
కేంద్రానికి 3 రోజుల్లో వరదలపై నివేదిక: మంత్రి రఘువీరా
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, నష్టం వివరాలకు సంబంధించిన నివేదికను మూడు రోజుల్లో కేంద్రానికి పంపుతామని మంత్రులు రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, నష్టం వివరాలకు సంబంధించిన నివేదికను మూడు రోజుల్లో కేంద్రానికి పంపుతామని మంత్రులు రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. భారీ వర్షాలు, వరదలుపై ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సామావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రులు రఘువీరా, కన్నా మాట్లాడుతూ పంట నష్టం అంచనాలు సిద్ధమవుతున్నాయన్నారు. 3 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు.
ఇన్పుట్ సబ్బిడీ పాత బకాయిలను వెంటనే అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చనట్లు తెలిపారు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనవారికి వచ్చే రచ్చబండలో కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. పాక్షికంగా ధ్వంసమైన వారికి మూడు వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇస్తామన్నారు.