vasco da gama
-
సంపద తరలిన మార్గానికి ఇదే దిక్సూచి
1498 మే 20. కేరళ తీరంలోని కాలికట్ (కోజికోడ్) సమీపంలో ఉన్న ‘కప్పకడవు’ అనే చిన్న గ్రామం చరిత్రపుటల్లోకి ఎక్కిన రోజు అది. వాస్కోడా గామా (Vasco da Gama ) అనే పోర్చుగీసు నావికుడు సముద్ర మార్గాన భారత్ చేరిన రోజు అది. అప్పటి నుంచి యూరప్ నుంచి భారత్‌కు సముద్రమార్గం కనిపెట్టిన వాడిగా వాస్కోడా గామా ప్రసిద్ధి చెందాడు.భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కోసం 1497 జూలై 8న పోర్చుగల్ రాజు మాన్యుయెల్ –1 ఆదేశంతో లిస్బన్ నుండి వాస్కోడా గామా బయలుదేరాడు. సుమారు 170 మంది సిబ్బందితో, సావో గాబ్రియేల్, సావో రాఫెల్, బెర్రియో వంటి నౌకలు ఈ ప్రయాణంలో పాల్గొన్నాయి. ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగలేదు. భయంకరమైన తుపానులు, ఆహార కొరత, స్కర్వీ వంటి వ్యాధులు నావికులను వేధించాయి. సముద్రంలో నెలల తరబడి గడపడం వల్ల సగానికి పైగా సిబ్బంది మరణించారు. నావికులు భయంతో వెనక్కి వెళ్దామని గొడవ చేసినా, గామా మొండితనంతో ముందుకు సాగాడు. తిరుగుబాటు చేసినవారిని ఇనుప గొలుసులతో బంధించి మరీ తన లక్ష్యం వైపు ప్రయాణించాడు. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మొంబాసా వంటి ప్రాంతాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు. అతడు భారత్‌కు చేరుకోవడంలో స్థానిక నావికుల సముద్రమార్గ అవగాహన కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలోని మలిండిలో అతడికి ఒక గుజరాతీ నావికుడు (కాంజీ మలమ్), అరబ్ నావికుడు (ఇబ్న్ మాజిద్)ల సహాయం లభించింది. రుతుపవనాల గమనాన్ని గుర్తించడంలో ఈ నావికులకు ఉన్న అవగాహనే గామాను క్షేమంగా కాలికట్ తీరానికి చేర్చింది. కాలికట్ పాలకుడు జామొరిన్ (మాన విక్రమ) గామానుఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. అయితే పోర్చుగీసువారు కానుకలుగా సమర్పించిన బట్టలు, టోపీలు, పగడపు దండలు, చక్కెర, తేనె వంటి అల్పమైన వస్తువులను చూసి అతడు పెదవి విరిచాడు. నిజానికి జామొరిన్ ఆ కానుకలను చూసి జాలిపడి, గామా చేసిన కష్టభరితమైన ప్రయాణాన్ని గౌరవిస్తూ వ్యాపారానికి అనుమతి ఇచ్చాడు. మిరియాలు, ఇతర మసాలా దినుసులు, క్యాలికో వస్త్రాల వ్యాపారం చేసుకునే వీలు కల్పించాడు. గామా ఇక్కడి నుంచి తాను వచ్చిన మూడు నౌకలలో సుగంధ ద్రవ్యా లను, ఇతర విలువైన వస్తువులను తీసుకుని తిరిగి పోర్చుగల్ వెళ్లి అమ్మడంతో ఈ యాత్ర చేయడానికి అయిన ఖర్చుకు 60 రెట్ల లాభం సమకూరింది. అందుకే మరోసారి ఇండియా ప్రయాణ మయ్యాడు.వ్యాపారం మాత్రమే లక్ష్యం కాదు వాస్కోడా గామా రెండో ప్రయాణం (1502) అత్యంత క్రూరంగా సాగింది. అరేబియా సముద్రంపై పోర్చుగీసు ఆధి పత్యం సాధించడానికి గామా హింసను ఆశ్రయించాడు. సము ద్రంలో వెళ్తున్న అరబ్ నౌకలపై దాడులు చేయడం, ప్రయాణికు లను చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జామొరి న్ను తన సైనిక శక్తితో బలవంతంగా సంధికి ఒప్పించాడు. అంతు లేని సంపదతో తన స్వదేశం తిరిగి వెళ్లాడు.మొత్తానికి ఈ సముద్ర మార్గ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రను మలుపు తిప్పింది. పోర్చుగీసువారి విజయంతో డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్లు భారత్‌కు రావడం మొదలుపెట్టారు. వ్యాపారం కోసం వచ్చిన వీరు, క్రమంగా దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఆక్రమణలకు పాల్పడ్డారు. చివరిసారిగా 1524లో పోర్చుగీసు భారత వైస్రాయ్గా వచ్చిన వాస్కోడా గామా, కొచ్చిన్ లోనే అనా రోగ్యంతో మరణించాడు. అతడి భౌతిక కాయాన్ని తర్వాత పోర్చు గల్‌కు తరలించారు. వాస్కోడా గామా వేసిన సముద్రపు బాట 450 ఏళ్ల భారత బానిసత్వానికి దారితీసింది. అంతులేని సంపద ఈ మార్గంలోనే యూరప్‌కు ప్రవహించింది. దేశం పేదదిగా మిగిలిపోయింది. -ఎడిటోరియల్ టీమ్ -
July 8th: వాస్కోడగామా తొలిసారి ఇండియాకు పడవెక్కిన రోజు
పదిహేనవ శతాబ్దాపు ప్రముఖ పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా తొలిసారి నేరుగా ఇండియాకు నౌకాయానం ప్రారంభించిన రోజు ఇది. 1497 జూలై 8న ఆయన మహాయాత్ర లిస్బన్ రేవు నుంచి మొదలైంది. ఆఫ్రికాలోని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ప్రాంతాన్ని చుడుతూ ఏడాది తర్వాత 1498 మే 20న ఇండియాలోని కోళికోడ్ (కేరళ) తీర ప్రాంతాన్ని చేరుకుంది. ఐరోపా నుంచి సముద్ర మార్గంలో ఒకరు ఇండియాకు రావడం అదే మొదటిసారి. దాంతో ఐరోపా మళ్లీ ఇండియాతో తన వ్యాపార సంబంధాలను పునరుద్ధరించుకుంది. మొదట గ్రీకులు, రోమన్లు అరబ్‌లు భారత్ నుంచి సరకు కొనుక్కెళ్లి ఐరోపాలో లాభానికి అమ్ముకునేవారు. కాన్‌స్టాంట్‌నోపుల్ మీదుగా భారత్‌కు భూమార్గం అందుబాటులో ఉన్నంతవరకు వీళ్ల వ్యాపారాలన్నీ సజావుగా సాగాయి. ఎప్పుడైతే తురుష్కులు కాన్స్టాంట్ నోపుల్‌ను ఆక్రమించుకున్నారో అప్పటి నుంచి ఆ దారి మూసుకుపోయింది. -
పూరి నెక్ట్స్ ‘వాస్కోడగామా’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన మెహబూబా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
కర్నూలు మీదుగా వాస్కోడిగామకు రైలు
– ప్రతి గురు, శనివారాల్లో రాకపోకలు కర్నూలు(రాజ్‌విహార్): హైదరాబాదు నుంచి వాస్కోడిగామకు కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రైలు ప్రతి గురు, శనివారాల్లో రాకపోకలు సాగించనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఇది కర్నూలు మీదుగా నడిచే తొలి రైలు కావడం గమనార్హం. వీటిలో టికెట్లు పొందేందుకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. రైళ్లు వివరాలు: – వాస్కోడిగామకు: హైదరాబాదు (నాంపల్లి స్టేషన్) నుంచి ఈ రైలు (నంబర్ 17021) ప్రతి గురువారం ఉదయం 9:20 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రబాదులో 9:55కి, కాచిగూడలో 10:22లకు, షాద్ నగర్ 11:06, మహబూబ్ నగర్ మధ్యాహ్నం 12గంటలకు, గద్వాలలో 1 గంటకు బయలుదేరి కర్నూలుకు 14:10గంటలకు (మధ్యాహ్నం 2:10)కి వచ్చి రెండు నిమిషాలు ఆగి కదులుతుంది. డోన్‌లో 15:55గంటలకు బయలుదేరి గుంతకల్‌కు 17:00గంటలకు చేరుకుంటుంది. 18:00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి వాస్కోడిగామకు వెళ్లే రైలు (నంబర్ 17419)కు ఈ బోగీలను అనుసంధానం చేస్తారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు వాస్కోడిగామకు చేరుకుంటుంది. – కర్నూలు మీదుగా హైదరాబాదుకు: వాస్కోడిగామ నుంచి రైలు (నంబర్ 17420) శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 21:00గంటలకు గుంతకల్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 10బోగీలతో 17022 నంబరు రైలుగా రాత్రి 21:10గంటలకు బయలుదేరి డోన్‌కు అర్ధరాత్రి 12:25కి, కర్నూలుకు శనివారం తెల్లవారుజామున 2:10కి, గద్వాలకు 3:14, మహబూబ్ నగర్‌కు 4:20, షాద్ నగర్‌కు 05:05, కాచికూడకు 6:00, హైదరాబాదు (నాంపల్లి)కు ఉదయం 7:40గంటలకు చేరుకుంటుంది.


