
కరాచీ: ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్‌లను భారత్‌కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్‌కు చెందిన ఆల్ జజీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్.
లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్‌ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్‌తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటువంటి అభ్యంతరం చెప‍్పదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ స్పష్టం చేశారు.
ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్ సహకరించాలన్నారు.
ఇందుకు భారత్ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. భారత్ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్‌కు అప్పగిస్తామన్నారు.
నున్వెలా ప్రకటిస్తావ్!
బిలావల్ భుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్రంగా మండిపడ్డారు. బిలావాల్ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.