రేపు అంగన్‌వాడీ కార్మికుల సమ్మె | anganwadi workers strike tomorrow | Sakshi
Sakshi News home page

రేపు అంగన్‌వాడీ కార్మికుల సమ్మె

Feb 16 2014 2:16 AM | Updated on Sep 2 2017 3:44 AM

తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 17న సమ్మె చేయనున్నట్లు అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) కార్యదర్శి రోజా వెల్లడించారు.

21న చలో హైదరాబాద్..
  ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకూ సిద్ధమని ప్రకటన


 సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 17న సమ్మె చేయనున్నట్లు అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) కార్యదర్శి రోజా వెల్లడించారు. శనివారం ఆమె సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే 21న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కనీసం వేతనం రూ.10 వేలు చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని తాము సుదీర్ఘకాలంగా పోరాడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో నిరవధిక సమ్మెకూ వెనకాడబోమని ఆమె హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement