'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ..

Assam CM Himanta Biswa Sarma Hussain Obama Remark Sparks Row - Sakshi

గువాహటి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ‍్యాఖ్యలు చేశారు. భారత్‌లో అనేకమంది హుస్సేన్‌ ఒబామాలు ఉన్నారని వ్యంగ్యంగా ట్విట్టర్ వేదికగా అన్నారు. అలాంటి వారిని ఎదుర్కోవడమే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. భారత్‌లో మైనార్టీల దుస్థితిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఒబామాను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసులు వాషింగ్టన్‌ వెళ్తారా అంటూ ట్విటర్‌లో వచ్చిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. 

అసోం పోలీసులు స్వీయ ప్రాధామ్యాల ప్రకారం నడుచుకుంటారని బిశ్వశర్మ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విపక్ష నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒక పాత్రికేయుడు ట్విటర్‌లో ప్రశ్న అడిగారు. ఒబామాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారా? అని ఆయన అడిగారు. దీనిపై అసోం సీఎం వివాదస్పదంగా బదులివ్వడం రాజకీయంగా రగడకు దారితీసింది.  

 సీఎం వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్‌ క్రాస్టో ఫైరయ్యారు. భారత్‌లో మతం ఆధారంగా వివక్ష లేదంటూ అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తి వ్యతిరేకంగా అసోం సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం ఈ అంశంలో క్షమాపణలు చెప్పకపోతే ప్రధాని మోదీని ప్రపంచం ఎలా విశ్వసిస్తుందని ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: మణిపూర్‌: అమిత్‌ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్‌ నుంచి వెళ్లింది వీరే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top