ఏపీ జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

Andhra Pradesh Judicial Preview Committee Website Launch - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్‌ శివశంకరరావుతో కలిసి వెబ్‌సైట్‌, లోగోను సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టం ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత), 2019 చట్టము 14.08.2019 నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.  ఏ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్‌ అయినా ముందుగా కమిషన్‌ ముందుకు వస్తుంది. ఆ తరువాత కమిషన్‌.. టెండర్‌ డాక్యుమెంట్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో వారం రోజుల పాటు పెడతారు. ఆ టెండరుకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు చేయడానికి వీలుంటుంది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాతే టెండర్లను ప్రభుత్వం ఆమోదించనుంది. వెబ్‌సైట్: judicialpreview.ap.gov.in

కేబినెట్‌ సమావేశం..
ఈనెల 16న తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రిమండలి సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్యక్షతను ఈ సమావేశం జరుగనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top