'వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు' | Anatha Venkrami Reddy takes on tdp leaders | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు'

May 3 2015 4:06 PM | Updated on Aug 21 2018 7:39 PM

'వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు' - Sakshi

'వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు'

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఖండించారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను అరెస్ట్  చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఖండించారు. హత్యకు గురైన రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద రెడ్డి విచారణను పక్కనబెట్టి, పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ దౌర్జన్యాలకు నిరసనగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement