రాజధానికి భూమిచ్చి... ఆత్మహత్య ! | a man committed suicide of landpooling | Sakshi
Sakshi News home page

రాజధానికి భూమిచ్చి... ఆత్మహత్య !

Mar 9 2015 10:03 PM | Updated on Nov 6 2018 7:56 PM

భూ సమీకరణ విషయంలో కుటుంబంలో తలెత్తిన వివాదం ఓ రైతు ప్రాణం తీసింది.

గుంటూరు : భూ సమీకరణ విషయంలో కుటుంబంలో తలెత్తిన వివాదం ఓ రైతు ప్రాణం తీసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కురగల్లు గ్రామానికి చెందిన తోట నాగేంద్రం(60)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేసి, ఆస్తుల పంపకం చేశాడు. మిగిలిన రెండు ఎకరాల 2.25 సెంట్లు పొలాన్ని కుమారులకు చెప్పకుండా భూ సమీకరణకు ఇచ్చారు. ఈ విషయంపై కుమారులు, కోడలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన నాగేంద్రం సోమవారం ఉదయాన్నే పొలానికి వెళ్లి అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భూ సమీకరణకు భూమి ఇవ్వటంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని నాగేంద్రం కోడలు పోలీసులకు తెలపినట్లు సమాచారం.

(మంగళగిరి)
 

Advertisement
 
Advertisement
Advertisement