అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో శనివారం టీడీపీ మినీ మహానాడు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో శనివారం టీడీపీ మినీ మహానాడు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘనాథ రెడ్డి, పరిటాల సునీతా, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు.
అయితే ఈ సభను అక్కడి చేనేత కార్మికులు అడ్డుకుంటారనే కారణంగా ముందస్తుగా 200 మంది చేనేత కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, టీడీపీ నేత గడ్డం సాయి వేధింపులు అరికట్టాలంటూ గత మూడు రోజులుగా చేనేత కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.