
కూటి కోసం పోరాటం..
పిఠాపురం: ఎవరెన్ని పాట్లు పడినా పిల్లల కోసమే. ఈ తల్లి తన పిల్లల ఆకలి తీర్చేందుకు అలుపెరగక కోడి పిల్లల విక్రయానికి ప్రయాస పడుతోంది. అసలే ఎండా కాలం. నడినెత్తిన సూరీడు. మాడు మాడిపోయేలా ప్రకాశిస్తున్నాడు. ఓ చెట్టు నీడ కనపడేసరికి ఇలా నడుం వాల్చి కాస్త ఉపశమించింది. ఈ కోడి పిల్లల అమ్మకం అయ్యేదెపుడో.. తన పిల్లలకి ఆకలి తీర్చేదెపుడో.. కూటి కోసం కష్టపడుతున్న ఈ వృద్ధురాలు శనివారం స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల వద్ద మెయిన్ రోడ్డు పక్కన సేద తీరుతున్న దృశ్యమిది.