Kakinada District News
-
జీడిపండుకు మూడు గింజలు!
మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో అంబటి లక్ష్మీనారాయణకు చెందిన జీడి తోటలో ఒక చెట్టుకు కాసి న జీడిపండుకు మూడు గింజలు ఉన్నాయి. సాధారణంగా ఒక పండుకు ఒకే గింజ ఉంటుంది. కానీ ఇక్కడ మూడు గింజలు ఉండటం స్థానికులను ఆశ్చర్యపరచింది. ఇంటర్ ఫీజు చెల్లింపునకు 5 వరకూ అవకాశం అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకూ జరగనున్న అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు రెండు రోజులు గడువు పెంచినట్లు డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. కొంతమంది విద్యార్థులకు మరికొంత సమయం ఇస్తే ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటర్మీడియెట్ బోర్డు దృష్టికి వెళ్లినట్లు డీఐఈవో స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశంగా ముందు నిర్దేశించిన ఈనెల 3వ తేదీని 5వ తేదీ వరకూ రెండు రోజుల పాటు పెంచినట్లు ఆయన వివరించారు. ఈ గడువు పెంపుతో పాటు ఆ లోపు ఫీజు చెల్లించే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా చెల్లించే అవకాశాన్ని బోర్డు కల్పించిందని ఆయన వెల్లడించారు. ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో మట్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతా అరవింద్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు యానాంకు చెందిన అరవింద్ కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మ్‌డి కోర్సు చదువుతున్నాడు. కాకినాడ నుంచి ద్విచక్రవాహనంపై యానాం వెళుతుండగా మట్లపాలెం లేఅవుట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో అరవింద్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన కాకినాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. బంగారు ఆభరణాల చోరీ అన్నవరం: గ్రామ శివార్లలోని కొత్తపేటలో ఒక కుటుంబం ఊరెళ్లిన విషయం పసిగట్టిన దొంగలు ఇంటి తలుపుల తాళం బద్దలు కొట్టి రూ.పది లక్షల విలువైన 98 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన వి.విజయ గత నెల 29న విశాఖపట్నంలోని తన అమ్మగారి ఇంటికి వెళ్లారు. అయితే శుక్రవారం ఉదయం ఆమె ఇంటికి ఎదురుగా ఉన్న వారు ఆమెకు ఫోన్ చేసి మీ ఇంటి తలుపు తాళం బద్దలు కొట్టి ఉందని తెలిపారు. దీంతో ఆమె విశాఖపట్నం నుంచి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులతో బాటు బీరువాలోని లాకర్ తాళం బద్దలు కొట్టి సుమారు 98 గ్రాముల బంగారం అపహరించిన విషయం వెల్లడైంది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ వచ్చి ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జీజీహెచ్ మేల్ నర్సు సస్పెన్షన్
త్రిసభ్య కమిటీ విచారణ మేరకు కలెక్టర్ నిర్ణయం కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు మేల్ నర్సు పోలాబత్తిన శ్రీనివాసరావును కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు అధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు, సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు, జీజీహెచ్ సూపరింటెండెంట్ సూచనలతో నర్సింగ్ విభాగం అధికారులు ఈ ఉత్తర్వులను శుక్రవారం శ్రీనివాసరావుకు అందజేశారు. 2025 రిపబ్లిక్ డే పురస్కారాలకు ప్రతిభ ఆధారంగా స్వయానా కలెక్టర్ ఆమోదం మేరకు ఎంపిక అయి అవార్డులు అందుకున్న తన తోటి నర్సింగ్ సిబ్బందిని శ్రీనివాసరావు వాట్సాప్ వేదికగా తీవ్ర పదజాలంతో మహిళలు అని కూడా కనీసం గౌరవం చూపక అవమానపరుస్తూ పోస్టులు పెట్టాడని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని ఎంపిక చేసిన కలెక్టర్, జీజీహెచ్ సూపరింటెండెంట్, హెచ్వోడీలు, నర్సింగ్ సూపరింటెండెంట్ల నిర్ణయాన్ని కూడా నిరాధార వ్యాఖ్యలతో తప్పుబట్టాడని ఆదేశాల్లో ప్రస్తావించారు. తాను చేసే ఆరోపణలకు నర్సింగ్ వర్గాల నుంచి మద్దతు ఉందని నమ్మించేందుకు ఖాళీ పత్రాలపై సంతకాలు సేకరించాడని, ఎందుకు ఖాళీ పత్రాలపై సంతకాలు సేకరిస్తున్నావని నర్సులు అడిగితే మన సమస్యలను ఉన్నతాధికారులకు, నాయకులకు నివేదించేందుకని నమ్మబలికాడని ఆదేశాల్లో తెలిపారు. ఏపీ ఎన్జీవో, జిల్లా నర్సింగ్ అసోసియేషన్ల సూచనలతోనే తాను ఇలా సంతకాల సేకరణ చేపడుతున్నానని నర్సులతో అన్నాడని, ఈ విషయంపై ఆయా సంఘాల నాయకులు తమకేమీ సంబంధం లేదని, తమ సంఘాల పేర్లను వ్యక్తిగత వైషమ్యాల కోసం వాడుకుంటున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని సస్పెన్షన్ ఆర్డర్లో ప్రస్తావించారు. సంతకాల సేకరణ ఈ ఏడాది జనవరి 30వ తేదీన రాత్రి 10.30 కి ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగిస్తూ నర్సుల విధులకు శ్రీనివాస్ ఆటంకం కలిగించాడని ఆర్డర్లో పేర్కొన్నారు. సదరు ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్ విచారణాధికారిగా త్రిసభ్య కమిటీని నియమించి శ్రీనివాసరావుపై విచారణ నిర్వహించి వివరణ కోరామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణలో వాస్తవాలు స్పష్టం కావడంతో పాటు సంతకాలు పెట్టిన నర్సులు, నాయకులు శ్రీనివాసరావుపై ఫిర్యాదులు చేశారని ప్రస్తావించారు. అతడి వివరణ సైతం అసంబద్దంగా ఉందని, శ్రీనివాస్ వివరణతో కూడిన విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించినట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు. విచారణలోని వాస్తవాల ఆధారంగా శ్రీనివాసరావుపై కలెక్టర్ సస్పెన్షన్ వేటుకు ఆదేశాలిచ్చారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
● రూ.41,50,000 విలువగల వాహనాలు, నగలు, వెండి, నగదు స్వాధీనం ● 25 కేసుల్లో నిందితులుగా గుర్తింపు బిక్కవోలు: అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, నగలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్‌జోన్ ఇన్చార్జి డీఎస్పీ ఎం.భవ్యకిషోర్ తెలిపారు. శుక్రవారం ఆమె బిక్కవోలు పోలీస్ సేష్టన్ వద్ద మాట్లాడారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన దల్లి కామిరెడ్డి, చినరాచపల్లి గ్రామానికి చెందిన కచ్చల చిరంజీవి, జంగాలపల్లి గ్రామానికి చెందిన సఖిలేటి సాయి, గిడుతూరు గ్రామానికి చెందిన వళ్లు శ్రీను జనవరి 9 తేదీన బిక్కవోలు మండలం బలభద్రపురంలో మూడు చోట్ల చోరీ యత్నం చేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించిన బ్రీజా కారుపై వీరు బలభద్రపురం వచ్చారు. వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్ల చోరీతో పాటు ఏటీఎంలో దొంగతనం, నగల షాపులో చోరీ ప్రయత్నం చేశారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల సాయంతో నలుగురు ముద్దాయిల్లో ఒకరు అయిన సాయిని గుర్తించారు. అతనిని మార్చి 3వ తేదీన తుని రైల్వేస్టేషన్ వద్ద బిక్కవోలు పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యలగూడెంలో దొంగలించిన బైక్‌ను స్వాధీనం చేసుకొని అతనిని రిమాండ్‌కు పంపించారు. కచ్చల చిరంజీవి మాకవరపుపాలెం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మిగిలిన ఇద్దరు నిందితులు దల్లి కామిరెడ్డి, వళ్లు శ్రీనును గురువారం సాయంత్రం 4గంటలకు తుని రైల్వే స్టేషన్ వద్ద అనపర్తి సీఐ సుమంత్, ఎస్సై రవిచంద్రకుమార్ తన బృందంతో అరెస్టు చేశారు. వారిపై తూర్పుగోదావరి జిల్లాలో 3, కాకినాడ జిల్లా 11, అనకాపల్లి జిల్లా 7, ఏలూరు జిల్లా 1, శ్రీకాకుళం జిల్లా 2, విశాఖ జిల్లాలో 1 కేసులు ఉన్నాయి. వీరి నుంచి 71 గ్రాముల బంగారు వస్తువులు, 1.02 కిలోల వెండి వస్తువులు, రూ. 9,80,000 నగదుతో పాటు మూడు బైకులు, ఒక కారు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలు, గ్యాస్ కట్టర్‌తో పాటు రూ.41,50,000 విలువగల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
రెండు జేసీబీల స్వాధీనం
పి.గన్నవరం: గడువు ముగిసినా మానేపల్లి లంక నుంచి పెదకందాలపాలెం ర్యాంపు మీదుగా అక్రమంగా మట్టి తరలిస్తున్న నేపథ్యంలో మైన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పెదకందాలపాలెం వద్ద ర్యాంపులో ఉన్న రెండు జేసీబీలను సీజ్ చేశారు. మానేపల్లిలంక నుంచి హైవే పనులకు మట్టి తీసేందుకు గడువు ముగిసిందని మైన్స్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ర్యాంపులో పనిచేస్తున్న రెండు జేసీబీలు సీజ్ చేసినట్టు మైన్స్ ఆర్ఐ సుజాత తెలిపారు. గడువు ముగిసిన నేపథ్యంలో ఈ ర్యాంపుల నుంచి మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ రెహమాన్ అలీ, మానేపల్లి వీఆర్వో నాగన్న ఆమె వెంట ఉన్నారు. -
చంద్రప్రభ వాహనంపై వీరేశ్వరుడు
వైభవంగా రుద్రహోమం ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు శైవాగమ పద్ధతిలో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయంలో ఉదయం గవ్యాంతం, పంచవింశతి కలశ స్థాపన పూర్వక అభిషేకం, లక్ష్మీగణపతి హోమం, రుద్రహోమం నిర్వహించారు. సాయంత్రం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించిన చంద్ర ప్రభ వాహనంపై ఊరేగించారు. ఈ ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సావాల సందర్భంగా ఆలయ ఆవరణలో భారీ చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఘనంగా ఆదిశంకర జయంతి ఆదిశంకరాచార్య జయంతిని పురస్కరించుకొని మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శంకర జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ పురోహితులు నాగాభట్ల రామకష్ణమూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకస్వాములు, పండితులు వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా కార్యక్రమం నిర్వహించారు. -
బొప్పాయికి రింగ్ స్పాట్
మొజాయిక్ ఇది వైరస్ వలన పంటను ఆశిస్తుంది. ఆకులపైన పసుపు వర్ణం, ఆకుపచ్చ వర్ణం కలిగిన కణజాలం తయారై మొజాయిక్ లక్షణాలు కనబడతాయి. ఈ తెగులు సోకిన ఆకులు క్రమేపీ పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. తెగులు సోకిన చెట్టు కాయ పరిమాణం తగ్గి నాణ్యత కోల్పోతుంది. ఈ తెగులును తెల్లదోమ వ్యాప్తి చేస్తుంది. నివారణ చర్యలు బొప్పాయి పంట సాగుచేసే రైతులు మొక్కలు నాటిన 20 రోజుల తరువాత వేపనూనెను 5 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఈ తెగులును వ్యాప్తి చేసే దోమను నివారించవచ్చు. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎసిటామిఫ్రిడ్ ఎకరానికి 40 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా డయోమిథాగ్జామ్ 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేస్తే తెగులును నివారించవచ్చు. ● మొక్కతోటలపై ప్రభావం అధికం ● సస్యరక్షణ చర్యలు తప్పనిసరి పెరవలి: జిల్లాలో బొప్పాయి తోటలు 200 హెక్టార్లలో సాగు జరుగుతుండగా ఒక్క నిడదవోలు నియోజకవర్గంలోనే 50 హెక్టార్లలో ఈ పంట పండిస్తున్నారు. పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, దేవరపల్లి, కడియం, కొవ్వూరు, మండలాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. బొప్పాయి తోటలపై మొజాయిక్, రింగ్‌స్పాట్, ఆకుముడత వంటి తెగుళ్లు ఎక్కువగా ఆశించి ఉండటంతో మొక్కల్లో ఎదుగుదల ఆగి తోటలు పాడైపోతున్నాయని కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. వీటిపై వచ్చే తెగుళ్లు, సస్యరక్షక్ష ణ చర్యలు, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన వివరించారు. రింగ్‌స్పాట్ వైరస్ ఈ తెగులు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులతో వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగవలె మారుతాయి. కాయలు, కాండం పైన ఉంగరం లాంటి మచ్చలు ఏర్పడి నాణ్యతను కోల్పోయేలా చేస్తాయి. పండ్లు ముగ్గినప్పుడు రింగ్ ఏర్పడినచోట వాసన వస్తుంది. నివారణ చర్యలు బొప్పాయి పంట సాగుచేసే రైతులు మొక్కలు నాటిన 20 రోజుల తరువాత వేపనూనెను 5 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఈ తెగులును వ్యాప్తిచేసే దోమను నివారించవచ్చు. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎసిటామిఫ్రిడ్ ఎకరానికి 40 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా డయోమిథాగ్జామ్ 10లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేస్తే తెగులును నివారించవచ్చు. ఆకుముడత తెగులు ఈ తెగులు పురుగుల వల్ల వైరస్ వ్యాప్తిచెంది తీవ్ర నష్టాన్ని కలుగుతుంది. తెగులు ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుని పోతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ఉండలుగా మారి వికృత రూపం దాల్చుతాయి. కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి వంకరటింకరగా తయారవుతాయి. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ తెగులును రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంకలు వ్యాప్తి చేస్తాయి. నివారణ చర్యలు ఎసిటామిఫ్రిడ్ ఎకరానికి 40 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా డయోమిథాగ్జామ్ 10లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేస్తే తెగులును నివారించవచ్చు. ఎరువుల యాజమాన్యం బొప్పాయి మొక్కలకు ఎరువులు ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. మొక్కలు నాటినప్పుడే కాక ప్రతీ మొక్కకు రెండునెలలకు ఒకసారి 90 గ్రాముల యూరియా, 250 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్పేట్, 150 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. ఇలా సంవత్సరానికి 6 దఫాలుగా ఎరువులు వేస్తే మొక్కకు మంచి పోషకాలు అందుతాయి. ఈ విధంగా ఎరువులు వినియోగించడం వల్ల మొక్కకు మంచి పోషకాలు అంది అధిక దిగుబడిని అందిస్తాయి. సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపటినప్పుడు తెగుళ్లను నివారించవచ్చు. –సీహెచ్ శ్రీనివాస్, ఉద్యాన అధికారి, కొవ్వూరు -
బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం
● సూర్యారావుపేట సాగర తీరంలో క్రీడా సందడి ● ప్రారంభ మ్యాచ్ పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా విజయం కాకినాడ రూరల్: కాకినాడ సాగర తీరాన క్రీడా సంబరం ఆరంభమైంది. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ వుమెన్స్ అంతర జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలు కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట బీచ్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను కలెక్టరు షణ్మోహన్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కౌడా వైస్ చైర్పర్సన్ భావన, ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన పురుషుల 13 జట్లు, మహిళల 13 జట్లు మూడు రోజులు పాటు జరగనున్న పోటీలలో పాల్గొననున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగున్నాయి. ఫైనల్ పోరు ఆదివారం సాయంత్రం జరగనుంది. పోటీల కోసం 4 కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రేక్షకుల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రారంభ మ్యాచ్‌గా పురుషుల విభాగంలో తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు తలపడగా తూర్పు గోదావరి జిల్లా విజయం సాధించింది. మహిళల విభాగంలో తూర్పుగోదావరి, శ్రీకాకుళం జట్లు తలపడగా శ్రీకాకుళం జట్టు విజయం సాధించింది. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ బీచ్ ప్రదేశాన్ని రానున్న రెండు నెలల్లో రూ.2.5కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ బీచ్ కబడ్జీ పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ మే 15నుంచి 20వరకు మచిలీపట్నంలో జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయని, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చూపే వారిని ఎంపిక చేస్తామన్నారు. హౌసింగ్ పీడీ సత్యనారాయణ, డీఎం అండ్ హెచ్ఓ నరసింహనాయక్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, కేఎస్పీఎల్ సీఓఓ మురళీధర్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, కబడ్డీ పోటీల ఆర్గనైజింగ్ సెక్రటీ కనపర్తి నూకరాజు పాల్గొన్నారు. -
ఢీసీసీబీపై సోషల్ వార్
బీసీ సామాజికవర్గం నుంచి.. ఈ సామాజికవర్గానికి దీటుగా బీసీ సామాజికవర్గం గట్టి పోటీగా నిలుస్తోంది. ఈ వర్గం నుంచి జనసేన కోసం కాకినాడ రూరల్ సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం తగ్గేదే లేదని గట్టి పట్టుబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరం జనసేన కోసం శక్తివంచన లేకుండా పని చేశామని, ఇప్పుడు సాకులు చెప్పి, చైర్మన్ పదవి దక్కనీయకుండా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సత్తిబాబు వర్గం పార్టీ నేతల వద్ద బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీసీసీబీ చైర్మన్గిరీనీ ఒక సామాజికవర్గానికే ఎక్కడైనా రాసిచ్చేశారా? బీసీలకు ఇవ్వకూడదా? అని ఆ వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. సంప్రదాయమనే ముసుగేసి చైర్మన్‌గిరీకి దూరం చేద్దామనుకుంటే తాడోపేడో తేల్చుకుంటామని సవాల్ చేస్తోంది. చరిత్రను తిరగరాసి ఈసారి డీసీసీబీ చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని ఆ సామాజికవర్గం పట్టుబడుతోంది. ఇలా పార్టీలోని రెండు సామాజిక వర్గాలు సై అంటే సై అంటూ కయ్యానికి దిగుతూండటం టీడీపీ అధిష్టానికి మింగుడు పడటం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం.. అనే చందంగా పరిస్థితి తయారైందని అంటున్నారు.సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పీఠం కోసం కూటమిలో ‘సోషల్’ వార్ తారస్థాయికి చేరింది. ఈ చైర్మన్‌గిరీ కోసం కూటమిలోని టీడీపీ, జనసేనలు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నాయి. పార్టీల వారీగానే కాకుండా సామాజిక వర్గాలుగా కూడా నేతలు విడిపోయి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ఇంతలోనే చైర్మన్ పీఠం జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్‌కు ఖాయమైపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంతో కాకినాడ కేంద్రంగా ఉన్న డీసీసీబీ చైర్మన్‌గిరీ నియామకం కాస్తా రసకందాయంలో పడింది. ఆ ముగ్గురు.. డీసీసీబీ చైర్మన్ పదవి కోసం టీడీపీలోని రెండు బలమైన సామాజిక వర్గాలు పోటీ పడుతున్నాయి. బ్యాంక్ చరిత్రను తిరగేస్తే అధికారంలో ఏ పార్టీ ఉన్నా చైర్మన్‌గిరీ తమకే దక్కుతోందని ఒక సామాజికవర్గం బలమైన వాదన వినిపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా గతంలో చైర్మన్లుగా పని చేసిన వారి జాబితాను టీడీపీ అగ్రనేతల ముందుంచారని తెలిసింది. టీడీపీలోని ఒక సామాజికవర్గం నుంచి మెట్ల రమణబాబు, జెడ్పీ మాజీ చైర్మన్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో కోనసీమ నుంచి చక్రం తిప్పిన దివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కుమారుడు రమణబాబుకు ఇవ్వాలని ఆ ప్రాంత నేతలు చేస్తున్న డిమాండ్‌ను మెట్ట ప్రాంత నేతలు తోసిపుచ్చుతున్నారని చెబుతున్నారు. రమణబాబు ఆప్కాబ్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారంటూ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చను వారు కారణంగా చూపిస్తున్నారని అంటున్నారు. తండ్రి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా కూడా ఉండటంతో అదే కుటుంబం నుంచి నవీన్‌ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన వైరి వర్గం వ్యతిరేకిస్తోంది. ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన తనకే ప్రాధాన్యం ఇవ్వాలని కటకంశెట్టి బాబీ లాబీయింగ్ చేస్తున్నారు. ఇలా టీడీపీలో ఒకే సామాజికవర్గం నుంచి ముగ్గురు ఆశిస్తున్నారు. సీన్లోకి ‘గ్లాస్’మేట్స్ డీసీసీబీ చైర్మన్ గిరీ కోసం టీడీపీలో రెండు బలమైన సామాజికవర్గాలు తలపడుతుండగా.. మూడో పక్షంగా జనసేన సీన్లోకి వచ్చింది. ఈ పదవిని ఆ పార్టీ ఎగరేసుకుపోయే ప్రయత్నాలు చివరికొచ్చేశాయని అంటున్నారు. టీడీపీలో తలపడుతున్న రెండు వర్గాలకు చెక్ చెప్పేందుకు మధ్యే మార్గంగా డీసీసీబీని జనసేన కోటాగా ప్రకటించేస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య ఒక అంగీకారం కూడా కుదిరిందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి డీసీసీబీని జనసేనకు ఇవ్వాలనేది కూటమి ఒప్పందంగా చెబుతున్నారు. అయితే ఇటీవల ఆ జిల్లా టీడీపీ నేతలు డీసీసీబీ కోసం గట్టిగా పట్టుబట్టారు. దీంతో, అక్కడి డీసీసీబీని టీడీపీకి జనసేన వదిలేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిపై తాజా నిర్ణయం వెనుక పవన్ కల్యాణ్‌పై ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు లాబీయింగ్ పని చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను తొక్కేసే వ్యూహంలో భాగంగా నాగబాబు.. జనసేన నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్‌కు డీసీసీబీ చైర్మన్‌గిరీని కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. తమ నాయకుడిని పవన్ కల్యాణ్ పొగడ్తలతో ముంచెత్తుతూండగా.. ఆయన సోదరుడు నాగబాబు పరోక్షంలో తెగడుతూ, నియోజకవర్గంలో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని వర్మ అనుచర వర్గం గుర్రుగా ఉంది. ఇటీవల నాగబాబు పిఠాపురంలో జరిపిన అధికారిక కార్యక్రమాల్లో వర్మ వర్గం నిరసనలతో ఈ విషయం తేటతెల్లమైందని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. మరోవైపు బంధుప్రీతితోనే మర్రెడ్డి పేరును సిఫారసు చేశారంటూ పవన్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన జనసేన నేతలు నాగబాబుపై మండిపడుతున్నారు. కాకినాడలోని డీసీసీబీ కార్యాలయం చైర్మన్ గిరీపై కూటమిలో కుమ్ములాటలు జనసేన పట్టు.. తగ్గేదే లేదంటున్న టీడీపీ పవన్ సోదరుడు నాగబాబు లాబీయింగ్ పిఠాపురం ఇన్చార్జి మర్రెడ్డి వైపు మొగ్గు బలప్రదర్శనకు సిద్ధమవుతున్న టీడీపీ బీసీలు పోటీలో పలువురు మరోవైపు పొత్తులో భాగంగా కోనసీమ నుంచి కొత్తపేట సీటు త్యాగం చేసిన బండారు శ్రీనివాసరావు డీసీసీబీ పదవికి సరిపోరా అని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. కొత్తపేట నుంచి బరిలోకి దిగేందుకు అన్నీ సిద్ధ చేసుకున్న శ్రీనివాసరావు చివరి నిమిషంలో పొత్తు ధర్మం, సోదరుడు మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు కోసం కట్టుబడి పని చేస్తే కనీసం డీసీసీబీ పదవికై నా పరిశీలనలోకి తీసుకోక పోతే పార్టీపై కేడర్‌లో విశ్వాసం ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాస్‌తో పాటు కాకినాడ సిటీలో ముత్తా శశిధర్, సంగిశెట్టి అశోక్, జగ్గంపేటలో తుమ్మలపల్లి రమేష్ వంటి నేతలు జనసేన కోసం పని చేయలేదా అని పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి. వీరందరినీ కాదని కేవలం పిఠాపురంలో బంధువైన మర్రెడ్డికి ప్రొటోకాల్ ఇవ్వాలని, వర్మకు ముకుతాడు వేయాలనే అజెండాతోనే నాగబాబు లాబీయింగ్ చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. దీని ద్వారా పార్టీ శ్రేణులకు ఏరకమైన సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కావడం లేదనే చర్చ వాడీ వేడిగా జరుగుతోంది. చివరకు డీసీసీబీ పీఠంపై ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే. -
కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
కల్యాణోత్సవాలకు ముత్యాల తలంబ్రాలు సమర్పణ అన్నవరం: ఈ నెల 8వ తేదీ రాత్రి జరగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవానికి కాకినాడకు చెందిన జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఎల్.సుమలత, ఎన్.ఉదయ శంకర్ శుక్రవారం ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సత్యదేవుని ఆలయం వద్ద ఈఓ వీర్ల సుబ్బారావుకు వారు శుక్రవారం ఈ తలంబ్రాలు అందచేశారు. ● రథోత్సవం నాడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ● దేవస్థానం అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం ● ఉత్సవాల ఏర్పాట్లను వివరించిన ఈఓ అన్నవరం: ఈ నెల 7 నుంచి జరగనున్న సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అన్నవరం దేవస్థానం అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. సింహాచలం అప్పన్న చందనోత్సవం నాడు జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో.. ‘ముందస్తు ప్రణాళిక.. మనకుందా? శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం కథనం ప్రచురించింది. ఆర్డీఓ, డీఎస్పీ తదితర అధికారులు హాజరు కాకపోవడంతో గత నెల 23న జరిగిన దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశం తూతూ మంత్రంగా జరిగిందని, ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, దేవదాయ శాఖ కమిషనర్ సమీక్షించాలని ఆ కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం సత్యదేవుని ఆలయాన్ని సందర్శించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఈఓ వీర్ల సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ఈ నెల 11న జరిగే సత్యదేవుని రథోత్సవానికి విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. రథం లాగేందుకు నిపుణులను తీసుకుని రావాలని ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని ఈఓకు స్పష్టం చేశారు. ఆలయం వద్ద కలెక్టర్ షణ్మోహన్‌కు పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, ఈఓ సుబ్బారావు ప్రసాదాలు అందజేశారు. అధికారులతో ఈఓ సమీక్ష కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఈఓ సుబ్బారావు దేవస్థానం అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకూ జరిగిన ఏర్పాట్లు, ఇంకా చేపట్టాల్సినవేమిటో ఆరా తీశారు. ఎటువంటి అసంతృప్తికీ తావు లేకుండా ఉత్సవాల ఏర్పాట్లలో పాల్గొనాలని కోరారు. ఉత్సవాలు పూర్తయ్యేంత వరకూ ఉద్యోగులు సెలవులు అడగవద్దని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
పీఎం సూర్యఘర్‌పై అవగాహన కల్పించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పీఎం సూర్యఘర్ పథకంపై మండల, గ్రామ స్థాయిల్లో విస్తృత అవగాహన కల్పించి, రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులను కోరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయీ సంఘ సమావేశాలు, ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించి, మరింత పటిష్ట, సత్వర అమలుకు అధికారులకు సభ్యులు సూచనలు చేశారు. ఆర్థిక, ప్రణాళిక అంశంపై చర్చలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన స్టాంపు డ్యూటీ, సీనరేజి సర్దుబాటు చెల్లింపులను వెంటనే జరపాలని, పంచాయతీల పరిధిలో జరిగే అన్ని పనులనూ తప్పనిసరిగా పంచాయతీ తీర్మానాలతోనే నిర్వహించాలని కోరారు. గ్రామీణాభివృద్ధిపై జరిగిన చర్చలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, సంబంధిత వెబ్సైట్ ఓపెన్ చేయాలని అన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమంపై జరిగిన చర్చలో బాలికల రక్షణ, శారీరక, మానసిక వికాసం లక్ష్యంగా శుక్రవారం నుంచి నిర్వహిస్తున్న కిశోరి వికాసం సమ్మర్ క్యాంపు కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని కోరారు. కాలువల మూసివేత సమయంలో చేపట్టాల్సిన నిర్వహణ, మరమ్మతులపై చర్చించేందుకు ఆ శాఖ ఎస్ఈ సమావేశానికి రాకపోవడంపై జెడ్పీ చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, సీఈఓ లక్ష్మణరావు పాల్గొన్నారు. జిల్లాలో 11 వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంప్రత్తిపాడు రూరల్: జిల్లాలో ఈ ఏడాది 11 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రత్తిపాడులోని మహిళా సమాఖ్య కార్యాలయంలో మండల గృహనిర్మాణ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 5 వేల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మరో 5 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వీటిలో లింటల్, రూఫ్ లెవెల్స్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, కొండ ప్రాంతాల్లోని గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనంగా ఆర్థిక సహాయం చేస్తున్నామని వివరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 274 ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా 80 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో హౌసింగ్ డీఈ సువర్ణరాజు, ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్‌బాబు, హౌసింగ్ ఏఈ గోవింద్, ఏపీఎం వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఎన్డీఏ రాక్షస పాలన
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై దాడి దారుణంరాజమహేంద్రవరం సిటీ: తమ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం దారుణమని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. పెదపూడి మండలం దోమాడలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను పరామర్శించి, వారికి బియ్యం పంపిణీ చేసి తిరిగి వస్తుండగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డిపై టీడీపీకి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారన్నారు. బాధితుల పక్షాన నిలబడి, ధైర్యం చెప్పి తిరిగి వస్తున్న క్రమంలో టీడీపీ గూండాలు ఒక పథకం ప్రకారమే ఈ దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ గూడూరి అక్కడి నుంచి డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని ఫోనులో పరామర్శించారు.పెదపూడి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును పక్కన పెట్టి, ఎన్డీఏ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై పెదపూడిలో గురువారం రాత్రి టీడీపీ, ఎన్డీఏ కూటమి మూకలు దాడికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వైఎస్సార్ సీపీ కీలక నేతలు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అనపర్తి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్రమాలు, అవినీతిని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఎండగడుతున్నారని, దీనిని తట్టుకోలేక దాడికి ప్రయత్నంచడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. దీనిపై ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, శాంతికి మారుపేరుగా, మంచితనానికి మచ్చుతునకగా, నలుగురికీ చేతనైన సాయం చేస్తూ సౌమ్యంగా, గాంధీలా ఉండే డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని అల్లూరిగా మార్చి తప్పు చేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టాక నియోజకవర్గంలో జరుగుతున్న ఒక్కో సంఘటనతో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి రోజురోజుకూ రాటుదేలుతున్నారని అన్నారు. ఇక ఆయనను తట్టుకోవడం ఎమ్మెల్యే నల్లమిల్లి వల్ల కాదని అన్నారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డిపై జరిగిన దాడి ఘటనను వదిలిపెట్టేదే లేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర స్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో రౌడీయిజం ఎల్లకాలం చెల్లదన్నారు. వైఎస్సార్ సీపీ రౌడీయిజం చేయాలనుకుంటే నియోజకవర్గ గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తిరగనియ్యరని రాజా హెచ్చరించారు. మాజీ హోం మంత్రి, పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీవ్ర దౌర్జన్యకాండకు పాల్పడుతోందని, దీనికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు కూడా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తలు అండగా ఉండగా ఏమీ చేయలేవు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండగా తనను ఎమ్మెల్యే నల్లమిల్లి ఏమీ చేయలేర ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయనరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులపై అనేక దాడులు చేశారని చెప్పారు. దీని ద్వారా ఎమ్మెల్యే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో నేరుగా తనను అంతమొందించేందుకు పెదపూడి గ్రామంలో దాడి చేయించారని ఆరోపించారు. కార్యకర్తలను, నాయకులను బెదిరిస్తే బెదిరిపోయే పని కాదని భావించి, ఏకంగా తనను అంతమొందించేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రయత్నించారని అన్నారు. తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, ఏమాత్రం వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి క్షణం ఎమ్మెల్యే అక్రమాలు, తప్పులను ఎండగడుతూనే ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడిన ప్రతి వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడూ రెట్టింపు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలోనే ఉందని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎవరినైనా ఇబ్బంది పెడితే, వారు ధైర్యంగా ముందుకు వస్తే అన్ని విధాలా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు లంక చంద్రన్న, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ ఆర్టనైజింగ్ కార్యదర్శి తాడి సూరారెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్‌రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కొండేటి భీమేష్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లభశెట్టి సతీష్, నియోజకవర్గ వీవర్స్ విభాగం అధ్యక్షుడు పప్పు సింహాచలం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాంబత్తుల చంటి, పార్టీ మండల కన్వీనర్ గుత్తుల రమణ, ఎంపీటీసీ సభ్యుడు సమ్మంగి దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు, అనపర్తి గ్రామ పార్టీ కన్వీనర్ మురళీబాలకృష్ణారెడ్డి, పార్టీ నాయకుడు సత్తి హరిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడితే బుద్ధి చెబుతాం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి పార్టీ నేతల సంఘీభావం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
రాయవరం/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమమవుతుంది. ఇదే ఉద్దేశంతో సాంకేతిక విద్యాశాఖ, పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లు ఏర్పాటయ్యాయి. ఐటీఐ కోర్సు పూర్తి కాగానే విద్యార్థులు అప్రెంటిస్ చేస్తున్నారు. ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు ఈ నెల 24 తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఐటీఐలు, వాటిలో ఉన్న సీట్లు, ట్రేడ్స్ తదితర విషయాలతో ‘సాక్షి’ కథనం. అధిక శాతం ఇంటర్లో.. పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు ఏ కోర్సులో చేరాలా అంటూ ఆలోచన చేస్తారు. అధిక శాతం మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతారు. సాంకేతిక విద్య ద్వారా త్వరగా జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే వారు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తారు. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐలు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఐటీఐకి ప్రాధాన్యమిస్తున్నారు. 18 ఏళ్లు దాటగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఐటీఐ పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఐటీఐ పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ దోహదపడుతుంది. ఏడాది, రెండేళ్ల వ్యవధితో రెగ్యులర్ కోర్సులు ఐటీల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితికి రెగ్యులర్ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఇనుస్ట్రుమెంటేషన్ మెకానికల్ వంటి కోర్సులు ఉంటాయి. ఏడాది కాలపరిమితితో డీజిల్ మెకానిక్, వెల్డర్, కటింగ్ అండ్ సూయింగ్, కంప్యూటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోర్సులు ఉంటాయి. ఐటీఐల్లో చేరగోరే విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కోర్సులు ఏ ఏ ఐటీఐల్లో ఉన్నాయో వెళ్లి పరిశీలించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతుల ప్రవేశానికి షెడ్యూల్ విడుదల చేస్తారు. రెండేళ్ల కాల పరిమితి కోర్సులు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, ఆర్అండ్సె టెక్నాలజీ, మెకానికల్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, టర్నర్ ఏడాది కాల పరిమితి కోర్సులు మెకానిక్ డీజిల్, సీవోపీఏ, వెల్డర్, సూయింగ్ టెక్నాలజీ, పీపీవో డ్రోన్ టెక్నాలజీపై స్వల్పకాలిక కోర్సు గతేడాది కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో డ్రోన్ టెక్నాలజీపై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెట్టారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును ప్రారంభించారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్ డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాలిటెక్నిక్‌లోనూ చేరవచ్చు.. ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్‌లోనూ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐటీఐ పూర్తి చేసినవారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసినవారు బీటెక్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు లేటరల్ ఎంట్రీని పొంది. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగావకాశాలను పొందుతున్నారు. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల 10వ తరగతి అర్హతతో ప్రవేశాలు వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు ఈ నెల 24 తుది గడువు పరిస్థితి ఇదీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలు లేవు. కాకినాడ జిల్లాలో మాత్రమే రెండు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో ప్రైవేటు యాజమాన్యంలో 15 ఐటీఐలు ఉండగా, వీటిలో ఏడాది, రెండేళ్ల కాల పరిమితితో 2,564 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 12 ప్రైవేట్ యాజమాన్యంలో 1,704 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో 728 సీట్లు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీ ఐల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు 4,998 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఐటీఐల్లో ప్రవేశాలకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సును పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను దరఖాస్తుదారుల వెమొబైల్ నంబరుకు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి. –ఎంవీజీ వర్మ, కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, కాకినాడ -
రూ.12.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం
ముగ్గురు దొంగల అరెస్టు మామిడికుదురు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగల ముఠాను నగరం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12.50 లక్షల విలువైన 133 గ్రాముల బంగారం, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నగరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ ఈ చోరీలకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఆలమూరు మండలం ఖండ్రిగపేటకు చెందిన వాసంశెట్టి వీరబాబు, గువ్వల చంద్రశేఖర్, పెదపళ్లకు చెందిన కుడుపూడి నాగరాజులను అరెస్టు చేశామన్నారు. ఈ చోరీ కేసుల్లో మరో నిందితుడు గుత్తుల సుభాష్ పరారీలో ఉన్నాడని చెప్పారు. వీరిపై నగరం, తాడేపల్లిగూడెం, తడికలపూడి, ద్వారకా తిరుమల, దేవరపల్లి, దెందులూరు, పెరవలి, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. వీరు చైన్ స్నాచింగ్‌లతో పాటు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడతారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బంగారం అమ్మేందుకు వెళ్తుండగా వీరిపై అనుమానం వచ్చి నగరం ఎస్సై చైతన్యకుమార్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చోరీ నేరాల గుట్టు రట్టు అయ్యిందన్నారు. దొంగలను పట్టుకోవడంతో చాకచక్యంగా పనిచేసిన సీఐలు భీమరాజు, గజేంద్ర (సీసీఎస్), ఎస్సైలు చైతన్యకుమార్, పరదేశి, కానిస్టేబుళ్లు కృష్ణసాయి, శ్రీను, దుర్గాప్రసాద్, అర్జునరావు, సుభాకర్, బ్లెస్సన్ను ఎస్పీ కృష్ణారావు అభినందించారు. -
చెట్టు కూలి వ్యక్తి మృతి
కొవ్వూరు: పట్టణంలో వేములూరు–దీప్తీ స్కూలు రోడ్డు మార్గంలో ఈదురుగాలుల ప్రభావానికి చెట్టు కూలి మోటారు సైకిలిస్టుపై పడడంతో వేములూరు గ్రామానికి చెందిన చిన్న రవి కుమార్ (49) మృతిచెందారు. బుధవారం రాత్రి స్నేహితుడు అత్తిలి చంద్రరావుతో కలిసి మోటారుసైకిల్‌పై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో బలమైన ఈదురుగాలులు వీచి రవికుమార్ నడుపుతున్న మోటారు సైకిల్‌పై చెట్టు పడింది. బలమైన గాయాలు కావడంతో రవికుమార్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వెనుక కూర్చోన్న చంద్రరావుకి తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఆర్ సత్యనారాయణ తెలిపారు. మృతుడు అవంతీ ఫీడ్స్ ఫ్యాక్టరీలో వర్కర్‌గా పనిచేస్తున్నారు. రవికుమార్కి భార్య, కుమారుడు ఉన్నారు. బెల్ట్‌షాపు నిర్వాహకులపై కేసులు కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా ఎకై ్సజ్ పరిధిలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు కాకినాడ అర్బన్, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, పెద్దాపురంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. -
అటు కళ్యాణ శోభ... ఇటు బ్రహ్మోత్సవ ప్రభ
ఐ.పోలవరం: నిత్య కళ్యాణ కాంతుడైన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి అయిదు రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలు బ్రహ్మానందాన్ని ఇవ్వనున్నాయి. తమ గోత్ర నామాలతో స్వామి ముందు కూర్చుని కల్యాణాలు చేయించుకుంటూ ధన్యమయ్యే భక్తులు మురమళ్ల పుణ్య క్షేత్రంలో కన్నుల పండువగా జరగనున్న స్వామి బ్రహ్మత్సవాల్లో పాల్గొననున్నారు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందుకు నాందిగా గ్రామంలోని మహిళలు ఆలయ ఆవరణలో పసుపు కొమ్ములను రోకట్లో కొట్టి బ్రహ్మోత్సవాలకు శుభాన్ని అద్దారు. శైవాగమ పద్ధతిలో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకస్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులను చేసే కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పండితులు పంచామృతాలతో స్వామి వారికి, అమ్మవారికి స్నానాలు చేయించారు. బ్రహ్మోత్సవ కల్యాణ మూర్తులకు జంపన రామకృష్ణంరాజు దంపతులు అర్చకస్వాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, స్వామి వారిని, అమ్మవారిని భద్రపీఠంపై ఉంచి ప్రత్యేక అలంకరణలో గ్రామోత్సవాన్ని కన్నుల వైకుంఠంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరేశ్వరుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవంలో ఎదురు సన్నాహం, ద్వాదశ ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మినారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరేశ్వరస్వామి ఆలయంలో ఆరంభమైన బ్రహ్మోత్సవాలు అయిదు రోజులపాటు అలరించనున్న ఆధ్యాత్మిక సంబరాలు -
ముద్దులొలికే పొట్టిదూడ
కొత్తపేట: పుంగనూరు జాతి ఆవుకు దూడ జన్మించడంతో ఆ రైతు కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పొట్టిగా ముద్దులొలికే పొట్టి దూడ ఆ పెరట్లోనే కాకుండా వారి ఇంట్లో చెంగు చెంగుమని తిరుగుతుంటే ఆ ఇంట్లో వారి ఆనందం అంతా ఇంతా కాదు. కొత్తపేట గ్రామ దేవత బంగారమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన రైతు అద్దంకి చంటిబాబుకు ఒంగోలు జాతికి చెందిన ఆవు ఉండేది. దానికి పుంగనూరు జాతి బ్రీడు క్రాసింగ్ చేయించగా అప్పట్లో పుంగనూరు జాతి దూడే పుట్టింది కానీ ఒంగోలు జాతిని పోలి ఉంది. ఆ ఆవు పెద్దదయ్యాక దానికి తొలిచూరిగా పుంగనూరు బ్రీడు క్రాసింగ్ చేయించారు. నెలలు నిండాక పుంగనూరు దూడ పొట్టిగా (అడుగున్నర ఎత్తు) పెయ్య దూడ పుట్టింది. తెలుపు, కపిలవర్ణ రంగులో విశేషంగా ఆకర్షిస్తోంది. -
సాగర తీరాన క్రీడా సంబరం
కాకినాడ రూరల్: కాకినాడ సాగర తీరం క్రీడా సంబరానికి వేదిక అయ్యింది. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ వుమెన్స్ కబడ్డీ పోటీలు రూరల్ మండలం సూర్యారావుపేట న్యూ ఎన్జీఆర్ బీచ్‌లో శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కబడ్డీ పోటీలు కనువిందు చేయనున్నాయి. ఇందుకు కోసం నాలుగు కోర్టులను ఏర్పాటు చేశారు. లీగ్ కమ్ నాకౌట్ దశలో జరగనున్న కబడ్డీ పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. పోటీలు మూడురోజులు జరుగుతాయి. రోజుకు 15నుంచి సుమారు 20మ్యాచ్‌లు వరకు జరగనున్నాయి. ఒక్కో జట్టులో నలుగురేసి క్రీడాకారులు తలపడనున్నారు. పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన క్రీడా జట్లు పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తుండడంతో 13జిల్లాల నుంచి 13పురుషుల జట్లు, 13మహిళల జట్లు హాజరవుతున్నాయి. పురుషుల జట్లుకు సూర్యారావుపేట జెడ్పీ హైస్కూల్, మహిళలకు వాకలపూడి హైస్కూల్లో వసతి, భోజన సదుపాయం కల్పించారు. నేటి నుంచి మూడు రోజులపాటు బీచ్ కబడ్డీ పోటీలు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక సీనియర్ మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు -
ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలోని పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ ఆకస్మికంగా చనిపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను జెడ్పీ చైర్మనన్ విప్పర్తి వేణుగోపాలరావు గురువారం నిర్వహించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను, ఒకరికి ఆఫీసు సబార్డినేట్, చాలాకాలంగా రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరిలో ఒక డ్రైవరికి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మనన్ విప్పర్తి మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు, ముగ్గురికి పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. జీఎస్ రాంగోపాల్, ఏపీ పంచాయతీరాజ్ మంత్రిత్వ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ రమేష్, పరిపాలనాధికారి వీహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు. -
టీడీపీ నేతల కవ్వింపు చర్యలు
● మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై దాడికి యత్నం ● పెదపూడిలో కారును అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితులు పెదపూడి: గ్రామంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి దోమాడ గ్రామం నుంచి అనపర్తి వెళుతున్న వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారును టీడీపీ నాయకులు అడ్డగించి దాడికి ప్రయత్నించారు. కొంతమంది కారు ముందు కూర్చుని కారును కదలనివ్వలేదు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు రావడంతో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. దీంతో కొంత సమయం తరువాత తీవ్ర ఉద్రిక్తతల నడుమ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారులో వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దోమాడ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడి అనపర్తి బయలు దేరారు. ఈలోపుగా మాజీ ఎమ్మెల్యేను అడ్డగించడానికి పెదపూడి మార్కెట్ సెంటర్లో టీడీపీ నాయకులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కారులో వస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే మాజీ ఎమ్మెల్యే కారులోంచి కిందకు దిగాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులపై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దోమాడ గ్రామంలో గృహాలు కోల్పోయిన బాధిత మహిళలు, నాయకులు, ప్రజలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మార్కెట్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారులో వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యేకు దళిత, ప్రజా సంఘాల నాయకులు, దోమాడ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ‘రామకృష్ణారెడ్డి.. నీ హత్యా రాజకీయాలకు భయపడను’ ‘ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. నీ హత్యా రాజకీయాలకు నేను భయపడను’ అని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమాడ గ్రామంలో బాధితులకు సాయం చేసి వస్తే నీ టీడీపీ గూండాలు, రౌడీలను పంపించావా అని దుయ్యబట్టారు. ఖబడ్దార్ రామకృష్ణారెడ్డి.. ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసినా నీ అవినీతి అక్రమాలను ఎండగడుతూనే ఉంటాను. నీ అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. నాకు అండగా, రక్షణగా నిలిచిన దళిత ప్రజా సంఘాల నాయకులు కొండబాబు, ఆదినారాయణ, ఏనుగుపల్లి కృష్ణ, దోమాడ బాధితులు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పెదపూడిలో మాజీ ఎమ్మెల్యే కారును దౌర్జన్యంగా అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు -
టెన్త్ టాపర్లకు కలెక్టర్ అభినందన
కాకినాడ సిటీ: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయి, జిల్లా టాపర్లుగా నిలిచిన జిల్లా విద్యార్థులను కలెక్టర్ షణ్మోహన్ సగిలి అభినందించారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో టెన్త్ పరీక్షల్లో 600 మార్కులు సాధించి, స్టేట్ టాపర్‌గా నిలిచిన యాళ్ల నేహాంజలిని, మండల టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదు, ప్రేరణాత్మక పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి పరీక్ష ముఖ్యమైన తొలి అంకమని, ఇందులో ఉత్తమ మార్కులతో సాధించిన విజయం జీవితంలో సమున్నత లక్ష్యాలను ఆత్మవిశ్వాసంతో అందుకోవడానికి తొలిమెట్టుగా నిలుస్తుందని అన్నారు. చిన్నప్పుడు టెన్త్ పరీక్షల్లో తాను జిల్లా టాపర్‌గా నిలిచానని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులందరితో కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో తాము ఎంచుకున్న కోర్సులలో రాణించి, ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని ఆకాంక్షించారు. తాము చదువుకోలేకపోయినా, పేదరికంలో ఉన్నా పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినా ధైర్యంతో చదివి, టాపర్‌గా నిలిచిన విద్యార్థినికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ, పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి, ప్రైవేటు స్కూల్లో చదివించిన తమ కుమారుడి కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివించిన కుమార్తెకు మంచి ర్యాంకు వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల అపనమ్మకాన్ని విడనాడాలని కలెక్టర్ కోరారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 9,108 మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్లో పాసవడం ముదావహమన్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధనా ప్రమాణాలకు దర్పణం పడుతోందన్నారు. 600కు 600 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచిన యాళ్ల నేహాంజలిని, ఆమె తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నత విద్యలో మరింతగా రాణించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ జె.మనీషా, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్, కాకినాడ, పెద్దాపురం, డిప్యూటీ డీఈఓలు ఎన్.వెంకటేశ్వరరావు, ఐ.ప్రభాకరశర్మ, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్, డీసీఈబీ కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు పాల్గొన్నారు. -
బాలికల భవితకు కిశోరి వికాసం
కాకినాడ సిటీ: బాలికల రక్షణ, వారి అభివృద్ధి కిశోరి వికాసం కార్యక్రమ ముఖ్య లక్ష్యాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. ఈ కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టరేట్లో గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కింద జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈ నెల 2 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకూ బాలికలకు 12 అంశాలపై అవగాహన కల్పించనున్నారని చెప్పారు. 11 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలను, డ్రాపౌట్లను గుర్తించి, గ్రూపులుగా తయారు చేసి, శిక్షణ ఇవ్వనున్నారన్నారు. రుతుక్రమ పరిశుభ్రత, నిర్వహణ, లైంగిక విద్య, బాల్యవివాహం, పునరుత్పత్తి, ఆరోగ్యం, బాలల హక్కులు, రక్షణ, పోక్సో చట్టం, కౌమార దశలో ఐరన్ లోపం, రక్తహీనత, లింగ అసమానత, విద్య, కెరీర్, మార్గదర్శకత్వం, నైపుణ్యాల ప్రాధాన్యం, సైబర్ మోసాలు, ఆన్లైన్ భద్రత, సమస్యలు, ఆర్థిక నిర్వహణ, కౌమార బాలికల నాయకత్వం, సాధికారిత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు. కేఎస్పీఎల్ భూములకు పరిహారం పెంచాలి తొండంగి: కాకినాడ సీపోర్టు లిమిటెడ్(కేఎస్పీఎల్)కు తొండంగి మండలం పెరుమాళ్లపురంలో ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారాన్ని మరింత పెంచాలని రైతులు కోరారు. ఈ భూముల పరిహారంపై రైతులతో తొండంగి తహసీల్దార్ కార్యాలయంలో జేసీ రాహుల్ మీనా చర్చించారు. మొత్తం సుమారు 597 ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వం ఎకరాకు రూ.10 లక్షలు ప్రకటించిందని తహసీల్దార్ మురార్జీ వివరించారు. ఈ మొత్తానికి అంగీకరించని 781 మంది రైతులు పరిహారం తీసుకోలేదు. ఈ భూములకు మార్కెట్లో ఎక్కువ ధర ఉందని, రెట్టింపు పరిహారం ఇవ్వాలని 52 మంది రైతులు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని జేసీ హామీ ఇచ్చారు. మోదీది విభజించి, పాలించు విధానం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కులాలు, మతాల పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింహాచలం ఘటన దురదృష్టకరమని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అమరావతి సభ కోసం రాష్ట్రానికి మహారాజు వస్తున్నట్లుగా చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాని రాష్ట్రానికి ఎలాంటి నిధులూ ఇవ్వలేదని, అమరావతి ప్రారంభానికి వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను అవమానించారని అన్నారు. అందుకే తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా తాము నిరసన తెలుపుతామని ప్రకటించారు. మోదీకి ఎన్నికల మీద ఉన్న ప్రేమ దేశ భద్రతపై లేదని నారాయణ విమర్శించారు. పహల్గాం ఘటన జరిగిన తర్వాత అఖిలపక్షం ఏర్పాటు చేసిన ఆయన.. ఆ సమావేశానికి రాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం తీవ్రమైన తప్పిదమని దుయ్యబట్టారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత దారుణమని, ఆ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని అన్నారు. అక్కడి సహజ వనరులను, గనులను అదానీకి అప్పగించేందుకే కగార్ డ్రామా ఆడుతున్నారని నారాయణ విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫ్యాక్షనిస్టులా మారిపోయారని, టైం ప్రకటించి మరీ మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దేశ రక్షణ కంటే మావోయిస్టుల నిర్మూలన పైనే కేంద్ర హోం మంత్రి దృష్టి పెట్టారన్నారు. అందుకే పహల్గాం ఘటన జరిగిందన్నారు. పహల్గామ్ ఘటన తర్వాత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ తొలిసారి ప్రధాని మోదీకి అండగా నిలిచాయని, కానీ ఈ ఘటనను బీహార్, యూపీ ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కుల గణనకు ఆమోదం తెలపడం మంచి పరిణామమని చెప్పారు. అయితే, నిర్దిష్ట కాలపరిమితితో కులగణనను ప్రకటించకపోవడం కేంద్రం చేస్తున్న మరో మోసమని విమర్శించారు. దేశంలో కార్మికుల సాధించుకున్న హక్కులను పాలకవర్గాలు కాలరాస్తున్నాయని, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ వచ్చాక కార్మిక హక్కులు హరించుకుపోయాయని, వంద మంది ఉంటేనే సంఘం కట్టే పరిస్థితి నెలకొందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో ఇండియా కూటమి మరింత బలపడాల్సిన అవసరముందన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాడిద చాకిరీ చేస్తూ బానిసల్లా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిదని నారాయణ అన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు. -
ముందస్తు ప్రణాళిక.. మనకుందా?
సమన్వయ సమావేశానికి అధికారుల డుమ్మా ఏటా కల్యాణోత్సవాలకు కనీసం 15 రోజుల ముందు దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశం జరుగుతుంది. ఈసారి గత నెల 23న ఈ సమావేశం నిర్వహించారు. అదే రోజు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన కారణంగా పెద్దాపురం ఆర్డీఓ, డీఎస్పీ, జలవనరుల శాఖ జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. వాస్తవానికి ఈ ఇద్దరు అధికారులే ఈ సమావేశానికి కీలకం. వారి గైర్హాజరుతో ఈ సమావేశం తూతూమంత్రంగా జరిగినట్లయ్యింది. దీనికితోడు ఇటీవల ఈఓ వీర్ల సుబ్బారావు తీసుకున్న పలు నిర్ణయాలు, ఆలయంలో జరిగిన పలు వివాదాల కారణంగా కూడా ఉత్సవాల ఏర్పాట్లలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. అన్నవరం: సింహాచలం అప్పన్న సన్నిధిలో బుధవారం గోడ కూలి ఏడుగురు దుర్మరణం పాలైన ఘటన అన్నవరం దేవస్థానం అధికారులను, భక్తులను కలవరపాటుకు గురి చేస్తోంది. సత్యదేవుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు సమీపిస్తూండటం, దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళిక కొరవడటమే ఇందుకు కారణం. ఈ నెల ఏడో తేదీన ప్రారంభం కానున్న సత్యదేవుని కల్యాణోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉండగా.. అధికారులు ఇప్పటికీ ముందస్తు ప్రణాళిక రూపొందించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యుద్దీపాలంకరణ, రంగులు వేయడం వంటి పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఈ జాగ్రత్తలు మేలు ఫ ఈ నెల 8న జరగనున్న సత్యదేవుని కల్యాణోత్సవానికి 50 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశ ముంది. అయితే, కల్యాణం జరిగే చోట 5 వేల మందికి మించి కూర్చునే అవకాశం లేదు. దీంతో చాలా మంది భక్తులు సర్కులర్ మండపం పైకెక్కి ఉత్సవం చూసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో అనుకోని ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఫ అలాగే, 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే సత్యదేవుని రథోత్సవానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశముంటుందని భావిస్తున్నారు. రథోత్సవం జరిగే అన్నవరం మెయిన్ రోడ్డు వెడల్పు 20 అడుగులు మాత్రమే. రథం వెడల్పు 14.6 అడుగులు. అంటే రథం రోడ్డు మధ్యలో ఉంటే అటూ ఇటూ మూడడుగుల చొప్పున మాత్రమే ఖాళీ ఉంటుంది. దీంతో భక్తులు రథానికి ముందు, వెనుక ఉండాలి తప్ప పక్కన ఉండే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో భక్తులు రథోత్సవం చూసేందుకు, రథం పగ్గాలు లాగేందుకు ఎగబడకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలి. ఫ మెయిన్ రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉంటుంది. అందువలన రథం ముందుకు లాగేందుకే కాకుండా వెనక్కి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గత ఏడాది మాదిరిగానే రథాన్ని లాగేందుకు నిపుణులను తీసుకు వచ్చి, వారి తోడ్పాటు, దేవస్థానం సిబ్బంది సహకారంతో రథోత్సవం నిర్వహించాలి. ఆ రోజు విద్యుత్ సరఫరా నిలుపు చేయాలి. రథం ట్రయల్ రన్ కూడా నిర్వహించాలి. ఫ ఉత్సవాల తొలి ఐదు రోజులూ వివిధ వాహనాలపై జరిగే స్వామి, అమ్మవార్ల ఊరేగింపులు తిలకించేందుకు కూడా భక్తులు భారీగా విచ్చేస్తారు. అదే సమయంలో రోడ్డు మీద వాహనాల రాకపోకలు యథావిధిగా జరుగుతూండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించాలి. ఫ దేవస్థానానికి వచ్చే ప్రముఖులు, ఉన్నతాధికారులకు అవసరానికి మించి ప్రొటోకాల్ ఇస్తూండటం ఇతర భక్తులకు ఇబ్బందిగా మారుతోంది. గత జనవరిలో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం విషయంలో అదే జరిగింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే అనుచరగణానికి ఎక్కువసేపు ఆలయంలో దర్శనాలు చేయించడంతో తెల్లవారుజాము నుంచీ క్యూలో చలిలో నిల్చున్న భక్తులు ఇబ్బంది పడ్డారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఫ రాష్ట్రంలోని ఇతర ప్రముఖ దేవస్థానాల్లో మాదిరిగా అన్నవరం దేవస్థానంలో కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)ను నియమించాలన్న డిమాండ్‌పై ఉన్నతాధికారులు స్పందించడం లేదు. సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై ఐదుగురు మంత్రులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు సమీక్షించి, ఏర్పాట్లు చేసినా అపశృతి తప్పలేదు. ఈ నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లలో అనుభవం ఉన్న అధికారిని సీఎఫ్ఓగా నియమించడం మేలు. ఫ సత్యదేవుని కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ కమిషనర్, కలెక్టర్ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈఓ, దేవస్థానం అధికారుల మధ్య సమన్వయం కుదిర్చి, ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ సమీపిస్తున్న సత్యదేవుని కల్యాణోత్సవాలు ఫ సింహాచలం ఘటన నేపథ్యంలో జాగ్రత్తలు అవశ్యం ఫ ఉత్సవాలపై కమిషనర్, కలెక్టర్ సమీక్షించాలంటున్న సిబ్బంది -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు పోటెత్తారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో సత్యదేవుని సన్నిధి కిటకిటలాడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, పరమేశ్వరుడు భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరి వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ఫ 2 వేల వ్రతాల నిర్వహణ ఫ రూ.40 లక్షల ఆదాయం -
చేతికందొచ్చి.. మృత్యు తీరానికి చేరి..
అంబాజీపేట: రెండు కుటుంబాల్లో వారు చేతికి అందివచ్చిన కొడుకులు. విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉన్నారు. సింహాచలం ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలిసి అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలేనికి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాదం చిమ్మింది. ఈ ఘటనలో కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (శివ) (26), పత్తి దుర్గా స్వామినాయుడు(33) దుర్మరణం పాలయ్యారు. వంట మేసీ్త్రగా కుటుంబాన్ని పోషిస్తున్న కుంపట్ల శ్రీనివాసరావు పెద కుమారుడు మణికంఠ ఈశ్వర శేషారావు, రైతు నాయకుడు పత్తి దత్తుడు రెండో కుమారుడు దుర్గా స్వామినాయుడు ఈ ప్రమాదంలో మృతి చెందారని తెలియగానే ఆయా కుటుంబాల్లోనే కాకుండా, అంబాజీపేటలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కొడుకులు శాశ్వతంగా దూరం కావడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మంగళవారం రాత్రి మృతులిద్దరూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, రేపు చందనోత్సవం సందర్భంగా అప్పన్న దర్శనానికి వెళుతున్నామంటూ, ఎప్పటిలాగే కబుర్లాడుకున్నారు. తెల్లారేసరికి కొడుకులు దుర్మరణం పాలయ్యారన్న సమాచారం విని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇద్దరు యువకులకు పెళ్లిళ్లు కాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ సమయంలో చేదు వార్తను వినాల్సి వచ్చిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. విశాఖపట్నంలో ఉద్యోగాలు కాగా, కుంపట్ల మణికంఠ ఈశ్వరశేషారావు (శివ) ఏడాది నుంచి విశాఖపట్నంలో మెట్రోకెమ్ కంపెనీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి, సోదరుడు ఉన్నారు. తండ్రి, అతని సోదరుడు వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సెలవు దినాల్లో అంబాజీపేట వచ్చినప్పుడు తండ్రి చేసే కేటరింగ్ వృత్తిలో సాయం చేసేవాడు. ఉద్యోగం చేస్తూ అతడు తన కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ఈశ్వర శేషారావు మృత్యువాత పడటంతో ఆ కుటుంబానికి కీలకాధారం లేకుండా పోయింది. ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని తండ్రి శ్రీనివాసరావు, తల్లి సీతామహాలక్ష్మి రోదిస్తున్నారు. మరో మృతుడు పత్తి దుర్గా స్వామినాయుడు(33) విశాఖపట్నంలో ఇంటీరియర్ డెకరేషన్ వర్కు చేస్తున్నారు. సుమారు 30 మందికి పనులు కల్పిస్తున్నాడు. అతడికి తండ్రి దత్తుడు, తల్లి వెంకటరమణ, సోదరుడు, సోదరి ఉన్నారు. ఇటీవల కాలంలోనే సోదరి వివాహాన్ని దుర్గా స్వామినాయుడు దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. సంవత్సరాది పండగ నాడు కొర్లపటివారిపాలెం గ్రామ దేవత వనువులమ్మ జాతరకు ఏటా దుర్గా స్వామినాయుడు అమ్మవారి ఫొటోలతో క్యాలెండర్లను ముద్రించి, ఇంటింటికీ స్వయంగా పంచిపెట్టేవాడు. అతని మరణ వార్త విని కొర్లపాటివారిపాలెంలో విషాదం నెలకొంది. ఇంటీరియర్ వర్కుతో అందరి మన్ననలు పొందడమే కాకుండా, పలు అవార్డులను గెలుచుకున్నాడు. తండ్రి రైతు నాయకుడిగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. తన కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకునే సమయంలో దుర్గా స్వామినాయుడు శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొర్లపాటివారిపాలెంలోని మృతుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి నేలపూడి స్టాలిన్‌బాబు సంతాపం ప్రకటించి, వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు వెన్నుదన్నుగా యువకులు సింహాచలం ఘటనలో ఇద్దరి దుర్మరణం మృతుల కుటుంబాల్లో చిమ్మిన విషాదం మూడోసారి జంట మరణాలు కొర్లపాటివారిపాలెంలో జంట యువకులు మృత్యుఒడికి చేరడం ఇది మూడోసారి. 2001లో పి.గన్నవరం శివకోడు ప్రధాన పంట కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. 2008లో పుణ్య దినాలను పురస్కరించుకుని పి.గన్నవరం వైనతేయి గోదావరి నదిలో స్నానమాచరిస్తున్న ఇద్దరు యువకులు సుడిగుండంలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లి ఈ ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు చేరడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
సృష్టి కర్తా శ్రమ జీవే..
కపిలేశ్వరపురం: సంపదకు మూలం శ్రమ. ఆ శ్రమను చేసే శ్రామికులు దశా, దిశా నిర్ణేతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా మానసిక, శారీరక శ్రామికులున్నారు. కాకినాడ జిల్లాలో 62, తూర్పుగోదావరి జిల్లాలో 38, కొనసీమ జిల్లాలో 7 మొత్తం 107 మధ్య తరహా, భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. కాకినాడ జిల్లాలో 1,81,000 హెక్టార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 1,23, 027, కోనసీమ జిల్లాలో 1,49,000 హెక్టార్లు వరి సాగవుతోంది. వ్యవసాయానికి అనుబంధంగా రవాణా, రైసుమిల్లు రంగాలు బలోపేతమై ఉన్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం శ్రామికులను విస్మరిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే శ్రామిక నిరసనలను ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో శ్రామిక శక్తి కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరంలో వర్తక, వ్యాపారాలు, కోనసీమ జిల్లాలో ఆక్వా, కొబ్బరి తదితర రంగాల్లో విస్తారంగా శ్రామికులు ఉత్పత్తి రంగంలో శ్రమిస్తున్నారు. కోనసీమ జిల్లాలో 1,726, తూర్పుగోదావరి జిల్లాలో 1,556 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో విస్తారంగా అంగన్వాడీలున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 3,500 మంది అంగన్వాడీలున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.53 లక్షల జాబ్ కార్డులకు 2.27 లక్షల మంది, కాకినాడ జిల్లాలో 1.96 లక్షల కార్డులకు 1.95 లక్షల మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,61,372 కార్డులకు 1,11,815 మంది ఉపాధి కూలీలున్నారు. కాకినాడ జిల్లాలో 620, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 512 చొప్పున మొత్తం 1,144 సచివాలయాల పరిధిలో వేలాది మంది ఉద్యోగులున్నారు. కోనసీమ జిల్లాలో 355, కాకినాడ జిల్లాలో 428, తూర్పుగోదావరి జిల్లాలో 364 ఎండీయూ వాహనాల నిర్వాహకులున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,200 మంది ఆశా కార్యకర్తలున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 815, కాకినాడ జిల్లాలో 1,060, కోనసీమ జిల్లాలో 1,017 మొత్తం 2,892 మంది వీఓఏలున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 108, కోనసీమ జిల్లాలో 166, కాకినాడ జిల్లాలో 72, మొత్తం 320 వ్యవసాయ సహకార సంఘాల్లో 1,650 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 108 వాహనాలు 22 ఉండగా, 81 మంది, తూర్పుగోదావరిలో 21 వాహనాల్లో 79, కాకినాడ జిల్లాలోని 19 వాహనాల్లో 73 మంది ఈఎంటీలు, డ్రైవర్లు ఉన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ చేసే శ్రామికులు విస్తారంగా ఉన్నారు. పాలకుల అణచివేత మండపేట ఫీల్డ్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి తనపై రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. మార్చి 6న ఎన్నికల హామీలపై జీవోలను ఇవ్వాలంటూ విజయవాడలో ఆందోళనకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరం, కాకినాడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. సచివాలయ ఉద్యోగులకు ఎడతెరిపి లేకుండా సర్వేలు, సంబంధం లేని శాఖల పనులు అప్పగిస్తూ వేధిస్తోంది. ఉపాధి లేదా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కోనసీమ జిల్లాలో సుమారు 4.80 లక్షల మంది యువకులను, కాకినాడ జిల్లాలో 5,33,908, తూర్పుగోదావరి జిల్లాలో 5.09 లక్షల మంది యువకులను పది నెలలుగా మోసగిస్తోంది. కాకినాడ జిల్లాలో 12,272 మంది, కోనసీమ జిల్లాలో 9,581 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 9,117 మంది మొత్తం 30,970 వలంటీర్లను కూటమి ప్రభుత్వం దగా చేసింది. అమలాపురం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ కం కండక్టర్ డ్యూటీ చేయాలంటూ వేధించడాన్ని నిరసిస్తూ మార్చి 9న డిపోలో కార్మికులు నిరసనకు దిగారు. శ్రామికునికి వైఎస్సార్ సీపీ దన్ను 2019 సెప్టెంబర్‌లో ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడంతో కార్మికులకు ఎంతో మేలు జరిగింది. ఆటో కార్మికులకు, బోటు ఉన్న మత్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున, మగ్గం ఉన్న చేనేత కార్మిక కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం అందించింది. అంగన్వాడీలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలకు, ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు వేతనాలను పెంచింది. మున్సిపాలిటీల్లోని కార్మికుల వేతనాలను రూ.18 వేలు చేసి వారి ఆర్థిక ప్రగతికి దోహదపడింది. ప్రతి గ్రామానికి పది మంది చొప్పున సచివాలయ ఉద్యోగాలు కల్పించింది. ‘కూటమి’పై శ్రామిక పోరాటాలిలా.. ఎన్నికల హామీ మేరకు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 5న అమలాపురంలో వలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఫిబ్రవరి 18న ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు ధర్నాలు చేశారు. ఫిబ్రవరి 28న ఆప్కాస్‌ను రద్దు చేసి మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలంటూ ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ ఏప్రిల్ ఒకటిన అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేశారు. ఏప్రిల్ రెండున 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలంటూ మూడు జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. మార్చి 4న అమలాపురంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వాహన మిత్ర తరహా ఆర్థికసాయం కోరుతూ ధర్నా చేశారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలంటూ ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమకు మద్యం షాపు కేటాయించాలంటూ జనవరి 27న రాజోలు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట కల్లుగీత కార్మికులు ధర్నా చేశారు. అదే రోజు వేతనాలు పెంచాలంటూ మూడు జిల్లాల కలెక్టరేట్ల ఎదుట వీఓఏలు ధర్నా చేపట్టారు. డెలివరీ కమీషన్‌ను పెంచాలంటూ ఏప్రిల్ 24న రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ఎల్పీజీ గ్యాస్ డెలివరీ కార్మికులు ధర్నా చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని కోరుతూ అదే రోజు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మార్చి 24న స్మార్ట్ మీటర్లతో తమ పొట్ట కొట్టొద్దంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద మీటర్ రీడర్లు ధర్నా చేశారు. ఫిబ్రవరి 9న తమ వేతనాలు పెంచాలని, సీటీసీ విధానాన్ని రద్దు చేసి ఈపీఎఫ్ యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద 104 ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో విస్తారంగా ఉత్పత్తి సృష్టి అహర్నిశలు శ్రమిస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులు సంక్షేమ సేవలందిస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు ఐదు నెలలకే శ్రామిక వ్యతిరేకత మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వం పది నెలల్లో మిన్నంటిన నిరసనలు నేడు శ్రామిక దినోత్సవం మే డే ప్రపంచంలో ఎన్నో వింతలూ.. విశేషాలు. ప్రకృతి పరమైన అద్భుత సౌందర్యాలు నిస్సందేహంగా భగవంతుడి సృష్టే. కానీ.. రాయిపై రాయి పేర్చి, లోహాలను వంచి రూపొందించిన కళాత్మక ఖండాలు, అద్భుత కట్టడాలన్నింటికీ మానవ శ్రమే మూలం. కండలు కరిగించి.. రక్తాన్ని చెమటగా మార్చి.. దేశాభివృద్ధికి దిశానిర్దేశం చూపేది శ్రామికులే. వారి శ్రమ లేనిదే ఏ దేశమూ పురోగతి సాధించదనేది జగమెరిగిన సత్యం. అందుకే శ్రమించే ప్రతిఒక్కరూ సృష్టికర్తలే. ప్రకృతిని సృష్టించిన ఆ భగవంతుడూ ఓ శ్రమ జీవే. శ్రామికులపై ప్రభుత్వ నిర్బంధం కూటమి నేతలు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక శ్రామికులపైనా, ఆందోళనలపై నిర్బంధాన్ని విధిస్తోంది. ప్రభుత్వ తీరును ఐక్యంగా ప్రతిఘటిస్తాం. – కరణం ప్రసాదరావు, కార్మిక నేత, సీఐటీయూ, సామర్లకోట -
● రెండు డజన్ల అడుగుల ఎత్తు.. ఈ అరటి చెట్టు
మలికిపురం: రెండు డజన్లు.. అరటి పండ్లు కావు.. అన్ని అడుగుల ఎత్తున పెరిగిన అరటి చెట్టు ఇది. మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో రైతు మట్టా శ్రీనివాసరావు ఇంటి పెరట్లో వేసిన అరటి చెట్టు అమాంతం అంత ఎత్తున ఎదిగింది. సాధారణంగా అరటి చెట్లు 15 అడుగులకు మించి పెరగవు. ఈ చెట్టు ఏకంగా 24 అడుగుల ఎత్తు ఎదగడంతో చూపరులు విస్తుపోతున్నారు. ఈ అరటి విత్తనం పేరు బూడిత పక్కీస్ అంటారని, విజయనగరంలోని స్నేహితుల ఇంటి నుంచి తెచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీని పండ్లు కూడా సాధారణ చక్కెర కేళీ కంటే భారీ సైజులో ఉంటాయన్నారు. ఈ మొక్క వేసిన చోట చుట్టుపక్కల ఇతర మొక్కలను ఎదగనీయదు. మొత్తం నేల ధాతువులను వినియోగించుకోవడమే ఇలా ఎత్తుగా ఎదగడానికి కారణం. గొల్లపాలెంలో 24 అడుగుల అరటి చెట్టు వద్ద శ్రీనివాసరావు -
దేవస్థాన పారిశుధ్య కార్మికులకు జీతాలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి మార్చి నెల జీతాలు బుధవారం చెల్లించారు. పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.10,500, సూపర్వైజర్లకు రూ.12,500 చొప్పున జీతాలు చెల్లించినట్టు వారు తెలిపారు. ఏప్రిల్ నెల దాదాపు గడిచిపోయినా గుంటూరుకు చెందిన కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గా ఏజెన్సీ ఇంకా మార్చి జీతమే చెల్లించకపోవడంతో పారిశుధ్య సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ?’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన అధికారులు కాంట్రాక్ట్ సంస్థకు పారిశుధ్య కార్మికుల బిల్లు ఆగమేఘాలపై పూర్తి చేసి చెక్కు అందజేశారు. దీంతో బుధవారం సిబ్బంది ఖాతాల్లో నగదు జమయింది. ఏప్రిల్ బిల్లు మే పదో తేదీకల్లా చెల్లించేలా చూడాలని సిబ్బంది కోరారు. -
శతాధిక వృద్ధుడి కన్నుమూత
ముమ్మిడివరం: కొత్తలంక గ్రామంలోని రమాబాయిపేటకు చెందిన దాసరి సాహెబ్(103) బుధవారం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు మనవళ్లు, ఓ మనవరాలు ఉన్నారు. పెద్ద మనమడు దాసరి నాగేశ్వరరావు దళిత ఉద్యమ రాష్ట్ర నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. రెండో మనవడు సాయిబాబా గొల్లవిల్లి నీటి సంఘం అధ్యక్షుడిగా పని చేసి, ప్రస్తుతం అయినవిల్లి మండలం క్రాప గ్రామ సర్వేయర్‌గా ఉన్నారు. జీవనోపాధికి వ్యవసాయ కూలీగా పనిచేసిన సాహెబ్ కొద్ది రోజుల క్రితం వయోభారంతో అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన పనులు స్వయంగా చేసుకునేవారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. రెడ్ క్రాస్ జాతీయ సమావేశానికి రామారావు కాకినాడ సిటీ: రెడ్‌క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఇటీవల చైర్మన్‌గా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన వైడీ రామారావు తన తొలి సమావేశానికి హాజరుకావడానికి బుధవారం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల రెండున రెడ్‌క్రాస్ జాతీయ చైర్మన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే సమావేశంలో తాను పాల్గొంటున్నట్టు రామారావు తెలిపారు. 160 కిలోల సముద్ర ఉత్పత్తులు సీజ్ తాళ్లరేవు: వేట నిషేధం నిబంధనలను ఉల్లంఘించి సముద్రంలో మత్స్య సంపదను వేటాడి, విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 160 కిలోల మత్స్య ఉత్పత్తులను మత్స్య శాఖాధికారులు బుధవారం సీజ్ చేశారు. మండలంలోని మట్లపాలెం మార్కెట్టులో సముద్ర చేపలు, రొయ్యలు విక్రయిస్తున్నట్టు అందిన సమాచారంతో జిల్లా మత్స్య శాఖాధికారి వి.కృష్ణారావు, మత్స్య శాఖ అభివృద్ధి అధికారులు జి.గోపి, కె.ప్రకాశరావు సిబ్బందితో దాడి చేశారు. వ్యాపారులు చెక్కా కృష్ణ, వైదాడి తులసి, పి.నూకరాజుకు చెందిన మత్స్య ఉత్పత్తులను సీజ్ చేశారు. ముగ్గురి వద్ద వేర్వేరుగా సముద్ర చేపలైన 60 కిలోల మెత్తళ్లు, 40 కిలోల బుంగరొయ్యలు, 60 కిలోల మెత్తళ్లు, సొరచేపలను సీజ్ చేసి, అనంతరం బహిరంగ వేలం నిర్వహించారు. వీటికి రూ.13 వేల ఆదాయం సమకూరినట్టు కృష్ణారావు తెలిపారు. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
రాయవరం: ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసే విధానానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగిస్తోంది. పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ అందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాల సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. జిల్లా పుస్తక గోడౌన్‌కు చేరుకున్న పాఠ్య పుస్తకాలను ఆయా మండల స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. 47 టైటిల్స్ ఈ ఏడాది రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాలను మరింతగా కుదించింది. గతంలో 173 వరకు టైటిల్స్ ఉండగా, ఇప్పుడు 47 టైటిల్స్ మాత్రమే ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలకు గతంలో తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రెండు సెమిస్టర్లుగా మూడు పుస్తకాలుగా ముద్రించారు. 3, 4, 5 తరగతులకు తెలుగు, ఇంగ్లిషు ఒక పుస్తకం, గణితం పరిసరాల విజ్ఞానం ఒక పుస్తకంగా సెమిస్టర్–1, సెమిస్టర్–2గా ముద్రించారు. ఇదే మాదిరిగా వర్క్‌బుక్‌లు ముద్రించారు. 6–9 తరగతుల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు సబ్జెక్టులను సెమిస్టర్–1, సెమిస్టర్–2గా ముద్రించారు. నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు విడివిడిగా సెమిస్టర్–1, 2గా ముద్రించారు. 10వ తరగతికి మాత్రం సబ్జెక్టుల వారీగా పుస్తకాలను ముద్రించారు. గణితం మాత్రం సెమిస్టర్–1, 2గా ముద్రించారు. పాఠ్య పుస్తకాలన్నీ బైలింగ్విల్ విధానంలోనే ముద్రించారు. ఒక పేజీలో ఇంగ్లిషు, ఒక పేజీలో తెలుగు పాఠ్యాంశాన్ని ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు ఈజీగా ఏ మీడియంలోనైనా చదువుకునే వీలుంది. గతం నుంచే పాఠ్య పుస్తకంలో క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ సహాయంతో పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా పొందేందుకు వీలవుతోంది. విద్యార్థులకు వెన్నెముకపై భారం పడకుండా గత ప్రభుత్వం పాఠ్య పుస్తకంలో సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 70 శాతం సరఫరా ఇప్పటి వరకు జిల్లా గొడౌన్‌కు 70 శాతం పుస్తకాలు సరఫరా అయ్యాయి. జిల్లా గోదాంకు చేరుకున్న పుస్తకాల్లో 5,46,935 (32 శాతం) పుస్తకాలను మూడు జిల్లాల పరిధిలో 25 మండలాలకు సరఫరా చేశారు. ఇప్పటి వరకూ 13 టైటిల్స్‌కు సంబంధించి ఒక్క పుస్తకం కూడా సరఫరా కాలేదు. 3, 4, 5 తరగతులకు సంబంధించి ఒక్కొక్క టైటిల్ రావాల్సి ఉండగా, 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి రెండేసి టైటిల్స్ సరఫరా కావాల్సి ఉంది. 10 టైటిల్స్ పాఠ్య పుస్తకాలు, మూడు టైటిల్స్ వర్క్‌బుక్స్ సరఫరా కావాల్సి ఉంది. సెమిస్టర్–1 రికై ్వర్మెంట్, సరఫరా అయిన పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్ జిల్లా ఇండెంట్ సరఫరా శాతం తూర్పుగోదావరి 3,04,850 1,82,841 60 కాకినాడ 6,65,317 2,37,738 36 కోనసీమ 4,78,208 1,17,418 25 ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా.. జిల్లా గోదాంకు ఇప్పటి వరకు 70శాతం పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్ చేరుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 47 టైటిల్స్ పుస్తకాలు సరఫరా చేస్తున్నాం. జిల్లా గోదాంకు వచ్చిన పాఠ్య పుస్తకాలను ఎప్పటికప్పుడు మండల కేంద్రాలకు ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా తరలిస్తున్నాం. – పి.సురేష్, పాఠ్య పుస్తకాల మేనేజరు, బొమ్మూరు గోదాంకు చేరాయి ఈ ఏడాది ఏప్రిల్‌లో ముద్రించిన పాఠ్య పుస్తకాలు బొమ్మూరులోని గోదాంకు చేరుకున్నాయి. జిల్లా గోదాం నుంచి ఆయా జిల్లాల పరిధిలో మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాం. జిల్లా గోదాంకు చేరుకున్న పాఠ్య పుస్తకాలను మే మొదటి వారంలో పూర్తి స్థాయిలో మండల కేంద్రాలకు తరలిస్తాం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ఉమ్మడి జిల్లాకు 16,48,640 సెమిస్టర్–1 పుస్తకాలు అవసరం ఇప్పటికే 5,46,935 పుస్తకాల రాక -
ప్రశాంతంగా పాలిసెట్
బాలాజీచెరువు (కాకినాడ): పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్–2025 బుధవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. కాకినాడ అర్బన్‌తోపాటు రూరల్ ప్రాంతాల్లో 21 కేంద్రాలు, పిఠాపురంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు 9,558 మంది దరఖాస్తు చేయగా 8,846 మంది హాజరయ్యారు. కాకినాడ డివిజన్లో బాలురు 4,220 మందికి గాను 3,955 మంది హాజరుకాగా, బాలికలు 2,995 మందికి 2,737 మంది హాజరయ్యారు. పిఠాపురం డివిజన్లో బాలురు 1,361 మందికి 1,257 మంది హాజరుకాగా, బాలికలు 982 మందికి 898 మంది హాజరయ్యారు. పరీక్షలు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించినట్టు జిల్లా కో–ఆర్డినేటర్ ఎన్.జనార్ధనరావు తెలిపారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విడిపోయిన ఏపీకి రాజధాని నిర్మాణం చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లు నిధులు ఇచ్చిందని, ప్రస్తుతం రూ.15 వేలు కోట్లు ఆర్థిక గ్రాండ్ కూడా మంజూరు చేసిందన్నారు. వివిధ కేంద్ర సంస్థలను కేటాయించిందన్నారు. ఎన్నో పరిశ్రమలు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారన్నారు. వెనుకబడి ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో రూ.3 వేల కోట్లతో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 11 నదుల ద్వారా రూ.50 వేల కోట్లతో ఇంటింటింకీ మంచినీటి కుళాయి ఇచ్చేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. సివిల్స్ ర్యాంకర్‌కు అభినందన కాకినాడ సిటీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సివిల్ సర్వీసెస్) పరీక్షల్లో ఆల్ ఇండియా 94వ ర్యాంకు సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్ బుధవారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సివిల్ సర్వీస్ విజేత స్నేహిత్‌కు అభినందనలు తెలిపారు. -
రాములోరి భూముల్లో రావణాసురులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాములోరి భూముల్లో రావణాసురులు చొరబడ్డారు. పిఠాపురం రాజా హయాంలో భద్రాచల రాముడిని పోలిన పంచలోహ విగ్రహంతో పిఠాపురం నియోజకవర్గం గోర్స గ్రామంలో రామాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్వహణ కోసం నాడు 30 ఎకరాలు దానం చేశారు. ధూపదీప నైవేద్యాల కోసం నాడు సర్వే నంబర్ 121, 122లో గోర్సలో 19.92, కుతుకుడుమిల్లిలో సర్వే నంబర్ 142/1లో 4.89 ఎకరాలు, 142/2లో 6.25 ఎకరాలు ఉన్నాయి. గోర్సలోని 19.92 ఎకరాలను కండేపల్లి నాగన్న, అప్పన్న కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. దేవదాయశాఖ అధీనంలో ఉన్న ఈ భూములకు రెండేళ్లకు ఒకసారి వేలం నిర్వహించేవారు. కాలక్రమంలో దేవదాయశాఖ అధికారులతో కొందరు ఆక్రమణదారులు కుమ్మకై ్క రికార్డులు తారుమారు చేసి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2008కి ముందు తొమ్మిది మంది ఆక్రమణలో ఉన్న గోర్స భూములు కాలక్రమంలో 20 మంది, ప్రస్తుతం 34 మంది చేతుల్లోకి పోయాయి. రెవెన్యూ అధికారులు ముడుపులు మెక్కి ఈ భూములపై పాస్‌పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఆన్లైన్లో కూడా నమోదు చేయించారు. ఆక్రమణదారులు దేవస్థానం భూములను అల్లుళ్లకు కట్న కానుకలుగా కూడా ధారాదత్తం చేసేయడంతో చేతులు మారాయి. ఆక్రమణలో ఉన్న గోర్స భూముల కోసం పాతికేళ్ల క్రితం గ్రామస్తుడు నామాలస్వామి న్యాయ పోరాటంలో మొదలు పెట్టారు. అయితే వయసు మీదపడటంతో అలసిపోయారు. అయినా రాములోరి భూముల కోసం పోరాటాన్ని గ్రామస్తులు విడిచిపెట్ట లేదు. స్థానికులకు 2013లో హిందూ ధర్మరక్షణ సమితి సభ్యులు కూడా తోడయ్యారు. ముడుపులు ముట్టజెపుతూ.. ఇప్పుడు ఆ భూమి ఎకరం రూ.కోటి పైనే పలుకుతోంది. రెండు పంటలు.. అవసరాన్ని బట్టి మూడో పంట కూడా సాగు చేస్తుంటారు. మిగిలిన గ్రామాల్లో భూములకు ఇబ్బంది లేకున్నా ఒక్క గోర్స గ్రామంలో మాత్రమే కూటమి నేతల కబ్జాలో ఉన్నాయి. గోర్సలో సారవంతమైన రాములోరి భూములు ఆక్రమించుకున్న కబ్జాదారులు వాటిని కాపాడుకునేందుకు వేర్వేరు పార్టీల్లో ఉన్న వారు కూటమిగా జత కట్టిన తెలుగుదేశం, జనసేన పార్టీల పంచన చేరారు. ఇరుపార్టీలకు చెందిన నాయకులు, అనుచరుల ఆక్రమణలోనే ఈ భూములుండగా అధికారులకు అడిగినంతా ముడుపులు ముట్టజెపుతూ పబ్బం గడుపుతున్నారు. రూ.కోట్లు విలువ చేసే ఆ భూముల కోసం పాతికేళ్లుగా గ్రామస్తులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ భూముల కోసం 2008లో అప్పటి దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు గ్రామస్తులు చేసిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించి ఆ భూమి దేవస్థానానికి చెందినదిగా నిర్ధారించారు. అడంగల్ ప్రకారం వెంటనే భూమిని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఆ భూమికి అక్రమంగా సృష్టించిన పాస్ పుస్తకాలతో పాటు ఆక్రమణదారులు అనధికారంగా సంపాదించిన హక్కుల రద్దుకు ఆదేశాలు జారీచేశారు. భూమిని అనుభవిస్తున్న వారు హైకోర్టులో వేసిన కేసు వీగిపోవడంతో తిరిగి ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో 2023లో వైఎస్సార్ సీపీ తీసుకువచ్చిన జీవో ప్రకారం దేవస్థానం భూములు తిరిగి దేవస్థానాలకే అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టు జిల్లా ఉన్నతాధికారులు భూములను స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కు విన్నవించినా దక్కని ఫలితం ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాములోరి భూములు కబ్జాచేసిన వారు ఆ పార్టీ పంచన చేరారు. జనసేన, తెలుగుదేశం పార్టీల అండతో దేవదాయ శాఖాధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఆక్రమణలో ఉన్న భూములు కాపాడుకుంటున్నారు. భూములకు ఆక్రమణ చెర వీడేలా ఆదేశాలు ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లారు. పవన్ ఆదేశాలతో ఈ నెల 4న భూములు అప్పగిస్తున్నామంటూ అధికారుల సమాచారంతో స్థానికులు రామాలయం వద్దకు వచ్చినా కుంటిసాకులతో మళ్లీ వాయిదా వేశారు. స్థానికులు ఈ నెల 25న కొత్తపల్లి వచ్చిన పవన్‌కల్యాణ్‌కు అడ్డంపడి మరోసారి వినతిపత్రం అందజేశారు. అయినా అతీగతీ లేదని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. న్యాయస్థానాల్లో అనుకూలంగా తీర్పులు వచ్చినా, ఉప ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం దక్కక పోవడానికి ఆక్రమణదారులైన కూటమి నేతలు తెర వెనుక చక్రం తిప్పడమే కారణమంటున్నారు. సనాతన ధర్మం కోసం కాషాయకండువాలతో దీక్షలు చేసిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చినా భూములకు మోక్షం కలగలేదంటే ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన గోర్స రామాలయం భూములు చెర వీడుతాయనే నమ్మకం కలగడం లేదంటున్నారు. కూటమి నేతలు ఒత్తిళ్లతోనే రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గోర్స గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా రాములోరి భూములకు చెర విడిపించాలని స్థానికులు కోరుతున్నారు. ‘పవన్’కు చెప్పినా పనికాలేదు రూ.20 కోట్ల స్థిర ఆస్తులు చెరపట్టిన వైనం కూటమి పంచన ఆక్రమణదారులు గోర్సలో పాతికేళ్లుగా పోరాటం అధికారుల చర్యలు శూన్యం న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా రాముని భూములు కబ్జాదారుల చెర వీడటం లేదు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు పోరాటాలు చేస్తున్నారు. దేవదాయశాఖ అధికారులకు అన్నీ తెలిసినా ఆచరణలోకి వచ్చేసరికి భూములు తిరిగి స్వాధీనం చేసుకోకపోవడం అన్యాయం. దాదాపు పాతికేళ్లుగా ఆందోళన చేస్తున్నాం. ఈ విషయం మా ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాం. జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయినా ఇంతవరకు భూములు దేవదాయశాఖకు దఖలు పడేలా అధికారుల నుంచి చర్యలు కనిపించ లేదు. – అయినంపూడి సత్యనారాయణరాజు, భూముల ఉద్యమ కార్యాచరణ నేత, గోర్స, ఉప్పాడ కొత్తపల్లి కబ్జాదారులకు వత్తాసు భూములు దేవదాయశాఖకు దఖలు పరిచే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరిగాం. న్యాయం జరిగిందనుకుంటున్న తరుణంలో యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గోర్స రాములవారి ఆలయ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం తీరని వేదనకు గురిచేస్తోంది. భూములను కబ్జాచేసి అనుభవిస్తున్న వారికి కొందరు వత్తాసు పలుకుతూ గ్రామానికి అన్యాయం చేస్తున్నారు. ఇది చూస్తూ ఎవరూ ఉపేక్షించరు. – రొంగల వీరబాబు, గ్రామ సర్పంచ్, గోర్స, ఉప్పాడ కొత్తపల్లి -
వినియోగంలోకి సత్యదేవుని కొత్త నివేదన శాల
అన్నవరం: స్థానిక శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) నిర్మించిన నివేదనశాలలో ఎట్టకేలకు బుధవారం నుంచి నివేదనల తయారీ ప్రారంభించారు. ‘సాక్షి’దినపత్రికలో ఏప్రిల్ 25వ తేదీన ‘నిరుపయోగంగా నివేదనశాల’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అధికారులు స్పందించారు. ఈ నివేదనశాలలో భక్తులకు పంపిణీ చేసే పులిహోర, దద్దోజనం, ఇతర ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సత్యదేవునికి నివేదనలు, పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి, విడిపొంగలి వంటి ప్రసాదాలు తయారు చేసేందుకు స్వామివారి ఆలయానికి దిగువన కుడివైపు ఒక నివేదనశాల ఉంది. 2023లో భక్తులు వేచి ఉండేందుకు కంపార్ట్మెంట్ తరహాలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా ఆ నివేదనశాలను హాలులా అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ మార్చారు. దీంతో నివేదనలు తయారు చేసేందుకు రామాలయానికి ఎదురుగా గల సర్క్యులర్ మండపం మీద తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) రూ.30 లక్షల వ్యయంతో కొత్త నివేదన శాల నిర్మించి 2023 ఆగస్టు నెలలో దాత చేతుల మీదుగా ప్రారంభించారు. 2023 నవంబర్‌లో ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కాగా ఆయన స్థానంలో ప్రస్తుతం దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న కె.రామచంద్రమోహన్ ఈఓగా భాధ్యతలు స్వీకరించారు. పాత నివేదనశాలలోనే మళ్లీ నివేదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో పాత నివేదనశాలకు మార్పులు చేసి 2023 నవంబర్ నుంచి ఉపయోగిస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో ఏప్రిల్ 25న ‘నిరుపయోగంగా నివేదనశాల’ శీర్షికన కథనం ప్రచురితం కాగా దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించారు. కొత్త నివేదనశాలలో భక్తులకు పంపిణీ చేసే పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి తయారు చేయాలని ఆదేశించారు. దీంతో బుధవారం లాంఛనంగా అందులో నివేదనల తయారీ ప్రారంభించారు. -
కోరం లేక ‘కోట’ మున్సిపల్ సమావేశం వాయిదా
సామర్లకోట: కోరం లేకపోవడంతో సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ ప్రకటించారు. బుధవారం ఆమె అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా కౌన్సిల్ సభ్యులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. టీడీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన కాళ్ల శ్యామల, చల్లపల్లి వెంకట సత్యనారాయణ మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం సరిపోలేదు. కౌన్సిల్లో 31 మంది సభ్యులుండగా 29 మంది వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఒక కౌన్సిలర్ మృతి చెందగా ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం నాలుగుకు చేరుకుంది. ప్రస్తుత సమావేశం నిర్వహణకు 16 మంది సభ్యులుండాలి, ఐదుగురే హాజరుకావడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అరుణ ప్రకటించారు. ఏప్రిల్ రెండవ తేదీన చైర్మన్‌పై బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని 22 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. మూడవ తేదీన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు వైఎస్సార్ సీపీ అరుణను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో అరుణ సమావేశం నిర్వహణకు సిద్ధంకాగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. ప్రభుత్వం నుంచి పట్టణాభివృద్ధికి రూ.మూడు కోట్లు మంజూరయ్యాయని, కౌన్సిల్లో చర్చించి ఆమోదించాల్సి ఉండగా సభ్యుల హాజరుకాలేదని చైర్ పర్సన్ అరుణ అన్నారు. -
కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మకు బాధ్యతలు
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరానికి ప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి గల అనుబంధం మరింత ఽబలపడేలా స్థానిక యువ పండితుడు, చతుర్వేది, ఏకసంథాగ్రాహి, దుడ్డు సత్యవేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ తమిళనాడులోని కాంచీపురంలో గల కంచి కామకోటి ఉత్తరాధికారిగా, తదుపరి 71వ పీఠాధిపతిగా అక్షయ తృతీయ పర్వదినాన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సత్యదేవుని నామం కలిపి ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా ఇకపై భక్తుల ఆశయాలకు ప్రతీకగా నిలుస్తారని కంచి కామకోటి పీఠాథిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అభిభాషించారు. శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష కంచిలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలోని పంచగంగా తీర్థంలో ఉదయం 5–30 నుంచి ఎనిమిది గంటల వరకు జరిగిన వైదిక కార్యక్రమంలో పండితుల మంత్రోచ్ఛాటన మధ్య దుడ్డు గణేష్ శర్మ ద్రావిడ్ యజ్ఞోపవీతాన్ని విసర్జించారు. తల్లిదండ్రులు దుడ్డు ధన్వంతరి, మంగాదేవి సమక్షంలో వేలాది మంది భక్తులు, పీఠం అభిమానులు చూస్తుండగా సన్యాసి దీక్ష స్వీకరిస్తున్నట్లు బిగ్గరగా మూడుసార్లు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రకటించారు. శంకరునికి శూలంలా... విష్ణువుకు చక్రంలా యతికి దండం శరీరంపై ఉన్న తెల్లని వస్త్రాలను కూడా నీటిలోనే వదిలి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఇచ్చిన కాషాయ వస్త్రాలను ధరించారు. అనంతరం శంకరునికి శూలంలా, విష్ణువుకు చక్రంలా యతి కి దండం ఎల్లప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుందని స్వామీజీ ఉపదేశించి దండాన్ని అందించారు. దండాన్ని చేతబూని ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి’గా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పెద్ద స్వామీజీతో కలిసి కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తరువాత కంచి పీఠంలో శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల బృందావనాలను దర్శించారు. తరువాత కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి పీఠంలో శ్రీచంద్రమౌళీశ్వర స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. అన్నవరంలో ప్రత్యేక పూజలు శ్రీదుడ్డు గణేష్ శర్మ ద్రావిడ్ సన్యాస దీక్ష స్వీకరించిన సందర్భంగా స్థానిక శ్రీసత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో జగద్గురు ఆదిశంకరాచార్యులుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్రం అధ్యక్షుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా నామకరణం పులకించిన అన్నవరం -
గుడిలో చోరీ చేసి పట్టుబడ్డ దొంగ
పిఠాపురం: చేతికి గ్లౌజులు, కాళ్లకు సాక్సులు, మొహానికి మాస్క్ వేసుకుని దర్జాగా గుళ్లోకి ప్రవేశించాడు. ఎక్కడా తన ఆనవాళ్లు బయట పడకుండా జాగ్రత్త పడుతూ దేవుడి గుడిని కొల్లగొట్టాడు. దొంగిలించిన సొత్తుతో పరారవ్వడానికి ప్రయత్నించి గ్రామస్తులకు చిక్కాడు. గొల్లప్రోలు శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. మంగళవారం తెల్లవారుజామున గొల్లప్రోలు నడిబొడ్డున ఉన్న శివాలయం గోడ దూకి ఒక వ్యక్తి పారిపోతుండగా స్థానికులు అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఆరా తీస్తే అతను దొంగతనం చేసి పారిపోతున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా అతను గుడిలో దొంగతనం చేసి పారిపోతున్నట్లు గుర్తించారు. అతని నుంచి గుడిలో ఉండే సుమారు రెండు కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అతనిని గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన పసుపులేటి శివాజీగా గుర్తించారు. అర్ధరాత్రి శివాలయంలో ప్రవేశించి ఆలయ తలుపులు పగుల గొట్టి స్వామి వారికి అలంకరించే వెండి వస్తువులను దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇతను గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా చేతికి గ్లౌజులు, కాళ్లకు సాక్సులు, మొహానికి మాస్క్ వేసుకుని దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు కేజీల వెండి వస్తువుల స్వాధీనం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉప ముఖ్యమంత్రి పవన్ హడావుడితో పోర్టుకు నష్టం
కాకినాడ సిటీ: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హడావుడితో దెబ్బతింటున్న పోర్టు ఎగుమతి, దిగుమతులపై అధికారులు దృష్టి సారించి ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకునేందుకు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే పోర్టు ఎగుమతి దిగుమతులు సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సీపీఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సాయంత్రం సుందరయ్యభవన్‌లో కె.సత్తిరాజు అధ్యక్షత జరిగిన సమావేశంలో సీపీఎం నాయకులు మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోర్టులో బియ్యం ఎగుమతులపై చేసిన హడావుడి వల్ల పోర్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కాకినాడ పోర్టు ద్వారా జరగాల్సిన ఎగుమతి, దిగుమతులు విశాఖ, కృష్ణపట్నం రేవుల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు లావాదేవీలు వేగంగా జరిగి కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ జిల్లా మంత్రిగా ఉండడం వల్ల పిఠాపురంతో పాటు జిల్లా అంతా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని, దానిలో భాగంగా జిల్లా కేంద్రమైన కాకినాడ కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. అభివృద్ధికి కొలమానం ఉపాధి కల్పనే అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఉపముఖ్యమంత్రి కార్యాచరణ అందుకు తగిన విధంగా లేదన్నారు. ఇప్పటికై నా రాజకీయ ప్రయోజనాల చట్రంలో కూరుకుపోకుండా చిత్తశుద్ధిగా, అభివృద్ధి దిశగా ఉపముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సీపీఎం కోరుతోందని నాయకులు అన్నారు. సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నాయకులు దుంపల ప్రసాద్, వేణు, మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ పాల్గొన్నారు. దెబ్బతింటున్న ఎగుమతి, దిగుమతులు ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న కార్మికులు సీపీఎం సమావేశంలో నేతలు -
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులను నియమించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ముగ్గురిని నియమిస్తూ పార్టీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచీ పీఏసీ, సీజీసీ సభ్యురాలిగా పదవులు నిర్వహించిన జక్కంపూడి విజయలక్ష్మిని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలిగా నియమించారు. కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడిగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం తంగేడు గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ దాట్ల వెంకట సూర్యనారాయణరాజును నియమితులయ్యారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గానికి విశాఖపట్నానికి చెందిన తిప్పల గురుమూర్తిరెడ్డిని నియమించారు. అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన పార్టీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమితులయ్యారు. పార్లమెంటరీ పరిశీలకులు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు అనుసంధానంగా పని చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నీట్‌గా నిర్వహించాలిరాజమహేంద్రవరం సిటీ: వైద్య కళాశాలల్లో ప్రవేశానికి జరిగే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. నీట్ నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో తన చాంబర్లో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 2,760 మంది ఈ పరీక్ష రాయనున్నారన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మే 3, 4 తేదీల్లో ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు మూసివేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు. ఆయా కేంద్రాలకు అన్ని బస్ స్టేషన్ల నుంచీ ఉదయం 8 నుంచి ఒంటిగంట వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జేసీ అన్నారు. సమావేశంలో డీఆర్ఓ టి.సీతారామమూర్తి, నోడల్ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ జి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నాళం వారి సత్రం భూముల కౌలు వేలం వాయిదా
తొండంగి: రాజమహేంద్రవరానికి చెందిన నాళంవారి సత్రంకు సంబంధించి శృంగవృక్షంలోని 268.64 ఎకరాల భూమి మూడు సంవత్సరాల కౌలు వేలం ప్రక్రియ మంగళవారం వాయిదా పడింది. దేవదాయధర్మాదాయశాఖ సత్రం కార్యనిర్వహణాధికారి చందక దారబాబు, పర్యవేక్షణాధికారి రమణి, ఇతర సిబ్బంది 268.64 ఎకరాలకు 13 బిట్లుగా కౌలు వేలం నిర్వహించేందుకు శృంగవృక్షం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. గతంలో సత్రం భూములకు వేలం సొమ్మును బకాయిదారులు 52 మంది రూ1.36 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. రైతులందరూ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని వేలం పాటలో పాల్గొనేందుకు బకాయిలు చెల్లిస్తామని అధికారులకు వివరించారు. కొద్ది మంది రైతులు రూ.9.27 లక్షలు చెల్లించారు. మరి కొంత మంది సమయం ఇస్తే బకాయిలు చెల్లించి వేలం పాటలో పాల్గొంటామని కోరారు. ప్రస్తుతం వేలంలో పాల్గొనేందుకు రైతులు పూర్తిస్థాయిలో హాజరుకాని నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వేలం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఈవో దారబాబు తెలిపారు. రైతుల అభ్యర్థనను దేవదాయశాఖ ఆర్జేసీకి తెలియజేసి త్వరలో వేలం షెడ్యూల్ వెల్లడిస్తామని తెలిపారు. భూములను గుట్టుగా రాయించుకునేందుకు రాజకీయ ఒత్తిడులు నాళం వారి సత్రం భూములు కేవలం తక్కువగా 13 బిట్లుగా వేలం నిర్వహిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు లేదు. దీర్ఘకాలం నుంచి దేవదాయ ధర్మాదాయశాఖ అధికారులను రాజకీయ ఒత్తిడి చేసి తక్కువ ధరకు మొక్కుబడిగా బహిరంగ వేలం తంతు నిర్వహించి కొందరు భూములను దక్కించుకున్నారని, వారు ఇతరులకు సబ్ లీజుకు ఇచ్చి సొమ్ము అక్రమంగా సంపాదించారని రైతులు ఆరోపిస్తున్నారు. అలా సొమ్ము చేసుకున్న పాట దారులు సత్రానికి చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ప్రస్తుతంసత్రం అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో కార్యనిర్వహణాధికారిని బదిలీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. యువతి అదృశ్యం అమలాపురం టౌన్: తన అక్క ఇంటికి అమలాపురం వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని పంజా సెంటరుకు చెందిన యాళ్ల భూమిక శివ సాయి మంగళవారం అదృశ్యమైంది. ఈ మేరకు యువతి తండ్రి యాళ్ల నాగభూషణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని తన అక్క ఇంటికి వచ్చిన భూమిక మంగళవారం ఉదయం అదృశ్యమైంది. రూ. 9.27 లక్షలు చెల్లించిన పాత బకాయిదారులు చెల్లింపునకు మరింత గడువు ఇవ్వాలని కోరిన రైతులు -
వైద్యం వికటించి చిన్నారి మృతి
రౌతులపూడి: మండలంలోని గిడజాం గ్రామానికి చెందిన చక్కా హర్షవర్ధన్ (11నెలలు) వైద్యం వికటించి మంగళవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు వారు, గ్రామస్తులు గిడజాంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై రౌతులపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గిడజాం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ ఆరోగ్య పరీక్షల కోసం తల్లితండ్రులు సంధ్య, నాగదుర్గాప్రసాద్ మంగళవారం రౌతులపూడి సినిమా సెంటర్లో ఒక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. వైద్యుడు ఇందన బ్రహ్మానందం బాలుడిని పరీక్షించి ఇంజెక్షన్, మందులు ఇచ్చారు. ఇంటికివెళ్లి బాలుడికి మందులు వేయగా కొంతసేపటికి ఎగఊపిరి వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కంగారుపడ్డ తల్లితండ్రులు రౌతులపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు బాలుడిని పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన బాలుడు తల్లితండ్రులు, కుటంబసభ్యులు గిడజాంలో రోడ్డుపై ఆందోళన చేశారు. అనంతరం రౌతులపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
విద్యార్థిని సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతి
తుని: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫ్కేషన్ విడుదల చేయడంతో కష్టపడి ఉద్యోగం సాధించాలని కలలు కన్న విద్యార్థికి కొండంత కష్టం కలిగింది. ఐదేళ్లుగా డీఎస్సీ కోసం శ్రమిస్తున్న విద్యార్ధి నూకరత్నం ఆశలు అడియాశలు అయ్యాయి. ఆగ్ని ప్రమాదం రూపంలో కష్టార్జితం బూడిద పాలు కావడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం తుని మండలం సీహెచ్.అగ్రహరం గ్రామంలో రెండు పోర్షన్ల తాటాకు ఇంటికి నిప్పు అంటుకుని సర్వస్వం కోల్పోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మదాసి లోవరాజు, సిరిసిపల్లి అమ్మాజీ కుటుంబాలు రెండు పోర్షన్లు తాటాకు ఇంటిలో ఉంటున్నారు. ఈ ప్రమాదంలో విలువైన వస్తువులు, నగదు ఆగ్నికి ఆహుతి అయ్యాయి. ఇందులో మదాసి లోవరాజు కుమార్తె నూకరత్నంకు చెందిన పది, ఇంటర్, డిగ్రీ ఒరిజనల్ సర్టిఫికెట్లు కాలిపోయాయి. దీంతో పాటు దాచుకున్న రూ.1.40 లక్షలు బూడిద పాలు అయ్యాయి. నూకరత్నం కోటనందూరులో హాస్టల్లో ఉంటూ డీఎస్సీకి సన్నద్ధం అవుతోంది. ఆగ్ని ప్రమాదం జరిగిందని, సర్టిఫికెట్లు కాలిపోయాయని తెలియడంతో తల్లిడిల్లింది. ఐదేళ్లుగా డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నానని, ఒరిజనల్ సర్టిఫికెట్లు కాలిపోవడంతో భవిష్యత్ అంథకారం అయిందని కన్నీరు పెట్టుకుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే భవిష్యత్‌ను కోల్పోతానని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యాశాఖ అధికారులు స్పందించి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాటు చేయాలని వేడుకుంది. తుని ఆగ్నిమాపక అధికారి రాముడు ఆధ్వర్యంలో మంటలను ఆర్పివేశారు. నూకరత్నంకు అండగా వైఎస్సార్ సీపీ ప్రమాదంలో సర్వం కోల్పోయిన రెండు కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని పార్టీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన బాధితులను మంగళవారం పరామర్శించారు. విద్యార్థి నూకరత్నం కన్నీటిని చూసిన వైఎస్సార్ సీపీ నాయకులు చలించిపోయారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి సర్టిఫికెట్లు ఇచ్చేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రెండు కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, పోతల రమణ, సర్పంచ్ లంక సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు లంక తాతీలు, మామిడి శెట్టి శ్రీను,ఆవాడ సత్యనారాయణ, లంక చిన్నాలు, గోవిందు, చిట్టిబాబు, అప్పారావు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ -
పతకాల విజేతకు కలెక్టర్ అభినందన
కాకినాడ సిటీ: జాతీయ స్థాయి పరుగు పందేల్లో మూడు కాంస్య పతకాలు సాధించిన యాతం నాగబాబును కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం కలెక్టరేట్లో అభినందించారు. 58 సంవత్సరాల నాగబాబు వెటరన్ నేషనల్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్లో మూడు కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా నాగబాబు కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం మైసూర్లో చాముండి విహార స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన 44వ నేషనల్ వెటరన్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్ షిప్ మీట్ 2025లో పాల్గొని ఈ పతకాలు సాధించినట్లు తెలిపారు. మూడు విభాగాలుగా జరిగిన పోటీల్లో 100 మీటర్లు, 400, 800 మీటర్ల పరుగు పందేల్లో పాల్గొని ప్రతి విభాగంలోను మూడో స్థానం సాధించి కాంస్య పతకాలు సాధించారు. ఈయన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా మలేరియా విభాగంలో సబ్ యూనిట్ అధికారిగా పని చేస్తున్నారు. నాగబాబు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ షణ్మోహన్ అభిలాషించారు. నిందితుల అరెస్టు కాకినాడ క్రైం: ఈ నెల 27వ తేదీన కాకినాడలో ఓ యువకుడి హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రేచర్లపేటలోని గుర్రాల వారి వీధిలో మీసాల గౌతమ్(25)ను అతడి నలుగురు స్నేహితులు తలపై రాళ్లతో కొట్టి హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో నిందితులైన యాదాల దుర్గాప్రసాద్, యాదాల నవీన్, మొహమ్మద్ సంధాని, షేక్ ఇమ్రాన్‌లను అరెస్టు చేసినట్లు కాకినాడ టూ టౌన్ పోలీసులు వెల్లడించారు. మద్యం కోసం డబ్బు డిమాండ్ చేయడం వల్ల చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో గౌతమ్‌ని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో 10 మందికి రెండు రోజులు చొప్పున జైలు, ఏడుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1,2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో 17 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
మెట్టు.. మెరిసేలా..
ఫ ఆకర్షణీయంగా రెండో మెట్ల మార్గం నిర్మాణం ఫ ప్రత్యేక యంత్రాలతో రాళ్ల కటింగ్ ఫ మూడు నెలల్లో పూర్తి కానున్న పనులు అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు నిర్మిస్తున్న రెండో మెట్ల దారి నున్నటి మెట్లతో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. రాజస్తాన్ నుంచి తీసుకువచ్చిన యంత్రంలో కట్ చేసిన రాళ్లను ఈ మెట్ల దారిలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మొదటి మెట్ల దారిలో ఉపయోగించిన రాళ్లు చేతితో చెక్కినవి. వాటిలో అంత నునుపు కనిపించదు. యితే ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో మెట్ల దారిలో ఉపయోగిస్తున్న రాళ్లను గ్రానైట్, మార్బుల్ రాళ్ల మాదిరిగా మెషీన్లతో కట్ చేసి, ఫినిషింగ్ ఇస్తున్నారు. ఈ రాళ్లతో వేస్తున్న మెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 250 మెట్లు.. రూ.90 లక్షలు మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రారంభమయ్యే ఈ మార్గం రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ మార్గంలో మూడు మలుపులతో 250 మెట్లు నిర్మించనున్నారు. వీటిని నిర్మాణానికి సుమారు రూ.90 లక్షల అంచనాతో గత ఏడాది టెండర్ ఖరారు చేశారు. 2010లో అప్పటి దేవస్థానం ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ మెట్ల మార్గం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు తొలి పావంచా వద్ద నుంచి 400 మెట్లతో ఒక మార్గం ఉంది. అది మొదటి ఘాట్ రోడ్డుకు సుమారు అర కిలోమీటరు దూరంలో ఉంది. టూరిస్టు బస్సులలో వస్తున్న భక్తులు తమ వాహనాలను దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపు చేసి, తొలి పావంచా వద్ద ఉన్న మెట్ల మార్గంలో కొండపై ఉన్న సత్యదేవుని ఆలయానికి చేరుకోవడం ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డు నుంచి రెండో మెట్ల మార్గం నిర్మిస్తే స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి భక్తులకు వీలుగా ఉంటుందని రామచంద్ర మోహన్ భావించారు. ఆ తరువాత ఆయన ఇక్కడి నుంచి బదిలీ అవ్వడంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. తిరిగి 2023లో ఆయన అన్నవరం దేవస్థానం ఈఓగా నియమితులైన తరువాత ఈ మెట్ల దారి నిర్మాణానికి టెండర్లు పిలిచి, ఖరారు చేశారు. రాజస్తాన్ మెషీన్లతో.. మొదట పనివారు ఉలితో చెక్కిన రాళ్లను ఈ మెట్ల మార్గంలో ఉపయోగించాలని అనుకున్నారు. అయితే, ఆ రాళ్లతో వేసిన మెట్లు అంత అందంగా లేవని భావించారు. రాజస్తాన్ నుంచి ఒక మెషీన్ తీసుకుని వచ్చి, దేవస్థానం గ్రౌండ్లో ఉంచి, ఈ రాళ్లను అందంగా కట్ చేస్తున్నారు. త్వరలో ఇంకో మెషీన్ కూడా తీసుకు వస్తామని అధికారులు తెలిపారు. మరో మూడు నెలల్లో ఈ మెట్ల మార్గం పనులు పూర్తి చేస్తామని దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, డీఈ ఉదయ్ కుమార్ తెలిపారు. మెషీన్‌తో కట్ చేసిన రాళ్లతో నిర్మించిన మెట్లు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు భక్తుల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. -
జాతీయ బోట్గేమ్ పోటీల్లో వర్షిత ప్రతిభ
పెదపూడి: భోపాల్‌లోని లోయర్లేక్ వేదికగా ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించిన 35వ జాతీయ కెనోయ్ స్ప్రింట్ (బోట్గేమ్) చాంపియన్‌షిప్ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన గొలుగూరి వర్షిత కాంస్య పతకం సాధించిందని ఆమె తల్లిదండ్రులు రాజేష్‌రెడ్డి, విజయలక్ష్మి సోమవారం తెలిపారు. అనపర్తిలో వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ కె4 500 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించినట్టు తెలిపారు. వర్షిత ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఎస్ఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతోందన్నారు. -
వీర్లపై వారి వైఖరేమిటో!
● నివేదిక సమర్పించి నాలుగు రోజులైనా వీడని సందిగ్ధత ● సింహగిరి చందనోత్సవం తరువాతేనని ఊహాగానాలు ● పరిశీలనలో ముగ్గురు ఆర్జేసీలు, ఒక డీసీ పేర్లు అన్నవరం: రత్నగిరిపై ఇటీవల నెలకొన్న వివాదాలు, ఈఓ వీర్ల సుబ్బారావు వ్యవహార శైలి, ఆయన కుమారుడి జోక్యం, తదితర అంశాలపై దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ కె.చంద్రకుమార్ విచారణ జరిపి నివేదిక సమర్పించి నాలుగు రోజులైనా తదుపరి చర్యలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌కు ఇచ్చిన నివేదికలో సాక్షిలో వచ్చిన పలు కథనాల ఆధారంగా పలువురు ఉద్యోగుల అభిప్రాయాలను సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నమోదు చేసిన రికార్డులను పొందుపరచారు. దేవస్థానంలో సూపరింటెండెంట్లు, ఏఈఓలతో 22వ తేదీ, మంగళవారం ఏడీసీ చంద్రకుమార్ సమావేశమై విచారణ నిర్వహించారు. తరువాత ఈఓ వీర్ల సుబ్బారావు తో కూడా ఆయన మాట్లాడారు. కమిషనర్ బిజీతో ఆలస్యం? కాగా, సింహాచలం దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా చందనోత్సవ ఏర్పాట్లలో కమిషనర్ రామచంద్రమోహన్ తలమునకలైన ఉండడం వల్లే రత్నగిరి వ్యవహారాల్లో చర్యలు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. 29వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ప్రారంభం కానున్న చందనోత్సవానికి సుమారు 300 మంది సిబ్బందిని వివిధ దేవస్థానాల నుంచి డెప్యుటేషన్‌పై తరలించారు. ఈఓ బదిలీపై ఊహాగానాలు నివేదిక ఆధారంగా ఈఓ వీర్ల సుబ్బారావును రత్నగిరి నుంచి బదిలీ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మే ఏడో తేదీ నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు సాగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత నెమ్మదించవచ్చనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. పరిశీలనలో నలుగురి పేర్లు ఈఓ సుబ్బారావు బదిలీ జరిగితే ఆ స్థానంలో ఎవరిని నియమించాలనేదానిపై ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ ఈఓలుగా పని చేసిన ముగ్గురు ఆర్జేసీల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఇద్దరు దేవస్థానం ఈఓలుగా పనిచేస్తుండగా, ఒకరు సెలవులో ఉన్నారు. మరో ఆర్జేసీ శాఖాపరమైన పోస్టులో ఉన్నారు. కాగా, గతేడాది డీసీగా పదోన్నతి పొందిన అధికారిని ఈఓగా నియమించాలని టీడీపీకి చెందిన మెట్ట ప్రాంత సీనియర్ ఎమ్మెల్యే సిఫారసు చేసినట్టు సమాచారం. ఆర్జేసీ పదోన్నతుల జాబితాలో ఆయన స్థానం రెండోది. అందువల్ల ఆయనను ఈఓగా నియమించి ఆ తరువాత పదోన్నతి కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. కొనసాగేలా ఈఓ పావులుకాగా, దేవస్థానం ఈఓగా తనను కొనసాగించాలని ఈఓ వీర్ల సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇటీవల ఒక టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడిని కలిసి చర్చించారని ఆయన కమిషనర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారని అంటున్నారు. అలాగే ఇతర ఎమ్మెల్యేలను కూడా ఆయన కలుస్తున్నట్టు సిబ్బంది చెప్తున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాకినాడ సిటీ: స్థానిక న్యూ పోర్ట్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం దిగవన రైతుల పట్టాల వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పీ ఎస్ఐ వాసు తెలిపారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు, చామన ఛాయ కలిగి ఉండి బ్లూ కలర్ ట్రాక్ ఫ్యాంట్ సిమెంటు కలర్ టీషర్టు దానిపై ఫ్రంట్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఉందన్నారు. కుడికాలుకు దిష్టి పూసలతాడు, మెడలో ఎర్రతాడు, చేతికి ఎర్రతాడు ఉన్నాయ న్నారు. ఆచూకీ తెలిసిన వారు 85558 56876 నంబర్‌కు తెలియజేయాలని ఎస్ఐ కోరారు. -
దిగుబడి బాగున్నా దయనీయమే!
● ధాన్యం కొనండి మహాప్రభో అని వేడుకుంటున్న అన్నదాతలు ● టార్గెట్ మీరలేమంటున్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది ● తలలు పట్టుకుంటున్న రైతులు గోకవరం: చివరి ధాన్యపు గింజ వరకు కొంటాం.. రైతు సంక్షేమమే లక్ష్యం.. ఇవీ నిత్యం కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు. క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి విరుద్ధం. కొనుగోలు కేంద్రాల వద్ద ఇంత ధాన్యమే కొనాలని లక్ష్యం విధిస్తే అంతకు మించి సరకును రైతులు తీసుకువస్తే ససేమిరా.. మేమింతే కొంటామని కొనుగోలు కేంద్రాల సిబ్బంది పొమ్మంటే అన్నదాత పరిస్థితి ఏమిటి? ఎవరైనా పంట వేస్తే దిగుబడి బాగా రావాలనే వేస్తారు. ఆశించినట్టే దిగుబడి వచ్చినా అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టు పరిస్థితి ఉంటే ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలి? ఇదే పరిస్థితి మండలంలోని తంటికొండ రైతులకు ఏర్పడింది. ఈ పరిస్థితిపై రైతులు సోమవారం అధికారులకు మొర పెట్టుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు రబీసాగులో 876 ఎకరాల్లో ఎంటీయూ 1121 రకం ధాన్యాన్ని, 12 ఎకరాల్లో 1156 రకాన్ని పండించి ఈ–క్రాప్ నమోదు చేయించుకున్నారు. సుమారు 33,779 క్వింటాళ్లు దిగుబడి రాగా 16,110 క్వింటాళ్లు రైతుభరోసా కేంద్రం ద్వారా విక్రయించారు. అయితే వ్యవసాయశాఖ సిబ్బంది టార్గెట్ లేదని వారి వద్ద ఉన్న సుమారు 14,169 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారులకు విక్రయిద్దామంటే గిట్టుబాటు ధర రావడం లేదని, ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తాము అప్పులపాలవుతామని రైతులు అధికారుల వద్ద వాపోయారు. ధాన్యం టార్గెట్‌ను పెంచి తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీఓ గోవిందు, ఏఓ రాజేశ్వరిలను వేడుకున్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. -
ట్రిపుల్ ఐటీ సంరంభం..
● ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల ● ఆన్లైన్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ● వచ్చే నెల 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన రాయవరం: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపు అంతా ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 4 వేల ట్రిపుల్ ఐటీ సీట్లలో జిల్లాకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు.. ఎన్ని సీట్లు వస్తాయనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. జూన్ 11 నుంచి 17వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీ (పీహెచ్/ఎన్సీసీ/స్పోర్ట్స్/భారత్ స్కౌట్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్దేశించిన ఐఐఐటీల్లో చేపట్టనున్నారు. అడ్మిషన్ల అనంతరం ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తారు. నాలుగు వేల సీట్లు రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో చోట వెయ్యి సీట్ల వంతున నాలుగు వేల సీట్లు ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 48,448 మంది మధ్య ఈ పోటో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే అధిక సీట్లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీలో అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియ ఇలా ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇరువురు విద్యార్థులకు మార్కులు సమానంగా వస్తే తొలుత గణితం, అనంతరం జనరల్ సైన్స్, తదుపరి ఇంగ్లిషు, ఆ తదుపరి సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజన్లో అధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తారు. అప్పటికీ సమానంగా వస్తే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు ఉన్న వారిని, హాల్ టికెట్ నంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు ఇలా ట్రిపుల్ ఐటీలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయుకేటీ.ఇన్/ఏపీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ.300గా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200గా నిర్దారించారు. రిజర్వేషన్లు ఇలా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు రిజర్వేషన్ నిబందనలు పాటిస్తారు. రాష్ట్రంలోని అభ్యర్థులకు 85 శాతం సీట్లు, మిగిలిన 15 శాతం సీట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కేటాయిస్తారు. ఎస్సీ–15, ఎస్టీ–6, బీసీ(ఎ)–7, బీసీ (బి)–10, బీసీ (సి)–1, బీసీ (డి)–7, బీసీ (ఇ)–4, దివ్యాంగులు–5, ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (సీఏపీ)–2, ఎన్సీసీ–1, స్పోర్ట్స్–0.5, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్–0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీల్లో బాలికలకు 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు. ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 24. ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ ఏప్రిల్ 27 నుంచి మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. ఆన్లైన్ స్పెషల్ కేటగిరీ (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్) విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మే 28, 29 తేదీలలో. స్పోర్ట్స్ కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన: మే28 నుంచి 30 వరకు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మే 29న. ఎన్సీసీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మే 29 నుంచి 31 వరకు. ప్రొవిజినల్ సెలక్షన్ (స్పెషల్ కేటగిరీ కాని విద్యార్థులు) జూన్ 05. నూజివీడు క్యాంపస్‌కు ఎంపికై న వారి సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 11, 12 తేదీలు ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ క్యాంపస్‌లకు ఎంపికై నవారికి జూన్ 12, 14 తేదీలు శ్రీకాకుళం క్యాంపస్‌కు ఎంపికై న వారికి జూన్ 16, 17 తేదీలలో ఎంపికై న విద్యార్థులు ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్టు చేయాల్సిన తేదీ జూన్ 30 నాడు వైఎస్ చలువతో గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అధిక సీట్లు కేటాయించగా, 2010లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లు ఉండేలా కుదించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లిపోవడంతో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీల్లో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇచ్చేందుకు వర్శిటీ అధికారులు నిర్ణయించి 4వేల సీట్లలో ఓపెన్ కేటగిరీలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ, ఎన్ఆర్ఐ, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా కేటాయిస్తారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అవకాశం లభించనుంది. -
పీజీఆర్ఎస్కు 439 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 439 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి, సీపీఓ త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు రానవసరం లేదని, మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీ స్థితిగతులు తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు. అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, సక్రమంగా పరిష్కరించని అర్జీలపై రెండు స్థాయిల్లో ఆడిట్ జరిపి, రీ ఓపెన్ చేస్తారని చెప్పారు. అలా ఎక్కువగా అర్జీలు రీ ఓపెన్ చేసిన శాఖ అధికారులకు మెమోలు జారీ చేస్తారని హెచ్చరించారు. అందువలన అర్జీదారు సంతృప్తి చెందే విధంగా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. సముద్ర నాచు సాగును ప్రోత్సహించాలి అమలాపురం రూరల్: జిల్లాలో తీరం వెంబడి చెరువు ఆధారిత సముద్రపు నాచు సాగును ప్రోత్సహించాలని, దీనివలన బహుళ ప్రయోజనాలుంటాయని, సహజ పర్యావరణానికి ఇది లాభదాయకమని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సముద్రపు నాచు సాగు విస్తరణ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఆయన సమీక్షించారు. ఈ నాచు ఉత్పత్తులు సేంద్రియ ఎరువులుగా, పశుగ్రాసంగా, చేపలకు, కోళ్లకు మేతగా, కాస్మెటిక్స్ తదితర రంగాల్లో ఉపయోగపడతాయని, పర్యావరణ హితమైన ఉత్పత్తులను అందిస్తుందని వివరించారు. గచ్చకాయలపోర, ఎస్.యానాం, రాజోలు సముద్ర తీర ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను ఆర్డీఓ కె.మాధవి సమన్వయంతో ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 40 మంది ఔత్సాహిక స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. వారికి తమిళనాడులోని రామనాథపురం జిల్లా మండపంలో జరుగుతున్న నాచు సాగుపై శిక్షణ ఇప్పించేందుకు విధివిధానాలు మే రెండో తేదీ నాటికి రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రతినిధి శ్రీహర్ష, జిల్లా మత్స్యశాఖ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ, ఉద్యాన అధికారులు పీవీ శ్రీనివాసరావు, ఎంవీ ప్రసాదరావు, శంకరరావు, బోసుబాబు, రమణ, ఎల్డీఎం కేశవవర్మ, డీఆర్డీఏ పీడీ జయచంద్ర పాల్గొన్నారు. సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగంతో అనంత ఫలితం అంబాజీపేట: లోక కల్యాణం కోసం నిర్వహించే యాగాల్లో సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం ఎంతో అరుదైనదని, ఇది అనంత ఫలితాలనిస్తుందని ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన సచ్చిదానంద తీర్థ స్వామి అన్నారు. తొండవరం గ్రామంలో జరుగుతున్న ఈ యాగాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ, 60 ఏళ్ల క్రితం వరకూ ఈ ప్రాంతంలో ఇటువంటి యాగం జరగలేదన్నారు. ఎంతో నిష్టాగరిష్టులైన సోమయాజులుకు మాత్రమే ఇటువంటి యాగాలు నిర్వహించే సత్తా ఉంటుందన్నారు, కోనసీమలో ఉద్దండులైన వేద పండితులకు కొదవ లేదన్నారు. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ఆశీస్సులతో 2020లో తాను అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున యాగం నిర్వహించానన్నారు. హరిద్వార్‌లో తెలుగు వారికి నిత్యాన్నదానం చేసేందుకు గౌతమీ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశామని, దీనిని గుంటూరుకు చెందిన వాసుదేవశర్మ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక్కడ ప్రతి రోజూ రెండు మూడు వేల మందికి భోజనం, ఫలహారం అందిస్తున్నామని వివరించారు. రానున్న సరస్వతీ నది పుష్కరాలకు రోజుకు లక్ష మంది వరకూ తెలుగు వారు వచ్చే అవకాశం ఉన్నందున వారికి భోజనం, ఫలహారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్వామీజీ వివరించారు. -
కొమరగిరిలో భూచోళ్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అందిన కాడికి దోచుకు తినడమే కూటమి నేతల పనిగా మారినట్లు కనిపిస్తోంది. చేతుల్లో అధికారం ఉందని, తాము ఏమనుకుంటే అదే అవుతుందని, ఏం చేయాలనుకుంటే అదే చేస్తామని, తమను ఆపే దమ్ము ఎవరికి ఉందనే ధైర్యంతో చెలరేగిపోతున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్.. ఇలా ఒకటేమిటి అన్నింటా పెత్తనం తమదే అన్నట్లు బరితెగిస్తున్నారు. ఈ దోపిడీ యవ్వారం కాస్తా శృతి మించి, నిరుపేదల కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో పాగా వేసే వరకూ వెళ్లింది. గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు రెవెన్యూ యంత్రాంగం అండదండలు కూడా తోడవడంతో టీడీపీ, జనసేన నేతలు రూ.లక్షలు మింగేస్తున్నారు. ఏం జరిగిందంటే.. కాకినాడ అర్బన్ పరిధిలో పేదలు, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేయాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాధినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. దీనికోసం యు.కొత్తపల్లి మండలం కొమరిగిరిలో రైతుల నుంచి 72 ఎకరాలు సేకరించారు. ఇందులో 30 ఎకరాల్లో లే అవుట్లు వేసి, పేదలకు పట్టాలు కూడా ఇచ్చేశారు. మిగిలిన 42 ఎకరాల్లో లే అవుట్ వేయాల్సి ఉంది. ఈ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అప్పట్లో పరిహారం కూడా చెల్లించేసింది. ఇక్కడ 350 మంది పేదలకు పట్టాలు కూడా అందచేసింది. భూమి పల్లంగా ఉండటంతో లే అవుట్ చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో లే అవుట్, భూమి అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి హామీలను నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. అదే ఇప్పుడు పేదలకు శాపంగా.. ఆ పార్టీల నేతలకు కల్పతరువుగా మారింది. 42 ఎకరాలపై కూటమి నేతల కన్ను కొమరగిరిలో లే అవుట్ చేయని, రెండు పంటలు పండే సారవంతమైన 42 ఎకరాల భూములపై కొన్నాళ్ల కిందట కూటమి నేతల కన్ను పడింది. రైతులకు పూర్తిగా పరిహారం చెల్లించడంతో ఆ భూములపై ప్రభుత్వానికే సర్వహక్కులూ ఉంటాయి. కానీ, ప్రభుత్వం తమదేనన్న ధీమా, అధికారులు తమ మాట కాదరనే ధైర్యంతో కూటమి నేతలు ఆ భూములను యథేచ్ఛగా తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. గత ప్రభుత్వం ఎలాగూ పరిహారం ఇచ్చేసిందనే మిషతో అప్పటి వరకూ ఆ భూములకు యజమానులుగా ఉన్న రైతులను నయానా భయానా బెదిరించి తరిమేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆ భూములపై ఆధిపత్యం కోసం టీడీపీ, జనసేన నేతలు వర్గాలుగా విడిపోయారు. ఈ విషయంలో టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగి, ఇరు పార్టీల నేతలకు మీకు సగం.. మాకు సగం అనే పద్ధతిల రాజీ కుదిర్చారు. ప్రభుత్వ ఆధీనంలోని భూములను తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన జిరాయితీ భూముల మాదిరిగా బినామీలకు లీజులకు ఇచ్చేశారు. రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని మీకింత.. మాకింత అంటూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఖరీఫ్ రబీ సీజన్లు రెండూ కలిపి ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలనేది నేతలు, బినామీ రైతులు చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో నాలుగో వంతు రెవెన్యూ వర్గాలకు ముట్టజెప్పేందుకు అంగీకారం కుదిరిందని కొమరగిరి కోడై కూస్తోంది. అంటే 42 ఎకరాలకు, రెండు సీజన్లకు కలిపి రూ.16.80 లక్షల మేర కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తూండటంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేతులు దులుపుకొంటున్న ‘రెవెన్యూ’ ఈ భూముల విషయమై అక్కడి రెవెన్యూ అధికారులను అడిగితే కాకినాడ అర్బన్ పరిధిలోని లబ్ధిదారుల కోసం కేటాయించిన భూములని, తమకు ఎటువంటి ప్రమేయమూ లేదని తప్పించుకుంటున్నారు. కాకినాడ రెవెన్యూ అధికారులైతే ఆ భూముల్లో ఎవ్వరూ సాగు చేయరాదని, ఒకవేళ చేస్తే కౌలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించామని చెబుతూ చేతులు దులుపుకొంటున్నారు. ఈ భూబాగోతం నిగ్గు తేల్చాలని ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం పరిహారం చెల్లించిన ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, అర్హులైన లబ్థిదారులకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనే డిమాండుతో సీపీఐ, అనుబంధ వ్యవసాయ కూలీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పట్టా భూముల్లో కూటమి నేతల తిష్ట బినామీ రైతులతో గ‘లీజు’ వ్యవహారం మీకు సగం.. మాకు సగం అంటూ కొల్లగొట్టు యవ్వారంపేదలకు ఇవ్వాలి కొమరగిరి భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా సాగు చేస్తున్న వారిని ఉపేక్షించడం అన్యాయం. రెవెన్యూ అధికారులు చొరవ తీసు కుని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఈ భూములు కేటాయించాలి. అర్హులైన వారికి 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని వెంటనే కొమరగిరి భూముల్లో అమలు చేసి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అధికారులు చొరవ తీసుకోకుంటే బినామీ రైతులతో సాగు చేస్తున్న వారికి మద్దతు ఇస్తున్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ స్వాధీనం చేసుకునే వరకూ పోరాటం కొమరగిరి భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే వరకూ పోరాటం ఆపేది లేదు. ఈ భూముల్లో ఇల్లు కట్టుకునేందుకు అర్హులైన 1,400 మంది నిరుపేదల జాబితా రూపొందించి, రెవెన్యూ అధికారులకు అందజేశాం. ఆ జాబితాను పరిశీలించి అర్హులైన వారికి నిబంధనల మేరకు 3 సెంట్ల స్థలం పంపిణీ చేయాలి. – నక్కా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు, వ్యవసాయ కార్మిక సంఘం, కాకినాడ జిల్లా -
వాడపల్లి వెంకన్నకు రూ 1.47 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,47,12,969 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 32 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సోమవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,16,439, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.24,51,230 చొప్పున ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే, బంగారం 13 గ్రాములు, వెండి 1.380 కేజీలు, విదేశీ కరెన్సీ నోట్లు 64 వచ్చాయన్నారు. క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.3,45,300 ఆదాయం వచ్చిందని తెలిపారు. వాడపల్లి వెంకన్న దర్శనానికి స్లాట్ విధానంఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. దీనికోసం తిరుమల తరహాలో వచ్చే నెల 1 నుంచి ప్రతి శనివారం స్లాట్ విధానం అమలు చేయనున్నారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. వీఐపీ సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. చంటి పిల్లలు (తల్లి, రెండేళ్ల లోపు పిల్లలు), దివ్యాంగులకు (కాళ్లు లేకుండా పూర్తిగా నడవలేని వారు, చూపు పూర్తిగా కనపడని వారు, దివ్యాంగులతో పాటు ఒక సహాయకుడు) ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనం పూర్తిగా ఉచితం. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ వీఐపీ దర్శనాలకు అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల తరువాత సిఫారసు లేఖలపై దర్శనాలను అనుమతించరు. -
చంద్రబాబు ఒత్తిడితోనే పిచ్చి ప్రేలాపనలు
రావులపాలెం: జగన్‌ను తిట్టాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒత్తిడి కారణంగా మంత్రులు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం గోపాలపురంలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరి కాదని అన్నారు. వాస్తవాలు మరచిపోయి మంత్రి సుభాష్ జగన్‌పై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగ్గిరెడ్డి ఏమన్నారంటే.. ● విశాఖలోని విలువైన భూములను 99 పైసలకే ఉర్సా కంపెనీకి ధారాదత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం భూమి రూ.5 కోట్లని చెప్పిన చంద్రబాబు ఉర్సాకు 99 పైసలకే కట్టబెట్టడాన్ని బట్టి మతిస్థిమితం ఉందో లేదో అర్థం చేసుకోవచ్చు. ● 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పెన్షన్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. మంచి విమర్శ చేస్తే తీసుకుంటామని మీరన్నారు కదా! ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడి ఎప్పుడిస్తారో చెప్పాలి. ● చంద్రబాబు గతంలో రూ.1,500 కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని వర్షపు నీరు లోపలకు వచ్చేలా కట్టారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అప్పటి సీఎం కేసీఆర్ రూ.613 కోట్లతో శాశ్వత సచివాలయం నిర్మించారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రూ.4,600 కోట్లతో పూర్తి స్థాయి సచివాలయం కడతామని చంద్రబాబు చెబుతున్నారు. ఇలా ప్రజల ధనాన్ని లూటీ చేయడంతో పాటు అప్పల ఊబిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోవడం పిచ్చి పనులు అవునో కాదో చెప్పాలి. ● ప్రజల సొమ్ము రూ.40 కోట్లు ఖర్చు చేసి ఇటీవల దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పెట్టుబడులు ఏం తెచ్చారో చెప్పాలి. ● గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీ, పోర్టులు, ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభించారు. మంత్రి సుభాష్ అన్నట్లుగానే సినిమాటిక్‌గా ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి’ అనే తీరుగా చంద్రబాబు పాలన సాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధీ చేయకుండా జగన్ చేసిన వాటినే మళ్లీ కొత్తగా చెప్పుకుంటున్నారు. ● నియోజకవర్గంలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఇసుక, మట్టి కాకుండా, బ్యాంకర్ల వరకూ చిట్‌ఫండ్స్ వరకూ చేరింది. ఈ సెటిల్మెంట్లు, బి–ట్యాక్స్‌లు వేస్తున్నది ఎవరో చెప్పాలి. ● ఎక్కడ చూసినా కూటమి నాయకుల అవినీతే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు కనిపించడం లేదు. ● బీసీ కార్పొరేషన్ లోన్లు, ఇసుక, మట్టి, గిట్టుబాటు ధరలు, అమరావతి పేరిట నాలుగు లేన్ల రోడ్డుకు కిలోమీటరుకు రూ.62 కోట్లు ఖర్చు.. ఇలా అన్నింటా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. ● వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వడం లేదు. ● రాష్ట్రంలో అన్ని నిత్యావసరాల ధరలు, పన్నులు, మద్యం, కరెంటు చార్జీలు ఇలా అన్నీ పెంచారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వకుండా, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. ● ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ఎక్కడున్నారో తెలియడం లేదు. -
దుర్గామాతలకు ఘనంగా హోమాలు
అన్నవరం: రత్నగిరి దుర్గామాతలుగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి చైత్ర అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం ఘనంగా ప్రత్యంగిర, చండీ హోమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. కాగా, పది రోజులుగా తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి నిర్వహిస్తున్న చైత్ర మాస పూజలు ఆదివారం నిర్వహించిన చండీహోమంతో ముగిశాయి. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పూజలు చేసిన అనంతరం చండీహోమం నిర్వహించారు. సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, చెల్లపిళ్ల ప్రసాద్, కనకదుర్గ ఆలయ అర్చకుడు చిట్టెం హరగోపాల్, పరిచారకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమం అనంతరం పండితులు వేదాశీస్సులు అందజేసి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. కనకదుర్గ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. దేవస్థానం ఏఈఓ కె.కొండలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని: తలుపులమ్మ లోవకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అమ్మవారిని 25 వేల మంది భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారని కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,21,500, పూజా టికెట్ల ద్వారా రూ.73,380, కేశఖండన టికెట్ల ద్వారా రూ.8,940, వాహన పూజలకు రూ.1,730, కాటేజీల ద్వారా రూ.33,060, విరాళాలు రూ.66,458 కలిపి మొత్తం రూ.3,05,068 ఆదాయం సమకూరిందని వివరించారు. గంధామావాస్య సందర్భంగా అమ్మవారిని, ఆలయాన్ని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. అలాగే, మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాయిదాల పద్ధతితో తల్లులకు పంగనామం కాకినాడ రూరల్: సూపర్ సిక్స్ పేరిట ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి పార్టీల నేతలు విఫలమవుతున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆదివారం విమర్శించారు. తల్లికి వందనం పథకం సొమ్మును వాయిదాల పద్ధతిలో ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం తల్లులకు పంగనామం పెట్టినట్టే అవుతుందని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని నెరవేర్చేందుకు ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నూరు శాతం నెరవేర్చారని గుర్తు చేశారు. అమ్మ ఒడి పేరిట పిల్లల చదువులకు భరోసా ఇచ్చారన్నారు. కూటమి పాలకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని నాగమణి అన్నారు. -
నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన సోమవారం నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ నుంచి ఆదేశాలు వచ్చాయి. వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం వృథా కాకుండా, వారిలో పఠనాశక్తిని కలిగించి, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ శిబిరాల నిర్వహణకు జిల్లా గ్రంథాలయ సంస్థ సమాయత్తమైంది. వివిధ అంశాలపై 40 రోజుల పాటు ఈ శిక్షణ ఇస్తారు. తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ అని షెడ్యూల్ ప్రకటించినా, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ మాత్రమే నిర్వహించనున్నారు. పఠనం, సరదా అనే రెండు విభాగాల్లో శిక్షణ ఉంటుంది. పుస్తక పఠనం, కథలు చెప్పించడం, ప్రముఖులతో అవగాహన సదస్సులు, ఆటలపై ఆసక్తి ఉన్నవారికి చెస్, క్యారమ్స్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. అలాగే విజేతల పుస్తకాలతో పాటు కవులు, స్వాతంత్య్ర సమర యోధుల జీవిత విశేషాలు, వివిధ దినపత్రికలు, చిన్నారులకు ఉపయోగపడే పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. నృత్యం, పప్పెట్ల తయారీ వంటి వాటిపై కూడా శిక్షణ ఇవ్వచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సమీప గ్రంథాలయాలను సంప్రదించాలి. వేసవి సెలవుల్లో పిల్లలు గ్రంథాలయాలకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీఎల్‌ఎన్‌ఎస్‌వీ ప్రసాద్ కోరారు. విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి, నిత్యం శిక్షణకు వచ్చేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. స్పోకెన్ ఇంగ్లిష్, చెస్, చిత్రలేఖనం వంటి అంశాల్లో స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ముందుకు రావాలని కోరారు. ఈ శిక్షణకు గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు దాదాపు రూ.12 లక్షలు కేటాయించారని, ఈ ఏడాది నిధుల కేటాయింపుపై ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు. -
● ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలే..
వేసవి ఎండలు మండిపోతున్నాయి.. అందులోనూ సముద్ర తీరానికి కాస్త చేరువలో ఉన్న పిఠాపురం ప్రజలైతే ఓవైపు ఎండ.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో ఆపసోపాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా బాటసారుల ఇబ్బందులు తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం.. అందులో చల్లని నీటిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ, పిఠాపురం మున్సిపల్ అధికారులు చుక్క నీరు లేకుండానే చలివేంద్రాలు నిర్వహిస్తున్నట్టున్నారు. ఈ చిత్రాలు చూస్తే అలాగే అనిపించక మానదు. స్థానిక పాదగయ క్షేత్రం సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రానికి ప్రతి రోజూ వేలాదిగా భక్తులు వస్తూనే ఉంటారు. వారు తమ దాహార్తిని తీర్చుకునేందుకు ఈ చలివేంద్రం వద్దకు వస్తే అక్కడ ఖాళీ వాటర్ క్యాన్లు దర్శనమిస్తూండటంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. మున్సిపల్ అధికారులు మొక్కుబడిగా చలివేంద్రం ఏర్పాటు చేసి, అందులో నీరుందో లేదో కూడా పట్టించుకోకుండా చేతులు దులిపేసుకున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. – పిఠాపురం -
మోటారు సైకిల్‌ను ఢీకొన్న లారీ
ముమ్మిడివరం: మోటారు సైకిల్‌పై వస్తున్న నలుగురు యువకులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయ పడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన ఉందుర్తి బాలు, కరప మండలం గొల్లపాలెంకు చెందిన ఖండవిల్లి రాజా, అయినవిల్లి మండలం శంకరాయగూడెంకు చెందిన నిడుమోలు ఉమామహేశ్వరరావు, టి.కొత్తపల్లికి చెందిన బొమ్మి వినోద్ ఆదివారం యానాం నుంచి ఒకే మోటారు సైకిల్‌పై తిరిగి వస్తుండగా 216 జాతీయ రహదారి అన్నంపల్లి టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉమామహేశ్వరరావును ఇంటి దగ్గర దింపేందుకు వారు వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన వారిలో ఉందుర్తి బాలు పరిస్ధితి ఆందోళన కరంగా ఉంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం -
యువకుడి దారుణ హత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఆదివారం ఓ హత్య జరిగింది. స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఓ వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ సినిమా రోడ్డులో త్రీ టౌన్ పీఎస్ ఎదురుగా ఉన్న వీధిలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్న మీసాల గౌతమ్(25) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించి తల్లిదండ్రులతో ఘర్షణ పడి ఇంటి నుంచి వెళ్లిపోయి, రేచర్లపేటలో గుర్రాల వారి వీధిలో యువతి ఇంట్లో నెల రోజులుగా ఆమెతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం యువతి ఇంటి నుంచి ఆటో నిలిపి ఉంచిన ప్రదేశానికి వెళ్లి స్టార్ట్ చేయబోతుండగా గౌతమ్‌కు తెలిసిన దుర్గాప్రసాద్, నవీన్, ఇమ్రాన్, సన్నీ అనే వ్యక్తులు ఆటో వద్దకు వచ్చారు. వారి మధ్య డబ్బుకు సంబంధించిన వాదన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీయగా నలుగురు యువకులు గౌతమ్‌పై దాడి చేశారు. రాయి, ఇనుపరాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టడంతో గౌతమ్ అక్కడే కుప్పకూలి పోయాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రియురాలు గౌతమ్ సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పగా కుటుంబీకులు వచ్చి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గౌతమ్ మరణించాడు. ఇదిలా ఉంటే కుటుంబీకులు గౌతమ్‌ది ఉద్దేశపూర్వక హత్యేనని ఆరోపిస్తున్నారు. నలుగురు యువకులు గంజాయి, మద్యం సేవించి మత్తులో తూగుతూ ఘాతుకానికి పాల్పడ్డారని గౌతమ్ తల్లి, సోదరి అంటున్నారు. తన బిడ్డను కడతేర్చిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని తండ్రి కోరుతున్నారు. ఈ ఘటనపై కాకినాడ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులు పరారీలో ఉన్నారని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయని అన్నారు. రాయి, ఇనుపరాడ్డుతో విచక్షణా రహితంగా దాడి నిందితులు నలుగురూ పరారు -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అమలాపురం టౌన్: గడియ వేసి ఉన్న ఇళ్ల తలుపుల బోల్ట్లను తీయడంలో, ఐరన్ రాడ్లతో తలుపుల గెడలు తీయడంలో ఈ ముగ్గురు దొంగలు సిద్ధహస్తులు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీ ముగించుకుని అక్కడ నుంచి జారుకుంటారు. తాము చోరీ చేయాల్సిన ఇంటి ప్రాంతంలో పగలు రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి తాపీగా కారులో వచ్చి చోరీలకు పాల్పడుతుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 32 చోరీలు చేసిన అంతర్రాష్ట్ర దొంగలు ముఠా ఇది. అమలాపురం పట్టణంలో 2023, 2024, 2025 సంవత్సరాల్లో చోరీలు చేసిన ఆ ముగ్గురి దొంగలను పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీల చిట్టాను వివరించారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జంగా వెంకట్రావు, అదే జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన దమ్ము సుధాకర్, గుంటూరు అర్బన్ జిల్లా శ్రీరామ్‌నగర్‌కు చెందిన కాట్ల కిషోర్‌బాబు అంతర్రాష్ట దొంగలు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తాము దొంగిలించిన సొత్తును నగుదుగా మార్చుతున్న సమయంలో అమలాపురం పట్టణ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబుతో కలసి ఎస్పీ కృషారావు ఈ చోరీల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో 17 చోరీలు తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ, నల్గొండ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 చోరీలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 15 చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 32 చోరీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. అమలాపురం పట్టణం గాంధీనగర్‌లో 2023 ఏప్రిల్‌లో మొదటి చోరీ, కురసాలవారివీధిలో 2024 ఆగస్టులో రెండో చోరీ, ఈ సంవత్సరం జనవరిలో మూడో చోరీ చేశారు. ఈ మూడు చోరీలకు సంబంధించి రూ.40 లక్షల సొత్తును రికవరీ చేశారు. నరసరావుపేటలో క్రికెట్ ఆటలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. కేసును ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులు ఈ మూడు చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు, క్రైమ్ పార్టీ సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు. వారికి నగదు రివార్డులు అందజేశారు. పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, పట్టణ ఎస్ ఎన్ఆర్ కిషోర్‌బాబు, క్రైమ్ ఎస్సై రాంబాబు, ఏఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎంఎస్ రాజు, రమణ, కాని సాయి, శుభాకర్, ప్రసాద్, శ్రీనివాస్, అర్జున్, హరి, చిన్న ప్రసాద్‌లకు ఎప్పీ కృష్ణారావు నగదు రివార్డులు అందజేసి అభినందించారు. రూ.40 లక్షల సొత్తు రికవరీ ఎస్పీ కృష్ణారావు వెల్లడి -
మాతృత్వానికి మరో మెట్టు!
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో తల్లిపాలు పొందలేని శిశువులకు పాలందిస్తూ ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ విశేష ఆదరణ పొందింది. వందలాది శిశువుల తల్లిపాల ఆకలిని తీరుస్తూ పసిమొగ్గల పాలిట మరో అమ్మగా అవతరించింది. కాకినాడ జీజీహెచ్, సుషేణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధాత్రి మిల్క్ బ్యాంక్ 2023 ఫిబ్రవరిలో వెలసింది. నాటి నుంచి తల్లిపాల సంబంధిత సేవల్లో తరిస్తూ తల్లికి దిగులు లేకుండా, బిడ్డ పోషణకు లోటు రాకుండా ఎనలేని సేవలందిస్తోంది. తల్లిపాలకు తల్లితో పనిలేదు శిశువు తల్లిపాలు తాగేందుకు తల్లితోనే పనిలేదు. మరో తల్లి దానం చేసిన పాలను శాసీ్త్రయ విధానంలో శుద్ధి చేసి, భద్ర పరిచి తల్లిపాలకు నోచుకోని పిల్లలకు అందిస్తారు. ఈ మదర్ మిల్క్ బ్యాంక్ ఎందరో పసిమొగ్గల జీవితాలను పౌష్టికం చేస్తోంది. ఫార్ములా ఫీడ్‌తో డబ్బా పాలకు స్వస్తి చెప్పడంతో పాటు భావితరాలలో పోషకాహార లోటును రూపుమాపడమే మిల్క్ బ్యాంక్ సేవల లక్ష్యం. ఏడాదిలో 102 మంది పిల్లలకు గడచిన ఏడాది కాలంలో జీజీహెచ్ మిల్క్ బ్యాంక్ ద్వారా 102 మంది శిశువులకు తల్లిపాలు అందించారు. తల్లి, తల్లి తరఫున కుటుంబ సభ్యులు లేదా వైద్య సిబ్బంది ఎవరు శిశువును మిల్క్ బ్యాంక్‌కు తీసుకువచ్చినా పాలు పడతారు. ఇంటి దగ్గర ఫీడ్ కోసం తల్లిపాలు అందిస్తారు. శిశువులకు పాల లోటెందుకు... పండంటి శిశువును ప్రసవించడం, ఆ శిశువుకి చనుబాలు అందిస్తూ తల్లిగా పునర్జన్మించడం ప్రతి సీ్త్రకి ఓ వరం. అయితే, అమ్మగా మారిన ప్రతి మహిళకు అది సాధ్యం కాదు. అందుకు వివిధ కారణాలు దోహదపడతాయి. తల్లి అనారోగ్యానికి గురి కావడం, పోషకాహార లోపంతో బాధపడుతుండడం, హార్మోన్ల అసమతుల్యత, సిజేరియన్ డెలివరీ, తల్లిలో ఒత్తిడి, ఆందోళన, ఛాతి సంబంధిత శస్త్రచికిత్సల కారణంగా పాలు ఉత్పత్తి కాకపోవచ్చు లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వొచ్చు. జీజీహెచ్‌లో కొనసాగుతున్న మదర్ మిల్క్ బ్యాంక్ సేవలు ఫార్ములా ఫీడ్‌కు స్వస్తి చెప్పేలా పసిపిల్లలకు తల్లి పాలు తల్లి నుంచి పాలు పొందలేని శిశువులకు వరం ఏడాది కాలంలో 102 మంది పిల్లలకు తల్లిపాల ప్రయోజనాలు ఏడాది కాలంలో... పాలు పొందిన శిశువులు – 102 మదర్ బ్యాంక్ ప్రయోజనాలు అందుకున్న తల్లులు – 1,457 మిల్క్ బ్యాంక్ ద్వారా తమ పాలను తామే శాసీ్త్రయ పద్ధతిలో చనుబాల నుంచి పొందినది 5,60,971 మిల్లీ లీటర్లు మిల్క్ బ్యాంక్ ద్వారా సేకరించిన పాలు 55,765 మిల్లీ లీటర్లు శిశువులకు అందించిన పాల మొత్తం 37,175 మిల్లీ లీటర్లు తల్లులు సందర్శన 9,284 శిశువుల సందర్శన 621 -
విశిష్టమైనది సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం
అంబాజీపేట: లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ 60 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వ పృష్ఠ ఆప్‌తో ర్యామ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర యాజులు చెప్పారు. తొండవరంలో వైనతేయ నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా తొండేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ సమీపంలో ఆదివారం సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం ప్రారంభమైంది. యాగకర్తలుగా దువ్వూరి వెంకట సూర్యప్రకాశ యజ్వ, కనకదుర్గ సోమపీధిని దంపతులు వ్యవహరిస్తున్నారు. యాగ విశిష్టతను ప్రాజెక్ట్ అధికారి యాజులు మాట్లాడుతూ అగ్నిదేవుని ద్వారా సమస్త దేవతలకు హవిస్సు భాగం అందించేందుకు సర్వ పుష్ఠ ఆప్తోర్యామ యాగం ఉపయోగపడు పడుతుందన్నారు. యాగంలో (మహాగ్నిచయనం) భాగంగా ప్రత్యేక ఆకారాలు కలిగిన వేయి ఇష్టకాలను (ఇటుకలను) ప్రత్యేక మంత్రాలతో అమర్చుతామని, ఇలా పేర్చిన ఇటుకలన్నీ గరుడ పక్షి ఆకారాన్ని సంతరించుకుంటాయని యాజులు వివరించారు. ఈ యాగంలో సమస్త దేవతలను ఆహ్వానించి వివిధ హోమద్రవ్యాలతో వారికి హవిస్సు భాగాన్ని అందిస్తామన్నారు. ఇలాంటి యాగం తన తాత అయిన దువ్వూరి యజ్ఞేశ్వర ఫౌండరీక యాజులు 60 ఏళ్ల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో నిర్వహించారని, ఇన్నాళ్లకు తన తండ్రి అయిన సూర్య ప్రకాశ సోమయాజులు నిర్వహించడం ఎంతో అరుదైన విషయమన్నారు. ఈ యాగంలో నమక చమకాలతో హోమం చేసి, పురుష సూక్తాలతో పరమాత్మను ధ్యానం చేస్తామన్నారు. ఈ క్రతువులో శతరుద్రీయహోమం (నమక ప్రశ్న) వల్ల ఘోర తనుశాంతి, వసోర్ధారా హోమం (చమక ప్రశ్న) వల్ల శాంతమైన తనువుకు ప్రీతి కలుగుతుందని యాజులు వివరించారు. అమావాస్య నాడు యాగ ప్రారంభం ఎంతో శక్తివంతం ఎంతో విశేషమైన సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగాన్ని చైత్ర బహుళ అమావాస్య రోజున ప్రారంభించడం వల్ల ఎంతో శక్తివంతంగా మారుతుందని, కోరికలన్నీ ఈడేరుతాయని యాజులు వివరించారు. సమస్త మానవాళి సుఖశాంతులతో ఉంటారని, వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని, ముఖ్యంగా తమిళనాడులో ఏ పనైనా అమావాస్య నాడే ప్రారంభించి విజయవంతంగా ముగిస్తారన్నారు. సమస్త దేవతలకు కూడా హవిస్సు కేటాయిస్తారన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ యాగంలో వివిధ కార్యక్రమాలు, క్రతువులు ఉంటాయన్నారు.టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్ అధికారి యజ్ఞేశ్వర యాజులు -
ఆరు నెలలు తాగితే జీవితకాలపు భరోసా
తల్లి పాలు బిడ్డకు ఆరు నెలలు పట్టిస్తే యావత్ జీవిత కాలం రోగనిరోధక శక్తి లభిస్తుంది. మరే ఆహారం వల్లా ఇంతటి ప్రయోజనం సాధ్యం కాదు. అధికంగా పాలు ఉత్పత్తి అయ్యే తల్లుల పాలు వృథా కాకుండా సేకరించడం, పాలు అందుకోలేకపోతున్న శిశువులకు అందించడమే మిల్క్ బ్యాంక్ విధి. తల్లిపాలందించి పసివాళ్లలో పోషకాహార లోపాన్ని రూపుమాపడమే లక్ష్యం. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ మాణిక్యాంబ సహకారంతో సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శిశువులకు పాలు కావాలనుకునే వారు, చనుబాలు దానం చేయాలనుకునే తల్లులు జీజీహెచ్‌లోని ఽమిల్క్ బ్యాంక్ ప్రతినిధులను సంప్రదించవచ్చు. – డాక్టర్ ఆమంచర్ల హర్షవర్దన్, ఽ దాత్రి మిల్క్ బ్యాంక్ కాకినాడ ఇన్చార్జి జీజీహెచ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో నిర్వహిస్తున్న మిల్క్ బ్యాంక్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ మాణిక్యాంబ ఈ సేవలను పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ హర్షవర్దన్, మేనేజర్ మాధవ్ సంస్థ తరఫున ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తూ తల్లులు, శిశువులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అధునాతన పరికరాలతో శాసీ్త్రయ విధానాలను అనుసరిస్తూ పాలు శుద్ధి చేసి భద్రపరచడంలో నాణ్యతను కొనసాగిస్తున్నారు. – డాక్టర్ ఎంపీఆర్.విఠల్, ఇన్చార్జి సూపరింటెండెంట్, జీజీహెచ్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్లజర్ల: మండలంలోని పుల్లలపాడు వద్ద బైపాస్ రోడ్డుపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. దేవరపల్లి గ్రామానికి చెందిన దాసుదుర్గాప్రసాద్, బిరదాఅంజి, జాజుమొగ్గలసాయిచరణ్తేజ కలసి కాలినడకన ద్వారకాతిరుమల శనివారం సాయంత్రం వెళ్తుండగా మార్గమధ్యలో పుల్లలపాడు వద్ద రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బిరదా అంజి మృతిచెందగా, దుర్గాప్రసాద్, సాయిచరణ్ చికిత్స పొందుతున్నారు. మృతుడు అంజి మోటారు సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
తిరుమలలో అవగాహన సదస్సుకు మంచి స్పందన
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సదస్సుకు సుమారు 15వేలమంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలంటే స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను వారికి అందించాలి. అప్పుడే వారు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలుగుతారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి దూరంగా ఉంచాలని అన్నారు. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ అవసరంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. ప్రతి తల్లి తమ పిల్లలకు విలువలతో కూడిన విద్యను వారికి అందించే ప్రయత్నం చేయాలని తెలిపారు. తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు పెండ్యాల బుచ్చిబాబు, ఏఎన్వీ సత్యనారాయణ(నాని మాస్టారు) పాల్గొన్నారు. -
కూటి కోసం పోరాటం..
పిఠాపురం: ఎవరెన్ని పాట్లు పడినా పిల్లల కోసమే. ఈ తల్లి తన పిల్లల ఆకలి తీర్చేందుకు అలుపెరగక కోడి పిల్లల విక్రయానికి ప్రయాస పడుతోంది. అసలే ఎండా కాలం. నడినెత్తిన సూరీడు. మాడు మాడిపోయేలా ప్రకాశిస్తున్నాడు. ఓ చెట్టు నీడ కనపడేసరికి ఇలా నడుం వాల్చి కాస్త ఉపశమించింది. ఈ కోడి పిల్లల అమ్మకం అయ్యేదెపుడో.. తన పిల్లలకి ఆకలి తీర్చేదెపుడో.. కూటి కోసం కష్టపడుతున్న ఈ వృద్ధురాలు శనివారం స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల వద్ద మెయిన్ రోడ్డు పక్కన సేద తీరుతున్న దృశ్యమిది. -
రూ.20 వేల విలువైన మద్యం స్వాధీనం
కొత్తపేట: మద్యం అక్రమంగా విక్రయిస్తున్న ఇంటిపై దాడి చేసి రూ.20 వేలు విలువైన 110 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. కొత్తపేట మండలం వానపల్లి శివారు రామమోహనరావుపేటలో కుంచే రమేష్ అనే వ్యక్తి మద్యాన్ని అక్రమంగా తెచ్చి విక్రయిస్తున్నట్టు అందుకున్న సమాచారంతో ఎస్సై జి.సురేంద్ర సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. దీంతో రమేష్ సమీప పంట పొలా ల నుంచి పరారయ్యాడు. అనంతరం అక్కడి నుంచి రూ.20 వేలు విలువైన 110 మద్యం సీసాలతో పాటు, అప్పటికే విక్రయించిన మద్యం నగదు రూ 6,270, రమేష్ పరారవుతూ చేజార్చుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం అమలాపురం రూరల్: మండలం నడిపూడి కాలువలో శుక్రవారం గల్లంతైన సరెళ్ల సురేష్ మృతదేహం శనివారం కాలువలో లభ్యమైయింది. నడిపూడి శ్రీరామ్ నగర్‌కు చెందిన సురేష్ శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ప్రధాన పంట కాలువలో కాలుజారి పడ్డాడు. అతని కోసం స్థానికులు, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సర్పంచ్ చెల్లుబోయిన వెంకటేశ్వరరావు చొరవతో ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి కాలువలోని నీటి ప్రవాహాన్ని తగ్గించి సురేష్ కోసం గాలించారు. అయినా రాత్రివరకు మృతదేహం లభ్యం కాలేదు. శనివారం నీటి ప్రవాహాన్ని పెంచడంతో సురేష్ మృతదేహం నడిపూడి లాకుల వద్దకు కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన తాలూకా పోలీసులు కాలువ నుండి బయటకు తీశారు. సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు తాలూకా ఎస్సై శేఖర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
సత్యదేవుని కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు
● ఏడు రోజుల పాటు నిర్వహణ ● అంగరంగ వైభవంగా జరిగేలా చర్యలు అన్నవరం: రత్నగిరి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చేనెల ఏడో తేదీ వైశాఖ శుద్ధ దశమి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలలో ఎనిమిదో తేదీ ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకు దివ్య కల్యాణం జరగనుంది. రోజుకొక కార్యక్రమం చొప్పున ఏడు రోజుల పాటు 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈఓ, దేవస్థానం సిబ్బంది మధ్య అంతరం పెరిగినప్పటికీ ఉత్సవ ఏర్పాట్లలో అంతా బిజీగా ఉన్నారు. శుభలేఖలు పంపిణీ ప్రారంభం సత్యదేవుని కల్యాణ మహోత్సవాల శుభలేఖలను వీఐపీలు, ప్రజాప్రతినిధులకు అందచేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు శుభలేఖ అందచేసి ఆహ్వానించారు. ఇంకా జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు అందజేయాల్సి ఉంది. రథం మరమ్మతులు పూర్తి కల్యాణ మహోత్సవాలలో భాగంగా మే 11న సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న రథోత్సవానికి కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ మాణిక్యాంబ శిల్పకళ ఉడ్ వర్క్స్‌కు చెందిన కొల్లాటి శ్రీనివాస్ బృందం మరమ్మతులు పూర్తి చేశారు. ఉత్సవానికి దగ్గర చేసి ట్రయల్‌రన్ నిర్వహిస్తామని డీఈఈ ఉదయ్ కుమార్ తెలిపారు. ధ్వజ స్తంభానికి అలంకరణ దాత ఆర్థిక సహకారంతో గత ఏడాది బంగారు పూత వేయించిన ధ్వజ స్తంభానికి కుండలాలు కనిపించేలా ఆలయానికి సమాంతరంగా శ్లాబ్‌కు రంధ్రం చేసి అద్దాన్ని అమర్చి మిగిలిన పనులను శనివారం పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాల మొదటి రోజు ధ్వజారోహణం చేసి కార్యక్రమాలు ప్రారంభించి, ఆరో రోజు ధ్వజావరోహణ చేస్తారు. విద్యుదలంకరణలు ప్రారంభం సత్యదేవుని ఉత్సవాల సందర్భంగా విద్యుత్ అలంకరణలు చురుగ్గా సాగుతున్నాయి. స్వామివారి ఆలయం, రాజగోపురాలు, ఆలయ ప్రాంగణం, సత్రాలు, రామాలయం, తొలిపావంచా మెట్లుదారి తదితర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణ చేస్తున్నట్టు ఎలక్ట్రికల్ డీఈ వీ సత్యనారాయణ తెలిపారు. -
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్
● 9 మంది ఉపాధి కూలీలకు గాయాలు ● మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరానికి నలుగురి తరలింపు కొత్తపేట: ఉపాధి పనికి వెళుతున్న మహిళా కూలీల ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏపీఓ ఎన్.ఆనంద్ తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని అవిడి చప్పిడివారిపాలేనికి చెందిన 9 మంది మహిళా కూలీలు ఆ పంచాయతీ పరిధిలోని గోరింకల డ్రైన్ అభివృద్ధి పనికి శనివారం ఉదయం ఆటోలో బయలుదేరారు. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఆ ఆటోను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న కుడుపూడి నాగమణి, గుబ్బల నాగలక్ష్మి, చప్పిడి గౌరీలక్ష్మి, పితాని సత్యవతి, మట్టపర్తి నాగలక్ష్మి, ఇళ్ల వెంకటలక్ష్మి, గుబ్బల లక్ష్మి, జక్కంశెట్టి పెంటమ్మ, చోడి గన్నెమ్మ గాయపడ్డారు. వారిని స్థానికులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని ఏపీఓ ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించగా డ్వామా ఏపీడీ మల్లికార్జునరావు హుటాహుటిన కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుడుపూడి నాగమణి, గుబ్బల నాగలక్ష్మి, చప్పిడి గౌరీలక్ష్మి, పితాని సత్యవతికి తీవ్ర గాయాలు కాగా ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ పి. శ్రీకర్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లి నలుగురు క్షతగాత్రులను పరామర్శించారు. -
భక్తవత్సలా.. గోవిందా..
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో మురిసిపోయింది. ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆధిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యాన అర్చకులు, వేద పండితులు స్వామివారికి సుప్రభాత సేవ తదితర సేవలు నిర్వహించారు. స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోములో భాగంగా మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశాక, కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలి వచ్చి, మొక్కులు చెల్లించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం అదనపు ఏర్పాట్లలో భాగంగా మరో ఫ్లై ఓవర్ నిర్మించారు. వేంకటేశ్వరస్వామి దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యక్రధరరావు భక్తుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. స్వయంగా క్యూలైన్లో కలిసిపోయి, వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో పాటే స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి దేవస్థానానికి స్వామి వారి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ ద్వారా రూ.49,60,411 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ● వాడపల్లికి భక్తజన శోభ ● స్వామివారిని వేలాదిగా దర్శించుకున్న భక్తులు ● రూ.49.60 లక్షల ఆదాయం -
ప్రభుత్వం హామీలు అమలు చేయాలి
అమలాపురం టౌన్: మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయా లని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు, సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో పోరాడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం సాయంత్రం జరిగిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూని యన్ అనుబంధ సంఘం ఏఐటీయూసీ జిల్లా శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత కశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాల కోసం వచ్చే నెల ఐదున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు సుబ్బారాయుడు ప్రకటించారు. ప్రతి మున్సిపాలిటీ వద్ద పారిశుధ్య కార్మికులు నిరసనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరూతూ మేడే రోజున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్, జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు మాట్లాడుతూ మేడేను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల శ్రీనివాసరావు 16 డిమాండ్లతో కూడిన అంశాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ డిమాండ్లపై సమావేశం చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను నెరవేర్చాలని తీర్మానం చేసింది. కార్మిక నాయకులు బుంగా కుమార్, రాయుడు సుబ్బలక్ష్మి ప్రసంగించారు. సమావేశం ముగిశాక స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మే 5న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టబోయే ఆందోళనలు జయప్రదం చేయాలని కోరుతూ నాయకులు కొద్ది సేపు ప్రదర్శన నిర్వహించారు. ● ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు -
గణేష్ శర్మకు కంచిలో ఘన స్వాగతం
అన్నవరం: కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఎంపికై న అన్నవరానికి చెందిన యువ పండితుడు దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ శనివారం తమిళనాడు కాంచీపురంలోని కంచి కామకోటి పీఠానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు మంగాదేవి, ధన్వంతరి, ఇతర బంధువులతో కలిసి వచ్చిన గణేష్ శర్మకు పెద్ద సంఖ్యలో పండితులు, పీఠం సిబ్బంది మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పెరియస్వామి అంటూ ఆ ప్రాంతం నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా పీఠంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారని సిబ్బంది తెలిపారు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఈ నెల 30వ తేదీన గణేష్ శర్మకు కంచి కామకోటి పీఠాథిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. అనంతరం, తన శిష్యునిగా స్వీకరిస్తారు. తరువాత పీఠం సంప్రదాయం ప్రకారం గణేష్ శర్మ ఉత్తరాధికారిగా నియమితులవుతారు. భవిష్యత్తులో 71వ పీఠాధిపతిగా నియమితులవుతారు. ఆయన బంధువులు మరికొందరు ఈ నెల 30న జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
ఎండగండం నుంచి.. కొండంత ఉపశమనం
సాక్షి, అమలాపురం: రోహిణీ కార్తె ఇంకా రానేలేదు.. అప్పుడే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. నడినెత్తిన చండమార్తాండుడు నిప్పులు కురిపిస్తూండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇలా మండుతున్న ఎండల నుంచి తక్షణ ఉపశమనాన్నిచ్చే దివ్యౌషధం కొబ్బరి బొండం. బొండాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లతో చేసే జ్యూస్‌ల విక్రయాలతో చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. పోషకాల గని ● కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి బొండం సైలెన్తో సమానం. ఒక బొండంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ● మూత్ర సంబంధిత జబ్బులు, కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇది చక్కగా పని చేస్తుంది. ● కొబ్బరి నీళ్లు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. దీనిని బెస్ట్ ఎనర్జీ డ్రింక్‌గా ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు. ● బొండంలో ఉండే కొబ్బరి గుజ్జు గుండె జబ్బులు రానివ్వకుండా చేస్తుంది. వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, చికెన్‌పాక్స్ వంటివి తగ్గడానికి దోహదపడుతుంది. ● లేత కొబ్బరిలో విటమిన్–ఎ, బి, సి సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, రెబోఫ్లెవిన్, నియాసిన్, థయామిన్ అధికంగా ఉంటాయి. అక్కడి బొండాలకు డిమాండ్ ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఏడాదికి 105 కోట్ల కొబ్బరి కాయలు వస్తాయని అంచనా. కొబ్బరి కాయల్లో 15 శాతం మాత్రమే బొండాలుగా రైతులు విక్రయిస్తున్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, చాగల్లు, పెరవలి, గోపాలపురం, కాకినాడ జిల్లాలో తుని, ఏలేశ్వరం, కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం వంటి మండలాల్లో మాత్రమే కొబ్బరి బొండం సేకరణ అధికంగా ఉంటుంది. ● ఎండలు పెరగడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు జోరందుకున్నాయి. మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోని ముఖ్య నగరాలు, పట్టణాలకు బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రోజుకు 60 లారీలకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరిగితే రోజుకు 100 లారీల వరకూ బొండాల ఎగుమతి జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ● మార్చి మొదటి వారంలో బొండం రైతువారీ ధర రూ.12 ఉండగా ఇప్పుడది రూ.18కి పెరిగింది. ఎండలు పెరిగితే ఈ ధర రూ.20 వరకూ చేరుతుందని రైతులు ఆశపడుతున్నారు. ● కొబ్బరి కాయతో పోల్చుకుంటే బొండం అమ్మకాలే లాభసాటిగా ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. బొండం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే పక్వానికి వచ్చే కొబ్బరి కాయకు పట్టే సమయం 12 నెలలు. అందువలన బొండాల ఉత్పత్తిని రైతులు త్వరగా అందుకుంటూ, నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నారు. ● కొబ్బరి కాయలైతే రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రూ.2 వరకూ అవుతోంది. అదే బొండాలను వ్యాపారులు సొంత ఖర్చులు పెట్టుకుని తీసుకుంటారు. దీనివలన రైతులకు ఆ పెట్టుబడి బాధ తప్పుతోంది. షర్బత్‌ల నుంచి జ్యూస్‌ల వరకూ.. ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా బొండాలు విక్రయిస్తూ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. బొండాలతో పాటు కొబ్బరి నీళ్లతో షర్బత్, నాటాడీకో వంటి కోకోనట్ జల్లీలతో పాటు కొబ్బరి నీళ్లు, గుజ్జుతో జ్యూస్‌లు కూడా తయారు చేస్తున్నారు. వాస్తవానికి కొబ్బరి జ్యూస్ తయారీ మొదలైంది రాజమహేంద్రవరంలోనే కావడం విశేషం. ఇప్పుడు ఈ వ్యాపారం అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. కోకోనట్ జ్యూస్‌లలో సైతం స్ట్రాబెర్రీ, మ్యాంగో, డ్రాగన్, బనానా, కివీ, వాటర్ మిలన్, ఆపిల్ వంటి ఫ్లేవర్లతో ఆకట్టుకుంటున్నారు. ఆరోగ్యానికి ఔషధం కేవలం దప్పిక తీరడమే కాదు.. కొబ్బరి బొండం ఆరోగ్యానికి ఔషధం. వేసవిలో ఉపశమనం కోసమే కాదు.. ఏడాది పొడవునా ఆరోగ్యం కోసం కొబ్బరి బొండం తాగడం మంచిదే. దీనిలోని ఎలక్ట్రోలైట్లు, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు తక్షణ శక్తినిస్తాయి. ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. – డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అంబాజీపేట కొబ్బరి బొండం.. దివ్యౌషధం వేసవి ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న డిమాండ్ ఉమ్మడి ‘తూర్పు’న 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు భారీగా ఎగుమతులు చాగల్లు, ఏలేశ్వరం, కొత్తపేట బొండాలకు అధిక డిమాండ్ -
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● 1,500 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయంఅన్నవరం: పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆలయానికి వచ్చి, వ్రతాలాచరించి, సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. మొత్తం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. దుర్గామాతలకు నేడు హోమాలు చైత్ర మాస అమావాస్యను పురస్కరించుకుని రత్నగిరి వనదుర్గ అమ్మవారికి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. అలాగే, రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గమ్మ వారి ఆలయంలో చైత్ర మాస పూజల ముగింపు సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహించనున్నారు. -
శృంగార వల్లభుని సన్నిధికి భక్తుల తాకిడి
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తుల తాడికి పెరిగింది. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామివారికి రూ.3,23,118 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. నాలుగు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నలుగురికి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పించారు. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా కోరుమిల్లి లలిత, రాష్ట్ర ప్రచారం విభాగం ఉపాధ్యక్షుడిగా రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా లాలం అచ్యుత ఆనంద్ (బాబ్జీ), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రటరీగా దాడిశెట్టి నూకపతిరావు నియమితులయ్యారు. మత్స్యకారులకు భృతి పంపిణీకాకినాడ సిటీ: మత్స్యకార సేవ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 24,769 మంది అర్హుల ఖాతాలకు రూ.20 వేల చొప్పున రూ.49.54 కోట్ల మేర సముద్ర వేట నిషేధ కాల భృతి జమ చేశామని ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎంపీ సానా సతీష్‌బాబు, జిల్లా మత్స్యశాఖాధికారి వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
న్యాయం చేయాలంటూ ఆందోళన కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణం కేపీ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్వర్ణకారుడు మాదాబత్తుల సత్తిబాబు (40) కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం కుటుంబ సభ్యులు, సహచర స్వర్ణకార వృత్తిదారులు ఆందోళన చేశారు. మండపేట టిడ్కో గృహ సముదాయం వద్ద నివాసం ఉంటున్న సత్తిబాబు పట్టణంలోని రథం సెంటర్లోని స్వర్ణకార దుకాణంలో వెండి పట్టీల తయారీ పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొట్టింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సత్తిబాబు మృతి చెందాడు. కాగా సత్తిబాబు కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్వర్ణకారులు, వెండి పనివార్లు కలువ పువ్వు సెంటర్లో మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బంగారు వర్తకుల సంఘం అధ్యక్షుడు సంకా శ్రీనివాస్ రంగా, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు వెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్, కామాక్షి వెండి పనివార్ల సంఘం అధ్యక్షుడు అడపా వాసు, వైఎస్సార్ సీపీ నాయకులు కొమ్ము రాంబాబు, పతివాడ రమణ మాట్లాడుతూ మృతికి కారకుడైన వారిపై చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సంఘీభావం తెలిపారు. ఆందోళనకారులతో పట్టణ సీఐ సురేష్ మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
మాకు మా నాన్నే కావాలి!
ఫ అమ్మ చెంతకు వెళ్లం ఫ లేకుంటే చంపేయండి ఫ ఇద్దరు చిన్నారుల వేదన రాజానగరం: ‘మా అమ్మ వద్దకు వెళ్లం, మమ్మల్ని మా నాన్నకు అప్పగించండి.. లేదంటే చంపేయండి. అమ్మకు అప్పగిస్తే చంపేస్తుంది’ అంటూ రోదిస్తూ ఇద్దరు చిన్నారులు అంటున్న మాటలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి వివాహేతర సంబంధంతో భర్తను వదిలేసి, ప్రియుడితో ఉంటోంది. ఆ ప్రియుడు ఆమె పిల్లలతో చాకిరీ చేయించుకుంటూ, ఇష్టానుసారం కొడుతున్నా ఆ తల్లి హృదయం చలించడం లేదు. కనీసం ఆ తల్లిని కన్న తల్లి కూడా చోద్యం చూస్తూ కూతురి వివాహేతర సంబంధాన్ని వెనకేసుకొస్తున్న నేపథ్యంలో ఆ చిన్నారులు విసిగిపోయారు. పై విధంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొంతమూరులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. కొంతమూరు చెంచు కాలనీలో ఉంటున్న అన్నెపు ధనలక్ష్మి, జయరామ్ దంపతులకు ఇద్దరు సంతానం. ప్రస్తుతం వీరిద్దరూ రాజమహేంద్రవరం ఆర్యాపురంలోని ఒక స్కూల్లో 4, 2 తరగతులు చదువుతున్నారు. పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న జయరామ్‌కు భార్య, పిల్లలంటే అమితమైన ప్రేమాభిమానాలున్నాయి. ధనలక్ష్మి ఒక కర్రీ పాయింట్లో పని చేస్తూండగా మందపల్లి ప్రవీణ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. క్రమేపీ అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త, పిల్లలను పట్టించుకునేది కాదు. ఆమె ప్రవర్తనను సరి చేయాల్సిన తల్లి తులసమ్మ కూతురుకు వంత పాడి, అల్లుడు జయరామ్‌ను బయటకు పంపించేందుకు సాయపడింది. సుమారు ఏడాది నుంచి ప్రియుడితో కలసి ఉంటున్న ధనలక్ష్మి ఎదుటనే ఆ ఇద్దరు పిల్లలతో ఆమె ప్రియుడు సేవలు చేయించుకునేవాడు. చెప్పినట్టు చేయకపోతే కొట్టేవాడు. ఈ క్రమంలో జనవరి 25న బెల్డుతో ఇష్టానుసారం కొట్టడంతో చుట్టుపక్కల వారి ద్వారా విషయం తెలుసుకుని మేనమామ పాలవలస బాలమణికంఠ అక్కడకు వెళ్లి, ఆ ఇద్దరు పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లాడు. ముందుగా రాజానగరం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. అప్పటి నుంచీ వారిని తన ఇద్దరు పిల్లలతో సమానంగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ ధనలక్ష్మి పిల్లల గురించి పట్టించుకోకపోగా, వారి సంరక్షణ పేరుతో భర్త నుంచి నెలనెలా రూ.10 వేలు వసూలు చేస్తోంది. పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా వినియోగించకపోవడంతో స్కూలు ఫీజులు రూ.38 వేల వరకూ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పిల్లల మేనమామ మణికంఠ శుక్రవారం రాజానగరం పోలీసులను మరోసారి ఆశ్రయించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలు తమ తండ్రి వద్దకు వెళ్లిపోతామంటున్నారని ఈ సందర్భంగా మణికంఠ చెప్పాడు. అందుకు తమ బావ కూడా సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అధికారికంగా జరగాలని కోరుతున్నాడని అన్నాడు. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ సమక్షంలో వారిని తండ్రికి అప్పగిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందన్నాడు. ఇద్దరు చిన్నారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో నిర్ణయం తీసుకుంటాం తండ్రి శ్రీకాకుళంలో ఉంటున్నాడు. అతనికి కబురు చేశాం. రెండు రోజులలో వస్తాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో తల్లిదండ్రులిద్దరినీ పెట్టి, పిల్లల వయస్సును బట్టి వారు ఎవరి వద్ద ఉండాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకుంటాం. లేకుంటే హోమ్‌కు అప్పగిస్తాం. – నారాయణమ్మ, ఎస్సై, రాజానగరం -
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
● ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ● ఘనంగా యూనియన్ నూతన జెండా ఆవిష్కరణ, చిహ్నం టవర్ ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్: విద్యుత్‌శాఖలో పెండింగ్‌లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో కూడిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సానా కృష్ణయ్య, ఎంవీ గోపాలరావు డిమాండ్ చేశారు. శుక్రవారం బొమ్మూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (రి.నెం.1104) 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఓఅండ్ ఎం ఏపీ ట్రాన్స్‌కో రాజమహేంద్రవరం ప్రాంతీయశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సానా కృష్ణయ్య నూతనజెండాను ఆవిష్కరించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.గోపాలరావు యూనియన్ చిహ్నం టవర్‌ను ప్రారంభించారు. కృష్ణయ్య, గోపాలరావు మాట్లాడుతూ పార్టీలు, కులాలకు అతీతంగా కార్మికులతో నడుస్తున్న ఏకై క యూనియన్ ఏపిఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 మాత్రమేనన్నారు. 75 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం యూనియన్ చేసిన పోరాటాలను వారు గుర్తు చేసుకున్నారు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే చెల్లించాలని, 24గంటలపాటు విధినిర్వహణలో ఉండే ఉద్యోగులకు నగదు రహిత మెడికల్ పాలసీ అమలుచేయాలని, కాంట్రాక్టు కార్మికులకు సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి, డైరెక్టుగా జీతాలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన 7,200 మంది ఎనర్జీ అసిస్టెంట్స్‌ను ఎలక్ట్రిసిటీ బోర్డు జేఎల్‌ఎంలుగా విలీనం చేయాలన్నారు. తమ డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వం అమలు చేయకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని కృష్ణయ్య,గోపాలరావు అన్నారు. రాష్ట్ర కార్యనిర్మాహక అధ్యక్షుడు ఎం.జగదీశ్వర్, ప్రాంతీయ మాజీ అధ్యక్షుడు కె. శ్రీనివాసులు, యం.డి. అబ్దుల్ గఫూర్, ప్రాంతీయ మాజీ కార్యదర్శి యం. శ్రీనివాసరావు , ఏసిఇపిడిసిఎల్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం. శ్రీనివాసులు మాట్లాడుతూ యూనియన్ సాధించిన విజయాలను కొనియాడారు. ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ ఏ.గురుబాబు విద్యుత్ ఉద్యోగులు ఐక్యంగా ఉంటే డిమాండ్లును సాధించుకోవచ్చన్నారు. ప్రాంతీయ అధ్యక్ష,కార్యదర్శులు పినిపే సురేష్ బాబు,జగతా అచ్యుతరామయ్యలు మాట్లాడుతూ, ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలను విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
దారి దోపిడీ కేసులో నలుగురి అరెస్టు
కోటనందూరు: దారి దోపిడీ కేసులో నలుగురు యువకులను అరెస్టు చేశామని స్థానిక ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. వివరాల్లోకెళితే.. రాజమహేంద్రవరానికి చెందిన అల్లాది నాగేంద్రసాయి, గాలంకి కిరణ్‌బాబు లంబసింగి పర్యటనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 22న తెల్లవారుజాయు 2 గంటల సమయంలో తుని–నర్సీపట్నం రోడ్డులో మండలంలోని కాకరాపల్లి స్సైసీ రెస్టారెంట్ ఎదురుగా వచ్చేసరికి గుర్తు తెలియని ఆరుగురు యువకులు రెండు స్కూటీలపై వచ్చి అడ్డగించారు. ఆరుగురులో ఒకరు వీరిని క్రికెట్ బ్యాట్‌తో బెదిరించగా మరొకరు వీరిని చెంపలపై కొట్టారు. మరొక వ్యక్తి న్యూస్ రిపోర్టర్‌గా చెప్పి ఫొటోలు తీశాడు. మిగిలివారు బాధితుల నుంచి బలవంతంగా పల్సర్ బైక్, రెండు సెల్ఫోన్లు, దుస్తుల బ్యాగు, రూ.1,400 నగదు దోచుకొని బెదిరించి పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గాంధీనగరం, తాండవ జంక్షన్ల మధ్య సమావేశమై దొంగిలించిన బైకును అమ్మి గంజాయి కొనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్లు అందుకున్న సమాచారంతో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై రామకృష్ణ సిబ్బందితో దాడి చేశారు. పెట్టం కామరాజు అలియాస్ వైన్షాప్నాని, గూటూరి సాయిదుర్గాప్రసాద్, సంగు నాగవెంకట భవానీ కుమార్, చింతా పవణ్కళ్యాణ్లను ఆరెస్టు చేశారు. చల్లా నాగశివమణికంఠ, ఏనుగుపల్లి రాజు పరారీలో ఉన్నారు. వీరంతా కాకినాడ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. -
సీతారాముల ఉత్సవ విగ్రహాల చోరీ
కొత్తపల్లి: మండలంలోని ఉప్పాడ నాయకర్ కాలనీ–1లో ఉన్న సీతారామస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. స్థానిక ఆలయంలో పూజలు చేసే మల్లే మంగ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయ పునర్నిర్మాణం అనంతరం గత సంవత్సరం ఏప్రిల్ 15న విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్థానిక భక్తులు రోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. 4రోజుల క్రితం స్థానిక వ్యక్తి పూజలు చేస్తానని తాళాలు తీసుకున్నాడు. పూజ అనంతరం ఆలయానికి వేసిన తాళాన్ని దగ్గరలో ఉన్న కిళ్లీ కొట్టులో ఇచ్చి వెళ్లాడు. ఆ కాలనీలో ఏ సమస్య వచ్చినా గ్రామ పెద్దలు ఆలయం వద్దే చర్చిస్తారు. ఈ తరహాలో శుక్రవారం ఉదయం స్థానిక సమస్యపై పెద్దలు చర్చించుకుంటున్నారు. దీంతో ఆలయంలోని ఉన్న ఉత్సవ విగ్రహాలైన సీతారాములు, లక్ష్మణ విగ్రహాలు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న మంగ తాళం తీసి చూడగా ఆంజనేయ విగ్రహం మినహా మిగిలిన మూడు విగ్రహాలను అపహరించినట్లు గుర్తించారు. చోరీకి గురైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు సుమారు 50 కేజీల కంచుతో తయారు చేయించి గంపల రమణ కుటుంబ సభ్యులు అందించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విగ్రహాలను ఇచ్చిన దాతలకు తెలియపరిచామన్నారు. దీనిపై గ్రామస్తుడు ఉమ్మిడి జగన్నాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తపల్లి ఎస్ఐ జి.వెంకటేష్ తెలిపారు. -
రచ్చకు భయపడ్డారా..!
రచ్చబండకు చేసిన ఏర్పాట్లు ● డిప్యూటీ సీఎం రచ్చబండ రద్దు అందుకేనా? ● చర్చనీయాంశమైన పవన్ పర్యటన ● ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయిన వైనం ● భద్రత పేరుతో ప్రజలకు దూరం ● ట్రాఫిక్ ఆంక్షలతో జనానికి నరకం సాక్షి ప్రతినిధి, కాకినాడ: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన మెరుపు వేగంతో ముగిసిపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా ప్రధానంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. దీంతో, తమ సమస్యలు చెప్పుకుందామని నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పిఠాపురం చేరుకున్నారు. తీరా చూస్తే పవన్ పర్యటనలో రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చల్లగా చెప్పారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ ఎన్నో చెప్పి.. ‘ప్రతి ఇంటికీ వస్తా.. ప్రతి ఒక్కరినీ పలకరిస్తా.. అందరి సమస్యలూ వింటా.. అన్నింటికీ పరిష్కారం చూపుతా..’ అంటూ సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ మాటలు నమ్మి ఉబ్బి తబ్బిబ్బయిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి, ఆయనను గెలిపించారు. ఆయన తరచూ వస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలు ముగిసి, పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పది నెలలు పైనే అయ్యింది. ఇన్ని నెలల్లో ఆయన పట్టుమని పది రోజులైనా పిఠాపురం వచ్చారా అని ఇప్పుడు స్థానికులు చర్చించుకుంటున్నారు. ‘ప్రతిసారీ ఎంత వేగంగా వస్తున్నారో అంతే వేగంగా తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు?’ అని ప్రశ్నిస్తున్నారు. రాత్రికి ఏర్పాట్లు.. ఉదయానికి రద్దు వారి ప్రశ్నలకు సమాధానమా అన్నట్లు శుక్రవారం నాటి పవన్ పర్యటనలో రచ్చబండ కార్యక్రమాన్ని ఖరారు చేశారు. దీని కోసం స్వయంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బంది రెండు రోజులు కష్టపడ్డారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో గురువారం రాత్రికే పనులు చకచకా పూర్తి చేశారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల ఆవరణలో వేదిక, కుర్చీల వంటి ఏర్పాట్లు గురువారం రాత్రి 10 గంటల వరకూ చేశారు. తీరా చూస్తే తెల్లారేసరికి బిచాణా ఎత్తేశారు. రచ్చబండ కార్యక్రమం రద్దయినట్లు జనసేన నేతలు సోషల్ మీడియాలో శుక్రవారం ఉదయం చల్లగా మెసేజ్ పెట్టారు. గత జనవరి 10న పిఠాపురం రాజీవ్‌గాంధీ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో పవన్ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా రచ్చబండలో తమ సమస్యలు వింటారని ఆశ పడిన ప్రజలకు చివరకు నిరాశే ఎదురైంది. అక్కడి శిలాఫలకాలు ఇక్కడ ఆవిష్కరణ గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, రథశాల, ఆలయ అభివృద్ధికి పవన్‌తో శంకుస్థాపనలు చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే, చివరిలో దీనికి సంబంధించిన శిలాఫలకాలను కొత్తపల్లికి తరలించి, అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన చోటే ఆవిష్కరించేశారు. దీనికి సమయాభావమే కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనానికి ఇక్కట్లు పవన్ పర్యటనతో ఎప్పటి మాదిరిగానే ప్రజలకు ఈసారి కూడా ఇక్కట్లు తప్పలేదు. అడుగడుగునా భారీ పోలీసు బందోబస్తు, బారికేడ్లతో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో జనం నరకయాతన పడ్డారు. ఉప్పాడ సెంటర్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకూ దుకాణాలను పోలీసులు భద్రత పేరుతో మూయించేశారు. పట్టణంలోకి ఆర్టీసీ బస్సులు సహా ఇతర ఏ వాహనాలనూ రానివ్వకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులూ పడ్డారు. పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు శంకుస్థాపన నిర్వహించిన సందర్భంగా రోగులు నరకం కళ్ల చూశారు. బందోబస్తు పేరుతో పోలీసులు సీహెచ్‌సీలో రోజువారీ వైద్య సేవలను దూరం చేయడంతో నానా ఇక్కట్లూ పడ్డారు. అన్న అవమానం.. తమ్ముడి ఆలింగనం టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై పవన్ అన్న, ఎమ్మెల్సీ నాగబాబు తరచూ సైటెర్లతో అవమానిస్తూండగా.. తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం ఆయనను ఆలింగనం చేసుకోవడం చూసి కూటమి నేతలు విస్తుపోయారు. ఇటీవల చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వర్మను కించపరిచేలా నాగబాబు పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం కూటమిలో చిచ్చు రేపింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లిలో కార్యక్రమానికి వర్మ డుమ్మా కొట్టారు. అయితే, పిఠాపురం అంబేడ్కర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన కుట్టు మెషీన్లు, వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో కనిపించారు. ఆ కార్యక్రమానికి తనతో పాటు అనుచరులను అనుమతించకపోవడంతో అసహనానికి గురయ్యారు. ఇంతలో అక్కడకు వచ్చిన పవన్.. వర్మను లోపలకు తీసుకుని వెళ్లి ఆయనతోనే రిబ్బన్ కట్ చేయించారు. అన్న నాగబాబు అలా.. తమ్ముడు పవన్ ఇలా వ్యవహరించడమేమిటోనని నివ్వెరపోవడం కూటమి నేతల వంతయింది. రద్దు అందుకేనా? పవన్ రచ్చబండ రద్దుకు బయటకు భద్రతా కారణాలను చూపిస్తున్నారు. వాస్తవానికి వివిధ సమస్యలతో ప్రజలు క్యూ కట్టే అవకాశముందని నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తరువాత పట్టు రైతుల సమస్యలు స్వయంగా తెలుసుకుని, వారి కోసం సిల్క్ సిటీ ఏర్పాటు చేస్తానని పవన్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం పంట నష్టాలకు తోడు కూటమి ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నియోజకవర్గంలోని పట్టు రైతులు వేసిన మల్బరీ పంటను దున్నేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడం, గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రబీ వరి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు కళ్లాల్లో ధాన్యాన్ని వదిలేసి ఎలా అమ్ముకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో ఇటీవల దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. మరోవైపు పిఠాపురం పట్టణంలో మురుగు, చెత్త సమస్య ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. దీంతో, పట్టణ ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు. స్థానిక జనసేన మహిళా నేత ఒకరు స్వయంగా చెత్తను తొలగిస్తూ, అధికారుల తీరుపై నిరసన కూడా తెలిపారు. ఈ పరిస్థితుల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తే ఆయా వర్గాల వారు నిలదీసే అవకాశముంటుందని, వాటికి సమాధానం చెప్పలేమనే భయంతోనే చివరి నిమిషంలో దీనిని రద్దు చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ, పిఠాపురం – కొత్తపల్లి రోడ్డులో అడుగడుగునా ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు మండుటెండలో వేచి ఉండటం గమనార్హం. -
సత్యదేవునికి రూ.1.26 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి గత 28 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,26,07,501 ఆదాయం వచ్చింది. దేవస్థానంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూ.1,19,83,071, చిల్లర నాణాలు రూ.6,24,430 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 50.100 గ్రాములు, వెండి 950 గ్రాములు వచ్చాయన్నారు. హుండీల ద్వారా రోజుకు సగటున రూ.4,50,267 మేర ఆదాయం సమకూరిందన్నారు. హుండీల ద్వారా విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 215, సింగపూర్ డాలర్లు ఏడు, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ ఐదు, యూరోలు 140, బ్రెజిల్ రియల్స్ 22, ఖతార్ రియల్ ఒకటి, కువైట్ రియల్ ఒకటి, ఒమన్ రియల్ ఒకటి, ధాయ్‌లాండ్ బాట్స్ 140, యూఏఈ దీరామ్స్ 10, మలేషియా రింగిట్స్ 4 లభించాయి. ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో శ్రీవారి సేవ, శ్రీహరి సేవ తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది సుమారు 400 మంది పాల్గొన్నారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ సహా ముగ్గురు ఏఈఓలు, ముగ్గురు సూపరింటెండెంట్లు సెలవు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఒక ఉద్యోగి మరణించడంతో కొంతమంది సిబ్బంది అక్కడకు వెళ్లారని పేర్కొన్నారు. దేవస్థానం ఉద్యోగులు చాలా తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. హుండీ లెక్కింపు అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలను తనిఖీ చేసి, వెలుపలకు పంపించారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. 24,762 మందికి వేట నిషేధ భృతి కాకినాడ రూరల్: ఈ నెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం అమలులోకి వచ్చిన నేపథ్యంలో మత్స్యకారుల ఖాతాల్లో ప్రభుత్వం శనివారం భృతి జమ చేయనుంది. జిల్లాలో 24,762 మంది లబ్ధిదారులకు రూ.20 వేల చొప్పున రూ.49.504 కోట్లు అందించనుంది. కలెక్టరేట్లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సముద్రంలో వేట సాగించే 4,451 బోట్లకు మత్స్య శాఖ అధికారులు ఎన్యూమరేషన్‌ను చేపట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ డేటాను ఆరు అంచెల్లో తనిఖీ చేసి, 24,762 మందిని ఎంపిక చేసి, సోషల్ ఆడిట్ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు అందుబాటులో ఉంచారు. ప్రతి లబ్ధిదారుకూ కేవైసీ చేపడుతున్నామని మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. -
అల కాంచీపురములో...
● అన్నవరానికి అరుదైన గౌరవం ● కంచి పీఠం ఉత్తరాధికారిగా గ్రామానికి చెందిన ద్రావిడ్ ● 71వ పీఠాధిపతిగా ఎంపిక ● పీఠంతో అన్నవరం దేవస్థానానికి విడదీయలేని బంధం అన్నవరం: సాక్షాత్తూ ఆ కై లాస శంకరుడే.. ఆదిశంకరాచార్యుడిగా అవతరించి.. అవైదిక మతాల నుంచి సనాతన ధర్మాన్ని పరిరక్షించి.. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి.. భారత దేశం నలు చెరగులా నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించి.. దక్షిణాదిన తాను స్వయంగా ఆధిపత్యం వహించిన సుప్రసిద్ధ పీఠం.. కంచి కామకోటి పీఠం. అటువంటి విశిష్ట పీఠానికి ఉత్తరాధికారిగా గోదారి గడ్డపై వెలసిన దివ్యక్షేత్రం అన్నవరం గ్రామానికి చెందిన ఓ నవ యువకుడు ఎంపికవడం ఈ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది. అన్నవరానికి చెందిన చతుర్వేద పారంగతుడు దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్‌ను కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఎంపిక చేశారు. ద్రావిడ్ ఈ నెల 30న అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా స్వామీజీ చేతుల మీదుగా సన్యాస దీక్ష స్వీకరిస్తారు. అనంతరం ఆయనను స్వామీజీ తన శిష్యునిగా స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో కంచి పీఠంతో అన్నవరం దేవస్థానానికి శతాబ్దానికి పైబడి కొనసాగుతున్న అనుబంధం, కంచి పీఠాధిపతులు గతంలో ఇక్కడకు పలుమార్లు విచ్చేసి, మార్గనిర్దేశం చేయడం వంటి అంశాలను పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ద్రావిడ్ ఎంపికతో కంచి పీఠానికి, అన్నవరం దేవస్థానానికి అనుబంధం మరింత దృఢపడుతుందని, ఇదంతా సత్యదేవుని దయ, పీఠాధిపతులకు ఈ క్షేత్రంపై గల అభిమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్నవరానికి చెందిన దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ కంచి పీఠం ఉత్తరాధికారిగా, భవిష్యత్తులో 71వ పీఠాధిపతిగా భాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నవరం దేవస్థానంతో పీఠం అనుబంధం మరింత బలోపేతమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మా అందరి పూర్వ జన్మ సుకృతం
దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా సన్యాసాశ్రమం స్వీకరించి, వారి శిష్యునిగా అవుతూండటం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము తొమ్మిది మంది అన్నదమ్ములం. ఆరుగురు చెల్లెళ్లు. గణేష్ శర్మ మా రెండో సోదరి భళ్లమూడి భాస్కరం, సూర్యనారాయణ దంపతుల కుమార్తె కొడుకు. అతడి తండ్రి దుడ్డు ధన్వంతరి, తల్లి మంగాదేవి. గణేష్‌ను నా చేతుల మీద పెంచాను. ద్వారకా తిరుమలలో ఆగమ శాస్త్రాలు అభ్యసించి, పరీక్షలో గోల్డ్ మెడల్ పొందాడు. అప్పుడే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అతడిని చూసి, పరీక్షించారు. అతడి విద్వత్తు చూసి కంచి పీఠానికి తీసుకుని వెళ్లి, నాలుగు వేదాలు, ఉపనిషత్తులు నేర్పించారు. గణేష్ శర్మ ఏకసంధాగ్రాహి. ఒకసారి చెప్పింది వెంటనే గుర్తు పెట్టుకుని అప్పగిస్తాడు. అతడికి ఈ గౌరవం దక్కడం మా పూర్వజన్మ సుకృతం. – నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు, అన్నవరం దేవస్థానం -
5 నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ
కాకినాడ సిటీ: వచ్చే నెల 5 నుంచి కాకినాడ రూరల్ వాకలపూడిలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) సెంటర్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ శిక్షణకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులైన 18 నుంచి 30 సంవత్సరాల లోపు పురుష అభ్యర్థులు అర్హులన్నారు. టూ వీలర్ టెక్నీషియన్, వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ కోర్సులకు మూడు నెలల శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తున్నారని తెలిపారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ ఇస్తారన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ అందిస్తారన్నారు. వీటితో పాటు అదనంగా బేసిక్ కంప్యూటర్ కోర్సు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 4వ తేదీ లోపు 83284 83297, 89784 75164 మొబైల్ నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లచ్చారావు సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి అమానుషం తుని: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి అత్యంత కిరాతకమని తపోవన ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తుని మండలం కుమ్మరిలోవలోని తపోవనంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి, హతమార్చడం హేయమని పేర్కొన్నారు. ఉగ్ర భావజాలంతో ఉన్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి, సామరస్యమే ఉన్నతమైన వాతావరణాన్ని తీసుకు వస్తుందని చెప్పారు. హింసాత్మక సంఘటనలు ఎటువంటి ప్రభావాన్నీ చూపించవన్నారు. మతపరమైన భావజాలంతో ఇటువంటి దుశ్చర్యలకు ఒడిగట్టడం దారుణమైన విషయమన్నారు. భారతదేశం మతాలు, వర్గాలకు అతీతంగా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదం అందరికీ ఉమ్మడి శత్రువని, కేంద్ర నాయకత్వానికి భారతీయులు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. టీచర్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కాకినాడ క్రైం: వైద్య ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం కాకినాడ జీజీహెచ్‌కు వస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ తెలిపారు. ప్రత్యేక ఓపీ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేసి, మైక్‌లో ప్రచారం చేస్తున్నామన్నారు. సెమినార్ హాలులో ఆర్థో, న్యూరాలజీ సమస్యలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. మెడికల్ డిపార్టుమెంట్ కాన్ఫరెన్స్ హాలులో మెడికల్ ధ్రువీకరణ పత్రాలు, ఆప్తాల్మాలజీ డిపార్టుమెంట్లో కంటి సమస్య ఉన్నవారి పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే, ఈఎన్టీ ధ్రువీకరణ పత్రాలను సోమ, శనివారాల్లో పరిశీలించనున్నామని డాక్టర్ విఠల్ తెలిపారు. రేడియేషన్ డిపెండెంట్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన క్యాన్సర్ వార్డులో నిర్వహిస్తున్నామన్నారు. టీచర్ల సహాయార్థం నర్సులను నియమించి, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు నలుగురు క్లర్కులను నియమించామన్నారు. అలాగే మార్గనిర్దేశం కోసం సీనియర్ నర్సులను కూడా నియమించామన్నారు. శుక్రవారం 208 మంది టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరిగిందని విఠల్ తెలిపారు. లోక్ అదాలత్ వాయిదా ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వచ్చే నెల 10న నిర్వహించ తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్‌ను జూలై 5వ తేదీకి వాయిదా వేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఈ విషయం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎకై ్సజ్ అధికారులతో జిల్లా న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జూలై 5న జిల్లావ్యాప్తంగా జరగనున్న లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో రాజీ పడదగిన ఎకై ్సజ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బి.పద్మ, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులు సీహెచ్ లావణ్య, ఎం.కృష్ణకుమారి, ఎస్కేడీవీ ప్రసాద్, పీఎన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
కంచితో మంచి అనుబంధం
● వీర వేంకట సత్యనారాయణ స్వామి స్వయంభువుగా వెలసిన అన్నవరం దేవస్థానానికి, కంచి కామకోటి పీఠానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించి 134 సంవత్సరాలు పూర్తి కాగా అప్పటి నుంచీ దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ప్రతి కీలక పరిణామాల్లో కంచి కామకోటి పీఠాధిపతులు సూచనలు అందిస్తున్నారు. వారు భక్తులకు, దేవస్థానం అధికారులకు ఇస్తున్న సూచనలు, అనుగ్రహ భాషణలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ● నడిచే దేవుడిగా పేరొందిన కంచి పీఠం 68వ అధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సుమారు 50 ఏళ్ల క్రితం కంచి నుంచి పాదయాత్ర చేస్తూ అన్నవరం వచ్చారు. ఆయన కూడా వందల సంఖ్యలో భక్తులతో పాటు ఏనుగులు, గుర్రాలు, ఆవులు కూడా నడుస్తూ వచ్చాయి. అన్నవరంలో ఆయన మూడు రోజులు బస చేశారు. స్థానిక సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయంలో పీఠం ఏర్పాటు చేసి, స్వామీజీ పూజలు చేశారు. ఆ సమయంలో సత్యదేవుని ఆలయానికి వచ్చి, దేవస్థానంలో అనేక వైదిక కార్యక్రమాల గురించి మార్గనిర్దేశం చేశారు. పలువురు పండితులకు అన్నవరంలో ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు. స్వామీజీ అన్నవరం నుంచి పాదయాత్రగా తుని వెళ్తూ, మార్గం మధ్యలో ఎర్రకోనేరు వద్ద సూర్యాస్తమయం కావడంతో అక్కడ సంధ్యావందనానికి ఆగిపోయారని నాడు స్వామీజీతో యాత్రలో పాల్గొన్న అన్నవరం దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ తెలిపారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను నియమించారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్(బన్ని)ని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పెదపాటి సుబ్రహ్మణేశ్వరరావు(నాగబాబు)ను ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. కష్టపడి పని చేసే వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరిని ఈ పదవుల్లో నియమించినందుకు అధినేత జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అరుణ్‌కుమార్, సుబ్రహ్మణేశ్వరరావులను అభినందించారు. -
ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవునికి అర్చకులు గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి 7.30 గంటల వరకూ స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ తులసి దళార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజన, మంత్రపుష్పాలు, వేదాశీస్సులు అందజేశారు. ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, అర్చకుడు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జాతీయ పోటీలకు ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఏలూరులో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర స్థాయి పోటీల్లో కాకినాడ క్రీడాకారులు ప్రతిభ చూపి, 3 బంగారు, 2 రజత, 3 కాంస్య పతకాలు అందుకున్నారు. జి.సురేష్ కుమార్ 100, 200 మీటర్లు, కె.సత్యదుర్గ బోసే గేమ్, కె.ప్రేమ్‌కుమార్ 200, 100 మీటర్లు రన్నింగ్‌లో ప్రతిభ చూపి, ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ జిల్లా కో ఆర్డినేటర్ చామంతి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది గురువారం అభినందించారు. జాతీయ వెటరన్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కర్ణాటకలోని చాముండి విహార స్పోర్ట్స్ స్టేడియంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన 44వ జాతీయ వెటరన్ అథ్లెటిక్స్ పోటీల్లో కాకినాడకు చెందిన వెటరన్ అథ్లెట్ యాతం నాగబాబు ప్రతిభ కనబరిచారు. 100, 400, 800 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు సాధించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం మలేరియా విభాగంలో యూనిట్ అధికారిగా పని చేస్తున్న ఆయన ఒక్కరే మన రాష్ట్ర నుంచి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఉగ్రవాద దాడి మృతులకు నివాళి అమలాపురం టౌన్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యాన గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూలు సెంటరులో కొవ్వొతుల వెలుగులతో మృతులకు నివాళులర్పించారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ నాయకులు కుడుపూడి త్రినాథ్, కట్టోజు రాము, వేగిరాజు సాయిరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు, వెటరన్ క్రీడాకారిణి మెహబూబ్ షకీలా తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ పరీక్షలకు 453 మంది హాజరు
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)లో బీఎస్సీ నర్సింగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 10వ తేదీ వరకూ జరగనున్న ఈ పరీక్షలకు తొలి రోజు 493 మందికి గాను 453 మంది హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే తక్షణమే డిబార్ చేస్తామని హెచ్చరించారు. పరీక్షలకు అబ్జర్వర్‌గా డాక్టర్ లావణ్య, చీఫ్ సూపరింటెండెంట్‌గా వైస్ ప్రిన్సిపాల్ (అకడమిక్స్) డాక్టర్ శశి, అదనపు చీఫ్ సూపరింటెండెంట్‌గా ఫార్మకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ వ్యవహరించారు. ఆర్ఎంసీ ఎగ్జామినేషన్ భవంతిలో ఉన్న మూడు హాళ్లలో నిర్వహించిన ఈ పరీక్షలకు 18 మంది వైద్యులు ఇన్విజిలేటర్లుగా పని చేశారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం ఆదేశాల మేరకు ఎటువంటి కాపీయింగ్‌కి తావివ్వకుండా పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎగ్జామినేషన్ హాల్ పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉందన్నారు. విద్యార్థులు అసంబద్ధ ప్రయత్నాలకు పాల్పడి విద్యా సంవత్సరాన్ని నష్టపోవద్దని సూచించారు. -
వనామీ.. కష్టాల సునామీ
సాక్షి, అమలాపురం: అంతర్జాతీయ మార్కెట్లో నిలకడ లేని ధరల వల్లనే కాదు.. అనధికార హేచరీల నుంచి వస్తున్న నాసిరకం రొయ్య పిల్లలు.. సిండికేటుగా మారిన మేత కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచేయడం.. వెరసి వనామీ రైతులు నిలువునా మునుగుతున్నారు. ఆక్వా రైతులు ఎదురు దెబ్బలు తినడానికి ఈ సీడ్, ఫీడ్ కారణమవుతున్నాయి. వీటి వల్ల నష్టాలను మూటగట్టుకుంటున్న వనామీ రైతులు మరోసారి సాగుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వరి, కొబ్బరి, అరటి, కూరగాయల పంటల తరువాత ఆక్వా సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. వనామీ రొయ్యల సాగుకు పెట్టుబడులు, లావాదేవీలు అధికం. ఈ రంగం దేశానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం తెచ్చిపెడుతోంది. అటువంటి వనామీ సాగు ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ధరలు పెరగడంతో ఆక్వా సాగు ఆశాజనకంగా కనిపించింది. అంతలోనే ఎగుమతిదారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించడం.. అమెరికా సుంకాల ప్రభావం.. ఎడాపెడా విద్యుత్ కోతలతో పెరిగిన పెట్టుబడులు.. ఇలా చెప్పుకొంటూపోతే వనామీ రైతుల కష్టాలకు అంతే లేకుండా పోతోంది. వీటన్నింటికన్నా రొయ్యల మేత (ఫీడ్) ధరలు, నాసిరకం రొయ్య పిల్లల (సీడ్) వల్ల వీరు అధికంగా నష్టపోతున్నారు. వారిది దురాశ.. వీరికి నిరాశ దేశంలోని 12 తీర ప్రాంతాల్లో 302 హేచరీరు, 21 బ్రూడ్ స్టాక్ హేచరీలు మాత్రమే కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) రిజిస్ట్రేషన్ పొందాయని సమాచారం. చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి, తుని, తొండంగి, తాళ్లరేవు మండలాల్లో 100కు పైగా హేచరీలను సీఏఏ అనుమతి లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా అల్లవరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం మండలాల్లో మరో 50కి పైగా ఉన్నాయి. వనామీ సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన రొయ్య పిల్లలు కావాలి. కానీ, చాలా వరకూ నాసిరకం కావడంతో నెల రోజుల్లోపు విబ్రియో, ఈహెచ్‌పీ, వైట్ స్పాట్, వైట్ గట్, వైట్ ఫీకల్, రెడ్ డిసీజ్ వంటి వ్యాధులు ప్రబలి రొయ్య పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. ఈహెచ్‌పీ సోకిన రొయ్యల్లో 60 రోజులు గడిచినా పెద్దగా పెరుగుదల ఉండదు. ఒక రొయ్య 2 గ్రాములు, మరొకటి 5 గ్రాములు ఇలా వేర్వేరు బరువుతో ఉంటాయి. ఒకవైపు మంచి కౌంట్ రాకపోవడం, మరోవైపు మేత వృథా పోవడంతో రైతులు నష్టపోతున్నారు. చాలా వరకూ అనధికార హేచరీల్లో వ్యాధులున్న బ్రూడర్ (తల్లి) రొయ్యలను కొనుగోలు చేసి, వాటి పిల్లలను అమ్ముతున్నారు. ఆరోగ్యకరమైన బ్రూడర్ రొయ్యలున్నా వాటి నుంచి ఏడు దఫాలుగా మాత్రమే పిల్లలను ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ హేచరీల యజమానులు అత్యాశకు పోయి 12 నుంచి 15 దఫాలుగా రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల వాటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, త్వరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. దీంతో, పెట్టుబడి పెరిగి, తగినంతగా లాభాలు రాక వనామీ రైతులు నిరాశ చెందుతున్నారు. టన్నుకు రూ.25 వేలు పెంచి.. కరోనా సమయంలో టన్ను సోయాబీన్ ధర అంతర్జాతీయంగా రూ.90 వేలకు చేరింది. దీంతో, ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులు రాత్రికి రాత్రే మేత ధరను టన్నుకు రూ.25 వేలకు పైగా పెంచారు. తరువాతి కాలంలో సోయాబీన్ ధర టన్ను రూ.25 వేలకు తగ్గింది. ప్రస్తుతం రూ.40 వేలుగా ఉంది. అయినప్పటికీ మేత కంపెనీలు ధరలు తగ్గించడం లేదు. మేతలో వాడే మినరల్స్, ఇతర పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం ఉండగా.. వాటిని కూడా ఎత్తేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే టన్ను మేతను రూ.25 వేల నుంచి రూ.30 వేలు తగ్గించి విక్రయించాలి. కానీ, మేత ఉత్పత్తిదారులు దిగి రాబోమని అంటున్నారు. అధికార టీడీపీ అండదండలు పుష్కలంగా ఉన్న ఓ మేత కంపెనీ రాష్ట్రంలోని ఆక్వా పరిశ్రమపై పెత్తనం చెలాయిస్తూ ధరలు తగ్గించకుండా చేస్తోంది. దీనివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. వనామీ రొయ్యల చెరువుల్లో వినియోగించే మందులపై కూడా 150 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని కూడా తగ్గించారు. అయినప్పటికీ వాటి ధరలను కూడా తగ్గించడం లేదు. రొయ్యల కౌంట్ ధరల నష్టాల కన్నా మేత, రొయ్య పిల్లలు, మందుల వల్ల అధికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని సీడ్‌తో నష్టం నాసిరకం రొయ్య పిల్లల వల్ల రైతులు పలు రకాలుగా నష్టపోతున్నారు. అవి చాలా త్వరగా వ్యాధులు బారిన పడుతున్నాయి. చిన్న వయసులోనే చనిపోవడం వల్ల రైతులు కనీస పెట్టుబడులు కూడా పొందలేకపోతున్నారు. ఒకవేళ బతికినా రొయ్యల కౌంట్ల మధ్య వ్యత్యాసం అధికంగా వస్తోంది. దీనివల్ల మార్కెట్లో సరైన ధరలు పొందలేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి, మత్స్యశాఖ ద్వారా హేచరీలపై నిఘా పెట్టి, రైతులకు నాణ్యమైన రొయ్య పిల్లలు అందించేలా చర్యలు తీసుకోవాలి. – పి.రామ్మోహనరావు, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ఫ ముంచేస్తున్న సీడ్.. ఫీడ్ ఫ శాపంగా మారిన ఫీడ్ ధరలు ఫ గతంలో కేజీకి రూ.16 చొప్పున పెంపు ఫ ఇప్పుడు రూ.4 తగ్గించి రైతుకు మేలు చేశామంటూ గొప్పలు ఫ హేచరీల్లో 80 శాతం నాసిరకం సీడ్ ఫ రొయ్యల పెరుగుదల లేక నష్టాలు -
అన్నదానం బఫే హాలుకు లిఫ్ట్ ప్రారంభం
అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో బఫే హాలుకు ఏర్పాటు చేసిన లిఫ్టును దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అన్నవరం దేవస్థానంలో ఫిబ్రవరిలో తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నదానం హాలు వద్ద భోజనం కోసం వందలాదిగా భక్తులు క్యూలో వేచి ఉండటాన్ని గమనించారు. వారికి ఆ బాధ తప్పేలా బఫే పద్ధతిలో కూడా భోజనం పెట్టాలని ఆదేశించారు. దీంతో ఫిబ్రవరి 26 నుంచి అన్నదానం హాలు పై అంతస్తులో భక్తులకు బఫే ద్వారా భోజనాలు పెట్టడం ప్రారంభించారు. అంతకు ముందు సిట్టింగ్ పద్ధతిలో రోజుకు 4 వేల మందికి మాత్రమే భోజనాలు పెట్టేవారు. బఫే పద్ధతి ప్రారంభించాక ఆ సంఖ్య 6 వేలకు పెరిగింది. అయితే, బఫే భోజనాలు వడ్డించేందుకు అవసరమైన ఆహార పదార్థాలను దిగువన ఉన్న హాలు నుంచి మెట్ల మార్గంలో మోసుకుని వెళ్తూ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. బఫేలోనే ఎక్కువ మంది భోజనం చేస్తూండటంతో కనీసం అరగంటకోసారి ఆహార పదార్థాలు మోసుకుని వెళ్లాల్సి వస్తోంది. తిరిగి ఖాళీ పాత్రలను దిగువకు తెచ్చుకోవడం కూడా వారికి ఇబ్బందిగా మారింది. ఇలా మోసుకుని వెళ్తున్న క్రమంలో ఆహార పదార్థాలు చల్లారిపోతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ దాత ఆర్థిక సహకారంతో అన్నదానం హాలు నుంచి మొదటి అంతస్తులోని బఫే హాలుకు లిఫ్టు ఏర్పాటు చేశారు. దీంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పాయి. భక్తులు కూడా అనప్రసాదం వేడిగా అందుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బఫే హాలుకు పాత సీఆర్వో కార్యాలయం మెట్ల మీదుగా వెళ్లాల్సి రావడంతో దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా బఫే హాలుకు నేరుగా నడిచి వెళ్లే ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
అమ్మాయిలే మిన్నగా..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. గత నెల 17 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించిన టెన్త్ పరీక్షలకు 27,368 మంది విద్యార్థులు హాజరు కాగా, 22,508 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 82.02 శాతం రాగా ఈ ఏడాది 82.24 శాతంతో కాస్త మెరుగుపడి రాష్ట స్థాయిలో జిల్లాకు 15వ స్థానం దక్కింది. ప్రభుత్వ పాఠశాల అనగానే అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణత అనే పదానికి ఫుల్ స్టాప్ పడింది. చాలీచాలని గదులు, శిథిలావస్థకు చేరిన భవనాలు, కనీస వసతులు వంటి సమస్యలకు చెక్ పెట్టి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాడు–నేడు ద్వారా రూపు రేఖులు మార్చారు. బోధన విషయంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. దాని ఫలితంగా సగర్వంగా సర్కార్ బడులు తలెత్తుకుంటున్నాయి. పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధిస్తున్నారంటే అది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చదువులపై తీసుకున్న శ్రద్ధ వల్లనే అని అర్థమవుతుంది. బాలికలదే పైచేయి పది ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో 27,368 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో బాలురు 13,708, బాలికలు 13,660 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో 10,850 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, 11.658 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి పై చేయి సాధించారు. జిల్లా వ్యాప్తంగా 82.24 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 79.15 శాతం, బాలికలు 85.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించి 27,368 మంది పరీక్షలకు హాజరు కాగా 22,508 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 17.098 మంది ప్రథమ శ్రేణి, 3,568 మంది ద్వితీయ శ్రేణి, 1,842 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపింది. ప్రాథమిక విద్య నుంచి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తూ ప్రణాళిక బద్ధంగా చదువుతూ మంచి మార్కులు సాధించి కాకినాడ చరిత్రలో నూటికి నూరుశాతం మార్కులతో ఘనత చాటింది. సమష్టి విజయం పది ఫలితాల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమష్టి కృషి కారణమైందని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. పేదింటి తోటలో పూసిన పుష్పాంజలి పిఠాపురం: రైతింట తోటలో పూసింది పుష్పాంజలి. సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోను మంచి అద్భుతాలు సృష్టించే ఫలితాలు సాధించవచ్చని నిరూపించింది. గొల్లప్రోలుకు చెందిన రైతు తోట రాంబాబు భార్య సుజాతలకు మూడవ కుమార్తె అయిన తోట పుష్పాంజలి గొల్లప్రోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చదువుకుంటోంది. పదవ తరగతి ఫలితాల్లో 600కు 594 మార్కులు సాధించి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించి విద్యా కుసుమాంజలిగా ప్రశంసలందుకుంది. ఎల్ఎల్బీ చదివి లాయర్‌గా స్థిరపడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యప్రకాశరెడ్డి ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. కూలీ ఇంట్లో మెరిసిన కనకవల్లి నిరుపేద కుటుంబానికి చెందిన ఆకేటి వెంకటరమణ, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె ఆకేటి కనకవల్లి పదవ తరగతి ఫలితాల్లో 600కు 590 మార్కులు సాధించింది. గొల్లప్రోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చదువుకుంటోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రశంసలందుకుంటోంది. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తన తండ్రికి చేదోడుగా ఉండాలనేదే తన ధ్యేయమని ఆమె చెబుతోంది. టెన్త్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 15వ స్థానం 82.24 శాతం ఉత్తీర్ణత -
7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
అన్నవరం: మే ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు వారం రోజుల పాటు జరగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సహకరించాలని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కోరారు. బుధవారం రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణ మండపంలో జరిగిన ప్రభుత్వ శాఖలు, దేవస్థానం అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ వైశాఖ శుద్ధ ఏకాదశి, మే ఎనిమిదో తేదీ రాత్రి 8–30 గంటల నుంచి జరుగునున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణం తలంబ్రాలు, ప్రసాదం పంపిణీ చేయడానికి తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్యాణం తిలకించే భక్తులు, గ్రామస్తుల కోసం టోల్గేట్ నుంచి రత్నగిరికి ఎనిమిది ఉచిత బస్‌లు నడపాలని నిర్ణయించారు. పంపా నదిలో కొంతమేర నీరు ఉన్నప్పటికీ ఉత్సవాల నాటికి పంపా ఏలేరు రిజర్వాయర్ నుంచి పంపాకు నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కోరారు. శ్రీసత్యదేవుని కల్యాణ మహోత్సవం రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి, ఊరేగింపులు జరిగే ఐదు రోజులు సాయంత్రం అన్నవరంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించారు. 11 వ తేదీ సాయంత్రం టేకు రథంపై జరగనున్న సత్యదేవుని రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. -
జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి
పిఠాపురం: రాష్ట్రంలో జర్నలిస్ట్‌లు, పత్రిక కార్యాలయాలపై జరుగుతున్న దాడులు అరికట్టి పత్రిక స్వేచ్ఛను కాపాడాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచర వర్గం దాడి చేసి కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం చేసి, విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్‌పై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పిఠాపురం, పెద్దాపురంలో జర్నలిస్ట్‌లు ఆందోళనలు, ర్యాలీ నిర్వహించారు.జర్నలిస్టు సంఘాల ఆద్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తహసీల్దారు, డీఎస్పీ , ఆర్డీవో కార్యాలయాలలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి పత్రికలో వ్యతిరేక వార్త వచ్చిందని కార్యాలయంపై దాడి చేయడం, కార్యాలయ పరికరాలు ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాత్రికేయులు పత్రికా కార్యాలయ పై దాడులు అరికట్టాలని కోరారు. పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేయాలిపెద్దాపురం: మున్సిపాల్టీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ ఆర్డీ సీహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పట్టణాల్లో ఆదాయ వనరులు పెంచి అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఆస్తి పన్ను, తాగునీరు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు నూరుశాతం పూర్తి చేయాలన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా వడ్డీ రాయితీపై అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ పరిధిలోని పారిశుధ్య పనులను తనిఖీలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ పద్మావతి ఆయా విభాగాల అధికారులు ఉన్నారు. -
ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏలూరు సాక్షి కార్యాలయంపై నిస్సిగ్గుగా దాడికి దిగిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరవర్గంపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజె నాయకుడు స్వాతి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షలను ఇలా మీడియాపై చూపడం తగదన్నారు. దాడి సందర్భంగా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేయడమేగాక, విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్‌పై దాడి చేయడం దారుణమన్నారు. సాక్షి పత్రికలో తనకు వ్యతిరేకంగా వార్త వచ్చిందని కార్యాలయంలోని పరికరాలను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలు లేకపోతే వివరణ ఇవ్వాలే గానీ కార్యాలయంపైన, విలేకరులపైన దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేగా పత్రికాస్వేచ్ఛను కాపాడాల్సిన చింతమనేని కార్యాలయాన్ని ధ్వంసం చేయడం సరికాదు. ఈ దాడిని పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఏపీయూడబ్ల్యూజే పరిగణిస్తోందనారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చింతమనేనిపై సీఎం చంద్రబాబు క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జూన్ కల్లా ఉత్తరాంధ్రకు నీరు అందించడమే లక్ష్యం కిర్లంపూడి: మండలంలోని కృష్ణవరం పోలవరం ఎడమ కాలువ పీకేజీ 3 పనులను నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామనాయుడు బుధవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పరీశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ఇంజినీర్లు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ జూన్ కల్లా ఫస్ట్‌ఫేజ్ పనులు పూర్తి చేసి ఎడమ మెయిన్ కెనాల్ ద్వారా పుష్కర, పురుషోత్తం పట్నం ఎత్తిపోతల నుంచి ఉత్తరాంధ్రకు నీటి తరలించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
ధాన్యం తేమ శాతం పెంపు
పిఠాపురం: 17 శాతంకు బదులుగా 22 శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు దళారుల ప్రమేయం రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల వెలువడిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుపై బుధవారం పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. 17 శాతం తేమ ఉండాల్సినప్పటికి 22 శాతం వరకు తేమ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అందుకు సరిపడా ధాన్యం అదనంగా తూకం వేయాలని ఆయన అధికారులకు సూచించారు. 18 శాతం తేమ ఉన్నట్లయితే ఒక కేజీ, 19 శాతం తేమ ఉన్నట్లయితే రెండు కేజీలు, 20 శాతం తేమ ఉన్నట్లయితే మూడు కేజీలు, 21 శాతం తేమ ఉన్నట్లయితే నాలుగు కేజీలు, 22 శాతం తేమ ఉన్నట్లయితే ఐదు కేజీలు ధాన్యం అదనంగా తూకం వేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నమోదు చేయాలని సూచించారు. 22 శాతం కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే రైతు విధిగా ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. తేమ శాతం 17 వచ్చిన తర్వాత రైతులు అమ్ముకుంటే ఏ గ్రేడ్ రకం 75 కేజీలకు రూ.1,740, సాధారణ రకం 75 కేజీలకు రూ.1,725 పొందవచ్చన్నారు. ధాన్యం అమ్మిన 36 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం దేవులా నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, వ్యవసాయ శాఖ ఏడి పి స్వాతి పాల్గొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా కొనుగోలుకు చర్యలు కలెక్టర్ షణ్మోహన్ -
శ్రీ ప్రకాష్ విద్యార్థుల అత్యున్నత ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచారు. నందవరపు భానుతేజస్ 594, సామిరెడ్డి గీతిక 593, కడిమి అర్చన 592, ఎస్.రుత్విక 592, ఎం.స్నేహిత్ 590 మార్కులు సాధించారని పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. 550కు పైగా 91 మంది, 500కు పైగా 155 మంది మార్కులు సాధించి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఆ విద్యార్థులను శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అధినేత నరసింహారావు, ప్రిన్సిపాల్ మూర్తి అభినందించారు. ఆదిత్య విద్యాసంస్థల విజయభేరి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఏబీబీవీ సత్యసూర్యతేజ, బి.మహిత్ నాయక్ 596 మార్కులు సాధించారని ఆదిత్య విద్యాసంస్థల డైరక్టర్ ఎన్.శృతిరెడ్డి బుధవారం తెలిపారు. తమ విద్యాసంస్థల నుంచి 590కి పైగా 53 మంది, 550కు పైగా 465 మంది మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి, డైరెక్టర్ ఎస్వీ రాఘవరెడ్డి అభినందించారు. బాలికపై యువకుడి లైంగిక దాడి అన్నవరం: అన్నవరంలో పదేళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకు వెనుక గల ఒక ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను పక్కింటి ఆమె దుకాణానికి వెళ్లి పంచదార తెమ్మని పంపించింది. ఆ బాలిక దుకాణానికి వెళ్లి పంచదార కొనుగోలు చేసి ఇంటికి తెచ్చింది. ఆ సమయంలో పక్కింటి ఆమె ఇంట్లో లేదు. ఆమె కొడుకు 20 ఏళ్ల కొల్లు సతీష్ ఉన్నాడు. అతడు ఆ పంచదార వంటింట్లో పెట్టాలని చెప్పాడు. బాలిక వంటింట్లోకి వెళ్లగానే తలుపునకు గెడపెట్టి ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి ఆలస్యంగా తెలియడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి బాబు తెలిపారు. -
ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా రాజ్‌కుమార్
రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా కత్తుల రాజ్‌కుమార్ బుధవారం రాజమహేంద్రవరంలోని జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కరీంనగర్ జోన్ నుంచి పదోన్నతిపై ఇక్కడకు బదిలీపై వచ్చారు. రాజమహేంద్రవరం జోన్ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయం పరిధిలో రూ.10,037 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపారు. 25న ప్రవేశ పరీక్షలు అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 2025– 26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. పరీక్ష ఫలితాలను మే 14వ తేదీన విడుదల చేస్తారన్నారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశానికి సైతం అదే రోజు పరీక్ష జరుగుతుంది. హత్య కేసు రీ ఓపెన్ కాకినాడ క్రైం: ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన కేసును రీ ఓపెన్ చేయాలని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలు జారీ చేశారు. 2022లో అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్‌ను విచారణ అధికారిగా నియమించారు. 60 రోజుల్లో దర్యాప్తు నివేదికను తనకు సమర్పించాలని ఆదేశాలలో పేర్కొన్నారు. 34,591 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అల్లవరం: జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి బుధవారం నాటికి 34,591.60 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం. బాల సరస్వతి బుధవారం ప్రకటనలో తెలిపారు. బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన ‘కళ్లాల్లో ధాన్యం, నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు’ కథనంపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. అల్లవరం మండలంలో 18 రైతు సేవా కేంద్రాలు ద్వారా 395.720 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా అల్లవరం మండలంలో 1854 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉందన్నారు. అమలాపురం రూరల్ పరిధిలో 22 రైతు సేవా కేంద్రాల ద్వారా 1040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. -
‘దిశా’కు ప్రజాప్రతినిధుల డుమ్మా
సాక్షి, అమలాపురం: కేంద్ర ప్రయోజిత పథకాల అమలుతో పాటు జిల్లా స్థాయిలో జరిగే అభివృద్ధి పనుల మీద నిర్వహిస్తున్న దిశా సమావేశానికి అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల గైర్హాజరు కావడం విస్మయానికి గురి చేసింది. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండపేట శాసన సభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్, అధికార టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ సమావేశంలో ప్రతిపక్షాల గొంతును నొక్కి వేస్తుండడం, వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో వారు పాల్గొనేందుకు పెద్దగా మక్కువ చూపడం లేదు. కుంటుపడిన అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నించినా బయటకు రాకుండా మీడియాకు సైతం ప్రవేశం లేకుండా చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన వారూ పాల్గొనక పోవడం గమనార్హం. అమలాపురంలో జరిగిన ఒక ప్రైవేట్ మోటార్ సైకిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురంలోనే జరిగిన దిశాకు ముఖం చాటేశారు. కాగా.. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు లబ్ధిదారులకు అందించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడు జి.హరీష్ మాధుర్ అన్నారు. జిల్లా పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతెన్నులు, సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై స్థానిక కలెక్టరేట్లో బుధవారం జరిగిన దిశ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో వీవీఎస్.లక్ష్మణరావు పాల్గొన్నారు. -
ఓపెన్‌లోనూ టాప్ లేపారు
● వెలువడిన ఓపెన్ స్కూల్ ఫలితాలు ● సత్తా చాటిన విద్యార్థులు రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. గత నెల 17 నుంచి 28 వరకూ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఓపెన్ టెన్త్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో కాకినాడ (84.90 శాతం), తూర్పుగోదావరి (81.51), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (77.86 శాతం) జిల్లాలు నిలిచాయి. ఈ పరీక్షలకు కాకినాడ జిల్లా నుంచి 2,066 మంది హాజరు కాగా 1,754 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 83.05, బాలికలు 86.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 2,299 మంది పరీక్షకు హాజరు కాగా, 1,874 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 79.18గా, బాలికల ఉత్తీర్ణత 84.36 శాతంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 1,102 మంది విద్యార్థులు హాజరు కాగా, 858 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 73.77 శాతం, బాలికల ఉత్తీర్ణత 83,30 శాతంగా ఉంది. ఇంటర్ ఫలితాల్లో.. ఓపెన్ ఇంటర్ ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (82.15 శాతం), కాకినాడ (80.88 శాతం), తూర్పుగోదావరి (79.75 శాతం) జిల్లాలు మంచి ఉత్తీర్ణత సాధించాయి. కోనసీమ జిల్లా నుంచి 4,442 మంది పరీక్షకు హాజరు కాగా 3,649 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలురు 80.60, బాలికలు 84.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాకినాడ జిల్లా నుంచి 6,395 మంది పరీక్షకు హాజరు కాగా 5,172 మంది పాసయ్యారు. బాలుర ఉత్తీర్ణత 80.49, బాలికల ఉత్తీర్ణత 81.42 శాతంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి 4,588 మంది పరీక్షలు రాయగా, 3,659 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 77.53, బాలికల ఉత్తీర్ణత 82.45 శాతంగా ఉంది. రాష్ట్ర స్థాయి ఫలితాల్లో కోనసీమ మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో కాకినాడ, నాలుగో స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలు నిలిచాయి. రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఓపెన్ టెన్త్, ఇంటర్లో ఫెయిలైనవారు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటికి ఈ నెల 26 నుంచి మే 5వ తేదీ వరకూ ఏపీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఫీజు చెల్లించాలి. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్‌కు రూ.200, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెగ్యులర్ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను అనుసరించి జరుగుతాయి. వాటిని మే 19 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 26 నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్నాయి. పరీక్షా రుసుమును ఈ నెల 26 నుంచి మే 5వ తేదీ వరకు ఏపీటీ ఆన్లైన్ ద్వారా ద్వారా లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు. -
ఊడిమూడిలంక వంతెన పనుల పరిశీలన
పి.గన్నవరం: నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై నిర్మిస్తున్న వంతెన పనులను ఏఐఐబీ టీమ్ బుధవారం పరిశీలించింది. ఇంతవరకూ పనుల పట్ల టీమ్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.49.5 కోట్లు మంజూరు చేయించిన విషయం విధితమే. ఇంతవరకూ సుమారు రూ.32 కోట్ల వ్యయంతో 60 శాతం మేర పనులు పూర్తిచేశారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ఏఐఐబీ టీమ్ లీడర్ పవన్ ఖర్గీ (నేపాల్), సభ్యులు మాయా గాబ్రియల్ (ఫిలిప్పీన్), ఫ్రాన్సిస్ లార్ల సవెల్ల (ఫిలిప్పీన్), జోష్యుల శివరామశాస్త్రి (భారత్, ఏపీ), యోగేష్ బామ్ మల్ల (నేపాల్), ఎ.ముఖరాజ్ (కర్నాటక), అశోక్‌కుమార్ (డిల్లీ)లు వంతెన పనులను పరిశీలించారు. ఇంతవరకూ పనుల ప్రగతిని డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు బృంద సభ్యులకు వివరించారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు కె.లాస్య, ఎంఎల్పీ సమన్విత 595 మార్కులు సాధించి ప్రతిభ చూపారని ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీహెచ్.మధుమిత, జి.భువన 592 మార్కులు, జి.హిమబిందుసాయి, జీటీఎస్ హృతిక. కేవీ రాఘవ 591 మార్కులు సాఽధించారన్నారు. గణితం, సైన్స్‌లో వందకు వంద మార్కులు వచ్చాయని తెలిపారు. 591 మార్కులకు పైగా 7గురు, 580కు పైగా 21మంది, 570కు పైగా 41మంది, 560కు పైగా 62 మంది, 550కి పైగా 89 మంది, 540కు పైగా 114 మంది మార్కులు సాధించారన్నారు. -
స్థానిక స్వపరిపాలనకే పంచాయతీరాజ్
ఆలమూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల అభ్యున్నతి, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా 1992లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. భారత దేశంలో ఈచట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమితి వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి తొలి స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అయిన గ్రామ పంచాయతీలకు తోడుగా మూడంచెల విధానంలో మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. అలాగే 2009 లో మరోసారి జరిపిన 110వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ పితామహుడు బలవంత్రాజ్ మెహతా కమిటీ సిఫారసుల మేరకు ఆధునిక పంచాయతీరాజ్ వ్యవస్థకు తిరిగి రూపకల్పన జరిగింది. రాజ్యాంగ సవరణ ద్వారా రూపొందించిన పంచాయతీరాజ్ చట్ట నియమావళి ఆధారంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు విధులు నిర్వహిస్తూ గ్రామీణ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి మూడంచెల పద్ధతి జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు చేస్తున్న మూడంచెల పద్ధతి ప్రకారం విధుల నిర్వహణలో స్పష్టమైన విధానం ఉంటుంది. జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందే నిధులను మండల ప్రజా పరిషత్‌కు జిల్లా పరిషత్ కేటాయిస్తుంది, అలాగే మండల స్థాయిలో నిర్ణయించే బడ్జెట్‌ను జిల్లా పరిషత్ ఆమోదించి ఆ మేరకు నిధులను కేటాయిస్తుంది. మండల ప్రజా పరిషత్‌కు ఏవిధమైన పన్నులు విధించే అవకాశం లేనందున జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను మాత్రమే గ్రామ పంచాయతీలకు కేటాయిస్తుంది. ఇక గ్రామ పంచాయతీలైతే స్వయంగా నిధులను సమకూర్చుకోవడంతో పాటు మండల, జిల్లా పరిషత్ కేటాయించే నిధులతో గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. గ్రామీణ ప్రజల పౌర సౌకర్యాలు కల్పించడం, ప్రజా హక్కులకు భంగం వాటిల్లకుండా పరిరక్షించడం పంచాయతీరాజ్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. వ్యవస్థల విధుల నిర్వహణపై స్పష్టత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం -
ఫొటో స్డూడియోలే వీరి టార్గెట్
దేవరపల్లి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, ఫొటో స్టూడియోల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను దేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యుల్లో ఒకరు మహిళ కావడం విశేషం. దేవరపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ బి.నాగేశ్వర్ నాయక్ ఆ వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన షేక్ సమీర్ (పైజల్), విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన అల్లాడి నాగమణికంఠ ఈశ్వర్ (మణి), తెలంగాణలోని కోదాడ మండలానికి చెందిన నాగదాసరి ఒమెసిన్మస్(సిమ్), చిలకలూరిపేటకు చెందిన రామిశెట్టి దేవీ ప్రసాద్, కోదాడకు చెందిన మునగంటి గోపి, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన కొల్లి వెంకట సూర్యసత్యమణిసాయి ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడలో కారును అద్దెకు తీసుకుని దొంగతనాలకు ఉపయోగిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దేవరపల్లి మెయిన్ రోడ్డులోని ఆర్కే డిజిటల్ స్టూడియోలో, నిడదవోలులోని రెండు ఫొటో స్టూడియోల్లో దొంగతనం చేశారు. రెండుచోట్లా కెమెరాలు, కంప్యూటర్ పరికరాలు, రెండు హార్డ్ డిస్కులు, ప్రింటర్ దొంగిలించారు. ఈ చోరీలపై దేవరపల్లి, నిడదవోలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అద్దె కారులో రెక్కీ.. ముఠా సభ్యులందరూ ఒక కారును అద్దెకు తీసుకుని దాని నంబర్ ప్లేటు తీసేస్తారు. దొంగతనం చేయబోయే ప్రదేశంలో రెక్కీ నిర్వహిస్తారు. కొన్ని షాపులు, ఇళ్లను ఎంపిక చేసుకుని రాత్రి సమయంలో ఇనుపరాడ్డులను ఉపయోగించి షట్టర్లు, తాళాలను బద్దలుకొట్టి దొంగతనం చేస్తారు. దేవరపల్లిలో జరిగిన దొంగతనానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా బుధవారం ఎస్సై వి.సుబ్రహ్మణ్యం స్థానిక డైమండ్ జంక్షన్ వద్ద ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.5 లక్షల విలువైన కెమెరాలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టుకు హాజరుపర్చిచారు. దొంగతనాలకు ఉపయోగిస్తున్న కారు, బుల్లెట్ వాహనాన్ని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో గోపాలపురం ఎస్సై కె.సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భీమరాజు, కానిస్టేబుళ్లు బాలచంద్రరావు, సలీం, పండు, దుర్గారావు, గోపాలపురం స్టేషన్ సిబ్బంది కుమార స్వామి, గోవింద్, నాగేంద్ర, వెంకట్ ఎంతో సహకరించారన్నారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్టు తెలిపారు. విలువైన కెమెరాల చోరీ ఆరుగురు ముఠా సభ్యుల్లో ఒకరు మహిళ అరెస్టు చేసిన దేవరపల్లి పోలీసులు -
పుస్తకం.. మహోన్నతం
● అక్షరమే అసలైన సంపద ● సమాజానికి వెలుగునిచ్చే దీపం ● పుస్తక రచనలో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక స్థానం ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సంతోషంగా ఉంది చదువుకునే రోజుల్లో సామాజిక ఉద్యమాలకు ఆకర్షితుడినై విద్యార్థి, యువజన సంఘాల్లో పని చేశాను. గత కాలపు ఉద్యమాలను గ్రంథస్తం చేయాలన్న నా కోరిక ఇటీవల తీరింది.‘నవ సమాజం కోసం’ పేరుతో నేను రాసిన పుస్తకం ఈ ఏడాది మార్చి 9న కాకినాడలో ఆవిష్కృతమై ఆదరణ పొందింది. – దువ్వా శేషబాబ్జీ, కాకినాడ కపిలేశ్వరపురం: సమాజానికి వెలుగునిచ్చేది అక్షరం. అది పుస్తకాల రూపంలో ప్రజల చెంతనే ఉంటుంది. అలాంటి పుస్తకాలు రూపొందించడానికి ఎందరో మహానుభావులు అక్షర సేద్యం చేస్తున్నారు. సమాజంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించడానికి కృషి చేస్తున్నారు. పుస్తక రచనలో దారులెన్ని ఉన్నా సామాజిక ప్రయోజనమే అంతిమ లక్ష్యం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక పుస్తక ప్రచురణా సంస్థలు, రచయితలు, కవులు సామాజిక ఉద్యమకారులు అలనాటి కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మారుతున్న మానవ సమాజ పోకడలకు తమ రచనల ద్వారా అద్దంపడుతున్నారు. సమాజ హితం కోరుతూ సాగుతున్న పుస్తక ప్రచురణ, రచన తదితర అంశాలపై నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పుస్తక దినోత్సవ నేపథ్యం ప్రపంచంలో సామాజిక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో యునెస్కో స్పందించి పుస్తక పఠన ఆవశ్యకతను గుర్తించాలని ప్రపంచ దేశాలకు సూచించింది. కనుమరుగవుతున్న పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిష్యత్తు తరాలకు జ్ఞానాన్ని పంచేందుకు యునెస్కో ఏప్రిల్ 23 ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున సదస్సులు, సమావేశాలు, పరిశోధనాపరమైన అంశాలపై చర్చలు చేపట్టాలని సూచించింది. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక స్థానం రాజమహేంద్రవరం కేంద్రంగా సాహితీ సేవలు విస్తారంగా సాగేవి. సమాజంలో దుర్మార్గాలు పెరిగిపోయినప్పుడల్లా పుస్తకమే ప్రజలను మేల్కొలిపేది. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ‘నీతి కథామంజరి’ పేరుతో 158 కథలను సంకలనం చేస్తూ రాసిన పుస్తకం సీ్త్రల సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఆనాటి నుంచి నేటికీ జిల్లాలో సాహిత్య కృషి కొనసాగుతోంది. రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం కొత్తపేట, అమలాపురం, యానాం ప్రాంతాల్లో పలు సాహితీ సంస్థలు, స్మారక సంస్థల ద్వారా పుస్తక ప్రచురణ, రచన, పఠన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశోధనలకు చేదోడు చారిత్రక, సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేవారికి జిల్లాలోని రూపుదిద్దుకున్న పుస్తకాలు దోహదపడతాయి. రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయం ఎంతో చారిత్రాత్మకమైంది. హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠంలో సుమారు 50 వేల అరుదైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయం ఉంది. కపిలేశ్వరపురం జమీందారీ దివాణం గ్రంథాలయంలోని పుస్తకాలను అధ్యయనం చేసిన పలువురు పీహెచ్డీ పట్టాలను పొందారు. సాంకేతికత తోడుగా.. పెరిగిన సాంకేతికతను పుస్తక పఠనం పెంచడానికి వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక మంది సామాజిక మాధ్యమాల్లో సాహిత్య గ్రూపులను ఏర్పాటు చేసి పుస్తకాల్లోని అంశాలపై చర్చలు జరుపుతున్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు 250 మందితో పుస్తకం పేరుతో గ్రూపు ఏర్పాటు చేసి పుస్తకాలపై చర్చిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్టణం కేంద్రంగా నడుస్తున్న మంచి పుస్తకం వాట్సాప్ గ్రూపుల్లో మన జిల్లాకు చెందిన అనేక మంది భాగస్వాములయ్యారు. పుస్తక రచన భార్య జ్ఞాపకార్థం మహనీయుల కృషికి అక్షర రూపం పలు రచనలు పుస్తకాన్ని రాయడమంటే పెద్ద చదువులు చదవాలనో, గ్రంథాలయాల్లో గంటల తరబడి గడపాలనో అనుకొంటే పొరబాటే. తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు అక్షర రూపం ఇస్తే చాలు. అలాంటి వారిలో రాజమహేంద్రవరానికి చెందిన దేవగుప్తపు పేరలింగం ఒకరు. ఆయన 13 పుస్తకాలను రచించగా వాటిలో కొన్నింటిని స్వతంత్రంగా ప్రచురించారు. తన సైకిల్‌కు ‘హేతువాద చైతన్య రథం’ అనే పేరుపెట్టి మూడు దశాబ్దాలకు పైగా సైన్స్, సామాజిక భావాలను ప్రచారం చేశారు. 82 ఏళ్ల వయసులో 2014 ఏప్రిల్ 14న తుదిశ్వాస విడిచే వరకూ తన ఇంటినే సైన్స్ గ్రంథాలయంగా నడిపారు. కవితా రావు ఇంగ్లిష్ రచన లేడీ డాక్టర్స్ పుస్తకాన్ని కాకినాడకు చెందిన డాక్టర్ పీఎస్ ప్రకాశరావు అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆనందిబాయి, కాదంబినీ గంగూలీ, రుక్మాబాయి రౌత్, హైమవతి సేన్, ముత్తు లక్ష్మీరెడ్డి, మేరీ పూనాన్ లూకోస్.. వైద్య వృత్తిని చేపట్టే క్రమంలో ఎదుర్కొన్న సామాజిక, సాహసోపేతమైన ఘటనలెన్నో ఆలోచింపజేస్తాయి. ఈ నెలలో ‘పరిచయాలు–సమీక్షలు’ పేరుతో మరో పుస్తకాన్ని తీసుకొచ్చారు. కాకినాడకు చెందిన రావు కృష్ణారావు మానవ సమాజ పరిణామ క్రమాన్ని నిర్దేశించే చలన సూత్రాలను విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. రామచంద్రపురంలోని డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి నిర్వాహకుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ ప్రోత్సాహంతో ఈయన రచనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఆధునిక బేతాళ కథలు, బతుకు పోరు కథా సంకలనం పుస్తకాలు తెలుగు పాఠకులను ఆలోచింపజేశాయి. కాకినాడ జిల్లా జగన్నాథగిరికి చెందిన ప్రజా నాట్యమండలి నాటక కళాకారుడు పోలిశెట్టి రామకృష్ణ తన భార్య జ్ఞాపకార్థం ఏడాదికో పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి పేరుతో సొంత ఖర్చులతో గత కాలపు ప్రఖ్యాత పుస్తకాలను ఆధునిక సాంకేతికతతో అచ్చు వేయించి ఉచితంగా అందజేస్తున్నారు. -
తాళ్లపూడిలో మృత శిశువు కలకలం
తాళ్లపూడి: మండల కేంద్రమైన తాళ్లపూడిలోని పుష్కరాల రేవులో మంగళవారం మృత శిశువు ఘటన కలకలం రేపింది. సుమారు 8 నెలలున్న గర్భస్థ మృత శిశువును చిన్న వస్త్రంలో చుట్టి అక్కడ పడవేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొవ్వూరు రూరల్ సీఐ బి.విజయబాబు, ఏఎస్సై చక్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ముధై తదితరులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. మృత శిశువును శవ పరీక్ష కోసం కొవ్వూరు ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అలాగే గ్రామంలోని ఆస్పత్రుల్లో ప్రసవాలకు సంబంధించిన వివరాలు సేకరించి, మృత శిశువు ఆచూకీ గుర్తించారు. గ్రామంలోని అశోక హాస్పిటల్‌కు రెండు రోజుల క్రితం గోపాలపురం మండలం ప్రగడపల్లికి చెందిన రాసపోతుల శ్రీనివాసు, దేవీ స్వప్న అనే దంపతులు వచ్చారు. దేవీ స్వప్నకు నెలలు నిండడంతో డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు జరిపారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెందడంతో ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆ బిడ్డను తామే ఖననం చేసుకుంటామని చెప్పడంతో శ్రీనివాసుకు అప్పగించారు. కానీ మృతశిశువును ఎక్కడ ఖననం చేయాలో తెలియక పుష్కరాలరేవు వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. -
ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తా
పిఠాపురం: ఐపీఎస్ అధికారిగా సమాజ సేవ చేస్తానని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 94 ర్యాంకర్ చెక్క స్నేహిత్ తెలిపారు. పిఠాపురానికి చెందిన ఈ యువకుడి ఘనతను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా స్నేహిత్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి తనకు ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉండేదని, అదే లక్ష్యంగా చదువుకున్నానన్నారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. తల్లి మాధురి కుమునిది గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారని, తండ్రి వెంకట్ చిన్న వ్యాపారవేత్త అని తెలిపారు. కాగా..స్నేహిత్ ఐదో తరగతి వరకు పిఠాపురంలోని ఆదర్శ విద్యాలయలో చదువుకున్నాడు. ఆరో తరగతి నుండి ఇంటర్ వరకూ గుంటూరులోని భాష్యం విద్యాసంస్థల్లో చదివాడు. ఎంసెట్‌లో 31వ ర్యాంకు సాధించి, గుజరాత్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా ఉత్తీర్ణుడయ్యాడు. సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టుగా మ్యాథ్య్ తీసుకున్నాడు. ఢిల్లీలో కోచింగ్ తీసుకోవడంతో పాటు సొంతంగా చదివి సివిల్స్‌లో 94 ర్యాంకు సాధించాడు. చిన్ననాటి నుంచే చదువులో మేటికొవ్వూరు: నిడదవోలు విద్యుత్ డివిజన్ పరిధిలో కొవ్వూరు టౌన్ ఏఈ(డీ–1)గా పనిచేస్తున్న దొమ్మేటి జగదీశ్వరరావు కుమారుడు దొమ్మేటి వినయ్ 2024 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీస్‌లో 274వ ర్యాంకు సాధించాడు. జగదీశ్వరరావు రెండో కుమారుడు అయిన వినయ్ చిన్ననాటి నుంచే చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు. పదో తరగతిలో పదికి 9.8 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 1000కి 986 మార్కులు సాధించాడు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో నిట్‌లో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) పూర్తి చేసి, పదికి 8.8 శాతం మార్కులు దక్కించుకున్నాడు. యూపీఎస్సీలో మూడోసారి ప్రయత్నించి 274వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఇదంతా తన తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో సాధించానని వినయ్ చెబుతున్నాడు. జగదీశ్వరరావు మొదటి కుమారుడు సాయి సంతోష్ ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వినయ్ తల్లి దుర్గ గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం యూపీఎస్సీ 94 ర్యాంకర్ స్నేహిత్ -
చేబ్రోలులో వ్యాధుల విజృంభణ
● వాంతులు, విరేచనాలతో పలువురికి అస్వస్థత ● ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు ● గ్రామంలో వైద్య సిబ్బంది సర్వే పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రోగాలు ప్రబలి పలువురు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కీళ్ల నొప్పులు, రొంప, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేబ్రోలు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు గొల్లప్రోలు, పిఠాపురాల్లోని ప్రైవేటు ఆస్పత్రులలో వీరందరూ చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి బాధితులకు చికిత్స అందిస్తున్నామని పీహెచ్సీ వైద్యుడు జగదీష్ తెలిపారు. కారణమేమిటో! ఇటీవల పక్క మండలంలో జరిగిన ఒక శుభ కార్యానికి వెళ్లిన కొందరు అస్వస్థతకు గురయ్యారు. అలాగే గ్రామంలో జరిగిన వివిధ శుభకార్యాలలో భోజనాలు చేసిన వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఫుడ్ పాయిజన్ కావడమే దీనికి కారణమని భావిస్తున్నారు. స్థానికంగా వేసిన కొత్త బోరులోని నీరు తాగడం వల్ల వ్యాధులు ప్రబలాయని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఆ నీటికి పరీక్షలు చేయించిన వైద్యాధికారులు, నీటి వల్ల కాదని చెబుతున్నారు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల ఇలా జరిగి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. గ్రామంలో సుమారు వంద మంది అనారోగ్యానికి గురైనట్టు గుర్తించామని వైద్య సిబ్బంది చెబుతుండగా, వారి సంఖ్య మరో వంద వరకూ ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. వాతావరణ మార్పులు, ఎండల తీవ్రత వల్ల కూడా ఇలా రోగాలు విజృంభించే అవకాశం ఉందని వైద్యాధికారులు అన్నారు. కాగా.. గ్రామంలో వ్యాధుల విజృంభణపై జెడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు వైద్యులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
దేవరపల్లి: ఉపాధి పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. దేవరపల్లి మండలం బందపురంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 45 మంది కూలీలు బందపురం–గొల్లగూడెం రోడ్డులో నీటి బోదెలు తవ్వుతున్నారు. ఆ సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగలు మూకుమ్మడిగా వారిపై దాడి చేశారు. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో సుంకర గంగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు చికిత్స చేశారు. గంగరాజు కోలుకున్నాడని, ఎటువంటి ప్రమాదం లేదని ఏపీఏ ఆర్వీ శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ బార్ అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం కాకినాడ లీగల్: కాకినాడ బార్ అసోసియేషన్ 2025–26 సంవత్సరం ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. అనంతరం అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏలూరి సుబ్రహ్మణం విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా చెక్కపల్లి వీరభద్రరావు (చంటి), ఉపాధ్యక్షుడిగా పెన్మెత్స రామచంద్రరాజు, జాయింట్ సెక్రటరీగా బండి నరేంద్ర, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా జోకా వీఎస్ విజయకుమార్, లైబ్రరీ సెక్రటరీగా మేడపాటి రామారెడ్డి, కోశాధికారిగా కోకా వెంకట కృష్ణారావు, లేడీస్ రిప్రజెంటీవ్‌గా జి.దివ్య శ్రీవిద్య, సీనియర్ కమిటీ మెంబర్‌గా నక్కా సంజీవ్ కుమార్, జూనియర్ కమిటీ సభ్యులుగా మర్ల ప్రవల్లిక, గుత్తుల మంగరాజు, షేక్ ప్రేమ్ నజీర్, దుళ్ల నాగబాబు విజయం సాధించారు. మొత్తం 1,160 ఓట్లకు గాను 1,013 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూపర్ సీనియర్ కమిటీ మెంబర్‌గా వేగుళ్ల వెంకట రమణమూర్తి, మహిళా కమిటీ మెంబర్‌గా కె.శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలరించిన శ్రీ ప్రకాష్ గస్టో కార్యక్రమంబాలాజీచెరువు (కాకినాడ): స్థానిక దంటు కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ గస్టో (థియేటరీ ఆర్ట్స్) కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ, పెద్దాపురం స్కూళ్ల బ్రాంచ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు రోజుల పాటు ఆరు రంగస్థల నాటికలను మూడు భాషలలో ప్రదర్శించనున్నారు. గస్టో ద్వారా భాష, నాటకం, కవిత్వం, సాహిత్యం తదితర వాటిపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేశామని పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ ప్రకాష్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, థియేటర్ ప్రాక్టీషనర్ అమలా రాయ్, ఐసీసీఆర్ డైరెక్టర్ సంజయ్ హాజరయ్యారు. విద్యతో పాటు పలు కళల ప్రాధాన్యత తెలుపుతూ, వాటిని విద్యలో భాగం చేయడం సంతోషమని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పెరవలి: పెళ్లి విషయంలో భార్య, కుమార్తె తన మాట వినడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ముక్కామల గ్రామానికి చెందిన కమాడి ధర్మారావు (40)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని ఇటీవల ఓ సంబంధం తీసుకువచ్చాడు. అయితే భార్య, కుమార్తెలకు ఆ సంబంధం నచ్చలేదు. దీంతో నెల రోజులుగా వారికి నచ్చచెబుతూ వస్తున్నాడు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఈ నెల 20వ తేదీ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య కమాడి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్యాణము చేతము రారండీ..
ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలకు సన్నాహాలు ఫ నేడు దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఫ పలు అంశాలపై చర్చ అన్నవరం: సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల దిశగా అధికారులు ఎట్టకేలకు అడుగులు వేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో రత్నగిరిపై బుధవారం సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నారు. కల్యాణోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపై ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. పెద్దాపురం ఆర్డీఓ రమణి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొంటారు. ఉత్సవాలకు దేవస్థానం తరఫున చేపట్టే ఏర్పాట్లను ఈఓ ఈ సమావేశంలో వివరించనున్నారు. వీటిపై దృష్టి పెడితే మేలు ఫ వచ్చే నెల 7 నుంచి 13వ తేదీ వరకూ కల్యాణోత్సవాలు జరగనున్నాయి. 8వ తేదీ రాత్రి 9.30 గంటలకు సత్యదేవుని దివ్యకల్యాణం నిర్వహిస్తారు. దీనికి 10 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశముంది. అయితే, స్వామివారి వార్షిక కల్యాణ వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డులో సుమారు 2 వేల మంది మాత్రమే తిలకించే అవకాశం ఉంది. ఆ షెడ్డుకు ఇరువైపులా ఉన్న ఆవరణలో స్వామివారి కల్యాణాన్ని తిలకించేలా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తే మిగిలిన భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఫ భక్తులకు మంచినీరు, కల్యాణానంతరం అన్నదాన పథకంలో ఉచిత ఫలహారం రెండుమూడు చోట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఫలహారం ప్యాకెట్లు రూపంలో పంపిణీ చేస్తే భక్తులు వాటిని తీసుకుని వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఫ కల్యాణానంతరం ఉచిత ప్రసాదం, తలంబ్రాలు ఒకేచోట మాత్రమే పంపిణీ చేస్తూండటంతో ఏటా భక్తుల తోపులాట జరుగుతోంది. అలా కాకుండా స్వామివారి సర్క్యులర్ మండపంతో పాటు మరో రెండుచోట్ల పంపిణీ చేయడం మేలు. ఫ భక్తులు భారీగా వచ్చే అవకాశమున్నందున వారిని నియంత్రించేందుకు సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఫ సత్యదేవుని దివ్యకల్యాణం జరిగే మే 8న ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి. చిన్న, ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాటిని సాధ్యమైనంత వరకూ కొండ దిగువనే నిలిపివేయాలి. భక్తులను కొండ మీదకు తరలించేందుకు సుమారు 20 బస్సులు వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. ఫ పశ్చిమ, తూర్పు రాజగోపురాల పరిసరాల్లోని పార్కింగ్ స్థలాల వద్ద భక్తుల సౌకర్యార్థం ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. సుమారు వంద మంది అదనపు సిబ్బందితో పారిశుధ్య చర్యలు చేపట్టాలి. ఫ కల్యాణోత్సవాలు జరిగే ఏడు రోజులూ దేవస్థానానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఫ ముందు జాగ్రత్తగా అగ్నిమాపక శకటంతో సిబ్బంది కల్యాణం రోజున రత్నగిరిపై ఉండాలి. ఫ ఉత్సవాల చివరి రోజైన మే 13న సత్యదేవుని శ్రీపుష్పయాగం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం మహిళలకు రవికెల వస్త్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో ఏటా గందరగోళం ఏర్పడుతోంది. దీని నివారణకు పక్కా చర్యలు చేపట్టాలి. ఫ ఇతర పెద్ద దేవస్థానాల్లో జరిగే ఉత్సవాల మాదిరిగానే సత్యదేవుని కల్యాణోత్సవాలకు కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌ను నియమిస్తే మేలు. మద్యం దుకాణాలు బంద్ చేయాలి గతంలో అన్నవరం మెయిన్ రోడ్డులో పాత బస్టాండ్ సమీపాన ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేది. ఈ ఏడాది బస్ కాంప్లెక్స్ వెళ్లే దారిలో మరో మద్యం దుకాణం కూడా ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ముందు నుంచే రథోత్సవం జరుగుతుంది. అందువలన కల్యాణోత్సవాలు జరిగే ఏడు రోజులూ అన్నవరంలో పంపా సత్రం వద్ద ఉన్న మద్యం దుకాణాలను 48 గంటల ముందు నుంచే బంద్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలి. రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లుకల్యాణోత్సవాల సందర్భంగా మే 7 నుంచి 11వ తేదీ వరకూ సత్యదేవుని వివిధ వాహనాల్లో కొండ దిగువన ఊరేగిస్తారు. ఈ వాహనాల్లో రూ.1.08 కోట్లతో రూపొందించిన భారీ టేకు రథం చాలా పెద్దది. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ రథంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. దీనిని తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. రథాన్ని లాగేందుకు పోటీ పడే అవకాశం ఉంటుంది. ఆ రోజు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి. రథం లాగేందుకు అనుభవం కలిగిన నిపుణులను నియమించాలి. గత ఏడాది రథోత్సవం నాడు అన్నవరంలో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలా కాకుండా ఆ రోడ్డు వరకూ మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేసేలా, సాధ్యమైనంత త్వరగా రథోత్సవం జరిగేలా చర్యలు తీసుకోవాలి. జలగండం తప్పినట్టే.. పంపా జలాశయం గత నెలలో డెడ్ స్టోరేజీకి చేరినప్పటికీ ఈ నెలలో కురిసిన వర్షాలతో నీటిమట్టం 82.5 అడుగులకు చేరింది. దీంతో, కల్యాణోత్సవాల వరకూ నీటి సమస్య దాదాపు పరిష్కారమైనట్టే. అయితే, ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. దీంతోపాటు మే 12న స్వామివారి చక్రస్నానం పంపా జలాశయంలో నిర్వహించాలి. ఉత్సవాలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈలోగా ఎండలు తీవ్రమైతే ఉన్న నీరు కొంత ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అందువలన గతంలో కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించిన విధంగా ఏలేరు నుంచి పంపాకు నీటిని తరలించడం మేలు. -
రాష్ట్ర మహిళా విభాగంలో ఇద్దరికి చోటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరికి రాష్ట్ర మహిళా విభాగంలో చోటు లభించింది. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన జమ్మలమడక నాగమణిని రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా, సిటీ నియోజకవర్గానికి చెందిన కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కష్టపడి పని చేసే వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చిన అధినేత జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పదవులు పొందిన చంద్రకళాదీప్తి, నాగమణికి ఆయన అభినందనలు తెలిపారు. విద్యార్థిని చెంపపై కొట్టిన టీచర్ అమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలోని ఐ మైండ్స్ స్కూల్లో నాలు గో తరగతి చదువుతున్న గని శ్రీమాణిక్యాన్ అనే విద్యార్థిని చెంపపై ఆ స్కూలు టీచర్ కొట్టిన విషయం మంగళవారం వివాదంగా మారింది. తమ అమ్మాయి స్కూల్లో కంప్యూటర్ పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో చెంపపై టీచర్ బలంగా కొ ట్టిందని నల్లా వీధికి చెందిన విద్యార్థిని తండ్రి యె రుబండి సురేష్ వాపోయారు. స్కూల్‌కు వెళ్లి అడిగితే టీసీ ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారే తప్ప.. ఎందుకు అంతలా కొట్టాల్సి వచ్చిందో చెప్పడం లేద న్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. పట్టణ సీఐ పి.వీరబాబు మాట్లాడుతూ విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు స్కూలు యాజమాన్యం, టీచర్‌ను బుధవారం ఉదయం పిలిచి విచారణ చేస్తామన్నారు. -
పతాక స్థాయికి..
అరాచకం..తుని: కూటమి నేతల అరాచకం తునిలో పతాక స్థాయికి చేరింది. తోటి దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆ కుటుంబంపై ఓ టీడీపీ నాయకుడు, తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల తరఫున నిలవాల్సిన పోలీసులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి.. నిందితులను అరెస్టు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తూండటంతో.. ఓ దళిత కుటుంబం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందోనని క్షణక్షణం భయాందోళనకు గురవుతోంది. బాధితుల కథనం ప్రకారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలివీ.. తుని పట్టణం 4వ వార్డు కొండవారిపేటకు చెందిన ఓ దళిత మహిళపై ఫిబ్రవరి 19న టీడీపీ నాయకుడు లావేటి సతీష్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన స్థానిక ఆరుగుల వారి వీధికి చెందిన వైఎస్సార్ సీపీ గృహ సారథి ఆరుగుల గంగరాజు, ఆయన భార్య వాణీకుమారి తదితరులు అతడిని అడ్డుకున్నారు. దీంతో, సతీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై అదే రోజు రాత్రి బాధితులు తుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో స్థానికులతో కలిసి బాధిత మహిళతో పాటు ఆరుగుల గంగరాజు కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 20న కాకినాడ వెళ్లి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్, అనుచరులను అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలు బలంగా ఉన్నందున ఎక్కడ ఇరుక్కుంటామోననే భయంతో.. గంగరాజు కుటుంబాన్ని సతీష్, అనుచరులు పలుసార్లు హెచ్చరించారు. దళిత మహిళకు అండగా నిలిచారన్న కోపంతో 20 మంది అనుచరులతో కలిసి సతీష్ ఈ నెల 6న గంగరాజు కుటుంబంపై దాడి చేశారు. కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదించారు. అయినప్పటికీ మాట వినడం లేదన్న అక్కసుతో ఈ నెల 20వ తేదీ రాత్రి సతీష్ మరోసారి తన అనుచరులతో కలిసి గంగరాజు ఇంటికి వెళ్లాడు. ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి, వారిని గాయపరిచారు. ఈ దాడిలో గంగరాజు చేయి విరిగిపోయింది. తలపై బలమైన గాయమైంది. అతడిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. తమకు లావేటి సతీష్, కె.డేవిడ్‌రాజు, ఆరుగుల నవీన్, ఆరుగుల దుర్గాప్రసాద్, కాపారపు మనోజ్, కాపారపు రాజు, కుందేటి జాన్, ఎగ్గాడ బాల ఏసు, గంపల గంగబాబు, మామిడి వినాయక్, గుండుబిల్లి నాగేశ్వరరావు, కండవల్లి అన్నపూర్ణ, కేసరపు నాగమణి తదితరుల నుంచి ప్రాణహాని ఉందని గంగరాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫ గతంలో దళిత మహిళపై లైంగిక దాడికి టీడీపీ నాయకుడి యత్నం ఫ ప్రతిఘటించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు ఫ సాక్ష్యంగా నిలిచిన కుటుంబంపై టీడీపీ గూండాల దాడులు ఫ పోలీసుల ప్రేక్షకపాత్ర ఫ బాధితులకు మాజీ మంత్రి రాజా పరామర్శ నిందితులను అరెస్టు చేయాలి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, అంబేడ్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కులను టీడీపీ నేతలు కాలరాస్తూంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. టీడీపీ నాయకుడు సతీష్, అతడి అనుచరుల దాడిలో గాయపడిన గంగరాజు, వాణీకుమారిలను మంగళవారం ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దళిత మహిళపై టీడీపీ నాయకుడు లావేటి సతీష్ లైంగిక దాడి యత్నానికి పాల్పడిన ఘటనలో సాక్షులుగా ఉన్న గంగరాజు, వాణీకుమారిపై రెండుసార్లు దాడికి ఒడిగట్టారని అన్నారు. ఈ దాడిపై తుని పట్టణ పోలీసులు కేసు నమోదు చేయలేదని, జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను ఆశ్రయించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారని, అయితే, నిందితులను అరెస్ట్ చేయలేదని చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాలను తుని పోలీసులు పట్టించుకోనందువల్లనే రెండుసార్లు దాడికి ఒడిగట్టారని అన్నారు. అధికార పార్టీకి చెందిన తమపై సాక్ష్యం చెప్తే చంపేస్తామంటూ లావేటి సతీష్ హెచ్చరించడంతో పాటు అనుచరులతో గంగరాజు ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా పోలీసులు నిరక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో జైల్లో ఉండాల్సిన నిందితులు బయట తిరుగుతున్నారని, వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గానికి చెందిన బాధితులపై జరిగిన దాడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, కఠినమైన సెక్షన్లు పెట్టాలని అన్నారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గమనించాలని హితవు పలికారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు రాజా విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా దాడులు జరిగితే ప్రతిస్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అన్నవరం శ్రీను, రేలంగి రమణాగౌడ్, లగుడు శ్రీనివాస్, వేముల రాజబాబు, నక్కా జాన్ ఆనంద్, మీలా బుజ్జి, కౌన్సిలర్లు కర్రి సత్య జగదీష్, చింతల సునీత, మాజీ కౌన్సిలర్ చితకల రత్నకుమారి, కోరుమిల్లి లలిత, మర్రా దాసు, కాసే కపిల్, చింతల పండు తదితరులు పాల్గొన్నారు. -
సెట్ చేసుకోవాలిలా..
ఫ ఏపీ ఈఏపీ సెట్‌కు 24 చివరి తేదీ ఫ ఇప్పటికే 3,37,437 దరఖాస్తులు ఫ వచ్చే నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఫ 21 నుంచి 27 వరకూ ఇంజినీరింగ్ కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు చదవడం ద్వారా జీవితంలో స్థిరపడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఈ కోర్సులలో చేరేందుకు విద్యార్థులు, వారిని చదివించేందుకు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహపడుతూంటారు. ఈ కోర్సులలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్లైన్ దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌కు 2,73,010 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీకి 87,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్మీడియెట్ పాసై, ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు పొందిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఏపీ ఈఏపీ సెట్–2025 ఎంపిక చేసుకోవాలి. అందులో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, సూచనల మాన్యువల్ వంటి పూర్తి వివరాలు పొందవచ్చు. ధ్రువపత్రాలు తప్పనిసరి దరఖాస్తు సమయంలో వివిధ కేటగిరీల విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ (పీహెచ్) కేటగిరీల్లో తమకు సంబంధించిన వాటిని ఆన్లైన్ అప్లికేషన్లో సెల క్ట్ చేయాలి. అలాగే, సంబంధిత ధ్రు వపత్రం నంబరు నమో దు చేయాలి. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నంబరు సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 1వ తేదీ తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష కేంద్రం ఎంచుకోవాలిలా.. విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకూ ఏ విద్యాసంస్థల్లో, ఏ ఊరిలో చదివారనే వివరాలను ఆయా విద్యా సంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివరిలో ఈఏపీ సెట్ ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలి. ఈవిధంగా ఐదు ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ, అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతరత్రా కారణాలతో ఆ కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాల్లో కేంద్రాన్ని కేటాయిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి, సబ్మిట్ చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్‌తో పాటు ఆన్లైన్ ప్రింటవుట్ కాపీపై ఫొటో అతికించి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. దరఖాస్తు చేసుకోవాలి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈఏపీ సెట్‌కు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ తేదీ దాటితే ఫైన్‌తో చెల్లించాలి. ఇప్పటి వరకూ ఇంజినీరింగ్ విభాగంలో 2,63,708 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగంలో 72,966 మంది, రెండు విభాగాలకు కలిపి 763 మంది దరఖాస్తు చేసుకున్నారు. – వీవీ సుబ్బారావు, ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ దరఖాస్తు ఇలా.. ఈఏపీ సెట్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయిన తరువాత ఐదు దశల్లో ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. స్టెప్–1 మొదలు స్టెప్–5 వరకూ ఐదు దశల్లో కనిపించే ట్యాబ్‌లను వరుస క్రమంలో క్లిక్ చేస్తూ, అడిగిన వివరాలు నమోదు చేయాలి. స్టెప్–1: ఎలిజిబులిటీ క్రైటేరియా అండ్ ఫీజు పేమెంట్‌కు లాగిన్ అయి సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు నమోదు చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ ఇవ్వాలి. దీంతో పాటు ఇంజినీరింగ్–ఫార్మసీ, అగ్రికల్చర్–ఫార్మసీ, బోత్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్ చేసి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. స్టెప్–2: నో యువర్ పేమెంట్ స్టేటస్‌పై క్లిక్ చేసి, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. అనంతరం చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లలో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవడంతో స్టెప్–2 ప్రక్రియ పూర్తవుతుంది. స్టెప్–3: ఫిల్ అప్లికేషన్లో పేమెంట్ చేసిన ఐడీతో పాటు సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. స్టెప్–4: ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్‌పై క్లిక్ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు. స్టెప్–5: ఇక్కడ క్లిక్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్, పుట్టిన తేదీ వివరాలు.. ఈఏపీ సెట్ హాల్ టికెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో కీలకంగా మారుతాయి. -
చెత్త ట్రాక్టర్ టెండర్‌కు ఆమోదం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో చెత్త తరలింపునకు పిలిచిన టెండర్లలో అతి తక్కువగా నెలకు రూ.23,990కి దాఖలైన కొటేషన్‌కు అన్నవరం దేవస్థానం పాలక మండలి సోమవారం ఆమోదం తెలిపింది. చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన పాలక మండలి సమావేశం సోమవారం రత్నగిరిపై జరిగింది. ఈ సమావేశంలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు గత మార్చి నెలలో నెలకు రూ.60 వేలకు ఎటువంటి టెండర్ లేకుండా నామినేషన్ మీద ట్రాక్టర్‌తో చెత్త తొలగించే పనిని ఒకరికి అప్పగించారు. తాను రూ.43 వేలకే చెత్త తరలిస్తానని ఒకరు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. దీనిపై మార్చి 28న రత్నగిరిపై చెత్త వివాదం శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీంతో విధి లేని పరిస్థితిలో అధికారులు చెత్త తరలింపునకు టెండర్ పిలవగా నెలకు రూ.29,990కి లోయెస్ట్ టెండర్ దాఖలైంది. ఫలితంగా దేవస్థానానికి నెలకు రూ.36,010, ఏడాదికి 4,32,120 మేర ఆదా అయింది. దీనిని ట్రస్ట్‌బోర్డు ఆమోదించింది. అలాగే, భక్తులు హుండీల్లో సమర్పించిన చీరలు, పంచెలు, కండువాలను హుండీల ఆదాయం లెక్కింపు రోజునే వేలం వేయాలని తీర్మానించారు. కొండ దిగువన నిర్మిస్తున్న రథశాల నుంచి మెయిన్ రోడ్డుకు 38 అడుగుల పొడవున అప్రోచ్ రోడ్డు, రథశాలకు శాలాహారం నిర్మాణానికి అతి తక్కువకు దాఖలైన టెండర్లకు ఆమోదం తెలిపారు. చైన్నెకి చెందిన పీఎస్ కుమార గురుపరన్, కె.శాంతి దంపతుల ఆర్థిక సహకారంతో సత్యగిరిపై ఆగమ పాఠశాల ఆవరణలో జీఐ ప్రొఫైల్ షీట్ షెడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న అర్చకుల పారితోషికాన్ని నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని నిర్ణయించారు. దేవస్థానం దత్తత తీసుకున్న నాలుగు ఆలయాల్లో కన్సాలిడేటెడ్ పద్ధతిలో పని చేస్తున్న స్వీపర్ల వేతనాల పెంపునకు ఆమోదం తెలిపారు. -
తల్లి ఒడికి చేరిన తనయ
ఫ పరంధామానికి చేరిన శ్రీరాముడు ఫ ముగిసిన ఉత్తరకాండ ప్రవచన సప్తాహం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): చతుర్విధ పురుషార్థ సాధనకు రామాయణాన్ని మించిన కావ్యం లేదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఎన్ని కావ్యాలున్నా, వాటిలో అత్యుత్తమమైనది రామాయణమేనన్నది బ్రహ్మవాక్కు అని చెప్పారు. స్థానిక టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఉత్తరకాండపై వారం రోజులుగా ఆయన నిర్వహిస్తున్న ప్రవచనాలు సోమవారం ముగిశాయి. ముగింపు ప్రవచనంలో రామావతార పరిసమాప్తిని వివరించారు. శ్ఙ్రీగోమతీ నదీ తీరాన రాముడు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో వాల్మీకి మహర్షి ఆనతి మేరకు లవకుశులు రామకథను గానం చేశారు. వారు తన కుమారులేనని రాముడు గుర్తించాడు. సీతపై లోకాపవాదు తొలగించడానికి అశ్వమేధ యాగం జరుగుతున్న తరుణం సరైన సమయమని గుర్తించాడు. ఎందరో రాజులు, మహర్షులు, రాక్షస, వానర వీరులు తరలి వచ్చారు. వారందరి సమక్షాన సీతమ్మ శపథ పూర్వకంగా తన పాతివ్రత్యం నిరూపించాలని ఆయన వాల్మీకి మహర్షిని కోరాడు. మరుసటి రోజు ఉదయం బ్రహ్మదేవుని అనుసరించి వస్తున్న వేదమాతలా, వాల్మీకి మహర్షిని సీతాదేవి అనుసరించి అక్కడికి చేరుకుంది. శ్రీరామా! నా వేలాది సంవత్సరాల తపస్సు మీద ఆన పెట్టి చెబుతున్నాను. సీతాదేవి శుద్ధచరిత, నిష్కళంకశ్రీ అని ఆయన ప్రజల సమక్షంలో రామునితో చెప్పాడు. శ్రీమహర్షీ! సీతాదేవి పాతివ్రత్యం నాకు తెలుసు. లోకాపవాదు తొలగించడానికి నేను ఇటువంటి కోరిక కోరుతున్నానుశ్రీ అని రాముడు బదులిచ్చాడు. శ్రీత్రికరణశుద్ధిగా నేను రాముని తప్ప అన్యుని గురించి తలచకపోయి ఉంటే, భూదేవి నన్ను తనలోకి తీసుకుంటుందిశ్రీ అని సీతమ్మ శపథం చేస్తుంది. సీత మాట పూర్తయిన వెంటనే దివ్య సింహాసనం మీద భూదేవి వచ్చి సీతాదేవిని రసాతలంలోకి తీసుకు వెళ్లింది. శ్రీసాగరం ఆవల ఉన్న సీతాదేవిని తీసుకు వచ్చిన నాకు సీతను వెంటనే అప్పగించకపోతే, ధరాతలాన్ని నాశనం చేస్తానుశ్రీ అని రాముడు ప్రకటించాడు. బ్రహ్మాది దేవతలు రామునితో సాంత్వన వచనాలు పలికి ఆయన నిగ్రహించారుశ్రీశ్రీ అని సామవేదం వివరించారు. శ్ఙ్రీప్రజారంజకంగా 11 వేల సంవత్సరాలు పరిపాలించిన రాముని వద్దకు కాలపురుషుడు వచ్చాడు. ‘నీతో ఒక రహస్యం మాట్లాడాలి. ఈ సమయంలో ఎవరూ మన వద్దకు రారాదు’ అని ఆయన చెబుతాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, ‘మా సమావేశం అయ్యేంత వరకూ ఎవ్వరినీ పంపవద్దు. నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడు నా చేతిలో వధ్యుడు’ అని చెబుతాడు. అయితే, దుర్వాస మహర్షిని ఆపలేకపోవడంతో మహర్షుల సూచనపై లక్ష్మణునికి మరణంతో సమానమైన బహిష్కరణను రాముడు విధించాడు. సీత లేని రాముని ఊహించవచ్చును. ‘లక్ష్మణుడు లేని రాముని ఊహించలేము’ అని సామవేదం అన్నారు. ‘కాలపురుషుని ద్వారా బ్రహ్మ సందేశాన్ని తెలుసుకున్న రాముడు సరయూ నది ద్వారా పరంధామానికి చేరుకున్నాడు. అంతకు ముందే ఆయన బహిష్కరించిన లక్ష్మణుడు పరంధామానికి చేరుకున్నాడు’ అని షణ్ముఖ శర్మ చెప్పారు. ఈ ప్రవచనాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
పీఎంఏవై గృహ సముదాయాల్లో మౌలిక వసతులు
కాకినాడ సిటీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) తొలి విడతలో పేదలకు నిర్మించిన అన్ని కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పన పనులకు చెల్లించాల్సిన బిల్లులు, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల వివరాలతో శాఖల వారీగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని కాలనీల్లో పైపులైన్లు, పూర్తయిన గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని కాలనీల్లో పచ్చదనం పెంపొందించేందుకు డ్వామా ద్వారా మొక్కలు నాటాలన్నారు. అన్ని కాలనీల్లో అంతర్గత విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి, దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ శాఖ ద్వారా జరిపిన భూసేకరణ, డ్వామా, హౌసింగ్ శాఖల ద్వారా చేసిన ల్యాండ్ లెవెలింగ్ పనులకు చెల్లించాల్సిన మొత్తాల మంజురుపై ప్రభుత్వాన్ని కోరేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ పి.వెంకటలక్ష్మి, ఈపీడీసీఎల్ ఎస్ఈ డి.ప్రసాద్, మెప్మా పీడీ ప్రియంవద, ఎల్డీఎం జేఎస్వీఎస్ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ అందజేత
కాకినాడ సిటీ: జిల్లాలో పీహెచ్సీ, యూపీహెచ్సీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన పీహెచ్సీ, యూపీహెచ్సీల సిబ్బందికి నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ సర్టిఫికెట్లను సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సర్టిఫికెట్లు పొందిన వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన సిబ్బంది మరింత నైపుణ్యంతో సేవలు అందించి జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాలు సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సర్టిఫికెట్లు పొందిన వాటిల్లో ఏవీ నగరం పీహెచ్సీ, ప్రకాశం స్ట్రీట్, జెట్ల పెదకాపు స్ట్రీట్ యూపీహెచ్‌సీలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు బెండపూడి–1, జి.మామిడాడ–3, సర్పవరం–3 ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జె.నరసింహ నాయక్, నోడల్ అధికారి డాక్టర్ జి.లక్ష్మి, డీపీఎంఓ డాక్టర్ రవి, భారతి, డాక్టర్లు అర్చన, శ్రీవిద్య, శ్రీనుచంద్ర, ఆయేషా, ప్రత్యూష, టి.ఆశారేఖ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 503 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 503 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేవీ రామలక్ష్మి, సీపీఓ పి.త్రినాథ్, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటికి సత్వరమే సమగ్ర, సంతృప్తికర పరిష్కారాలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 78 ఫిర్యాదులు కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచీ అర్జీదారులు వచ్చి తమ ఫిర్యాదులు సమర్పించారు. వారి సమస్యలను ఎస్పీ బిందుమాధవ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 78 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. గురుకుల ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్ల విడుదల గోకవరం: ఈ నెల 25న జరగనున్న గురుకుల ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు విడుదలైనట్టు కాకినాడ జిల్లా కో ఆర్డినేటర్, భూపతిపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. దీనికి 610 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి కాకినాడలో 3 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పరీక్షకు 910 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీనికి కాకినాడలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్ టికెట్లను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని రవి సూచించారు. -
విద్యార్థి జీవితంలో పుస్తకానికి ప్రాధాన్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తకం ప్రాధాన్యం కలిగి ఉంటుందని ప్రముఖ విద్యావేత్త అమలారాయ్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్‌నగర్ శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో సోమవారం 2024–25 విద్యాసంవత్సరంలో విద్యతో పాటు పలు విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం పేరుతో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమలారాయ్ మాట్లాడుతూ విద్య అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పినది వినడం, పుస్తకాలు పఠనం చేయడం మాత్రమే కాదని, మానసిక వికాసం కోసం ఉల్లాసం కోసం మనం ఆడే ఆటలు, పాటలు అన్నీ విద్యాభ్యాసమేనన్నారు. నేటి కాలంలో విధ్యాభ్యాసం కేవలం మార్కులు, ర్యాంకులు సాధనే ధ్యేయంగా మారిందని, ఇటువంటి సమయంలో విద్యతో పాటు సమానంగా వారికి అభిరుచి ఉన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీ ప్రకాష్ యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పాఠశాల డైరక్టర్ సీహెచ్.విజయ ప్రకాష్ మాట్లాడుతూ విద్యాబోధన కంటే చదువుపై ఆసక్తిని కలిగించడం విద్యాసంస్థల ప్రధమ కర్తవ్యమన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి స్మార్ట్ షేక్స్పియర్, సూపర్ స్పిల్బర్గ్, రాకింగ్ రామానుజన్, పద్యయోధ టైటిల్స్ అందజేశారు. -
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 59 విభాగాలుగా 176 హామీలు ఇచ్చిందన్నారు. వాటిలో పెన్షన్, అరకొర గ్యాస్ పథకం తప్ప మరేమీ అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగులకు, మహిళలకు, కార్మికులకు, వివిధ వృత్తులు, కులాల వారీగా అమలు చేస్తామన్న పథకాలు ఏవీ అమలు చేయలేదని ఆరోపించారు. ముందు దగా, వెనుక దగా, కుడిఎడమల దగాదగా అన్న చందంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉందని ఆందోళనకారులు విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, మైనారిటీ, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు చంద్రబాబు ప్రభుత్వం తల ఊపుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. రెండున్నర లక్షల పెన్షన్ల కోత విధించి, పెన్షన్ పెంచి అమలు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం పోజు కొడుతోంది తప్ప ఆచరణలో పెన్షన్లు పెరిగింది లేదని విమర్శించారు. మొదటి దఫా గ్యాస్ పథకం అరకొర అమలు చేశారు తప్ప పూర్తిగా అమలు చేయలేదని, ఉచిత బస్సు ఊసేలేదన్నారు. నిరుద్యోగ భృతి మాటేలేదని, అమ్మకు వందనం, మహిళా శక్తి రైతు భరోసా, వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇవి కూడా అమలు చేయలేదన్నారు. ఇల్లులేనివారికి గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇస్తానన్న పథకానికి నేటికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు నిధులు విడుదల కావడంలేదన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, ఎం ఏసు, రాగుల రాఘవులు, జి బాలరాజు, జి రాజ్‌కుమార్, బొడ్డు సత్యనారాయణమూర్తి, జి దుర్గారావు, చిన్న, శ్రీను, కెవిరమణ, సతీష్ పాల్గొన్నారు. -
మోటారు సైకిళ్లు ఢీకొని ఒకరి మృతి
మరో ఇద్దరికి గాయాలు తాళ్లరేవు: జాతీయ రహదారి 216పై పటవల పైడా కళాశాల సమీపంలో రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో మహమ్మద్ అలీషా(44) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కాకినాడకు చెందిన మొహమ్మద్ అలీషా, మహమ్మద్ జహంగీర్ కలిసి ద్విచక్రవాహనంపై ముమ్మిడివరంలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తుండగా, పైడా కళాశాల సమీపంలో ఎదురుగా వెళుతున్న మరొక బైక్‌ను ఢీకొనడంతో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్నవారు కింద పడిపోయారు. ఈ ఘటనలో మహమ్మద్ అలీషా తలకు తీవ్రగాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జహంగీర్‌తోపాటు మరొక బైక్‌పై వెళుతూ వెనుక కుర్చున్న మహిళకు కూడా గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. వీరిని 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఖండవల్లి రోడ్డు ప్రమాదంలో ఒకరు..ఇద్దరికి తీవ్ర గాయాలు పెరవలి: జాతీయ రహదారిపై పెరవలి మండలం ఖండవల్లి సెంటర్లో ఆదివారం రాత్రి కారు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలు పాలయ్యారు. పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన నేకూరి రాజ్ కిరణ్, ఈతకోట శ్రీనివాస్, కొనుకు సతీష్ కుమార్ (23) మోటార్ సైకిల్‌పై ఖండవల్లి వస్తుండగా సెంటర్లో రోడ్డు దాటే క్రమంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న సతీష్‌కుమార్ మోటార్ సైకిల్ పైనుంచి ఎగిరి 10మీటర్ల దూరంలో పడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒక యువకుడికి చేయి జారిపోవడంతో అతనిని మైరుగైన వైద్యం కోసం మంగళగిరి పంపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుదాఘాతంతో...తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం పంచాయతీలో పెంకే దుర్గా శ్యాంప్రసాద్(35) విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యన్నారాయణ తెలిపిన వివరాల మేరకు జి.వేమవరంలోని సానబోయిన ఆదినారాయణకి చెందిన మల్లితోటలో శ్యాంప్రసాద్ కొంతకాలంగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మల్లితోటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటారు వేసే క్రమంలో విద్యుత్ వైరు స్విచ్‌బోర్డులో పెడుతుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్యాంప్రసాద్ మృతదేహం వద్ద భార్య నందిని కుటుంబ సభ్యులు బోరున విలపించడం అక్కడివారిని కలిచివేసింది. నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యన్నారాయణ తెలిపారు. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని గొల్లవిల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న యాండ్ర సత్యనారాయణ(64) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడని ఇన్చార్జి ఏపీవో వీరబాబు తెలిపారు. గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడని ’ఉపాధి సిబ్బంది ఎమ్.ధనలక్ష్మీ సమాచారం అందించడంతో ఘటనా ప్రదేశానికి వెళ్లి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయగా మృతి చెందినట్టు నిర్ధారించారన్నారు. మృతుడికి గతంలో భార్య మరణించగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెన్త్ ఫలితాలు మనమిత్ర, లీప్ మొబైల్ యాప్‌లో.. రాయవరం: పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాలను https:// bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లతో పాటుగా, మనమిత్ర(వాట్సాప్), లీప్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ నంబరు 95523 00009కు హాయ్ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకోవాలి. అనంతరం ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, అభ్యర్థి రోల్ నంబరు నమోదు చేయడం ద్వారా విద్యార్థులు పది ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందే వీలుంటుంది. -
ధరణీ రక్షతి రక్షితః
కపిలేశ్వరపురం: సకల జీవరాశులకూ ఆధారమైన ఈ ధరిత్రి ప్రమాదంలో ఉంది. కోటాను కోట్ల జీవులు నిన్న బాగా బతికాయి. నేడు ప్రమాదంలో పడ్డాయి. రేపు... ? ఈ ప్రశ్నకు సమాధానం కచ్చితంగా మనిషే చెప్పాలి. తన అవసరాలు కోసం అనివార్యమంటూ విచ్చలవిడి వినియోగంతో ధరిత్రిని ప్రమాదంలోకి నెట్టాడు. అందులోనే తాను నలిగిపోతూ జీవకోటి ఉనికినే ప్రశ్నార్థకం చేశాడు. ఈ ధరణిని మనం కాపాడితే అదే మనలను రక్షిస్తుందన్న విషయాన్ని మరచిపోతున్నాడు. ఆహ్లాదకరమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సైతం పర్యావరణ పరంగా ముప్పు పొంచి ఉంది. నేడు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఈ కథనం... నేపథ్యమిదీ... 84 లక్షల జీవరాశులున్న భూమిపై మానవులు సాగిస్తున్న విధ్వంసాన్ని ఆపాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి శ్రద్ధ వహించింది. ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకొంటూ ఆ సంస్థ సూచనలపై చర్చలు, సమావేశాలు, సమీక్షలు జరుపుతున్నారు. 2023లో ఎర్త్ డే థీమ్‌గా ‘మన గ్రహం కోసం ఖర్చు చేయండి’ అనే నిదానంతోనూ, 2024లో ప్లానెట్ వెర్సస్ ప్లాస్టిక్ అనే నినాదంతో కృషి చేసింది. ఈ ఏడాది ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. పోగుపడుతున్న చెత్తతో పర్యావరణానికి విఘాతం నాలుగు లక్షల జనాభా కలిగిన జిల్లా కేంద్రమైన కాకినాడలో రోజుకు 140 టన్నులు, రాజమహేంద్రవరంలో 145 టన్నులు, అమలాపురంలో 38 టన్నుల చెత్త తయారవుతోంది. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో రోజుకు సుమారుగా 28 టన్నులు చొప్పున, ఏలేశ్వరం నగర పంచాయతీలో 8 మెట్రిక్ టన్నుల చెత్త పోగుపడుతోంది. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదకరం. పాలిథీన్ సంచులు, ఇతర వస్తువుల రీసైక్లింగ్ చేసేందుకు వీలుపడదు. ప్లాస్టిక్ బాటిళ్లు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లు వెయ్యి సంవత్సరాలు వరకూ భూమిలో కరగవు. ప్రపంచంలో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్‌కు ప్రభావితమై అంతరించే దశలో ఉన్నాయి. శరీరంలోకి వెళ్లిన సూక్ష్మ స్థాయిలో ఉండే ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాల వల్ల క్యాన్సర్, చర్మ , హార్మోన్లకు సంబంధించిన వ్యాధులొస్తాయి. ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ట్రేలు, ఫోర్కులు, చెంచాలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, బడ్స్, బెలూన్లు, క్యాండీ, కత్తులు, అలంకరణకు వాడే థర్మోకోల్, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే వీవీసీ బ్యానర్లు నిషేధ జాబితాలో వున్నాయి. ప్రమాదభరితంగా పారిశ్రామిక ఉద్గారాలు తూర్పుగోదావరి జిల్లాలో 38 మధ్య తరహా పరిశ్రమలు, కాకినాడలో 62, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏడు మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వాటికి తోడు అనేక చోట్ల భారీ పరిశ్రమలున్నాయి. హేచరీలు, పరిశ్రమలు విడుదల చేసే విషపూరితమైన రసాయనాలు సముద్రంలోకి చేరి గోదావరి, సముద్ర జలాలను కలుషితం చేస్తున్నాయి. అడుగంటుతున్న భూగర్భజలాలు అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆక్వా సాగుతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తాగునీరు కలుషితమైపోతోంది. మెట్ట ప్రాంతాల్లో సాగు నీరందక ఎత్తిపోతల పథకాలతో నీరందిస్తున్నారు. గోదావరి తీరాన ఉన్నప్పటికీ తాగునీటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాలుష్యానికి బలవుతున్న జీవరాశులు... కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు తీవ్రత ఎక్కువ. కాకినాడ జిల్లాలో జనవరి నెలలో 220 సముద్ర తాబేళ్లు మృతి చెందాయి. కొత్తపల్లి మండల పరిధిలోని తీర ప్రాంతంలో సముద్ర జలాలు కలుషితం కారణంగా సముద్ర తాబేళ్లు తరచూ మృత్యువాత పడుతూ ఒడ్డుకు చేరుకుంటున్నాయి. గతేడాది కోనసీమ జిల్లాలో సుమారు 984 ఆలివ్వ్ రిడ్లే తాబేళ్లు 1,02,740 గుడ్లను పెట్టాయి. వాటి నుంచి వచ్చిన 71,388 పిల్లలను సముద్రంలో వదిలారు. ఆక్వాతో అన్నీ సమస్యలే... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పునీటి చెరువుల్లో 20,110 ఎకరాల్లోనూ, మంచినీటి చెరువుల్లో 44,199 ఎకరాల్లోనూ ఆక్వా సాగు జరుగుతోంది. 201 రోయ్యల హేచరీలు, 13 ప్రాసెసింగ్ యూనిట్లు, నాలుగు ఫీడ్ మిల్లులు ఉన్నాయి. వీటి నుంచి పర్యావరణ సమస్యలు రావడమే కాకుండా మూడు పంటలు పండే భూములు ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. ఆక్వా సాగుతో భూమి సారం దెబ్బతింటోంది. పర్యావరణ హితమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైవిధ్య భరితమైంది. దేశం నలుమూలలకూ మొక్కలను సరఫరా చేసే కర్మాగారంగా కడియం నర్సరీలు నడుస్తున్నాయి. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన సుమారు 400 కుటుంబాలు 40 ఏళ్లుగా పలు రాష్ట్రాల్లో నర్సరీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో వరి సాగుతో ఆహార ఉత్పత్తి చేస్తున్నారు. 161 కి.మీ. సాగరతీరం, 297 కి.మీ. గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉంది. కాకినాడ సమీప కోరంగి మడ అడవులు ప్రకృతి వైపరీత్యాల నుంచి జిల్లాను కాపాడుతున్నాయి. మడ అడవుల్లో 272 రకాల పక్షి జాతులు, 610 రకాల మత్స్య జాతులున్నాయి. గోదావరి సముద్ర కలిసే ప్రాంతంలో 300 రకాల చేపలుండటమే కాకుండా ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తికి నిలయం. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని చిత్తడి నేలలు ఆహార క్షేత్రాలు కావడంతో శీతాకాలంలో జొన్నాడకు వందల సంఖ్యలో సైబీరియా నుంచి 1,600 కిలోమీటర్లు ప్రయాణించి బార్ హెడెడ్ గుస్గా పిలిచే వలస బాతులు సంచరిస్తుంటాయి. ఆటుపోట్లు, పౌర్ణమి సమయంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆలివ్‌రిడ్లే గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి. భూరక్షణపై ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రతిఘటిస్తున్న ప్రజలు నేడు ధరిత్రీ దినోత్సవం నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ధరిత్రీ పరిరక్షణ పట్ల కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉప్పాడ సముద్ర కోత నివారణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా పరిశీలన జరిపి సుమారు రూ.2వేల కోట్లతో కోత నివారణతో పాటు, తీరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నీటిమూటయ్యింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పచ్చని పంట పొలాలను ఆక్వా జోన్‌గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించారు. పలు గ్రామ సభల్లో ఆక్వా జోన్ మాకొద్దంటూ తీర్మానాలు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో ధరిత్రి రక్షణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ధరిత్రీ రక్షణకు విశేష కృషి చేసింది. 2022 జూలై 1 ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చింది. ఫలితంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2020లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 51వ ర్యాంకును సాధించింది. 2021లో 41, 2022లో 97, 2023లో 59వ ర్యాంకులను పొందింది. మండపేట తదితర పురపాలక సంఘాలు సైతం ధరిత్రీ రక్షణలో గుర్తింపు పొందాయి. విఘాతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యావరణ విఘాతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆక్వా సాగుతో ముప్పు వాటిల్లుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఆక్వా జోన్లు ఏర్పాటు చేస్తామంటూ గ్రామసభలను నిర్వహించడం ప్రజా వ్యతిరేకమే. పర్యావరణ పరిరక్షణ చట్టాలను నిర్వీర్యం చేసే పాలనపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. – కేవీవీ సత్యనారాయణ, కన్వీనర్, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ సబ్ కమిటీ, జనవిజ్ఞాన వేదిక అనుబంధం, యానాం -
గంజాయి కేసులో నలుగురి అరెస్ట్
తుని: యువతకు గంజాయి సరఫరా చేస్తోన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని తుని పట్టణ సీఐ ఎం.గీతారామకృష్ణ సోమవారం తెలిపారు. తునిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఉప్పరగూడెం కాలనీలో ముమ్మర తనిఖీలు నిర్వహించి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తుని పట్టణం అమ్మాజీపేటకు చెందిన పగడం శివ సంతోష్ ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తునికి తీసుకువచ్చి బత్తాయితోట వీధికి చెందిన పిట్టా నాగ సత్య మహేష్, అమ్మాజీపేటకు చెందిన మనసాని వెంకటేష్ ద్వారా స్థానికంగా గంజాయి విక్రయిస్తున్నారన్నారు. వీరు ఉప్పరగూడెంకు చెందిన షేక్ ఉమా గౌరి వద్ద నిల్వ చేశారన్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య తొండంగి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తొండంగి మండలం ఏ.కొత్తపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విశ్వనాథుల చిన్న(35) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంటి మేడపై పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని చూసి కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి సుమారు నెలరోజులకు బయటపడిన వైనం కొవ్వూరు: మద్దూరులంక గ్రామంలో పల్లెపాలెంలో ఆకుల కృష్ణారావు అనే రైతుకి చెందిన మకాం సమీపంలో చిత్రాపు వెంకట్రావు మృతదేహాన్ని గుర్తించారు. సుమారు నెల రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని రూరల్ పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా ఎండిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆరునెలలు క్రితమే మృతుడు వెంకట్రావు భార్య రామజ్యోతి తొమ్మిది నెలలు గర్భవతిగా ఉన్న సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి వెంకట్రావు ఒంటరిగా ఉంటున్నారు. గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఎస్సై చెప్పారు. ఆమె ఇటీవల హైదరాబాద్ వెళ్లిపోయింది. వెంకట్రావు తల్లిదండ్రులు పదిహేహేనేళ్ల కిత్రమే మృతి చెందారు. దీంతో తన సోదరుడు ఒక ఫోర్షన్లోను వెంకట్రావు మరో పోర్షన్‌లోను నివాసం ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవడం లేదని స్ధానికులు చెబుతున్నారు. ఘటనా స్ధలంలో లభ్యమైన మొబైల్ ఫోన్ ఆధారంగా శవం వెంకట్రావుది అని నిర్ధారించారు. మార్చి 20వ తేదీన చివరి కాల్ చేసి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి సమీపంలోనే గుళికలు డబ్బా ఉండడాన్ని బట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. దీంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీహరిరావు తెలిపారు. -
ముందున్నది బంగరు భవిత
● ఒక్క ఫలితం జీవితాన్ని నిర్దేశించదు ● ఆత్మహత్యకు పాల్పడితే ఎందరికో క్షోభ ● ఒత్తిడిని, నిరాశను దరిచేరనీయొద్దు ● చదువులో వెనకబాటు అత్యంత సహజం ● ప్రతికూల ఫలితం వస్తే తల్లిదండ్రులు అండగా నిలచి భరోసా ఇవ్వాలి ● పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపాలి ● 23న పదో తరగతి పరీక్షా ఫలితాలు రాయవరం: చదువులో ఒత్తిడి.. ర్యాంకులు.. మార్కులు.. ఆత్మన్యూనత.. ఇలా కారణం ఏదైనా కావచ్చు.. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. తాజాగా అంబాజీపేటలో ఒక బాలిక పదో తరగతి ఫలితాల్లో ఫెయిలవుతానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 23న పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఒత్తిడితో ప్రాణాలను బలి తీసుకోవద్దని, ఒత్తిడిని చంపేసి ఉజ్వల భవితకు బాటలు వేసుకోండని, ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవాలని మానసిక నిపుణులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. జీవితంలో పాసైన వారెందరో మనిషి జీవితంలో ఒడుదొడుకులు సహజం. కష్టం వచ్చిందని కుంగిపోతే రేపటి పనిని పూర్తి చేయలేం. ఈ విషయాన్ని పిల్లలు గుర్తించాలి. ● గోదావరి జిల్లాలకే చెందిన ఎల్లాప్రగడ సుబ్బారావు ఇంటర్ మూడుసార్లు తప్పినా ప్రపంచంలో అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. ఎన్నో యాంటీ బయాటిక్స్‌ను కనుగొన్నారు. రక్తహీనత ఎందుకు వస్తుందో కనిపెట్టి దానికి చికిత్సా విధానాలను కనిపెట్టారు. ● చిన్నతనంలో మొద్దబ్బాయ్గా పిలవబడిన ఐన్‌స్టీన్ ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త అయ్యారు. ● ప్రపంచాన్ని శాసిస్తున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ విద్యార్థిగా వెనుకబడిన వారే. ● సచిన్ టెండూల్కర్ చదువులో రాణించలేక పోయినా తాను ఎంపిక చేసుకున్న క్రికెట్ రంగంలో ప్రపంచ కీర్తిని పొందాడు. ● స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు విద్యాభ్యాసంలో వెనుకబడినా, తనకిష్టమైన నటనా రంగంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. ● పదిలో ఫెయిలై డాక్టర్లు అయిన వారు, ఐఏఎస్‌లు అయిన వారు ఎందరో ఉన్నారు. ● చదువుపై ఇష్టం లేకుంటే తమకు ఆసక్తి ఉన్న క్రీడలు, సంగీతం, వ్యాపారం ఇలా వారికి నచ్చిన రంగాన్ని ఎన్నుకోవాలి. ఫలితాలు విడుదలయ్యే సమయం ఏప్రిల్, మే నెలలు పరీక్షా ఫలితాలు విడుదలయ్యే సమయం. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మరో మూడు రోజుల్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే డిగ్రీ, పీజీ వంటి పలు ఉన్నత కోర్సుల ఫలితాలు విడుదలవుతాయి. ఈ ఫలితాలు కొందరికి మధురానుభూతిని..మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగల్చడం సహజం. ఇంటర్ ఫలితాల్లో కొందరు అత్యుత్తమ మార్కులు సాధిస్తే, మరికొందరు ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని, ఇంకొందరు పరీక్ష తప్పామని క్షణికావేశానికి లోనై కాని పనులు చేస్తున్నారు. పదితో ప్రారంభం పదో తరగతి నుంచే విద్యార్థులకు ఒత్తిడి ప్రారంభమవుతోంది. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని కొందరు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసలు సిసలైన పరీక్ష మొదలవుతుంది. జీవితంలో స్థిరపడడానికి అవసరమైన ఇంటర్మీడియేట్‌లో చేరతారు. ఇక్కడా అదే ఒత్తిడి. బాగా చదవాలని తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పించి ఆనక ఉత్తమ ఫలితాల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతారు. ప్రశాంతంగా ఆలోచించాలి ఫలితాలు ఎలా ఉన్నా.. కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకుని ఆత్మ విమర్శ చేసుకుంటే చాలని, అనవసర మైన ఆందోళనలకు ఒత్తిడికి గురై తప్పుడు దారులు వెతకరాదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఓటమి విజయానికి తొలి మెట్టని, నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నది వీరి సూచన. ఎందుకు ఓడిపోయాం? కారణమేమై ఉంటుంది? మరోసారి అలాంటి తప్పు జరగకుండా సరిదిద్దుకుని మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయం. విద్యార్థులకు సూచనలు ● పాస్, ఫెయిల్ అన్నవి సాధారణ విషయాలు. ● జీవితం ఎంతో విలువైనది. భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధిస్తామన్న సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ● ఏ ఫలితమూ జీవితాన్ని నిర్దేశించదు. ● వ్యతిరేక ఫలితం ఎదురైతే కాసేపు ప్రశాంతంగా ఆలోచించి జరిగిన పొరపాటును గుర్తించాలి. ● ఒత్తిడి నుంచి వేగంగా బయటపడే ప్రయత్నం చేయాలి. ● జరిగిన తప్పును వీలైనంత వరకు తల్లిదండ్రులకు చెబితే 90 శాతం భారం దిగి పోయినట్లేనని గ్రహించాలి. ● వెనుకబడిన సబ్జెక్టులు లేదా పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైతే అధ్యాపకులు, సీనియర్ల సూచనలు, సలహాలను తీసుకోవాలి. ● తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంత క్షోభకు గురవుతారోనని ఒక్క క్షణం ఆలోచించాలి. ఒత్తిడిలో ఉన్న పిల్లలను గుర్తించాలి పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పరీక్ష తప్పిన విద్యార్థులు ఆత్మన్యూనతను వీడాలి. జరిగిన తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. డిప్రెషన్లో ఉన్న పిల్లలు నిద్రాహారాలకు దూరంగా ఉంటారు. ఒంటరితనాన్ని కోరుకుంటారు. అటువంటి వారి పట్ల స్నేహపూర్వకంగా మెలగుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, మానసిక వైద్యురాలు, ఏరియా ఆస్పత్రి, అమలాపురం తల్లిదండ్రులు ఇవి గుర్తుంచుకోవాలి తమ పిల్లలు అనుకున్న మార్కులు సాధించలేదనో, పరీక్ష తప్పారనో వారిని మందలించొద్దు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పోల్చి అవహేళన చేయవద్దు. ఫలితాల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలు ప్రతికూలంగా వస్తే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. ఆ సమయంలో వారిని అక్కున చేర్చుకోవాలి. శ్రీజరిగిన పొరపాటు గురించి పిల్లలతో సున్నితంగా చర్చించి, మీకు మేమున్నామన్న భరోసాను ఇవ్వగలిగితే వారికి తిరుగేలేదు. -
దుర్గమ్మ ఆలయంలో చోరీ
● రూ.2.5 లక్షల విలువైన ఆభరణాలు చోరీ ● సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల విచారణ తొండంగి: మండలంలోని పి.అగ్రహారంలో ఇటీవల పునర్నిర్మించిన దుర్గామాత ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్టు ఆలయకమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. పోలీసులు, ఆలయకమిటీ తెలిపిన వివరాల ప్రకారం పి.అగ్రహారంలో దుర్గామాత ఆలయాన్ని దాతల సహకారంతో పునర్నిర్మించారు. మార్చి 16న అమ్మవారి విగ్రహప్రతిష్ట జరిగింది. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో అమ్మవారికి వెండి కిరీటం, మూడు జతల శతమానాలు, వెండి కాసులపేరు అలంకరించారు. శనివారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు నగల చోరీకి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే రెండు రోజుల ముందు పగలు అమ్మవారిని దర్శించుకుని రెక్కీ నిర్వహించినట్టు కూడా ఫుటేజీలో రికార్డు అయ్యింది. దీంతో ఆదివారం ఉదయం అమ్మవారికి పూజ చేసేందుకు వెళ్లిన పూజారికి ఆలయ తాళాలు పగలుగొట్టి కనపడ్డాయి. తరువాత అమ్మవారి నగలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. నగల విలువ రూ.రెండున్నర లక్షలు ఉంటాయని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. దీంతో ఆలయకమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి తొండంగి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్రావు ఘటనా స్ధలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీని సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి తొండంగి: గ్రామానికి చెందిన పల్లా శ్రీరాములు (59) ఈ నెల 14న ఽపొలం నుంచి ఎడ్ల బండిపై ధాన్యం బస్తాలు తీసుకువచ్చి ఇంట్లో వేస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. దీంతో మెడపై బస్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానికంగా ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతడు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శ్రీరాములు కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. శ్రీరాములుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో రెగ్యులర్ ఇంటర్మీడియేట్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి ప్రతిభ చూపారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆదివారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో కె.రుత్విక్ 23వ ర్యాంక్, పి.ఆదిత్య అభిషేక్ 46వ ర్యాంక్ సాఽధించి ప్రతిభ చాటారన్నారు. వీటితో పాటు 109, 112, 118, 135, 144, 155, 206, 212, 280, 300, 309, 342, 359, 395, 524 ర్యాంకులు వరుసగా సాధించారన్నారు. అలాగే 2 వేల లోపు 44 మంది, 5 వేల లోపు 102 మంది అత్యున్నత ర్యాంకులు సాధించి పటిష్టమైన అకడమిక్ పోగ్రాంకు నిలువుదట్టంగా నిలిచాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్‌రెడ్డి, హాస్టల్ డైరెక్టర్ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ, ప్రిన్సిపాల్ మెయినా, కో–ఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరక్టర్ రాఘవరెడ్డి, పి.గంగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఫణీంద్ర అభినందించారు. -
గోదావరిలో మృతదేహం లభ్యం
మృతుడు రాజమహేంద్రవరం వాసిగా గుర్తింపు కొవ్వూరు: రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీకి చెందిన సుంకర మదన్ కిశోర్ (45) అనే వ్యక్తి మృతదేహం ఆదివారం ఏరినమ్మ ఘాట్‌లో లభ్యమైనట్లు సీఐ పి.విశ్వం తెలిపారు. మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసు స్టేషన్లో మృతుడి సోదరుడు పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యక్తి అదృశ్యం కేసు నమోదు చేశామని ఎస్సై జి.సతీష్ తెలిపారు. మృతుడు ఓఎన్జీసీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సోదరుడు పవన్‌కుమార్‌కి ఫోన్ చేసి తన కుమార్తె, తల్లితో మాట్లాడాలి ఇవ్వమని చెప్పి కొద్దిసేపు మాట్లాడాడని, అనంతరం నది ఒడ్డున తాళాలు పెట్టి స్నానానికి వెళ్తున్నట్టు చెప్పాడని ఫిర్యాదుల పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్నానానికి వెళ్లి నదిలో మునిగిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఎస్సై సతీష్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
డైవర్షన్‌పై విజిలెన్స్!
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025తండ్రి హయాంలో తప్పును సరి చేస్తారా? సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న యనమల రామకృష్ణుడి హయాంలో జరిగిన డ్రైన్ డైవర్షన్ తప్పిదాన్ని ఆయన కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్యే దివ్య నిజంగానే సరి చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముంపు బారిన పడుతున్న 10 వార్డుల ప్రజల్లో దీనిపై చర్చ నడుస్తోంది. అప్పట్లో ప్రజలకు నష్టం కలుగుతుందని తెలియకుండానే రామకృష్ణుడు ఇలా చేశారా? ఇప్పటి వర కూ జరిగిన నష్టంపై ఏ చర్యలు తీసుకుంటారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. విజిలెన్స్ విచారణ జరిపిస్తే అసలు నిజం వెలుగులోకి వస్తుందని, అప్పుడు చర్యలు తీసుకుంటే ప్రజలకు నమ్మ కం కలుగుతుందని పలువురు అంటున్నారు.● గతంలో మేజర్ డ్రైన్ మళ్లింపు ● తునిలో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జా ● రియల్టర్ల కోసం 10 వార్డుల ప్రజలను ముంచిన నేతలు ● నాటి ఆర్థిక మంత్రి యనమల హయాంలో నిర్వాకం ● దీనిపై విచారణ జరుపుతామని ఆయన కుమార్తె, ఎమ్మెల్యే దివ్య ప్రకటన ● తుని పట్టణ ప్రజల విస్మయం -
ఏమంటారో.. ఏం చేస్తారో..!
అన్నవరం దేవస్థానం ● నేడు రత్నగిరికి రానున్న అదనపు కమిషనర్ ● వివాదాలపై రెండు రోజుల పాటు చంద్రకుమార్ విచారణ ● అన్నవరం దేవస్థానంలో సర్వత్రా ఉత్కంఠఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు, వివాదాలపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.చంద్రకుమార్ సోమవారం రానున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన వివిధ అంశాలపై విచారణ నిర్వహించనున్నారు. దీంతో, అన్నవరం దేవస్థానంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎవరెవరిని ఏయే ప్రశ్నలడుగుతారో.. వాటికి ఏం జవాబు చెప్పాలనే దానిపై సిబ్బంది తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరిపై ఏ చర్యలు తీసుకునే అవకాశముందనే విషయమై కూడా చర్చించుకుంటున్నారు. దేవస్థానంలో నెలకొన్న వివాదాలపై విచారణకు చంద్రకుమార్‌ను నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. దేవస్థానంలో చోటు చేసుకుంటున్న వివాదాలపై విచారణ నిర్వహించి, మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆయనను కమిషనర్ ఆదేశించారు. అందువలన రెండు రోజుల పాటు విచారణ నిర్వహించి, మూడో రోజు నివేదిక సమర్పిస్తారని తెలిసింది. ఆ నివేదికపై వారాంతంలోగా చర్యలు తీసుకుంటారని సమాచారం. చంద్రకుమార్ గతంలో సుమారు ఏడాది పాటు ఇక్కడ ఈఓగా పని చేశారు. అందువలన ఆయనకు దేవస్థానం కార్యకలాపాపై పూర్తి అవగాహన ఉంది. పరిస్థితులను త్వరగానే అర్థం చేసుకోగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విచారణాంశాలివే.. ● ప్రస్తుత ఈఓ వీర్ల సుబ్బారావు కుమారుడు దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూములో సీసీ టీవీలను పర్యవేక్షించడం.. డ్రోన్ కెమెరాల కొనుగోలు అంశంపై ఈఓ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఈఓతో కలసి పాల్గొనడం.. ఈఓ క్యాంపులో ఉన్నప్పుడు ఆయన అధికారిక వాహనంలో దేవస్థానానికి రాకపోకలు సాగించడం వంటి అంశాలపై చంద్రకుమార్ విచారణ నిర్వహించనున్నారు. ● దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావు వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేయడం, ఏఈఓ సెలవు, మరో ఇద్దరు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు సెలవు కోరడంపై కూడా విచారించనున్నారు. ● సిబ్బందికి వీక్లీ ఆఫ్‌లు ఇవ్వకపోవడంపై కూడా విచారణ జరపనున్నారు. ● పీహెచ్డీ పట్టా లేకపోవడంతో గతంలో పని చేసిన ఈఓలు సత్యదేవ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రావును రెగ్యులర్ చేయలేదు. ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఫైలు పెట్టినపుడు పీహెచ్డీ లేదనే కారణంతో నిలిపివేశారు. ప్రస్తుత ఈఓ ఆయనను రెగ్యులర్ చేయడంపై కూడా విచారించనున్నారు. ● దేవస్థానంలో స్వామివారి దర్శనం, ప్రసాదం, మౌలిక వసతుల కల్పనపై మూడు నెలలుగా భక్తుల అసంతృప్తి పెరుగుతున్నట్టు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా నిర్ధారణ అవుతోంది. దీనిపై చంద్రకుమార్ సమీక్షించనున్నారు. ● నీటి సమస్య సాకుతో దేవస్థానం సత్రాల్లో ఏసీ గదులను ఒక రోజు అద్దెకివ్వకపోవడంపై కొద్ది రోజుల కిందట వివాదం రేగింది. దీనిపై కలెక్టర్ షణ్మోహన్, కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి గదులు అద్దెకివ్వడం పునరుద్ధరించినా దేవస్థానం అప్రతిష్ట పాలవడంపై కూడా విచారణ జరపనున్నారు. ● దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లకు కొంత కాలం జీతాలు నిలిపివేశారు. దీనికి గల కారణాలపై కూడా దృష్టి సారించనున్నారు. ● స్వామివారి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌ను నియమించాల్సిన అవసరం ఉందా అనే అంశంపై సిబ్బంది అభిప్రాయాలు అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పలు అంశాలపై చంద్రకుమార్ విచారణ జరుపుతారని సమాచారం. -
సత్యదేవుని సన్నిధిలో భక్తుల సందడి
● స్వామివారిని దర్శించిన 40 వేల మంది ● రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని 5 వేల మంది స్వీకరించారు. ఘనంగా రథ సేవ ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, టేకు రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథ సేవ ప్రారంభించారు. రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు. అనంతరం, స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నిజామాబాద్‌కు చెందిన సాయిప్రసన్న దంపతులు రూ.2,500 చెల్లించి రథ సేవలో పాల్గొన్నారు. వారికి స్వామివారి కండువా, రవికెల వస్త్రం, ప్రసాదం ఇచ్చి, స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అర్చకుడు సుధీర్, పరిచారకుడు పవన్ తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ముగిసిన అగ్నిమాపక
వారోత్సవాలుకాకినాడ క్రైం: జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. స్థానిక రామారావుపేటలోని ఇండియన్ రెడ్‌క్రాస్ భవంతిలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అగ్ని మాపక సహాయ అధికారి ఉద్దండురావు సుబ్బా రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కాకినాడ బ్రాంచ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వైడీ రామారావు, ఎన్.సుగుణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుగుణారెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం వల్ల అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు నష్టం ఎక్కువగా ఉంటోందని అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆ శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహించిన ప్రదర్శనలు, విన్యాసాలు ప్రజల్లో విశేష అవగాహన పెంపొందడానికి దోహదపడ్డాయని చెప్పారు. రెడ్‌క్రాస్ సభ్యులు శివకుమార్, ఉషారాణి మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ శాఖ అందిస్తున్న విపత్తు నిర్వహణ సేవలను కొనియాడారు. ఏడీఎఫ్‌వో ఉద్దండురావు సుబ్బారావు మాట్లాడుతూ, వారోత్సవాల సందర్భంగా తాము నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి పీవీ సాయిరాజేష్ పర్యవేక్షణలో వారోత్సవాలు నిర్వహించామని చెప్పారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆవరణలో అనుకోని ప్రమాదాల్లో ఒక్కసారిగా మంటలు రేగితే నియంత్రించే శాసీ్త్రయ విధానాలను ప్రదర్శన ద్వారా వివరించారు. -
కల్యాణోత్సవాల దిశగా అడుగులు
అన్నవరం: వచ్చే నెల 7 నుంచి 13వ తేదీ వరకూ జరగనున్న సత్యదేవుని వార్షిక కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లు క్రమంగా జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసే పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో చర్చించాల్సిన అంశాలపై దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర అధికారులు ఆదివారం సమావేశమై చర్చించారు. కల్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇదిలా ఉండగా సత్యదేవుని కల్యాణోత్సవాలకు రావాడ చిరంజీవి దంపతులు (విజయవాడ) రూ.3.5 లక్షల విలువ చేసే పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే, స్వామివారి కల్యాణంలో ఉపయోగించేందుకు వి.రాము (జంగారెడ్డిగూడెం) గోటి తలంబ్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలను చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు దాతల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, ఏఈఓ కొండలరావు, సూపరింటెండెంట్లు అనకాపల్లి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వైదిక కార్యక్రమాల నిలిపివేత కల్యాణ మహోత్సవాల సందర్భంగా వచ్చే నెల 7 నుంచి 13వ తేదీ వరకూ సత్యదేవుని సన్నిధిలో నిత్యం నిర్వహించే పలు వైదిక కార్యక్రమాలను నిలిపివేయనున్నారు. నిత్య కల్యాణం, ఆయుష్య హోమం, సహస్ర దీపాలంకార సేవ, పంచ హారతుల సేవ, ప్రతి శుక్రవారం వనదుర్గ అమ్మవారికి జరిగే చండీహోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమం, రాత్రి వేళల్లో జరిగే పవళింపు సేవ నిలుపుదల చేయనున్నారు. స్వామివారి వ్రతాలు, ఇతర కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయి. -
లోవకు పోటెత్తిన భక్తులు
తుని: లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ 30 వేల మంది భక్తులు తలుపులమ్మ వారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,11,295, పూజా టికెట్ల ద్వారా రూ.1,13,910, కేశఖండన టికెట్ల ద్వారా రూ.16,120, వాహన పూజ టికెట్ల ద్వారా రూ.4,650, కాటేజీల ద్వారా రూ.68,492, ఇతరత్రా రూ.1,02,513 కలిపి దేవస్థానానికి రూ.4,16,980 ఆదాయం సమకూరిందని వివరించారు. కోటసత్తెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయంలో నిత్యాన్నదానానికి చవ్వాకుల నాగ మల్లికార్జునరావు, సాయికుమారి దంపతులు (నిడదవోలు) రూ.25 వేల విరాళం సమర్పించారు. రాజమహేంద్రవరం మౌనిక సిల్వర్ వర్క్స్ అధినేత వానపల్లి మురళీకృష్ణ 400 గ్రాముల వెండి అష్టలక్ష్మి చెంబు, బీర్ల సత్యనారాయణ (కె.పెంటపాడు) 14.770 గ్రాముల బంగారం దేవస్థానానికి సమర్పించారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,70,094 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. బాలబాలాజీకి రూ.1.74 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.1,74,499 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 3,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 1,500 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.27,030 వచ్చిందన్నారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.59,257 విరాళాలు అందించారని తెలిపారు. యలమంచిలికి చెందిన అందె వీరరాఘవులు, లక్ష్మీసుజాత దంపతులు నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.10,116 విరాళంగా సమర్పించారు. సాయిబాబాకు రజత ఛత్రం సమర్పణ రామచంద్రపురం: పట్టణంలోని కోదండ రామాలయంలో కొలువై ఉన్న శిరిడీ సాయిబాబా వారికి పట్టణానికే చెందిన వాడ్రేవు శ్రీరాజరాజేశ్వరి రామ్మూర్తి రూ. 2.20 లక్షల విలువైన రజత ఛత్రాన్ని సమర్పించారు. రాజరాజేశ్వరి ఇటీవల మృతి చెందిన తన అత్తగారు వాడ్రేవు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం.. కుటుంబ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్, రత్న పద్మావతి, వాడ్రేవు శ్రీనివాస్, భానుగాయత్రి, వాడ్రేవు వీరేశలింగం, విన్నకోట శ్రీనివాస్‌లతో కలసి ఆలయ నిర్వాహకులు, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, పాలూరి గోపాలకృష్ణకు ఛత్రాన్ని అందజేశారు. -
ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు
గండేపల్లి: 2025లో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాలు సాధించిన 1507 మంది విద్యార్థులు, వారిని పోత్సహించిన తల్లిదండ్రులకు ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పరుచూరి కృష్ణారావు అభినందనలు తెలిపారు. సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్ డే–2025 వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగ కల్పనలో పురోగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ టీసీఎస్‌కు చెందిన చల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినప్పటికీ నూతన ఆవిష్కరణలు పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, కె.సత్యనారాయణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం.రాధికామణి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు సీతానగరం: మండలంలోని రఘుదేవపురం పంచాయతీ కార్యదర్శి గేదెల జయ భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్యాభర్తలైన తన్నీరు జయమ్మ, నూకరాజుపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్ కుమార్ శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రఘుదేవపురం చెరువు గట్టును ఆక్రమించి ఇల్లు కడుతున్న జయమ్మ, నూకరాజులపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీ కార్యదర్శి జయ భార్గవి తన సిబ్బందితో కలిసి ఈనెల ఒకటిన నోటీసులు అందించడానికి వెళ్లారు. అయితే వారి విధులకు జయమ్మ, నూకరాజు ఆటంకం కలిగించి, దుర్భాషలాడుతూ, భయభ్రాంతులకు గురి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయిలో కె.ప్రణీత్ 2వర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ 3, పి.శరత్ సంతోష్ 9, వి.తేజశ్రీ 18, టి.జశ్వంత్ దొర 30, కె.అభినవ్ 45, కె.యశ్వంత్ రాజా 46, జి.సుజోష్ రాజా 66, ఇ.వర్షిత్ 75, ఎం.కారుణ్య రాజ్ 86వ ర్యాంకు సాధించారన్నారు. కె.వెంకటరామ వినీష్ 100, జి.కార్తీక్ 120, వి.రామసాయి వరుణ్ 153, జి.చేతన్ నాగఅనిరుథ్ 154, కె.శంకర్ మాణిక్ 191, ఎం.సిరి సంజన 204, పి.జశ్వంత్ సాయిచరణ్ 219, ఎం.విశ్వనాథ నాగసాయిరామ్ 224, డి.అశిష్ సాయిశ్రీకర్ 235, కె.సాయి సృజన 236, సీహెచ్ శ్రీచరణ్ 242, వై.దేవేష్ రుత్విక్ 246, పి.ప్రణవ్ రుద్రీష్ 247 ర్యాంకులు కై వసం చేసుకున్నారన్నారు. వీటితో పాటు 292, 310, 313, 319, 326, 331, 338, 349, 366, 391, 395, 403, 429, 444, 465, 473 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారన్నారు. 1000 లోపు 58 మంది, 5000 లోపు 254 మంది, 10,000 లోపు 417 మంది, 20,000లోపు 654 మంది ర్యాంకులు సాధించారని, కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 1,620 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొంది 93 శాతం సక్సెస్ రేటు సాధించారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
శ్రీషిర్డీసాయి విద్యార్థుల విజయభేరి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలలో శ్రీ షిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య శనివారం విలేకరులకు తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడన్నారు. సీహెచ్ మోక్షిత్ 35, ఎం.మధులిక రెడ్డి 169, మోహన్ శ్రీరామ్ జీ 287 ర్యాంకులు కై వసం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనపరచారన్నారు. మొత్తం 10 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా, 23 మంది 2000 లోపు, 45 మంది 5000 లోపు, 64 మంది 10000 లోపు, 88 మంది 20000 లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. మొత్తం 245 మంది విద్యార్థులు హాజరుకాగా 186 మంది విద్యార్థులు అడ్వాన్స్‌కు అర్హత సాధించవచ్చునన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 20,000 గటగట (వెయ్యి) 18,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వాడపల్లి వెంకన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ ప్రాంగణంతో పాటు వాడపల్లి గ్రామం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏడు వారాలు – ఏడు ప్రదక్షిణల నోము చేపట్టిన భక్తులు వేంకటేశ్వరస్వామిని వివిధ నామాలతో కొలుస్తూ మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఏడువారాలు పూర్తయిన భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపించారు. అనంతరం ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, అన్నప్రసాదం స్వీకరించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారికి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి రూ.42,03,230 ఆదాయం సమకూరిందని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. -
టెన్షన్.. టెన్షన్..
● పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినస్థలంలో తీవ్ర ఉద్రిక్తత ● నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్ ● ఆయనను జీపులో తరలించిన పోలీసులు ● భారీగా తరలి వచ్చిన క్రైస్తవ నేతలు రాజమహేంద్రవరం రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో నివాళులర్పించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునివ్వడంతో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రవీణ్ మృతి చెందిన స్థలానికి హర్షకుమార్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఆయనను వెంటనే జీపులో ఎక్కించుకుని పలు స్టేషన్లకు తరలించారు. ఈ లోగా భారీ సంఖ్యలో వివిధ సంఘాల నేతలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ప్రవీణ్ మృతి చెందిన స్థలం దగ్గరకు చేరుకున్నారు. వారిని అక్కడకు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కానీ క్రైస్తవ సంఘాల నాయకులు వాటిని తోసుకుని వెళ్లి ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో నివాళులర్పించి, సుమారు గంట పాటు ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్‌ది ముమ్మాటికే హత్యేనని, ప్రస్తుత పాలకులు, పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈలోపు బీఎస్పీ నాయకుడు ఇసుకపట్ల రాంబాబు, మాలమహానాడు నాయకుడు నక్కా వెంకటరత్నం, ఆర్పీఐ నాయకుడు జంగం సుబ్బారావు, నిడదవోలుకు చెందిన రమేష్‌ను పోలీసులు జీపుల్లోకి ఎక్కించుకుని రాజానగరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో రాత్రి 7.30 గంటల వరకూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హర్షకుమార్‌ను సుమారు ఐదు గంటల పాటు విఽవిధ స్టేషన్లకు తిప్పి రాత్రి 7.30 గంటలకు ఇంటి వద్ద వదిలిపెట్టి, భారీ ఎత్తున పోలీసు పహారా ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం ఎంతో బెటర్: హర్హకుమార్ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కన్నా జగన్ పాలన ఎంతో బాగుండేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. శనివారం రాత్రి ఆయన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఐదు గంటల పాటు తనను పోలీస్ జీపులో తిప్పుతూ ఇబ్బంది పెట్టారన్నారు. పోలీసులు తనను తీసుకువెళ్లినా కార్యక్రమం విజయవంతమైందన్నారు. -
మ్యారేజ్.. హైరేంజ్..
ఆత్మీయంగా ఉంటారు కోనసీమ జిల్లా ప్రజలు చాలా ఆత్మీయంగా ఉంటారు. మా ప్రదర్శనలను ఉత్సాహంగా తిలకిస్తారు. మాతో సెల్ఫీలను తీయించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ ప్రాంతం, ఇక్కడ పెళ్లిళ్లు చాలా వైభవంగా జరుగుతాయి. – అలీనా, రష్యా ప్రత్యేక గుర్తింపు వివాహాల సందర్భంగా నిర్వహించే ఊరేగింపులలో మాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మా వేషాలను, ఊరేగింపులో బుల్లెట్ నడిపే తీరును చూసి ప్రజలు ఎంతో ముచ్చట పడతారు. ఈవెంట్ల కోసం చాలా ప్రాంతాలకు వెళతాం. అయితే రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ వచ్చినప్పుడు మాకు వచ్చే ఆనందం వేరు. – దామినీ ఈషా, మహారాష్ట్ర ● గోదారోళ్ల పెళ్లిళ్లలో ఆధునిక పోకడలు ● విదేశీ భామల సందడి ● ఉత్తరాది మహిళలతో అతిథులకు స్వాగతాలు ● విందు భోజనాల వడ్డన నుంచి పాన్ అందించే వరకూ మర్యాదలు ● ఖర్చుకు వెనుకాడని ఉమ్మడి జిల్లా వాసులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న పెళ్లిళ్లలో అడుగడుగునా ఆధునికత కనిపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి వారు కూడా అప్పోసొప్పో చేసి చాలా ఆడంబరంగా వివాహాలు చేయడం పరిపాటిగా మారింది. పెళ్లిళ్లలో అనేక కొత్త పద్ధతులు వచ్చి చేరుతున్నాయి. వాటిని అందరూ ఆమోదించడం గమనార్హం. ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా అందుకు తగినట్టుగా పెళ్లి సందడిలో కొత్త కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పెళ్లి మంటపం, రిసెప్షన్, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడిని తయారు చేయడం, సంప్రదాయంగా పంపే సారె.. తదితర వాటిలో ఆధునికతను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లలో ఉత్తరాది, విదేశీ భామలు సైతం సందడి చేస్తున్నారు. సాక్షి, అమలాపురం: ఆధునిక కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లలో అనేక కొత్త పోకడలు వచ్చాయి. పెళ్లి పందిరి నుంచి విందు భోజనాల వరకూ అన్నింటిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. గతంలో గోదావరి జిల్లాల్లో జరిగే పెళ్లిళ్లలో తాటాకు పందిళ్లు, కొబ్బరి, మొగలి ఆకులతో తయారు చేసిన రకరకాల పువ్వులు, ఆవుపేడతో అలికిన పెళ్లి అరుగు, చుట్టూ ముత్యాల ముగ్గులు, బాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, సంప్రదాయ భోజనాలు, అతిథులకు పసుపు, కుంకుమలు పెట్టి రవికెలు అందించడం కనిపించేంది. కొత్తదనం 1980 నుంచి గోదావరి పెళ్లిళ్లలో కొత్తదనం చోటు చేసుకుంది. టెంట్లు, షామియానాలు, పట్టు పరికిణీలు కట్టుకుని గులాబీలు ఇచ్చే పడుచు పిల్లలు, పన్నీరు జల్లే యంత్రాలు, మ్యూజికల్ నైట్లు, బ్యాండు మేళాలు, పచ్చి పువ్వుల మంటపాలు, పలు రకాల వంటలు, అతిథులకు వడ్డించే కేటరింగ్ కుర్రాళ్లు సందడి చేసేవారు. ఆధునిక బాటలో.. గోదారోళ్ల పెళ్లిళ్లు 2020 నుంచి ఆధునిక బాట పట్టా యి. బాహుబలి సెట్టింగ్‌లు, డీజే సౌండ్లు, సినీ నేప థ్య గాయకులతో సంగీత విభావరి, పెళ్లికి ముందు ఉత్తరాది బారాత్, సంగీత్, హల్దీలు, అనేక రకాల వంటకాలు, ఉత్తరాది భామలతో బుల్లెట్ బండ్ల మీద ఊరేగింపులు, విదేశీ భామలతో వినూత్న స్వాగత సత్కా రాలు.. ఇలా ఆధునిక పుంతలు తొక్కుతున్నాయి. బుల్లెట్ బండ్లపై సందడి పెళ్లిళ్ల ఊరేగింపులో కూడా కొత్త ట్రెండ్ సాగుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్ యువతులు బుల్లెట్ బండ్ల మీద పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వెంట ఊరేగింపుగా వస్తున్నారు. తలపాగాలు ధరించి, సంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్లు నడుపుతూ దారి పొడవునా సందడి చేస్తున్నారు. అలాగే రష్యా, బ్రెజిల్ భామలు పెళ్లి, రిసెప్షన్ వేదికల వద్ద స్వాగత సత్కారాలు చేస్తున్నారు. విచిత్ర వస్త్రధారణతో ఆహూతులను అలరిస్తున్నారు. వెస్ట్రన్ మ్యూజిక్కు లయబద్ధంగా డ్యాన్సులు చేస్తూ మంత్రముగ్ధులను చేస్తున్నారు. పీకాక్, స్వాన్ వేషధారణలతో స్వాగతం పలుకుతున్నారు. వీరితో పాటు అతిథులకు ముంత లస్సీలు అందజేసే మరాఠీ మహిళలు, కేటరింగ్ చేసే ఒడిశా యువతులు, ప్రత్యేకంగా బాదంపాలు అందించే పశ్చిమ బెంగాల్ మహిళలు, రకరకాల స్వీట్ పాన్లు అందించే నవాబులు ఇలా ప్రతి చోటా పెళ్లికి వచ్చేవారికి మర్యాదలు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క ఈవెంట్‌కు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చవుతుందని అంచనా. ఖర్చు అధికమే.. రష్యన్ కళాకారులు వివిధ రకాల ప్రదర్శనల కోసం ముంబై, ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు. వీరిని పెళ్లి ఈవెంట్‌కు తీసుకురావాలంటే పారితోషికంతో పాటు విమానం టికెట్లు కూడా ఇవ్వాలి. దీంతో ఒకేసారి విశా ఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఈవెంట్లు ఏర్పాటు చేసి, వీరిని రప్పిస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్ నుంచి వచ్చేవారు పెళ్లిళ్ల సీజన్లో వచ్చి స్థానికంగా ఉంటారు. వీరితో ఆయా రాష్ట్రాల సంప్రదాయ బ్యాండ్ కళాకారులను కూడా ఇక్కడి పెళ్లిళ్లకు తీసుకు వస్తున్నారు. -
కొండపై కోటరీల కుమ్ములాట
● సత్యదేవుని సన్నిధిలో ఇదేం నిర్వాకం! ● అవమానంతో కొండ దిగుతున్న సేవకులు ● వీఆర్ఎస్, సెలవులకు క్యూ ● రత్నగిరిపై గాడి తప్పిన పాలన సాక్షి ప్రతినిధి, కాకినాడ: సత్యదేవుని సన్నిధి కోటరీలకు కేంద్ర బిందువుగా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో సైతం వ్రతాలు నిర్వహించిన ఖండాంతర ఖ్యాతి వీర వేంకట సత్యనారాయణస్వామి వారి సొంతం. కార్తిక మాసంతో పాటు పండుగలు, వివాహాది శుభకార్యాలప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చే భక్తులతో అన్నవరం రత్నగిరి కళకళాడుతూంటుంది. భక్తవరదుడైన సత్యదేవుడు స్వయంభువుగా వెలసిన ఈ కొండపై స్వామివారికి, భక్తులకు సేవలందించాల్సిన అధికారులు.. కుమ్ములాటలతో ఈ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇక్కడ వివిధ క్యాడర్లలో పని చేస్తున్న 250 మంది రెగ్యులర్, వెయ్యి మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.. రెండు కోటరీల మధ్య నలిగిపోతున్నారు. దేవస్థానంలో గాడి తప్పిన పాలనపై జిల్లా కలెక్టరే స్వయంగా జోక్యం చేసుకునే పరిస్థితులు ఉత్పన్నం కావడం ఆలయ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. మునుపెన్నడూ లేని రీతిలో కొండపై రెండు కోటరీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. కొరవడిన సమన్వయం ఆలయ కార్యనిర్వహణాధికారులు(ఈఓ)గా దేవదా య శాఖ నుంచే కాకుండా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఎంతో మంది తమ సేవల ద్వారా ప్రశంసలు పొందారు. కారణాలేవైనప్పటికీ దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఇటీవల ఆలయ పాలనా వ్యవహారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ విభాగాల ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడుతోంది. పరస్పర ఫిర్యాదులతో అన్నవరం సత్యదేవుని ఆలయం రాష్ట్ర స్థాయిలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రెవెన్యూ శాఖకు చెందిన వీర్ల సుబ్బారావు గత డిసెంబర్ 14న ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముందు ఇక్కడ ఈఓగా పని చేసిన కె.రామచంద్ర మోహన్ ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అన్నవరం ఈఓగా పని చేసిన కాలంలో కొన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు ఆయనకు నమ్మిన బంట్లుగా ఉండేవారు. వారందరినీ రామచంద్ర మోహన్ కోటరీగా చెప్పుకునేవారు. ఆ కోటరీలో ఉన్న వివిధ విభాగాల ఏఈఓలు, ఇతర విభాగాల ఉద్యోగులు ప్రస్తుతం అవమానాలు ఎదుర్కొంటున్నారనే చర్చ ప్రస్తుతం కొండపై నడుస్తోంది. నాడు రామచంద్ర మోహన్‌కు నమ్మకస్తులమనే ముద్ర వలన ఇప్పుడు తమ పని తాము చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయని వారు అంటున్నారు. వివాదాస్పద నిర్ణయాలతో.. దీనికి తోడు దేవస్థానంలో తాజాగా తీసుకుంటున్న పలు విధానపరమైన నిర్ణయాలు వివాదాస్పంగా మారాయి. కొన్ని నిర్ణయాలు కమిషనర్ రామచంద్ర మోహన్‌కు, ఈఓ సుబ్బారావుకు మధ్య ఆధిపత్య పోరుకు దారి తీశాయని అంటున్నారు. తాజాగా కొండపై సీతారామ సత్రం శంకుస్థాపన వ్యవహారం వీరి మధ్య అగాధాన్ని మరింత పెంచిందంటున్నారు. సత్రం శంకుస్థాపన సమాచారం తనకు చెప్పకుండా నేరుగా దేవదాయ శాఖ మంత్రికి ఈఓ తెలియజేయడం కమిషనర్ ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు. ఈ వ్యవహారం కమిషనర్, ఈఓల మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసిందనే చర్చ ఆలయంలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ప్రిన్సిపాల్ పోస్టింగ్‌పై.. సత్యదేవుని విద్యా సంస్థలో ఎఫ్ఏసీగా పని చేస్తున్న రామ్మోహనరావుకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్ట్ ఇవ్వడం పెద్ద దుమారం రేపుతోంది. రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా ఇవ్వాలంటే పీహెచ్డీ తప్పనిసరి అని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నిర్దేశించిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు. నిబంధనలు అనుమతించనందువల్లనే రామ్మోహనరావుకు గతంలో రామచంద్ర మోహన్ రెగ్యులర్ పోస్టింగ్ తిరస్కరించారు. ఈ పోస్టుకు ప్రధాన అర్హత లేకున్నా, నేషనల్ ఎలిజిబిలిటీ, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ ఉందంటూ ప్రస్తుత ఈఓ పోస్టింగ్ ఎలా ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సన్నిహితుడు కావడమే అర్హతగా ఈ పోస్టు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. సత్యదేవుని ఆలయంలో గతంలో జరిగిన నియామకాల్లో లోపాలున్నాయంటూ పాత ఫైల్స్ తిరగేస్తున్న ఈఓ.. ఎఫ్ఏసీలో ఉన్న వారికి రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్టు ఇవ్వడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టింగ్ విషయంలో ఈఓ సన్నిహితుడికి వ్యతిరేకంగా పని చేసినందుకు అవమానిస్తున్నారనే మనస్తాపంతో ఈఓ పేషీ, వ్రతాలు పర్యవేక్షించే సూపరింటెండెంట్ కంచి మూర్తి అనారోగ్య కారణాలతో సింహాచలం దేవస్థానానికి బదిలీపై వెళ్లిపోయారని చెబుతున్నారు. ఈ పోస్టింగ్‌పై కమిషనర్, ఈఓ మధ్య వివాదం రాజుకుందనే వార్త కొండపై చక్కర్లు కొడుతోంది. గాడి తప్పిన పాలనపై ఫిర్యాదులు ఉద్యోగులు సెలవులు, వీఆర్ఎస్లు పెడుతున్న క్రమంలో అన్నవరం దేవస్థానంలో పాలన గాడి తప్పిందంటూ కమిషనర్‌కు ఫిర్యాదుల మీదు ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇటీవల కొండపై అన్నింటా తానే అన్నట్టు ఓ అధికారి పుత్రరత్నం ‘చినబాబు’ వ్యవహరిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ సైతం తీవ్రంగా పరిగణించారని తెలియవచ్చింది. రెవెన్యూలో పని చేస్తున్న ఈఓ సుబ్బారావు అక్కడి నుంచి అన్నవరం దేవస్థానానికి రావడానికి సిఫారసు లేఖలిచ్చిన ప్రజాప్రతినిధులే.. కొండపై పాలన గాడి తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. గతంలో రెవెన్యూలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు(ఎస్డీసీ)గా పని చేస్తూ ఐఏఎస్‌లు అయిన ఎంవీ శేషగిరిబాబు, ఎస్.సత్యనారాయణతో పాటు ఎస్డీసీలు ప్రసాదం వెంకటేశ్వర్లు, జితేంద్ర, కాకర్ల నాగేశ్వరరావు వంటి వారు ఈఓలుగా పని చేసినా ఇంతలా పాలన ఎప్పుడూ దిగజారలేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం ఇక్కడ పని చేయలేమంటూ.. అన్నవరం దేవస్థానంలో పని చేయలేమంటూ పలువురు వెళ్లిపోతున్నారు. అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రామ్మోహనరావుకు గత ఈఓ, ప్రస్తుత కమిషనర్ రామచంద్ర మోహన్‌కు సన్నిహితుడనే ముద్ర ఉంది. రామ్మోహన రావు అన్నవరం నుంచి రాజమహేంద్రవరం, తరువాత పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పని చేసి, అక్కడి నుంచి అన్నవరం దేవస్థానానికి తిరి గి వచ్చారు. నాలుగు నెలల్లో రిటైర్ కానున్న తరు ణంలో ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. అన్నదానం ఏఈఓ భ్రమరాంబ సిక్ లీవ్‌పై కొండ దిగిపోయారు. విజయవాడ నుండి డెప్యూటేషన్‌పై వచ్చి, అన్నవరంలో పని చేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ వీఆర్ఎస్కు అర్జీ పెట్టుకున్నారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఓలేటి జగన్నాథం, ఇద్దరు ఏఈఓలు జగ్గారావు, శ్రీనివాస్ సెలవు పై వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయంలో సెక్యురిటీ గార్డులుగా పని చేస్తున్న 10 మందిని అకస్మాత్తుగా తొలగించేశారు. ఆలయానికి వస్తున్న చినబాబును సరైన రీతిలో స్వాగతించడం లేదనే కారణంతో తమను తొలగించేశారని వారంతా ఎమ్మెల్యేల వద్ద మొర పెట్టుకున్నారు. -
కిటకిటలాడిన తొలి తిరుపతి
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో శనివారం కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామివారికి రూ.2,91,596 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు. రేపు ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తుని రూరల్: హంసవరంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో చేరికకు సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ పుల్లా పద్మజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లోనే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలన్నారు. హాల్ టికెట్, ఆధార్ నకలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బ్లాక్ లేదా బ్లూ పెన్నులతో పరీక్షకు సకాలంలో హాజరు కావాలని సూచించారు. కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారిగా శారద బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారిగా ఐ.శారద శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన నూకరాజు గత మార్చి 30న ఉద్యోగ విరమణ చేశారు. మామిడికుదురుకు చెందిన ఏసుబాబును జిల్లా అధికారిగా నియమించగా ఆయన రెండు వారాల పాటు పని చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నందున ఈ బాధ్యతలు నుంచి తనను తొలగించాలని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ఆయనను రిలీవ్ చేసి, జోన్–2 ఆర్జేడీగా ఉన్న శారదను ఈ పోస్టులో నియమించారు. ఈ సందర్భంగా శారదను పీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు, ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ మావూరి తిరుపతిరెడ్డి, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బంది అభినందించారు. అందరి సహాయ సహకారాలతో జిల్లాలో ఇంటర్ అడ్మిషన్ల పెంపుదలతో పాటు మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తానని శారద చెప్పారు. -
మొదలైన పెళ్లి సందడి
● సత్యదేవుని రథానికి మరమ్మతులు ● 23న ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశంఅన్నవరం: వచ్చే నెల 7 నుంచి జరగనున్న సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లు ఎట్టకేలకు మొదలయ్యాయి. కల్యాణ ఘడియలు సమీపిస్తున్నా ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు కాలేదని పేర్కొంటూ ‘కానరాని పెళ్లి సందడి’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 11న నిర్వహించే రథోత్సవంలో ఉపయోగించే రథం ముసుగు తొలగించి, మరమ్మతులు ప్రారంభించారు. ఈ రథం తయారు చేసిన మురమళ్లకు చెందిన కొల్లాటి శ్రీనివాస్‌ను, మరో నలుగురు శిల్పులను రప్పించారు. వారు రథానికి ఉన్న ఆరు చక్రాల ఇరుసులకు గ్రీజు పెట్టి, వాటి పనితీరు పరిశీలించారు. చక్రాల అడుగున నలుపు రంగు వేశారు. బ్రేకుల పనితీరు పరిశీలించి, రథాన్ని శుభ్రం చేసి, ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ పనులన్నింటికీ నాలుగు రోజులు పడుతుందని శ్రీనివాస్ తెలిపారు. హైడ్రాలిక్ బ్రేకుల పనితీరును పరిశీలించేందుకు రెండు మూడు రోజుల్లో నిపుణులు వస్తారని చెప్పారు. అలాగే, కోరుకొండ రథోత్సవం నిర్వహణలో అనుభవజ్ఞులైన 30 మంది నిపుణులను కూడా సత్యదేవుని రథోత్సవానికి రప్పిస్తున్నారు. రథానికి కట్టే పగ్గాలను కూడా తాళ్లరేవు నుంచి తీసుకుని వచ్చారు. కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై ఈ నెల 23న దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాలకు సంబంధించి గత నెలలో దేవస్థానం అధికారుల అంతర్గత సమావేశంలో చర్చించిన అంశాలు, ప్రభుత్వ విభాగాలు అందించాల్సిన సహకారంపై రూపొందించిన మినిట్స్‌ను ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం పరిశీలించారు. సమన్వయ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచారం పంపించారు. కలెక్టర్ షణ్మోహన్‌ను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. -
రత్నగిరి వివాదాలపై విచారణ
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఇటీవల ఏర్పడిన పలు వివాదాలపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విచారణ జరిపి నివేదిక అందజేయాలని దేవదాయ శాఖ అదనపు కమిషనర్ కె.చంద్రకుమార్‌కు శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చంద్రకుమార్ కూడా కొన్ని రోజులు అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేశారు. కొంత కాలంగా దేవస్థానంలో ఈఓ వీర్ల సుబ్బారావు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు దేవస్థానంలోని పలు విభాగాలను పరిశీలిస్తూ సిబ్బందికి ఆదేశాలివ్వడం, ఈఓ కార్యాలయంలో జరిగిన డ్రోన్ కెమెరాల కొనుగోలు సమావేశంలో ఆయనతో పాటు పాల్గొని, అధికారులకు సూచనలివ్వడంపై వివాదం రేగింది. ఈఓ వ్యవహార శైలిపై ఆవేదన చెందిన ఇద్దరు అధికారులు వీఆర్ఎస్కు దరఖాస్తు చేయడం, మరికొంత మంది సెలవుపై వెళ్లడం విదితమే. వరుసగా జరిగిన ఈ వివాదాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దేవస్థానం వ్యవహారాల్లో ఈఓ కుమారుడు జోక్యంపై మంగళవారం ప్రచురితమైన ‘చినబాబు వచ్చారు.. బహుపరాక్’ కథనం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఆ రోజు విశాఖపట్నంలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం సమావేశంలో పాల్గొన్న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల సమావేశంలో కూడా ఈ కథనం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశించడంతో కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,100 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సెలవు దినం కావడంతో రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. పూజల అనంతరం అర్చకులు ప్రాకార సేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు చిట్టి శివ, అర్చకుడు కంచిభట్ల సాయిరామ్, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బయట కొనాల్సిన దుస్థితి
అధికారంలోకి అన్నీ డబుల్ చేసి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ప్రతి నెలా ఇచ్చిన కందిపప్పు రేషన్ వాహనాల్లో ఇవ్వడం లేదు. దీంతో కందిపప్పు బయట కొనుగోలు చేసుకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది. పేదలకు పౌష్టికాహారంగా ఉపయోగపడే కందిపప్పును రేషన్ ద్వారా ఇవ్వకపోవడం దారుణం. – కర్రి వెంకటలక్ష్మి, టిడ్కో గృహ సముదాయం, సామర్లకోట స్టాక్ రావడం లేదంటున్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా రేషన్ వాహనం ద్వారా బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు అందజేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో బియ్యం ఇస్తున్నారు. పంచదార అరకొరగా ఇస్తూండగా, కందిపప్పు అప్పుడప్పుడు కనిపిస్తోంది. గత నెల పంచదార కూడా ఇవ్వలేదు. కందిపప్పు ఊసే లేదు. డీలర్లను, రేషన్ వాహనదారులను అడిగితే పై నుంచి స్టాక్ రావడం లేదని చెబుతున్నారు. చేసేది లేక బియ్యం మాత్రమే తీసుకుని వెళ్తున్నాం. – ఎస్ఎస్ రామ్‌కుమార్, కిర్లంపూడి