రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్: ఇద్దరి మృతి
Jan 9 2016 12:56 PM | Updated on Aug 30 2018 3:58 PM
ఇబ్రహీంపట్నం: రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారులోని కెరళా హోటల్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం పెదలంకకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై ఇబ్రహీంపట్నం వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న నాగరాజు(28) అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు.
Advertisement


