Harsh Dube
-
భారత జట్టులో మార్పు.. కేకేఆర్ స్టార్‌కు లక్కీ ఛాన్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌కు సువర్ణావకాశం వచ్చింది. భారత్-‘ఎ’ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. హర్ష్ దూబే స్థానంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగే త్రైపాక్షిక సిరీస్‌కు అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు.హర్ష్ దూబే స్థానంలో..ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెల్లడించింది. కాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే ఇటీవలే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.కారణం ఇదేకాగా హర్ష్ దూబే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే, అఫ్గన్‌తో సిరీస్ కంటే ముందు ప్రకటించిన భారత జట్టులో హర్ష్ దూబేకు చోటిచ్చారు సెలక్టర్లు. తాజాగా అతడి స్థానంలో అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.జార్ఖండ్‌కు చెందిన 27 ఏళ్ల అనుకుల్ రాయ్ స్పిన్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ ఆటగాడు ఐపీఎల్-2026లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి 43 పరుగులు చేయడంతో పాటు.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.తిలక్ వర్మ సారథ్యంలోఇదిలా ఉంటే.. శ్రీలంకలో జరిగే వన్డే ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్-‘ఎ’, అఫ్గన్-‘ఎ’ జట్లు పాల్గొంటాయి. జూన్ 9- జూన్ 21 మధ్య ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు డంబుల్లా వేదిక. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత్-‘ఎ’ జట్టు (అప్డేటెడ్)తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదోని, నిశాంత్ సంధు, సూయాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
క్రెడిట్ మొత్తం అతడికే.. క్లాసెన్ అదరగొట్టాడు: ఇషాన్ కిషన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్ మ్యాచ్ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇలాంటి వికెట్ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.క్రెడిట్ మొత్తం అతడికే.. నిజానికి ఈ పిచ్ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.ఇక ఆఖరి ఓవర్లో హర్ష్ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.మలింగ అద్భుతస్పెల్లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ అద్భుత స్పెల్ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. హర్ష్ దూబే ఆఖరి ఓవర్లోఇక హర్ష్ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్ మధుషాంక, సకీబ్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
IND vs AUS: శతకాలతో చెలరేగిన కొన్‌స్టాస్, ఫిలిప్.. ఆసీస్ భారీ స్కోరు
భారత్-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. సెంచరీతో కదంతొక్కిన కొన్స్టాస్టీమిండియాపై టెస్టు అరంగేట్రం చేసిన సామ్ కొన్‌స్టాస్ (Sam Konstas) సెంచరీతో కదంతొక్కగా... క్యాంప్‌బెల్ కెల్లావే (Campbell Kellaway- 97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ కనొల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించిన అనంతరం క్యాంపెబల్ అవుట్ కాగా.. ఈ దశలో భారత బౌలర్లు కాస్త పోరాటం కనబర్చారు. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (1), ఒలీవర్ పీక్ (2)ను వెంట వెంటనే ఔట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 198/0 నుంచి 224/4కు చేరింది. ఇక పట్టు చేజిక్కించుకోవడమే తరువాయి అనుకుంటుంటే... కూపర్ కనొల్లీ, లియామ్ స్కాట్ (79 బంతుల్లో 47 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పట్టుదల కనబర్చారు.దూబే... ఒక్కడే ఈ జంట ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించింది. ప్రసిధ్ కృష్ణ (0/47), ఖలీల్ అహ్మద్ (1/46) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... ఆసీస్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన దూబే... ఒక్కడే ఆసీస్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగాడు. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.జోష్ ఫిలిప్ అజేయ సెంచరీఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లియామ్ స్కాట్‌తో పాటు జోష్ ఫిలిప్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా లియామ్ స్కాట్ (81) అదరగొట్టగా.. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ అజేయ సెంచరీ (123)తో దుమ్ములేపాడు. మరోవైపు.. టెయిలెండర్ జేవియర్ బార్ట్లెట్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక బుధవారం భోజన విరామ సమయానికి భారత్-‘ఎ’ జట్టు మూడు ఓవర్లలో మూడు పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 2, నారాయణ్ జగదీశన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో..ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా- ‘ఎ’తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ వంటి వాళ్లు బరిలో ఉన్నారు. చదవండి: IND Vs WI: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు


