
PC: BCCI/IPL.com
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం(మే 7) టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిచాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్‌ను భారత టెస్ట్ కెప్టెన్‌గా తొలగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని రోహిత్ శర్మకు తెలియజేసినట్లు వినికిడి. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్‌కు టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై రోహిత్ ఆసంతృప్తిగా ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తీసుకున్న నిర్ణయంతో తన ఆశ్చర్యపోయినట్లు సెహ్వాగ్ తెలిపాడు.
"రోహిత్ నిర్ణయం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందకంటే ఇంగ్లండ్ పర్యటనకు తను సిద్దమవుతున్నట్లు రోహిత్ శర్మ ఇటీవల చాలా సందర్బాల్లో వెల్లడించాడు. అంతేకాకండా ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆఖరి టెస్టు అనంతరం తన రిటైర్మెంట్‌పై రోహిత్ ఓ క్లారిటీ ఇచ్చాడు. తను ఎక్కడికీ వెళ్ళడం లేదని, ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.
కానీ అంతలోనే ఏమి జరిగిందో ఆర్ధం కావడం లేదు. కచ్చితంగా సెలక్టర్లతో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఇంగ్లండ్ పర్యటనకు తనను టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేయమని లేదా పూర్తిగా ఆటగాడిగా కూడా పరిగణలోకి తీసుకోబోమని రోహిత్‌తో సెలక్టర్లు చెప్పండొచ్చు. అందుకే జట్టును ప్రకటించక ముందే రోహిత్ టెస్టులకు విడ్కోలు పలికాడు.
సెలక్టర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే రోహిత్ తనంతట తానే తప్పుకొన్నాడు. కానీ రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని ఎవరూ వదులుకోవాలని అనుకోరు. మూడు ఫార్మాట్లలో రోహిత్ తనదైన ముద్రవేశాడు. అతడి రికార్డులు అద్వితీయమైనవి" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: గిల్, బుమ్రా, పంత్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే