
ముద్దులొలికే పొట్టిదూడ
కొత్తపేట: పుంగనూరు జాతి ఆవుకు దూడ జన్మించడంతో ఆ రైతు కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పొట్టిగా ముద్దులొలికే పొట్టి దూడ ఆ పెరట్లోనే కాకుండా వారి ఇంట్లో చెంగు చెంగుమని తిరుగుతుంటే ఆ ఇంట్లో వారి ఆనందం అంతా ఇంతా కాదు. కొత్తపేట గ్రామ దేవత బంగారమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన రైతు అద్దంకి చంటిబాబుకు ఒంగోలు జాతికి చెందిన ఆవు ఉండేది. దానికి పుంగనూరు జాతి బ్రీడు క్రాసింగ్ చేయించగా అప్పట్లో పుంగనూరు జాతి దూడే పుట్టింది కానీ ఒంగోలు జాతిని పోలి ఉంది. ఆ ఆవు పెద్దదయ్యాక దానికి తొలిచూరిగా పుంగనూరు బ్రీడు క్రాసింగ్ చేయించారు. నెలలు నిండాక పుంగనూరు దూడ పొట్టిగా (అడుగున్నర ఎత్తు) పెయ్య దూడ పుట్టింది. తెలుపు, కపిలవర్ణ రంగులో విశేషంగా ఆకర్షిస్తోంది.