అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ | anganwadi workers arrested | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్

Feb 24 2014 9:14 AM | Updated on Jun 2 2018 8:32 PM

అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ - Sakshi

అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్

సమస్యల పరిష్కారం కోరుతూ 'ఛలో హైదరాబాద్' కార్యక్రమానికి బయల్దేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

హైదరాబాద్ : సమస్యల పరిష్కారం కోరుతూ 'ఛలో హైదరాబాద్' కార్యక్రమానికి బయల్దేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో హైదరాబాద్ వస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దాంతో వారు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

మరోవైపు వరంగల్ జిల్లాలోనూ అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారిని జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో అరెస్ట్ చేయటంతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇక  కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలను ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు నిలిపివేశారు. దాంతో వారు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement