వైఎస్సార్ జిల్లా పోలీసులు నలుగురు అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్లను సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
కడప: వైఎస్సార్ జిల్లా పోలీసులు నలుగురు అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్లను సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు, నెల్లూరు రహదారిలో గోపవరం మండలం పీపీ కుంట చెక్‌పోస్ట్ వద్ద నలుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ నవీన్‌గులాటి జిల్లా కేంద్రంలో విలేకరులో సమావేశంలో వెల్లడించారు. టి.వెంకటేశ్వర్‌రెడ్డి, షేక్ నవీద్, షేక్ సుజీద్, షేక్ అలీ్‌ఫ్‌ను అరెస్ట్ చేసి 2.2 టన్నుల బరువైన 169 ఎర్రచందనం దుంగలను, అశోల్ లేలాండ్ లారీతోపాటు రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.