విశాఖపట్టణం జిల్లా హుకుంపేట మండలం కూట్నపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
విశాఖపట్టణం జిల్లా హుకుంపేట మండలం కూట్నపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు వెళుతున్న బైక్ వెనుక వేగంగా వచ్చిన వ్యాను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న రామదాసు(25) అనే యువకుడు మృతిచెందాడు. బైక్ వెనక సీట్ లో ఉన్న సీతయ్య(24) తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ సీతయ్యని పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.