ఏసీబీ వలలో డ్రాఫ్ట్స్‌మెన్ | acb catch the draftsman | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో డ్రాఫ్ట్స్‌మెన్

Feb 26 2014 3:16 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో డ్రాఫ్ట్స్‌మెన్ - Sakshi

ఏసీబీ వలలో డ్రాఫ్ట్స్‌మెన్

కలెక్టర్ భూముల కొలతలు, రికార్డుల కార్యాలయం మళ్లీ రికార్డుల్లోకెక్కింది. పదవీ విరమణ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు లంచం అడిగిన ఇద్దరు అధికారులు ఇటీవల ఏసీబీకి చిక్కి జైలుపాలయ్యూరు.

 ఏసీబీ వలలో డ్రాఫ్ట్స్‌మెన్
 
 కాజీపేట,  : కలెక్టర్ భూముల కొలతలు, రికార్డుల కార్యాలయం మళ్లీ రికార్డుల్లోకెక్కింది. పదవీ విరమణ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు లంచం అడిగిన ఇద్దరు అధికారులు ఇటీవల ఏసీబీకి చిక్కి జైలుపాలయ్యూరు.

 

ఆ సంఘటన మరువక ముందే... మంగళవారం సేత్వార్ పహాణీ కోసం వచ్చిన యువకుడి వద్ద మామూళ్లు తీసుకుంటూ అదే కార్యాలయంలో ఏసీబీకి మరో ఉద్యోగి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం జిల్లాలో చర్చనీయూంశంగా మారింది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం...  చిట్యాల మండలం చింతకుంట్ల రామయ్యపల్లె గ్రామానికి చెందిన మొక్కిరాల జనార్దన్‌రావు ఓ కేసు నిమిత్తం భూముల కొలతలు, రికార్డుల కార్యాలయంలో సేత్వార్ పహాణీ, టీపన్ కోసం ఇటీవల రూ.600 చలాన్‌గా చెల్లించాడు. ధ్రువీకరణ పత్రాల కోసం సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ సాయిప్రసాద్ వద్దకు వెళ్లాడు. పత్రాలు కావాలంటే రూ.2,500 ఇవ్వాలని సదరు ఉద్యోగి పట్టుబట్టడంతోపాటు 15 రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నాడు. దీంతో విసుగు చెందిన జనార్దన్‌రావు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు పకడ్బందీ ప్లాన్‌తో రంగంలోకి దిగారు. జనార్దన్‌రావుకు డబ్బులు ఇచ్చి కార్యాలయూనికి పంపిం చారు. వాటిని సాయిప్రసాద్ తీసుకుంటుండగా... అప్పటికే అక్కడ మకాం చేసిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాయిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో సీఐలు సాంబయ్య, బాపూరెడ్డితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
 

 

 మూడు రోజులుగా మకాం
 

 

అవినీతి నిరోధక శాఖ అధికారులను మూడు రోజుల క్రితం జనార్దన్‌రావు కలిసి ఫిర్యాదు చేయగానే....  కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై వారు అక్కడే మకాం వేసి ఆరా తీసినట్లు తెలిసింది. అధికారి వేధింపులు నిజమేనని ఫోన్ ద్వారా నిర్ధారణ చేసుకున్న ఏసీబీ అధికారులు మినీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నిఘా తీవ్రం చేశారు. బాధితుడితో మంగళవారం ఫోన్ చేయించి... సదరు అధికారి కార్యాలయంలోనే ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. మారువేషంలో అక్కడే తచ్చాడుతూ సారుుప్రసాద్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 

 

 నాలుగు నెలల్లో ముగ్గురు ఉద్యోగులు

 

 నాలుగు నెలల్లో ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. పదవీ విరమణ చేసిన తోటి ఉద్యోగి చిన్నరాంలు సెటిల్‌మెంట్ డబ్బుల బిల్లుల కోసం వెళితే సర్వే ఇన్‌స్పెక్టర్ రాథోడ్ సుదర్శన్, ఏడీ సమీనాబేగం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రరుుంచగా... గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన వారు రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుబడ్డారు. తాజాగా రూ.2,500 లంచం  తీసుకుంటూ సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ సాయిప్రసాద్ ఏసీబీ అధికారులకు చిక్కడం ఆ శాఖ ఉద్యోగుల్లో కలకలం సృష్టిస్తోంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement