jagitya distirct
-
దైవ దర్శనానికి వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
సాక్షి,జగిత్యాల: మేడిపల్లి మండలం కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. శివగంగ ఆలయం సమీపంలోని కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. తొలుత ఇద్దరు మృతదేహాలు లభించగా ఒకరు గల్లంతయ్యారు. దీంతో వెంటనే గల్లంతైన చిన్నారి కోసం గజ ఈతగాళ్లు కోనేరులో దిగి గాలింపులు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. మృతులు మనస్వి, అర్వింద్‌గా గుర్తించారు. పిల్లల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జగిత్యాల జిల్లాలో పోలీసు సర్కిళ్లు పెంచాలి
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో పోలీస్ సర్కిళ్ల పరిధి పెంచాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎస్పీ జోయల్ డేవిస్‌కు లేఖరాశారు. జగిత్యాల టౌన్ యథావిధిగా కొనసాగించి జగిత్యాల రూరల్ సర్కిల్లో జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాలు, ధర్మపురి సర్కిల్లో ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాలు, మల్యాల సర్కిల్లో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి మండలాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు.


