మాతృత్వానికి మరో మెట్టు! | - | Sakshi
Sakshi News home page

మాతృత్వానికి మరో మెట్టు!

Apr 28 2025 12:09 AM | Updated on Apr 28 2025 12:09 AM

మాతృత్వానికి మరో మెట్టు!

మాతృత్వానికి మరో మెట్టు!

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో తల్లిపాలు పొందలేని శిశువులకు పాలందిస్తూ ధాత్రి మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ విశేష ఆదరణ పొందింది. వందలాది శిశువుల తల్లిపాల ఆకలిని తీరుస్తూ పసిమొగ్గల పాలిట మరో అమ్మగా అవతరించింది. కాకినాడ జీజీహెచ్‌, సుషేణ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ధాత్రి మిల్క్‌ బ్యాంక్‌ 2023 ఫిబ్రవరిలో వెలసింది. నాటి నుంచి తల్లిపాల సంబంధిత సేవల్లో తరిస్తూ తల్లికి దిగులు లేకుండా, బిడ్డ పోషణకు లోటు రాకుండా ఎనలేని సేవలందిస్తోంది.

తల్లిపాలకు తల్లితో పనిలేదు

శిశువు తల్లిపాలు తాగేందుకు తల్లితోనే పనిలేదు. మరో తల్లి దానం చేసిన పాలను శాసీ్త్రయ విధానంలో శుద్ధి చేసి, భద్ర పరిచి తల్లిపాలకు నోచుకోని పిల్లలకు అందిస్తారు. ఈ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ ఎందరో పసిమొగ్గల జీవితాలను పౌష్టికం చేస్తోంది. ఫార్ములా ఫీడ్‌తో డబ్బా పాలకు స్వస్తి చెప్పడంతో పాటు భావితరాలలో పోషకాహార లోటును రూపుమాపడమే మిల్క్‌ బ్యాంక్‌ సేవల లక్ష్యం.

ఏడాదిలో 102 మంది పిల్లలకు

గడచిన ఏడాది కాలంలో జీజీహెచ్‌ మిల్క్‌ బ్యాంక్‌ ద్వారా 102 మంది శిశువులకు తల్లిపాలు అందించారు. తల్లి, తల్లి తరఫున కుటుంబ సభ్యులు లేదా వైద్య సిబ్బంది ఎవరు శిశువును మిల్క్‌ బ్యాంక్‌కు తీసుకువచ్చినా పాలు పడతారు. ఇంటి దగ్గర ఫీడ్‌ కోసం తల్లిపాలు అందిస్తారు.

శిశువులకు పాల లోటెందుకు...

పండంటి శిశువును ప్రసవించడం, ఆ శిశువుకి చనుబాలు అందిస్తూ తల్లిగా పునర్జన్మించడం ప్రతి సీ్త్రకి ఓ వరం. అయితే, అమ్మగా మారిన ప్రతి మహిళకు అది సాధ్యం కాదు. అందుకు వివిధ కారణాలు దోహదపడతాయి. తల్లి అనారోగ్యానికి గురి కావడం, పోషకాహార లోపంతో బాధపడుతుండడం, హార్మోన్ల అసమతుల్యత, సిజేరియన్‌ డెలివరీ, తల్లిలో ఒత్తిడి, ఆందోళన, ఛాతి సంబంధిత శస్త్రచికిత్సల కారణంగా పాలు ఉత్పత్తి కాకపోవచ్చు లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వొచ్చు.

జీజీహెచ్‌లో కొనసాగుతున్న

మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ సేవలు

ఫార్ములా ఫీడ్‌కు స్వస్తి చెప్పేలా

పసిపిల్లలకు తల్లి పాలు

తల్లి నుంచి పాలు పొందలేని

శిశువులకు వరం

ఏడాది కాలంలో 102 మంది పిల్లలకు తల్లిపాల ప్రయోజనాలు

ఏడాది కాలంలో...

పాలు పొందిన శిశువులు – 102

మదర్‌ బ్యాంక్‌ ప్రయోజనాలు అందుకున్న తల్లులు –

1,457

మిల్క్‌ బ్యాంక్‌ ద్వారా తమ పాలను తామే శాసీ్త్రయ పద్ధతిలో చనుబాల నుంచి పొందినది

5,60,971 మిల్లీ లీటర్లు

మిల్క్‌ బ్యాంక్‌ ద్వారా సేకరించిన పాలు

55,765 మిల్లీ లీటర్లు

శిశువులకు అందించిన పాల మొత్తం

37,175 మిల్లీ లీటర్లు

తల్లులు సందర్శన 9,284

శిశువుల సందర్శన 621

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement