Obama
-
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
పిలల్ల పెంపకంలో ఆ తప్పులు చెయ్యొద్దంటున్న మిచెల్ ఒబామా!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా సోషల్ మీడియా ఇంటర్యూలో పిలల్ల పెంపకం గురించి మాట్లాడరు. పిల్లలను చక్కగా పెంచడం అనేది ఓ యజ్ఞం లాంటిదని అన్నారు. ఎందుకుంటే మనం చెప్పేవి వాళ్ల మంచికేనని తెలియాలి, అదే టైంలో తల్లిదండ్రులు వాళ్లకు విలన్స్ కాదు శ్రేయోభిలాషులు అనే నమ్మకం కలిగించాలి. అంతేగాదు ఆమె పిల్లల పెంపకం అనేది చాలా కష్టమైన పని అని, అది కత్తి మీద సాములాంటిదని అన్నారు. ఏ మాత్రం మనం అజాగ్రత్తతతో లేదా నిర్లక్ష్యపూరితంగా వ్యహరిస్తే వారి భవిష్యత్తు నాశనమవ్వడం తోపాటు మనకు తీరని మనోవ్యధే మిగిలుతుంది అని చెబుతున్నారు మిచెల్. తాను ఈ విషయంలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న మెళుకువలే తన ఇద్దరి పిల్లల పెంపకంలో ఉపయోగపడ్డాయిని చెబుతోంది. అందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మిచెల్. అవేంటంటే.. పిల్లలు తమంతట తామే పెరుగుతారు. వారికి ఎదిగే క్రమంలో మన సాయం కావాల్సిన చోటల్లా భరోసా ఇస్తే చాలు. వారే చుట్టూ ఉన్న వాతావరణం, తమ స్నేహితులు, బంధువుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. పైగా తెలివిగా అభివృద్ధి చెందుతారు. ఆ క్రమంలో పిలల్లు కొన్ని తప్పులు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ అనేంత మెచ్చూరిటీ లెవెల్స్ పిలల్లకు ఉండవు. మనం చేసే ఒక్కో పని సంక్రమంగా లేకపోతే ఎంత పెద్ద సమస్యను సృష్టిస్తుందనేది కూడా వాళ్లు అంచనా వేసేంత బ్రెయిన్ వాళ్లకు ఉండదు. కాబట్టి పిల్లలను తెలివిగా, సక్రమంగా పెంచాలంటే ఈ సింపుల్ మెళుకువలు పాటిస్తే ఎంతటి మొండి పిల్లలైనా తీరు మార్చుకుంటారు. కాస్త సమయ తీసుకున్నప్పటికీ మంచి పిల్లలుగా గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. మిచెల్ చెప్పే మెళుకువలు.. పిల్లలను నేరుగా విమర్శించొద్దు.. చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు ఇదే అని మిచెల్ అంటున్నారు. మీరు పిల్లలను మంచి కోరే నేరుగా వాళ్ల చేస్తుంది తప్పు అని చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్లు మనం అన్నమాటలు ఎలా తీసుకుంటున్నారనేది గమనించకపోతే పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య ఉండే బాండింగ్ దెబ్బ తింటుంది. మిమ్మల్ని శత్రువులుగా చూసే ప్రమాదం ఎక్కువగా ఉంది. పిల్లలు తమ తప్పును వాళ్లే గుర్తించేలా విడమర్చి చెబుతూ మిమర్శనాత్మకంగా చెప్పండి. అంతేగాదు పేరెంట్స్ మీరు క్షమించినా, బయట ఇలా చేస్తే వాళ్లను ఎలా చూస్తారనేది అర్థమయ్యేలా వివరించాలి. ఇలా చేస్తే పిల్లలు పేరెంట్స వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా ఫ్రెండ్లీగా మెలుగుతారు. బాధ్యతలను తీసుకునేలా చేయాలి.. చాల మంది తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పులు చేస్తున్నారని మిచెల్ అంటున్నారు. పిల్లలు అమాయకులు, ఎంత ఎదిగినా చిన్నవాళ్లే అనే భావనల నుంచి పేరెంట్స్ ముందు బయటకు రావాలి. వారి వయసుకు తగ్గట్టు చిన్న చిన్న బాధ్యతలను అప్పగించాలి. అప్పుడే ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కారించాలనే ఆలోచన డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడే వాళ్లలోని దాగున్న ప్రతిభ, సామర్థ్యాలను బయటకు వస్తాయి. ఇక్కడ బాధ్యతలు అనగానే ప్రతీది కాదు వారు చేయగలిగేలా, ప్రయోజనం చేకూర్చేవి, తప్పక నేర్చుకోవాల్సిన బాధ్యతలు చిన్న చిన్నగా ఇవ్వండి. రాను పిల్లలకు తెలియకుండా నా కుటుంబం కోసం నేను ఇది చేయాలనే అవగాహన రావడమే గాక ఇది తన బాధ్యత అనే స్థాయికి చేరుకుంటారని అంటున్నారు మిచెల్. సమస్యలతో పోరాడనివ్వండి.. తల్లిదండ్రులుగా మనం రక్షణగా ఉన్నప్పటికీ వారు వ్యక్తిగతంగా ఏదోఒక సమయంలో వారికి వారే పోరాడాల్సి ఉంటుంది. అందువల్ల చిన్న సమస్యలను వాళ్లు ఎలా పరిష్కరించేందుకు యత్నిస్తున్నారో చూడండి. వెళ్తున్న దారి కరెక్టే అయితే ధైర్యం ఇవ్వండి. ఒకవేళ్ల తప్పుదోవలో సమస్య పరిష్కరించేందుకు చూస్తుంటే అడ్డుకుని వివరించండి. ఈ విధానం పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కెరీర్ పరంగా వచ్చే సమస్యలను, ఒత్తిడులను జయించగలిగే శక్తిని ఇస్తుంది . తప్పిదాల నుంచే విజయం పొందడం ఎలా..? ఒక పని చేస్తున్నప్పుడూ పదే పదే ఫెయ్యిల్యూర్లు వస్తుంటే.. అక్కడితో నిరాశగా ఢీలా పడిపోకుండా ముందుకు నడవడం ఎలా అనేది తెలియజేయండి. ఎన్ని ఓటములు ఎదురైనా.. పాజిటివ్ ఆటిట్యూడ్‌ని వదలకూడదు, ఓడిపోయానని చేతులెత్తేయకూడదని చెప్పండి. చివరి నిమిషం వరకు విజయం కోసం వేచి చూసే స్పూర్తిని నేర్పించండి. తప్పిదాలనే విజయానికి బాటలుగా చేసుకోవడం ఎలా అనేది వివరించండి. ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తుల గూర్చి కథకథలుగా చెప్పండి. అప్పుడూ వాళ్లకు సక్సెస్ అనేది అందుకోలేని బ్రహ్మపదార్థంలా కనిపించదు. అలాగే ప్రస్తుత పరిస్తుతలను చూసి చాలామంది తల్లిదండ్రులు మనోడు మంచిగా ఉంటాడా? అని ఆందోళన చెందకూడదు. నిజానికి బయట పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా మీరు వారితో వ్యవహరించే విధానం బాగుంటే ఆందోళనకి చోటు ఉండదనే విషయం గుర్తెరగాలి. అంతేగాదు చెడు అలవాట్ల జోలికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ మనసు లాగినా పేరెంట్స్ మీదున్న గౌరవం ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేస్తుంది అని చెబుతున్నారు. నిజంగా మిచెల్ చెప్పిన మెళుకువలు ప్రతి తల్లిదండ్రులు అనుకరిస్తే పిల్లలు మంచిగా పెరగడమే కాకుండా దేశానికి మంచి పేరు కూడా తెస్తారు కదూ. (చదవండి: ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!) -
అమెరికా అధ్యక్షులపై స్మార్ట్ గాడ్జెట్ల నిషేధం ఎందుకు?
అమెరికా అధ్యక్షులను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. అటువంటిప్పుడు వారు తమకు నచ్చిన ఏదైనా గాడ్జెట్‌ను ఉపయోగించగలుగుతారని మనం అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. వారు నూతన సాంకేతికత పరికరాలకు దూరంగా ఉంటారు. వారు తమకు నచ్చిన ప్రతి గాడ్జెట్‌ను ఉపయోగించలేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లకు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలే కీలక టార్గెట్ అని అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలు గాఢంగా నమ్ముతాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షులు పరిమిత గాడ్జెట్లను మాత్రమే ఉపయోగించగలుగుతారు. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైన తర్వాత తాను బ్లాక్‌బెర్రీని ఉపయోగించడానికి భద్రతా సలహాదారులతో చాలా కాలం పోరాడారు. చివరికి భద్రతా సలహాదారులు అధ్యక్షుడు ఒబామా బ్లాక్‌బెర్రీని వినియోగించేందుకు ఆమోదించారు. అయితే సీనియర్ ఉద్యోగులు, దగ్గరి స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు మాత్రమే ఒబామా దీనిని వినియోగించాలనే షరతు విధించారు. 2010లో ఐప్యాడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అధ్యక్షుడు బరాక్ ఒబామా దానిని తన వద్ద ఉంచుకోవాలని భావించారు. ఒబామా కోరిక మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మరింత సురక్షితమైన ఐప్యాడ్ ‘ఒబామాప్యాడ్’ని రూపొందించారు. ఒబామాప్యాడ్ను అధ్యక్షుని వ్యక్తిగత సిబ్బందికి కూడా ఇచ్చారని సమాచారం. గతంలో వైట్ హౌస్‌లో వైఫై ఉండేది కాదు. దీంతో అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లో వైఫై ఇన్స్టాల్ చేయడం గురించి చర్చించారు. అయితే భద్రతా సలహాదారులు వైఫైని ఇన్స్టాల్ చేయడం భద్రతా ఉల్లంఘనను దారితీస్తుందని ఒబామాకు తెలిపారు. చివరకు అధికారులు బరాక్ ఒబామా పట్టుదలకు తలొగ్గవలసి వచ్చింది. ఎట్టకేలకు ఒబామా నివాసంలో వైఫైని ఏర్పాటు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో ట్విట్టర్‌ను విరివిగా ఉపయోగించారు. అతను వ్యక్తిగత పనుల కోసం బర్నర్ ఫోన్లు వాడినట్లు సమాచారం. తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా వాటిని తొలగించారు. ట్రంప్ కంప్యూటర్లు, ఈమెయిల్ వాడకంపై సందేహించేవారు. దీంతో ట్రంప్ కమ్యూనికేషన్ కోసం పేపర్‌ను వినియోగించేవారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ లిన్ తెలిపిన వివరాల ప్రకారం హ్యాక్ చేయలేని స్మార్ట్ గాడ్జెలు చాలా అరుదుగా ఉన్నాయి. అయితే ఇవి కమ్యూనికేషన్లో సమస్యలను సృష్టిస్తుంటాయి. అమెరికా అధ్యక్షుని విషయానికొస్తే అతనికి రక్షణ అత్యంత అవసరం. అందుకే అతను ఏ స్మార్ట్ గాడ్జెట్‌ను ఉపయోగించకూడదు. అందుకే అమెరికా మాజీ అధ్యక్షులు అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ స్మార్ట్ గాడ్జెట్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యాపిల్ న్యూస్ యాప్ వినియోగిస్తున్నారు. ఇది ఎప్పుడైనా సమస్యలను సృష్టించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా స్మార్ట్ గాడ్జెట్లు అంత సురక్షితం కావని, వాటితో ఎప్పటికైనా ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1982లో తన మాజీ ప్రేమికురాలికి ఒక లేఖ రాశారు. దానిలో ఏమి రాశారన్నది తాజాగా బయటపడి సంచలనంగా మారింది. బరాక్ ఒబామాకు గే సెక్స్ అంటే ఇష్టమని ఈ లెటర్ ద్వారా వెల్లడయ్యింది. తనకు రోజూ పురుషులను దగ్గరికి తీసుకోవడమంటే ఇష్టమని, అయితే అది తన కల్పన మాత్రమేనని దానిలో ఒబామా పేర్కొన్నారు. బరాక్ ఒబామా తన మాజీ ప్రియురాలికి రాసిన లేఖను న్యూయార్క్ పోస్టు బయటపెట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒబామాకు గే సెక్స్ ఫాంటసీ అంటే ఇష్టమనే విషయాన్ని ఈ ఉత్తరం వెల్లడించింది. దానిలో ఆయన తాను పురుషులతో రోజూ లైంగిక కార్యకలాలపాల్లో పాల్గొంటున్నట్లు కలలుకంటానని తెలిపారు. ఈ ఉత్తరం రాసే సమయానికి ఒబామా వయసు 21 ఏళ్లు. 1982 నవంబరులో ఆయన తన మాజీ ప్రేమికురాలు అలెక్స్ మెక్నియర్కు ఈ ఉత్తరం రాశారు. ఒబామా, అలెక్స్ ఆరోజుల్లో లాస్ఏంజిల్స్లోని ఆక్సిడెంటల్ కాలేజీ విద్యార్థులు. అప్పుడు వారు రిలేషన్లో ఉండేవారు. ఆ ఉత్తరంలో ఒబామా.. హోమో సెక్సువాలిటీ గురించి ప్రస్తావించారు. 40 ఏళ్ల క్రితం నాటి ఈ లెటర్‌ను ఒబామా తాను రాసినదేనని అంగీకరించారు. తాను ఒక పురుషుని రూపంలోనే మరో పురుషునితో ఉండేందుకు ఇష్టపడ్డానని ఒబామా పేర్కొన్నారు. ఒబామాతో రిలేషన్ ముగిసిన అనంతరం అతని మాజీ ప్రేమికురాలు అలెక్స్ ఆ లేఖలోని కొన్ని వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరం ఎమోరీ యూనివర్శిటీలో ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1992లో మిషెల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇది కూడా చదవండి: 6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్‌లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట! -
అసోం సీఎం 'హుస్సేన్ ఒబామా' వ్యాఖ్యలపై రాజకీయ రగడ..
గువాహటి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అనేకమంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారని వ్యంగ్యంగా ట్విట్టర్ వేదికగా అన్నారు. అలాంటి వారిని ఎదుర్కోవడమే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. భారత్‌లో మైనార్టీల దుస్థితిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఒబామాను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసులు వాషింగ్టన్ వెళ్తారా అంటూ ట్విటర్లో వచ్చిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. There are many Hussain Obama in India itself. We should prioritize taking care of them before considering going to Washington. The Assam police will act according to our own priorities. https://t.co/flGy2VY1eC — Himanta Biswa Sarma (@himantabiswa) June 23, 2023 అసోం పోలీసులు స్వీయ ప్రాధామ్యాల ప్రకారం నడుచుకుంటారని బిశ్వశర్మ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విపక్ష నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒక పాత్రికేయుడు ట్విటర్లో ప్రశ్న అడిగారు. ఒబామాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అని ఆయన అడిగారు. దీనిపై అసోం సీఎం వివాదస్పదంగా బదులివ్వడం రాజకీయంగా రగడకు దారితీసింది. సీఎం వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఫైరయ్యారు. భారత్‌లో మతం ఆధారంగా వివక్ష లేదంటూ అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తి వ్యతిరేకంగా అసోం సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం ఈ అంశంలో క్షమాపణలు చెప్పకపోతే ప్రధాని మోదీని ప్రపంచం ఎలా విశ్వసిస్తుందని ప్రశ్నించారు. ఇదీ చదవండి: మణిపూర్: అమిత్ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్ నుంచి వెళ్లింది వీరే.. -
ట్రంప్ మార్కు మార్పు..!
దరఖాస్తులో తప్పులు దొర్లినా, జత చేయాల్సిన డాక్యుమెంట్లలో ఏవైనా మర్చిపోయినా లేదా మిస్ అయినా అమెరికా వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తు, పిటిషన్ లేదా విజ్ఞప్తిని (హెచ్1బీ సహా) ఆ దేశ అధికారులు ఇప్పుడు తిరస్కరించవచ్చు. వీసా లేదా గ్రీన్‌కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే వాటిని సరిచేసుకునేందుకు దరఖాస్తుదారులకు గతంలో ఉన్న అవకాశం ఇప్పుడుండదు. అమెరికాలో చట్టపరంగా శాశ్వత నివాసులుగా (గ్రీన్‌కార్డ్‌పై) ఉండేందుకు, తాత్కాలికంగా అక్కడ నివసిస్తూ ఉద్యోగం (నాన్ ఇమిగ్రెంట్) చేసే వారు లేదా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారిపైనా తాజా నిబంధన ప్రభావం పడుతుంది. ఇప్పటిదాకా ప్రతీ ఏడాది దాదాపు 70 లక్షల వరకు ఇలాంటి దరఖాస్తులను అక్కడి అధికారులు పరిష్కరిస్తున్నారు. అయితే పర్యటనలు, వ్యాపార అవసరాల నిమిత్తం స్వల్పకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిపై కొత్త నిబంధన వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. గత మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన విధానపరంగా పెద్దమార్పుగానే ఇమిగ్రేషన్ లాయర్లు, కార్యకర్తలు, ఈ ప్రభావానికి గురయ్యే వారు భావిస్తున్నారు. కొత్త నిబంధన వల్ల వీసా దరఖాస్తు ప్రక్రియకయ్యే ఖర్చు మరింత పెరుగుతుందని, దరఖాస్తు పరిశీలన మామూలు కంటే ఎక్కువ కాలం తీసుకుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. నిబంధనలో తాజా మార్పు వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారి దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నట్టుగా తేలితే వారిని స్వదేశాలకు కూడా తిప్పి పంపించే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒబామా విధానానికి ట్రంప్ మార్పులు.. 2013లో బరాక్ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన నిబంధన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది. వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో తప్పులు, జత చేయని పత్రాలున్న అన్ని కేసుల్లో అభ్యర్థి పనిచేసుకునేందుకు వీలుగా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ), నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై (ఎన్ఓఐడీ) జారీ చేసేలా యూఎస్సీఐఎస్ అధికారులకు ఒబామా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త నిబంధన ద్వారా ఆ అవకాశం ఉండదు. విచారణలో ఉన్న స్వాప్నికుల (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్డీఏసీఏ) కేసులు మినహా కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అందే అన్ని దరఖాస్తులు, పిటిషన్లు, విజ్ఞప్తులు దీని పరిధిలోకి వస్తాయని అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రతినిధి మైఖేల్ బార్స్ తెలిపారు. -
‘మూడో’గళం నినాదం
సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్ హక్కులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై శుక్రవారం ఢిల్లీలో ఒబామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సులో బెంగళూరు ట్రాన్స్‌జెండర్ అకాయ్ పద్మశాలి ఒబామాను వివిధ విషయాల పై ప్రశ్నించడమే కాకుండా తమ వర్గం సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రసంగించనున్నారు. ఎవరీ అకాయ్.... అకాయ్ పద్మశాలి బెంగళూరులో పుట్టి పెరిగాడు. ఇక్కడే పదో తరగతి వరకు చదివాడు. తను ఉండాల్సింది ఇలా కాదని అనిపించి ట్రాన్స్‌జెండర్‌గా మారారు. సమాజం నుంచి చీత్కారాలు పై చదువులకు దూరంచేశాయి. తనలాంటి థర్డ్‌జెండర్స్‌కు సమాజంలో ఎదురవుతున్న అవమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు, హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఈమె కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవ అవార్డుతో పాటు పలు జాతీయ పురస్కారాలనూ పొందారు. ఒబామాతో భేటీకి నిరీక్షణ: అకాయ్ ఒబామాతో భేటీ విషయమై అకాయ్ పద్మశాలి ‘సాక్షి’తో మాట్లాడుతూ....‘ ఈ సదస్సులో పాల్గొనడం కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. ఒబామా ఇప్పటికే అమెరికాలో లైంగిక అల్ప సంఖ్యాకుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ విషయాలపై నేను ఆయనను ప్రశ్నించనున్నాను’ అని తెలిపారు. -
ట్రంప్‌కు ప్రేమతో..!
అధ్యక్ష బాధ్యతలు చేపట్టేముందు లేఖలో సూచనలు చేసిన ఒబామా వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ముందు డొనాల్డ్ ట్రంప్‌కు నాటి అధ్యక్షుడు ఒబామా రాసిన లేఖ ప్రతి ఒకటి తాజాగా వెలుగుచూసింది. శ్వేతసౌధం నుంచి వెళ్లిపోయే అధ్యక్షుడు, కొత్తగా వచ్చే అధ్యక్షుడికి సూచనలు ఇస్తూ లేఖ రాయడం సంప్రదాయం. సాధారణంగా ప్రస్తుత అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోయేవరకు ఆ లేఖను బహిర్గతపరచరు. కానీ ఒబామా రాసిన లేఖను ట్రంప్ అధికారం చేపట్టిన ఎనిమిది నెలలకే స్వయంగా ఆయనే శ్వేతసౌధం సందర్శకులకు చూపించగా, వారిలో ఒకరు ఉత్తరాన్ని ఫొటో తీసి మీడియాకు అందించారని సమాచారం. ట్రంప్‌కు ఈ లేఖలో ఒబామా పలు సూచనలు చేశారు. ‘నాతో సహా పార్టీలకతీతంగా లక్షలాది మంది మీపై ఆశలు పెట్టుకున్నారు. ఇది (శ్వేతసౌధం) ఓ అద్వితీయమైన కార్యాలయం. ఇక్కడ విజయం కోసం ముందుగా నిర్ణయించిన మార్గాలేవీ ఉండవు. కాబట్టి నేను ఇచ్చే సలహాలు మీకు పనికొస్తాయో లేదో నాకే తెలీదు’ అని ఒబామా లేఖలో పేర్కొన్నారు. ‘మనిద్దరినీ వేర్వేరు మార్గాల్లో అదృష్టం వరించింది. విజయానికి బాటలు వేయడానికి మనం ఏం చేయగలమనేది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే ప్రపంచానికి అమెరికా నాయకత్వం వహించడం అనివార్యం. దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఒబామా లేఖలో పేర్కొన్నారు. -
చవకబారు ఎత్తుగడలు
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఆరునెలలు పూర్తయింది. ఎన్నికల ప్రచారంలోనూ, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాతా ఆయన చాలా వాగ్దా నాలే చేశారు. అందులో పేద వర్గాలకు ఉపయోగపడుతూ ‘ఒబామా కేర్’గా ప్రసిద్ధి చెందిన ఆరోగ్య పరిరక్షణ చట్టం రద్దు ప్రధానమైనది. మరొకటి ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం రద్దు. సామాన్య పౌరులు చెల్లిస్తున్న పన్నుల్లో కోత పెడతానని, సంపన్న వర్గాలపై ఉన్న పన్నుల్ని పెంచుతానని హామీ ఇచ్చారు. అమెరికాలోని ప్రముఖ సంస్థలన్నీ స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా బలవంతంగా ఒప్పించానన్నారు. వీటిల్లో ఇంతవరకూ ఏ ఒక్కటీ నెరవేరలేదు. ‘ఒబామా కేర్’ రద్దుకు చేసిన ప్రయత్నం రెండోసారి కూడా విఫలమైంది. ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసేందుకు చేసిన ప్రయత్నాలకు ఒకసారి కాదు... రెండుసార్లూ ఆ గతే పట్టింది. సామాన్య పౌరులకు పన్నుల భారం తగ్గలేదు. సంపన్నులకు అదనపు పన్నులు వచ్చిపడలేదు. జీఎం, ఫోర్డ్, కారియర్లాంటి ప్రముఖ సంస్థలు చాలా ఉద్యోగాలను మెక్సికో, చైనాలకు తర లించాయి. ఇన్ని రకాలుగా విఫలమైన ట్రంప్ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చు కునేందుకు ఇరాన్‌పై అమల్లో ఉన్న ఆంక్షల జాబితాను మరింత పెంచారు. ‘విద్వే షపూరిత కార్యకలాపాలు’ సాగిస్తున్నందుకు ఈ కొత్త ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రక టించారు. ఈ తాజా ఆంక్షల కారణంగా మన దేశంతోసహా పలు దేశాలు ఇరాన్‌తో సాగిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులెదురవుతాయి. దాదాపు 3 కోట్ల మంది వరకూ లబ్ధి పొందుతున్న ఆరోగ్య పరిరక్షణ చట్టం అంటే ట్రంప్‌కు, పాలక రిపబ్లికన్ పార్టీకి మొదటినుంచీ మంట. తాను తీసుకు రాదల్చుకున్న కొత్త చట్టంతో పౌరులందరికీ తక్కువ వ్యయంతో ఆరోగ్య బీమా అందుబాటులోకొస్తుందని ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ఊదరగొట్టారు. అధ్యక్షుడైన కొత్తలోనూ ఆ మాటే అన్నారు. అయితే ఆయన ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఉన్న లబ్ధిదారులకు ఎసరు తీసుకురావడంతోపాటు దాన్ని మరింత ఖరీదైన వ్యవహారంగా మారుస్తున్నది. ఇది గనుక చట్టమైతే తమ పార్టీకి అప్రదిష్ట తప్పదని గ్రహించిన అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొందరు డెమొక్రటిక్ సభ్యులతో కలిసి దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా వరసగా రెండో సారి కూడా సెనేట్‌లో ట్రంప్‌కు భంగపాటు తప్పలేదు. కానీ ఇక్కడితో ఆయన వదిలేలా లేరు. చట్టాన్ని రద్దు చేయడం తథ్యమని, అందుకోసం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తానని చెబుతున్నారు. ట్రంప్ వ్యూహం బహిరంగమే. పాత చట్టం వచ్చే రెండేళ్లలో రద్దయ్యేలా బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే...ఆ తర్వాత తీరిగ్గా కొత్త చట్టానికి సంబంధించిన బిల్లు తీసుకురావచ్చునని ట్రంప్ ఆలోచిస్తున్నారు. పాత చట్టం రద్దయి, కొత్తది అమల్లోకి వచ్చే విధంగా రూపొందిన ప్రస్తుత బిల్లుకు బదులు ఇలా చేస్తే సమస్య ఉండదని ఆయన భావన. కానీ ఈ చర్య వల్ల బీమా సంస్థల్లో అనిశ్చితి ఏర్పడుతుందని, ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం చూపు తుందని, ఫలితంగా సామాన్య పౌరుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతాయని రిపబ్లికన్లు కొందరు ఆందోళనపడ్డారు. అందువల్లే చివరి నిమిషంలో బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. నిజానికి కొత్త బిల్లుపై అమెరికన్ పౌరుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం 17శాతంమంది మాత్రమే దానికి అనుకూలమని సర్వేలో తేలింది. ఒమామా కేర్ చట్టం రద్దుకు ఇంతగా తహతహలాడటం వెనక ట్రంప్‌కు వేరే ప్రయోజనాలున్నాయి. చట్టం రద్దయితే పన్ను సంస్కరణలు, మౌలిక సదుపాయాల ప్రక్షాళన వంటివి ప్రారంభించాలన్నది ఆయన ఆలోచన. పన్ను సంస్కరణల కోసం సంపన్న వర్గాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇంకా పన్నులెందుకు తగ్గించరని సామాన్యులు అడుగుతున్నారు. ఇరాన్‌తో ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందంపై రిపబ్లికన్లు మొదటినుంచీ మండిపడుతున్నారు. తాము అధికారంలోకొస్తే దాన్ని రద్దు చేస్తా మని పలుమార్లు ప్రకటించారు. అయితే అదంత సులభం కాదు. ఒప్పందంలో అమెరికా, ఇరాన్‌లు మాత్రమే కాదు... రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా ఉన్నాయి. ఏకపక్షంగా దాన్నుంచి తప్పుకోవడం వల్ల వెనువెంటనే యూరప్ దేశాలతో అమెరికాకు సమస్యలొచ్చిపడతాయి. ఇరాన్‌తో ఆర్ధిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆ దేశాలు తహతహలాడుతున్నాయి. పైగా ఇరాన్ ఒప్పందంలోని షరతులకు అనుగుణంగా నడుచుకుని తన అణు కార్యక్రమాలను నిలిపేసిందని బలంగా నమ్ముతున్నాయి. కేవలం ఇజ్రాయెల్‌ను సంతోషపెట్టడం కోసం ట్రంప్ దీన్ని రద్దు చేయాలని చూస్తున్న సంగతి వాటికి తెలుసు. ఒప్పందం రద్దు కావాలంటే ఇరాన్ పాత దోవన వెళ్తున్నట్టు నిర్ధారణ కావాలి. మూడు నెలలకోసారి అమెరికా భద్రతా విభాగం జరిపే సమీక్ష దాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఇరాన్‌వైపు ఉల్లంఘనలేమీ లేవని అది నిర్ధారించుకుంది. అందువల్లే అకారణంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే యూరప్ దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని, అది దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ఉన్నతాధికారులు ట్రంప్‌కు నచ్చజెప్పారు. మూడు నెలలక్రితం కూడా అదే జరిగింది. అందువల్లే అప్పుడూ, ఇప్పుడూ కూడా ఒప్పందం కొనసాగింపుపై ట్రంప్ అయిష్టంగా సంతకం చేస్తూనే అదనపు ఆంక్షలు తీసుకొచ్చారు. ఇందు వల్ల ఇరాన్ తనంతతానే ఒప్పందానికి దూరమవుతుందని ఆయన ఎత్తు గడ. ట్రంప్‌కూ, ఆయన సన్నిహిత దేశాలైన ఇజ్రాయెల్, సౌదీలకూ ఎంత నచ్చకపోయినా ఇరాన్ పశ్చిమాసియాలో ఇప్పుడు తిరుగులేని శక్తి. ఇరాక్‌లో ఐఎస్‌పై ఏళ్ల తరబడి పోరాడి, అనేక నష్టాలు చవిచూసి అమెరికా చేతులెత్తేస్తే... ఇరాన్ స్వల్ప వ్యవధిలో దానిపై విజయం సాధించి తనేమిటో నిరూ పించుకుంది. ఇంటా బయటా ట్రంప్ చేస్తున్న ఈ విచిత్ర విన్యాసాలకు కళ్లెం పడకపోతే అమెరికా ప్రతిష్ట ఇంకా దిగజారుతుంది. ఆ సంగతి అమెరికా పౌరులు తెలుసుకోవాలి. -
ఒబామాకు 58%.. ట్రంప్‌కు 40%
అమెరికా నాయకత్వంపై పలు ప్రపం చ దేశాల ప్రజల విశ్వాసం గణనీయంగా తగ్గిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోకడలే ఇందుకు కారణమని ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో వెల్లడైంది. భారత్ సహా మొత్తం 37 దేశాల్లో ఈ సర్వే జరిగింది. భారత్ విషయానికి వస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో పోలిస్తే ట్రంప్‌కు 18% మంది ప్రజల మద్దతు తగ్గింది. గతంలో ఇదే ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో 58% మంది భారతీయులు ఒబామాపై విశ్వాసం వ్యక్తం చేయగా ప్రస్తుతం 40% మంది ట్రంప్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. 18% తగ్గినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ట్రంప్‌కు భారత ప్రజల నుంచి మద్దతు లభించడం గమనార్హం. 37 దేశాల్లోనూ కలిపి చూస్తే కేవలం 22% మందే ట్రంప్ సమర్థుడనీ, ప్రపంచానికి మంచి చేస్తాడని విశ్వసిస్తున్నారు. అదే ఒబామాపై 64%మంది ప్రజలకు నమ్మకం ఉన్నట్లు గత సర్వేలో తేలింది. రష్యా, ఇజ్రాయెల్ దేశాల ప్రజలు మాత్ర మే ట్రంప్‌ను నమ్ముతున్నారు. మిగతా అన్ని దేశాల ప్రజలూ ట్రంప్‌ను దురహం కారిగా, ప్రమాదకారిగా, అసహనపరుడిగా, అధ్యక్ష పదవికి అర్హత లేనివాడిగా భావిస్తున్నారు. -
క్యూబాతో మైత్రికి ట్రంప్ తెర
► ఒబామా హయాం నాటి ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్ ► క్యాస్ట్రో మిలిటరీకి అమెరికా నిధులు బంద్ వాషింగ్టన్/మయామి: అమెరికా, క్యూబా సంబంధాల పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. బరాక్ ఒబామా హయాంలో క్యూబాతో కుదిరిన మైత్రి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని క్యూబా విమర్శించింది. ఈ విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా 2014 డిసెంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒబామా క్యూబాతో చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని, రౌల్ క్యాస్ట్రో సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించమని ట్రంప్ మయామిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి బదులుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అమెరికా చట్టాలకు లోబడే కొత్త విధానంతో క్యూబా, అమెరికా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. క్యూబా ప్రజలకే పెట్టుబడులు నేరుగా చేరేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని, దాని వల్ల వారు సొంత వ్యాపారాలు ప్రారంభించి తమ దేశానికి గొప్ప భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. క్యూబా ప్రభుత్వంపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకు, హైజాకర్లకు, పోలీసులను హత్యచేసిన వారికి ఆశ్రయం కల్పించిందని ఆరోపించారు. -
ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి....
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా చిన్న కూతురు సాశా ఒబామా శనివారం నాడు తన 16వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు. ఇది పెద్ద వార్త కాలేదుగానీ సాశా ఫస్ట్ నేమ్ నటాషా అని తెలిసి తాను ఏడాది క్రితం అమితాశ్చర్యానికి గురయ్యానని ఆశ్లే సీ ఫోర్డ్ ట్వీట్ చేయడం పెద్ద దుమారమే లేపింది. వేలాది మంది నటాషా పేరును షేర్ చేసుకున్నారు. వారంతా తమదైన శైలిలో స్పందించారు. ‘సాశా పేరు నటాషా అని తెలియని ఓ అబద్ధాల ప్రపంచంలో మనం ఇంతకాలం బతుకుతున్నామైతే’ అని కొందరు స్పందించగా, అమెరికా అధ్యక్షుల వెనక రష్యా కుట్ర ఉందడానికి నటాషా పేరే సాక్ష్యమని కొందరు వ్యాఖ్యానించారు. నటాషా అనే పేరు రష్యన్లు ఎక్కువ మంది పెట్టుకుంటారని, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం వెనక రష్యా కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. సాశా అసలు పేరు నటాషా అయితే ఒబామా పెద్ద కూతురు మాలియా అసలు పేరు చెల్సియానా? అంటు కొందరు ట్విట్టర్లో ప్రశ్నించారు. మరికొందరు మారియా అసలు పేరు బోరిస్ అంటూ ఖాయం చేశారు. సాశా పూర్తి పేరు సాశా అకా నటాషా ఒబామా. ఆమె పూర్తి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాకపోవడంతో అందరికి నటాషా పేరు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మార్తాస్ వైన్యార్డ్ దీవిలోని ఓ రిస్టారెంట్లో గత వేసవిలో సాశా పనిచేసినప్పుడు ఆమె పూర్తిపేరును మొదటిసారి పేర్కొన్నారు. -
మరో వివాదాస్పద అంశంపై ట్రంప్ సంతకం
క్లైమెట్చేంజ్పై ఒబామా నాటి ప్రమాణాలు మార్పు నూతన ఉద్యోగాల సృష్టి కోసమే వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన వివాదాస్పద అంశంపై సంతకం చేశారు. ఒబామా కాలంనాటి పర్యావరణ మార్పుల ప్రమాణాల్లో మార్పులను చేస్తూ ట్రంప్ సంతకం చేశారు. భూతాపంపై అంతర్జాతీయంగా చేస్తున్న పోరాటానికి పెద్ద దెబ్బగా ట్రంప్ సంతకాన్ని పరిగణిస్తున్నారు. బొగ్గు పరిశ్రమను కాపాడుతానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకే ట్రంప్ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ (ఈపీఏ) పై సంతకం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ‘ఒబామా నాటి పర్యావరణ ప్రమాణాలను మార్పు చేయడం ద్వారా ఉత్పత్తి, నూతన ఉద్యోగాల కల్పన శకం ప్రారంభమైనట్లేన’ని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఇంధన శక్తిపై ఉన్న పరిమితులను ఎత్తివేసే చారిత్రాత్మక చర్యగా ట్రంప్ తన నిర్ణయాన్ని పేర్కొన్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం వల్ల దేశ సంపద పెరుగుతుందని..తద్వారా మన దేశాన్ని తిరిగి పునర్ నిర్మించుకునే అవకాశం లభిస్తుంద’ని ట్రంప్ అన్నారు. -
60 రోజుల గడువు ఇవ్వండి
►హెచ్1బీ వీసాల కేసులో కోర్టును కోరిన ట్రంప్ ప్రభుత్వం ►భారతీయుల్లో గుబులు వాషింగ్టన్: అమెరికాలోని భారతీయుల్లో మళ్లీ అలజడి. హెచ్1బీ వీసాలున్న వారి జీవిత భాగస్వాములకు అమెరికాలో పనిచేసే అవకాశం కల్పించిన ఒబామా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించేందుకు 60 రోజుల గడువు కావాలని ట్రంప్ ప్రభుత్వం కోరింది. దీంతో వేలాది భారతీయుల్లో గుబులు మొదలైంది. హెచ్4 వీసాదారులు, ముఖ్యంగా హెచ్1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి 2015లో ఒబామా ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’బృందం వాషింగ్టన్ డీసీ అప్పీల్స్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా కోర్టు అమెరికా ప్రభుత్వ స్పందన కోరింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో తమకు మరింత సమయం కావాలని ట్రంప్ సర్కారు కోర్టుకు విన్నవించింది. ఇప్పటికే ట్రంప్ అమెరికాలో విదేశీ ఉద్యోగులపై పలు ఆంక్షలు పెట్టారు. పైగా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ మొదటి నుంచీ హెచ్1బీ ప్రోగ్రామ్‌కు వ్యతిరేకి. ఈ క్రమంలో హెచ్1బీ వీసాతో అమెరికా వెళ్లిన భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కాగా... వేలాది హెచ్4, హెచ్1బీ వీసాలున్న వారి కుటుంబాలు, అమెరికన్ పౌరులైన వారి పిల్లల పరిరక్షణకు ఈ కేసులో తాము కూడా జోక్యం చేసుకొంటున్నట్టు ఇమిగ్రేషన్ వాయిస్ ప్రకటించింది. ఇది నిరాధారమైన కేసని కింది కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయని ఇమిగ్రేషన్ వాయిస్ సహవ్యవస్థాపకుడు అమన్ కపూర్ వెల్లడించారు. హెచ్1బీ వీసాలతో అమెరికాలో ఉన్నవారిలో భారతీయులే అధికం. ‘హెచ్1బీ’ సంస్కరణలకు అవకాశం వాషింగ్టన్: భారత అమెరికన్లకు సంబంధించిన హెచ్1బీ వర్క్ వీసా, ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు విభాగాల్లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన సెనెటర్ టామ్ కాటన్ వెల్లడించారు. ప్రస్తుతమున్న విధానం వల్ల ఉన్నతమైన నైపుణ్యం రావటం లేదని అందువల్ల దీనిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘హెచ్1బీ వీసా ద్వారా డేటా మేనేజ్మెంట్ వర్కర్లు మాత్రమే అమెరికాకు వస్తున్నారు. పీహెచ్డీ చేసిన వారు, కంప్యూటర్ సైంటిస్టులు రావటం లేదు. అందుకే డిస్నీ, సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ కంపెనీలు సాధారణ నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను తొలగించి కొత్తవాళ్లను నియమించుకున్నాయి’ అని కాటన్ తెలిపారు. -
‘ట్రాన్స్–పసిఫిక్’ నుంచి వైదొలగిన అమెరికా
సంతకం చేసిన అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ : ఎన్నికల హామీల్ని వరుసగా ఆచరణలోకి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ –పసిఫిక్ భాగస్వామ్య(టీపీపీ) ఒప్పందం నుంచి వైదొలుగుతూ సంతకం చేశారు. ఒబామా హయాంలో వాణిజ్య సహకారం కోసం పసిఫిక్ మహా సముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు 40 శాతం వాటా కలిగిఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమైన టీపీపీపై ఏడేళ్ల పాటు సభ్య దేశాల మధ్య చర్చలు సాగాయి. 2016, ఫిబ్రవరి 4న తుది ఒప్పందంపై అమెరికాతో పాటు జపాన్ , మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, జపాన్ , పెరూ, సింగపూర్, బ్రూనై, చిలీలు సంతకం చేశాయి. ఒప్పందాన్ని ఆయా దేశాలు అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. ఆర్థిక సంబంధాల బలోపేతం, వృద్ధి రేటును ప్రోత్సహించడం, పన్నుల్ని తగ్గించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఆ లేఖలో ఏముందో చెప్పను : ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ.. తనకు ఒబామా మంచి లేఖ రాశారని ట్రంప్ వెల్లడిం చారు. అయితే ఆ లేఖలో ఏముందనే విషయాన్ని మీడియాకు చెప్పదలచుకోలేదన్నారు. దాన్ని మనసులోనే పెట్టుకుంటానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ కార్యక్రమాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియాతో సంబంధాలపై పునరాలోచన చేస్తామని ట్రంప్ పాలకవర్గం హెచ్చరించింది. -
‘వికీలీక్స్’ మన్నింగ్‌కు శిక్ష తగ్గించిన ఒబామా
వాషింగ్టన్: అమెరికాకు చెందిన కీలక దౌత్య సమాచారాన్ని లీక్ చేసిన చెల్సియా మన్నింగ్ శిక్షను అమెరికా అధ్యక్షుడు ఒబామా తగ్గించారు. అమెరికా ట్రాన్స్‌జెండర్ సైనికురాలైన మన్నింగ్(29) ఆ దేశపు కీలక దౌత్యసమాచారం కలిగిన 7,50,000 పేజీలతోపాటు వీడియోలను అపహరించి వికీలీక్స్‌కు లీక్ చేసింది. ఈ కేసులో 2013లో ఆమెకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీనిప్రకారం ఆమె 2045 వరకు జైలు జీవితాన్ని గడపాల్సి ఉంది. కానీ మన్నింగ్ జైలు శిక్షను తగ్గిస్తూ అధ్యక్షుడు ఒబామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె ఈ ఏడాది మే 17న జైలు నుంచి విడుదల కానుందని అమెరికా శ్వేతసౌధం వర్గాలు బుధవారం వెల్లడించాయి. -
బిడెన్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్
ప్రదానం చేసిన అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్: బిడెన్‌ను అధ్యక్షుడు ఒబామా.. అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’తో శ్వేతసౌధంలో సత్కరించారు. బిడెనే అమెరికాకు ఇప్పటి వరకు ఉత్తమ ఉపాధ్యక్షుడు అని, దేశ చరిత్రలో ఆయన సింహం అని ఒబామా కొనియాడారు. ప్రాంతీయ ఘర్షణలను సాకుగా చూపి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు అణ్వాయుధాల వినియోగ ప్రమాదాన్ని సూచిస్తోందని ఈ సందర్భంగా బిడెన్ అన్నారు. ‘ఉత్తర కొరియా ఒక్కటే కాదు. రష్యా, పాక్, పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు యూరప్, దక్షిణాసియా, తూర్పు ఆసియాల్లో నెలకొంటున్న ప్రాంతీయ ఘర్షణల్లో అణ్వాయుధాల వినియోగానికి సిద్ధమనే సంకేతాలను పంపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకర ఆలోచన.’ అని బిడెన్ సూచించారు. ఉగ్రవాదాన్ని తొలగించండి అమెరికా కొత్త రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న జేమ్స్ మాటిస్.. పాక్‌కు కఠినమైన హెచ్చరికలు పంపించారు. పాకిస్తాన్.. తన భూభాగంపై పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని బయటకు పంపించటం లేదా నిర్మూలించటంపై దృష్టిపెట్టాల్సిందేనని మాటిస్ అన్నారు. -
గుడ్‌బై అమెరికన్స్..
అమెరికా అధ్యక్షుడిగా ఒబామా వీడ్కోలు ప్రసంగం ఉద్వేగం.. ఉద్విగ్నత మధ్య కంటతడి పెట్టిన శ్వేతసౌధాధిపతి • జాత్యహంకారం, వివక్షపై అప్రమత్తంగా ఉండాలి • ప్రజాస్వామ్యాన్ని మనందరం పరిరక్షించుకోవాలి • విలువలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి • మనం సాధించాం.. మనం సాధించగలం.. • అమెరికన్లకు ఒబామా పిలుపు • భార్య మిషెల్, కుమార్తెలపై ప్రశంసల జల్లు • ఈ నెల 20న 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ నా రాజకీయ కలల కోసం.. మిషెల్ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. 25 ఏళ్లుగా ఆమె నా భార్య మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. మిషెల్ భవిష్యత్ తరాలకు రోల్ మోడల్. – చమర్చిన కళ్లతో ఒబామా జాత్యహంకారం, అసమానతలు, వివక్ష ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి వాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు అమెరికన్లంతా సిద్ధంగా ఉండాలి. మనం రాజ్యాంగానికి ద్రోహం చేయనంత వరకూ.. విలువలకు కట్టుబడి ఉన్నంత వరకూ ప్రపంచంలో ఎవరూ అమెరికాను ఓడించలేరు. షికాగో: ఎనిమిదేళ్ల అనుబంధం పెనవేసుకున్న పదవిని వీడుతున్నాననే ఉద్వేగం ఒకవైపు.. కొండంత బరువును దించేసుకుంటున్నాననే ఉద్విగ్నత మరోవైపు.. వెరసి చెమర్చిన కన్నులతో.. భారమైన హృదయంతో వీడ్కోలు పలికారు.. శ్వేతసౌధాధిపతి బరాక్ ఒబామా. ‘‘ఎస్.. మనం సాధించాం.. ఎస్.. మనం సాధించగలం’’అని నినదిస్తూ.. కుటుంబ సభ్యులు, వేలాది మంది మద్దతుదారుల నడుమ తన చిట్టచివరి ప్రసంగాన్ని ఉబికి వస్తున్న కన్నీళ్ల మధ్య ‘‘గుడ్‌బై అమెరికన్స్’’ అంటూ ఒబామా ముగించారు. ‘‘పెరుగుతున్న జాత్యహంకారం, అసమానతలు, వివక్ష ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి వాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు అమెరికన్లంతా సిద్ధంగా ఉండాలి’’అని అమెరికా అధ్యక్షుడిగా ఒబామా అమెరికన్లకు కడసారి పిలుపునిచ్చారు. (చదవండి: వీడ్కోలు ప్రసంగంలో ఉద్వేగానికి లోనైన ఒబామా) తన సొంత నగరం షికాగోలో ఒబామా అమెరికా అధ్యక్షునిగా తన వీడ్కోలు ప్రసంగాన్ని ఇచ్చారు. సుమారు 55 నిమిషాల పాటు 20 వేల మంది మద్దతుదారులను ఉద్దేశించి సాగిన ప్రసంగం తీవ్ర ఉద్వేగం.. ఉద్విగ్నత మధ్య సాగింది. 2008లో ఒబామా తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడాన్ని గుర్తు చేసేలా.. ఈ ప్రసంగం సాగడం గమనార్హం. 2008లో అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షునిగా ఎన్నికైన ఒబామా ఎనిమిదేళ్ల తర్వాత పదవి నుంచి వైదొలుగుతున్నారు. ఈ నెల 20న 45వ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్‌కు బాధ్యతలను బదిలీ చేయనున్నారు. అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందని ఈ సందర్భంగా ఒబామా హామీ ఇచ్చారు. మీపై మీరు నమ్మకం ఉంచండి.. అమెరికన్లంతా ఆశావాదంతో ముందుకు సాగాలని, తమలో అంతర్గతంగా దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించాలని ఒబామా ఈ సందర్భంగా సూచించారు. ‘‘మార్పు కోసం మీరు నా శక్తిసామర్థ్యాలపై నమ్మకం పెట్టుకోవడం కాదు.. మీ శక్తిసామర్థ్యాలను గుర్తించాలి. మన రాజ్యాంగంలో రాసిన అంశాలపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మనం దేనినైనా సాధించగలం’’అని పిలుపునిచ్చారు. ‘‘మనం రాజ్యాంగానికి ద్రోహం చేయనంత వరకూ.. విలువలకు కట్టుబడి ఉన్నంతవరకు ప్రపంచంలో ఎవరూ అమెరికాను ఓడించలేరు’’అని చెప్పారు. అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలి.. ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న అవరోధాలపై అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని ఒబామా హెచ్చరించారు. ‘‘మన భయాందోళనల్లోకి వెళితే ప్రజాస్వామ్యం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందువల్ల వెలుపల నుంచి ఎదురయ్యే సవాళ్ల నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి. మనకు రక్షణగా నిలిచిన విలువలను కాపాడుకునేందుకు మనం ప్రయత్నించాలి’’అని సూచించారు. తాను అధికారం చేపట్టినప్పటికంటే ఇప్పుడు.. మరింత ఆశావహ దృక్పథంతో పదవి నుంచి తప్పుకుంటున్నానని అన్నారు. (చదవండి: లాస్ట్ స్పీచ్.. ఒబామా హెచ్చరికలు!) వివక్ష, జాత్యహంకారం ప్రమాదకరం.. ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఒబామా తన ప్రసంగంలో అనేక అంశాలను లేవనెత్తారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ లేవనెత్తిన ముస్లింలపై తాత్కాలిక నిషేధం తదితర అంశాలను ప్రస్తావించారు. ముస్లిం అమెరికన్లపై వివక్ష చూపడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, వారు కూడా తమ లాగే దేశభక్తి కలిగిన పౌరులే అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై చట్టప్రకారం పోరాటం చేసేందుకు తాను ప్రయత్నించానని, అందువల్ల హింసకు అడ్డుకట్ట పడిందని, చట్టాల్లో సంస్కరణలు తీసుకొచ్చి పౌరుల హక్కులకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించామని చెప్పారు. వివక్షపై అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు, ఇళ్లు, విద్య, న్యాయంలో వివక్షను అరికట్టేందుకు చట్టాలను పటిష్టం చేయాలని సూచించారు. జాత్యహంకారం ఇప్పటికీ సమాజాన్ని విభజించే కారకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఐసిస్ ఉగ్రవాద సంస్థను తుదముట్టిస్తామని, అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఒబామా హెచ్చరించారు. బిన్ లాడెన్‌తో పాటు వేలాది మంది ఉగ్రవాదులను హతమార్చామని, ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా నేతృత్వం వహించిందని, ఈ కూటమి ఉగ్రవాద సంస్థల నాయకులను మట్టుబెట్టిందని, వారి సగం స్థావరాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మనం ప్రభావం ఉన్నంత వరకూ ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యా మన దరిదాపులకు కూడా రాబోవని చెప్పారు. ‘‘మీ అందరికీ కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించడం నాకు జీవితకాల గౌరవం’’అంటూ ఒబామా తన ప్రసంగాన్ని ముగించారు. మిషెల్.. నా బెస్ట్ ఫ్రెండ్.. వీడ్కోలు ప్రసంగం సందర్భంగా ఒబామా తన సతీమణి మిషెల్ ఒబామాపై ప్రసంశలు కురిపించారు. తన రాజకీయ కలల కోసం.. మిషెల్ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిందని పేర్కొంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఒబామా కళ్లు చెమర్చాయి. 25 ఏళ్లుగా ఆమె తన భార్య మాత్రమే కాదని, తన బెస్ట్ ఫ్రెండ్ అని చెపుతూ.. అధ్యక్షునిగా తన వెన్నంటి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిషెల్ భవిష్యత్ తరాలకు రోల్ మోడల్ అని కొనియాడారు. ఈ సందర్భంగా వేదిక దిగువన మొదటి వరుసలో కూర్చున్న మిషెల్, కుమార్తె మాలియా తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. సమావేశానికి హాజరైన వారంతా మిషెల్‌కు గౌరవ సూచకంగా లేచి నిలబడి అభినందనలు తెలిపారు. అలాగే తన కుమార్తెలు షాషా, మాలియాలకు ఒబామా థ్యాంక్స్ చెప్పారు. ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అతను తనకు సోదరునితో సమానమని కొనియాడారు. కాగా, స్కూల్లో పరీక్ష ఉండటం వల్ల ఒబామా చిన్న కుమార్తె ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
ఒబామా ఫైనల్ మెసేజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిచెల్లీ ఒమామా వైట్ హౌస్ నుంచి తమ చివరి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో భిన్న కోణాల్లో విడిపోయిన అమెరికా ప్రజలంతా సహోదర భావంతో మెలగాలని ఒబామా ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుకలను అమెరికా ప్రజలంతా ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా సైన్యం అందిస్తున్న సేవలకు గాను ఒబామా తన మెసేజ్‌లో ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. గత ఎనిమిదేళ్లుగా అమెరికా ప్రజలకు సేవ చేయడం అనేది.. మిచెల్లీ, తాను పొందిన గొప్ప గిఫ్ట్ అని ఒబామా పేర్కొన్నారు. ఈ కాలంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యలను అంతా కలిసి ఎదుర్కొన్నామని ఓబామా వెల్లడించారు. -
ఒబామా భారీ క్షమ
78 మందికి క్షమాభిక్ష, 153 మందికి శిక్ష తగ్గింపు హŸనలులు: పదవీకాలం ముగుస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున క్షమాగుణం ప్రదర్శించారు. 78 మందిని క్షమించిన ఆయన.. మరో 153 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. ఇంతమందికి క్షమాభిక్ష పెట్టడం గతంలో ఏ అధ్యక్షుడు చేయలేదని వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. క్షమాభిక్షలపై గత కొన్ని నెలలు ఒబామా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. వీటిల్లో శిక్ష తగ్గించేవి ఎక్కువగా ఉంటున్నాయి. క్షమాభిక్షలో ఓటు వేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం, పదవులకు అర్హత, న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అర్హత పొందటం లాంటివి ఉంటాయి. ఇంకా శిక్షలో తీవ్రతను తగ్గిస్తారు. ఈసారి క్షమాభిక్ష పొందిన వారిలో ఎక్కువ మంది నకిలీ కరెన్సీ మార్పిడి, పేలుడు పదార్థాలతో దొరికినవారు, అనుకోకుండా జరిగిన మారణకాండలో పాల్గొన్నవారు ఉన్నారు. అధ్యక్షుడిగా ఒబామా ఇప్పటి వరకూ 148 మందికి క్షమాభిక్ష పెట్టగా.. 1176 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారని వైట్ హౌస్ న్యాయవాది నీల్ ఎగ్గెల్స్టన్ తెలిపారు. -
ఆ నరమేధానికి వారే కారణం: ఒబామా
వాషింగ్టన్: సిరియాలోని అలెప్పోలో జరుగుతున్న నరమేధానికి అక్కడి బషర్ అల్ అసద్ ప్రభుత్వం, రష్యా, ఇరాన్‌లే కారణమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అయితే అక్కడ యుద్దాన్ని నిలిపివేయడానికి వాషింగ్టన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అలెప్పో నగరంలో అసద్ ప్రభుత్వం, రష్యా, ఇరాక్‌లు కలిసి చేస్తున్న దురాగతాల విషయంలో ప్రపంచ దేశాలు సమైక్యంగా ఉన్నాయన్నారు. ఈ విధమైన విధానాల ద్వారా అసద్ తన పాలనను చట్టబద్ధం చేసుకోలేరని ఒబామా స్పష్టం చేశారు. అలెప్పోలో జరుగుతున్న అకృత్యాలకు అసద్, అతని అనుకూల రష్యా, ఇరాన్లదే బాధ్యతని శుక్రవారం న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఒబామా అన్నారు. -
రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఒబామా
వాషింగ్టన్ : సైబర్ దాడుల ద్వారా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు బహిరంగంగా, రహస్యంగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యాను హెచ్చరించారు. ‘మన ఎన్నికల సమగ్రతపై ప్రభావం చూపడానికి కొన్ని విదేశీ ప్రభుత్వాలు ప్రయత్నించాయనడంలో సందేహం లేదు. దానిపై మనం తగిన చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకుంటాం కూడా’ అని ఓ ఇంటర్వూ్యలో చెప్పారు. సైబర్ దాడులపై తన అభిప్రాయాలేమిటో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తెలుసునని, నేరుగా ఆయనతోనే మాట్లాడాన చెప్పారు. -
ట్రంప్‌కు ఒబామా హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇతర ఏజెన్సీల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని.. అది ప్రమాదకరమైన ధోరణి అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. డెమోక్రటిక్ పార్టీని, ముఖ్యంగా హిల్లరీని లక్ష్యంగా చేసుకొని జరిగిన సైబర్ దాడులలో రష్యా పాత్ర ఉందంటూ ఇటీవల సీఐఏ అందించిన రిపోర్ట్‌ను ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాక్ విషయంలోనూ ఏజెన్సీల పనితీరు సరిగా లేదని ట్రంప్ మండిపడ్డారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. నిఘా సంస్థలతో మంచి సంబంధాలను ప్రారంభించాల్సిన ప్రస్తుత తరుణంలో ఆయన తీరు మాత్రం భిన్నంగా ఉంది. దీంతో ట్రంప్ అనుసరిస్తున్న 'ఫ్లయింగ్ బ్లైండ్' విధానం ప్రమాదకరమైనదని ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ ఒబామా హెచ్చరించారు. 'నువ్వు ఎంత స్మార్ట్ అనేది ముఖ్యం కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే.. దానికి సంబంధించిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ను మనం పరిశీలించాలి' అని ఒబామా అన్నారు. -
పెరల్ హార్బర్‌కు షింజో
వాషింగ్టన్: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే త్వరలో అమెరికాలోని పెరల్ ఓడరేవును సందర్శించనున్నారు. 75 సం॥క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఓడరేవుపై జపాన్ దాడి చేసిన తర్వా త ఇప్పటి వరకు జపాన్ నాయకులెవరూ దీన్ని సందర్శించ లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలసి హార్బర్‌ను సందర్శించనున్న తొలి జపాన్ ప్రధాని షింజో అబేనే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 27న హవాయ్‌లోని హొనొలొలులో ఒబామా జపాన్ ప్రధానితో భేటీ అవుతారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి ఎర్నెస్ట్ తెలిపారు. గత నాలుగేళ్లలో భద్రత, ఆర్థిక, గ్లోబల్ సవాళ్లు తదితర అంశా ల్లో ఇరుదేశాల సహకారంపై వీరిద్దరు చర్చించనున్నారు. -
నిన్ను చూసి గర్విస్తున్నా: ఒబామా
వాషింగ్టన్: ‘నువ్వు చాలా మంచివాడివి. నీలాగే అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని ఆరేళ్ల బాలుడిని ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సిరియా అంతర్యుద్ధం బాధిత బాలుడు ఒమ్రాన్ గురించి తనకు లేఖ రాసిన అలెక్స్ అనే అమెరికా బాలుడిని ఒబామా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన అధికారిక నివాసానికి ఆహ్వానించి అలెక్స్ తో మాట్లాడారు. అలెక్స్ తన కుటుంబ సభ్యులతో పాటు వైట్ హౌస్ కు వెళ్లి ఒబామాను కలిశాడు. ఒమ్రాన్ పట్ల అలెక్స్ చూపిన మానత్వానికి ఒబామా ముగ్దుడయ్యారు. చిన్నవయసులోనే అరుదైన వ్యక్తిత్వం కనబరిచిన అలెక్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సిరియా వైమానిక దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ ఫొటోను చూసి కదిలిపోయిన అలెక్స్ ఒబామాకు లేఖ రాశాడు. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఉత్తరాన్ని ఐక్యరాజ్యసమితిలో ఒబామా చదివి వినిపించారు. -
ఏడాదికి డాలరు జీతం చాలు
ట్రంప్ వెల్లడి వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల ప్రచారంలో చెప్పిన దాని ప్రకారం ఏడాదికి ఒక్క డాలరు జీతం మాత్రమే తీసుకుంటానని పునరుద్ఘాటించారు. సాధారణంగా అధ్యక్షుడికి ఇచ్చే నాలుగు లక్షల డాలర్లను స్వీకరించననీ, సెలవులపై ఎలాంటి విహారయాత్రలకు వెళ్లనని చెప్పారు. పన్నులను తగ్గిస్తాననీ, ఆరోగ్య సంరక్షణ రంగంపై శ్రద్ధ పెడతానని ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హస్య చతురత ఉన్న మనిషి అనీ, అలాగే ప్రచండుడు కూడా అని ట్రంప్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గురువారం శ్వేతసౌధంలో అధ్యక్షుడి అధికారిక కార్యాలయం ఓవల్ ఆఫీసులో ఒబామా ట్రంప్‌ను కలవడం తెలిసిందే. ఎన్నికల సమయంలో తమ మధ్య ఉన్న వైరం గురించి భేటీలో అసలేమీ మాట్లాడలేదని ట్రంప్ తెలిపారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం ట్రంప్‌తో మాట్లాడారు. ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలపడంతోపాటు చైనా, అమెరికాల బంధం బలపడటానికి సహకారమే సరైన మార్గమని అన్నారు. ఎఫ్‌బీఐ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తన ప్రత్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా ప్రత్యేక న్యాయవాదిని నియమించే అంశంపై ఇంకా ఏమీ ఆలోచించలేదనీ, ప్రస్తుతం ఉద్యోగాల కల్పన, ఆరోగ్యం, వలసలు వంటి వాటిపై దృష్టి పెడుతున్నానని ట్రంప్ చెప్పారు. అలాగే రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రీన్స ప్రీబస్, ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందం సీఈవో స్టీఫెన్ బ్యానన్లను ట్రంప్ వైట్‌హౌస్‌లో కీలక స్థానాల్లో నియమించారు. ప్రీబస్కు ఉద్యోగుల అధిపతిగా, బ్యానన్‌కు ముఖ్య వ్యూహకర్తగా స్థానాలు లభించారుు. ముస్లింలపై వేధింపులు బాధపెడుతున్నాయి ముస్లింలు, లాటిన్లు, ఆఫ్రికన్-అమెరికన్లపై వేధింపులు ఆపాలని ట్రంప్ తొలిసారిగా ప్రజలను కోరారు. తాను అధ్యక్షుడు అయ్యాక వేధింపులు మొదలయ్యాయన్న వార్తలు తనకు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. హిట్లర్‌తో పోల్చినందుకు ఉద్వాసన ట్రంప్‌ను నియంత హిట్లర్‌తో పోల్చినందుకు కాలిఫోర్నియాలో ఒక ప్రొఫెసర్‌ను తాత్కాలికంగా తొలగించారు. చరిత్ర, ప్రత్యేక విద్యను బోధించడంలో అపార అనుభవం ఉన్న ఫ్రాంక్ నవరో (65) అనే ప్రొఫెసర్, ఎన్నికలు పూర్తైన తర్వాత పాఠం చెబుతూ ట్రంప్‌ను హిట్లర్‌తో పోల్చారు. -
ఇక అద్దె ఇంట్లోకి బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడమే కాకుండా తన పదవీ కాలం మరికొన్నాళ్లలో ముగిసిపోతుండడంతో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌ను ఖాళీ చేసి మరో చోటుకు మకాం మార్చనున్నారు. నగరంలోని ‘సిడ్వెల్ ఫ్రెండ్స్ స్కూల్’లో చదువుతున్న తన చిన్న కూతురు సాషా చదువు అక్కడ ముగిసేవరకు ఒబామా ఈ నగరంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని ఆయన వైట్‌హౌస్‌కు కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఉన్న కలోరమ ప్రాంతంలోని ఓ ఆకర్షణీయమైన ఇంటిని అద్దెకు తీసుకొని ఉండాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ చేతుల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ కుటుంబం నివసిస్తున్న ఇంటికి అరమైలు దూరంలోనే ఉన్న ఇంటిని ఒబామా ఎంపిక చేసుకున్నారు. ఒకప్పుడు బిల్ క్లింటన్ వద్ద వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన జోలాక్హార్ట్ కుటుంబానిది ఆ ఇల్లు. ఆయన ‘గ్లోవర్పార్క్ గ్రూప్’ సహ వ్యవస్థాపకులు కూడా. ఆయన తన భార్య జియోవన్నా గ్రేతో కలసి ఇటీవల వృత్తిరీత్యా న్యూయార్క్ Ðð ళ్లి అక్కడే స్థిరపడ్డారు. 8,200 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ ఇంట్లో తొమ్మిది పడక గదులు, తొమ్మిది బాత్రూమ్లు ఉన్నాయి. తొమ్మిది పడక గదుల్లో ఒకటి సూట్‌లాంటి పడక గది ఉంది. అది మిషెల్ ఒబామా తల్లికి అనువుగా ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆమె ఒబామా కుటుంబంతోనే కలసి ఉంటోంది. ఓ లివింగ్ రూమ్, వంటగది, వసారా కలిగిన ఈ ఇంటికి వెనకాల పచ్చటి గార్డెన్ కూడా ఉంది. ఎనిమిది వాహనాల పార్కింగ్ స్థలం కూడా ఉంది. దీని అద్దె నెలకు 20వేల డాలర్లు ఉంటుందని రియల్ ఎస్టేట్ వెబ్సైట్ జిల్లో తెలియజేసింది. 1928లో నిర్మించిన ఈ ఇంటిని 2014లో జో లాక్హార్ట్ 53 లక్షల డాలర్లకు కొనుగోలు చేసి ఆధునీకరించారు. ఇప్పుడు ఈ ఇంటి విలువ దాదాపు 65 లక్షల డాలర్లు ఉంటుందని అంచనా. అమెరికా మాజీ అధ్యక్షులకు కూడా సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ ఉంటుందికనుక అందుకు వీలుగా ఈ ఇంటిలో కూడా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందని సీక్రెట్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆంటోని ఛాప మీడియాకు తెలిపారు. ఇంటి మొత్తానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటి ముందు లైట్ల వెలుతురును పెంచాల్సి వస్తుందని, ఇంటికి సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇరుగు, పొరుగు ఇళ్లనుంచి ఏమైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందా? అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని, ఆయా కుటుంబాలతో సంప్రతింపులు కూడా జరుపుతున్నామని ఆయన తెలిపారు. -
హిల్లరీ ర్యాలీలకు జనం రావడంలేదు అందుకే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పూర్తి సమయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రచారం కోసమే ఉపయోగిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. హిల్లరీకి ఏమాత్రం జనాకర్షణ లేదని అందుకే ఆమె ఒబామా సహాయం తీసుకుంటున్నారని ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఎద్దేవా చేశారు. హిల్లరీ తనకోసం తాను ప్రచారం కూడా నిర్వహించుకోలేకపోతున్నారని.. ఆమె సొంతంగా నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కేవలం 400 నుంచి 500 మంది ప్రజలు మాత్రమే పాల్గొంటున్నారని అన్నారు. అందుకే ఆమె ఒబామాపై ఆధారపడుతున్నారని ట్రంప్ విమర్శించారు. చివరి దశ ప్రచారపర్వంలో హిల్లరీకి మద్దతుగా కీలకమైన ఫ్లోరిడా, నార్త్ కరొలినా, పెన్సిల్వేనియా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో ఒబామా ఉధృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విమర్శలు చేశారు. మీడియా వ్యవహరిస్తున్న తీరుపట్ల కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. తన ప్రచారకార్యక్రమాలకు జనం తక్కువగా కనిపిస్తే మీడియా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా హెడ్లైన్లలో వార్తలు ప్రచురిస్తాయని.. అదే హిల్లరీ విషయంలో మాత్రం అలా జరగటం లేదని ట్రంప్ అన్నారు. -
మనకు వేరే మార్గం లేదు: ట్రంప్
వాషింగ్టన్: ఒబామా, హిల్లరీలు అమెరికన్లకు సంబంధం లేని యుద్ధాలు, వివాదాల్లో తలదూర్చి దేశాన్ని సురక్షితం కానిదిగా మార్చారని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. న్యూ హాంప్‌షైర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్.. ఒబామా, హిల్లరీల విదేశాంగ విధానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర ప్రజల సరిహద్దుల కోసం పోరాడుతూ అమెరికన్లు ప్రాణాలు, డబ్బు కోల్పోతున్నారని.. అయితే తన మొదటి ప్రాధాన్యత అమెరికాకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాక్, సిరియా, లిబియాలలో మారణహోమానికి హిల్లరీనే కారణమని ట్రంప్ మరోసారి విమర్శించారు. సిరియా నుంచి అమెరికాకు ప్రవేశించే శరణార్థుల సంఖ్య 550 శాతం పెరగాలని హిల్లరీ కోరుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఒబామా అనుమతించిన వారి కంటే వేల సంఖ్యలో ఎక్కువమంది వలసదారులను హిల్లరీ అమెరికాలోకి అనుమతించాలని చూస్తున్నారన్నారు. సిరియన్ శరణార్ధుల కార్యక్రమాన్ని నిలిపివేయాలని, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దూరంగా ఉంచాలని.. మనకు అంతకన్నా వేరే మార్గం లేదని ర్యాలీలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ట్రంప్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. -
భయాన్ని కాదు.. ఆశను ఎంచుకోండి
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి కీలకంగా భావిస్తున్న నార్త్ కరోలినాలో శుక్రవారం పర్యటించిన బరాక్ ఒబామా.. ట్రంప్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి సపోర్ట్‌గా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. భయాన్ని కాకుండా ఆశను ఎన్నుకొమ్మని ఓటర్లకు సూచించారు. 'అమెరికా పౌరులు పాటించే విలువలను ట్రంప్ గౌరవించలేదు కాబట్టి అమెరికా అత్యున్నత స్థానానికి అతడు అనర్హుడు' అని ఒబామా విమర్శించారు. ఫయటెవిల్లె స్టేట్ యూనివర్సిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒబామా 'ఒకవేళ అమెరికన్లు స్ట్రాంగ్ అని మీరు భావించినట్లైతే.. అమెరికన్లను వికలాంగులు అని, వలసదారులను క్రిమినల్స్, రేపిస్టులు అని, అలాగే మైనారిటీలను అవమానించేలా వ్యాఖ్యానించిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు' అని అన్నారు. అలాగే.. మహిళలను పందులు, కుక్కలు అంటూ మాట్లాడిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు అంటూ ఓటర్లను ఒబామా కోరారు. -
ఒహయో, ఫ్లోరిడాలే కీలకం
హిల్లరీ, ట్రంప్ సుడిగాలి ప్రచారం వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రధాన ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్న కీలక రాష్ట్రాల్లో వందల కోట్లు ప్రకటనలపై ఖర్చుచేస్తున్నారు. హిల్లరీ ఈ-మెయిల్ వివాదాన్ని ఎఫ్‌బీఐ తిరగదోడిన నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్ తారుమారయ్యాయి. పలు జాతీయ సర్వేల్లో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్లు ఉంది. ఒహయో, ఫ్లోరిడా రాష్ట్రాలు కీలకం కావడంతో హిల్లరీ, ట్రంప్, దేశాధ్యక్షుడు ఒబామాలు చివరి వారం ఈ రాష్ట్రాలపై దృష్టిపెడుతున్నారు. మంగళవారం హిల్లరీ ఫ్లోరిడా రాష్ట్రంలో 3 ర్యాలీల్లో ప్రసంగించగా... ఒబామా ఒహయోలో ప్రచారం చేశారు. ట్రంప్ వచ్చే రెండు రోజుల్లో ఫ్లోరిడాలో సుడిగాలి ప్రచారం చేస్తా రు. చివరి వారంలోనే ఇరు ప్రచార శిబిరాలు, వారికి మద్దతిస్తున్న గ్రూపులు దాదాపు రూ. 285 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు అంచనా. కాగా, నవంబర్ 8 ఎన్నిక కోసం ఇప్పటికే 2.8 కోట్ల మంది ఓటేశారు. మరోవైపు.. హిల్లరీకి మరో చిక్కు వచ్చిపడింది. ఆమె భర్త బిల్ క్లింటన్ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు బెల్జియం వ్యాపారి మార్క్రిచ్కు క్షమాభిక్ష పెట్టిన కేసులో 2001 నాటి విచారణ నివేదిక ఎఫ్‌బీఐ ట్విటర్ ఖా తాలో దర్శనమిచ్చింది.విచారణ 2005లోనే ముగించిన ఎఫ్‌బీఐ బిల్ క్లింటన్‌పై ఏ కేసూ నమోదు చేయలేదు. -
'థ్రిల్లర్' డ్యాన్స్‌తో అదరగొట్టిన ఒబామా
-
'థ్రిల్లర్' డ్యాన్స్‌తో అదరగొట్టిన ఒబామా
దివాలి వేడుకలతో మెరిసిపోయిన వైట్‌హోస్, బరాక్ ఒబామా, మిచెల్లీ డ్యాన్సులతో హోరెత్తింది. సోమవారం రాత్రి వైట్‌హోస్‌లో జరిగిన హాలోవీన్ ట్రిక్ ఆర్ ట్రీట్ ఈవెంట్లో మైకెల్ జాక్సన్ "థ్రిల్లర్" డ్యాన్స్‌లతో అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ప్రేక్షకులను మురిపించారు. వైట్‌హోస్‌లో సౌత్ లాన్లో ఏర్పాటుచేసిన ఈ ఈవెంట్‌కు 4వేలకు పైగా ప్రజలను ఒబామా ఆహ్వానించారు. వీరిలో ఎక్కువగా వాషింగ్టన్ ప్రాంతంలోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, సైనిక కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఒబామా పలు చమత్కారాలు చేశారు. కనీసం ఈరోజైనా తల్లిదండ్రులు మిచెల్లీపై, పోషకాహారంపై శ్రద్ధ తీసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్టు చమత్కరించారు. ఈ విషయానికి తానుకూడా సమ్మతిస్తున్నట్టు మిచెల్లీ తెలిపారు. ప్రతిఒక్కరూ క్యాండీ(మిఠాయి) తినాలని మిచెల్ చెప్పారు. అలా మిఠాయిలను ఆస్వాదిస్తూ రాత్రంతా ఈవెంట్ వేడుకలను ఎంజాయ్ చేయాలని ఒబామా పిలుపునిచ్చారు. -
నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైట్‌హౌస్ వేడుకలు
వాషింగ్టన్ : వైట్‌హోస్ దివాళి వేడుకలతో వెలుగొందుతోంది. ఓవల్ ఆఫీసులో మొదటి దీపాన్ని వెలిగించి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సంప్రదాయాన్ని తన తర్వాతి వారు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు ఒబామా పేర్కొన్నారు. కాగ, వైట్‌హోస్‌లో దీపావళి వేడుకలను ప్రారంభించిన తొలి అధ్యక్షుడు బరాక్ ఒబానానే. 2009లో ఆయన ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కొంతమంది ఇండియన్-అమెరికన్లు తన అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తున్నారని, వారందరి కోసం ఈ వేడుకలను జరుపుతున్నట్టు ఒబామా చెప్పారు. దివాళి సెలబ్రేషన్స్‌ను ప్రారంభించిన తొలి అధ్యక్షుడిని తానే కావడం, చాలా గర్వంగా ఫీలవుతున్నానని ఒబామా చెప్పారు. దివాళి రోజు ముంబాయిలో తమల్ని భారతీయులు ఆహ్వానించిన తీరును, తమతో వారుచేసిన డ్యాన్స్‌లను మిచెల్, తాను ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. చీకటిని వెలుగు ఎలా అధిగమిస్తుందో తెలిపే సంకేతంగా ఈ దీపం నిలుస్తుందన్నారు. తర్వాత వైట్హోస్కు వచ్చే అధ్యక్షులు కూడా ఈ వేడుకలను కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు వైట్‌హోస్ ఫేస్బుక్ పేజ్‌లో తెలిపారు. ఈ మెసేజ్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అర్థరాత్రి ఒబామా చేసిన ఈ పోస్టుకు 1.5 లక్షలమంది లైక్ రాగా.. 33వేలకు పైగా సార్లు షేర్ చేశారు. ఈ దివాళి వేడుకలు తమ ప్రియమైన వారందరికీ శాంతి సౌభాగ్యాలతో ఆనందం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దివాళి వేడుకలు జరుపుకుంటున్నారో వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. -
ఇండియాలా మనకెందుకు సాధ్యం కాదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో ఆర్థికాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓ పక్క భారత్, చైనా లాంటి దేశాలు 8 శాతం, 7 శాతం వృద్ధితో దూసుకుపోతుంటే అమెరికా అది ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. మాంచెస్టర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఒక సంవత్సరంలో కనీసం మూడు శాతం వృద్ధి కూడా సాధించలేక పోయారని.. అది ఒక్క ఒబామా పాలనలోనే అని అన్నారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఫలితాలు భయానకంగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. తాను అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఆర్థిక వృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ఆర్థికంగా ఉన్నతమైన దేశంగా మళ్లీ అవతరించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. హిల్లరీ నిర్ణయాల కారణంగా దేశంలో ఐఎస్ఐఎస్ ప్రాభల్యం మరింత పెరుగుతుందని.. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు దేశంలో తిష్టవేసి ఉన్నారని పేర్కొన్నారు. సిరియా శరణార్థుల విషయంలోనూ ఆమె నిర్ణయాలు దేశానికి ముప్పు తెచ్చేలా ఉన్నాయని ట్రంప్ వివరించారు. -
‘నోబెల్’కు నగుబాటు!
నోబెల్ సాహిత్య బహుమతిని మేటి పాటగాడు బాబ్ డిలన్‌కు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా ఆయన నుంచి ఏ జవాబూ లేక తలకొట్టేసినట్టయిన నోబెల్ కమిటీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా రూపంలో మరో ఝలక్ తగిలింది. 2009లో తనను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు ఎంపిక చేశారో ఇప్పటికీ తెలియదని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సమాధానం... ఆ కమిటీ తీరు తెన్నుల గురించి ఎన్నాళ్లనుంచో వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది. ఏమాట కామాటే చెప్పుకోవాలి. పురస్కార గ్రహీతల యోగ్యతాయోగ్యతల మాట అటుంచి... అలా ఎంపికైనవారిని ఎవరైనా అభినందిస్తారు. అలాగని అత్యధికుల అంచనాలకు దీటుగా లేని సందర్భాల్లో విమర్శలు రావడం కూడా సర్వసాధారణం. కానీ ఒబామాకు శాంతి బహుమతిని ప్రకటించాక విస్తుపోతూ ప్రకటనలు చేసిన వారే అధికం! మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, మదర్ థెరిసా, దలైలామా వంటి దిగ్గజాల సరసన ఆయనను కూర్చోబెట్టడమేమిటని కొందరు ఆగ్రహించారు కూడా! వీటన్నిటా సహేతుకత ఉంది. నోబెల్ బహుమతి ప్రకటించేనాటికి ఒబామా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిది నెలలు మాత్రమే అయింది. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్లు పంపడానికి గల తుది గడువునాటికైతే ఆయన అధికారంలోకొచ్చి పట్టుమని పక్షం రోజులు కూడా కాలేదు. ఆ రెండు వారాల్లో నోబెల్ కమిటీ ఆయనలో ఏం సుగుణాలు చూసిందో, ప్రపంచశాంతి స్థాపన కోసం ఆయన ఏం చేశారనుకున్నదో తెలియదు. తనను ఆ పురస్కారానికి ఎంపిక చేయ డాన్ని స్వాగతిస్తూ ‘విశ్వమానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ బహుమతి ధ్రువీకరిస్తున్నద’ంటూ ఒబామా అప్పట్లో గొప్పలుపో యారు. ఎనిమిదేళ్లు గడిచాకైనా ఆయన నిజం పలికారనుకోవాలి! ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ‘కేవలం ఆయన బుష్ కాకపోవ డమే’ కారణమని అప్పట్లో ఒకరు వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యానంలో వాస్తవం ఉంది. నోబెల్ కమిటీకి ఎందుకనో జార్జ్ బుష్ పొడగిట్టదు. పదవిలో ఉన్నప్పుడు, దిగిపోయాక కూడా ఆయనంటే తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఆయన వ్యతిరేకులన్న ముద్ర ఉంటే శాంతి బహుమతి ఇచ్చేవారన్న విమర్శ ఉండేది. అందుకు కొన్ని రుజువులున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు 2002లో శాంతి పురస్కారాన్ని ప్రకటించేనాటికి ఆయన బుష్‌కు వ్యతిరేకంగా... మరీ ముఖ్యంగా అప్పట్లో జరిగిన ఉగ్రదాడిపై బుష్ స్పందించిన తీరును దుయ్యబట్టారు. పదవీ విరమణ చేశాక ఆయన స్థాపించిన ఫౌండేషన్ హైతీ, బోస్నియా తదితర దేశాల్లో శాంతి స్థాపనకు, ఇజ్రాయెల్-పాలస్తీనాలమధ్య శాంతి చర్చలు ఫలవంతం కావడా నికి తోడ్పడిందని నోబెల్ కమిటీ చెప్పినా అసలు సంగతి ఆయనలో ఉన్న బుష్ వ్యతిరేకతే అంటారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అఫ్ఘాన్‌లో ముజాహిదీన్లకు ఆయు ధాలందించి, ఈనాటి ఉగ్రవాదానికి బీజం వేసింది కార్టరే. దేన్నయినా సాధించార నుకున్న సందర్భంలోనే ఏ బహుమతైనా ఇవ్వడం సంప్రదాయం. ఇవ్వదల్చుకున్న వారికి అలాంటి గొప్పదనం ఆపాదించడంలో నోబెల్ కమిటీ ఆరితేరింది. 1919లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌కు, 1973లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు నోబెల్ కమిటీ వారిని ఆకాశానికెత్తింది. యుద్ధోన్మాదులుగా వారి చరిత్రను మరుగుపరచాలని చూసింది. కానీ ఒబామా విషయంలో ఆపాటి కష్టమైనా పడకుండా బహుమతిని ప్రకటించి రికార్డు సృష్టించింది. ప్రశంసా వాక్యాల్లో శాంతి సాధనకు ఒబామా చేసిన దేమిటో ప్రస్తావించకుండా, కేవలం‘ప్రయత్నాలను’ మెచ్చుకోవడంతో సరి పెట్టింది. కనీసం ఆ ప్రయత్నాలు దేనికి దారితీస్తాయో, ఒకవేళ అవి విఫలమైన పక్షంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతున్నదో తెలుసుకోవాలన్న స్పృహ కూడా నోబెల్ కమిటీకి లేకపోయింది. హడావుడి పడకుండా మరికొన్నాళ్లు ఆగి ఉంటే ఆ ‘ప్రయత్నాల’ అసలు రంగు కూడా వెల్లడయ్యేది. బుష్ ప్రారంభించిన యుద్ధాలను ఒబామా మరింత ముందుకు తీసుకెళ్లారు. కొత్త యుద్ధ రంగాలనూ తెరిచారు. ‘ఆయనకు శాంతి పురస్కారం ఇవ్వడం ఘోర తప్పిదమే’నని ఆ సమయంలో నోబెల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గీర్ లెండ్స్టెడ్ నిరుడు అంగీకరించారు. లిబియాపై బాంబుల వర్షం, సిరియాలో వరస దాడులు ఎన్ని వేలమంది ప్రాణాలు తీశాయో ఎవరూ మరిచిపోలేరు. అఫ్ఘానిస్తాన్, సోమాలియా, పాకిస్తాన్ తదితర చోట్ల ఉగ్రవాదుల్ని గురిపెట్టామనుకుని సాధారణ పౌరులను వందల్లో హతమా ర్చారు. ప్రపంచంలో ప్రశాంతత నెలకొల్పుతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఒబామా ఆ తర్వాత సరిగ్గా అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారు. కనీసం నోబెల్ శాంతి పురస్కారం వచ్చినందుకైనా అందుకు తగినట్టు ప్రవర్తించా లని ఆయన అనుకోలేదు. మహాత్మా గాంధీకి నోబెల్ ఇవ్వాలంటూ అయిదు దఫాలు నామినేషన్లు వెళ్లినా నోబెల్ కమిటీ పట్టనట్టు ఉన్న సంగతిని ఎవరూ మర్చిపోరు. 1948లో ఆయనకు శాంతి బహుమతి ప్రకటిద్దామనుకుంటుండగా గాంధీజీ హత్య జరిగిందని అది ఇచ్చిన సంజాయిషీలో నిజమెంతో తెలియదు. మరణానంతరం ఇచ్చే సంప్రదాయం లేదని అప్పట్లో చెప్పింది. కానీ స్వీడన్ మంత్రిగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దాగ్ హమర్స్కోల్డ్కు 1961లో మరణానంతరం శాంతి పురస్కారం ఇచ్చింది. ఒక్క శాంతి బహుమతి విషయంలోనే కాదు...ఇతర రంగాల్లో ఇచ్చే పురస్కారాల విషయంలో సైతం కమిటీపై ఇలాంటి విమర్శలే ఉన్నాయి. ఈసారి ప్రకటించిన పురస్కారాల్లో ఒక్కరంటే ఒక్కరైనా మహిళ లేక పోవడాన్ని చాలామంది విమర్శించారు. అర్హులు లేరని కాదు. అనేకమంది మహి ళల పేర్లు నోబెల్ కమిటీ పరిశీలనకొచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ఈసారి మన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు కనుగొన్న అంశాలకు అనుకూలంగా అత్యధిక నామినేషన్లు వెళ్లినా కమిటీ పరిగణించలేదు. భవిష్యత్తులోనైనా ఇలాంటి తడబాట్లకు నోబెల్ కమిటీ స్వస్తి చెప్పడానికి ఒబామా ‘ఒప్పుకోలు’ ప్రకటన పనికొస్తే మంచిదే! -
అందరికీ అభివృద్ధి ఫలాలు..
♦ అందుకు అంతర్జాతీయ సహకారం అవసరం ♦ ఐఎంఎఫ్ వేదికగా ప్రపంచ నేతల పిలుపు ♦ అసమానతలు తొలగించే దిశగా పనిచేయాలి: ఒబామా వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ప్రస్తుతం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా సంపన్నులు, పేద వారి మధ్య అసమానతలు పెరగడానికి దారి తీసిన పరిస్థితుల్లో అభివృద్ధి ఫలాలు అందరినీ చేరుకునేలా విధానాల అమలు విషయంలో అంతర్జాతీయ సహకారానికి నేతలు పిలుపునిచ్చారు. వాషింగ్టన్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం శనివారం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు మరింత సహకారాత్మకంగా, కలసికట్టుగా నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక నమూనా కావాలి అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రసంగిస్తూ... అంతర్జాతీయ సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుని, అందరి కోసం పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక నమూనాను రూపొందించుకోవాలన్నారు. బలమైన, సమగ్ర, సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఐఎంఎఫ్ తన కృషిని కొనసాగించాలని కోరారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు డిమాండ్‌ను పెంచే ద్రవ్య విధానాలు, నిర్మాణాత్మక సంస్కరణల దిశగా పనిచేయాలని సూచిం చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, శరణార్థి సమస్యలు, దారిద్య్రాన్ని ఎదుర్కొం టున్న దేశాల్లో పెట్టుబడులు వంటి అంశాల పరిష్కారంలో ముందుండాలని ప్రపంచ బ్యాంకును ఒబామా కోరారు. కొద్ది మందికే లబ్ధి: లగార్డ్ ప్రపంచ వృద్ధి దీర్ఘకాలంలో కొద్ది మందికే లబ్ధి చేకూర్చిందని, అసమానతలు ఇప్పటికీ చాలా దేశాల్లో అధిక స్థాయిలో ఉన్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టీన్ లగార్డ్ అన్నారు. ఆయా దేశాల్లో వాణిజ్యం అనేది రాజకీయ బంతాటగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సమగ్ర అభివృద్ధి విధానాల ఆచరణపై దృష్టి పెట్టాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. తక్కువ వృద్ధి, తక్కువ ఉపాధి అవకాశాలు, తక్కువ వేతనాలను తొలగించేలా అవి ఉండాలన్నారు. ‘సమగ్ర అభివృద్ధి కోసం డిజిటల్ యుగానికి మారిపోవాలి. ఆ మార్పుతోనే అందరికీ లబ్ధి కలుగుతుంది. దీన్ని వేగవంతం చేయాలి’ అని లగార్డే పేర్కొన్నారు. వడ్డీ రేట్లు చారిత్రకంగా తక్కువ స్థాయిలో ఉన్నందున హై స్పీడ్ ఇంటర్నెట్, ఇంధన సామర్థ్య రవాణా విధానం, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు సరైన తరుణమిదేనన్నారు. తక్కువ వడ్డీ రేట్లతో సమస్యలు: జైట్లీ తక్కువ, ప్రతికూల వడ్డీ రేట్లు, బ్యాంకింగ్ రంగంలో రుణాల బలహీనత వల్ల ఎదురయ్యే సమస్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వృద్ధిని వేగవంతం చేసేందుకు రుణ భారం తగ్గించుకుని బ్యాలన్స్ షీట్లు మెరుగుపరుచుకోవాలని కోరింది. ఇష్టారీతన ప్రైవేటు రుణాల జారీ సైతం వృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే విధానపరమైన కార్యాచరణ పటిష్టమవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐఎంఎఫ్ వేదికగా ప్రపంచ దేశాలకు సూచించారు. ఉత్పత్తి, కార్మిక మార్కెట్ సంస్కరణల ద్వారా లబ్ధి పొందడంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ విధానాలను పటిష్టం చేసుకోవడం, బ్యాలన్స్ షీట్ల ఒత్తిడిని పరిష్కరించుకోవడం వంటివి స్తబ్దుగా ఉన్న వృద్ధిని వేగవంతం చేయడానికి తోడ్పడతాయన్నారు. ‘విదేశీ రుణ నిబంధనలు సులభతరం కావడం, కమోడిటీల ధరలు కోలుకోవడం వంటి వాటి ద్వారా అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ తక్కువ, ప్రతికూల వడ్డీ రేట్ల వంటి విధానాలు, ప్రైవేటు రుణాలు అధిక స్థాయిలో ఉండడం, బ్యాంకింగ్ రంగంలో రుణాల పరంగా బలహీనతలతో ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సమస్యలు అలానే ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తున్నామని, అయినా.. ప్రస్తుతం తాము సాధిస్తున్న వృద్ధి రేటు సరిపోదని చెప్పారు. -
డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు
-
డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు
ఒబామాకు లేఖ రాసిన ఆరేళ్ల బాలుడు న్యూయార్క్: సిరియా వాయుసేన దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. తాజాగా అమెరికాకు చెందిన అలెక్స్ అనే ఆరేళ్ల బాలుడు.. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశాడు. ఈ లేఖను ఒబామా ఐక్యరాజ్యసమితిలో చదివి వినిపించారు. అలెక్స్ స్వదస్తూరీతో రాసిన లేఖలో ‘ఒబామా! వెళ్లి ఒమ్రాన్ ను మా ఇంటికి తీసుకురండి. మేం మీకోసం జెండా, పూలు, బెలూన్లతో ఎదురుచూస్తూ ఉంటాం. అతణ్ని మా కుటుంబంలో చేర్చుకుంటాం. తమ్ముడిలా చూసుకుంటా. ఇంగ్లిష్ నేర్పిస్తాం’ అని పేర్కొన్నాడు. -
ఉత్తర కొరియాపై ఒబామా సీరియస్
వాషింగ్టన్: మరోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియాపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉ.కొరియా అణ్వాయుధాల ముప్పును అధ్యక్షుడు ఒబామా సీరియస్‌గా తీసుకున్నారని, అమెరికన్ల భద్రతకుముప్పు వాటిల్లకుండా గట్టి చర్యలు చేపడుతున్నారని వైట్‌హౌస్ పేర్కొంది. దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఉ.కొరియాకు వ్యతిరేకంగా చైనా సహా యావత్తు అంతర్జాతీయ సమాజం ఏకమైందని తెలిపింది. భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తున్న ఉ.కొరియాపై మండలి మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ముగువామ్ దీవుల్లో యాంటీ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థ ను మోహరించినట్టు ఎర్నెస్ట్ తెలిపారు. అదే సమయంలో నౌకాదళ బలగాన్నీ పెంచుతున్నట్టు వెల్లడించింది. భారత్‌లో అక్రమ డ్రగ్స్ తయారీ: అమెరికా వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు 21 దేశాలు అక్రమంగా మత్తుమందులను ఉత్పత్తి చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. అఫ్గనిస్తాన్, బహమాస్, మయన్మార్, బొలీవియా, వెనిజులాతోపాటు పలు ఆఫ్రికా, యూరప్ దేశాల పేర్లను ఒబామా ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే.. దీంతో సంబంధం లేకుండా తమ మిత్ర దేశాలైనా బొలీవియా, మయన్మార్, వెనిజులాలకు అమెరికా సాయం అందుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. -
మరోసారి మోదీ,ఒబామా భేటీ
-
బలమైన బంధానికి మరింత సహకారం
-
భారత్‌కు అమెరికా డ్రోన్లు!
వాషింగ్టన్: తీరప్రాంత నిఘాకు.. ముఖ్యంగా హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణ కోసం 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్లు అందజేయాలని భారత్ చేసిన విజ్ఞప్తికి అమెరికా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఒబామా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేలోపు ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం. భారత నేవీ ఫిబ్రవరిలో ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్ల కొనుగోలు కోసం రక్షణ శాఖకు లేఖ రాసింది. దీనిపై అమెరికా ఇ నిర్ణయం తీసుకోనప్పటికీ సబంధిత అంతర్గత ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. రక్షణ మంత్రి పరీకర్ పరీకర్ ఆగస్టు 29న అమెరికా రక్షణ మంత్రి కార్టర్‌తో ఈ డ్రోన్ల విషయంపై చర్చలు జరిపినట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. -
బలమైన బంధానికి మరింత సహకారం
- జపాన్ ప్రధానితో మోదీ చర్చలు - నేడు ఒబామాతో భేటీ వియంతైన్: ఉగ్రవాద వ్యతిరేక పోరు, పౌర అణు సహకారం వంటి రంగాల్లో పరస్పర సహకారంతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం లావోస్ చేరుకున్న మోదీ.. జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని..ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామని అబే చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపైనా వీరిద్దరిమధ్య చర్చలు జరిగాయి. పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచ మార్కెట్కోసం వస్తువుల ఉత్పత్తి జరగాలని కూడా నిర్ణయించారు. జపాన్‌కు సాంకేతిక బలముంటే.. భారత్‌కు యువశక్తి బలం, భారీ మార్కెట్ ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు, పౌర అణుసహకార ఒప్పందం పురోగతిపై సమీక్ష జరిపారు. భారత్‌లో మౌలికవసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికవృద్ధి విషయాల్లో తమ సహకారం ఉంటుందని అబే తెలిపారు. అటు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ ప్రధాని మోదీ లావోస్‌లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరూ సమావేశమవుతారని వైట్‌హౌస్ తెలిపింది. -
మోదీకి ఒబామా కితాబు
హాంగ్జౌ: ప్రస్తుతమున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) సాహసోపేత విధానమని అమెరికా అధ్యక్షుడు ఒబామా కితాబిచ్చారు. పన్నుల సంస్కరణకు కృషి చేసిన మోదీకి అభినందనలు తెలిపారు. జీ20 సమావేశాల సందర్భంగా ఒబామాతో మోదీ కాసేపు భేటీ అయ్యారు. క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సాహసోపేత సంస్కరణలకు జీఎస్టీ మార్గదర్శకంగా ఉంటుం దని ఒబామా కొనియాడారు. అంతకు ముందు మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, సౌదీ అరేబియా యువరాజు సాల్మన్‌ను కలిశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) సంస్కరణ, నావిక, మౌలిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం తదితర అంశాల్లో పరస్పర సహకారంపై మాట్లాడారు. మరిన్ని శాశ్వత సభ్యత్వాలతో యూఎన్ఎస్సీని బలోపేతం చేయాల్సిన అవసరంపై చర్చించారు. ఎన్ఎస్జీలో భారత్‌కు మద్దతు మోదీకి ఆసీస్ ప్రధాని హామీ హాంగ్జౌ: కీలకమైన అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి మద్దతు ఇస్తామని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ హామీ ఇచ్చారు. జీ20 సమావేశాల సందర్భంగా మోదీ టర్న్‌బుల్‌తో భేటీ అయ్యారు. ఎన్ఎస్జీలో మద్దతు ఇస్తామన్న టర్న్‌బుల్‌కు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. వేళ్లూనుకొంటున్న ఉగ్రవాదం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం సంబంధాలపై కూడా ఈ సమావేశంలో మోదీ, టర్న్‌బుల్ చర్చించినట్టు స్వరూప్ తెలిపారు. ‘ప్రజాస్వామ్య దేశాలన్నీ కలిసి ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా భారత్ పొరుగు దేశాల పాలనా వ్యవస్థపై ఇది ప్రభావం చూపుతోంది. రష్యా, చైనా, అఫ్గనిస్తాన్‌లకు కూడా ఉగ్రవాద ముప్పు ఉంది.’ అని మోదీ టర్న్‌బుల్‌కు చెప్పారు. -
ఒబామాకు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల గుర్తించిన అరుదైన జాతికి చెందిన చేప పేరులో 'ఒబామా' చేర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే ఈ గౌరవం ఆయనకు ఊరికే దక్కింది కాదు. గతవారం హవాయ్‌లోని ఓ మెరైన్ సాంక్షుయరీ విస్తీర్ణం పెంచుతూ ఒబామా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సాంక్షుయరీ విస్తీర్ణం గతంలో కంటే నాలుగింతలు పెరుగుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే పెద్ద మెరైన్ సాంక్షుయరీగా అది రికార్డులకెక్కింది. దీంతో జంతు శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇటీవల గుర్తించిన ఇంకా పేరుపెట్టని చేపకు ఒబామా పేరును చేర్చుతున్నట్లు వారు వెల్లడించారు. హవాయ్‌లోని పపహనౌముకాకియా మెరైన్ సాంక్షుయరీలోనే శాస్త్రవేత్తలు ఈ చేపను కనుగొన్నారు. ఈ చేపకున్న మరో విశేషం ఏమిటంటే.. ఒబామా ప్రచార సింబల్‌కు దగ్గరగా ఈ చేపపై కొన్ని గుర్తులున్నాయట. సముద్ర జీవులను రక్షించడానికి ఒబామా తీసుకున్న నిర్ణయానికి గుర్తుగా ఆయనకు ఈ గౌరవమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్నట్లు ఓ చేపకు ఒబామా పేరునుపెట్టడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ టెనెస్సీ నదిలో కనుగొన్న ఓ చేపకు ఇథియోస్టోమా ఒబామా అనే పేరుపెట్టారు. -
ఒబామా చిన్న కూతురు జాబ్ లో చేరింది..!
అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా చిన్న కూతురు వేసవి సెలవుల సందర్భంగా పార్ట్ టైం జాబ్ లో చేరింది. పదిహేనేళ్ళ వయసులో సగభాగం వైట్ హౌస్ లోనే లగ్జరీగా గడిపిన సాషా ఒబామా.. సమ్మర్ హాలీడేస్ హాయిగా గడిపేయకుండా జీవితానికి కావలసిన మరింత పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మీడియా రంగంలో సెటిలవ్వాలనుకున్న పెద్ద కూతురు మలియా ఒబామా.. గతేడాది సమ్మర్ హాలీడేస్ లో అనుభవంకోసం మీడియాలో పనిచేయగా... ప్రస్తుతం చిన్న కూతురు.. సాషా ఒబామా ఓ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయింది. ఫ్రైడ్ సీ ఫుడ్, మిల్క్ షేక్ లకు ప్రతీతి చెందిన మార్తాస్ వైన్యార్డ్ లోని ఫుడ్ జెయింట్.. నాన్సీ రెస్టారెంట్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. బ్లూ షర్ట్- హ్యాట్ ఖాకీ బ్యాంక్స్ వేసుకొని కస్టమర్ల ఆర్డర్లు తీసుకుంటూ సాషా కనిపించడం.. ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. రెస్టారెంట్లో ఉన్న సమయంలో సాషా ఒబామా.. తన పూర్తి పేరైన నటాషాను వినియోగిస్తోంది. ఆమెకు వేసిన షిఫ్టుల ప్రకారం ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఆమెకు భద్రత కోసం పని చేస్తున్నారు. అయితే ఓ సర్వర్ గా పనిచేస్తున్న ఆమెకు.. తోడుగా ఆరుగురు పనిచేస్తున్నారేంటి చెప్మా.. అంటూ.. ముందుగా తామంతా ఆశ్చర్యపోయామని, ఆ తర్వాత ఆమె ఎవరు అన్న అసలు విషయం తెలిసిందని రెస్టాటరెంట్లోని ఇతర సర్వర్లు చెప్తున్నారు. ఎప్పుడు మార్తాస్ వైన్యార్డ్ సందర్శించినా ఒబామా దంపతులు నాన్సీకే వెడుతుంటారు. ఒబామా కు ఎంతో ఇష్టమైన నాన్సీ రెస్టారెంట్లోనే ఆయన కూతురు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తుండటం విశేషం. రెస్టారెంట్లో నాలుగు గంటలపాటు కొనసాగే సాషా షిప్టు.. ఉదయమే ప్రారంభమౌతుంది. అయితే సాషా పనిచేస్తున్న నాన్సీ యజమాని మౌజబ్బర్.. ఒబామా మంచి స్నేహితులు కావడంతోనే సాషా సమ్మర్ జాబ్ కు అక్కడ చేరినట్లు తెలుస్తోంది. -
ఒబామా వరస్ట్ ప్రెసిడెంట్ః ట్రంప్
వాషింగ్టన్ః రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒబామాను టార్గెట్ చేశారు. ఆమెరికా చరిత్రలోనే ఒబామా లాంటి వరస్ట్ ప్రెసిడెంట్ లేడంటూ విరుచుకు పడ్డారు. అతడు అసలు అధ్యక్షపదవికే పనికి రాడని, ఓ భయంకరమైన విపత్తులాంటి వ్యక్తి అంటూ నోటికొచ్చిన పదాలన్నీ వాడుతూ అక్కసు వెళ్ళగక్కారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. ఒబామా ఓ భయంకరమైన వ్యక్తి అంటూ అభివర్ణించారు. ఒబామాలాంటి చెత్త అధ్యక్షుడు అమెరికా చరిత్రలోనే లేడని విమర్శలు గుప్పించిన ట్రంప్... వెంటనే అధ్యక్షపదవికి ఒబామా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రిపబ్లిన్ అభ్యర్థిగా తనకు నామినేషన్ కూడా లభించదన్నారని, తర్వాత తాను గెలిచే అవకాశం లేదన్నారని, ఉన్నట్లుండి తనదే విజయం అని కూడా చెప్తారంటూ ఒబామాపై విమర్శనాస్థ్రాలు సంధించారు. రిపబ్లికన్ అభ్యర్థి ప్రెసిడెంట్ పదవికి అన్ ఫిట్ అంటూ గతవారం ట్రంప్ పై ఒబామా చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించిన ఓ బ్రాడ్ కాస్టింగ్ గ్రూప్ ఇంటర్వూల్లో ట్రంప్.. ఒబామాపై తనదైన రీతిలో స్పందించారు. మరోవైపు డెమొక్రెటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను సైతం ట్రంప్ దెయ్యంతో పోల్చిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు దుష్ట హిల్లరీగా సంబోధిస్తున్న ఆయన తాజాగా ఆమెను దెయ్యం అనడం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ ప్రత్యర్థులు రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్న ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో సైతం రిగ్గింగ్ జరుగుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఒబామా దిగిపోతున్నారని తెలియగానే..
న్యూయార్క్: అమెరికాలోనైనా సరే, ఆఫ్రికాలోనైనా సరే నాలుగేళ్ల పిల్లలకు దేశాధ్యక్షుడెవరో సాధారణంగా తెలియదు. కానీ అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలోని బీవర్టన్ నగరానికి చెందిన నాలుగేళ్ల పాప అబెల్లా టామ్లిన్కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అని తెలియడమే కాకుండా ఆయనకు వీరాభిమాని కూడా. బరాక్ ఒబామా త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నారని కారులో కూర్చున్న చిట్టి తల్లి అబెల్లాకు తల్లి ఆండ్రియా చెప్పగానే వెక్కి వెక్కి ఏడ్చేసింది. డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఒబామా ప్రసంగాన్ని వింటున్న ఆండ్రియా, ఒబామా దిగిపోతున్న విషయాన్ని తన కూతురుకు చెప్పగానే ఆ పాప ఏడపందుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. ఒబామా స్థానంలో హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్షులుగా ఎన్నికవుతారంటూ తల్లి సముదాయించేందుకు ప్రయత్నించినా ఆ పాప తన ఏడుపాపలేదు. ఒబామా ఉన్నాక మరో అధ్యక్షుడు మనకెందుకు అంటూ అమాయకంగా తల్లిని ప్రశ్నించింది. చిన్నప్పటి నుంచి ఒబామా అంటే తన పాపకు ఎంతో ఇష్టమని మామ్ చెప్పారు. ‘ఒబామా అధ్యక్షుడిగా కొనసాగితే మాత్రం మనతో కలసి భోంచేస్తారా, చెప్పు!’ అంటూ తల్లి బుజ్జగించేందుకు ప్రయత్నించినా, అసలు ఎందుకు తప్పుకోవాలంటూ ఆ పాప ఎదురు ప్రశ్నించింది. ఒబామా తర్వాత హిల్లరీ ఎన్నికవుతారని, ఆమె కూడా చాలా మంచిదేనని నచ్చచెప్పానని, ఉద్దేశపూర్వకంగానే హిల్లరీతో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పలేదని ఆండ్రియా వివరించారు. ప్రతికూల దృక్పథంతో మాట్లాడేవారి గురించి తన పాపకు చెప్పడం తకను ఇష్టం లేదని ఆమె అన్నారు. పాప వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలను ఆండ్రియా వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడావీడియో హల్చల్ చేస్తోంది. అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాక వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ఒబామా తన పదవికి రాజీనామా చేస్తున్న విషయం తెల్సిందే. -
ఒబామా పరిచయ వీడియోలో మోదీ
ఫిలడెల్పియా: డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ఒబామాను పరిచయం చేస్తూ ప్రదర్శించిన వీడియోలో.. భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా చోటు లభించింది. వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఒబామా ప్రయాణాన్ని, కృషిని వివరిస్తూ రూపొందించిన ఈ వీడియోలో.. ప్రపంచ దేశాల నేతలతో కలిసి ఒబామా చేసిన కృషిని వివరించారు. అందులో ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కి మూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలాం డ్లు కూడా కనిపించారు. ఒబామా చెప్తున్న విషయాన్ని మోదీ శ్రద్ధగా ఆలకిస్తున్న దృశ్యాన్ని చూపుతూ.. వాతావరణ మార్పుపై గత ఏడాది నవంబర్‌లో పారిస్‌లో కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం గురించి వీడియోలో వివరించారు. -
నాకంటే.. బిల్‌కంటే.. హిల్లరీనే బెస్ట్!
అమెరికా అధ్యక్ష పదవికి ఆమెకే అర్హతలు ఎక్కువ * హిల్లరీపై ఒబామా ప్రశంసల జల్లు * పార్టీ కన్వెన్షన్‌లో ఉద్వేగపూరిత ప్రసంగం ఫిలడెల్ఫియా: ‘‘నేను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా.. నాకంటే.. బిల్‌కంటే.. మరెవరికంటే కూడా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి హిల్లరీకే అర్హతలు ఎక్కువ. ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా. ఇకపై నా పనిని ఓ సాధారణ పౌరునిగా చేస్తా. ఇక మనం చేయగలిగే మంచి పని ఏమిటంటే.. దేశ తదుపరి అధ్యక్షురాలిగా హిల్లరీని ఎన్నుకోవడమే’’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికన్లకు పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైన నేపథ్యంలో పార్టీ కన్వెన్షన్ మూడో రోజు ఒబామా డెలిగేట్లను, ప్రతినిధులను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీపై ఒబామా ప్రశంసలు కురిపించారు. హిల్లరీకి అధ్యక్ష భవనంలో ఏం జరుగుతుందో పూర్తి అవగాహన ఉందని, కానీ రిపబ్లికన్ అభ్యర్థి రాజకీయ నాయకుడు కాదని, ఆయనకు ఇలాంటి వాటిపై అవగాహన లేదని ఒబామా పేర్కొన్నారు. ‘‘ఓవల్ ఆఫీసుకు ఏం కావాలో మనకు ముందుగా తెలియదు. ఒకసారి మనం ఆ డెస్క్‌పై కుర్చున్న తర్వాతే అది అర్థమవుతుంది. ప్రపంచ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి..? యువకులను యుద్ధానికి పంపాలా..? వంటి అంశాల గురించి మనకు ఏమీ తెలీదు. కానీ హిల్లరీ ఆ రూమ్‌లో ఉంటే మనకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. ఇలాంటి నిర్ణయాల్లో ఇప్పటికే ఆమె పాలుపంచుకున్నారు. ఆయన(ట్రంప్)కి సరైన ప్రణాళిక అనేది లేదు. ఆయన వాస్తవవాది కాదు. తనది వ్యాపార మనస్తత్వం అని స్వయంగా ఆయన చెప్పుకుంటారు. అది మాత్రం ముమ్మాటికీ నిజం’’ అని పేర్కొన్నారు. రెండు సార్లు అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన తాను ఇప్పుడు మీ ముందుకు వచ్చానని, సురక్షితమైన చేతుల్లో అమెరికాను పెడుతున్నానని నమ్మకంగా చెప్పగలనన్నారు. ఒబామా ప్రసంగం చివరిలో హిల్లరీ స్టేజిపైకి రావడంతో సదస్సు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. వేదికపై హిల్లరీని ఆలింగనం చేసుకున్న ఒబామా.. తన మాదిరిగానే హిల్లరీని కూడా ఆదరించాలని కోరారు. మెరిసిన భారతీయ అమెరికన్లు: సదస్సు వేదికపై ముగ్గురు భారతీయ-అమెరికన్లు మెరిశారు. ఈ సందర్భంగా నీరా టాండెన్(45) తన రాజకీయ అరంగేట్రం చేశారు. ఇల్లినాయి నుంచి కాంగ్రెస్ డెమొక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి(42)ని పార్టీలో ప్రాధాన్యం పొందుతున్న నేతగా పరిచయం చేశారు. భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమి బెరా మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రస్తుత సంక్లిష్టతను అర్థం చేసుకున్న ఒకే ఒక అభ్యర్థిగా హిల్లరీని సమర్థిస్తున్నానన్నారు. -
ఆయన అమెరికాను అడ్డంగా అమ్మేస్తాడు!
ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సొంత పార్టీ డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. 12 ఏళ్ల కిందట ఇదే వేదికపై అధ్యక్ష అభ్యర్థిగా ప్రసంగించిన ఒబామా.. ప్రస్తుతం రెండు పర్యాయలు పూర్తిచేస్తుకున్న శ్వేతసౌధం అధిపతిగా మాట్లాడుతూ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా, బిల్ క్లింటన్ కన్నా హిల్లరీ ఎక్కువ అర్హురాలని, ఆమెను ఎంతమంది దెబ్బతీయాలని చూసినా, ఆమె ఎప్పుడు వెనుకడుగు వేయబోదని, వెన్నుచూపి తప్పుకోబోదని పేర్కొన్నారు. ఇంకా తన ప్రసంగంలో ఒబామా ఏమన్నారంటే.. నేను రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను. అమెరికా భవిష్యత్తు పట్ల ఎప్పుడూ లేనంత ఆశాభావంతో ఉన్నాను. ఎన్నో ప్రమాణాల ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు మన దేశం ఎంతో శక్తిమంతంగా, సమృద్ధిగా ఉంది. గతవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన రిపబ్లికన్ సదస్సులోని వ్యాఖ్యలు మనం విన్నాం. ఇవి ఎంతమాత్రం కన్జర్వేటివ్ అభిప్రాయాలు కావు. దేశ భవిష్యత్తు గురించి ఎంతో నిరాశాపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పి ప్రపంచం నుంచి అమెరికాను వేరే చేసేలా మాట్లాడారు. ఇది నిజమైన రిపబ్లికన్ పార్టీయేనా అనిపించింది. అమెరికా ఇప్పటికే గొప్ప దేశం. శక్తిమంతమైన దేశం. మన గొప్పతనం కోసం ట్రంప్‌పై ఆధారపడాల్సిన ఖర్మ పట్టలేదు. తన సంకుచిత భావజాలంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను అమ్మేయగలడు. కానీ, మనం అంత బలహీనులం. భయస్తులం కాము. ఈ నేలమీద డొనాల్డ్ ట్రంప్ 70 ఏళ్లు బతికాడు. కానీ ఎన్నడూ ఆయన కార్మికులను గౌరవించిన పాపాన పోలేదు. ఎనిమిదేళ్ల కిందట అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం నేను-హిల్లరీ ప్రత్యర్థులుగా పోరాడం. ఆ పోరు చాలా కఠినంగా కొనసాగింది. ఎందుకంటే హిల్లరీ అంత దృఢమైన వ్యక్తి. ఐఎస్ఐఎస్ను తుదముట్టించేవరకు హిల్లరీ విశ్రమించబోదు. ఆమె తదుపరి కమాండర్ ఇన్ చీఫ్ పదవి చేపట్టేందుకు సైతం ఫిట్‌గా ఉంది. మన పిల్లల భవిష్యత్తును ఆమె కాపాడగలదు. మన పిల్లలు, భావితరాలను కాపాడుకునేందుకు తుపాకీ సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరముంది. -
ఐ లవ్యూ మిషెల్లీ..!
-
ఐ లవ్యూ మిషెల్లీ!
ఫిలడెల్ఫియా: అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తన అద్భుతమైన ప్రసంగంతో ఆహూతులను కట్టిపడేశారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు ప్రకటిస్తూ మిషెల్లీ చేసిన ప్రసంగం ‘నభూతో’ అన్నతరహాలో ఆద్యంతం పార్టీ శ్రేణులను మంత్రముగ్ధులను చేసింది. అమెరికాకు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు కావడం ఎంత ప్రయోజనకరమో చెప్తూనే.. సందర్భోచితంగా ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వాగ్బాణాలు సంధించారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమొక్రటిక్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయిన తరుణంలో పార్టీ జాతీయ సదస్సులో ఆమె చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో సమధికోత్సాన్ని, ఐక్యతను నింపింది. ‘ఈ ఎన్నికల్లో నేను విశ్వసించే బాధ్యతాయుతమైన వ్యక్తి, అమెరికా అధ్యక్ష పదవికి అర్హురాలైన ఏకైక వ్యక్తి.. అది మన fమిత్రురాలు హిల్లరీ క్లింటనే’ అంటూ మిషెల్లీ ప్రకటించారు. భావోద్వేగాలను మిళితం చేస్తూ ఆమె ప్రసంగం సాగుతుండగా.. ఆహూతులు పలుసార్లు లేచినిలబడి కరతాళ ధ్వనులతో తమ హర్షం ప్రకటించారు. లింగ, జాతి వివక్షతలు, ట్రంప్ ప్రాతిపదిస్తున్న విచ్ఛిన్నకరమైన రాజకీయాలను పరోక్షంగా విమర్శిస్తూ మిషెల్లీ ప్రసంగం సాగింది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి ఏమాత్రం అర్హులు కారని ఆమె స్పష్టం చేశారు. ‘మనం దేశం గొప్పది కాదని, దానిని మళ్లీ గొప్పగా చేయాల్సిన అవసరముందని చెప్తున్నవారిని ఎంతమాత్రం అంగీకరించండి. ఇప్పుడు భూమిపై ఉన్న గొప్ప దేశం మనదే’ అని మిషెల్లీ పేర్కొన్నారు. భార్య మిషెల్లీ ప్రసంగానికి ఫిదా అయిపోయిన అధ్యక్షుబు బరాక్ ఒబామా.. ఆమెను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘గొప్ప మహిళ చేసిన గొప్ప ప్రసంగం ఇది. నువ్వు అమెరికా ప్రథమ పౌరురాలిగా ఉండటం నిజంగా గర్వకారణం. ఐ లవ్యూ మిషెల్లీ’ అంటూ ఒబామా ట్విట్టర్లో పేర్కొన్నారు. Incredible speech by an incredible woman. Couldn't be more proud & our country has been blessed to have her as FLOTUS. I love you, Michelle. — President Obama (@POTUS) July 26, 2016 -
డెమోక్రటిక్ చీఫ్ రాజీనామా
ఈ-మెయిల్ లీకుల ప్రభావం ఫిలడెల్ఫియా : అంతర్గత ఈ-మెయిల్స్ లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు డెబ్బీ వాజర్‌మాన్ షల్జ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ ప్రకటన చేశారు. తన ముందున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. దీనికి ముందు ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఒబామాను, హిల్లరీ క్లింటన్‌ను ఆమె సంప్రదించారు. -
అమెరికా కమ్యూనికేషన్ల చట్టంలో సవరణలు
వాషింగ్టన్: టెర్రరిజమ్, ఇతర క్రిమినల్ కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఐటీ కంపెనీలు, ముఖ్యంగా విదేశాల్లో నెలకొల్పిన అమెరికా ఐటీ కంపెనీల సర్వర్లలో నిక్షిప్తమైన వినియోగదారుల ఎలక్ట్రానిక్ సమాచారాన్ని సేకరించేందుకు అమెరికాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు దశాబ్దాల నాటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చట్టంలో మార్పులు తీసుకరావాలని అమెరికా నిర్ణయించింది. అందులో భాగంగా బరాక్ ఒబామా యంత్రాంగం తాజా ప్రతిపాదనలను తీసుకొచ్చింది. అమెరికా వెలుపలనున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ వినియోగదారుడి ఈ-మెయిళ్లను ఇవ్వాల్సిందిగా ఆ కంపెనీపై ఒత్తిడి చేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి లేదంటూ ఓ కేసులో అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పడంతో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల చట్టాన్ని సవరించాలని ఒబామా యంత్రాంగం నిర్ణయించింది. విదేశాల్లో ఉన్న అమెరికా ఐటీ కంపెనీలకు ఆయా దేశాల చట్టాలు వర్తిస్తాయి గనుక ఆ మేరకు ఆయా దేశాలతో ఒప్పందం చేసుకునేందుకు వీలుగా ఈ సవరణలను ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను అమెరికా పార్లమెంట్ ఆమోదించిన తర్వాత వివిధ దేశాలతో పరస్పర సహకార ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఇలాంటి ఒప్పందం అమెరికాతో చేసుకోవడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. ప్రస్తుతం క్రిమినల్ కేసులకు సంబంధించి విదేశాల నుంచి అవసరమైన ఎలక్ట్రానిక్ సమాచారాన్ని ‘పరస్పర న్యాయ సహకార ఒప్పందాల (ఎంఎల్ఏటీ)’ కింద అమెరికా సేకరిస్తోంది. కావాల్సిన సమాచారం గురించి సంబంధిత దేశానికి ముందుగా దౌత్యపరమైన విజ్ఞప్తులు పంపించాలి. ఆ తర్వాత వారంట్ జారీ చేసి పంపించాలి. సదరు దేశం చట్టాల ప్రకారం అక్కడి వారు సమాచార సహకారాన్ని అందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కాలహరణం జరుగుతోంది. అలా జరగకుండా చూసేందుకే ఈ కొత్త సవరణ ప్రతిపాదనలు. ఈ విషయంలో అమెరికాతో ఒప్పందం చేసుకున్న దేశాలు కూడా అవసరమైతే తమ దేశాల్లో సమాచార చట్టాలను మార్చుకోవాల్సి ఉంటుంది. మానవ హక్కులకు, వ్యక్తి ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా చట్టంలో సవరణలు ఉండాలని ఐటీ కంపెనీల సంఘం డిమాండ్ చేసింది. వ్యక్తిగత ప్రైవసీవాదులు మాత్రం ఈ చట్టం సవరణలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
టర్కీ పరిస్థితిపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్: టర్కీలో కొనసాగుతున్న సైనికతిరుగు బాటు, చెలరేగుతున్న హింస పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీలో ఎన్నికైన ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు సూచించారు. టర్కీ ఈ పరిస్థితిని త్వరగా అధిగమించాలని ఆయన ఆకాక్షించారు. హింసాయుత చర్యలకు చరమగీతం పాడాలని కోరారు. పరిస్థితిపై ఒబామా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో ఫోన్ లో చర్చించారు. టర్కీలోని తమ దేశ పౌరుల భద్రత గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కెర్రీ ఒబామాకు తెలిపారు. టర్కీలో సైనిక తిరుగుబాటు మూలంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు. . -
అమెరికాలో పోలీసులపై కాల్పులు
-
అమెరికాలో పోలీసులపై కాల్పులు
- ఐదుగురు పోలీసుల మృతి.. ఏడుగురికి గాయాలు - ప్రధాన నిందితుడి హతం - హింసాత్మకంగా నల్లజాతీయుల నిరసన హ్యూస్టన్ : అమెరికాలోని డాలస్ నగరంలో ఇద్దరు నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు పోలీసులతో పాటు ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. డాలస్‌లోని అత్యంత రద్దీగా ఉండే డౌన్‌టౌన్ ప్రాంతంలో నల్లజాతీయులు నిరసన ప్రదర్శన సందర్భంగా దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ వారంలో లూసియానా, మిన్నోసోటా పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుల మృతికి నిరసనగా మొదలైన నిరసనలు చివరకు రక్తపాతానికి దారితీశాయి. 9/11 దాడుల అనంతరం పోలీసులపై జరిగిన అతి పెద్ద దాడుల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ కాల్పుల ప్రధాన సూత్రధారి మిఖా జాన్సన్(25) రోబో సాయంతో జరిపిన పేలుళ్లలో మరణించాడు. తుపాకులతో దుండగులు కాల్పులు జరపడం వల్లే ఇది జరిగిందని డాలస్ పోలీస్ చీఫ్ డేవిడ్ బ్రౌన్ చెప్పారు. అయితే ఎంత మంది కాల్పులు జరపారన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. చనిపోయే మందు అనుమానితుడు పోలీసులతో మాట్లాడుతూ... ఇటీవల నల్ల జాతీయులపై కాల్పుల వల్ల తాను తీవ్రంగా కలత చెందానని, అందుకే తెల్లజాతి అధికారుల్ని చంపాలనుకున్నానని, తాను ఏ గ్రూపు చెందినవాడిని కానని, సొంతంగానే ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిపాడు. ‘నిరసనల సందర్భంగా గురువారం రాత్రి డాలస్‌లోని డౌన్‌టౌన్ ప్రాంతంలో ఇద్దరు నల్లజాతీయులు ఆకస్మాత్తుగా పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు దాన్ని ఉగ్రవాద చర్యగా మొదట పొరపడ్డారు. కాల్పులతో వందలాది మంది ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు పెట్టారు. ఇంతలో పోలీసులు ఒక అనుమానితుడ్ని చుట్టుముట్టి చాలా సేపు అతనితో చర్చలు జరిపారు. చర్చలు ఫలించపోవడంతో దుండగుడికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చివరకు పోలీసులు రోబోకు పేలుడు పదార్థం అమర్చి దుండగుడి వద్దకు చేర్చి పేల్చి వేశారు.’ అని పోలీసు చీఫ్ బ్రౌన్ తెలిపారు. ఇంకా అనుమానితులు చాలా మంది ఉండే అవకాశం ఉందని, అనుమానితులంతా కలసి పనిచేస్తున్నారని, దీంతో దర్యాప్తు అధికారులు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారని ఆయన చెప్పారు. ఒబామా తీవ్ర ఆందోళన.. మరోవైపు అమెరికాలో వరుస కాల్పుల ఘటనలపై అధ్యక్షుడు ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. నాటో సదస్సు కోసం పోలండ్‌లో ఉన్న ఒబామా పోలీసులపై జరిగిన దాడి అత్యంత హేయమైనదిగా పేర్కొన్నారు. ఈ సంఘటనలతో మనం తీవ్రంగా భీతిచెందామని, ప్రజలు, పోలీసులతో మనం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. -
పోలీసుల కాల్పులపై ఒబామా సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని నల్లజాతీయులపై పోలీసులు చేసిన కాల్పులు జాతివివక్షలానే కనిపిస్తోందని ఆయన అన్నారు. నాటో సమావేశం కొరకు పోలెండ్ లోని వార్సాకు చేరుకున్న ఒబామా మీడియాతో మాట్లాడారు. ఇలాంటి క్రూరమైన ఘటనల వల్ల అమెరికన్లందరూ ఇబ్బందులకు గురవుతారని వ్యాఖ్యానించారు. ఈ వారంలో నల్లజాతీయులపై పోలీసులు జరిపిన కాల్పులు కావాలని చేసినవిగానే కనిపిస్తున్నాయని అన్నారు. అమెరికా క్రిమినల్ జస్టిస్ సిస్టం చూపుతున్న గణాంకాల్లో ఎక్కువ మంది నల్ల జాతీయులనే కాల్చడం లేదా అరెస్టు చేయడం లాంటి చర్యలు పోలీసులు చేశారని అన్నారు. తెల్లజాతీయులతో పోలిస్తే 30 శాతానికి పైగా నల్లజాతీయులను పోలీసులు అడ్డగిస్తున్నారన్నారు. ఆ తర్వాత మూడు అంతకంటే ఎక్కువసార్లు వారిని పరిశీలిస్తున్నారని తెలిపారు. గత ఏడాది కాలంలో తెల్లజాతీయుల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ మంది నల్లజాతీయులను పోలీసులు కాల్చారని పేర్కొన్నారు. రెండు రెట్లు అధికంగా నల్లజాతీయులను అరెస్టు చేశారని చెప్పారు. సరైన పత్రాలను వెంటతెచ్చుకున్నా 75 శాతం కన్నా ఎక్కువ కేసులు నల్లజాతీయులపైనే నమోదయ్యాయని ఒబామా తెలిపారు. వీరిలో 10 శాతం మందికి శిక్ష కూడా పడినట్లు వివరించారు. అదే తప్పు చేసిన తెల్లజాతీయులకు ఎలాంటి శిక్ష లేకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ వాస్తవాలని, కేవలం చర్మం రంగు నలుపుగా ఉండటం వల్లే వారిపై వివక్షను చూపుతున్నారని బాధపడ్డారు. ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని దేశం మొత్తం ఈ సమస్య కారణంగా ఇబ్బందులపాలవుతుందని అన్నారు. మిన్నెసోటా, లూసియానాల్లో అమెరికన్ పోలీసులు ఇద్దరు నల్ల జాతీయులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై స్పందించిన ఒబామా నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యం అంటే మిగిలిన వారి ప్రాణాలు తృణప్రాయం కాదని, ఎవరిదైనా జీవితమే అనే అన్నారు. దేశంలో భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కువ మంది నల్లజాతీయులే బలవుతుండటం బాధకరమన్నారు. -
ట్రంప్, క్లింటన్ ల మధ్య భేదం అదే: ఒబామా
వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ తరఫు నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల తరఫు నుంచి పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ల మధ్య భవిష్యత్తు, ఊహలకు ఉన్న తేడా ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నార్త్ కరోలినాలో తొలిసారి హిల్లరీ తరఫు ప్రచారం నిర్వహించిన ఆయన చార్లెట్టేలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో ప్రతి పౌరునికి భవిష్యత్తుకు ఓటు వేసే అవకాశం ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఒబామా పిలుపునిచ్చారు. కేవలం డెమొక్రటిక్ పార్టీకో లేదా రిపబ్లికన్ పార్టీకో సంబంధించిన అంశం కాదని దేశ భవిష్యత్తు కోసం మీరు తీసుకోబోతున్న నిర్ణయమని ఆయన అభివర్ణించారు. క్లింటన్ పై ఎఫ్‌బీఐ చార్జ్ షీటు దాఖలు చేయడంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయని ఒబామా, క్లింటన్ కు ఉన్న అనుభవాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారని ఒబామా అన్నారు. భవిష్యత్తును గురించి భయపడే నాయకురాలు హిల్లరీ కాదని, మనం తయారు చేసుకునే విధానాలను బట్టే భవిష్యత్తు ఉంటుందని నమ్ముతారని ఆయన అన్నారు. దేశ ఆర్ధికవ్యవస్థ పనితీరుపై హిల్లరీ క్లింటన్ కు నిశిత అవగాహన ఉందని ఆయన చెప్పారు. ట్రంప్ పేరును ఉపయోగించకుండా విమర్శించిన ఒబామా, మాటలతో ఊదరగొట్టే నాయకుల కన్నా హిల్లరీ సమర్ధవంతంగా దేశాన్ని రక్షిస్తారని అన్నారు. -
ఈయూ.. బై బై..
యూరోపియన్ యూనియన్‌లో ఉండలేమని తేల్చిన బ్రిటన్ వాసులు - బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం మంది ఓటు - రాజీనామా చేస్తానంటూ బ్రిటన్ ప్రధాని ప్రకటన - అంతర్జాతీయంగా మార్కెట్ల అతలాకుతలం - స్టాక్స్, కరెన్సీలు, ముడిచమురు దారుణ పతనం - సురక్షిత పెట్టుబడిగా బంగారం మెరుపులు - మున్ముందు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు ప్రభావం ఇలా.. పౌండు చరిత్రాత్మక పతనం.. డాలర్ డ్రీమ్స్.. రూపాయి క్రాష్ బ్రిటన్‌తో లింకుంటే కుదేలే!! ఐటీలో అనిశ్చితి తప్పదు: నాస్కామ్ ఆందోళన అక్కర్లేదు: జైట్లీ భయపడొద్దు: రాజన్ బ్రిటన్‌తో విడిపోతాం - ఈయూతో కలిసుంటాం - బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో స్కాట్లాండ్ అడుగులు - ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఇవే డిమాండ్లు బ్రిటన్ పోతే పోనీ! డొనాల్డ్ టస్క్, ఈయూ అధ్యక్షుడు బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని.. మిగిలిన 27 దేశాలతో కలిసి కూటమి బలంగానే ఉంటుందని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. రెఫరెండంపై బ్రిటన్లు పిచ్చి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఈయూలోని 27 దేశాల ప్రతినిధిగా చెబుతున్నా. మా ఐక్యత కొనసాగుతుంది’ అని టస్క్ తెలిపారు. ప్రజాతీర్పు వెల్లడైనందున ఈయూ నుంచి బ్రిటన్ వీలైనంత త్వరగా వెళ్లిపోయేలా ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. అనవసర ఆలస్యం వల్ల అనిశ్చితి పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే.. బ్రిటన్ నిర్ణయంతో తమ కూటమిలో చీలిక వస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఈయూ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ తెలిపారు. నిర్ణయాన్ని గౌరవిస్తాం అమెరికా అధ్యక్షుడు ఒబామా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని తమ దేశం గౌరవిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. యునెటైడ్ కింగ్డమ్తోపాటు యూరోపియన్ యూనియన్ ఎప్పటిలాగే అమెరికా భాగస్వాములుగా కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లో జరిగిన రెఫరెండం ఫలితాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ అనంతర సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు ప్రశాంతమైన, స్థిరమైన, అనుభవం గల నాయకత్వం అవసరమని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బ్రిటన్ ప్రజల ఎంపికను గౌరవిస్తున్నానంటూ ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇక సెలవ్!: డేవిడ్ కామెరాన్ (బ్రిటన్ ప్రధాని) ఈ చారిత్రక నిర్ణయంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవినుంచి తప్పుకోనున్నారు. బ్రెగ్జిట్ వ్యతిరేక వాదనను ముందుండి నడిపించిన కామెరాన్.. ఇకపైనా దేశాభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉంటుందని.. కొత్త నాయకత్వం దేశాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. టెన్ డౌనింగ్‌స్ట్రీట్ (యూకే ప్రధాని అధికారిక నివాసం) ముందు శుక్రవారం భార్య సమంతతో కలిసి ఉద్వేగంగా మాట్లాడిన కామెరాన్ ‘రెఫరెండం ప్రజాస్వామ్య విజయం. చారిత్రక నిర్ణయం. ఇందులో ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫలితాలపై ఎటువంటి సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లకు వచ్చే ప్రమాదం లేదని, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందని.. ప్రపంచ దేశాలకు భరోసా ఇస్తున్నాను’ అని తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న కన్సర్వేటివ్ కాన్ఫరెన్స్‌లో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారన్నారు. విజయం సాధించిన బ్రెగ్జిట్ అనుకూల వర్గానికి కామెరాన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా నిర్ణయంతో బ్రిటన్‌లో ఉన్న ఇతర యూరోపియన్ దేశాల ప్రజలకు, యూరోపియన్ దేశాల్లో ఉన్న బ్రిటన్లకు ప్రస్తుతానికి ఎలాంటి సమస్యా లేదని ఇప్పటివరకున్నట్లుగానే వస్తువులు, సేవల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండవని కామెరాన్ తెలిపారు. ఇకపై యురోపియన్ యూనియన్‌తో చర్చించాల్సిన అంశాలపై వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరేళ్లపాటు యూకే ప్రధానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్న కామెరాన్.. తమ ప్రభుత్వం విద్య, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, దృఢమైన సమాజ నిర్మాణంలో కృషి చేసి విజయం సాధించిందన్నారు. సోమవారం సమావేశం కానున్న బ్రిటన్ కేబినెట్.. కామెరాన్ పదవినుంచి తప్పుకునేందుకు తదుపరి చేయాల్సిన పనులను నిర్ణయించనుంది. 48.1 వ్యతిరేకం బ్రెగ్జిట్ అనుకూలం 51.9 సర్దుకునేందుకు కొంత సమయం: బోరిస్ జాన్సన్ (బ్రెగ్జిట్ ఉద్యమ నేత) రెఫరెండం తీర్పుతో ఉన్నపళంగా ఈయూతో తెగదెంపులు జరగవని.. అంతా సర్దుకునేందుకు కొంత సమయం పడుతుందని.. బ్రెగ్జిట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తెలిపారు. ‘ఇది ప్రజా నిర్ణయం. ప్రజాస్వామ్య విజయం. ప్రజలు తమ నిర్ణయాన్ని ధైర్యంగా తెలియజేశారనేదానికి ఇదే నిదర్శనం. అయితే రెఫరెండంతో ఉన్నపళంగా మార్పులు సాధ్యం కాదు. అన్ని సర్దుకునేందుకు కొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ప్రధాని కామెరాన్‌పై బోరిస్ ప్రశంసలు కురిపించారు. ‘కామెరాన్ మా తరం చూసిన అసాధారణ నాయకుడు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ధైర్యమున్న వ్యక్తి’ అని కొనియాడారు. యురోపియన్ యూనియన్ గొప్ప ఆలోచన.. కానీ ఇది బ్రిటన్‌కు సరిపోదని అభిప్రాయపడ్డారు. ఎప్పటికీ బ్రిటన్ యూరప్‌లో భాగమేనన్నారు. ఈయూ నుంచి విడిపోతామంటూ చరిత్రాత్మక నిర్ణయం లండన్: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవటం) వివాదంపై బ్రిటన్లు శుక్రవారం చారిత్రక నిర్ణయాన్ని వెలువరిచారు. ఈ వివాదంపై నాలుగు నెలల ఉత్కంఠకు తెరదీస్తూ.. ఈయూతో నాలుగున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకునేందుకే మెజారిటీ బ్రిటన్లు మొగ్గుచూపారు. దీంతో, ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్.. ఈయూనుంచి తప్పుకోనున్న రెండో దేశంగా (గ్రీన్లాండ్ తర్వాత) నిలిచింది. గురువారం జరిగిన రెఫరెండంలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్‌కే మద్దతు తెలిపారు. యూకే ఎన్నికల కమిషన్ చీఫ్ జెన్నీ వాట్సన్ ప్రతిష్ఠాత్మకమైన మాంచెస్టర్ టౌన్‌హాల్ నుంచి ఈ ఫలితాలను వెల్లడించారు. దాదాపు 3.3 కోట్ల మంది బ్రిటన్లు (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జీబ్రాల్టర్) రెఫరెండంలో పాల్గొనగా 1.74 కోట్ల మంది (51.9 శాతం) విడిపోవాలని.. 1.61 మంది (48.1 శాతం) ఈయూతో కలిసుండాలని తమ నిర్ణయాన్ని తెలియజేశారు. బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య తేడా 12.69 లక్షలు మాత్రమే. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో ఎక్కువ మంది యురోపియన్ యూనియన్లోనే ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలపగా.. ఉత్తర, మధ్య ఇంగ్లాండ్, వేల్స్, మెజారిటీ ఇంగ్లీష్ కౌంటీలు మాత్రం బ్రెగ్జిట్‌కే మొగ్గుచూపాయి. రెఫరెండం ఫలితంతో.. త్వరలోనే ప్రధాని పదవినుంచి తప్పుకోనున్నట్లు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరాన్ వెల్లడించారు. దేశాన్ని తదుపరి మజిలీకి తీసుకెళ్లటంలో తను సరైన వ్యక్తిని కాన్నారు. మూడు నెలల తర్వాత యూకేకు కొత్త ప్రధాని వస్తారని..ఆయన నాయకత్వంలోనే దేశం ముందుకెళ్తుందని కామెరాన్ స్పష్టం చేశారు. కామెరాన్ వారసుడిగా బ్రెగ్జిట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పేరు వినబడుతోంది. పలువురు కన్జర్వేటివ్ పార్టీ నేతలూ పీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బ్రెగ్జిట్తో స్కాట్లాండ్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈయూలో యూకే కలిసుండాలని బలమైన ప్రజాభిప్రాయాన్ని తెలిపిన స్కాట్లాండ్.. తాజా ఫలితంతో.. యూకే నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఈయూలో కలవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియాన్ ఈ విషయాన్ని చూచాయగా వ్యక్తం చేశారు. రెఫరెండం తర్వాత దేశం రెండుగా విడిపోయిందని.. అమెరికా, భారత్, చైనావంటి దేశాలతో ఈయూతో కలిసి వ్యాపారం చేసే అవకాశాన్ని కోల్పోయిందని కామెరాన్‌కు అత్యంత సన్నిహితుడైన భారత సంతతి ఎంపీ అలోక్ శర్మ తెలిపారు. బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో పాటు వలసలపై కొత్త చర్చకు తెర లేచింది. ఇకపై యురోపియన్ దేశాలు, భారత్‌తోపాటు ప్రపంచ దేశాలతో బ్రిటన్ కొత్త వాణిజ్య బంధాలను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ రెఫరెండాన్ని ఈయూకు పెద్ద దెబ్బ అని తెలపగా.. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఈయూ పతనం మొదలైందని వస్తున్న వార్తలను యురోపియన్ కమిషన్ చీఫ్ జీన్ క్లాడ్ జంకర్ ఖండిచారు. కాగా, బ్రిటన్ నిర్ణయంతో నెదర్లాండ్స్, ఇటలీ కూడా రెఫరెండం ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాందిశీకులే అసలు సమస్య! బయటకు ఎన్ని కారణాలు చెబుతున్నా... ప్రస్తుతం ఈయూ దేశాల్ని కుదిపేస్తున్నది కాందిశీకుల సమస్యే. ఈయూ ఒప్పందాల ప్రకారం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు వలస వెళ్లొచ్చు. దీంతో ఆర్థిక అస్తవ్యస్థ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దేశాల నుంచి, సిరియా, ఇరాక్ వంటి కల్లోల దేశాల నుంచి బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలకు లక్షల మంది తరలివస్తున్నారు. పలుచోట్ల వలసదారుల సంఖ్య పెరుగుతోంది. ఇది సామాజిక మార్పులకూ దారితీస్తోంది. పెపైచ్చు వారికి భృతి చెల్లిస్తూ... ఉద్యోగాలిప్పిస్తున్నా చాలామంది చేయటం లేదు. సులభంగా భృతి అందుకుని జీవించడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కాందిశీకులపై రేగుతున్న అసంతృప్తి ఏ స్థాయికి వెళ్లిందంటే... ‘ఈయూ’లో బ్రిటన్ కొనసాగాలని ప్రచారం చేస్తున్న బ్రిటన్ మహిళా ఎంపీని వారం రోజుల కిందట ఓ అగంతకుడు కాల్చిచంపాడు. రెఫరెండంలో ప్రతిఫలించింది కూడా ఈ ఆవేదన... ఆగ్రహమే!!. -
బ్రెగ్జిట్ పై ప్రజా నిర్ణయాన్నిగౌరవిస్తాంః ఒబామా
వాషింగ్టన్ః యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల తీర్పును గౌరవిస్తానని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా అన్నారు. బ్రెగ్జిట్ పై స్పందించిన ఒబామా.. ఈ పరిస్థితుల్లో అమెరికాతో బ్రిటన్ కు ఉన్న సంబంధాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. బ్రిటన్ తో ఎప్పట్లాగే సంబంధాలు కొనసాగిస్తామని వివరించారు. బ్రిటన్ ప్రజలు తమ గళాన్ని వినిపించారని, వారి నిర్ణయాన్ని తాము తప్పక గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ యూనియన్ తో బ్రిటన్ విడిపోయినా, ఆ రెండింటితో అమెరికా సంబంధాలు విడివిడిగా కొనసాగుతాయన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు పెట్టిన ఓటింగ్ లో ఎక్కువ మంది బ్రిటన్ ప్రజలు మద్దతు పలకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ ఈయూతో విడిపోవడం ఖాయమైంది. -
మతీన్ భార్యకు ముందే తెలుసట
ఆర్లెండో కాల్పుల ఘటనలో కొత్త మలుపు న్యూయార్క్: ఆర్లెండోలోని నైట్ క్లబ్లో మతీన్ కాల్పులు జరుపుతాడన్న విషయం అతని భార్యకు ముందే తెలుసా? మతీన్ తూటాలు కొన్నప్పుడు ఆమె అతని పక్కనే ఉందా..? అవుననే అంటున్నారు ఎఫ్‌బీఐ అధికారులు. మతీన్ క్లబ్లో కాల్పులు జరుపుతాడన్న విషయం మతీన్ రెండో భార్య నూర్ జాహీ సల్మాన్(30)కు ముందే తెలుసనిభావిస్తున్నారు. మతీన్ తూటాలు కొనుగోలు చేసినప్పుడు తాను పక్కనే ఉన్నానని సల్మాన్ ఎఫ్‌బీఐ అధికారులకు చెప్పినట్లు ఎన్బీసీ న్యూస్ వెబ్సైట్ ఓ కథనం ప్రచురించింది. కథనం ప్రకారం.. గే నైట్ క్లబ్‌కు ఓసారి మతీన్‌ను తీసుకెళ్లి తాను దింపినట్టు ఆమె ఎఫ్‌బీఐకి చెప్పింది. దాడికి సంబంధించి తాను మతీన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానంది. మతీన్ దాడికి సంబంధించి ప్రణాళికలను తనతో పంచుకునే వాడని పేర్కొంది. కాగా, నైట్ క్లబ్లో కాల్పులు జరిపాక అక్కడి నుంచే మతీన్.. సల్మాన్‌కు ఫోన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. సెనేటర్ అంగస్ కింగ్ కేసు అంశాలను వెల్లడిస్తూ.. ఏం జరుగుతుందో సల్మాన్‌కు కొంత సమాచారం తెలుసన్నారు. కాల్పుల విషయం ముందే తెలిసినా పోలీసులకు చెప్పని సల్మాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అధికారులు భావి స్తున్నారు. అర్లాండో ఘటన నేపథ్యంలో మారణాయుధాలపై నిషేధాన్ని పునరుద్ధరించాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కాంగ్రెస్‌ను కోరారు. -
భారత్‌కు ప్రత్యేక హోదా బిల్లుకు సెనేట్ అడ్డు
వాషింగ్టన్: భారత్‌ను అంతర్జాతీయ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించేందుకు అడ్డంకి ఎదురైంది. ఎగుమతి నియంత్రణ నిబంధనలకు సంబంధించిన సవరణల బిల్లు అమెరికా సెనెట్‌లో ఆమోదం పొందలేదు. ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త భేటీని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతి రోజు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జాన్ మెక్కెయిన్ నేషనల్ డిఫెన్స్ అధరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ-17)కి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఒబామా, మోదీ చర్చల అనంతరం భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఎన్డీఏఏ 85-13 ఓట్లతో సెనేట్ ఆమోదం పొందినా.. కొన్ని కీలక సవరణలకు ఆమోదం లభించలేదు. -
మతీన్ కూడా స్వలింగసంపర్కుడే!
- మతీన్ ఫోన్లో ‘గే యాప్’ ఉందన్న ఎఫ్‌బీఐ - చాలాసార్లు క్లబ్‌కు వచ్చాడన్న ‘పల్స్’ న్యూయార్క్: ఆర్లెండో కాల్పులకు పాల్పడిన ఉగ్రవాది మతీన్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిన్నటి వరకు స్వలింగ సంపర్కులంటే(గే) నచ్చకే.. ఉగ్రవాద ఆలోచనలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భావిస్తుండగా.. తాజా విచారణలో మతీన్ కూడా గే అని తేలింది. అతను గే అయి ఉండొచ్చని.. కోపం, సిగ్గు కారణంగా ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ఉంటాడని మతీన్ మాజీ భార్య సితోరా యుసుఫ్రీ వెల్లడించారు. 2008లో ఆన్లైన్లో కలుసుకున్నామని.. 2009లో వివాహంచేసుకున్నామని అప్పుడే తనకు క్లబ్‌లకు వెళ్లే అలవాటున్న విషయాన్ని మతీన్ చెప్పడన్నారు. అయితే అవి గే క్లబ్‌లా కాదా అని మాత్రం చెప్పలేదన్నారు. ఎఫ్‌బీఐ ప్రాథమిక విచారణలోనూ మతీన్ ‘గే యాప్స్’ను వినియోగించేవాడని తెలిసింది. 2013లో తోటి ఉద్యోగులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, 2014లో సిరియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన మొహ్మద్ అబుసల్హాతో సంబంధాలున్నాయనే కారణంతో రెండుసార్లు విచారించినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. అల్ కాయిదా, హిజ్బుల్లా సంస్థలతో తనకు సంబంధాలున్నట్లు పలుమార్లు సన్నిహితులతో చెప్పాడని ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమీ తెలిపారు. మరోవైపు, ఆదివారం నాటి దురదృష్టకర సంఘటనకు సాక్షంగా నిలిచిన పల్స్ క్లబ్ నిర్వాహకులు కూడా మతీన్ చాలాసార్లు తమ క్లబ్‌కు వచ్చాడని వెల్లడించారు. కొన్ని సార్లు క్లబ్లో ఓ మూలన కూర్చుని తాగి వెళ్లేవాడని.. మరికొన్నిసార్లు తాగి గట్టిగా అరుస్తూ రచ్చ చేసేవాడన్నారు. ఈ క్లబ్‌కు వచ్చేవారు కూడా మతీన్‌ను చాలాసార్లు కలిసినట్లు తెలస్తోంది. ఆర్లెండోను సందర్శించనున్న ఒబామా మలీన్ కాల్పుల్లో చనిపోయిన 49 మంది పల్స్క్లబ్ మృతులకు అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం నివాళులర్పించనున్నారు. సాధ్యమైన కారణాల అన్వేషణ ఆర్లెండో ఘటనకు సాధ్యమైన కారణాలను ఎఫ్‌బీఐ అన్వేషిస్తోంది. అమెరికన్ ముస్లిం అయిన మతీన్ స్వదేశీ ప్రేరేపిత ఉగ్రవాద ఉన్మాదేనని.. ఇతనికి ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాల్లేవని శ్వేతసౌధం, ఎఫ్‌బీఐ సంయుక్తంగా వెల్లడించాయి. ఇతని మానసిక స్థితి సరిగా లేదని మాజీ భార్య చెప్పటంపైనా, స్వలింగ సంపర్కులకు వ్యతిరేకమన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. లైంగిక ప్రవృత్తిపై ఎటూ తేల్చుకోలేక పోవటం కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్లెండో కాల్పలును ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఖండించింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తులపై కాల్పులకు దిగటం దారుణమంది. -
ఇది ఉగ్రదాడే
నైట్ క్లబ్ నరమేధంపై ఎఫ్‌బీఐ.. ఇది మా సైనికుడికి దేవుడు కల్పించిన అవకాశం: ఐసిస్ - ఇది దేశీయ ఉగ్రవాద ఉన్మాదం: ఒబామా - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రపంచదేశాలు.. మృతులకు నివాళి - ఆర్లెండో బాధితుల్లో పలువురి పరిస్థితి విషమం - నివాళిగా ఇంద్రధనుస్సు రంగుల్లో ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు - ఉగ్రవాది మతిన్ ప్రవర్తన మొదట్నుంచీ అనుమానాస్పదమే - మతిన్ తండ్రి మిర్ సిద్ధిఖీ తాలిబాన్ మద్దతుదారు ఆర్లెండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన దారుణ మారణకాండ ఉగ్రదాడేనని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) స్పష్టం చేసింది. దేశీయంగా పెరుగుతున్న ఉగ్రవాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. విదేశీ ఉగ్రవాదానికి దీనితో ఏమాత్రం సంబంధం లేదని వెల్లడించింది. గే ప్రైడ్ మంత్ సందర్భంగా పల్స్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో 49 మందిని పొట్టనపెట్టుకున్న ఒమర్ మతీన్ (29) ఘటన జరిగేందుకు ముందు 911 (అమెరికా హెల్ప్‌లైన్ నెంబరు)కు ఫోన్ చేసి ఐసిస్ గురించి మాట్లాడాడని తెలిపింది. అయితే మతీన్‌కు నేరుగా ఉగ్రవాదులతో సంబంధాలు లేవని 2013లో తోటి ఉద్యోగులతో మతం గురించి విద్వేషపూరిత వ్యాఖ్యల ఘటనలో, 2014లో ఓ అమెరికా ఆత్మాహుతిదాడి దళ సభ్యుడితో సంబంధాల విషయంలో.. మతీన్‌ను విచారించి వదిలేసినట్లు వెల్లడించింది. అయితే.. ఈ ఘటన తర్వాత అమెరికా ఉగ్రవాద వ్యతిరేక విభాగం పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు ఐసిస్కూడా ఆర్లెండో కాల్పులకు పాల్పడింది తమవాడేనని రేడియో బులెటిన్‌లో ప్రకటించింది. ‘అమెరికా కాలిఫేట్‌లోని మా సైనికుల్లో ఒకడైన మతీన్‌కు ఈ పనిచేసేందుకు దేవుడు అవకాశం కల్పించాడు’ అని ప్రకటించింది. ‘ప్రపంచ’మంత సానుభూతి.. అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన మారణకాండపై ప్రపంచదేశాలన్నీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒర్లాండో ఘటనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా పారిస్ మేయర్ కార్యాలయంపై అమెరికా జెండాను ఎగురవేశారు. ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్, సైప్రస్, గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల రాజకీయ ప్రముఖులు ఆర్లెండో ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా వైట్‌హౌజ్‌పై జాతీయ జెండాను అవనతం చేశారు. పలు ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలను, ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయాన్నీ గే ప్రైడ్ జెండా రంగుల్లోకి మార్చేశారు. లాస్ ఏంజిలస్‌లో, పారిస్, లండన్, బెర్లిన్లలో వేల సంఖ్యలో ప్రజలు ఆర్లెండో మృతులకు సంతాపసూచకంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. ఐసిస్ దాడి కాదు: ఒబామా.. ఆర్లెండో ఉగ్రఘటనకు పాల్పడిన ఉగ్రవాది ఐసిస్ సభ్యుడు కాదని.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐసిస్ ఉగ్ర సాహిత్యంతో ప్రభావితుడై ఈ ఘటనకు పాల్పడ్డాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ‘ఈ ఘటన దేశీయంగా పెరుగుతున్న ఉగ్రవాద ఉన్మాదానికి ఉదాహరణ’ అని అన్నారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శాన్ బెర్నార్డినోలో జరిగిన ఘటనలాంటిదేనన్నారు. తండ్రి, కొడుకులది ఉగ్ర ఆలోచనే! కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాది మతీన్ 1986లో న్యూయార్క్‌లో అఫ్గాన్ నుంచి వలసవచ్చిన కుటుంబలో పుట్టాడు. ఆ తర్వాత ఫ్లోరిడా రాష్ట్రంలోని పోర్ట్ లూసీలో ఈ కుటుంబం స్థిరపడింది. ఒమర్ మతీన్ కొన్ని రోజులు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. కాగా, ఉగ్రవాది మతిన్ తండ్రి మిర్ సిద్ధిఖీ తాలిబాన్ మద్దతుదారుడని వెల్లడైంది. పాక్‌ను విమర్శిస్తూ.. తాలిబాన్లకు మద్దతుగా డరి భాషలో తను మాట్లాడిన వీడియోలను మిర్ ‘పాయమే అఫ్గాన్’ అనే యూట్యూబ్ చానల్లో పోస్టు చేశాడని మీడియా తెలిపింది. మిర్ పోర్ట్ సెయింట్ లూసీలో ‘డ్యూరాండ్ జిర్గా’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. శనివారం పోస్టు చేసిన వీడియోలో మిర్.. తనను తాను అఫ్గాన్ అధ్యక్షుడిగా చెప్పుకున్నారు. మతిన్ మాజీ భార్య కూడా.. తన భర్త ఉన్మాదిలా ప్రవర్తించేవాడని వెల్లడించింది. ప్రతి చిన్న విషయానికే కోపగించుకునేవాడని తెలిపింది. కాగా, శాంటా మోనికా ప్రాంతంలో ఓ కారులో మూడు రైఫిళ్లు, బాంబుల తయారీకి వినియోగించే రసాయనాలతో జేమ్స్ వెస్లే అనే యువకుడు పట్టుబడ్డాడు. సినిమాలో మాదిరి!.. ‘చెవులకు చిల్లులు పడే సంగీత హోరులో అందరం డ్యాన్స్ చేస్తున్నాం. అంతలోనే తుపాకీ శబ్దాలతో వాతావరణం గందరగోళంగా మారింది. సినిమాలోని దృశ్యాలను నిజజీవితంలో చూడాల్సివచ్చింది’ అని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల శబ్దం విని నేలపై పడుకున్న వారిపైనా ఉగ్రవాది నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడని మరో బాధితుడి బంధువు తెలిపారు. 39 మంది ఘటనా స్థలంలోనే చనిపోగా.. 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ప్రభావం? ఫ్లోరిడా ఘటన అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. సోమవారం జరగాల్సిన ప్రచార ర్యాలీని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వాయిదా వేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనతో ఒబామా సర్కారుపై విరుచుకుపడ్డారు. ముస్లింలకు దేశంలోకి ప్రవేశంపై తను చెప్పిందే నిజమైందన్నారు. ఇస్లాం ఉగ్రవాదం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. ఇప్పటికైనా ‘ఇస్లామిక్ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఒబామా ఉపయోగిచకపోతే.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. -
ఒబామాపై ట్రంప్ విమర్శలు
రిచ్మండ్: నేర అభియోగాలు ఎదుర్కొంటున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్షుడు ఒబామా బలపరుస్తున్నారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అయినా సరే నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో హిల్లరీని ఎదుర్కోవడానికి సిద్థంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. హిల్లరీకి ఒబామా మద్దతు ప్రకటించిన తరువాత వర్జీనియాలోని రిచ్మండ్లో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. నేర అభియోగాలు ఎదుర్కొటున్న వారికి దేశాధ్యక్షుడు మద్దతు తెలుపుతున్నారని, అయితే దేశం ఇదే కోరుకుంటుందా అని ర్యాలీకి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ప్రస్తుత డెమోక్రటిక్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఇటీవల ఇండియన్ అమెరికన్ రాజీవ్ ఫెర్నాండోకు కీలక పదవిని కట్టబెట్టడానికి కారణం అతడు క్లింటన్ ఫౌండేషన్‌కు ఎక్కువ మొత్తంలో డొనేషన్లు చెల్లించడమేనన్నారు. మెక్సికో, చైనాలాంటి దేశాలు అమెరికాను నాశనం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం దేశ వర్తక వ్యవహారాలు చూస్తున్న వ్యక్తులు తెలివితక్కువగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. మెక్సికో బార్డర్లో గోడను నిర్మిస్తానని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కొందరు దానిని ట్రంప్ వాల్ అని పిలువోచ్చునని అన్నారు. బలమైన, ఎత్తైన, అందమైన గోడగా తాను కట్టబోయే గోడ ఉంటుందని తెలిపారు. పరిశ్రమలను అమెరికాలోనే నెలకొల్పేలా చూడటం ద్వారా దేశంలో ఉపాధిని పెంపోందించాలన్నారు. అమెరికాకు దక్కాల్సిన వేలాది ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత్‌పై దాడులకు అడ్డాగా ఉండొద్దు
పాక్ హామీ ఇవ్వాలన్న అమెరికా వాషింగ్టన్: ప్రధాని మోదీ నేపథ్యంలో పాక్‌కు అమెరికా గట్టి సందేశం పంపింది. భారత్‌లపై దాడులు జరిపే ఉగ్రవాద సంస్థలకు పాక్‌ను అడ్డాగా మార్చొద్దని, ఆ విధంగా హామీ ఇవ్వాలని కోరింది. ఉగ్రవాద సంస్థలకు పాక్ స్థావరంగా మారిందని మోదీ అమెరికా పర్యటనలో పేర్కొనడం తెలిసిందే. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని పాక్‌ను అమెరికా ప్రోత్సహించడం ముందడుగని అమెరికా ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. ఆ రెండు దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందుతాయని, ఆ దిశగా చర్చలు సాగితే ఉద్రిక్తతలు తగ్గుతాయ చెప్పారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా మధ్య జరిగిన చర్చల్లో పాకిస్తాన్ అంశం కూడా ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో నెలకొన్న అనేక అంశాలను విస్తృతంగా చర్చించారన్నారు. అమెరికాతో భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాలు వేరని, కానీ, ఆ రెండు దేశాల మధ్య సంబంధాలనేవి వాటి ప్రాధాన్యతల మీద ఆధారపడి ఉంటాయన్నారు. -
హిల్లరీ నామినేషన్ లాంఛనమే!
- కాలిఫోర్నియా, న్యూజెర్సీలో స్పష్టమైన మెజారిటీ - జూలై 25న అధికారిక ప్రకటన.. లాస్ ఏంజిలస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ (68) రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియా, న్యూజెర్సీతోపాటు మరో నాలుగు చిన్న రాష్ట్రాలకు జరిగిన ప్రైమరీల్లో నాలుగింటిలో గెలిచి.. డెమొక్రాట్ల తరపున అధ్యక్ష బరిలో నిలిచేందుకు అధికారికంగా అర్హత సాధించారు. చివరి పోరుకు అర్హత సాధించేందుకు అవసరమైన 2,383 డెలిగేట్ల మద్దతును హిల్లరీ సాధించారు. మంగళవారం నాటి ఎన్నికల తర్వాత హిల్లరీకి 2,755 డెలిగేట్ల మద్దతు లభించగా.. శాండర్స్‌కు 1,852 మంది బాసట పలికారు. అయితే ఇందులో సూపర్ డెలిగేట్ల సంఖ్యను కూడా కలిపారు. అయితే ఓటమిని అంగీకరించేది లేదని వచ్చే మంగళవారం వాషింగ్టన్ డీసీలో జరిగే చివరి ప్రైమరీ వరకు బరిలో ఉంటానని శాండర్స్ ప్రకటించారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేషన్ సాధించిన హిల్లరీని అధ్యక్షుడు ఒబామా అభినందించారు. ఆయన గురువారం హిల్లరీ, శాండర్స్‌తో భేటీ కానున్నారు. జూలై 25 నుంచి 28 మధ్యన ఫిలడెల్ఫియాలో జరిగే డెమొక్రాటిక్ కన్వెన్షన్‌లో అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. కాగా, శాండర్స్ అభ్యర్థిత్వాన్ని కోరుకున్న వారంతా బాధపడొద్దని.. తనకు మద్దతు తెలపాలని ట్రంప్ కోరారు. -
భారత్ మా ప్రధాన రక్షణ భాగస్వామి
అమెరికా ప్రకటన.. రక్షణ రంగంలో ఒప్పందాలు ఖరారు - మోదీ-ఒబామా చర్చల అనంతరం సంయుక్త ప్రకటనలో వెల్లడి వాషింగ్టన్: భారత్‌ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది. తద్వారా.. రక్షణ రంగ వాణిజ్యం, సాంకేతికత బదిలీ విషయంలో అమెరికా అతి సన్నిహిత మిత్రులతో సమానంగా భారత్‌నూ పరిగణిస్తుంది. అలాగే.. అధీకృత నౌకాశ్రయ సందర్శనలు, సంయుక్త విన్యాసాలు, శిక్షణ, విపత్తు సహాయం కార్యక్రమాల్లో పరస్పరం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు లాజిస్టిక్స్ ఎక్సేంజ్ అవగాహన ఒప్పందాన్నీ ఇరు దేశాలూ ఖరారు చేశాయి. ప్రధాని మోదీ మంగళవారం అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చలు జరిపిన అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రక్షణ రంగంలో.. రక్షణ మౌలిక సదుపాయాలు, తీరగస్తీ సమాచార మార్పిడి, అమెరికా విమాన వాహక నౌకల సంచారానికి సంబంధించి కీలక ఒప్పందాలను ఖరారు చేయటంలో పురోగతి సాధించామని పేర్కొన్నారు. సంయుక్త ప్రకటనలోని ఇతర వివరాలు.. ► విస్తృత శ్రేణి ఉభయ(పౌర, సైనిక వినియోగ) సాంకేతికతలను లెసైన్స్‌తో పనిలేకుండా భారత్‌కు అందించడంపై ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా రక్షణ పరిశ్రమల అభివృద్ధికి, వాటి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లలో నిలపడానికి.. అమెరికా-భారత్ రక్షణ సహకారంలో భాగంగా అమెరికా చట్టాలకు తగ్గట్టు భారత్‌కు సరకులు, సాంకేతికతల ఎగుమతులు సాగేలా చూడటాన్ని అమెరికా కొనసాగిస్తుంది. ► విమానవాహక నౌకల సాంకేతికతకు సంబంధించిన వివరాలు, సమాచార మార్పిడిపై ఒప్పందానికి కూడా తుది రూపునిచ్చారు. అసియా - పసిఫిక్, హిందూమహాసముద్ర ప్రాంతంలో పరస్పరం ప్రాధాన్య భాగస్వాములుగా పరిగణించాలని నేతలు నిర్ణయించారు. ► ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కార్పొరేషన్లో చేరాలన్నభారత ఆసక్తినిఅమెరికా స్వాగతించింది. అలాగే భారత్ 2017 ప్రపంచ ఆర్థిక సదస్సును నిర్వహిస్తుంది. ప్రపంచ అభివృద్ధి, భద్రతా సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని పెంపొందించటానికి ఉమ్మడిగానూ, విస్తృత అంతర్జాతీయ సమాజంతోనూ కలిసి ఇరుదేశాలు పనిచేస్తాయి. ► ‘సుస్థిర అభివృద్ధి అజెండా 2030’ని దేశీయంగా, అంతర్జాతీయంగా అమలు చేయటానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. . సియాటిల్‌లో భారత దౌత్యకార్యాలయం అమెరికాలోని సియాటిల్ నగరంలో భారత్ త్వరలో కొత్త దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించనుంది. అమెరికాలోని వాయువ్య ప్రాంతంలో భారీ సంఖ్యలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ల కోసం ఈ ఆరో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పఠాన్‌కోట్ సూత్రధారులను పాక్ శిక్షించాలి: ఒబామా పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి 26/11 ఉగ్రదాడి వంటిదేనని.. దాని సూత్రధారులను శిక్షించాలని ఒబామా పాక్‌కు స్పష్టం చేశారు. పాక్ నుంచి భారత్‌కున్న ఉగ్ర ముప్పుై నిరోధంలో అండగా ఉంటామన్నారు. ముంబై, పఠాన్‌కోట్ దాడుల దుండగుల్ని చట్టంముందు నిలబెట్టాలని ఒబామా, మోదీ పాక్‌కు పిలుపిచ్చారు. -
5 దేశాల పర్యటనకు బయల్దేరిన మోదీ
అఫ్గాన్, ఖతర్, స్విస్, అమెరికా, మెక్సికోలతో బంధాలు బలోపేతం న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఐదు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అఫ్ఘానిస్తాన్, ఖతర్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లో పర్యటించనున్న ఆయన ఆ దేశాలతో వ్యాపారం, ఇంధన, భద్రత రంగాల్లో సహకారం పెంపుదలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఇందుకోసం ముందుగా శనివారం ఉదయం అఫ్ఘానిస్థాన్‌కు ప్రత్యేక విమానంలో మోదీ బయల్దేరారు. అక్కడ హెరాత్‌లో నిర్మించిన అఫ్గాన్-భారత్ ఫ్రెండ్షిప్ డ్యామ్‌ను ఆ దేశాధ్యక్షుడితో కలసి ప్రారంభిస్తారు. శనివారమే అక్కడి నుంచి ఖతర్ వెళ్తారు. తర్వాత స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తారు. సోమవారం అమెరికా చేరుకుని 7న ఒబామాతోమ చర్చిస్తారు. 8న ఆ దేశ పార్లమెంట్ (కాంగ్రెస్)లో ప్రసంగిస్తారు. అదేరోజు మెక్సికో చేరుకుని ఆ దేశ నేతలతో చర్చిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి స్వదేశానికి పయనమవుతారు. -
ఆత్మ విమర్శ ఎక్కడ?
సరిగా 71 ఏళ్లక్రితం తమ దేశం సృష్టించిన అణు విలయానికి సర్వనాశనమైన హిరోషిమా పట్టణాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించారు. అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు లక్షన్నర మంది ప్రజానీకం స్మృతికి నివాళులర్పించడంతోపాటు ఆ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన కొందరు వ్యక్తుల్ని ఆయన పలకరించారు. వారిని హత్తుకున్నారు... ఓదార్చారు. ఆధిపత్యం కోసం, గెలుపు కోసం సంపన్న దేశాల మధ్య సాగిన పోటీ పర్యవసానంగానే ఇంత దారుణం చోటు చేసుకున్నదని ఆవేదనచెందారు. మానవాళి చరిత్రనూ, దాంతో పెనవేసుకున్న ఘర్షణలు, యుద్ధాలు వగైరాలన్నిటినీ ఆయన పూసగుచ్చారు. ఒక్క మాటలో ‘క్షమాపణ’ మినహా ఒబామా అన్నీ చెప్పారు. ఇది క్షమాపణ చెప్పడానికి ఉద్దేశించిన పర్యటన కాదంటూ ముందే వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ పర్యటనపై ఇంటా బయటా ప్రశంసలతోపాటు విమర్శలూ వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడి ‘పెద్ద మనసు’ను కీర్తించినవారున్నారు. మానవేతిహాసంలోనే అత్యంత ఘోర దురంతానికి కారణమైనా ‘సారీ’ చెప్పడానికి నోరు రాలేదని ఆగ్రహించినవారున్నారు. అమెరికా, జపాన్‌లు రెండూ తమ దురుద్దేశాలను కొనసాగించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ఆరోపిస్తే... ఇలాంటి ‘సిగ్గుమాలిన’ పర్యటనలతో అమెరికా పరువు తీస్తున్నారని ‘న్యూయార్క్ పోస్టు’ వాపోయింది. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు కవి తన చేతగానితనాన్నీ, అర్ధ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలో దాచి మోసగించజూస్తాడని విఖ్యాత కథకుడు చలం అంటాడు. ఒబామా హిరోషిమాలో అలాంటి పనే చేశారా? ఆనాటి అమెరికా దుర్మార్గం జాడలు కప్పిపుచ్చాలని చూశారా? ఎందుకంటే...రెండో ప్రపంచ యుద్ధంలో అన్నివిధాలా అప్పటికే దెబ్బతిని ఉన్న జపాన్ను సమీప భవిష్యత్తులో కోలుకోలేకుండా చేయడం కోసం...తన అమ్ములపొదిలో ఉన్న అణు బాంబులు సృష్టించగల మారణ హోమాన్ని ‘వాస్తవికంగా’ పరీక్షించడం కోసం అమెరికా ఇంతటి దారుణానికి తెగించిందని చరిత్రకారులు చెబుతారు. హిరోషిమా తర్వాత మరో మూడు రోజులకు నాగసాకి పట్టణంలో కూడా ఇలాంటి దాడికే అమెరికా పాల్పడింది. ఈ రెండు ఉదంతాల్లోనూ లక్షన్నరమంది జనం ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని లక్షలమంది జీవితాంతం నరకయాతన చవిచూశారు. ఆనాటి దాడి ప్రభావంతో ఆ రెండు పట్టణాల్లో ఇప్పటికీ అంగవైకల్యంతో జన్మిస్తున్న వారున్నారు. భావోద్వే గాలతో నిండిన ఒబామా ప్రసంగంలో క్షమాపణ ప్రసక్తి లేకపోవడం సంగతలా ఉంచి... కనీసం అణ్వస్త్రాల తగ్గింపు గురించిగానీ, అందుకోసం అమెరికా తన వంతుగా చేయదల్చుకున్నదేమిటనిగానీ లేకపోవడం అన్యాయమని చాలామందికి అనిపించడంలో తప్పులేదు. చరిత్రలో జరిగిపోయిన వాటిని సరిదిద్దలేకపోయినా, అవి మళ్లీ పునరావృతం కాకుండా చూడటం సాధ్యమే. కనీసం ఆ దిశగా ఒక్క అడుగైనా ముందుకేయడానికి సంసిద్ధత ప్రదర్శిం చకపోవడమంటే ఆ తప్పు తిరిగి జరగడానికి ఆస్కారం కల్పించినట్టే. మారడానికి సిద్ధంగా లేమని ఒప్పుకోవడమే. అయితే ఒబామా వర్తమాన స్థితిని కూడా అర్ధం చేసుకోవాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక అమెరికన్ల పరిభాషలో ఆయన నిస్సహాయ లేదా నిరర్ధక అధ్యక్షుడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు అసాధ్యం. అందువల్లే హిరోషిమా వెళ్లడమే ఒక సాహ సోపేత నిర్ణయంగా భావించ మని కొందరు చెబుతున్నారు. ఆధిపత్యం కోసమో, వనరుల దోపిడీ కోసమో దేశాల మధ్య సాగే యుద్ధాలు మౌలికంగా ఆయా దేశాల సైన్యాల మధ్య సాగే సాయుధ ఘర్షణలు. జనావాస ప్రాంతాలను ఈ ఘర్షణలు తాకరాదని, పౌరులకు ప్రాణాంతకం కానీయరాదని అంతర్జాతీయ నియమాలున్నా చాలా సందర్భాల్లో వాటిని ఎవరూ పట్టించు కోవడం లేదు. ఈనియమాల ఉల్లంఘనలో అమెరికాది అగ్రస్థానమని ప్రపంచం మూలమూలనా నిరూపణవుతోంది. అది ఇరాక్ కావొచ్చు...సోమాలియా కావొచ్చు... అప్ఘానిస్తాన్ కావొచ్చు. అవి క్షిపణులు కావొచ్చు...బాంబులు కావొచ్చు... ద్రోన్ దాడులు కావొచ్చు- అతి తరచుగా బలవుతున్నది సామాన్య పౌరుల ప్రాణాలే. ఈ దేశాలన్నిటా సాగించిందీ, సాగిస్తున్నదీ దురాక్రమణే తప్ప యుద్ధం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి జపాన్ దురాక్రమణ ఉన్మాదం ఏ స్థాయిలో ఉన్నదో... దాని సైన్యాలు చైనాలోనూ, కొరియాలోనూ, ఇతరచోట్లా సాగించిన దురంతాలెలాంటివో అందరికీ తెలుసు. దాన్ని దారికి తీసుకురావడం అవసరమని అందరూ భావించినా అందుకు ఆ దేశ ప్రజల్ని మట్టుబెట్టడమే మార్గమని ఎవరూ అనుకోలేదు. అమెరికా ఇప్పుడు దేశదేశాల్లో సాగిస్తున్న దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు సైతం అందుకు ఆ దేశ ప్రజల్ని బాధ్యులుగా చేయరు. వియత్నాంలో 60వ దశకంలో అమెరికా సృష్టించిన మారణహోమాన్ని నిలువ రించడం చైతన్యవంతులైన అమెరికా ప్రజలవల్లనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అలాంటి చైతన్యమే అమెరికా దూకుడును నిలవరించగలదని అందరూ అనుకుం టున్నారు. చరిత్రకు సంబంధించిన ఎరుక ఇందుకు దోహదపడుతుంది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై జరిగిన అణ్వస్త్ర దాడుల గురించి అమెరికా ప్రజానీకం వైఖరిలో ఎంతో మార్పు వచ్చిందని ఈమధ్యే నిర్వహించిన ఒక సర్వే అంటున్నది. వ్యతిరేకులకూ, అనుకూలురకూ మధ్య స్వల్ప తేడాయే ఉన్నా ఆ దాడులు తప్పేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని చెబుతున్నది. పదేళ్లక్రితం ఇలాంటి సర్వేయే జరిపినప్పుడు అత్యధికులు ఆ దాడుల్ని సమర్ధించారు. చరిత్ర శిథిలాలపై హిరోషిమా పునర్నిర్మితమైంది. వర్తమాన ప్రపంచ అత్యాధునిక నగరాల్లో అదొకటి. 12 లక్షలమంది జనాభా గల ఆ నగరంలో ఇప్ప టికీ 50,000మంది బాంబు దాడి బాధితులున్నారు. కానీ అన్ని దేశాలూ జపాన్‌లా కాలేవు. అన్ని నగరాలూ హిరోషిమాగా చివురించలేవు. పచ్చని జీవితాన్ని ధ్వంసం చేయడం లిప్తకాలంలో చేయొచ్చుగానీ...దాన్ని పునర్నిర్మించడం, మళ్లీ జవజీవాల్ని అందించడం అంత సులభం కాదు. మరిన్ని హిరోషిమాలు రాకూడదనుకుంటే నిష్కర్షగా, నిజాయితీగా, స్వచ్ఛంగా మాట్లాడటం అవసరం. కేవల భావోద్వేగాలు, ఉత్ప్రేక్షలు, పరోక్ష ఒప్పుకోళ్లవల్ల పెద్దగా ఫలితం ఉండదు. -
గత గాయాలకు మందు
బైలైన్ క్యూబా. వియత్నాం. హిరోషిమా. బరాక్ ఒబామా మనకు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? నాకైతే అలాగే అనిపిస్తున్నది. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ అధ్యక్ష పదవీకాలంలోనే ఈ తరం అమెరి కన్లను వెంటాడిన కొన్నికొన్ని జ్ఞాపకా లనూ, సందిగ్ధాలనూ తనకు సాధ్యమై నంత మేర భూస్థాపితం చేయాలని ఒబామా ప్రయత్నం చేస్తున్నారు. ఆ జ్ఞాపకాలు, సందిగ్ధాలు ఏవంటే: 1945లో నాగసాకి, హిరోషిమాలను సర్వ నాశనం చేసిన అణుబాంబులు, 1960లలో క్యూబా, వియత్నాంల మీద జరిగిన దాడి ఘటనలు. దేశాధ్యక్షునిగా ఆయన ఈ సంఘటనల మీద క్షమాపణలు చెప్పలేరు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధులకు అది క్షేమకరం కాదు. అలాగే సోవియెట్ యూనియన్‌కు తీవ్రమైన సవాళ్లు విసరి, కమ్యూనిజం నుంచి ఈ స్వేచ్ఛా ప్రపం చాన్ని రక్షించామని విశ్వసించే వారికి కూడా అది ఆత్మహత్యా సదృశమవుతుంది. కానీ 19 60, 1970లలో పెరిగి పెద్దదైన తరానికి మాత్రం క్యూబా మీద జరిగినది ఓ మూర్ఖపు చర్య, వియత్నాం మీద దాడి ఘోర తప్పిదం. ఇది పూర్తిగా యాదృచ్ఛికం కాకున్నా, బరాక్ ఒబామా పుట్టిన సంవత్సరం, బే ఆఫ్ పిగ్స్ (దక్షిణ క్యూబా) మీద విఫల దాడికి జాన్ఎఫ్ కెన్నెడి ఆమోదించిన సంవ త్సరం కూడా 1961. కొన్ని మాసాల తరువాత క్యూబాలో క్షిపణల గురించిన వివాదం మీద అమెరికా, సోవియెట్ రష్యా అణు సంఘర్షణతో ఈ ప్రపంచాన్ని పేల్చేసినంత పనిచేశాయి. పశ్చాత్తాపం కూడా తగిలిన ఎదురు దెబ్బలకి కొంత సాంత్వన చేకూర్చగలదని ఒబామాకు తెలుసు. అయితే ఇందుకు తాను కూడా కొంత మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయ నకూ తెలుసు. అందుకు సంబంధించిన ఆత్మలు ప్రార్థనలతో సరిపెట్టుకోవు. వాటిని పూర్తిగా భూస్థాపితం చేయవలసిందే. గతకాలపు విషాదాలను మనం తుడిచిపెట్టలేం. వాటి పర్యవ సానాలను నిరాకరించలేం కూడా. ఒక ఘోర తప్పిదం గురించి బాహాటంగా అంగీకరిస్తే ప్రజలలో గుర్తింపు ఉంటుంది. గడచిన శతాబ్దంలో మనం చూసిన కనీవినీ ఎరుగని రక్తపాతాలు- యుద్ధాలు, వర్ణ వివక్ష, మారణహోమాలతో పోల్చి చూస్తే కామగాటమారు ఉదంతం వాటితో సమంగా మానవాళి మీద పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదు. కానీ సిక్కుల మీద అది లోతైన ముద్రను వదిలి వెళ్లింది. 1914లో సిక్కులు ప్రయా ణిస్తున్న కామగాటమారు అనే ఓడను జనంతో అలాగే కెనడా వెనక్కి తిరగ్గొట్టింది. ఇప్పటికీ ఆ గాయం రేగుతూనే ఉంటుంది. ఈ గాయాన్ని మాన్పవలసిన అవసరాన్ని కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆచితూచి వేసిన పదాలతో ఆయన ఓ ప్రకటన ఇచ్చారు కూడా. కామగా టమారు నౌకకు, అందులో అప్పుడు ప్రయాణించిన వారు ఎదుర్కొన్న ప్రతి విషాద ఘటనకి కెనడా బాధ్యత వహించలేదు. అయితే ఈ ప్రయాణికులు నిరపాయంగా తిరిగి వలస పోవడానికి వీలు కల్పించని నాటి కెనడా చట్టాలకు మాత్రం మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. పర్యవసానంగా ఎదురైన అన్ని విచారకర పరిణామాలకు మాత్రం మమ్మల్ని క్షమించాలి.’’ ఇందులో ముఖ్యాంశం బహిరంగంగా విచారం వ్యక్తం చేయడం. వాస్తవం ఏమిటంటే ఈ పనిచేయడానికి వందేళ్లు పట్టిందంటే, ఇలాంటి విషాదాన్ని గుర్తించడానికి వ్యవస్థలకు ఎంతకాలం పడుతుందో ఇది సూచిస్తుంది. అలాగే ఆ విషాదాలలోని అన్యాయం ఎంతటిదో గమనించడానికి కూడా ఎంత సమయం కావాలో ఇది సూచిస్తుంది. హిరోషిమా, నాగసాకిలలో నిర్మించిన శాంతి స్మారక స్తూపాన్ని సందర్శించడానికి అమెరికా అధ్యక్షుడికి 71 ఏళ్లు పట్టింది. ఇలాంటి వాటి మీద ఆగ్రహం ప్రకటించడం కంటే, నైతిక ప్రమాణాల గురించి మాట్లాడటం కంటే ఇలాంటి ఆలస్యాల వెనుక ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1945 నాటికి అమెరికా, జపాన్ అప్పటికి మూడేళ్ల నుంచి ఘోర యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి. ఎవరూ వెనక్కి తగ్గేటట్టు లేరు. కమికాజి అనుభవం దృష్ట్యా (పేలుడు పదార్థాలను నింపిన ఆ పేరు కలిగిన జపాన్ విమానం శత్రు స్థావరం మీద దాడి చేసింది) జరిగే ప్రాణనష్టం గురించి అమెరికా యోచించవలసి వచ్చింది. అయినప్పటికీ హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబుల బీభ త్సం తప్పలేదు. నా అభి ప్రాయం వరకు అమెరికా, జపాన్ల మధ్య సయోధ్య ఇప్పటికి పరిపూర్ణం కాలేదు కానీ, 1950లలోనే ఇందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక ఉత్పాతం కంటే శాంతి గొప్పదన్న వాస్తవాన్ని ఇంత తొంద రగా గుర్తించినందుకు రెండు దేశాలకు చెందిన ప్రజలకు శిరసు వంచి నమ స్కరించాలి. పర్యవసానం గా ప్రపంచం కొంత మెరుగైన స్థితికి చేరింది. చరిత్రలో సరికొత్త అధ్యాయం ఎప్పుడు మొదలవుతుంది? విజయం లేదా పరాజయం ప్రతి అంశాన్ని పరిపూర్ణంగా మార్చి వేసినప్పుడు తప్ప, సరికొత్త అధ్యాయం గురించి చెప్పడం ఎప్పుడూ కష్టమే. ఒక పరిణామం కొనసాగింపు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. ఒబామాకు క్యూబా సాదర స్వాగతం చెప్పినప్పుడు కూడా అమెరికా ఆ దేశంతో సంబంధాలకు సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని ఏళ్ల నుంచి ఆ తలుపులను తట్టలేదు. అయితే ఆ తలుపులు ఇక ఎప్పటికీ తెరిచే ఉంటాయని ఒబామా పర్యటన గట్టిగా చెబుతోంది. అమెరికా-వియత్నాం సంబంధాలలో ఒబామా తాపీగా చేసిన విన్యాసం ఒక కొత్త విధానాన్ని పరిచయం చేస్తున్నది. వియత్నాంకు అమెరికా ఆయుధాలు అమ్మబోతున్నది. వియ త్నాం యుద్ధం కొన్ని దశాబ్దాల క్రితమే ముగిసి ఉండవచ్చు కానీ, విభేదాలకు సంబంధించిన చివరి జాడలు, అంటే అనుమానాలు కూడా ఇప్పుడు సమసిపోయాయి. ఇది 1940లలో కమ్యూనిస్టు యోధుడు హోచిమన్ జపాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో కలసినప్పుడు ఆ రెండు దేశాల మధ్య కొనసాగిన బంధానికి పూర్తి విరుద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే ఐరోపా దేశాలను వలసల నుంచి ఖాళీ చేయవలసిందిగా అమెరికా ఒత్తిడి చేస్తుందని హోచిమన్ భావించారు (ఇలాంటి కారణాలతోనే గాంధీజీ మొదటి ప్రపంచ యుద్ధానికి మద్దతు ఇచ్చారు). కానీ రూజ్వెల్ట్ చనిపోయిన తరువాత ఆయన వారసుడు హ్యారీ ట్రూమన్ వియత్నాం మీదకు ఫ్రాన్స్‌ను ఉసిగొలిపారు. మిగిలిన కథ అందరికీ తెలుసు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి -
ఒబామా పెట్ డాగ్స్ కూడా బిజీ!
వాషింగ్టన్: పెట్ డాగ్స్ పట్ల యజమానులు ప్రేమానురాగాలు కురిపించడం చూస్తుంటాం. అబ్బో అవి ఎంత రాజభోగం అనుభవిస్తున్నాయో అంటూ వాటి అదృష్టాన్ని కొనియాడుతాం. అటువంటిది ఏకంగా ఓ దేశాధ్యక్షుడి ఇంట్లో పెట్ డాగ్స్ గా స్థానం పొందిన ఆ శునకాల అదృష్టాన్నేమనాలి? అటువంటి స్థానంలో ఉండటమేకాక, అక్కడ రాజ భోగాలు అనుభవించడంతోపాటు ఆ కుటుంబ సభ్యుల అమితమైన ప్రేమను అందుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంచుకుంటున్న పెట్ డాగ్స్ బో అండ్ సన్నీలు. మరి త్వరలో ఒబామా పదవీకాలం ముగిసిన తర్వాత వాటి స్థానం ఎక్కడ? సాధారణంగా శునకాలు చేసే పని ఏముంటుంది? తినడం పడుకోవడం. ఇంకా చెప్పాలంటే యజమాని ఇంటికి కాపలా కాయడం. కొన్ని జాతి శునకాలు దొంగలను గుర్తించడంలో ఆరితేరి పోలీసులకు సహకరిస్తుంటాయి. అయితే ఒబామా వైట్ హౌస్ లో నివసిస్తున్న బో మరియు సన్నీలు మాత్రం ప్రెసిడెంట్ ఒబామాతోపాటు ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ కలిగి ఉంటాయని తెలుసా? వైట్ హౌస్ అంబాసిడర్లుగా వ్యవహరించే ఆ శునకాల షెడ్యూల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒబామా కుటుంబం వైట్ హౌస్ లో పెంచుకుంటున్న పోర్చుగీస్ వాటర్ డాగ్స్ జాతికి చెందిన రెండు శునకాల్లో పెద్దది బో. ఏడేళ్ళ వయసున్న బో కు ఫస్ట్ డాగ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ టైటిల్ కూడ ఉంది. ఇక రెండవది సన్నీ. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు శునకాలను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారని, వాటితో ఫొటోలు తీయించుకోవాలని ఆశ పడతారని సాక్షాత్తూ మిచెల్లే ఒబామాయే చెప్పడం విశేషం. అందుకే వాటి షెడ్యూల్ ను సైతం నెల ప్రారంభంలోనే ఖరారు చేస్తారట. దాని ప్రకారమే వాటిని ప్రదర్శనకు ఆమోదిస్తామని కూడ ఆమె అంటారు. ఈస్టర్ సమయంలో సందర్శనకు వచ్చిన వారికి వినోదాన్ని అందించడంలో బో, సన్నీలు ఎంతో బిజీగా ఉంటాయి. ప్రెసిడెంట్ ఇనాగరేషన్ సందర్భంలో కూడ పర్యాటకులను స్వాగతించే మెచెల్లేకు పక్కనే బో ఉంటుంది. అలాగే ప్రతియేటా క్రిస్మస్ ముందు ఆస్పత్రిలో ఉన్నవారిని పరామర్శించేందుకు వెళ్ళే సమయంలో కూడ మిచెల్లే తో పాటు ఆ రెండు శునకాలు ఉండాల్సిందే. అసలు బో, సన్నీలు ఎంత గుర్తింపు పొందాయో చెప్పడానికి గతంలో వాటిపై జరిగిన కిడ్నాప్ ప్రయత్నమే పెద్ద నిదర్శనం. ప్రస్తుతం ఏడేళ్ళ వయసున్న బో.. ఒబామా కుటుంబంలోకి 2009 లో అడుగు పెట్టింది. 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామాకు మంచి మద్దతుదారుడగా ఉండటమే కాక, ఆయన కుటుంబానికి సైతం సన్నిహితుడుగా ఉండే మాజీ సెనేటర్ ఎడ్వార్డ్ ఎం కెన్నడీ... 'బో' ను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ళ వయసున్న సన్నీ 2013 ఆగస్టు లో ఒబామా కుటుంబ సభ్యురాలైంది. బో అప్పటికే వైట్ హౌస్ గ్రౌండ్స్ కీపర్ హెడ్ గా ఉన్న డేల్ హానీ కి హెల్పర్ గా విధులు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం డేల్ తో పాటు నేషనల్ పార్క్ సేవల్లో ములిగిపోయే బో... నేషనల్ పార్క్ క్రూ సిబ్బందితో పాటు వాకింగ్ చేయడం, అక్కడి మొక్కలను పరీక్షించడం వంటివి తన బాధ్యతగా ఉన్నట్లే కనిపిస్తుందని, అలాంటి సమయంలో అసలు తమనుసైతం పట్టించుకోకుండా సీరియస్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఉంటుందని మిచెల్లే చెప్తుంటారు. అయితే తమ ఇంట్లో తమతోపాటు ఉంటున్న పెంపుడు జంతువులైన బో, సన్నీలు తమ కుటుంబ సభ్యులుగానే పెరుగుతున్నాయని, ఒక్కోసారి అవి నా ఒళ్ళోనూ, నా కుర్చీమీద కూర్చుంటాయని, నేను కూడ వాటిని ఎంతో ప్రేమగా నిమిరుతూ ఉంటానని, అవి మాకు ఎంతో ప్రేమను అందించడంతోపాటు, ఎంతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయని మిచెల్ చెప్తారు. ముఖ్యంగా అధ్యక్ష పదవిలో ఉన్నవారి పెంపుడు జంతువులు ప్రజాదరణ పొందడం, వారికి సహచరులుగా ఉండటం సాధారణమే. అయితే వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా పదవీ కాలం ముగియనున్న బరాక్ ఒబామా... గతేడాది ఓ సందర్భంలో తన పెంపుడు జంతువులైన బో, సన్నీల గురించి కూడ ప్రస్తావించారు. తాను వైట్ హౌస్ ఖాళీ చేసే ముందు తన పెంపుడు జంతువులు చించేసిన కాగితాలతో సహా ప్రతి చిన్న విషయాన్నీ క్లియర్ చేసి వెడతానంటూ హామీ ఇవ్వడం ఆయనకు వాటిపై ఉన్న ప్రేమతోపాటు... పదవిపట్ల ఆయనకున్న బాధ్యతను కూడ వెల్లడించింది. -
ఒబామా ఉండబోయే భవంతి ఇదే..
వాషింగ్టన్: వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా పదవీ కాలం ముగిశాక బరాక్ ఒబామా కుటుంబం నివసించనున్న భవంతి ఇదే. వాషింగ్టన్ డీసీలోని కలోరమా ప్రాంతంలోని తొమ్మిది పడక గదులున్న ఈ భవనంలోనే ఒబామా ఉండబోతున్నారని అమెరికా మీడియా నిర్థారించింది. పావు ఎకరం స్థలంలో 1928లో ఈ భవంతిని నిర్మించారు. కాగా ఒబామాకు చికాగోలో సొంత అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. -
జూన్ 7న మోదీ అమెరికా పర్యటన
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా 7న వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ కానున్నారు. ‘వాతావరణ మార్పు, క్లీన్ ఎనర్జీలపై ఇరుదేశాల భాగస్వామ్యం.. రక్షణ, భద్రతల్లో సహకారం.. ఆర్థిక అభివృద్ధి ప్రాధాన్యాలు తదితర అంశాల్లో సాధించిన పురోగతిపై మోదీతో ఒబామా చర్చిస్తారు’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ ర్యాన్ కోరారని, దానికి ప్రధాని అంగీకరించారని పేర్కొంది. జూన్ 7న కంపెనీల సీఈవోలతో మోదీ సమావేశమవుతారని తెలిపింది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మో హన్‌సింగ్ తర్వాత అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్న ఐదో ప్రధానిగా మోదీ రికార్డులకెక్కనున్నారు. ఆదివారం ఇరాన్ పర్యటనకు వెళ్లనున్న మోదీ.. జూన్ 4 నుంచి రెండ్రోజులపాటు ఖతార్‌లో పర్యటించనున్నారు. -
బ్రిటన్ ఈయూలోనే ఉండాలి: అమెరికా
లండన్: బ్రిటన్ యూరోపియన్ యూనియన్(ఈయూ)లోనే కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన బ్రిటన్ పర్యటన సందర్భంగా కోరారు. జూన్ 23న జరిగే రెఫరెండమ్‌లో.. బ్రిటన్ ఈయూలో ఉండాలనే ఓటేయాలని ‘డైలీ టెలిగ్రాఫ్ ’రాసిన వ్యాసంలో విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలాఖర్లో జపాన్‌లో జరిగే జీ7 దేశాల కూటమి భేటీ తర్వాత ఒబామా.. అమెరికా అణుబాంబు దాడిలో ధ్వంసమైన హిరోషిమా నగరాన్ని సందర్శించనున్నారు. -
ఒబామా వలస విధానానికి మద్దతుగా ర్యాలీ
అమెరికా సుప్రీం కోర్టు వద్ద భారతీయ అమెరికన్ల ప్రదర్శన వాషింగ్టన్: అమెరికాలో 40 లక్షల మంది అక్రమ వలసదారుల బహిష్కరణకు వ్యతిరేకంగా ఉన్న ఒబామా ప్రభుత్వ విధానాల (డీఏపీఏ)కు మద్దతిస్తున్న భారతీయ అమెరికన్లు, దక్షిణాసియా ప్రాంత ప్రజలు సోమవారం అమెరికా సుప్రీం కోర్టు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. డీఏపీఏను 26 రాష్ట్రాలు సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. దీనిపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. డీఏపీఏతో కొంతమంది వర్ధమాన అమెరికన్లు కుటుంబాలతో కలసి ఉండటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ పేర్కొంది. -
అణు భద్రతే మా ప్రాధాన్యం!
అణు భద్రత సదస్సులో ప్రధాని మోదీ ♦ అణు స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ♦ సౌదీ చేరుకున్న ప్రధాని వాషింగ్టన్: అణు భద్రతను భారత్ జాతీయ ప్రాధాన్యంగా గుర్తించి పటిష్టమైన సంస్థాగత ప్రణాళిక, స్వతంత్ర నియంత్రణ వ్యవస్థతో ముందుకెళ్తోందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలో జరుగుతున్న అణు భద్రత సదస్సు చివరి రోజు ప్రసంగంలో.. అణువ్యాప్తి నిరోధం, భద్రత అంశాలపై భారత్ తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. సుశిక్షితులైన, ప్రత్యేకమైన సిబ్బంది నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తోందన్నారు. అణు ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు అక్రమ రవాణాను అడ్డుకోవటం, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటంపైనా భారత్ ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. అణు స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ‘అణు ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ చొరవ’ పేరుతో 2017లో జరిగే సమావేశాన్ని భారత్‌లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 2005లో ‘భారీ నష్టం చేసే ఆయుధాలు, వాటి సరఫరా వ్యవస్థ చట్టం’ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలను భారత్ అమలు చేస్తోందని మోదీ వెల్లడించారు. సదస్సు ముగిసిన తర్వాత బ్రిటన్ ప్రధాని కామెరాన్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకురానున్న టూటైర్ వీసా విధానం వల్ల తలెత్తే ఇబ్బందులను కామెరాన్‌తో చర్చించారు. కాగా, ప్రభుత్వేతరుల చేతికి అణుశక్తి చేరటంలో అన్ని దేశాలు కఠినంగా వ్యవహరించాలని అణుభద్రత సదస్సుకు వచ్చిన అన్ని దేశాలు సంయుక్తంగా తీర్మానించాయి. కాగా సదస్సు వేదిక వద్ద సిక్కు వేర్పాటువాద నాయకులు నిరసన చేపట్టారు. సౌదీలో మోదీ.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం సౌదీకి చేరుకున్న మోదీకి ఆదేశ యువరాజు ఫైజల్ అజీజ్ ఘన స్వాగతం పలికారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో సహకారంతోపాటు పలు కీలకాంశాలపై సౌదీతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇస్లాం సంస్కృతికి కేంద్రమైన సౌదీ ఇటీవలే 34 ముస్లిం దేశాలతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సౌదీలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతోనూ ప్రధాని సమావేశం కానున్నారు. సౌదీలో విమానం దిగిన తర్వాత రియాద్‌లో మట్టి ఇటుకలతో కట్టిన ‘మస్మక్ కోట’ను మోదీ సందర్శించారు. అనూహ్యంగా ప్రధాని మోదీ ఎల్అండ్టీ కంపెనీ ఉద్యోగులతో కలసి అల్పాహారం చేసి కాసేపు ముచ్చటించారు. రాజకీయ సుస్థిరత వల్లే భారత్ వృద్ధి.. భారతదేశంలోని రాజకీయ స్థిరత వల్లే దేశం వృద్ధి సాధ్యమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు. రియాద్‌లో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రపంచదేశాల ఆర్థికపరిస్థితి దిగజారుతుండటంతో.. వారందరికీ భారత్ ఆశాకిరణంగా మారిందన్నారు. తెలివైన మానవవనరులు, ఆధునిక నైపుణ్యం వంటి విషయాల్లో ప్రపంచానికి భారత్ ఇవ్వాల్సింది చాలా ఉందని మోదీ అన్నారు. సౌదీలో 30 లక్షల మంది భారతీయలు పనిచేస్తున్నారంటే మన యువత ఎంత ప్రతిభావంతమైంతో.. అర్థమవుతుందన్నారు. ప్రపంచంలో ఒక దేశంగా ఉన్న భారత్ నేడు.. ఓ ముఖ్యమైన దేశంగా మారిందన్నారు. ‘భారతదేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అద్భుతమైన ప్రగతినిసాధిస్తోంది’ అని వెల్లడించారు. ‘మైగవ్’ వెబ్సైట్, నరేంద్రమోదీ యాప్ మీ దగ్గరుంటే నేను ‘మీ పాకెట్లో ఉన్నట్లే’ అని మోదీ అన్నారు. భారత్-పాక్ ఆయుధాలు తగ్గించాలి: ఒబామా వాషింగ్టన్: తమ అమ్ములపొదిలోని అణ్వాయుధాలు తగ్గించుకునేందుకు భారత్, పాక్‌లు ముందుకు రావాలనిఅమెరికా అధ్యక్షుడు ఒబామా అణుభద్రత సదస్సులో సూచించారు. మిలటరీ సిద్ధాంతాలకు అనుగుణంగా పెంచుకుంటున్న అణు సంపత్తిని తప్పుడు పనులకు వినియోగించమని భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలున్న అమెరికా,రష్యా తమ ఆయుధ సంపత్తిని తగ్గించుకుంటే తప్ప మిగిలిన దేశాలు ముందుకు రావన్నారు. -
ఒబామా టాంగో డ్యాన్స్ అదుర్స్!
అర్జెంటీనాలో పర్యటన బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులు జోరుగా హుషారుగా డాన్సులతో అదరగొట్టారు. పాశ్యాత్య నృత్యాల్లో సూపర్ డాన్స్‌గా పేరున్న టాంగో డ్యాన్స్‌తో ఒబామా, మిషెల్‌లు అక్కడి టాంగో కళాకారులతో స్టెప్పులు వేస్తూ హుషారెత్తించారు. అర్జెంటీనా డ్యాన్సర్ మోరా గాడోయ్తో కలసి ఒబామా నృత్యం చేశారు. ఈ డ్యాన్స్‌కు అర్జెంటీనా ప్రతిని ధులు ఫిదా అయిపోయారు. అర్జెంటీనా సంప్రదాయ పానీయమైన ‘మేట్’ తాను తొలిసారిగా రుచిచూశానని, అర్జెం టీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని కలుసుకునేందుకు యత్నిస్తున్నానని ఆయన చమత్కరించారు. జార్జ్ లూయిస్ బోర్జెస్, జూలియో కొర్టాజర్ వంటి అర్జెంటీనా రచయితల పుస్తకాల్ని చదివానన్నారు. ఆ దేశ ప్రతినిధులు ఇచ్చిన విందులో ఒబామా పాల్గొన్నారు. అంతకుముందు అర్జెంటీనాలో పర్యటనలో భాగంగా ఒబామా ‘డర్టీవార్’పై ప్రసంగింస్తూ తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. అర్జెంటీనాలో అమెరికా మద్దతుతో జరిగిన ‘డర్టీవార్’లో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన బ్యూనస్ఎయిర్స్ సమీపంలోని ‘పరాగ్వే డె లా’ను బుధవారం ఒబామా సందర్శించారు. ఈ సందర్భంగా ‘డర్టీవార్’లో అమెరికా పోషించిన పాత్ర గురించి ఆయన మాట్లాడారు. 1976-1983 మధ్యకాలంలో జరిగిన డర్టీవార్లో అర్జెంటీనాకు చెందిన 30 వేలమంది కనిపించకుండా పోయారు. ‘డర్టీవార్’ఘటనల పట్ల సామరస్యాన్ని పాటించాలని.. ఇరుదేశాలమధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని కాంక్షించారు. డర్టీవార్కు సంబంధించిన రహ స్య నివేదికల్ని వెల్లడించేందుకు ఒబామా అంగీకరించారు. ఈ సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడు మార్షియో మాక్రి ‘మేమంతా డర్టీవార్ వెనుక ఉన్నటువంటి అసలు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా’మన్నారు. -
క్యూబా గడ్డపై అమెరికా అధినేత
హవానాలో దేశాధ్యక్షుడు రావుల్ కాస్త్రోతో ఒబామా భేటీ ♦ సత్సంబంధాల కోసం చర్చలు హవానా: చిరకాల ప్రత్యర్థుల మధ్య మరింత సయోధ్యకు రంగం సిద్ధమైంది. 5 దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలికే దిశగా క్యూబా, అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. క్యూబా అధ్యక్షుడు రావుల్ కాస్త్రోతో చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం క్యూబా రాజధాని హవానా చేరుకున్నారు. అనంతరం హవానాలోని ప్రధాన ప్రభుత్వ భవనం ‘ప్యాలెస్ ఆఫ్ రివల్యూషన్’లో రావుల్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు, ప్యాలెస్ వద్ద ఒబామాకు మిలటరీ బ్యాండ్‌తో ఘన స్వాగతం లభించింది. ఈ చరిత్రాత్మక పర్యటనలో ఒబామాతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా పాల్గొంటున్నారు. హవానా చేరుకోగానే స్థానిక భాషలో ఆత్మీయంగా ‘ఏంటి సంగతి.. క్యూబా!’ అని ఒబామా ట్వీట్ చేశారు. ‘ఇది చరిత్రాత్మక పర్యటన’ అని హవానాలో ఇటీవలే పునఃప్రారంభమైన అమెరికా ఎంబసీ అధికారులతో అన్నారు. తర్వాత, క్యూబా పౌరులు అమితంగా ఆరాధించే ఆ దేశ స్వాతంత్య్రోద్యమ నాయకుడు జోస్ మార్టిన్‌కు నివాళులర్పించారు. 1928లో కెల్విన్ కూలిజ్ పర్యటన తర్వాత క్యూబాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1959 నాటి క్యూబా విప్లవం తర్వాత ఆ కమ్యూనిస్ట్ గడ్డపై అడుగుపెట్టిన తొలి యూఎస్ అధ్యక్షుడూ ఒబామానే. అమెరికా, క్యూబాల మధ్య సత్సంబంధాలకు 2014లోనే బీజాలు పడ్డాయి. సాధారణ సంబంధాలు నెలకొనేలా కృషి చేస్తామని 2014 డిసెంబర్లో ఒబామా, రావుల్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. 2015 ఏప్రిల్‌లో వారి చరిత్రాత్మక భేటీ జరిగింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాల జాబితా నుంచి 2015 మేలో క్యూబాను అమెరికా తొలగించింది. కానీ, ఆర్థిక, వాణిజ్య నిషేధాన్ని ఇంకా పూర్తిగా తొలగించలేదు. క్యూబాపై నిషేధం తొలగింపునకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి కాగా క్యూబాతో సత్సంబంధాల పునరుద్ధరణకు రిపబ్లికన్లు సుముఖంగా లేరు. దీంతో ఒబామా తాజా పర్యటన జరుగుతోంది. మరోవైపు, కీలక వ్యవస్థలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ గుప్పిట్లో ఉన్న క్యూబాలో ఆ దేశ ప్రభుత్వానికి రుచించని విధంగా, చర్చల్లో మానవ హక్కుల అమలుకు అమెరికా ఒత్తిడి తేవొచ్చు. ఒబామా పర్యటనకు కొద్ది గంటల ముందే, నిషేధిత మానవహక్కుల సంఘానికి చెందిన పలువురిని క్యూబా అరెస్ట్ చేసింది. కాగా, ఒబామా పర్యటనతో క్యూబా రాజకీయ విధానాల్లో గొప్ప మార్పులేం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, క్యూబాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనడానికి మరింత సమయం పట్టొచ్చని అంటున్నారు. క్యూబా పౌరుల నుంచి అమెరికా అధ్యక్షుడికి గొప్ప స్వాగతం లభించకూడదని రావుల్ భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఒబామాకు స్వాగతం పలికేందుకు రావుల్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లకపోవడాన్ని వారు గుర్తు చేశారు. ఒబామా పర్యటన సందర్భంగా హవానాలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో ఒబామా హక్కుల కార్యకర్తలను కలుసుకుంటారు. పగ.. ప్రేమ 1959: క్యూబా విప్లవం. దేశాధ్యక్షుడు, నియంత, అమెరికా మద్దతున్న ఫుల్జెన్షియొ బటిస్టాను పదవీచ్యుతుడిని చేసిన ఫిడెల్ కాస్త్రో నేతృత్వంలోని గెరిల్లా దళం. కాస్త్రో నేతృత్వంలోని నూతన ప్రభుత్వాన్ని గుర్తించిన అమెరికా. యూఎస్‌లో పర్యటించిన కాస్త్రో . ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో భేటీ. 1960: క్యూబాలోని అమెరికాకు చెందని చమురు శుద్ధి కార్మాగారాలు సహా అన్ని ప్రైవేటు కంపెనీలను జాతీయికరించిన కాస్త్రో ప్రభుత్వం. ఆ తరువాత అన్ని అమెరికా కంపెనీల స్వాధీనం. అక్టోబర్‌లో క్యూబా ఎగుమతులపై నిషేధం విధించి, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్న అమెరికా. 1961: క్యూబా సోషలిస్ట్ దేశమన్న కాస్త్రో. ఏప్రిల్‌లో కాస్త్రో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా మద్దతుతో సాగిన ‘బే ఆఫ్ పిగ్స్’ చర్య విఫలం. 1962: క్యూబాతో వాణిజ్యం నిషేధం, ఇతర ఆంక్షల విధింపు. అక్టోబర్‌లో క్యూబాలోని రష్యా అణు క్షిపణులను తొలగించాలంటూ అమెరికా దిగ్బంధం. అణు యుద్ధం అంచున ప్రపంచం. 1977: క్యూబాతో సత్సంబంధాల పునరుద్ధరణకు నాటి యూఎస్ అధ్యక్షుడు కార్టర్ ప్రయత్నాలు. రీగన్ యూఎస్ అధ్యక్షుడవడంతో ఆగిన కృషి. 1991: చిరకాల మిత్రదేశం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో సంక్షోభంలో క్యూబా ఆర్థిక వ్యవస్థ. 2006: ఆనారోగ్యం బారిన ఫిడెల్ కాస్త్రో. సోదరుడు రావుల్ కాస్త్రోకు అధ్యక్ష బాధ్యతల అప్పగింత. 2014: దౌత్యసంబంధాల పునరుద్ధరణకు ఇరుదేశాల అంగీకారం. 2015: ఏప్రిల్‌లో ఒబామా, రావుల్ కాస్త్రోల చరిత్రాత్మక భేటీ. 2016: క్యూబా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా. -
శ్రీనివాసన్‌కు దక్కలేదు
అమెరికా సుప్రీం జడ్జిగా మెర్రిక్ గార్లాండ్ వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా మెర్రిక్ గార్లాండ్ (63)ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశా రు. చివరి నిమిషం వరకు భారత సంతతికి చెందిన శ్రీ శ్రీనివాసన్‌కే ఒబామా అవకాశం కల్పిస్తారని భావించినా అది జరగలేదు. వైట్‌హౌజ్‌లోని రోజ్ గార్డెన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్రిక్ పేరును ఒబామా ప్రటిం చారు. ‘గార్లాండ్ సుప్రీం కోర్టుకు నైతికత, గొప్పదనం, పారదర్శకత తీసుకు రాగల సమర్థుడు’ అని ఒబామా ప్రశంసించారు. చివరి వరకు శ్రీనివాసన్ పేరునే ప్రకటించే అవకాశం కనిపించింది. అయితే.. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సెనేట్ రిపబ్లికన్లు ఒబామాను హెచ్చరించారు. వచ్చే అధ్యక్షుడు 9 మంది సభ్యుల ధర్మాసనం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఒబామా, డెమోక్రాట్లు మాత్రం.. మరో పది నెలల సమయం ఉన్నందున ఈ విషయాన్ని అప్పుడు ఆలోచించుకోవచ్చని భావించారు. చివరి వరకు జరిగిన తర్జన భర్జనల అనంతరం గార్లాండ్ పేరును ప్రకటించినట్లు తెలిసింది. క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్‌కు యూస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన గార్లాండ్.. హార్వర్డ్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీం కోర్టు నామినీల చరిత్రలోనే ఫెడరల్ చట్టాలపై విస్తృత అనుభవం ఉన్న వ్యక్తి గార్లాండ్ అని వైట్‌హౌజ్ కొనియాడింది. గత నెలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంటోనిన్ హఠాన్మరణంతో ఈ పదవి ఖాళీ అయింది. -
ట్రంప్‌కు అగ్ని పరీక్ష
అమెరికన్ రాజకీయాలపై ప్రభావం చూపనున్న ‘రెండో సూపర్ ట్యూస్డే’ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన నేతలంతా ‘రెండో సూపర్ ట్యూస్డే’ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీలో తన ప్రత్యర్థులందరినీ వెనక్కినెట్టి దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఇది అగ్నిపరీక్షే. మంగళవారం కీలకమైన ఐదు రాష్ట్రాలు.. ఫ్లారిడా, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, మిస్సోరి, ఒహయోల్లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 360 మంది ప్రతినిధులు ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి 2,472 మంది ప్రతినిధులున్నారు. అధ్యక్ష అభ్యర్థి కావాలంటే వీరిలో 1,237 మంది మద్దతు ఉండాలి.ఇప్పటికి ఈ రేసులో ట్రంప్ (460) ముందంజలో ఉండగా.. టెడ్ క్రుజ్ (367), రుబియో (153), ఒహయో గవర్నర్ జాన్ కాషిష్ (63) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యలతో ట్రంప్ ఇంటా, బయటా తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. పైగా ఇటీవల జరిగిన వాషింగ్టన్ డీసీ, వ్యోమింగ్ రాష్ట్రాల్లో ఆయన ఘోర పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మిట్ రోమ్నీవంటి సీనియర్లు మిగతా అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ట్రంప్‌ను 1,237 మంది బలపరచకుండా అడ్డుకోగలిగితే జూలైలో జరిగే పార్టీ కన్వెన్షన్‌లో నాయకుల అభిప్రాయం మేరకు అభ్యర్థిని ఖరారు చేస్తారు. మెజారిటీ రిపబ్లికన్ నాయకులు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నందున ఆయన అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ముందంజలో ఉండటం కేవలం రిపబ్లికన్లనే కాదు అటు డెమోక్రాట్లను, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా కలవరపరుస్తోంది. తన వారసుడిగా ట్రంప్‌ను అమెరికన్లు ఎన్నుకోరని ఆయన విశ్వసిస్తున్నారు. అమెరికాకు వలస వచ్చినవారు ట్రంప్ విషయంలో ఆందోళనగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ట్రంప్ ర్యాలీల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అం దుకే ట్రంప్ కూడా భారతీయుల గురించి స్వరం మార్చారు. అమెరికా విద్యాలయా ల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తెలివైన వారని, వారిని వెనక్కి పంపరాదని, అలా పంపితే మనకే నష్టమని అన్నారు. -
ట్రంప్ జోస్యం చెప్పిన ఒబామా
వాషింగ్టన్: తన అనంతరం తమ దేశ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ప్రజలు ఎన్నుకుంటారని అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా అనుకోవడం లేదని అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు మాట్లాడుతున్న మాటల కారణంగా వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతి స్పందనను ప్రతి అమెరికన్ పౌరుడు గమనిస్తున్నాడని ఆ ప్రకటనలో పేర్కొంది. అమెరికా ప్రజలు ట్రంప్ ను విశ్వసించడం లేదని, అతడిని తమ అధ్యక్షుడిగా ఎన్నికుంటారని భావించడం లేదని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. ట్రంప్ ప్రచార శైలిపై ఆయనను ప్రశ్నించగా ట్రంప్ ను ప్రజలు విశ్వసించడం లేదని, ఇప్పటికే రెండుసార్లు బహిరంగంగా జరిగిన సమావేశంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారని అన్నారు. దీర్ఘదృష్టి ఉన్నవాడిని, తెలివైనవాడిని, సహనం, ఓర్పు ఉన్నవాడిని తమ అధ్యక్షుడిగా అమెరికన్లు ఎంచుకుంటారని, వారికి ఆ మాత్రం అవగాహన ఉందని తెలిపారు. అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ అందరికన్నా ముందున్నప్పటికీ ప్రతి రోజు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తనకు తానే ఉచ్చు బిగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ముక్కోపి అని, ముస్లిం వ్యతిరేకి అని, విదేశాలతో మంచి సంబంధాలు కొనసాగించగలిగే సామర్థ్యం లేనివాడని ఆయన ప్రసంగాల ద్వారా పలువురు అంటున్నారు. -
ఒబామా మద్దుతు శ్రీనివాసన్‌కే
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు జడ్జీ బరిలో శ్రీ శ్రీనివాసన్, మరో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడు ఒబామా ఈ జాబితాను పరిశీలిస్తున్నారు. అయితే శ్రీనివాసన్, మెర్రిక్ గార్లాండ్ రిపబ్లికన్ పార్టీ మద్దతుతో ముందంజలో ఉన్నారు. అరుదుగా ఖాళీ అయ్యే ఈ స్థానంలో సమర్థుడైన వారిని నియమించాలని ఒబామా యోచిస్తున్నట్లు సమాచారం. అయితే బరిలో కేటన్జీ బ్రౌన్ జాక్సన్(45) కూడా ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీం కోర్టు జడ్జీ జస్టిస్ స్కాలియా అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ ఖాళీ ఏర్పడిన విషయం విదితమే. 2013లో శ్రీనివాసన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్య్కూట్ అప్పీల్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. యూఎస్‌లో ఇది అత్యంత ప్రాధాన్యమైన కోర్టుల్లో ఇది రెండవది. శ్రీ శ్రీనివాసన్‌కే ఒబామా మద్దత్తు ఉన్నట్లు తెలుస్తోంది. -
అంతరిక్ష శోధనకు అమెరికా అండ
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ‘అమెరికన్లుగా భారత్ సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అలాగే భారతీయులపై కూడా. మీకు స్నేహితులుగా ఉండటం మాకు గర్వకారణం. మీ కలల దేశాన్ని నిర్మించుకునే క్రతువులో భాగస్వాములమైనందుకూ మేము గర్వంగానే భావిస్తాం’ అన్నారు. అమెరికా, భారత్‌ల సంబంధాలు ఈ శతాబ్ది గతిని నిర్దేశించేవని ఒబామా ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఏడాది పర్యటనలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ఉన్న సారూప్యాలను కూడా ఆయన విపులీకరించారు. రెండు దేశాలూ విజ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని ఆస్వాదిస్తాయని చెప్పారు. ‘భారత దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక ప్రాజెక్టు విజయవంతమైన ప్రతిసారి ‘వాట్ నెక్స్ట్?’ అని ప్రశ్నించేవారు. భారత్, అమెరికా అంతరిక్ష సహకారం విషయంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే... కలలను సాకారం చేసుకోవడం అని చెప్పాలి. ఇరుదేశాల భాగస్వామ్యం అంగారకుడిని జయించడంతో ఆగిపోదు... అంతకంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలదు.’ నాసా (అమెరికా) డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ దావా న్యూమ్యాన్ చెప్పిన మాటలివి. 2030 నాటికల్లా అరుణ గ్రహంపైకి వ్యోమగామిని పంపేందుకు సిద్ధమవుతున్న అమెరికా ఇందుకోసం భారత్‌తో కలిసి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా డాక్టర్ దావా న్యూమ్యాన్ ఈ అంశాలను వివరించారు. అవి ఆమె మాటలలోనే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మంగళ్యాన్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పంపిన మేవెన్లు 2014 సెప్టెంబరులో రెండురోజుల తేడాతో ఆ గ్రహపు కక్ష్యలో విజయవంతంగా తిరుగుతున్న విషయం తెలిసిందే. అంగారకుడి మీది వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ఈ రెండు ఉపగ్రహాలు పని చేస్తూ ఇరుదేశాల అంచనాలు, ఆకాంక్షలను పూర్తి చేస్తున్నాయి. అంతేకాదు... ఇస్రో, నాసాల మార్స్ వర్కింగ్ గ్రూప్ కూడా చాలా చురుకుగా పనిచేస్తోంది. బెంగళూరులో ఇటీవల ఈ రెండు బృందాలు ముఖాముఖి కలుసుకున్నాయి కూడా. భవిష్యత్తులో మామ్, మేవెన్లతోపాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో ఎలా ఒకరికొకరు సహకరించుకోవాలన్న అంశంపై వీరు చర్చలు జరిపారు. ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టడంతోపాటు ప్రపంచ ఆహార భద్రత, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో ఉపయోగపడగల నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (నిసార్) ప్రయోగానికి ఇరుదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇరుదేశాలకూ ఇది చాలా ప్రాముఖ్యం కలిగిన ప్రాజెక్టు. భారత్, అమెరికాలు రెండూ తమ శక్తిసామర్థ్యాల మేరకు ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడానికి ప్రయత్నం సాగిస్తున్నాయి. కలలను సాకారం చేసుకోవడం అంటే ఇదే. ఇదొక్కటే కాదు... రెండు దేశాలు కలసికట్టుగా చేపడుతున్న ప్రాజెక్టుల జాబితా చాలానే ఉంది. ఇరుదేశాల పరిశోధకుల ఎక్స్ఛేంజి ప్రోగ్రామ్ వీటిల్లో ఒకటైతే... వీరిద్దరూ నాసా విజిబుల్/ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఇన్స్ట్రుమెంట్ను ఇస్రో విమానంలో తీసుకెళ్లి భారత్‌లోని పలు ప్రదేశాలపై పరిశీలనలు జరపడం మరొకటి. గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వచ్చే నెల వరకూ కొనసాగనుంది. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికాల సహకారానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. నాసా, ఇస్రోలు రెండూ ఈ దిశగా ఎంతో పురోగతి సాధించాయని చెప్పకతప్పదు. తాము చేపట్టబోయే కొన్ని ప్రయోగాల గురించి ముందుగానే సమాచారం అందించడం, ఆయా ప్రాజెక్టుల్లో ఉమ్మడి ప్రయోజనాలు గుర్తించడం, సహకారానికి అవకాశమున్న అంశాల పరిశీలన కూడా జరుగుతోంది. అన్ని స్థాయిల్లోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా, పోటీతత్వంతో పనిచేస్తూ ఇరుదేశాలూ అసలు సిసలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. అంతరిక్ష రంగంలో భారత్ అమెరికాల మధ్య సంబంధాలు ఈనాటివి కావు. 1963లో నాసాకు చెందిన నైక్ అపాచే సౌండింగ్ రాకెట్‌ను భారత్ భూభాగం నుంచి ప్రయోగించినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తు లోనూ ఎర్త్, స్పేస్ సెన్సైస్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ రంగా లతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల విషయంలోనూ పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయనే మా నమ్మకం. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషన్ల వేవ్ అబ్జర్వేటరీ నిర్మిస్తా మని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలి ప్రకటన మాకు ఎంతో ఆసక్తిని కలిగించింది. ఈ శతాబ్దపు ఆవిష్కరణ గురుత్వ తరంగాలపై విస్తృత అధ్యయనానికి కలసికట్టుగా పనిచేసే మరో అవకాశం ఇది. ఐన్‌స్టీన్ వందేళ్ల క్రితం కన్నకల ఇలా సాకారమవుతోందన్న మాట. ఇందులో భారత్ అమెరికా శాస్త్రవేత్తలు పాలుపంచుకోవడం... మనం కలసికట్టుగా ఎలాంటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సమాధానాలు వెతకగల మన్న విశ్వాసాన్ని కల్పిస్తుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ‘అమెరికన్లుగా భారత్ సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అలాగే భారతీ యులపై కూడా. మీకు స్నేహితులుగా ఉండటం మాకు గర్వకారణం. మీ కలల దేశాన్ని నిర్మించుకునే క్రతువులో భాగస్వాములమైనందుకూ మేము గర్విస్తాం’ అన్నారు. అమెరికా, భారత్‌ల సంబంధాలు ఈ శతాబ్ద గతిని నిర్దేశించేవని ఒబామా ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఏడాది పర్యటనలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ఉన్న సారూప్యాలను కూడా ఆయన విపులీకరించారు. రెండు దేశాలూ విజ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని ఆస్వాదిస్తాయని చెప్పారు. ఇరువురూ చేతులు కలిపితే అంతరిక్ష రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు సాధ్యమని చంద్ర, అంగారక గ్రహాలకు ఆవలి విశ్వ రహస్యాలను ఛేదించడమూ వీలవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో కలసి జారీ చేసిన ఉమ్మడి ప్రకటనలో కూడా అంతరిక్ష రంగంలో సహకారాన్ని, వాణిజ్య సంబం ధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తాలూకు ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. నాసా తరఫున నేను ఇటీవలే భారత్‌లో పర్యటించగా... మరికొన్ని నెలల్లో నాసా అడ్మిని స్ట్రేటర్ చార్లెస్ బౌల్డెన్ ఆసియా పసిఫిక్ రిమోట్ సెన్సింగ్ సింపోజియంలో పాల్గొనేందుకు రానున్నారు. గత ఏడాది సెప్టెంబరులో అమెరికా, భారత్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం సరైన దిశలోనే ఉన్నదనేందుకు మా పర్యటనలే నిదర్శనం. గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
ఒబామాతో స్టెప్పులేసిన 106 ఏళ్ల బామ్మ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులను కలిసిన ఓ 106 ఏళ్ల బామ్మ సంతోషంతో స్టెప్పులేసింది. బామ్మ ఉత్సాహానికి ఆశ్చర్యపోయిన ఒబామా.. మీరు ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉండటం వెనుక రహస్యం ఏంటీ అని ఆమెను ప్రశ్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒబామా దంపతులంటే ఉన్న అభిమానంతో వారిని కలుసుకోవాలని వర్జీనియా మెక్ లారెన్ అనే మహిళ 2014లో వైట్‌హౌస్‌కు దరఖాస్తు పెట్టుకుంది. మెక్ లారెన్ అభ్యర్థనకు అంగీకరించిన వైట్‌హౌస్ వర్గాలు ఆదివారం ఒబామా దంపతులను కలవడానికి అవకాశం కల్పించారు. దీంతో తనకు ఎంతో ఇష్టమైన వారిని మొదటిసారి కలిసిన సంతోషంలో ఆ బామ్మ ఊతకర్ర సహాయంతోనే ఒబామా, మిచెల్‌లతో కలిసి స్టెప్పులేసింది. అనంతరం మాట్లాడుతూ.. అమెరికా మొట్టమొదటి నల్లజాతి ప్రెసిడెంట్ ఒబామాను, ఆయన సతీమణి మిచెల్‌ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. -
'ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వదిలేది లేదు'
న్యూయార్క్: ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని మాత్రం అడ్డుకోవడం జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి స్పష్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కుట్రలను ఏ దేశంలోనైనాన చేధించడానికి తాము సిద్ధమని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై తమ దేశ భద్రతా బృందానికి సూచనలు చేసిన సందర్భంగా ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. 'మా అధ్యక్షుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇసిల్(ఇస్లామిక్ స్టేట్ మరోపేరు)ను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. అవసరం అయితే, ఇతర దేశాల్లో ఆ ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను కూడా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు' అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇసిల్ ముఖ్యంగా పరిపాలన బలహీనంగా ఉన్న లిబియా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకొని తన దాడులకు కేంద్ర స్థానంగా మార్చుకుంటున్నందున అలాంటి దేశాలకు పాలన పరమైన సహాయం కూడా చేసి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రపంచంలో తమతో దౌత్యపరమైన సంబంధాలు ఉన్న దేశాలన్నింటితో కలిసి సాగేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఉగ్రవాదం విషయంలో తమ ముందున్న సవాళ్లను గురించి అమెరికా ప్రజలతో చాలా స్పష్టంగా ఒబామా మాట్లాడారని, అయితే, అది తమ దేశాన్ని ఏమీ చేయలేదని కూడా వారికి భరోసా ఇచ్చినట్లు చెప్పారు. -
ఉగ్రమూకలను అంతం చేయాలి!
పాక్‌లోని ఉగ్ర వ్యవస్థలపై ఆ దేశానికి ఒబామా విస్పష్ట సందేశం ♦ పఠాన్‌కోట్ దాడి క్షమార్హం కాని ఉగ్ర చర్య ♦ భారత్, అమెరికాలది ఈ శతాబ్ది భాగస్వామ్యం వాషింగ్టన్: పాకిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వంపై ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ‘దేశంలోని ఉగ్రసంస్థలను అంతం చేయడానికి సంబంధించి పాక్ మరింత కఠిన చర్యలు తీసుకోవాలి.. తీసుకోగలదు. పాక్‌పై నాకు నమ్మకముంది’ అన్నారు. ‘చాన్నాళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ‘క్షమార్హంకాని ఉగ్రవాదా’నికి మరో ఉదాహరణ పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి’ అన్న ఒబామా.. పాక్ గడ్డపైనున్న ఉగ్రవాద వ్యవస్థలను నిషేధించి, వాటి కార్యకలాపాలను అడ్డుకుని, నిర్వీర్యం చేయాని తేల్చిచెప్పారు. ఈ విషయంలో చిత్తశుద్ధి చూపేందుకు పాక్‌కు ఇదే సమయమని పీటీఐకి ఆదివారమిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారత్-యూఎస్ సంబంధాలు, ఉగ్రవాదం, తదితరాలపై ఆయననేమన్నరంటే. ► స్వదేశంలో ఉగ్రవాదులకు, ఉగ్ర సంస్థలకు సహకరించడాన్ని పాక్ ఎట్టిపరిస్థితుల్లో సహించకూడదు. పఠాన్‌కోట్ దాడుల తర్వాతద పాక్ ప్రధానితో సంప్రదింపుల విషయంలో భారత ప్రధాని మోదీ ప్రశంసనీయ చొరవ చూపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాద నిర్మూలకపై చర్చల్లో ఇద్దరూ ముందడుగు వేస్తున్నారు. ► పాక్‌లో అభద్రత ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ప్రమాదకరమని షరీఫ్ గుర్తించారు. పెషావర్ సైనిక పాఠశాలపై పాశవిక ఉగ్రదాడి అనంతరం తరతమ తేడా చూపకుండా అన్ని ఉగ్రసంస్థల అంతానికి ప్రతిన బూనారు. అదే సరైన మార్గం. ఆ తరువాత పాక్‌లోని కొన్ని ఉగ్రసంస్థలపై షరీఫ్ చర్యలు తీసుకోవడం చూశాం. ► ఈ శతాబ్దపు నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో భారత్, అమెరికాలది ఒకటి. మాతో దృఢ భాగస్వామ్యం కావాలని మోదీ బలంగా కోరుకున్నారు. అందులో భాగంగానే మా రెండు కార్యాలయాల మధ్య సురక్షిత హాట్‌లైన్ ఏర్పాటైంది. ద్వైపాక్షిక సంబంధాల పూర్తిస్థాయి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. నా భారత పర్యటనతో పరస్పర సహకారంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ► రైతు, సంక్షేమం, అందరికీ విద్యుత్తు, పేదరిక నిర్మూలన తదితరాల్లో విశ్వసనీయ భాగస్వాములుగా భారత్, అమెరికాలు రూపొందాయి. -
ఒబామా షియానా, సున్నీనా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశ రాజకీయాల్లోకి వచ్చిన దశాబ్దం కాలం నుంచి ఆయన ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన సున్నీ తెగకు చెందిన ముస్లిం అని, కాదు షియా తెగకు చెందిన ముస్లిం అంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఇప్పటికి కూడా తెరపడలేదు. ఒబామాకు షియా ముస్లిం మూలాలు ఉండడం వల్లనే ఇరాన్‌తో అమెరికాకు అణు ఒప్పందం కుదిరిందన్న ప్రచారం తాజాగా ఊపందుకొంది. దశాబ్దాలుగా ఇరాన్‌తో అణ్వస్త్రాల అంశం వివాదాస్పదంగా ఉండగా, గత జూలై నెలలోనే ఇరాన్‌తో అమెరికాకు అణు ఒప్పందం కుదిరింది. ఈ కారణంగా ఇరాన్‌పై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వైట్‌హౌజ్ ఇటీవల ప్రకటించింది. ఇరాన్‌తో అణు ఒప్పందానికి కూడా షియాలు ఎక్కువగా ఉన్న ఇజ్రాయెల్ తోడ్పడిందని దుబాయ్ జనరల్ సెక్యూరిటీ అధిపతి దాహి ఖల్ఫాన్ తమీమ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌లోని షియా ప్రాంతాలను ఒబామా త్వరలో పర్యటించే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. తమీమ్ అనామక వ్యక్తేం కాదు. దుబాయ్ మాజీ పోలీసు చీఫ్. ఆయనకు ట్విట్టర్ ఖాతాలో 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఒబామా గురించి చేసే వ్యాఖ్యలను వేలాది మంది షేర్ చేసుకుంటారు. ఒబామాకు షియా నేపథ్యం ఉండడం వల్లనే ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరిందని ఇరాకి పార్లమెంట్ సభ్యుడు తహా అల్ లాహిబీ కూడా ఆ మధ్య ఆన్లైన్ వీడియోలో వ్యాఖ్యానించారు. అదే సమయంలో సిరియా రచయిత ముహిద్దీన్ లజికాని లండన్‌కు చెందిన అల్ హివర్ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఒబామా కెన్యాలోని షియా మతస్థుడికి పుట్టిన కొడుకని అన్నారు. ఒబామా మధ్య పేరు హుస్సేన్ అని, ఆ పేరు షియా ముస్లింల గురువదని, అందుకే షియా ముస్లింలు ఎక్కువ మంది హుస్సేన్ అని పేరు పెట్టుకుంటారని అన్నారు. వాస్తవానికి సున్నీలు, ముస్లిం ఏతరులు కూడా ఎక్కువ మంది హుస్సేన్ పేరు పెట్టుకుంటారు. ఒబామా తల్లితో విడిపోయిన తండ్రి కెన్యాకు చెందిన ముస్లిం అని, ఆ తర్వాత ఆయన హేతువాదిగా మారారన్న వాదన ఉంది. సున్నీలు ఎక్కువగా ఉండే కెన్యా మూలాలు ఉన్నందున ఒబామా సున్నీ తెగకు చెందిన ముస్లిం అన్న ప్రచారమూ జరిగింది. ఒబామా తల్లి ఇండోనేసియాకు చెందిన సున్నీని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్లపాటు ఒబామా ఆ దేశంలోనే ఉన్నందున ఆయనకు సున్నీ మూలాలు ఆన్నాయనే వాదనా ఉంది. ఇండోనేసియాలో ఒబామా తొలుత క్రిస్టియన్ స్కూల్లో, ఆ తర్వాత ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. ఇలాంటి ప్రచారం ఎక్కడిదాకా వెళ్లిందంటే ఒబామా ఉత్తర్వుల కారణంగా ఇస్లాం స్టేట్ సున్నీ తీవ్రవాదులకు అమెరికా మద్దతు ఇస్తోందని ఇరాక్‌లో ఎక్కువ మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజమేనని ఇరాక్ షియా ప్రైవేట్ సైన్యం కమాండర్ ముస్తఫా సాది మీడియా ముందు ఆరోపించారు. ఒబామా షియా ముస్లిం అని, కాదు సున్నీ అని నిరూపించేందుకు కొందరు అరబిక్ సోషల్ మీడియాలో నకిలీ వీడియోల ద్వారా ప్రచారం కూడా చేశారు. అమెరికన్లలో కూడా ఒబామా ముస్లిం అని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. 2014లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం రిపబ్లికన్లలో 54 శాతం మంది ఒబామాను ముస్లిం అని విశ్వసిస్తున్నారు. ఏదేమైనా ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్ అనే స్థానానికి మాత్రం ఢోకా రాలేదు. -
అక్రమ వలసలపై సమీక్షకు యూఎస్ సుప్రీం సై
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న దాదాపు 40 లక్షల మంది విదేశీయులకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని సమీక్షించేందుకు యూఎస్ సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో వలస వచ్చిన వారే కీలకం కావటంతో.. దీనిపై దుమారం రేగుతోంది. అక్రమంగా నివాసం ఉంటున్న వారందరినీ చట్టబద్ధం చేసేందుకు ఒబామా తన ఎగ్జిక్యూటివ్ అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించటంపై దిగువ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సంవత్సరం కావటంతో.. తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థనతో దీనిపై సమీక్షించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. ఏప్రిల్‌లో ఈ కేసు విచారణ జరగనుండగా.. జూన్ చివరికల్లా తీర్పు వెలువడనుంది. -
నేడు ఒబామా ‘యూనియన్’ ప్రసంగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా తన ఎనిమిదేళ్ల అధ్యక్ష పదవీ కాలంలో ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’లో మంగళవారం చివరి ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన సతీమణి మిషెల్ ఒబామా భారతీయ అమెరికన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఆహ్వానించారు. అమెరికా మొదటి పౌరురాలికి చెందిన గెస్ట్ బాక్స్‌లో తుపాకీ హింస బాధితుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచనున్నారు. భయానక తుపాకీ హింసకు జీవితాలు తారుమారై వికలాంగులుగా జీవిస్తున్న అమెరికన్లకు మద్దతుగా ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నట్లు వైట్‌హౌజ్ పేర్కొంది. 48 ఏళ్ల సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ సంస్థ కే-12 క్లాస్రూంలు, ‘టీచ్.ఓఆర్జీ’ ద్వారా ఉపాధ్యాయ వృత్తికి ప్రోత్సాహాన్నిస్తూ కంప్యూటర్ సైన్స్‌ను ఎక్కువ మందికి అందేలా పనిచేస్తూ లీడర్‌గా అవతరించిందని వైట్‌హౌజ్ తెలిపింది. -
బొమ్మలు కొన్నట్లు తుపాకులు కొనేసుకుంటున్నారు..
ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా గన్ కల్చరే కనిపిస్తోంది. షాపింగ్ మాల్స్ లో ఆటబొమ్మలు కొన్నట్లుగా తుపాకులను కొనేసుకుంటున్నారు. టెక్సాస్ నుంచి మైన్ వరకు తుపాకీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చేతిలో గన్ లేకుండా కాలు బయట పెట్టేందుకూ ఇప్పుడు అమెరికన్లు ఆలోచిస్తున్నారు. చివరకు తుపాకీ పేల్చడంలో శిక్షణ కూడ తీసుకుంటున్నారు. ఆత్మరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అమెరికన్లు తుపాకీలు కొనేందుకు క్యూ కడుతున్నారు. ఉగ్ర భయం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో... ఆందోళన చెందుతున్న జనం... ప్రాణ రక్షణ కోసం తుపాకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్కడ రికార్డు స్థాయిలో గన్ సేల్స్ పెరిగిపోయింది. ముఖ్యంగా 2015 ఫెడరల్ డేటా ప్రకారం చూస్తే అమెరికాలో తుపాకీ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఫెడరల్ బ్యాగ్రౌండ్ చెక్ సిస్టమ్ ప్రారంభమైన 1998 నుంచి పరిశీలిస్తే... 23.1 మిలియన్లకు చేరిన కొనుగోళ్ళు.. గత సంవత్సరం అత్యధిక సంఖ్యలో సుమారు పది శాతం పెరిగాయి. 2015 బ్లాక్ ఫ్రైడే సందర్భంగా జరిగే అమ్మకాలతో పోలిస్తే... ఈసారి అత్యధిక సంఖ్యలో తుపాకీ కొనుగోళ్ళుపెరిగాయి. దీంతో బ్లాక్ ఫ్రైడే.. గన్స్ సేల్స్ డే గా పరిణమించింది. సంవత్సరాంతంలో శాన్ బెర్నార్డినో కాల్పుల అనంతరం.. హింసను అరికట్టేందుకు అధ్యక్షుడు ఒబామా తుపాకీ అమ్మకాలపై పరిమితులు విధిస్తూ ఓ ప్యాకేజీని కూడ ప్రవేశ పెట్టారు. అయితే ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రికార్డులకు, తుపాకీల అమ్మకాలకు సరిపోలడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఉన్న పరిమితులను బట్టి ఒక్కోలా అమ్మకాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఎఫ్‌బీఐ రికార్డులు మాత్రం 2015 లో తుపాకీల లావాదేవీలు అత్యధిక స్థాయిలో పెరిగినట్లు చెప్తోంది. అంతేకాక సామాజిక సర్వేల్లో కూడా గత సంవత్సరం ఆల్కహాల్, టుబాకో, విస్ఫోటనాలు, మందుగుండు సామగ్రి పరిశ్రమల అభివృద్ధితో పోలిస్తే ఎక్కువగా తుపాకీల పరిశ్రమల అభివృద్ధే పెరిగినట్లు తేలింది. మొదటిసారి తుపాకులను కొనేవారి కంటే యజమానులు మరిన్ని తుపాకులను కొని తమ ముందు తరాల వారికోసం నిల్వ చేసుకోవడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే కొత్త పరిమితుల అమలు నేపథ్యంలో ఈ రికార్డు స్థాయి తుపాకీల అమ్మకాలు జనవరితో ముగిసే అవకాశం కనిపిస్తోంది. -
ఐఎస్ఐఎస్ సృష్టికర్తలు ఒబామా, హిల్లరీనే!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ విధానాల వల్లే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పురుడు పోసుకుందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. మిసిసిపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒబామా, క్లింటన్ విధానాలపై దుమ్మెత్తిపోశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూపు ఎదుగుదలకు వారే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. 'నేను గతంలోనే చెప్పాను. 'చమురు తెచ్చుకొండి. చమురును అధీనంలోకి తీసుకోండి. చమురును నిల్వ ఉంచండి' అని మూడేళ్లుగా నేను చెప్తూనే ఉన్నా. కానీ ప్రతి ఒక్కరూ ' అది మేం చేయలేం. అది సారభౌమాధికార దేశం. అక్కడ దేశం లేదు' అంటూ కారణాలు చెప్పారు. వాళ్లే ఐఎస్ఐఎస్ను సృష్టించారు. ఒబామాతో కలిసి హిల్లరీ క్లింటన్నే ఐఎస్ఐఎస్ను సృష్టించింది' అని ట్రంప్ ఆరోపించారు. చమురు కోసం పొరుగుదేశం సౌదీ అరేబియాను తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ఇరాన్ భావిస్తోందని ఆయన విమర్శించారు. -
బాబు భజన బృందం కిమ్మనడం లేదెందుకో?
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఈగ వాలనివ్వని భజన బృందం ఈ మధ్య కొన్ని అంశాల్లో కిమ్మనడం లేదట. ముఖ్యంగా ఎవరైనా చంద్రబాబును సునిశితంగా విమర్శించినా తట్టుకోలేక ఒంటికాలిపై లేచే అమాత్యులు కొందరు తమ నోటికి పని చెప్పడం లేదు. చంద్రబాబుపై ఏదైనా విమర్శ వచ్చినప్పుడు ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెట్టి తమ స్వామి భక్తి చాటుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల బాబు డాక్టరేట్ గుట్టురట్టైనా, సోషల్ మీడియాలో షికాగో స్టేట్ యూనివర్శిటీ డాక్టరేట్ అంశం హల్చల్ చేసినా నోరు మెదపకపోవడంపై ఏమై ఉంటుందబ్బా.. అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట. ప్రచారానికి, ఎదురుదాడికి బ్రాండ్ అంబాసిడర్లుగా ముద్రపడిన బాబు అండ్ కో మౌనముద్ర దాల్చడంపైనా రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఆ మధ్య చినబాబు, అమెరికా అధ్యక్షుడు ఒబామా అపాయింట్మెంట్పైనా పెద్ద చర్చ నడిచింది. ఒబామా అపాయింట్మెంట్ చినబాబుకు ఎలా దక్కిందో.. అటు సోషల్ మీడియాతో పాటు ఇటు పత్రికల్లోనూ విసృ్తత ప్రచారం నడిచింది. ఆ సమయంలోనూ తమ్ముళ్లు ఎక్కడా నోరు పారేసుకోలేదు. అంటే మౌనం అర్ధాంగీకారమే కదా.. అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారట. -
ఏప్రిల్ నుంచి వీసా ఫీజుల మోత
ఫైలుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్: అమెరికాలోని భారత ఐటీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని భారీగా వడ్డించిన వీసా ఫీజులు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఇప్పటికే ఆమోదించగా... ఈ ఫైలుపై అధ్యక్షుడు ఒబామా శుక్రవారం సంతకం చేశారు. దీంతో హెచ్1బీ వీసాకోసం సుమారు రూ. 2.7 లక్షలు, ఎల్1 వీసా కోసం రూ. 3.2 లక్షలు చెల్లించాల్సి రానుంది. పెంచుకుంటూ పోతున్న అమెరికా..: అమెరికాలోని ఐటీ సంస్థల్లో పనిచేసేందుకు వచ్చే విదేశీ నిపుణుల కోసం హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. అసలు హెచ్1బీ దరఖాస్తు ఫీజు సుమారు రూ. 20 వేలు (325 డాలర్లు). 2005లో ‘ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఫీజు’ పేరుతో రూ. 33,000 (500 డాలర్లు) వడ్డించారు. ఆ తర్వాత ‘ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఫీజు’ పేరిట 25 మందికంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలకు హెచ్1బీ వీసాపై సుమారు రూ. లక్ష (1,500 డాలర్లు) ఫీజు విధించారు. తాజాగా ప్రత్యేక ఫీజును సుమారు రూ. 3 లక్షలకు పెంచింది. ఇక వీటన్నింటికీ తోడు హెచ్1బీ వీసాల దరఖాస్తులను 15 రోజుల్లోపే పరిశీలించేందుకు రూ. 80 వేలు (1,225 డాలర్లు) వసూలు చేస్తుంది. వీటన్నింటికి తోడు వీసా దరఖాస్తులను ఫైలింగ్ చేసేందుకూ రూ. 60 వేల నుంచి రూ. లక్ష దాకా చెల్లించాల్సిందే. అంటే మొత్తంగా భారత కంపెనీలు ఒక్కో హెచ్1బీ వీసా కోసం రూ. 6 లక్షలు కట్టాలి. -
పారిస్ ఆశలు
పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో రెండు వారాలపాటు ఏకధాటిగా సాగిన చర్చలు, వాదోపవాదాల అనంతరం శనివారం 196 దేశాలు ఒక ఒప్పందానికొచ్చాయి. ఇది చరిత్రాత్మకమని పలు దేశాధినేతలంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇంకొంచెం ముందుకెళ్లి ఇది అమెరికా నాయకత్వం సాధించిన విజయంగా చెప్పుకున్నారు. ఒప్పందం చూసినవారు కూడా ఇదంతా నిజమేనని నమ్ముతారు. ఎందుకంటే 31 పేజీల ఆ ఒప్పందంలో అందుకు బోలెడు దాఖలాలున్నాయి. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయాలని, దాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కే తగ్గించడానికి ప్రయత్నించాలని అది చెబుతున్నది. దీర్ఘకాలంలో అన్ని దేశాలూ కర్బన ఉద్గారాల ఊసేలేని ఆర్థిక వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. 2050-2100 మధ్యకల్లా ధనిక, పేద తేడా లేకుండా దేశాలన్నీ దీన్ని సాధించితీరాలన్నది. ఉద్గారాల తగ్గింపు అంశంలో ఏ దేశం తీరు ఎలా ఉన్నదో అయిదేళ్లకోసారి సమీక్షించాలని కూడా నిర్ణయించింది. అంతేకాదు...దేశాలన్నిటికీ ఉమ్మడి బాధ్యతను కట్టబెడుతూనే ధనిక, బీద దేశాల వ్యత్యాసాన్ని కూడా ఒప్పందం పరిగణనలోకి తీసుకుంది. ఇన్ని అనుకూలాంశాలున్నాయి గనుక పారిస్ ఒప్పందం ఒక ముందడుగేనని చాలామంది చెబుతున్నారు. కానీ ఉద్గారాల తగ్గింపునకు వివిధ దేశాలిచ్చిన స్వచ్ఛంద హామీలనన్నటినీ గుదిగుచ్చినా భూతాపం 2 డిగ్రీల సెల్సియస్‌లోపు ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలంటున్నారు. ఏం చేయాలన్న విషయంలో మాత్రమే పారిస్‌లో అవగాహన కుదిరింది. ఎలా చేయాలో, అందుకు నిర్దిష్టంగా అనుసరించవలసిన కార్యాచరణేమిటో స్పష్టం చేసి, దాన్ని సాధించని పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో ఒప్పందం చెప్పి ఉంటే వేరుగా ఉండేది. అందువల్ల అందరికీ భరోసా ఏర్పడేది. ఒప్పందానికి చట్టబద్ధత లేకపోతే సంపన్న దేశాలు దానికి కట్టుబడి ఉంటాయని నమ్మేదెలా? లాభాపేక్ష తప్ప ధరిత్రి క్షేమం పట్టని సంపన్న దేశాలు భారీయెత్తున వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ప్రపంచాన్ని చుట్టుముట్టిన కర్బన కాలుష్యంలో వాటి వాటా 70 శాతం పైబడేనని వివిధ గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత 1850 మొదలుకొని 2011 వరకూ విడుదలైన కర్బన ఉద్గారాల్లో అమెరికా వాటా 27 శాతం, యూరోప్ దేశాల భాగం 28 శాతం అని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. చైనా 11 శాతం, రష్యా 8 శాతం కాలుష్యానికి కారణమయ్యాయి. మన దేశం వాటా 3 శాతం మించలేదు. పర్యావరణ ధ్వంసానికి తామే ప్రధాన కారకులమన్న స్పృహను ప్రదర్శించి అందుకు తగినట్టుగా పెద్దయెత్తున కోత విధించుకోవాల్సింది పోయి సంపన్న దేశాలు పేచీకి దిగాయి. అందరికీ సమానంగా బాధ్యతలు పంచాలని డిమాండ్ చేశాయి. మరోవైపు కాలుష్యాన్ని వడబోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు ఉదారంగా అందించేందుకు సైతం అవి ముందుకు రావడంలేదు. కర్బన ఉద్గారాలపై విధించే కోతలోనూ అవి వ్యాపార ప్రయోజనాలను వెదుక్కుంటున్నాయి. కోత కారణంగా వర్ధమాన దేశాల్లో పరిశ్రమల స్థాపనకు వీలు కుదరని స్థితి ఏర్పడితే తమ సరుకులకు గిరాకీ ఏర్పడుందని...స్థాపించాలని నిర్ణయించుకుంటే తమ కాలుష్య వడబోత టెక్నాలజీకి మంచి ధర వస్తుందని అవి లెక్కలేసుకుంటున్నాయి. పారిస్ ఒప్పందంలో టెక్నాలజీ ఊసెత్తకుండా 2020 తర్వాత పేద దేశాల కోసం ఏటా 10,000 కోట్ల డాలర్లు నిధులు సమకూరుస్తామని, భవిష్యత్తులో దీన్నింకా పెంచుతామని అవి తెలిపాయి. నిజానికి ఈ డబ్బంతా మళ్లీ ఆ దేశాలకే చేరుతుంది. ఎందుకంటే 2022 నాటికి పుష్కలంగా పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉంటే తప్ప కర్బన ఉద్గారాలకు కోత పడటం సాధ్యం కాదు. మళ్లీ ఆ టెక్నాలజీ సైతం సంపన్న దేశాలవద్దే ఉంది గనుక దాన్ని డబ్బు పోసి కొనుక్కొనక తప్పని స్థితి పేద దేశాలకుంటుంది. కనుక పేద దేశాల కోసం నిధులతోపాటు వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడానికి ధనిక దేశాలు ఏం చేయబోతాయో పారిస్ ఒప్పందం స్పష్టంగా చెప్పి ఉంటే కాస్తయినా ఉపయోగం ఉండేది. అలాగే భూతాపోన్నతివల్ల సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండే దేశాల్లోని ప్రజలు పెద్దయెత్తున వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో ధనిక దేశాలు తీసుకోవాల్సిన బాధ్యతల గురించి కూడా ఒప్పందం ప్రస్తావించలేదు. ఈ లోటుపాట్లు గమనిస్తే పారిస్‌లో రాజకీయంగా ఆలోచించి నిర్ణయాలు చేశారే తప్ప మానవాళికి ఎదురుకాబోయే సవాళ్లు, వాటిని ఎదుర్కొనవలసిన తీరుతెన్నులపై శాస్త్రీయ అవగాహనతో దృష్టిపెట్టలేదని అర్ధమవుతుంది. శిలాజ ఇంధనాలు రోజురోజుకూ అడుగంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే కాలం సౌరశక్తిదే. దానివైపుగా కదలాలని చెప్పడం బాగానే ఉన్నా అది ఎంత వేగంగా జరగాలి...దానికి దేశాలన్నీ ఏం చేయాలన్న దిశా నిర్దేశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావించిన 'వాతావరణ న్యాయం' అనే పదం ఒప్పందంలోని పీఠికకే పరిమితమైంది తప్ప ఇతరచోట్ల దానికి అనుగుణమైన ప్రతిపాదనలు లేవు. వచ్చే ఏప్రిల్‌నుంచి అమల్లోకి రాబోయే పారిస్ ఒప్పందం కార్యాచరణ ఎలా ఉన్నదో చూడటానికి 2018లో వాతావరణ మార్పులకు సంబంధించిన కమిటీ సమావేశమవుతుంది. ఆపై మరో రెండేళ్లకు ఒత్తిళ్లు మొదలవుతాయి. ఈలోగా ప్రస్తుత ఒప్పందానికి అనుగుణంగా ప్రతి దేశమూ తమ చట్టాలను సవరించుకుని తగిన కట్టుదిట్టాలు చేసుకోవాల్సి ఉంటుంది. 2030కల్లా సౌరశక్తితోసహా మొత్తంగా 200 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులు సమీకరిస్తామని మన దేశం లోగడే లక్ష్య నిర్దేశం చేసుకుంది. కనుక ఆ రంగంలో భారీయెత్తున పెట్టుబడులు అవసరమవుతాయి. సంపన్న దేశాలు పారిస్‌లో ముఖం చాటేసిన నేపథ్యంలో ఇదంతా ఏమేరకు సాధ్యమవుతుందో వేచిచూడాలి. పారిస్ శిఖరాగ్ర సదస్సుకు ముందు కర్బన ఉద్గారాల్లో తమ దేశం రెండో స్థానంలో ఉన్నదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అంగీకరించారు. దాన్ని పరిష్కరించుకుంటామన్న హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుత ఒప్పందం ఆ విషయంలో ఆశావహంగా లేదు. 1992 నాటి రియో డి జెనైరో సదస్సుతో పోలిస్తే అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఎలాగైతేనేం ఒక ఒప్పందానికి రాగలిగాయని సంబరపడితే పడొచ్చుగానీ మంచి ఫలితాలు రావాలంటే ఆచరణలో అది మరింత పదునెక్కాలి. -
ఏకాభిప్రాయానికి చివరిరోజు
కాప్-21లో ‘భారత సూచన’లకు పట్టుబడుతున్న యూఎస్ పారిస్: వాతావరణ మార్పులపై రూపొందించిన ఒప్పంద ముసాయిదాపై 11 రోజులుగా మేధోమథనం జరుగుతోంది. దీనికి తుదిరూపు ఇచ్చేందుకు ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలుంది. అయినా ఇంత వరకు ఒప్పందంపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి సభ్యదేశాల మంత్రులంతా సమావేశం కానున్నారు. కాగా, భారత్ ప్రతిపాదించిన నియమాల అమలు అవసరమని.. దీనిపై సభ్యదేశాలు ఆలోచించాలని అమెరికా సూచించింది. బుధవారం నాటి ఒబామా-మోదీ ఫోన్ సంభాషణ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. భారత మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమయ్యారు. సమావేశ వివరాలను వెల్లడించనప్పటికీ.. భేటీ సంతృప్తికరంగా సాగిందని.. పర్యావరణ మార్పులపై భారత్-అమెరికా సంయుక్తంగా పోరాటం చేయనున్నాయని జవదేకర్ తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి చేసేందుకు పారిస్ సదస్సు వేదికని జాన్ కెర్రీ తెలిపారు. అయితే.. ఉద్గారాల విషయంలో అందరూ ఒకతాటిపైనే ఉన్నా.. పేద దేశాలకు ఆర్థిక సాయం చేయటం, పర్యావరణ మార్పులతో నష్టపోతున్న దేశాలకు పరిహారం అందించటం విషయంలోనే ఏకాభిప్రాయం రావటం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. అయితే.. ఒప్పందంలో అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. -
‘అసద్ తొలగితే అంతర్యుద్ధానికి ముగింపు’
మనీలా: సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ అధికారం నుంచి వైదొలగితేనే ఆ దేశంలో అంతర్యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరుగుతున్న సదస్సు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘‘అసద్ అధికారంలో ఉండగా సిరియాలో అంతర్యుద్ధం ముగుస్తుందని నేను భావించడం లేదు. ఆయన హయాంలో అంతర్యుద్ధం, సాధారణ పౌరులపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆయన అధికారంలో ఉండేందుకు అక్కడి ప్రజలు అంగీకరించరు..’ అని పేర్కొన్నారు. అసద్‌కు గట్టి మద్దతుదారైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒబామా భేటీ అయిన కొద్దిరోజులకే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసద్‌ను తొలగించాలని అమెరికా, దానికి అంగీకరించబోమని రష్యా గట్టి పట్టుదలతో ఉన్నాయి. కానీ ఈ భేటీ సందర్భంగా ఇద్దరూ సిరియాపై ఓ ఒప్పందానికి వచ్చారని, అందువల్లే అసద్‌ను తొలగించాలంటూ ఒబామా చెప్పారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఐఎస్‌కు వ్యతిరేకంగా సంకీర్ణ సేన !
వాషింగ్టన్: పారిస్‌పై ఉగ్రవాద దాడులు ఐఎస్‌కు వ్యతిరేకంగా మిలిటరీ సంకీర్ణ సేన ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని సృష్టించాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీని గురించి తక్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అయితే హింసాత్మక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి ఇప్పటికిప్పుడే అమెరికా లేదా అంతర్జాతీయ సేన వైమానిక దాడులు చేయడం సరికాదని వారు భావిస్తున్నారు. పాతకాలంలోలాగ ఐఎస్ఐఎస్పై తిరిగి బాంబు దాడి చే యలేమని విశ్లేషకుడు ఆంథోని కార్డెస్మన్ అభిప్రాయపడ్డారు. మరోపక్క.. పారిస్‌పై ఉగ్ర దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా తమ జాతీయ భత్రతామండలి(ఎన్ఎస్సీ) సిబ్బందితో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. -
ఒబామా దీపావళి విషెస్
దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఫోన్ చేసి.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. కాగా... అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లోనూ దీపావళి సంబరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రితం వేద మంత్రాల మధ్య.. వైట్ హౌస్ లో దీపావళి ఒబామా పండగ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి అని పేర్కొన్నారు. -
ఫోర్బ్స్ జాబితాలో ముందుకెళ్లిన మోదీ
న్యూయార్క్: ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు. మొత్తం 73మందితో కూడిన ప్రపంచ శక్తిమంతుల జాబితా-2015ను ఫోర్బ్స్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ జాబితాలో గత ఏడాది మోదీ 15వ స్థానంలో నిలిచారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఈసారి జర్మనీ వైఎస్ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ రెండో స్థానం, గతేడాది రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడో స్థానంలో ఉన్నారు. ఇక, మోదీ తర్వాత భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 36 స్థానంలో ఉండగా భారత సంతతికి చెందిన లక్ష్మీ మిట్టల్ 55, సత్యనాదెళ్ల 61 స్థానంలో నిలిచారు. టాప్ టెన్ శక్తిమంతులు వీరే... 1. వ్లాదిమిర్ పుతిన్ (63) 2. యాంజెలా మెర్కెల్ (61) 3. బరాక్ ఒబామా (54) 4. పోప్ ఫ్రాన్సిస్ (78) 5. జి జిన్ పింగ్ (62) 6. బిల్ గేట్స్ (78) 7. జానెట్ ఎల్లెన్ (69) 8. డేవిడ్ కామెరాన్ (49) 9. నరేంద్ర మోదీ (65) 10. లారీ పేజ్ (42) -
'సద్దాం హుస్సేన్ ఉంటే ప్రపంచం బాగుండేది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ బతికుంటే ప్రస్తుత ప్రపంచం బాగుండేదన్నారు. సీఎన్ఎన్ ఛానల్ నిర్వహించిన 'స్టేట్ ఆఫ్ ద యూనియన్' టాక్ షోలో ట్రంప్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్లపై ఘాటైన విమర్శలు చేశాడు. తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి ఒబామా, హిల్లరీ అనుసరించిన విధానాలే కారణమన్నారు. ఇరాక్‌లో మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పాలనలో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అలాగే లిబియాలో ప్రస్తుతం ఉన్న అరాచకాలు గఢాఫీ పాలనా కాలంలో లేవని అన్నారు. ఇరాక్, లిబియా, సిరియా దేశాల్లో ప్రజల తలలను నరికేస్తున్నారనీ, ఇరాక్ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే స్థలంగా మారిందని అన్నారు. నియంతల పాలనలో కూడా ఇలాంటి క్రూరమైన ఘటనలు జరగలేదన్నారు. ఈ దేశాలలో ప్రజలు ఒబామా, హిల్లరీల విధానాలకు వ్యతిరేకంగా రగిలిపోతున్నారన్నారు. అగ్రరాజ్యం చేతిలో 2003లో పదవీచ్యుతుడై, తన నియంతృత్వ పోకడలకు 2006లో ఉరిశిక్షకు గురైన సద్దాం హుస్సేన్, నాలుగు దశాబ్దాల పాటు నియంతృత్వ విధానాలతో లిబియాను పాలించి 2011లో హతమైన గఢాఫీల పాలన ఉంటే ప్రస్తుతం ప్రపంచం బాగుండేదన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు..తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి అగ్రరాజ్యమే కారణమనే సంకేతాలతో సంచలనం సృష్టిస్తున్నాయి. -
'భారత్‌తో సంబంధాలకు ఒబామా అత్యంత ప్రాధాన్యత'
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీతో గల సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని వైట్‌హౌస్ డిప్యూటీ సెక్రటరీ ఎరిక్ షుల్జ్ ప్రకటించారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన సంబంధాల విస్తరణ లాంటి అంశాలలో ఒబామా, మోదీతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారని శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో షుల్జ్ తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వైట్‌హౌజ్ ప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, భారత్‌లు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని, వీటికి ఒబామా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని షుల్జ్ ప్రకటించాడు. -
భారత్ ఆయుధాల వల్లే ప్రతిచర్యలు
పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్య వాషింగ్టన్: భారత్ చర్చలకు తిరస్కరిస్తూ కొన్ని శక్తుల సాయంతో ఆయుధాలను పెంచుకోవటం, ప్రమాదకర సైనిక విధానాలను అవలంబించటం చేస్తోందని.. దీనివల్ల పాకిస్తాన్ సమర్థవంతమైన హెచ్చరికను కొనసాగించటానికి ప్రతిచర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్లో.. అమెరికా పార్లమెంటుకు చెందిన మేధో సంస్థ యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో మాట్లాడారు. తాను రెండున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చాక భారత్ తో సంబంధాన్ని మెరుగుపరచటం కోసం నిజాయితీగా ప్రయత్నాలు చేశానని.. మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించానని చెప్పారు. దీనివల్ల వచ్చిన కదలిక.. గత ఆగస్టులో ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను కుంటి సాకులతో రద్దుచేయటంతో ముగిసిపోయిందన్నారు. ‘ఉగ్ర’గ్రూపులన్నింటిపైనా చర్య తీసుకోవాలి: అమెరికా వాషింగ్టన్: ఉగ్రవాద గ్రూపులన్నింటిపైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇందులో తేడాలుండరాదని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. భారత్-పాక్ శాంతి చర్చల ప్రక్రియలో ఇరు దేశాలు ఉమ్మడిగా అడిగితే తప్ప తనకు తానుగా ఎలాంటి పాత్ర పోషించేది లేదని తేల్చిచెప్పింది. అన్ని మిలిటెంటు గ్రూపులపైనా నిబద్ధతతో చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి తాము స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ ఎరిక్ షుల్జ్ మీడియాకు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో గురువారం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 90నిమిషాల పాటు చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఐరాస తీర్మానాలను అనుసరించి లష్కరే తోయిబా, దాని అనుబంధ ఉగ్రవాద గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటానని షరీఫ్ ఒబామాకు తెలిపినట్లు పేర్కొన్నారు. పాక్‌తో అణు ఒప్పందం లేదు: అమెరికా పాకిస్తాన్‌తో భారత్ తరహా అణు ఒప్పందం ఏదీ లేదని అమెరికా కొట్టి పారేసింది. ఈ విషయమై అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు తప్పని సీనియర్ అమెరికా అధికారి స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల నేతలు పాక్ అణు భద్రతపై చర్చలు సాగించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి అణ్వస్త్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పాక్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికా భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి తమ సహకారం ఉంటుందని.. దీనిపై పాక్‌తో భవిష్యత్తులోనూ చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కశ్మీర్ వివాద పరిష్కారం కోసం జోక్యం చేసుకోడానికి అమెరికానే సరైందని నవాజ్ షరీఫ్ శుక్రవారం అమెరికా సెనేటర్లతో అన్నారు. భారత్‌తో శాంతికి సంబంధించి తాను ప్రతిపాదించిన 4 ప్రతిపాదనలపై ఆయన పలువురు సెనేటర్లతో చర్చించారు. -
అనుకోని అతిథి... ఒబామా!
అనుకోని అతిథి వస్తే ఆ నందమే వేరు... ఆ వచ్చింది ఏకంగా ఓ దేశానికి ప్రెసిడెంట్ అయితే.. ఇక చెప్పాల్పిందేముంటుందీ? శాన్ ఫ్రాన్సిస్కో లోని గోల్ఫ్ కోర్స్ వెడ్డింగ్ లో అదే జరిగింది. స్టెఫానీ, బ్రియాన్ టోబ్స్ పెళ్ళికి... అనుకోకుండా వచ్చి.. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా సందడి చేయడం అక్కడి వారందరినీ ఆనందంలో ముంచెత్తింది. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ప్రెసిడెంట్ బారాక్ ఒబామా పుణ్యం, పురుషార్థం కలసి వస్తుందనుకున్నారో ఏమో... లాజొల్లాలోని టొర్రే పైన్స్ గోల్ఫ్ కోర్స్ లో ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యారు. మరి కాసేపట్లో పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుండగా... అమెరికా అధ్యక్షుడి రక్షణ సిబ్బంది హడావుడి మొదలు పెట్టారు. జరుగుతున్న కార్యక్రమం త్వరగా ముగించండి... లేదా కాసేపాగి జరుపుకోండి అంటూ హంగామా చేశారు. ఇంతట్లో అక్కడకు చేరిన ప్రెసిడెంట్ గారు వధూ వరులకు బ్లెస్సింగ్స్ చెప్పి, మంచి బహుమతిని అందజేశారు. అదే చేత్తో ఓ రౌండ్ గోల్ఫ్ ఆడి.. పెళ్ళివారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముందుగా ఆ హడావుడి అంతా ఎందుకు జరుగుతోందో అర్థంకాని ఫొటో గ్రాఫర్లు.. సీక్రెట్ సర్వీసెస్ కు చెందిన రెండు ఎస్ యు వీలను చూసిన తరువాత వస్తున్నది ఎవరూ అన్న విషయం తెలిసిందని చెప్తున్నారు. మొత్తానికి అక్కడికి వచ్చిన ఆ అనుకోని అతిథి ఒబామా అందరితో ఫొటోలు దిగి, వధూవరులను ఆశీర్వదించారు. వివాహం ప్రతి దంపతులకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం. అయితే స్టెఫానీ, బ్రియాన్ టోబ్స్ మాత్రం ఒబామా రాకను ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అంటూ ఆనందంతో చెప్తున్నారు. అయితే గత సంవత్సరం గోల్ఫ్ కోర్స్ లో ఒబామాకోసం భద్రతా సిబ్బంది ఓ పెళ్ళిని బలవంతంగా ఆపడం... అప్పట్లో విమర్శలకు కూడ దారి తీసింది. ఆ తర్వాత వారి ఆనందానికి అడ్డొచ్చినందుకు సదరు అమెరికా అధ్యక్షుడు క్షమాపణలు కూడ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఘటన గుర్తుండిపోయిందో ఏమో.. ఒబామా ఈసారి పెళ్ళికి ఆటంకం కలగకుండా కాస్త జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. -
'ఒబామాకు నోబెల్ ఇవ్వడం ఓ పెద్ద తప్పిదం'
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడంపట్ల నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఒబామాను మరింత ప్రోత్సహించేలా ఉంటుందని భావించాము. కమిటీ ఏమైతే ఆశించి ఒబామను 2009 నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేసిందో..దాంట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఒబామా కూడా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం నమ్మలేక పోయాడని తెలిపారు. 2009లో నోబెల్ శాంతికి ఒబాను ఎంపిక చేయడం మీద జరిగినంత చర్చ.. మరే సంవత్సరానికి ఎంపిక అయిన వారి మీద జరగలేదన్నారు. చాలా మంది ఒబామా అనుచరులు కూడా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఒక తప్పిదంగానే భావిస్తున్నారని పేర్కొన్నారు. నోబుల్ శాంతి బహుమతికి అతను అర్హుడు కాదని యూఎస్ లోని చాలా మంది అభిప్రాయపడ్డారని తెలిపారు. -
బాలుడి అరెస్టు.. ఒబామా ఆహ్వానం
వాషింగ్టన్: సాధరణంగా ఓ కేసులో అరెస్టయిన కుర్రాడిని చిన్నతనంతో చూస్తాం. అతడిపట్ల ఏహ్య భావాన్ని కలిగి ఉంటాం. కానీ ఆ కుర్రాడికి ఏకంగా దేశ అధ్యక్షుడి నుంచి పిలుపు వస్తే.. అమెరికాలోని తొమ్మిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ అనే కుర్రాడు ఓ అలారం గడియారాన్ని స్వయంగా తయారు చేశాడు. దానిని ఒక పెట్టెలో పెట్టుకొని తమ టీచర్లకు చూపించాలని ఆత్రంతో పాఠశాలకు వచ్చాడు. కానీ దానిని తెరిచి చూసిన ఉపాధ్యాయులు బాంబ్ అనుకొని పొరబడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. ఈ వీడియో ఇంటర్ నెట్లో హల్ చేసింది. కానీ, ఉపాధ్యాయులు, పోలీసులు చేసింది పొరపాటు అని తెలిసింది. ఈవిషయం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా తెలిసి ఆ బాలుడిని ఏకంగా తన ఇంటికి ఆహ్వానించాడు. పద్నాలుగేళ్ల వయసులో అతడు చేసిన నూతన ఆవిష్కరణకు ముగ్దుడైపోయారు. అతడిలాంటి శాస్త్రవేత్తలే అమెరికాకు కావాలని పొగుడుతూ ట్వీట్ చేశారు. నూతన ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని మరింత ప్రోత్సహించాలే తప్ప సంకెళ్లు వేయకూడదని అన్నారు. మరోపక్క, ఫేస్ బుక్ అధినేత కూడా ఆ కుర్రాడిని పొగడ్తల్లో ముంచెత్తడు. తన ఆవిష్కరణలు అలాగే కొనసాగించమని, ఆ బాలుడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి తనను నిరభ్యంతరంగా కలవొచ్చని ఆహ్వానించాడు. -
ఝంపా లాహిరికి అమెరికా పురస్కారం
వాషింగ్టన్: పులిట్జర్ అవార్డు విజేత అయిన భారతీయ అమెరికన్ ఝంపా లాహిరి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అమెరికా జాతీయ హ్యూమనిటీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ నెల పదిన వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆమెకు అవార్డు ఇస్తారు. మానవ సంబంధాలను అద్భుతరీతిలో ఆవిష్కరించినందుకుగాను ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ తెలిపింది. తన సృజనాత్మక రచనల ద్వారా ఆమె భారతీయ అమెరికన్ల అనుభవాలను అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించింది. -
భారత సంతతి పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను (స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లు) అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సత్కరించనున్నారు. వీరిలో ప్రవాహిని బ్రాడూ(శాన్ఫ్రాన్సిస్కో), మేరీ శాస్త్రి(మిచిగాన్), సుమా రెడ్డి(న్యూయార్క్) ఉన్నారు. అమెరికా ప్రజలు ప్రతిరోజూ 50 ఫుట్‌బాల్ మైదానాలకు సరిపోయే సెల్ఫోన్లను పడేస్తున్నారని వైట్‌హౌస్ తెలిపింది. వీటిల్లో విలువైన ఖనిజాలు కూడా ఉంటున్నాయి. బ్రాడూ 'బ్లూఓక్'అనే ఎలక్ట్రానిక్ రీసైకిల్ కంపెనీని స్థాపించారు. దీని ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాలను వెలికితీస్తున్నాడు. మేరీ శాస్త్రి మెటీరియల్ సైన్స్ ఉపయోగించి కొత్త తరం లిథియం బ్యాటరీలు తయారు చేస్తున్నాడు. ఇక సుమారెడ్డి స్నేహితుల రేటింగ్స్, రివ్యూస్, రికమెండేషన్స్ ఆధారంగా సందర్శించాల్సిన అద్భుత ప్రదేశాలను ఎంపిక చేసుకునే వాడ్లి అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించింది. -
వాతావరణ మార్పులపై బృహత్ ప్రణాళిక
ఆవిష్కరించిన అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్: అమెరికా థర్మల్ పవర్ప్లాంట్ల ద్వారా వాతావరణంలో కలుస్తున్న గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించే ఒక భారీ ప్రణాళికను అధ్యక్షుడు ఒబామా సోమవారం ఆవిష్కరించారు. మానవాళి భవిష్యత్‌కు వాతావరణంలో వచ్చే మార్పులే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. 2030 నాటికి దేశంలోని విద్యుత్ ప్లాంట్ల కర్బన కాలుష్యం 32 శాతం వరకూ తగ్గుతుందన్నారు. ఉద్గారాల తగ్గింపుపై అమెరికా ముందడుగు వేస్తేనే ఇతర దేశాలూ అనుసరిస్తాయని, తమ దేశాన్ని చూసే చైనా కూడా చర్యలు ప్రారంభించిందని ఒబామా పేర్కొన్నారు. అంతకుముందు ఉద్గారాల తగ్గింపుపై భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు తీసుకుంటున్న చర్యలను వైట్ హౌస్ ఉదహరించింది. -
బురుండీలో అంతటా ఒబామా ఫీవర్
-
‘రష్యా దూకుడుకు కళ్లెం వేద్దాం’
క్రూయెన్(జర్మనీ): ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుసరిస్తున్న ధోరణిపట్ల జీ7 దేశాలు కలసికట్టుగా వ్యవహరించి రష్యా దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ కూటమి దేశాల నేతలకు పిలుపునిచ్చారు. జీ7 సదస్సు కోసం క్రూయెన్ పట్టణానికి చేరుకున్న ఒబామాకు జర్మనీ శనివారం సంప్రదాయ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీ8 సమ్మిట్‌గా ఉన్న తాము రష్యా అధ్యక్షుడు పుతిన్ వైదొలగడంతో జీ7గా మారామని అన్నారు. పుతిన్‌కు ఈ సమావేశం ద్వారా గట్టి సందేశం పంపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ అభ్యున్నతికి జర్మనీతో కలసి పనిచేస్తామన్నారు. కాగా, జీ7 సదస్సు జరుగుతున్న క్రూయెన్ పట్టణం ప్రపంచీకరణ వ్యతిరేకులు, పర్యావరణ వేత్తల ఆందోళనలతో అట్టుడికింది. -
ఒబామాతో మోదీ సెల్ఫీ వద్దనుకున్నారా?
అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైనప్పుడు, రోజూ తాను కేవలం 3 గంటలు నిద్రపోతానని చెప్పుకున్నారు నరేంద్ర మోదీ. అందరు దేశాధిపతులతోనూ సెల్ఫీ తీసుకున్న మోదీ, ఒబామాతో మాత్రం దిగలేదు. విదేశీ పర్యటనల సందర్భంగా మోదీ అక్కడ నేతలతో సెల్ఫీలు దిగిన విషయం తెలిసిందే. వాక్చాతుర్యం దండిగా ఉన్న నరేంద్ర మోదీ కలలను అమ్మి, ఓట్లు తెచ్చుకున్నాడు, ఏడాది పాలనలో ఆయన దేశానికి ఒరగ బెట్టింది ఏమీలేదని కాంగ్రెస్ ప్రముఖుడు కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. మోదీ అంటే (ఇంగ్లిష్ అక్షరమాల ప్రకారం ఎం ఒ డి ఐ అంటే) మర్డర్ ఆఫ్ డెమొక్రసీ అని ఆ పార్టీ విడుదల చేసిన ఐదు అధ్యాయాలు పత్రం లో పేర్కొన్నది. దీనిని కాంగ్రెస్ ప్రముఖుడు జైరాం రమేశ్ విడుదల చేశారు. ఎన్డీఏ -2 అంటే ఒకే వ్యక్తి చేస్తున్న తమాషా అని కాం గ్రెస్ తీర్మానించింది. ఆ విమర్శలు- ► మోదీ ఒక గగన విహారి. విదేశీ యాత్ర లతో తన ఇమేజ్ను ప్రవాసుల దగ్గర ఇనుమడింప చేసుకోవడమే ఆయన ధ్యేయం. ఆయన విదేశాలలో 53 రోజు లు పర్యటిస్తే, దేశంలో 48 రోజుల పాటే పర్యటించారు. ► మోదీ పాలన చేపట్టిన కొత్తలో ‘స్కిల్ ఇండియా’ గురించి పదే పదే చెప్పే వారు. ఆచరణలో మాత్రం ‘కిల్ ఇండి యా’, ‘కిల్ పార్లమెంట్’, కిల్లింగ్ ఆఫ్ జుడీషియరీ’ అన్న తీరులో వ్యవహ రిస్తున్నారు. ►నెహ్రూ కాలం నుంచి చాలాకాలం పాటు ప్రధానే విదేశీ వ్యవ హారాల శాఖ ను కూడా చూసేవారు. వాజపేయి జన తా హయాంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. అప్పుడు ఆయ నను ‘గగన విహారీ వాజపేయి’ అనే వారు. ఇప్పుడు మోదీని ‘సూపర్ గగన విహారీ’ అనాలి. విదేశీ పర్యటనలలో దేశ రాజకీయాల గురించి ప్రస్తావించిన చెడ్డపేరు కూడా మోదీకే దక్కుతుంది. ► రక్షణ వ్యయాన్ని కుదించడం ద్వారా ప్రధాని జాతీయ భద్రతతో చెలగాటం ఆడుతున్నారు. ► ఈ ఏడాది కాలమంతా ఆయన పార్ల మెంటుకు ముఖం చాటేస్తూనే ఉన్నారు. ఆయన పూర్తిగా పార్లమెంటు మీద శీత కన్ను వేశారు. జీఎస్టీ రాజ్యాంగ సవ రణ బిల్లు సమయంలో కూడా ప్రధాని సభలో లేరు. ఈ ఏడాది కాలంలో పార్ల మెంటు ముందుకు 53 బిల్లులు వచ్చా యి. కానీ అందులో ఐదంటే ఐదు మా త్రమే స్థాయీ సంఘం ముందుకు వెళ్లా యి. నిజానికి ముఖ్యమైన బిల్లులు అన్నీ స్థాయీ సంఘం ముందుకు వెళ్లాలి. ► ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల ద్వారా భారత్‌లో ఆశ్రీత పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ప్రతి పర్యటనలోను ఆయన వెంటనే పారి శ్రామికవేత్తలు బృందం ఉంటుంది. వారు అక్కడ వ్యాపార లావాదేవీల పని చూసుకుంటారు. ► దేశంలో చాలా విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లు లేరు. భారత వైద్య మండలికి అధిపతిని నియమించలేదు. సీఎస్ఐఆర్ పరిస్థితి కూడా అంతే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అం టే బీజేపీ ప్రకటించిన ‘పాలనలో పార దర్శకత’ మాటలకే పరిమితమవు తున్నది. ► ఈ ఏడాది కాలంలో విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుధ్యం, స్త్రీ శిశు సంక్షే మం వంటి వాటికి నిధులు కోత వేయ డంలో మోదీ ప్రభుత్వం నూటికి నూరు మార్కులు సాధించుకుంది. ► 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయదలచి మోదీ భారత రైతాంగానికి చాలా నష్టం చేశారు. తద్వారా భూ ఆక్ర మణకు దారులు వేశారు. దీనికి వ్యతిరే కంగా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. లవ్ జీహాద్ వ్యతిరేక నినాదంతో, ఘర్ వాపసీ విధానంతో బీజేపీ దేశానికి ఎంతో చేటు చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. చర్చిలమీద దాడి, క్రైస్తవ సన్యాసినిపై అత్యా చారం వంటి ఘటనలతో దేశం అప్రతిష్ట పాలైంది. ఇక బీజేపీ సభ్యులు కొందరు చేసి న వ్యాఖ్యలు దేశం పట్ల విశ్వసనీయతను దెబ్బతీశాయని పార్టీ ఆరోపించింది. కె. రాఘవేంద్ర -
ఒబామాతో లోకేశ్ ఫొటో
డెమోక్రటిక్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ఒబామాతో కరచాలనం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్. పదివేల డాలర్లు చెల్లించినవారికి ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒమాబాతో కరచాలనంచేస్తూ ఫొటో దిగే అవకాశం ఇచ్చారు. లోకేశ్ అలాగే ఈ అవకాశాన్ని ‘కొని’తెచ్చుకున్నారు. హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ ఫొటో తీసుకున్నారు. నిధుల సమీకరణ కోసం డెమాక్రటిక్ పార్టీ '2016 వైట్‌హౌస్ విక్టరీ ఫండ్' పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఆయన ఈ ఫొటో దిగారు. నిధుల సమీకరణకు ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్లాండ్లోని సెంటినెల్ హోటల్లో గురువారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి 300 మంది టికెట్లు కొనుగోలు చేసినట్టు ఆ పార్టీకి చెందిన డెమాక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్సీ) ప్రకటించింది. ఒబామా 26 నిమిషాలపాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎక్కువ మొత్తం పెట్టి టికెట్ కొనుగోలు చేసినవారు ఒక్కొక్కరితో విడిగా అమెరికా అధ్యక్షుడు కరచాలనం చేశారు. అందులో భాగంగానే లోకేష్ కూడా ఒబామాను కలిశారు. కార్యక్రమం హాలులో ప్రవేశానికి 500 అమెరికన్ డాలర్లు, ఒబామాతో ఫోటో దిగడానికి 5 వేల డాలర్లు, ఆయనతో కరచాలనం చేసి పరిచయం చేసుకోవడానికి 10 వేల డాలర్లు రుసుముగా నిర్దేశించిన విషయం తెలిసిందే. 500 డాలర్ల టికెట్ కొనుగోలు చేసిన వారు హాలులో ప్రవేశించి ఒబామా ప్రసంగాన్ని వినడానికి మాత్రమే వీలుంటుంది. లోకేశ్ 10 వేల డాలర్లు చెల్లించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా వచ్చిన నిధులన్నీ డెమాక్రటిక్ పార్టీ ఖాతాలోకి వెళతాయి. లోకేశ్ పోర్ట్‌ల్యాండ్‌లో ఒబామాను కలుసుకున్నారని తెలుగుదేశం పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నూతన పారిశ్రామిక విధానాన్ని, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు విశేషాలను ఆయన ఒబామాకు వివరించినట్టు తెలిపింది. తన నాలుగో రోజు అమెరికా పర్యటనలో పలు ఐటీ కంపెనీల ప్రముఖులతో లోకే శ్ భేటీ అయ్యారని వివరించింది. -
ఒబామా పర్యటన ఖర్చును వెల్లడించలేం
ముంబై: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత జనవరిలో భారత పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యయమెంతో చెప్పాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తును విదేశాంగ శాఖ తిరస్కరించింది. ఇది సున్నిత సమాచారమని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని స్పష్టంచేసింది. అందువల్ల ఆర్టీఐ సెక్షన్ 8(1)(సీ) కింద ఈ సమాచారాన్ని బహిర్గతపరచలేమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు, ఆయన వెంట వచ్చిన బృందానికి భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని ముంబైకి చెందిన అనిల్ గల్గాలి విదేశాంగ శాఖకు దరఖాస్తు చేశారు. -
అజ్మీర్ దర్గాకు ఒబామా కానుక
ఏప్రిల్ 19 నుంచి 803వ ఉర్సు ఉత్సవాలు మొదలుకానున్నవేళ అజ్మీర్‌లోని ప్రఖ్యాత హజ్రత్ ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తీకి ఓ అరుదైన భక్తిపూర్వక కానుక అందింది. ఆ బహుమానాన్ని పంపింది మరెవరోకాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా! ఆయన ఆదేశాలతో ప్రత్యేకంగా రూపొందించిన ఎరుపు రంగు చాదర్‌ను అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ శుక్రవారం దర్గా అధిపతులకు అందజేశారు. చాదర్ అందించడంతోపాటు ప్రపంచమంతా శాంతి సామరస్యాలతో వెల్లివిరియాలనే ఒబామా సందేశాన్ని వర్మ తెలియజేశారని ఖ్వాజా సాహెబ్ నషీన్, చిస్తీ ఫౌండేషన్ డైరెక్టర్ సయీద్ సల్మాన్ మీడియాకు చెప్పారు. ఒక దక్షిణాసియాయేతర దేశం అజ్మీర్ దర్గాకు చాదర్ పంపడం ఇదే తొలిసారని, సూఫీ తత్వాన్ని పాశ్చాత్యదేశాలు కూడా గౌరవించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చిన చిస్తీ మాట్లాడుతూ అజ్మీర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అమెరికా సహాయం కోరామని, ఆ మేరకు వాషింగ్టన్‌లోని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్తో చర్చలు జరిపామన్నారు. -
భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. ఈ మేరకు అధికారిక భవనం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై మా అధ్యక్షుడు పూర్తి సమ్మతంగా ఉన్నారు.. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో కూడా నిర్ణయాలు తీసుకున్నారు' అని అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. -
ఔనా..నిజమేనా?
-
స్ఫూర్తిదాత మహాత్మాగాంధీ
న్యూఢిల్లీ: గాంధీజీపై తనకున్న అభిమానాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించిన ఒబామా.. ఆదివారం రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి అని కొనియాడారు. గాంధీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ముకుళిత హస్తాలతో కాసేపు మౌనం పాటించారు. ‘డాక్టర్ మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ అన్న మాటలు అక్షర సత్యాలై నిలుస్తున్నాయి. గాంధీ స్ఫూర్తి భారత్‌లో నేటికీ సజీవంగా ఉంది. ఆ స్ఫూర్తి ప్రపంచానికి అపురూప కానుక. దానితో దేశాలు, ప్రజల మధ్య ప్రేమ విరాజిల్లాలని ఆశిస్తున్నా’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. రాజ్‌ఘాట్ వద్ద బోధి మొక్కను నాటారు. అక్కడి అధికారులు ఒబామాకు చరఖాను బహూకరించారు. -
ఒబామా స్నేహ హస్తం
భూమ్యాకాశాలు రెండింటా భద్రతా బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్న ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీసమేతంగా అడుగుపెట్టారు. సోమవారం జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోబోతున్న తొలి అమెరికా అధ్యక్షుడిగానే కాదు...ఆ పదవిలో ఉంటూ రెండోసారి భారత్ సందర్శించిన తొలి నేతగా కూడా ఒబామా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రొటోకాల్‌ను కాదని స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలికారు. ఇరు దేశాలూ సాన్నిహిత్యం కోసం, పరస్పర సహకారం కోసం ఎంతగా ఆరాటపడుతున్నాయో వీటినిబట్టే తెలుసుకోవచ్చు. మోదీ అధికారంలోకొచ్చాక అధినేతలిద్దరిమధ్యా న్యూయార్క్‌లో గత సెప్టెంబర్‌లో శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ సందర్భంగా పలు రంగాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అందులో ప్రతిష్టంభన ఏర్పడిన పౌర అణు ఒప్పందంపై మరిన్ని చర్చలు జరగాలనుకోవడం దగ్గరనుంచి అంతరిక్ష రంగంలో సహకారం, వాణిజ్య సౌలభ్య ఒప్పందానికి అంగీకారంవంటి అంశాలవరకూ ఎన్నో ఉన్నాయి. ఇరు దేశాల వాణిజ్యం గత దశాబ్దం కాలంలో అయిదు రెట్లు పెరిగి అదిప్పుడు 10,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2020 నాటికి దాన్ని 50,000 కోట్ల డాలర్లకు పెంపొందింపజేయాలన్న ఆశలున్నాయి. 2010 నవంబర్‌లో ఒబామా మన దేశానికొచ్చారు. అయితే, ఆ తర్వాత ఇరుదేశాలమధ్యా సంబంధాలు క్షీణించలేదుగానీ పెరగాల్సినంతగా పెరిగిన దాఖలాలు లేవు. పెపైచ్చు మన దౌత్య అధికారిణి దేవయాని ఖోబ్రగడే విషయంలో అమెరికా పోలీసు అధికారులు అతిగా వ్యవహరించిన తీరు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలూ పరస్పరం ప్రయోజనాలున్నాయని భావించిన రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడం మొదలుకొని పటిష్టమైన స్నేహసంబంధాలను ఏర్పర్చుకోవడంవరకూ ఎన్నో అంశాల ఎజెండాతో ఒబామా వచ్చారు. హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ఒబామాల మధ్య రెండు దేశాల ప్రతినిధి బృందాల సమక్షంలోనూ, అటు తర్వాత ఏకాంతంగానూ చర్చలు సాగాయి. ఈ చర్చల పర్యవసానంగా అధినేతలిద్దరిమధ్యా పరస్పర అవగాహన పెరిగిన సూచనలు కనిపించాయి. సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారిద్దరూ మాట్లాడిన తీరు దీన్ని ప్రతిఫలించింది. పౌర అణు ఒప్పందం విషయంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయని ఇద్దరూ ప్రకటించారు. అలాగే రక్షణ రంగంలో ఉన్న ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరో పదేళ్లు పొడిగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇక స్మార్ట్ సిటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, యూపీ, రాజస్థాన్లతో ఒప్పందాలు కూడా కుదిరాయి. వీటితోపాటు ఉగ్రవాదుల కదలికలపై పరస్పరం సమాచారాన్ని పంచుకోవాలని... అమెరికాలో పనిచేస్తున్న వేలాదిమంది భారత వృత్తిరంగ నిపుణులకు ప్రయోజనం చేకూర్చే సామాజిక భద్రతా ఒప్పందం కుదరడానికి వీలుగా ఇరుదేశాలూ చర్చించుకోవాలని నిర్ణయించారు. అణు ఒప్పందం విషయంలో అడ్డంకులు తొలగినట్టు చెప్పడం మినహా అందుకు సంబంధించిన వివరాలేవీ మోదీ, ఒబామాలు వెల్లడించలేదు. ఆ ఒప్పందానికి ఏర్పడిన ప్రతిబంధకాలు చిన్నవేమీ కాదు. ఇరు దేశాలమధ్యా పౌర అణు ఒప్పందం కుదిరి ఆరున్నరేళ్లు దాటుతున్నది. ఆ ఒప్పందం కుదరడానికి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తన ప్రభుత్వాన్నే పణంగా పెట్టారు. అయితే, యూపీఏ రెండో దశ పాలనలో ఆ ఒప్పందానికి అనుగుణంగా తీసుకొచ్చిన అణు పరిహార చట్టం విషయంలో అమెరికాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ముఖ్యంగా అణు విద్యుత్ ప్రాజెక్టులో ఏదైనా ప్రమాదం సంభవించిన పక్షంలో అణు రియాక్టర్‌ను సరఫరాచేసిన సంస్థనుంచి గరిష్టంగా రూ. 1,500 కోట్లు వసూలు చేయాలని నిర్దేశిస్తున్న ఆ చట్టంలోని సెక్షన్ 17(బీ) తమకు సమ్మతం కాదని అమెరికా అంటున్నది. అలాంటివన్నీ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వహిస్తున్న సంస్థే చూసుకోవాలని చెబుతున్నది. అణు రియాక్టర్ల డిజైన్, అందులో వాడే పరికరాల నాణ్యత మొదలైనవి సాధారణంగా ప్రమాదాలకు కారణమవుతాయి గనుక వాటిని సరఫరా చేసిన సంస్థ బాధ్యత లేదనడం సరికాదన్నది మన ప్రభుత్వం వాదన. కనుకనే ఆ సెక్షన్ తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేసింది. మరోపక్క భారత్‌కు సరఫరా అయ్యే అణు ఇంధనం రియక్టర్లకే చేరుతున్నదో లేదో పర్యవేక్షించడానికి అంగీకరించాలని అమెరికా కోరుతున్నది. ఈ విషయంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) భద్రతా ప్రమాణాల మేరకు పనిచేస్తామన్నది మన వాదన. ఇప్పుడు కుదిరిందంటున్న అవగాహన ఏమిటో వెల్లడైతే తప్ప ఈ విషయాల్లో ఎవరెంత రాజీపడ్డారో తెలిసే అవకాశం లేదు. ఇక అమెరికా-చైనాలమధ్య కుదిరిన వాతావరణ ఒప్పందాన్ని చూపి ఆ విషయంలో మన దేశంపై కూడా ఒబామా ఒత్తిడి తెస్తారన్న అంచనాలు మొదటినుంచీ ఉన్నాయి. ఈ అంశం చర్చల్లో ప్రధానంగానే ప్రస్తావనకొచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పారిస్‌లో జరగబోయే శిఖరాగ్ర సదస్సులో ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేయడం మినహా మోదీ దీని గురించి అదనంగా ఏమీ చెప్పలేదు. ఇదే సమయంలో స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల లభ్యతలో సహకరించడానికి అమెరికా ముందుకొచ్చింది. వర్ధమాన దేశాలు కూడా తమతో సమానంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని చాన్నాళ్లనుంచి అమెరికా వాదిస్తున్నది. ఈ విషయంలో ఒబామా తాజా ప్రతిపాదనలేమిటో, మోదీ స్పందనేమిటో వెల్లడికావాల్సి ఉంది. ఇక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే అంశంలో మరింత సహకరించుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకోవడం ఎన్నదగినది. అమెరికా ఒత్తిడి పర్యవసానంగా జమా- ఉత్ -దవా(జేయూడీ)ను నిషేధించాలని ఈమధ్యే పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ విషయంలో అమెరికా మరింత కృషి చేస్తే ఉపఖండంలో శాంతిసుస్థిరతలు ఏర్పడతాయి. మొత్తానికి ఒబామా పర్యటన పర్యవసానంగా ఇరుదేశాల సంబంధాలూ మరింత ఎత్తుకు ఎదిగితే అది ఇద్దరికీ లాభదాయకమే. -
ఒబామా పర్యటనలో వాళ్లిద్దరూ మిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు భారత పర్యటనను మిస్సవుతున్నారు. ఒబామా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా తన కుమార్తెలు 16 ఏళ్ల మాలియా, 13 ఏళ్ల సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా ఇక్కడకు రావడం లేదని యూఎస్ డిప్యూటీ నెషనల్ సెక్యురిటీ అడ్వైజర్ బెన్ రోడ్స్ తెలిపారు. వీరి తొలి ప్రాధాన్యం స్కూల్ కావడం వల్ల తమ విదేశీ పర్యటనలను వేసవిలోనే చేయాలనుకుంటున్నారని రోడ్స్ అన్నారు. ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామాలు మాత్రమే ఈ పర్యటనకు రానున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగే గణతంత్ర్య వేడుకలకి ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వీరి మూడు రోజుల పర్యటనలో తాజ్ మహాల్ని కూడా సందర్శించనున్నారు. -
వీవీఐపీ భద్రత కోసం..!
సిద్ధమవుతున్న ఇండో, అమెరికన్ బలగాలు న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన దగ్గర పడుతుండటంతో.. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు రెండు దేశాల అధికారులు, భద్రతా బలగాలు కాలంతో పోటీ పడుతూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో రాజ్‌పథ్ దగ్గర్లోని 71 ఆకాశ హర్మ్యాలను పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ మూసేస్తున్నారు. జనవరి 26 ఉదయం నుంచి అన్ని మెట్రో స్టేషన్లను మూసేస్తారు. పరేడ్ రోజు 40 వేల మంది భద్రతాబలగాలు విధుల్లో ఉంటాయి. రాజ్‌పథ్‌లోని పరేడ్ జరిగే 3కి.మీల ప్రాంతంలో 160 సీసీ కెమెరాలను, ముఖాలను గుర్తించగల మరో 80 కెమెరాలను ఏర్పాటు చేశారు. పరేడ్ జరిగే సమయంలో ఢిల్లీపై 35 వేల అడుగుల ఎత్తు వరకు నోఫ్లై జోన్‌గా ప్రకటిస్తారు.అలాగే, 400 కి.మీ.ల పరిధిలో విమానాల ప్రయాణాలను నిషేధించారు. జనవరి 27న ఒబామా కుటుంబం తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్న సమయంలో ఆయనకు రక్షణగా 100 మంది అమెరికా సెక్యూరిటీ సిబ్బంది, 4 వేల మంది భారతీయ భద్రత సిబ్బంది విధుల్లో ఉంటారు. అణు ఒప్పందం అమలు కోసం: రెండు దేశాల మధ్య 2005లో కుదిరిన పౌర అణు ఒప్పందం అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఇరుదేశాల అధికారులు బుధవారం లండన్‌లో సమావేశమయ్యారు. ఒప్పందం అమలులో ప్రధాన అడ్డంకిగా మారిన పరిహారం అంశంపై ఈ భేటీలో ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలై, 2020 నాటికి భారతీయులందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్న మోదీ లక్ష్యం నిజం కావాలని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. రక్షణ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బుధవారం అమెరికా ప్రకటించింది. ఆసియాలోను, అంతర్జాతీయంగానూ భారత్‌ను బలమైన భాగస్వామిగా గుర్తించడాన్ని ఒబామా పర్యటన ప్రతిబింబిస్తుందని పేర్కొంది. -
భారత్ పర్యటనకు ముందు ఒబామా కీలక ప్రసంగం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనకు ముందు కీలక ప్రసంగం చేశారు. అమెరికా కాంగ్రెస్‌లో ఆయన ప్రసంగించారు. ఆర్థిక సంక్షోభానికి ముందున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒబామా తెలిపారు. ఉద్యోగ కల్పన వేగంగా జరుగుతోందని, 1999 సంవత్సరం నాటి పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయిన ఆయన పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, పవన విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని ఒబామా వెల్లడించారు. కాగా గణతంత్ర దినోత్సవానికి ఒబామా ప్రత్యేక అతిథిగా హాజరు అవుతున్న విషయం తెలిసిందే. -
మేం భద్రత కల్పించగలం!
ఒబామా పర్యటనపై అమెరికాకు భారత్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరవుతున్న దృష్ట్యా.. ఆ రోజు పరేడ్ జరిగే ఢిల్లీలోని రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న భవనాల పైన తమ దేశ సాయుధులే(స్నైపర్స్) పహారా ఉంటారన్న అమెరికా ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. మరో ఐదు రోజుల్లో ఒబామా భారత్‌లో అడుగిడుతుండటంతో.. ఆయన పర్యటన సమయంలో చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఇరుదేశాల అధికారులు సంప్రదింపులను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా అమెరికా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు భారతీయ అధికారులకు పై స్నైపర్ ప్రతిపాదన చేశారని, దాన్ని భారతీయ అధికారులు తిరస్కరించారని భద్రతా ఏర్పాట్లలో భాగస్వామి అయిన అధికారి వెల్లడించారు. భారతీయ భద్రతాధికారులు సుశిక్షితులని, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతావలయం గల ఒబామాకు రక్షణ కల్పించగల శక్తియుక్తులున్నవారని, ఒబామాకు భద్రత విషయంలో అమెరికా అధికారుల జోక్యం అవసరం లేదని వివరించారన్నారు. భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేత తదితర ప్రముఖులు కూడా హాజరవుతున్నందువల్ల భద్రత ఏర్పాట్లను వేరేవారికి అప్పగించలేమని తేల్చిచెప్పారన్నారు. వేడుకలు జరిగే ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలన్న అమెరికా విజ్ఞప్తిని కూడా భారత్ తోసిపుచ్చింది. ‘బీస్ట్’లోనా?.. ‘లైమో’లోనా?.. గణతంత్ర వేడుకలు జరిగే వేదిక వద్దకు ఒబామా ఏ వాహనంలో రావాలనే విషయంపై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ప్రత్యేకంగా తన అత్యంత భద్రతాయుత వాహనం ‘బీస్ట్’లో ఒబామా వేదిక వద్దకు వస్తారని అమెరికా ఒత్తిడి తెచ్చింది. సాధారణంగా ముఖ్య అతిథి రాష్ట్రపతితో కలిసి వేదిక వద్దకు రావడం సంప్రదాయం. ఒకవేళ భారత రాష్ట్రపతి వచ్చే బుల్లెట్‌ప్రూఫ్ వాహనం లైమోజిన్లో ప్రణబ్‌తో కలసి ఒబామా వేదిక వద్దకు వస్తే.. విదేశంలో సొంత వాహనం ‘బీస్ట్’లో ప్రయాణించని తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలుస్తారు. అలాగే, భారత్‌లో ఒబామా ప్రయాణించేందుకు మూడు మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, వాటిలో ఆ సమయంలో మరే భారతీయ వీఐపీ ప్రయాణించకూడదని అమెరికా కోరింది. భారత్ దీన్ని తోసిపుచ్చింది. ఒబామా ప్రయాణించే మార్గంలోనే భారత రాష్ట్రపతి, ప్రధాని తదితర వీఐపీలు ప్రయాణిస్తారని తెలిపింది. -
రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం
-
రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లష్కర్-ఇ- తోయిబా ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిఘా పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరోవైపు పాక్ సరిహద్దుల్లోనూ భద్రత పెంపుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 10 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దుల్లో మోహరించాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. -
భారత్‌పై ఉగ్ర దాడి జరగకూడదు
ఒబామా పర్యటన సందర్భంగా పాక్‌కు అమెరికా హెచ్చరిక ఒకవేళ అటువంటి దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఒబామా భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల జాగ్రత్తలు గణతంత్ర వేడుకల్లో రాజ్‌పథ్ వీవీఐపీ వేదికకు ఏడంచెల భద్రత వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌లో పర్యటిస్తుండగా భారత్‌పై ఎలాంటి సీమాంతర ఉగ్రవాద దాడి జరగకుండా చూడాలని పాకిస్తాన్‌కు అమెరికా సూచించింది. ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే, అది పాక్ నుంచే జరిగిందని వెల్లడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించింది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్‌లో పర్యటించనుండడం తెలిసిందే. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఒబామా.. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు బహిరంగ వేదిక (ఓపెన్ ఎయిర్ ప్లాట్‌ఫాం)పై ఉండనున్నారు. దీంతో ఆయన భద్రత విషయమై అమెరికా, భారత భద్రతా సంస్థలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి నేతలు భారత్‌లో పర్యటిస్తుండగా.. పాక్ నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్‌లో దాడులకు పాల్పడిన చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్చరికలు జారీచేసినట్లు చెప్తున్నారు. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్నపుడు కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. అఫ్ఘానిస్థాన్లోని అమెరికా బలగాలు ఆ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా, భారత్‌ల మధ్య నిఘా సమాచారం మార్పిడి అనూహ్యంగా పెరిగింది. ఒబామాకు గుర్తిండిపోయేలా ఏర్పాట్లు న్యూఢిల్లీ: వేడుకలు జరిగే రాజ్‌పథ్‌కు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ఈ మార్గం చుట్టూ 80,000 మంది పోలీసులతో పాటు 10,000 మంది పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నారు. వేదికపై వీవీఐపీ ఎన్‌క్లోజర్ చుట్టూ ఏడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గగనతలాన్ని రాడార్‌తో పర్యవేక్షించనున్నారు. ఒబామా భారత యాత్రను సుదీర్ఘ కాలం గుర్తుంచుకునేలా తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ చెప్పారు. విద్యావేత్తల బోధనపై ఒప్పందం! భారత్‌లోని విద్యా సంస్థల్లో అంతర్జాతీయ అధ్యాపకులు బోధించటానికి సంబంధించిన ఒప్పందం ఒబామా పర్యటన సందర్భంగా ఖరారయ్యే వీలుంది. ఐఐటీలు, సెంట్రల్ వర్సిటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే విద్యా సంస్థలతో పాటు ‘ఎ’ గ్రేడ్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు విదేశాల నుంచి అత్యుత్తమ అధ్యాపకుల చేత బోధన అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది. మోదీ అమెరికా పర్యటనలో ప్రతిపాదించిన ‘గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ ఎకడమిక్ నెట్వర్క్స్’ కింద ఏటా వేయి మంది వరకూ అమెరికా విద్యావేత్తలను ఇక్కడ బోధించేందుకు పంపించటానికి ఆ దేశం అంగీకరించింది. కాగా, దీపావళిని పురస్కరించుకుని అమెరికాలో దీపావళి పోస్టల్ స్టాంపును జారీ చేసేందుకు ఒబామా పర్యటన సందర్భంగా మద్దతివ్వాలని కోరుతూ అమెరికా పార్లమెంటు సభ్యురాలు కారొలిన్ మాలొనీ ఆయనకు లేఖ రాశారు. -
ఒబామాకు అగ్గిపెట్టెలో పట్టే చీర
ఈ నెల 26న ప్రధాని చేతుల మీదుగా బహూకరణ సిరిసిల్ల చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అగ్గిపెట్టెలో అమరే చీరను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను మగ్గంపై నేశాడు. ఈ చీరను అమెరికా అధ్యక్షుడికి అందించేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు హైదరాబాద్‌లో నల్ల విజయ్‌కుమార్ శనివారం అందించారు. హైదరాబాద్‌కు చెందిన దైవజ్ఞశర్మ నల్ల విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌కు పిలిపించి అమెరికా అధ్యక్షుడికి అగ్గిపెట్టెలో చీర, పట్టు శాలువాను అందించే విధంగా ఏర్పాటు చేశారు. జనవరి 26న భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి భారత్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా నాలుగున్నరమీటర్ల అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో పాటు రెండుమీటర్ల శాలువాను ఒబామాకు అందించనున్నట్లు కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. నల్ల విజయ్‌కుమార్ చేనేత మగ్గంపై నెలరోజుల పాటు శ్రమించి వీటిని నేశాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి కేంద్రమంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని విజయ్‌కుమార్ తెలిపారు. అతితేలికైన చీర, శాలువాను భారత ప్రధాని చేతులమీదుగా అమెరికా అధ్యక్షునికి బహూకరించే అవకాశం రావడంపై విజయ్‌కుమార్ సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో విజయ్‌కుమార్ వస్త్రాలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, దైవజ్ఞశర్మ పరిశీలించారు. -
రిపబ్లిక్ డేకు ‘ఉగ్ర’ ముప్పు
ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాల సం దర్భంగా ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. రిపబ్లిక్‌డేకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా విచ్చేస్తున్న నేపథ్యంలో దేశ రాజధానితోపాటు పలు రాష్ట్రాల్లో విధ్వంసాలకు విదేశీ, దేశీయ ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయని తన నివేదికలో ఐబీ పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు కొచ్చి, చెన్నైల్లో విధ్వంసాలకు ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలు, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
పెళ్లింట... ఒబామా ఆట...
రాజు తలచుకుంటే దెబ్బలకే కాదు దోస్తానాకూ కొదవుండదని అర్థమై ఉంటుందా పెళ్లివారికి. అమెరికాలోని హవాలిలో నివసించే ఆర్మీ అధికారులు నాటాలీ హెల్మెల్, ఎడ్వర్డ్ మాల్యూలు గత ఆదివారం తమ పెళ్లికని కనొహె గోల్ఫ్‌కోర్స్‌లో ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. తీరా పెళ్లికి పూట ఉందనగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్నేహితులతో కలిసి ఆదివారం గోల్ఫ్ ఆడడానికి వస్తున్నారు కాబట్టి పెళ్లి వేదికను మార్చుకోమని కబురు. సాక్షాత్తూ ప్రెసిడెంట్ గారు ఆడుకోవడానికి వస్తుంటే పెళ్లీ పేరంటాలు ఒక అడ్డా?! దాంతో ఉస్సురంటూ ఆదరా బాదరాగా తమ సెటప్ మొత్తం అక్కడి నుంచి వేరే చోటుకి మార్చేసుకున్నారు. సరే. ఏమైతేనేం, పెళ్లి అయిపోయిన కాసేపటికి పెళ్లివారికి ఒబామా నుంచి ఫోన్. తన ఆట కారణంగా వారికి కలిగిన ఇబ్బందికి సారీ చెప్పడంతో మొదలుపెట్టి, హనీమూన్ నుంచి గోల్ఫ్ ఆట విశేషాల దాకా వధూవరులతో కాసేపు ముచ్చటించి మరీ బై చెప్పారట. దీంతో వధూవరులు ఉబ్బితబ్బిబ్బయిపోయి... ఇది తమకు ఒక మెమొరబుల్ డే అంటూ అధ్యక్షుల వారి ఆట దెబ్బకు తమ పెళ్లి అడ్రస్ మారిపోవడాన్ని లైట్ తీసేసుకున్నారు. -
పాక్‌కు రూ.6,200 కోట్లు
ఒబామా గ్రీన్‌సిగ్నల్ వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా బిలియన్ డాలర్ల(రూ.6,200 కోట్లు) నిధులను అందించనుంది. అఫ్ఘానిస్థాన్‌లో తన సైనిక కార్యకలాపాలకు సహకారంగా పాక్ ఆర్మీ చేసిన ఖర్చులను అమెరికా తిరిగి చెల్లించనుంది. ఈ మేరకు డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2015పై దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం సంతకం చేశారు. అయితే, ఉగ్రవాద కార్యకలాపాల మీద చర్యలు తీసుకోవాలని, హుక్కానీ నెట్‌వర్క్‌పై చర్యలు ఉండాలని అమెరికా ఎప్పటి మాదిరిగానే నిబంధనలు విధించింది. -
ఒబామా పర్యటన సందర్భంగా దాడులు?
-
ఒబామాకు గొంతునొప్పి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు గొంతునొప్పి రావడంతో ఆదివారం బెతస్దాలోని వాల్టెర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్యాస్ సంబంధిత సమస్యతో ఒబామా బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. గ్యాస్ సమస్య వల్ల తరచుగా త్రేన్పులు వస్తుండటంతో గొంతు నొప్పి సంభవించినట్లు వైద్యులు చెప్పారు. -
అమెరికా రక్షణ మంత్రిగా కార్టర్
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రిగా ఆస్టన్ కార్టర్‌ను దేశాధ్యక్షుడు ఒబామా శుక్రవారం ప్రకటించారు. ఒబామాకు సన్నిహితుడు, భారత్‌కు మద్దతుదారు అయిన కార్టర్ ఎంపికతో, భారత్, అమెరికా రక్షణ సంబంధాలపై ఒబామా మరింత వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశముంది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్‌లో వివిధ హోదాల్లో కార్టర్ గతంలో పనిచేశారు. -
ఒబామాకు కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్ : రిపబ్లిక్ డే విశిష్ట అతిధిగా భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్‌కు ఆహ్వానించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒబామా పర్యటనపై ఆయన...ఎంబసీ అధికారులతో చర్చించారు. జనవరి 26న ఒబామా ఢిల్లీ వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ... ఒబామాను ఆహ్వానించే అంశంపై అమెరికా ఎంబసీకి లేఖ రాశారు. -
2 లక్షల కోట్ల డాలర్లు పెంచాలి..
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ జీడీపీపై జీ20 దేశాధినేతల తీర్మానం ఇన్ఫ్రాలో భారీ పెట్టుబడులు, వాణిజ్యం పెంపుతోనే సాధ్యం బ్రిస్బేన్: రానున్న ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ)కి 2 లక్షల కోట్ల డాలర్లను అదనంగా జతచేయాలని జీ20 దేశాధినేతలు నిర్దేశించారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడం వంటి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఆదివారమిక్కడ జీ20 సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన 3 పేజీల ప్రకటనలో ఈ అంశాలను పొందుపరిచారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలకు చెందిన 20 దేశాల కూటమే జీ20. ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంచడం, మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీ20 ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రనేతలు స్పష్టం చేశారు. ‘2018 కల్లా ప్రపంచ జీడీపీకి కనీసం మరో 2% వృద్ధిని జోడించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో 2 లక్షల కోట్ల డాలర్లు జతవుతుంది. మిలియన్లకొద్దీ ఉద్యోగాలను సృష్టించొచ్చు’ అని పేర్కొన్నారు. 2012 గణాంకాల ప్రకారం ప్రపంచ జీడీపీ విలువ 85 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో జీ20 దేశాల వాటా 85% కావడం గమనార్హం. సమీకృత అభివృద్ధిపై దృష్టి... ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తగిన డిమాండ్ లేక అవస్థలుపడుతోంది. వృద్ధి పెంపునకు సరఫరాపరమైన అడ్డంకులను తొలగించాలి. ఫైనాన్షియల్ మార్కెట్లు, భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు పొంచిఉన్నాయి. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ సంస్థలు, వృద్ధికి ఊతమిచ్చేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాం. పటిష్టమైన, స్థిరమైన, సమతూకంతోకూడిన వృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం. నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రైవేటు రంగ వ్యాపార కార్యకలాపాల పెంపు వంటి చర్యలను అమలు చేయనున్నాం. ఇవన్నీ సమీకృత అభివృద్ధితో పాటు ఆర్థిక అసమానతలు, పేదరికాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి’ అని ప్రకటనలో దిగ్గజ నేతలు పేర్కొన్నారు. 2020 కల్లా పురుషులు, మహిళా ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని 25% మేర తగ్గించాలని జీ20 పేర్కొంది. తద్వారా 10 కోట్లకుపైగా మహిళా ఉద్యోగులు జతయ్యేలా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 2017కి ఆటోమేటిక్ పన్నుల సమాచార వ్యవస్థ పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం సభ్య దేశాల మధ్య ఆటోమేటిక్‌గా పన్ను సంబంధ సమాచారాన్ని పంచుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు జీ20 నాయకులు పేర్కొన్నారు. 2017కల్లా లేదంటే 2018 చివరినాటికి ఇది అందుబాటులోకి రావచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. నల్లధనం జాడ్యానికి చెక్ చెప్పేందుకు ప్రపంచదేశాల సహకారం కోసం భారత్ పదేపదే అంతర్జాతీయ స్థాయిలో గొంతెంతున్న నేపథ్యంలో జీ20 సదస్సు దీనిపై దృష్టిపెట్టడం గమనార్హం. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీల లాభాల తరలింపునకు చెక్ చెప్పడానికి కూడా తగిన కార్యాచరణను రూపొందిచాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. 2015కల్లా ఇది ఖరారు కావచ్చని భావిస్తున్నారు. గ్లోబల్ ఇన్ఫ్రా హబ్ ఏర్పాటుకు అంగీకారం... ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు జీ20 నేతలు అంగీకరించారు. అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేటు రంగం, ప్రభుత్వాలు తమ ఆలోచనలు, నైపుణ్యాలను పంచుకునే వేదికగా, పెట్టుబడులకు అడ్డంకులు లేకుండా చేయడమే ఈ హబ్ ముఖ్యోద్దేశం. సిడ్నీలో దీన్ని నెలకొల్పనున్నారు. పెట్టుబడులను ఈ రంగంలోకి తీసుకొచ్చేందుకు మార్గాల అన్వేషణ, ఇన్ఫ్రా మార్కెట్ల నిర్వహణ, ఫైనాన్సింగ్‌ను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఆయా దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి హబ్ తోడ్పాటునందిస్తుంది. నాలుగేళ్ల నిర్దేశిత కాలవ్యవధిని ఇందుకు నిర్ధేశించారు. ఈ హబ్ ద్వారా 2030 నాటికి గ్లోబల్ ఇన్ఫ్రా రంగంలో మరో 2 లక్షల కోట్ల డాలర్ల నిధులను ప్రవహింపజేసేందుకు వీలవుతుందని జీ20 దేశాలకు చెందిన బీ20 వ్యాపార దిగ్గజాల బృందం అంచనా వేసింది. రెమిటెన్స్‌ల చార్జీలను 5 శాతానికి తగ్గించాలి... ప్రవాశీయులు విదేశాల నుంచి స్వదేశానికి పంపే డబ్బు(రెమిటెన్స్) విషయంలో విధిస్తున్న చార్జీలను తగ్గించేందుకు కృషిచేస్తామని జీ20 హామీనిచ్చింది. ప్రపంచ సగటు రెమిటెన్స్ వ్యయాన్ని 5 శాతానికి తగ్గించేందుకు పటిష్టమైన , ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొంది. కొన్ని దేశాల్లో రెమిటెన్స్‌లపై గరిష్టంగా 10 శాతం వరకూ చార్జీలు విధిస్తుండటాన్ని కూడా జీ20 ప్రస్తావించింది. సమీకృత ఆర్థికాభివృద్ధిని పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భారత్, ఇతర వర్ధమాన దేశాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశాన్ని సదస్సు తన ప్రకటనలో చేర్చడం గమనార్హం. గతేడాది 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులతో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. -
భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్
న్యూయార్క్: ఫోర్బ్స్ శక్తివంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ శక్తివంతులైన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మోదీ 15 స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్న మోదీని ఫోర్బ్స్ ఇండియా రాక్‌స్టార్‌గా అభివర్ణించింది. కాగా ప్రపంచంలోనే శక్తిమంతులైన 72 వ్యక్తులుగా ఫోర్బ్స్ పేర్కొన్న జాబితాలో రిలయన్స్ సంస్థల ఛైర్మన్ ముఖేష్ అంబానీ 36వ స్థానంలో, లక్ష్మీ మిట్టల్ 57, మైక్రోసాప్ట్ సీఈవో సత్యా నాదేండ్ల 64వ స్థానంలో నిలిచారు. -
ఒబామాకు ‘మధ్యంతర’ షాక్
ఇక రెండేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడికి గడ్డుకాలమే! వాషింగ్టన్: అమెరికా పార్లమెంటు ఉభయసభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు బరాక్ ఒబామాను, అధికార డెమొక్రాటిక్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 36 స్థానాలకు(మొత్తం 100 సీట్లు), మొత్తం 50 రాష్ట్రాలకు గానూ.. 36 రాష్ట్రాల్లో గవర్నర్ పోస్ట్‌లకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ప్రతినిధుల సభ, సెనెట్.. రెండింటిలోనూ రిపబ్లికన్లు ఆధిపత్యం సాధించారు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు 235 సీట్లు దక్కించుకోగా.. డెమోక్రాట్లు 157 స్థానాలకే పరిమితమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 199, డెమోక్రాట్లకు 233 స్థానాలు ఉన్నాయి. సెనెట్‌లో రిపబ్లికన్లు 52 సీట్లలో, డెమోక్రాట్లు 43 స్థానాల్లో గెలుపొందారు. సెనేట్‌లో రిపబ్లికన్లు మెజారిటీ పెంచుకోవడం.. గడిచిన ఎనిమిదేళ్లలో ఇది తొలిసారి. కెంటకీకి చెందిన సెనేటర్ మిచ్ మెక్‌కొనెల్.. సెనేట్ మెజారిటీ లీడర్ హోదాను చేజిక్కించుకుని తన కలను సాకారం చేసుకోనున్నారు. నార్త్ కరోలినా, ఆర్కన్సాన్, కొలరాడోలలో అధికార డెమోక్రాట్ల సీట్లను రిపబ్లికన్లు చేజిక్కించుకున్నారు. అత్యంత పోటీ ఉన్న ప్రతిష్టాత్మక అయోవో సెనేట్ సీటును రిపబ్లికన్ అభ్యర్థి జోనీ ఎర్నెస్ట్ దక్కించుకోవడం గమనార్హం. గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టున్న మేరీలాండ్, ఇలినాయిస్లలో రిపబ్లికన్లు ఘన విజయం సాధించారని విశ్లేషకులు చెబుతున్నారు. డెమోక్రాట్లకు శరాఘాతం: అధికార డెమోక్రాట్లకు తాజా ఫలితాలు మింగుడుపడడం లేదు. ఒబామా రెండేళ్ల పదవీ కాలంలో తలపెట్టే కీలక పాలనా యంత్రాంగ సంస్కరణలు ఆమోదం పొందడం ఇక కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఒబామాను చాలా మంది కుంటి బాతుగా పిలవడం మొదలుపెట్టారు. రెండేళ్ల పదవీ కాలంలో ఒబామా ఇక గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. -
అజామ్‌గఢ్ నుంచి అమెరికా వరకు!
ఫ్రాంక్ ఇస్లామ్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తి అయ్యారు. కారణం... అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ఆయనకు ప్రశంసలు లభించడమే. వాషింగ్టన్‌లోని పొటొమ్యాక్లో ఉన్న ఇంద్రభవనం లాంటి ఇస్లామ్ ఇల్లు... చాలామందితో పాటు ఒబామా మనసును కూడా దోచుకుంది. ఒబామా స్వయంగా ఇస్లామ్‌కు ఫోన్ చేసి తెగ మెచ్చుకున్నారు. ఇస్లామ్ ఇంద్ర భవంతిలో ఎన్నో గదులు, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు ఫ్రాంక్ ఇస్లామ్ కనిపించని కష్టం కూడా ఆ భవనం పునాదులలో ఉంది. ఇస్లామ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అందరినీ ఆకట్టుకుంటున్న అతడి ఇంటి గురించి మాత్రమే కాదు... సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్న అతని వ్యక్తిత్వాన్ని గురించి కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి... ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌గఢ్‌లో జన్మించారు ఇస్లామ్. అజామ్‌గఢ్ మురికివాడల్లో నుంచి అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఏయంయు) వరకు... అక్కడి నుంచి అమెరికాకు ఇస్లామ్ ప్రయాణం కొనసాగింది. తనకు బాగా ఇష్టమైన ‘ఏయంయు’ నుంచి యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో (అమెరికా) లో చేరారు ఇస్లామ్. అక్కడ చదువు పూర్తి చేసిన తరువాత ఎన్నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలలో ఉద్యోగం చేశారు. అయితే తనకు ఎప్పుటి నుంచో ఒక కల ఉండేది - సొంతంగా ఒక కంపెనీ స్థాపించాలని! వ్యాపారవేత్తగా రాణించాలని! చేస్తున్న ఉద్యోగం మానేసి 1994లో తన దగ్గరున్న కొద్ది పెట్టుబడితో ‘క్యూయస్యస్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించారు. ‘‘ఉద్యోగం చేయడమంటే ఆ ఉద్యోగం వరకు మాత్రమే ఆలోచిస్తాం. వ్యాపారం అలా కాదు. అనేక రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధపడ్డాను’’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు ఇస్లామ్. ‘‘నా దగ్గర పెద్దగా డబ్బు లేదు. సౌకర్యాలు కూడా లేవు. ఆత్మవిశ్వాసం ఉంది. భవిష్యత్తు ఉంది’’ అని గట్టిగా అనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని ముందుకు కదిలారు ఇస్లామ్. కంపెనీ ప్రారంభించినప్పుడు... ఒకే ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగి తానే! ‘సవాలును ఆహ్వానించేవాడే, విజయాన్ని ఆస్వాదించగలడు’ అనేది ఇస్లామ్ నమ్మిన సిద్ధాంతం. అదే ఆయన్ను విజేతను చేసింది. ఒక్కడితో ప్రారంభమైన కంపెనీ పదమూడు సంవత్సరాల తరువాత వేలాది ఉద్యోగుల స్థాయికి చేరుకుంది. వ్యాపారంలో భారీ విజయం సాధించిన ఇస్లామ్, ఆ స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి మరింత ధనం గడించే అవకాశం ఉన్నా...‘ ఇక చాలు’ అనుకున్నారు. ‘ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా దానికి తిరిగి ఇవ్వాలి’ అనుకున్నారు. విజయవంతంగా నడుస్తున్న తన కంపెనీని 2007లో అమ్మేసి అమెరికా, భారత్‌లలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారు ఇస్లాం. తాను స్థాపించిన ‘ఫ్రాంక్ ఇస్లాం అండ్ డెబ్బి డ్రైస్మెన్ ఛారిటబుల్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు సహాయపడడం ప్రారంభించారు. రాజప్రాసాదాన్ని తలపించే ఇంటిని ఉద్దేశించి ‘‘ఇంత ఆడంబరం అవసరమా?’’ అని ఎవరైన ఇస్లామ్‌ని అడిగితే ఆయన మాత్రం తడుముకోకుండా- ‘‘వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వాడు, నల్లచర్మం ఉన్నవాడు కూడా భారీ విజయాలు సాధించగలడు అని చెప్పడానికి నా భవంతి ఒక ప్రతీక’’ అంటారు నవ్వుతూ. చదువు గురించి ఆయన ఎప్పుడూ గొప్పగా చెబుతారు. అందరినీ సమానీకరించే శక్తి చదువుకు ఉందంటారు. ‘‘విద్య అనేది ఇరవై ఒకటవ శతాబ్దపు కరెన్సీ’’ అంటూ ఒబామా చెప్పే మాటను తరచుగా ఉటంకిస్తారు. అజామ్‌గఢ్ నుంచి అమెరికా యూనివర్శిటీలలో చేరే ఎందరో విద్యార్థులకు ఇస్లామ్ అండగా నిలుస్తున్నారు. అజామ్‌గఢ్‌లో ఒక హైస్కూల్, కాలేజి నిర్మాణానికి ప్రణాళిక వేశారు. చదువులో ప్రతిభ చూపుతున్న ఆలీగఢ్ యూనివర్శిటీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నారు. కేవలం విద్యకు సంబంధించిన కార్యక్రమాలకే పరిమితం కాకుండా కళా, సాంస్కృతిక రంగాలలో కూడా ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలను చేస్తున్నారు. మహిళలకు సంబంధించిన రకరకాల సంక్షేమ పథకాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అజామ్‌గఢ్ చుట్టుపక్కల జిల్లాలలో ఎక్కడా ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన ‘ఐటిఐ’లు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకొని అజామ్‌గఢ్‌లో ‘ఖమ్రూన్ నిస మెమోరియల్ గర్ల్స్ టెక్నికల్ కాలేజీ’’కి శంకుస్థాపన చేశారు. ‘‘అమెరికా సంపన్నుడు ఇస్లామ్ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. తన దేశానికి సంబంధించిన అభిమానాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా... చేతల రూపంలోనూ చూపుతున్నారు’’ అంటారు ఇస్లామ్ సన్నిహితులు మెచ్చుకోలుగా. ఒక కుర్రాడు అమెరికాలో చదవడానికి వెళుతుంటే ‘‘ఇస్లామ్లా పెద్ద పేరు తెచ్చుకోవాలి’’ అని దీవించే తల్లిదండ్రులు, ‘‘మనలో పట్టుదల ఉండాలేగానీ... ఏదైనా సాధించవచ్చు’’ అని పిల్లలకు ఇస్లామ్ జీవితాన్ని వ్యకిత్వ వికాస పాఠంగా చెప్పే ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. -
నమో.. ఒబామా
-
మార్టిన్‌కు మోదీ, ఒబామా నివాళి
వాషింగ్టన్: మోదీ అమెరికా పర్యటనలో మరో అరుదైన సంఘటన! ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్‌కు మోదీ, ఒబామాలు కలసికట్టుగా నివాళి అర్పించారు. ఇద్దరూ వైట్‌హౌస్‌లో చర్చల అనంతరం నేరుగా మార్టిన్ మెమోరియల్ వద్దకు వెళ్లి హక్కుల నేతను స్మరించుకున్నారు. కాసేపు స్మారకం చుట్టూ నడిచారు. స్మారక ప్రాధాన్యం గురించి ఒబామా మోదీకి వివరించారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో మోదీ ఒక్కరే పాల్గొనాల్సి ఉండగా, ఒబామా చివరి నిమిషంలో షెడ్యూలు మార్చుకుని భారత ప్రధానితో కలసి వెళ్లారు. -
వైట్‌హౌస్‌లో.. మంచినీళ్లతో..
మోదీకి విందు ఇచ్చిన ఒబామా ఉపవాసం కారణంగా ఏమీ తినని మోదీ 90 నిమిషాల పాటు చర్చలు వాషింగ్టన్: అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్.. విందు ఇస్తున్నది అధ్యక్షుడు ఒబామా.. ఈ విందుకు హాజరైన అసాధారణ అతిథి మన ప్రధాని నరేంద్ర మోదీ.. కానీ ఈ విందులో మోదీ కేవలం కొన్ని మంచి నీళ్లు తాగేసి ఊరుకున్నారు. కారణం నవరాత్రుల సందర్భంగా ఆయన ఉపవాసం ఉండడమే.. తమ దేశ పర్యటనకు వచ్చిన మోదీకి ఒబామా వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఈ విందులో అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్‌తో పాటు భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, దౌత్యవేత్త ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్తో సహా మొత్తం 20 మంది మాత్రమే పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లోని బ్లూరూమ్(భోజనాల గది)లో ఏర్పాటుచేసిన ఈ విందులో బాస్మతి బియ్యంతో వండిన అన్నం, చేపలు, పండ్లను, మామిడి క్రీమ్‌తో చేసిన ఐస్‌క్రీమ్‌ను సిద్ధంగా ఉంచగా... మోదీ మాత్రం కొన్ని మంచినీళ్లను మాత్రమే తీసుకున్నారు. నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నందున తానేమీ తినడం లేదని.. మిగతా అతిథులంతా ఇబ్బంది పడకుండా సాధారణంగానే భోజనం చేయాలని విజ్ఞప్తి చేశారు. 90 నిమిషాలు భేటీ..: వైట్‌హౌస్‌లో విందు అనంతరం ఒబామాతో మోదీ పలు అంశాలపై దాదాపు 90 నిమిషాల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం.. ‘భేటీ చాలా బాగా సాగింది. పలు అంశాల్లో ఇరు దేశాలు కలసి పనిచేయాలనే అంశంలో ఇరువురి ఆలోచనలను పంచుకున్నాం..’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఒబామా, మోదీల భేటీపై భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. దౌత్య సంబంధాలు, ఉగ్రవాద నిర్మూలన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలిపారు. ఈ భేటీ చాలా అద్భుతంగా కొనసాగిందని పేర్కొన్నారు. కాగా.. ఈ సందర్భంగా ఒబామాకు భగవద్గీతపై మహాత్మాగాంధీ వ్యాఖ్యానాల సంకలనాన్ని, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్‌కు చెందిన జ్ఞాపికను మోదీ బహుమతిగా ఇచ్చారు. మోదీ.. ‘కెం చో’.. ‘కెం చో’... వైట్‌హౌస్‌లో విందుకు హాజరైన ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుశల ప్రశ్న ఇది. ‘కెం చో’ అంటే గుజరాతీ భాషలో.. ‘ఎలా ఉన్నారు?’ అని అర్థం. గుజరాతీ అయిన మోదీని ఆయన మాతృభాషలోనే ఒబామా పలకరించారు. దీనికి స్పందనగా మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మోదీతో కరచాలనం చేసిన ఒబామా.. వైట్‌హౌస్‌లోకి తోడ్కొని వెళ్లారు. -
ఒబామాతో మోడీ భేటీ
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ఒబామాతో భేటీ కావడమిది రెండోసారి. వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో ఒబామాతో చర్చలు జరుపుతున్నారు. ద్వైపాక్షిక అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయి. -
మోడీని గుజరాతీలో పలకరించిన ఒబామా
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేతసౌథంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒబామా 'కేమ్ చో మిస్టర్ పీఎం?(హౌ ఆర్ యూ)' అంటూ మోడీకి గుజరాతీలో పలకరించారు. తొలిసారి కలుసుకున్న ఇద్దరు నేతలూ పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. మోడీ గౌరవార్ధం ఒబామా వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఈ విందులో మోడీ, ఒబామాతో పాటు 20మంది ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం మరోసారి ఒబామా, మోడీ భేటీ కానున్నారు. ఓవల్ హౌస్‌లో జరిగే ఈ సమావేశంలో సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. కాగా శ్వేతసౌధంలో ఇచ్చిన ఈ విందుకు ఒబామా సతీమణి మిషేల్ ఒబామా హాజరు కాలేదు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కూతురు గురించి బెంగపడుతున్న ఒబామా
వాషింగ్టన్ : కన్నబిడ్డ కాసేపు కనిపించకపోతేనే తల్లడిల్లుతాం. అదే ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డను కాస్త దూరంగా పంపాలంటే ఏ తండ్రి కళ్లయినా చెమ్మగిల్లుతాయి. దేశానికి రాజు అయినా... తండ్రి మమకారం విషయంలో మాత్రం అతడు మామూలు వ్యక్తే. ఇందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మినహాయింపు కాదు. ప్రపంచంలోనే అగ్రరాజ్యానికి అధినేత అయిన ఒబామా తన పెద్ద కూతురు మాలియాను ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు పంపించే విషయమై ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు. బిడ్డను విడిచి దూరంగా ఎలా ఉండాలా అని భావోద్వేగానికి లోనవుతున్నారు. 16 ఏండ్ల మాలియా ఇప్పుడు 11 గ్రేడ్ చదువుతోంది. మరికొన్ని నెలల తర్వాత ఆమె కాలేజీ చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లే అవకాశముంది. అయితే, ఆ సందర్భంలోని తీపిని, చేదును ఎదుర్కోవడానికి గత రెండేళ్లుగా తాను భావోద్వేగంగా సన్నద్ధమవుతున్నట్టు ఒబామా చెప్పారు. ఇటీవల మస్సాచుసెట్స్ హైస్కూల్ గ్రాడ్యుయెట్స్తో మాట్లాడిన ఆయన ‘ఆ సందర్భంలో భావోద్వేగానికి లోనవ్వకుండా, ఏడ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆమెను ఇబ్బందిపెట్టను. అది నా పరీక్షా సమయమే’ అని పేర్కొన్నారు. ఇప్పటికే తండ్రి అంత ఎత్తు పెరిగిన మాలియా గతకొన్ని రోజులుగా స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీల్లో పర్యటిస్తున్నది. ఈ రెండు వర్సిటీలో ఒబామా కుటుంబం నివాసముంటున్న వైట్‌హౌస్‌కు చాలా దూరం. అన్నట్టు స్టాన్ఫోర్డ్ యూని వర్సిటీలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బిడ్డ చెల్సియా చదువుకుంది. -
సోషల్ నెట్వర్క్ సైట్లలో మోడీ Vs ఒబామా
-
ఒబామానే మెప్పించాడు!
విజయం అద్భుతాలు సృష్టించడానికి వయసుతో పని లేదు. ఆ విషయం యూసుఫ్ బాతాని చూస్తే తెలుస్తుంది. పుట్టుకతోనే బధిరుడైన ఈ చిన్నారి చదువులో అందరినీ తోసిరాజన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతోనే శభాష్ అనిపించుకున్నాడు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన యాకూబ్ బాతా... ఉద్యోగ నిమిత్తం భార్యతో సహా అబుదబీ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ వారికి యూసుఫ్ జన్మించాడు. వంశోద్ధారకుడు పుట్టాడన్న వారి ఆనందం మీద... యూసుఫ్ లోని వినికిడి లోపం నీళ్లు చల్లింది. పిల్లాడు వినలేడని తెలుసుకున్న ఆ దంపతులు కుమిలిపోయారు. అయినా అతడికి జీవితంలో ఉన్నత స్థితికి చేరేలా పెంచాలన్న ఉద్దేశంతో... అందుకు సాయం చేసే సంస్థ కోసం వెతికారు. అమెరికాలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డెఫ్’ వారి ఆశను నెరవేర్చింది. యూసుఫ్ బాధ్యతను తీసుకుంది. ఆ సంస్థ ద్వారా అక్షరాలు దిద్దిన యూసుఫ్... చూస్తూండ గానే ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరచి ఇటీవలే ‘ఔట్‌స్టాండింగ్ అకడమిక్ అచీవ్మెంట్ అవార్డు’ను అందుకున్నాడు. అతడి ప్రతిభ గురించి తెలుసుకున్న ఒబామా ప్రశంసలు కురిపిస్తూ స్వయంగా యూసుఫ్‌కి ఉత్తరం రాశారు. జీవితంలో ఇంకా ఇంకా ఎదగాలని ఆశీర్వదించారు. -
ప్రధాని హోదాలో అమెరికాకు మోడీ
న్యూఢిల్లీ : ఎట్టకేలకు నరేంద్ర మోడీ భారత ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై అడుగు పెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వ ఘన విజయాన్ని దక్కించుకున్న సందర్భంగా మోడీకి... అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి అభినందించిన విషయం తెలిసిందే. తమ దేశానికి రావాలని మోడీని ఈ సందర్భంగా ఒబామా ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లనున్నారు. వాషింగ్టన్లో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో మోడీ, ఒబామా పాల్గొననున్నారు. దీంతో భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలకు కొత్త అధ్యయనం మొదలైందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమావేశాలు జరిగే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వీలుగా ఇరువురికీ ఆమోదనీయమైన సమయంలో రావాలని అమెరికా సెప్టెంబర్ 30వ తేదీని ప్రతిపాదించగా, భారత్ మాత్రం సెప్టెంబర్ 26వ తేదీని సూచించింది. దీనిపై మోడీ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా 2002నాటి గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందన్న ఆరోపణలతో అమెరికా ఆయన వీసాపై 2005లో నిషేధం విధించింది. ఆ నిషేధం మోడీ ప్రధాని పీఠం ఎక్కేవరకూ కొనసాగిన విషయం తెలిసిందే.