ఏసీబీ వలలో అవినీతి చేపలు | ACB Fish into the trap of corruption | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి చేపలు

Aug 28 2014 3:56 AM | Updated on Sep 22 2018 8:22 PM

ఏసీబీ వలలో అవినీతి చేపలు - Sakshi

ఏసీబీ వలలో అవినీతి చేపలు

లంచం తీసుకుంటూ వేర్వేరు ఘటనల్లో లంగర్‌హౌస్ ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.

  • లంగర్‌హౌస్ ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్
  •  మరో కేసులో ఆర్ అండ్ బీ ఇంజనీర్లు
  • లంగర్‌హౌస్: లంచం తీసుకుంటూ వేర్వేరు ఘటనల్లో లంగర్‌హౌస్ ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్‌లో ఉండే మహమ్మద్ మతిన్ అలీ స్క్రాప్ వ్యాపారి. ఇదే వ్యాపారం చేసే అత్తాపూర్‌కు చెందిన అన్నాతమ్ముళ్లు ఫెరోజ్, షేక్ మతిన్, సద్దాం, ముబిన్‌తో వ్యాపార విషయంలో గొడవలు ఉన్నాయి. దీంతో బాధితుడు మతిన్ రాజేంద్రనగర్ పోలీసులతో పాటు, ఏసీపీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నలుగురు సోదరుల్లో ఒకరైన ఫెరోజ్‌ను ఇన్నోవా కారు ఢీకొనడంతో కాలు విరిగిందని వారం క్రితం లం గర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఆ కారు మ తిన్‌కు చెందినదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, బాధితులతో మాట్లాడి రాజీ కుదురుస్తామని, అందు కు తమకు రూ.10 వేలు ఇవ్వాలని ఎస్సై బి.శ్రీనివాసరావు, హెడ్‌కానిస్టేబుల్ అశోక్‌రెడ్డిలు మహమ్మద్ మతి న్‌ను డిమాండ్ చేశారు. లేదంటే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని బెదిరించారు. అతను ఏసీ బీని ఆశ్రయించడంతో సీఐ జేసుదాసు ఆధ్వర్యంలో బాధితుడికి రుంగురుద్దిన నగదును ఇచ్చి పంపి ఎస్సై, హె డ్‌కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు.
     
    ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు...
     
    ఖైరతాబాద్: హాస్టల్ భవనం అద్దె నిర్ణయించే విషయమై లంచం డిమాండ్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం వల పన్ని పట్టుకున్నారు. సోమయ్య అనే వ్యక్తికి ఎల్‌బీనగర్‌లో సొంత భవనం ఉంది. దీన్ని సాం ఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్వహించేందుకు అధికారు లు అద్దెకు అడిగారు. అద్దె నిర్ణయించే విషయంపై ఆర్‌అండ్‌బీ ఈఈ కె.నరేష్‌కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.రాజశేఖర్‌ను సోమయ్య కలవగా రూ.10వేలు లం చం డిమాండ్ చేశారు.

    దీనిపై సోమయ్య మంగళవా రం ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు బుధవారం సోమయ్య ఖైరతాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఇంజినీర్లకు లంచం ఇస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ ఎన్.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి ఈఈ నరేష్‌కుమార్, ఏఈ ఎం.రాజశేఖర్‌ను అరెస్ట్ చే శారు. వారినుంచి రూ.10వేలు స్వాధీనం చేసుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement