ఆర్టీసీ బస్సు బోల్తా: 30 మందికి గాయాలు | 30 injured in a bus slipped incident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

Aug 7 2015 5:11 PM | Updated on Sep 3 2017 6:59 AM

ఆర్టీసీ బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది.

శ్రీకాకుళం(కంచిలి): శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది గాయపడగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కంచిలి మండలంలోని కొత్తఅంపురం చెరువు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పలాస డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు సోంపేట నుంచి కంచిలి మీదగా గంగాధరపురం వెళుతుండగా కొత్తఅంపుర వద్ద ఆటోను తప్పించబోయి బోల్తా కొట్టింది.

దీంతో బస్సులోని 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచరం. గాయపడిన వారు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement