సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు అనారోగ్యంతో మృతి

ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం జగన్
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దాంతో ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకుంటారు. నారాయణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించి, తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. వైఎస్సార్ కుటుంబంతో నారాయణకు మూడు దశాబ్ధాలకు పైగా అనుబంధం ఉంది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న సాయంత్రం (గురువారం) ఢిల్లీ బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి