గుంటూరు: క్వారంటైన్‌కు 12 మంది డాక్టర్లు | 12 Doctors Get Quarantined In Guntur District | Sakshi
Sakshi News home page

గుంటూరులో 12 మంది డాక్టర్లు క్వారంటైన్‌కు తరలింపు

Apr 17 2020 10:18 AM | Updated on Apr 17 2020 12:27 PM

12 Doctors Get Quarantined In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురి రిపోర్ట్‌ రాగా, అందులో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 50 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు లాడ్జీని క్వారంటైన్‌ కేంద్రంగా మార్చిన అధికారులు.. డాక్టర్లు, వైద్య సిబ్బందిని అక్కడికి తరలించారు. 

జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనా సోకినట్టుగా అధికారులు చెప్పారు.  దీంతో ఇద్దరు ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకున్న దాదాపు 190 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. మరోవైపు గుంటూరు జిల్లాలో 122 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.

చదవండి : నడిచొచ్చిన పేగుబంధం 

ఏపీ విధానాలు అనుసరణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement