పిడుగుపాటుకు 26 మేకల మృతి | 26 goats died due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 26 మేకల మృతి

May 2 2015 5:27 PM | Updated on Sep 3 2017 1:18 AM

పిడుగుపాటుకు 26 మేకల మృతి

పిడుగుపాటుకు 26 మేకల మృతి

పిడుగుపాటుకు 26 మేకలు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలోని కంభగిరిస్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది.

అవుకు (కర్నూలు) : పిడుగుపాటుకు 26 మేకలు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలోని కంభగిరిస్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అవుకుకు చెందిన లాలూనాయక్ అనే వ్యక్తి తన మేకలను సమీపంలోని అడవికి తోలుకెళ్లాడు.

 

ఈ క్రమంలో కంభగిరిస్వామి ఆలయ సమీపంలో మేకలు మేత మేస్తుండగా లాలూనాయక్ ఆలయం వద్ద కూర్చున్నాడు. ఒక్కసారిగా వర్షంతో పాటు పిడుగు పడడంతో 26 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. దాంతో మేకల యజమాని లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement