Ilangovan
-
రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..
చెన్నై: తన మనవడు, మనవరాలు చెప్పినందుకే టీవీకే పార్టీకి ఓటు చేశామని రూ. 2,500 ఎప్పుడు వస్తాయని ఒక మహిళ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శివగంగ జిల్లాలోని మనమదురై ప్రభుత్వ ఆసుపత్రిని టీవీకే ఎమ్మెల్యే ఇలంగోవన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రాథమిక సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సను ఆయన పరిశీలించారు. ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తనిఖీ సమయంలో, మునియమ్మల్ అనే ఒక రోగి ఎమ్మెల్యేను ఇలా అడిగారు, ‘నా మనవడు, మనవరాలు అందరూ మీకు ఓటు వేయమని నన్ను అడిగారు. అందుకే మీకు ఓటు వేశాము. మేము కూడా మీరు రూ. 2,500 ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నాం అని అడిగారు.’ దీనికి ప్రతిస్పందనగా, ఎమ్మెల్యే ఇలంగోవన్, ‘ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,500 కంటే కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యం’ అని చెప్పారు. ఇది విని మునియమ్మాల్ నిరాశ చెందారు. -
కాంగ్రెస్ ఒక్కటే సరిపోదు.. డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు పొలిటికల్ యూటర్న్లు పీక్‌స్టేజ్‌కు చేరుకున్న వేళ డీఎంకే నాయకుడు ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదన్నారు. డీఎంకే ఒంటరిగానే ఉందన్నారు. విజయ్.. తగిన బలంతో వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ను సంప్రదించాలన్నారు.డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలాంగోవన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీవీకే అధినేత విజయ్ ముందుగా ఇతర రాజకీయ పార్టీలతో ప్రయత్నించి ఆ తర్వాతే గవర్నర్‌ను సంప్రదించాలి. ఒకే అతిపెద్ద పార్టీగా టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో విజయ్ ఒంటరిగా వెళ్ళి ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ వారు కాంగ్రెస్‌తో కలిసి వెళ్ళి, మెజారిటీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తగిన బలం లేకుంటే గవర్నర్ ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. తమిళనాడులో డీఎంకే ఒంటరిగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన మాకు లేదు. ఏఎంఎంకే ఎమ్మెల్యే టీవీకేకు మద్దతు ఇవ్వనప్పుడు ఆయన మద్దతు లేఖ ఎందుకు ఇవ్వాలి? ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్జరీ కేసులో పోలీసులు ఏం తేల్చారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ఏఎంఎంకే సపోర్టు లెటర్ లేకుండా ఎందుకు డ్రామా చేస్తోంది. అన్నాడీఎంకే ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచింది. టీటీవీ దినకర్ అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా అన్నాడీఎంకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిందని మండిపడ్డారు. #WATCH | Chennai | DMK leader TKS Elangovan says, "He (TVK chief Vijay) should first try with other political parties and then approach the Governor. If AMMK MLAs are not supporting TVK, then why should he give a letter of support? Let us see what happens when the police… pic.twitter.com/IPIfw54koq— ANI (@ANI) May 9, 2026అంతకుముందు కూడా ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేకు బీజేపీ ఎలాంటి సూచనలు చేసిందో తనకు తెలియదన్నారు. ఒకవేళ అన్నాడీంఎకే గనక టీవీకేకు మద్దతు ఇవ్వకపోతే.. ఏ పార్టీకీ సరైన మద్దతు రాకపోవడంతో హంగ్ వస్తే.. మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకే ఓటమిపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో పొరపాటు జరిగిందని.. అదేమిటో తాము పరిశీలిస్తున్నామన్నారు. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే డీఎంకే అజెండా కాదని, కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని, అందువల్ల ఆ పార్టీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. -
ఎంపిక కొలిక్కి..
సాక్షి, చెన్నై : డీఎంకే, కాంగ్రెస్‌ల నియోజకవర్గాల ఎంపిక కొలిక్కి వచ్చింది. స్నేహపూర్వకంగా నియోజకవర్గాల ఎంపిక ముగియడంతో గురువారం ఆ వివరాల్ని ప్రకటించేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నిర్ణయించారు. డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం కొలిక్కి రావడంతో నియోజకవర్గాల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. తమకుకావాల్సిన నియోజకవర్గాల్ని సాధించుకుంది.కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు తమకు మద్దతు దారులకు పలాన నియోజకవర్గం అంటే, పలాన నియోజకవర్గం కావాలని ప్రత్యేక కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇచ్చిన జాబితాతో బుధవారం సాయంత్రం డిఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నేతృత్వంలోని కమిటీ అడుగు పెట్టింది. అక్కడ డిఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కమిటీతో గంటన్నరకు పైగా సమాలోచించింది. రెండు కమిటీలు స్నేహ పూర్వకంగా నియోజకవర్గాల ఎంపికను పూర్తి చేశాయి. తమకు కావాల్సిన స్థానాల్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని సాధించుకుంది. అయితే, కొన్ని స్థానాల విషయంగా మాత్రం డీఎంకే మెట్టు దిగనట్టు, వాటికి బదులుగా ప్రత్యామ్నాయ స్థానాల్ని స్టాలిన్ అప్పగించి ఉన్నారు. నియోజకవర్గాల ఎంపిక ముగిసినానంతరం వెలుపలకు వచ్చిన ఈవీకేఎస్ ఇళంగోవన్, ఆయా నియోజకవర్గాల వివరాల్ని గురువారం ప్రకటిస్తామని ముందుకు సాగారు. -
అక్షింతలు
సాక్షి, చెన్నై : టీఎన్పీఎస్సీ వర్గాలపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణతో కూడిన పిటిషన్ సమర్పణలో జాప్యం చేసినందుకు గా ను తలా రూ. ఐదు వేలు చొప్పు న జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఇటీవల ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీ పర్వం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా అరుల్ మోళిని నియమిం చారు. గత ఏడాది కొంత కాలం గా ఆయన తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించినా, ఇటీవల ఆయ న పూర్తి స్థాయిలో బాధ్యత చేపట్టారు. అదే సమయంలో ఆ కమిషన్‌కు 11 మంది సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిం ది. అయితే, ఈ కమిటీకి వ్యతిరేకత బయలు దేరింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, పుదియ తమిళగం నేత కృష్ణస్వామిలతో పాటుగా పలువురు ఈ కమిటీకి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయిం చారు. టీఎన్పీఎస్సీ నియమ నిబంధనల మేరకు ఈ కమిటీ నియామకం జరగ లేదని, 11 మందిలో ఏడుగురు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు సంబంధించిన కేసులో విచారణలకు హాజరైన వాళ్లు ఉన్నారని ఆరోపించారు. ఈ కమిటీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ గత నెల విచారణకు వచ్చింది. విచారణ సమయంలో వివరణతో కూడిన పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, టీఎన్పీఎస్సీ కార్యదర్శి, సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నోటీసులు జారీ చేశారు. అయితే, ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్ప, మిగిలిన వారిలో స్పందన రాక పోవడంతో హైకోర్టు ఆగ్రహానికి గురి కాక తప్పలేదు. గురువారం పిటిషన్ విచారణకు రాగా, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణతో కూడిన నివేదికను దాఖలు చేశారు. మిగిలిన వారి తరఫున హాజరైన న్యాయవాదులు తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు సమయం వృధా చేసినందుకు గాను కేసు ఖర్చుల నిమిత్తం టీఎన్పీఎస్సీ కార్యదర్శితో పాటుగా మిగిలిన వాళ్లు తలా రూ. ఐదు వేలు చొప్పున జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ైజూన్ 13కు వాయిదా వేశారు. -
నల్లకన్నుకే నా ఓటు
సాక్షి, చెన్నై : సీపీఐ నేత నల్లకన్ను సీఎం పదవికి అర్హుడని, ఆయన రేసులో ఉంటే, తన ఓటు ఆయనకే అని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే తమకు ఆహ్వానం పలకడంతో ఆ దిశగా పొత్తు యత్నాల్లో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తుల్లో మునిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఆయన వ్యాఖ్యల్ని ఇతర నాయకులు తీవ్రంగా ఖండించే పనిలో పడ్డారు. ఈ సమయంలో శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్భూ ఏకంగా ఇళంగోవన్ సీఎం పదవికి అర్హుడని, ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయని వ్యాఖ్యానిం చడం కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల్లో మరిం త చర్చను వేడెక్కించింది. ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టే వాళ్లు ఓ వైపు ఉంటే, మరో వైపు ఏకంగా తాను కాదు...కమ్యూనిస్టు నేత నల్లకన్ను సీఎం పదవికి అర్హుడన్నట్టుగా ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం మరో చర్చకు తెరలేపినట్టు అయింది. నల్లకన్నుకే ఓటు : కమ్యూనిస్టు సీని యర్ నేత నల్లకన్నుకు అంబేద్కర్ బిరుదును శని వారం రాత్రి ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ కమ్యూనిస్టు నేతను పొగడ్తల్లో ముంచెత్తారు. నల్లకన్నుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు, పొత్తులు ఎలా ఉంటాయో ఏమో తెలియదు గానీ, సీఎం పదవి రేసులో నల్లకన్ను ఉంటే తన మద్దతు ఓటు ఆయనకే అని వ్యాఖ్యానించారు. ఆయన ఉత్తమ నాయకుడు అని వ్యాఖ్యానిస్తూ, ఆ పదవికి అర్హుడేనని స్పందించడంతో ఇప్పటికే ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థితత్వంపై సాగుతున్న చర్చ మరింత వేడెక్కినట్టు అయింది.


