తోక జాడిస్తే కత్తిరిస్తాం : ఏపీ సీఐడీ

Andhra Pradesh Crime CID Series On Fake News Over Corona - Sakshi

సోషల్ మీడియా ఫిర్యాదులపై ఏపీ సీఐడీ కొరడా

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలన భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కోవిడ్‌పై అసత్య ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ప్రారంభించిన వాట్సాప్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదులకుగాను ఏపీ సీఐడీ ఏర్పాటు చేసిన (9071666666) వాట్సాప్ నంబర్‌కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 ,474 ఫిర్యాదుల అందాయి. ఊహించని విధంగా ప్రజల్లో స్పందన రావడంతో దీని కోసం సీఐడీ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. (ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు)

దీనిపై ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక  మాట్లాడుతూ.. స్టే సేఫ్, స్టే స్మార్ట్ అనే నినాదంతో నాలుగు వాట్సాప్ నంబర్లను ప్రారంభించామని తెలిపారు. సైబర్ బుల్లియింగ్‌లో సభ్యత లేకుండా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ పెడితే సుమోటాగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాట్సాప్, టిక్ టాక్, ట్విట్టర్‌లో వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు.

అసత్య ప్రచారాలు చేసే వారి ట్రాక్ రికార్డ్ మొత్తం సీఐడీ దగ్గర ఉంటుందని ఎస్పీ రాధిక వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తామని హెచ్చరించారు. త్వరలోనే మొబైల్ యాప్, డాష్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తామని ఎస్పీ రాధిక తెలిపారు. (చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top