కృష్ణానదిలో ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు | 3 Engineering Students death in Krishna River at vijayawada | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు

Jan 6 2015 2:05 PM | Updated on Sep 2 2017 7:19 PM

కృష్ణానదిలో ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు

కృష్ణానదిలో ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మద్దూరు సమీపంలోని కృష్ణానదిలో మంగళవారం స్నానానికి దిగిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు.

విజయవాడ: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మద్దూరు సమీపంలోని కృష్ణానదిలో మంగళవారం స్నానానికి దిగిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి... గాలింపు చర్యలు చేపట్టారు. రెండు మృతదేహలను స్థానికులు సహాయంతో నది ఒడ్డుకు తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతులు జొన్నలగడ్డ రాజేశ్ (నిడమానురు ) భూక్యాలాల్ బాబు నాయక్ (తాడిగడప), వేమూరి శ్రీకాంత్ (కందుకూరు, ప్రకాశం జిల్లా) గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతులంతా సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement