హోదాపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం | ap assembly: ysrcp demands discussion on Adjournment motion | Sakshi
Sakshi News home page

హోదాపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం

Mar 23 2017 9:08 AM | Updated on Jun 4 2019 8:03 PM

విపక్షం నిరసనలు, నినాదాలతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ దద్దరిల్లింది.

అమరావతి: విపక్షం నిరసనలు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.  గురువారం సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి సభలో తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే వాయిదా తీర‍్మానంపై చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన తెలుపుతూ చర్చ జరపాలంటూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement