అమలాపురంలో తొలిసారిగా బాక్స్‌ క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అమలాపురంలో తొలిసారిగా బాక్స్‌ క్రికెట్‌ పోటీలు

May 31 2025 12:28 AM | Updated on May 31 2025 12:28 AM

అమలాప

అమలాపురంలో తొలిసారిగా బాక్స్‌ క్రికెట్‌ పోటీలు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కౌన్సెలింగ్‌తో ఒక్కటైన దంపతులు

ఆలమూరు: మండలంలోని బడుగువానిలంకలో మూడేళ్ల క్రితం విడిపోయిన దంపతులు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చొరవతో ఒక్కటయ్యారు. స్థానికుల కథనం ప్రకారం బడుగువానిలంకకు చెందిన పాలూరి వెంకటేష్‌తో పెదపళ్లకు చెందిన దేవి గౌతమికి 2014 లో వివాహమైంది. మూడవ కాన్పులో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో 2022 మార్చిలో దేవి గౌతమిని పిల్లలతో సహా భర్త వెంకటేష్‌ పుట్టింటికి పంపించి వేశాడు. అప్పట్లో పెద్దల వద్దకు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి కాపురాన్ని నిలబెట్టాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌గా ఆలమూరు మండలంలోని పెదపళ్లకు చెందిన గారపాటి శ్రీనివాసరావు నియమితులు కావడంతో దేవి గౌతమి ఆయనకు తన పరిస్థితి వివరించింది. దీనిపై స్పందించిన వైస్‌ చైర్మన్‌ గారపాటి భర్త వెంకటేష్‌ నివాసానికి వెళ్లి, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధుల సాయంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి భార్యాభర్తలిద్దరితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కాపురానికి ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ కృషిని ఇరు గ్రామాల ప్రజలు అభినందించారు.

అమలాపురం టౌన్‌: గుర్రాల విజయ కృష్ణ మెమోరియల్‌ పేరిట అమలాపురంలో మొట్టమొదటిసారిగా బాక్స్‌ క్రికెట్‌ పోటీలు స్థానిక గండువీధిలో ఈ నెల 28వ తేదీన మొదలయ్యాయి. జూన్‌ 3వ తేదీతో ఈ పోటీలు ముగిస్తాయని నిర్వాహకుడు కన్నా చెప్పారు. వారం రోజుల పాటు పోటీలను తమ సోదరుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతిగా రూ.30 వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొత్తం 40 జట్లు తలపడనున్నాయన్నారు. ప్రతీ మ్యాచ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ట్రోఫీని విజేత జట్టుకు అందజేస్తున్నారు.

అమలాపురంలో తొలిసారిగా బాక్స్‌ క్రికెట్‌ పోటీలు 1
1/1

అమలాపురంలో తొలిసారిగా బాక్స్‌ క్రికెట్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement