breaking news
-
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
విజయనగరం క్రైమ్: నగర శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మపురిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మపురికి చెందిన సేనాపతి ఆదిలక్ష్మి (40) కొన్నేళ్లుగా తనకు పెళ్లి కావడంలేదని కుంగిపోయింది. ఇంట్లో తనతో పాటు కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు 40 ఏళ్లకే అకాల మరణం చెందారు. వాళ్లకు కూడా పెళ్లికాక మనోవేదనతో అకాలమృతి కావడంతో ఆదిలక్ష్మి మనస్తాపానికి గురైంది. రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు లేక ముగ్గురు అన్నల్లో ఒక అన్నావదిన దగ్గర ఉంటూ అన్నయ్య పిల్లలతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వదిన కూడా తరచూ నీకు ఇంకా పెళ్లి కాలేదని మాటలతో వేధించసాగింది. అటు బయటకూడా స్నేహితులు, చుట్టుపక్కల వారు ఆదిలక్ష్మికి ఇంకా పెళ్లి కాలేదని గుసగుసలాడుకోవడం మరింతగా కంగదీసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పుడే ఆమె వదిన హుటాహుటిన నగరంలోని మహరాజా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా శుక్రవారం చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో వదిన నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రవీణ్ ఇప్పుడైనా పెళ్లి చేసుకో.. నేను గర్భిణిని
విశాఖపట్నం: మూడేళ్లుగా ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు.. ఆ యువతి గర్భం దాల్చగానే ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలివి. ప్రవీణ్ అనే 24 ఏళ్ల యువకుడు 40వ వార్డు ఏకేసీ కాలనీలోని తన అక్క వద్ద మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ ఉంటున్న ఇంటికి సమీపంలో 19 ఏళ్ల వయసు గల ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.ఆ యువతితో మొదట పరిచయం ఏర్పరచుకున్న ప్రవీణ్, అనంతరం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ యువకుడి మాటలను నమ్మిన యువతి అతడితో బయటకు వెళ్లడం, వారిద్దరూ శారీరకంగా కలవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో ఆ యువతి మూడు నెలల గర్భం దాల్చడంతో.. తనను ఇప్పుడైనా పెళ్లి చేసుకోవాలని ప్రవీణ్‌ను కోరింది. దీంతో అతడు నిరాకరించడంతో, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా, అక్కడ కూడా పెళ్లికి నిరాకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దారి తప్పిన దర్యాప్తు!
సాక్షి, రాజమహేంద్రవరం: లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ నెల 23న ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి. తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది. నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.ఎవరిని కాపాడేందుకీ తాత్సారం?: మార్గాని భరత్రామ్కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించి సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి శుక్రవారం ఆయన చేరుకుని ఐసీయూలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం భరత్‌రామ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిందని ఒకరు... లేదని మరొకరు చెబుతున్నారన్నారు. ఘటనపై ఈ నెల 23న ఒక ఎఫ్ఐఆర్, 24న మరొకటి ఎలా నమోదయ్యాయని నిలదీశారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్లు కూడా మార్చారన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే (రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు) ఇక్కడకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కేసులో అరెస్టయిన దీపక్ టీడీపీ నాయకుడి అల్లుడని చెప్పారు. ఇవన్నీ చూస్తూంటే ఎవరినో కాపాడడానికి పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోందని భరత్‌రామ్ అనుమానం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంత జరుగుతున్నా హోంమంత్రి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. హోంమంత్రికి పరామర్శించే సమయం లేదా?ఐద్వా, మహిళా సంఘాల మండిపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. బాధితురాలు చికిత్స పొందుతున్న కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి ఐద్వా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), మహిళా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఐద్వా నేత రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా అద్భుతం జరిగితే మినహా ఆ విద్యార్థిని సాధారణ స్థితికి రాలేదని వైద్యులు చెబుతున్నారన్నారు. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విద్యార్థిని సెల్‌ఫోన్ డేటాను దీపక్ డిలీట్ చేశాడని, ఆధారాలను మాయం చేసి సాక్ష్యాలను తారుమారు చేశాడన్నారు. మహిళ అయి ఉండి కూడా హోంమంత్రి ఇంత వరకూ ఎందుకు రాలేదని నిలదీశారు. బాధిత విద్యార్థినిని దీపక్ బ్లాక్మెయిల్ చేసి లోబరచుకున్నట్లు తెలుస్తోందన్నారు. అతడిపై రేప్ కేసు నమోదు చేశారో లేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు.టూరిజంపై ట్వీట్ చేయడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి ఈ అకృత్యంపై ఎందుకు ట్వీట్ చేయలేదని, గుండెల్ని పిండేసే ఈ ఘోష పాలకులకు పట్టదా? అని ప్రశ్నించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న పెద్దమనిషి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడని నిలదీశారు. పుట్టిన రోజు చేసుకున్న మహిళా హోంమంత్రి ఇంత దారుణ సంఘటన జరిగితే ఇప్పటి వరకూ స్పందించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. -
ఆరుగురు విద్యార్థులు అదృశ్యం
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే రోజు అదృశ్యమయ్యారు. స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి నాలుగు రోజులైనా వారు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శుక్రవారం స్థానిక పోలీసులను అశ్రయించారు. ఇప్పటి వరకూ ఇల్లు, స్కూల్‌కు తప్ప వేరే ప్రదేశం తెలియని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ విద్యార్థులందరూ కనిపించకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో కొమరిగిరి కరుణ (8వ తరగతి), కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొమరిగిరి పృథ్వీవర్మ (6వ తరగతి), గంధం సతీష్ (8వ తరగతి), మర్రి సంతోష్ (7వ తరగతి), కొమరిగిరి పండు (6వ తరగతి), రామచంద్రపురంలోని ఎయిడెడ్ స్కూల్లో కొమరిగిరి మాధురి (7వ తరగతి) చదువుతున్నారు. ఈ ఆరుగురు విద్యార్థులూ ఈ నెల 24వ తేదీన పాఠశాలలకు యథావిధిగా వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాలేదు. అప్పటి నుంచీ పరిసర ప్రాంతాల్లోను, బంధువుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ మూకుమ్మడిగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితి వివరించారు. విద్యార్థులందరూ కూడబలుక్కుని వెళ్లిపోయారా లేక వారిలో ఎవరైనా ప్రభావితం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో ఆ విద్యార్థుల ఫొటోలు ప్రదర్శించడంతో పాటు వివిధ పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్ఐ అశోక్ చెప్పారు. -
అయ్యో...అవ్వ!
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వంలో ఒంటరి వృద్ధులకూ రక్షణ కరువైంది. ఎవరిని ఏం చేసినా పట్టించుకునే వారే లేకపోవడంతో అరాచకశక్తులు పేట్రేగిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏలూరు వన్‌టౌన్ సత్యనారాయణపేటకు చెందిన చానాపతి రమణమ్మ (65) అనే ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ప్రసాద్ అనే యువకుడు ఆమె వద్ద డబ్బు ఉందని తెలుసుకుని 7.30 గంటల సమయంలో గొడవ పడ్డాడు. 9.30 గంటలకు మరోసారి వెళ్లి గొడవకు దిగాడు. ఆమె ముఖంపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మెడలోని బంగారు గొలుసు, బీరువాలోని కొంత నగదు తీసుకుని పరారయ్యాడు. తానే చంపానన్న అనుమానం వస్తుందని భావించి అర్ధరాత్రి ఆమె ఇంటికి మళ్లీ వచ్చాడు. ఆమె చేతులు, కాళ్లను కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి, వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఆమె ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావటంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ బృందంతో రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
సీతయ్యపై పోక్సో కేసు
విశాఖపట్నం: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేసిన ఘటనలో సీహెచ్ సీతయ్య అనే వ్యక్తిపై ఎంవీపీ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాసవానిపాలేనికి చెందిన 14 ఏళ్ల బాలిక 21వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆమె తల్లి, అన్నయ్యతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడైన సీహెచ్ సీతయ్య గత ఏడాదిగా బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకుంటున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి అనుమానంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా, గర్భవతి అని తేలింది. దీంతో ఆమె తల్లి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీతయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐపీఎల్లో బెట్టింగ్ జోరు
ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్ కోల్‌కత నైట్రెడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మొదలైంది. డఫ్పా బెట్‌తో పాటు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్‌లు కేకేఆర్ ఫేవరెట్ టీంగా బెట్టింగ్ నిర్వహించాయి. ఆర్సీబీపై మొదట్లో బెట్టింగ్ కాసిన వారు ఆ తర్వాత మళ్లీ కేకేఆర్‌పై బెట్టింగ్ కాశారు. కానీ, చివరికి ఆర్సీబీ గెలుపొందింది. దీంతో కేకేఆర్‌పై బెట్టింగ్ చేసిన వారంతా నిండా మునిగిపోయారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్‌ల జోరు తీరిది.సాక్షి ప్రతినిధి కర్నూలు : అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉండటం, ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్‌లు పుష్కలంగా ఉండడంతో అధికశాతం క్రికెట్ అభిమానులు ఆన్లైన్ బెట్టింగ్‌లో మునిగిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తుండడంతో రెండేళ్లుగా ఈ యాప్‌లు భారీగా పెరిగాయి. పైగా.. ఈసారి ప్లేయర్ల ఆక్షన్‌లో ఎక్కువశాతం ప్లేయర్లు జట్లు మారారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు జట్ల విజయావకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. చివరికి.. వారి ఖాతాల్లోని డబ్బు ఆవిరవుతోంది. ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులకు కూడా ఇవి సవాల్‌గానే మారాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులుమారే అవకాశముందని అంచనా.బెట్టింగ్ యాప్‌లు ఇవే.. ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎక్కువమంది ‘డఫ్పా బెట్టింగ్’ యాప్‌ను వాడుతున్నారు. దీంతో పాటు ఎక్స్ బెట్, స్కై ఎక్సే్ఛంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్‌లైన్, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్, టెన్క్రిక్, 22 బెట్, ఫోర్రాబెట్, వన్ విన్, పారిమ్యాచ్, మెల్బెట్తో పాటు అనేక బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి.ఆన్లైన్ బెట్టింగ్ తీరిది..⇒ ఈ విధానంలో మ్యాచ్‌కు గంట ముందే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దాంతోనే బెట్టింగ్ కాయాలి. ⇒ మ్యాచ్‌కు ముందు రేటింగ్స్ ఇస్తారు. ఆ ప్రకారం పందెం వేయాలి. ⇒ మ్యాచ్ సాగేతీరును బట్టి ఇవి మారుతుంటాయి. డిపాజిట్ క్లోజ్ అయితే అప్పటికప్పుడు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసే అవకాశం ఉండదు. దీంతో చాలామంది రూ.50వేల నుంచి లక్షల రూపాయలు ముందుగానే యాప్స్‌లో డిపాజిట్ చేస్తున్నారు. ⇒ మ్యాచ్ పరిస్థితి, రేటింగ్స్‌ను బట్టి అప్పటికప్పుడు ఆకర్షితులై కూడా భారీగా బెట్టింగ్ కాస్తారు. ⇒ బెట్టింగ్‌లో గెలిస్తే క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమవుతుంది. ఓడిపోతే ఖాతా ఖాళీ అవుతుంది. .. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ పొగొట్టుకుంటున్నారు.ఆఫ్‌లైన్ బెట్టింగ్ ఇలా.. టాస్ నుంచి బాల్ టు బాల్ వరకూ బెట్టింగ్ సాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు? తొలి ఓవర్ స్పిన్నర్‌తో బౌలింగ్ వేయిస్తారా? పేసర్‌తో వేయిస్తారా? మొదటి ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ఎవరు గెలుస్తారు? ఫలానా బాల్‌కు ఫోర్ వస్తుందా? సిక్స్ వస్తుందా? లేదా ఒక్క పరుగే వస్తుందా? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్‌లు ఉంటాయి. ఇక బుకీలు ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సబ్‌బుకీలు ఉంటారు. మ్యాచ్ మారుతున్న స్వరూపాన్ని బట్టి బెట్టింగ్ లెక్కలు మారుస్తారు. వీరు వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ ధరలు నిర్ధారిస్తారు. ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ కాసేవారు బార్లతో పాటు హోటళ్లలో కూర్చుని బెట్టింగ్ కాస్తారు. 357 రకాల వెబ్సైట్లు బ్లాక్.. బెట్టింగ్‌లను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) 357 రకాల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. వాటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మరో 700 యాప్‌లపై నిఘా ఉంచింది. అనుమతితో నడిచే బెట్టింగ్ యాప్‌లను టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 16న ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో హైదరాబాద్‌లో దగ్గుబాటి రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, వర్షిణితో పాటు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ ఊబిలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా చిక్కుకుంటున్నారు. -
కర్నూల్ హాస్టల్ లో దారుణం.. చిన్న పిల్లలనే కనికరం లేకుండా
కర్నూల్: జిల్లాలోని కోడుమూరు ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పిల్లలు అని చూడకుండా ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులపై పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి విచక్షణా రహితంగా విరుచుకుపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.తన బెల్టు తీసుకుని ఆ విద్యార్థులను చితకబాదాడు. తన మాట వినలేదని చెప్పి ఏడో తరగతి విద్యార్థులను దారుణంగా కొట్టాడు. దాడికి పాల్పడ్డ పదో తరగతి విద్యార్థి అనధికారంగా హాస్టల్ ఉంటున్నట్లు తెలుస్తోంది. -
అమ్మానాన్నను వీడి అనంతలోకాలకు..
నంద్యాల: బుడిబుడి నడకలతో..వచ్చీ రాని మాటలతో... ముసిముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇక లేరు. ఎప్పుడూ అమ్మానాన్న వెంటే ఉండే ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్లి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దైపె నుంచి పడి మృత్యువాత పడింది. ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా.. చిన్న కుమార్తె ఏడాది వయస్సులో ఉన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది. ఆటల్లోనే మెల్లగా మెట్లు ఎక్కి మిద్దె పైకి వెళ్లింది. అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళ్తున్నాడని భావించి మిద్దైపె నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది. తలకు తీవ్రమైన రక్త గాయం కావడంతో బైక్‌పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుట కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
తాడేపల్లిలో మహిళపై అత్యాచారం.. హత్య
తాడేపల్లి రూరల్: విజయవాడ–గుంటూరు జాతీయ రహదారి మధ్య డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మహిళ అత్యాచారం, ఆపై హత్యకు గురైంది. స్థానికుల కథనం మేరకు.. కొలనుకొండ జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ మీదుగా ఇప్పటం వెళ్లే రహదారిలో జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహానికి ఎడమ చేతి వైపున గొంతుపై బలంగా పొడిచినట్లు గాయం కనిపిస్తోంది. మహిళ మొహంపై పూర్తిగా రక్తం ఉండడంతో ఆమె ముఖఛాయలు సరిగా కనిపించడం లేదు. మర్మాంగం వద్ద రక్తం కారుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళ రెండు కాళ్లూ మోకాలు నుంచి కిందకు వంచి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికి హత్య జరిగి సుమారు 40 నిమిషాలు అయ్యుండొచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా నిర్ధారించారు. సంఘటన స్థలం వద్ద సెల్‌ఫోన్, హ్యాండ్ బ్యాగ్ లభించాయని.. వాటిని పరిశీలించి ఆ మహిళ ఎవరో గుర్తిస్తామని తెలిపారు. కాగా, డీజీపీ కార్యాలయం సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఓ హోటల్లో నిత్యం పోలీసులు ఉంటున్నప్పటికీ ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. జనవరి 31వ తేదీన కూడా గుంటూరు ఛానల్ నుండి నులకపేటకు వచ్చే రహదారిలో ఇదే గ్రామంలో డీజీపీ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇదే తరహాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ ఎవరో ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఈ రెండు హత్యలు ఒకేలా జరగడంతో ఒకే వ్యక్తి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలిగే ఉన్న సెల్ ఫోన్ టార్చిలైట్సంఘటనా స్థలం వద్ద మహిళ మృతదేహం కనిపించేలా సెల్ఫోన్లో టార్చిలైట్ వెలిగే ఉంది. హత్య చేసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. మహిళ సెల్‌ఫోన్‌కు ఎటువంటి రక్తపు మరకలు కనిపించ లేదు. లేదా హత్య జరగక ముందే ఆ మహిళ సెల్ ఫోన్లోని టార్చ్ లైట్‌ను ఆన్ చేసి ఉంచిందా.. అనే దిశలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ సెల్‌ఫోన్ కీలకంగా మారడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరో కోణంలో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన నేరస్తుల ద్వారా కూడా వివరాలు సేకరించి ఆ మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తామని సీఐ తెలిపారు. -
ప్రియురాలిని, ఆమె తల్లిని కిరాతకంగా హత్యచేసిన ప్రియుడు
రాజమహేంద్రవరం రూరల్: ఆమెకు 16.. అతడికి 20.. ఇద్దరి మనస్సులూ కలిశాయి. ఆరు నెలలుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలోనే కొద్దిరోజులుగా ప్రియురాలు వేరొకరితో చాటింగ్ చేస్తోందనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో.. ప్రియురాలిని, ఆమె తల్లిని ప్రియుడు కూరలు కోసే కత్తితో కిరాతకంగా హత్యచేసి, ఇంటికి తాళంవేసి, పరారయ్యాడు. రాజమహేంద్రవరంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మా (38), ఆమె కుమార్తె మహ్మద్ సానియా ఎలియాస్ సానా (16) మూడునెలలుగా రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉంటున్నారు. స్థానిక జాంపేట ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మజీద్‌కు సల్మా రెండో భార్య. ఆయన మూడేళ్ల క్రితం మృతిచెందాడు. ఆయన మొదటి భార్యకు ముగ్గురు కుమారులు. వారు జాంపేటలో నివసిస్తున్నారు. మహ్మద్ సానియా ఈవెంట్లకు యాంకర్‌గా వెళ్తుంటుంది. సల్మా, సానియాలకు తోడుగా వారి ఇంట్లో మజీద్ మొదటి భార్య చిన్న కుమారుడు ఉమర్ ఉంటున్నాడు. ఆరునెలల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ ఈవెంట్‌కు వెళ్లిన సమయంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీకాకుళం జిల్లా వాసి పల్లి శివకుమార్ లైట్‌బాయ్‌గా అక్కడకొచ్చాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తోందని..ఈ నేపథ్యంలో.. వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి శివకుమార్ సానియా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సానియా ఎవరితోనో ఫోన్లో చాటింగ్ చేస్తోందని గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడుతుంటే మొదటి భార్య కుమారులైన మహ్మద్ ఆలీ, ఉమర్‌లు శివకుమార్‌తో మాట్లాడి వెళ్లారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి కూర పట్టుకుని ఉమర్ వచ్చాడు. తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా సల్మా, సానియా రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు విషయం చెప్పాడు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, తన సిబ్బందితో తాళాలు పగులగొట్టి లోపల పరిశీలించారు. మెడమీదే బలమైన కత్తిపోటు గాయాలుండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, శాంతిభద్రతల ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు, డీఎస్పీలు బి. విద్య, శ్రీకాంత్ పరిశీలించారు. ఉమర్‌ను ఎస్పీ వివరాలడిగి తెలుసుకున్నారు. మహ్మద్ ఆలీ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడు శివకుమార్‌ను ఆదివారం మధ్యాహ్నం కొవ్వూరు ప్రాంతంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి పట్టుకున్నారు. -
టీడీపీ నేత కుమార్తెతో ప్రేమ.. పెళ్లి చేసుకున్నాడనే కారణంతో..
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా వరుడి ఇంటిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత సుంకర వెంకటరమణ కుమార్తె శివలీల, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వరుడు వెంకటేశ్వర్లుపై వెంకటరమణ, ఆయన మద్దతు దారులు కక్ష పెంచుకున్నారు. దీంతో, వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, రాడ్లతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. -
సామూహిక అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్ట్
గన్నవరం : బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏఎస్పీ వీవీ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక(14) సన్నిహితులతో కలిసి ఇటీవల కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వీరపనేనిగూడెం జాతరకు వచ్చి.. సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను స్వగ్రామం తీసుకెళతామని నమ్మబలికిన వీరపనేనిగూడేనికి చెందిన ఇద్దరు మైనర్లు ముందుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మైనర్లు ఇచ్చిన సమాచారంతో అదే గ్రామానికి చెందిన బాణావత్ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ అక్కడికి వెళ్లి బాలికపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆ బాలికను కేసరపల్లిలోని కొండేటి అనిల్ సహకారంతో అతని ఇంట్లో నిర్బంధించారు. అక్కడ జితేంద్ర, హర్షవర్ధన్‌లతో పాటు వారి స్నేహితులైన పరసా సంజయ్, ఉయ్యూరు నవీన్‌కుమార్, పరసా రాజేష్ ఆ బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఇప్పటికే జితేంద్ర, హర్షవర్ధన్‌తో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ చేసిన అనిల్, సంజయ్, నవీన్‌కుమార్, రాజేష్ లను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. -
విశాఖలో స్విగ్గీ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లోకి డెలివరీ బాయ్ అనిల్ (22) వెళ్లాడు. డెలివరీ ఇచ్చేటపుడు మర్యాదగా మేడం అని పిలవలేదని ఇంట్లో పని మనిషి చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సెక్యూరిటీ సిబ్బంది బట్టలు విప్పించి దాడి చేసినట్లు సమాచారం. అవమానం తట్టుకోలేక డెలివరీ బాయ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అపార్ట్మెంట్ వద్ద నగరంలో డెలివరీ బాయ్స్‌గా విధులు నిర్వహిస్తున్న యువకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తుదిశ్వాస విడిచాడు. మృతులు ఊటుకూరుకు చెందిన మృతులు వరుణ్ కుమార్(17), నందకిషోర్(18), సురేంద్ర(40)లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
లింగాపురం: నంద్యాల జిల్లా లింగాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళుతున్న సమయంలోవైఎస్సార్‌సీపీకి చెందిన సుధాకర్ రెడ్డి అనే కార్యకర్తను గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు. సుధాకర్ రెడ్డి పొలానికి వెళుతున్న సమయంలో మాటువేసి హత్య చేశారు కొంతమంది దుండగులు. ఈ హత్యకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.ఈ కేసులో కొంతమందిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యగావించబడ్డ సుధాకర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి సుధాకర్ రెడ్డితో కొంతమందికి వైరం ఉందని, దీని వెనుక వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికిందన్నారు. దాన్ని బట్టి నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనేవైఎస్సార్‌సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డిని అతిదారుణంగా హత్య చేశారనివైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
భార్యను కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం..
అన్నమయ్య: అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తతో పాటు అత్తా, మామ, ఆడపడచు వేధిస్తున్నారని లలితమ్మ అనే బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా.. మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన కోనకుంట రాయుడు కుమార్తె లలితమ్మకు కర్ణాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని గ్యాదోల్లపల్లికి చెందిన బంగారప్ప కుమారుడు క్రాంతి కుమార్‌తో నాలుగేళ్ళ కితం వివాహమైది. మూడేళ్ళ పాటు ఈ దంపతుల జీవనం సజావుగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం కాగా ఇటీవల మరో కుమార్తె జన్మనిచ్చింది. అయితే గత ఏడాది నుంచి తనను ఏ మాత్రం పట్టించుకోకుండా మరో మహిళతో గుట్టుగా అక్రమం సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ లలితమ్మ భర్తపై నెల రోజుల క్రితం పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో పోలీసులు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ తరుణంలో తన భర్తలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు బి.కొత్తకోటలోని ఇందిరమ్మ కాలనీలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో లలితమ్మ కుటుంబ సభ్యులకు పట్టుబడ్డాడు. తన భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, కట్టుకున్న భార్యతో పాటు పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న అత్తామామ, ఆడ పడచుతో పాటు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లలితమ్మ పేర్కొంది. ఈ విషయంపై ఎస్ఐ హరిహర ప్రసాద్ మాట్లాడుతూ లలితమ్మ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేస్తున్నామని తెలిపారు. -
మందలించాడని తండ్రిని హత్య చేసిన కూతురు
మండపేట: తనను మందలించాడన్న కోపంతో ఓ మహిళ ప్రియుడి సహాయంతో కన్న తండ్రినే కిరాతకంగా హత్య చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలను గురువారం టౌన్ సీఐ దారం సురేష్ మీడియాకు వెల్లడించారు. 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని కుమార్తె వస్త్రాల వెంకట దుర్గకు రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన దుర్గ కన్న తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అతను తోడుగా తన స్నేహితుడు తాటికొండ నాగార్జునతో కలిసి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక నులిమి.. డొక్కల్లో తన్ని హత్య చేశారు. మృతుడి సోదరుడు సూరా పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ.. దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి.. విశాఖపట్నం పారిపోతున్న నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో గురువారం వారిని రామచంద్రపురం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. -
నంద్యాల జిల్లాలో కీచక టీచర్
సాక్షి, నంద్యాల జిల్లా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లాలో కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి కీచకుడి అవతారం ఎత్తాడు. ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో ఘటన జరిగింది.నీలిచిత్రాలు చూడమంటూ సోషల్ టీచర్ బొజ్జన్న ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్కు తెలిసే చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ బొజ్జన్నపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో కర్కశ తండ్రి!
రామచంద్రపురం రూరల్(కాకినాడ): కన్న బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన కర్కశ తండ్రి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు సోమవారం రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపంలోని పంట కాలువలో తన బిడ్డలు పదేళ్ల రామసందీప్, ఏడేళ్ల కారుణ్యశ్రీని తోసేసిన ఘటనలో, సందీప్ బతికి బయటపడగా, కారుణ్య నీటమునిగి చనిపోయిన సంగతి విదితమే. అప్పుల నేపథ్యంలో పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఇలా చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు కాలువలు, గోదావరి వెంబడి పిల్లి రాజు ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలించారు. ఈ క్రమంలో యానాం బ్రిడ్జిపై రాజు స్కూటర్ కనిపించడంతో, వారి అనుమానం బలపడింది. రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ బోటుపై గోదావరిలో విస్తృతంగా గాలించారు. అయితే నిందితుడు రాజు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది. పోలీసులు దీనిని గోప్యంగా ఉంచడం గమనార్హం.‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’ -
అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం!
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వాడు దీపును చంపాడు.. మాకు అప్పగించండి
అనకాపల్లి, సాక్షి: జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరంలో మర్డర్ మిస్టరీ వీడింది. ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రియుడే అతికిరాతకంగా హతమార్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోతున్న హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. తమ స్నేహితురాలిని ముక్కలు చేసిన నిందితుడిని అప్పగించాలంటూనాందోళన చేపట్టారు.దీపు అనే ట్రాన్స్‌జెండర్‌ను ఆమె ప్రియుడు బన్నీ దారుణంగా హతమార్చాడు. ఆ శరీర భాగాలను వేరు చేసి బెడ్‌షీట్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశాడు. ఈ ఘోరం స్థానికంగా కలకలం రేపింది. శరీర భాగాలను సేకరించిన పోలీసులు.. చివరకు మృతదేహం నాగులపల్లికి చెందిన దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాగా గుర్తించారు. అనంతరం ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. బన్నీతో రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్న పోలీసులు.. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వాడిని అప్పగించండితమ స్నేహితురాలిని అతికిరాతకంగా చంపిన హంతకుడిని తమకు అప్పగించాలంటూ హిజ్రాలు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.అయ్యో.. పాపంకశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. సుమారు 30 ఏళ్ల వయసు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఉండడంతో ఆమె వివాహిత అని తొలుత అంతా పొరపడ్డారు. అయితే విచారణలో ఆమె దీపు అనే ట్రాన్స్‌జెండర్‌గా తేలింది. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు ఈ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో.. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సంఘటన స్థలాన్ని, ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. అనకాపల్లిలో మహిళ దారుణ హత్య -
కట్టుకున్నోడే.. కాలయముడు
ఇరవై రెండేళ్లు కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేశారు. కూతురి పెళ్లిని కూడా ఘనంగా చేశారు. చేతికి దొరికిన పనిచేస్తూ బతుకును చక్కగా పండించుకున్నారు. కానీ మద్యం మత్తు మగవాడి ఆలోచనను మార్చేసింది. కష్టసుఖాల్లో ఇన్నేళ్లుగా తోడుగా ఉండి నీడలా నడిచిన జీవన సహచరిపై కోపం పెంచుకునేలా చేసింది. అతడి మనసులో అనుమానపు విషాన్ని కలిపింది. దాని ఫలితం భార్య మరణం.. భర్తకు ఖైదు. కొడుక్కి జీవితకాలపు విషాదం. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో భర్త చేతిలో భార్య హతమైంది. శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని సంత సీతారాంపురంలో గాలి నాగమ్మ(42) అనే మహిళను ఆమె భర్త అప్పలరెడ్డి సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరెడ్డి, నాగమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల కిందటే అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు త్రినాథరావుతో కలిసి విశాఖలో ఉండేవారు. త్రినాథరావు తాపీమేస్త్రీ కాగా.. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. కుటుంబం మొత్తం కష్టాన్నే నమ్ముకుని బతికేది. గత నెలే వీరు స్వగ్రామం సంతసీతారాంపురం వచ్చేశారు. ఇక్కడ సొంతిల్లు ఉండడంతో కుమారుడికి పెళ్లి చేసి మళ్లీ విశాఖ వెళ్లిపోవాలని అనుకునేవారు. స్థానికంగా ఉండటంతో సరుగుడు, నీలగిరి చెట్లు కొట్టటం, తొక్క తీయటం వంటి పనులు చేస్తున్నారు. సోమవారం కూడా రణస్థలంలో నీలగిరి తోట కొట్టేందుకు, తొక్క తీసే పనికి భార్యాభర్తలు వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేశారు. కుమారుడు ఇంటి బయట మంచం వేసుకొని పడుకున్నారు. రాత్రి దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మందు తాగి గొడవపడడం, భార్యను అనుమానించడం వంటి పనులు చేసేవాడు. రాత్రి కూడా ఇలాగే దంపతులిద్దరూ గొడవ పడ్డారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా సరుగుడు, నీలగిరి చెట్లు నరికే కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అతి కిరాతకంగా కత్తితో మెడ, తలపై దాడి చేశాడు. నాగమ్మ పెద్దగా కేకలు వేయడంతో కుమారుడు, చుట్టుపక్కల వారు కంగారు పడి ఇంటిలోకి వెళ్లబోతుండగా.. అప్పలరెడ్డి తలుపులు తీసి బయటకు వెళ్లిపోయాడు. లోపల చూస్తే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది. హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్‌కుమార్, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని సందర్శించింది. కుమారుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమ్మ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్యతో గ్రామమంతా విషాదం నెలకొంది. జేఆర్ పురం సీఐ అవతారం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో దారుణం.. సామూహిక లైంగిక దాడి
సాక్షి, కృష్ణా: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు మైనర్‌ను నాలుగు రోజుల పాటు నిర్భంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన మైనర్(14) ఈనెల తొమ్మిదో తేదీన గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం, ఈనెల 13 న స్నేహితురాaలి ఇంటి నుంచి బయటికి వచ్చింది. రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన బాలికను ఇద్దరు యువకులు ట్రాప్ చేశారు. ఆమెను బైక్‌పై కొంత దూరం తీసుకెళ్లి మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, మరో నలుగురు ఆమెను నాలుగు రోజులు పాటు నిర్బంధించిన లైంగిక దాడి చేశారు.అనంతరం, ఈనెల 17న రాత్రి సమయంలో విజయవాడలోని మైలవరంలో కామాంధులు ఆమెను వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌కి జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో, సదరు ఆటోడ్రైవర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన ఆత్కూరు పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. -
అనకాపల్లిలో మహిళ దారుణ హత్య
అనకాపల్లి: అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమె రెండు కాళ్లు, రెండు చేతులను నరికి చంపేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. అయితే బెడ్ షీట్ అనుమానాస్పదంగా రక్తంతో ఉండటంతో స్థానికంగా దాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బెడ్ షీట్ ను ఓపెన్ చేసి చూడగా ఓ మహిళకు చెందిన రెండు కాళ్లు, రెండు చేతులు అందులో ఉండటం చూసి షాక్ అయ్యారు. దాంతో స్థానికంగా కలకలం రేగింది. అసలు హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు?, హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.