గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడు మృతి | agrigold victim died due to heart attack in anantapur district | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడు మృతి

Mar 24 2017 12:55 PM | Updated on Sep 28 2018 3:41 PM

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడు మృతి - Sakshi

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడు మృతి

అనంతపురం జిల్లా హిందుపురంలో విషాదం చోటు చేసుకుంది.

హిందూపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అగ్రిగోల్డ్‌ బాధితుడు షేక్‌ ఖాదర్‌ బాషా గుండెపోటుకు గురై మృతిచెందాడు. అగ్రిగోల్డ్‌లో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేవో అనే మనస్థాపంతో గత రెండు రోజులుగా ఖాదర్‌ బాధపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం  ఖాదర్‌ గుండెపోటుకు గురై మృతిచెందాడు.
 
కాగా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం... ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులకు తీవ్ర నిరాశే మిగిలింది.  జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందడం వల్లే గుండెపోటుతో ఖాదర్‌ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement