మా అందరి పూర్వ జన్మ సుకృతం | - | Sakshi
Sakshi News home page

మా అందరి పూర్వ జన్మ సుకృతం

Apr 26 2025 12:26 AM | Updated on Apr 26 2025 12:26 AM

మా అందరి పూర్వ జన్మ సుకృతం

మా అందరి పూర్వ జన్మ సుకృతం

దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్‌ శర్మ కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా సన్యాసాశ్రమం స్వీకరించి, వారి శిష్యునిగా అవుతూండటం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము తొమ్మిది మంది అన్నదమ్ములం. ఆరుగురు చెల్లెళ్లు. గణేష్‌ శర్మ మా రెండో సోదరి భళ్లమూడి భాస్కరం, సూర్యనారాయణ దంపతుల కుమార్తె కొడుకు. అతడి తండ్రి దుడ్డు ధన్వంతరి, తల్లి మంగాదేవి. గణేష్‌ను నా చేతుల మీద పెంచాను. ద్వారకా తిరుమలలో ఆగమ శాస్త్రాలు అభ్యసించి, పరీక్షలో గోల్డ్‌ మెడల్‌ పొందాడు. అప్పుడే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అతడిని చూసి, పరీక్షించారు. అతడి విద్వత్తు చూసి కంచి పీఠానికి తీసుకుని వెళ్లి, నాలుగు వేదాలు, ఉపనిషత్తులు నేర్పించారు. గణేష్‌ శర్మ ఏకసంధాగ్రాహి. ఒకసారి చెప్పింది వెంటనే గుర్తు పెట్టుకుని అప్పగిస్తాడు. అతడికి ఈ గౌరవం దక్కడం మా పూర్వజన్మ సుకృతం.

– నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు, అన్నవరం దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement