Anand rathi
-
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
భారతదేశం తన అవసరానికి మించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికి పరిష్కారం ప్రభుత్వ విధానాల్లో కంటే, ప్రజల లాకర్లలోనే ఉందని ఆనంద్ రాథి వెల్త్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం వరకు విక్రయించాలని ఆయన కోరారు. ఇది త్యాగం కాదు, దేశం కోసం చేసే ఒక రకమైన "ఆర్థిక దేశభక్తి" అని ఆయన అభివర్ణించారు.భారత్‌లో సమస్యగా బంగారం భారతీయ కుటుంబాల వద్ద సమిష్టిగా దాదాపు 4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.4 కోట్ల కోట్లు) విలువైన బంగారం ఉంది. ఇందులో చాలా వరకు వాడకుండా లాకర్లలో ఖాళీగా పడి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు 35 బిలియన్ డార్లుగా ఉన్న భారతదేశ వార్షిక బంగారం దిగుమతులు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడానికి, రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణమవుతోంది.పోయిన విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్ నుండి రూ.1,68,000 కోట్లు (17–18 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ, మన దేశ బంగారం దిగుమతి బిల్లు దీని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.100 గ్రాముల విక్రయంతో వచ్చే మార్పుఈ ప్రతిపాదన ఎంత ఆచరణాత్మకమైనదో చెప్పడానికి అజీజ్ కొన్ని లెక్కలను వివరించారు. ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములను (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.15-16 లక్షలు) విక్రయిస్తే ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.. ఆనంద్ రాథి సంస్థ పరిధిలోని 13,800 కుటుంబాలు ఇలా చేస్తేనే దాదాపు రూ.2,500–3,000 కోట్ల బంగారం తిరిగి మార్కెట్లోకి వస్తుంది.ఇదే విధంగా దేశంలోని సంపన్న కుటుంబాలన్నీ చేస్తే, బంగారం దిగుమతులను సులభంగా 40 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు. ప్రజలు విక్రయించే బంగారం ఆభరణాలు, పారిశ్రామిక అవసరాల కోసం మార్కెట్లో పునర్వినియోగంలోకి వస్తుంది. తద్వారా కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.ఇది త్యాగం కాదు... లాభాల స్వీకరణ !బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక గరిష్టాల వద్ద ఉన్నాయి. ఈ సమయంలో కొంత బంగారాన్ని విక్రయించడం అనేది దేశానికి మేలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో నిర్వహణ (లాభాలను ఖాతాలో వేసుకోవడం) అవుతుందని అజీజ్ పేర్కొన్నారు."ఈక్విటీ మార్కెట్లలో లాభాలు స్వీకరించినట్లే, బంగారంలోనూ భారీ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీ బంగారంపై 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేసుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.గడిచిన 10 ఏళ్ల కాలంలో బంగారం రూపాయి పరంగా కేవలం 8.5% వార్షిక రాబడిని మాత్రమే ఇచ్చింది. దీని కంటే 'సుకన్య సమృద్ధి యోజన' (8.25% వడ్డీ, పన్ను రహితం) వంటి ఇతర పొదుపు పథకాలు పన్నులన్నీ పోనూ మెరుగైన లేదా సమానమైన లాభాలను అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ప్రభుత్వానికీ విజ్ఞప్తిఈ ప్రచారంలో భాగంగా బంగారం విక్రయించిన రశీదులను సమర్పించాలని అజీజ్ ప్రజలను కోరుతున్నారు. దీని ద్వారా తగినంత మద్దతును కూడగట్టి, బంగారం విక్రయాలపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుండి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నారు. -
5 కంపెనీలు ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా, గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ చేరాయి. ఈ కంపెనీలు సెబీకి ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ ఐపీవో ద్వారా రూ. 2,700 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ విక్రయానికి ఉంచనుంది. ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకింగ్ సరీ్వసుల విభాగం ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఐపీవోలో భాగంగా రూ. 745 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న రూ. 745 కోట్లలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయ నున్నారు. ఈక్విటీ జారీ నిధులను రాజస్తాన్‌లోని అల్వార్‌లోగల జిలోత్ ఇండ్రస్టియల్ ఏరియాలో తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోగల ప్లాంటు విస్తరణతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వినియోగించనుంది. గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అహ్మదాబాద్‌లోని పరేఖ్స్ హాస్పిటల్ కొనుగోలుసహా.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్ సెంటర్ పాక్షిక చెల్లింపులకు, వడోదరలో రోబోటిక్స్ పరికరాలతోపాటు కొత్త ఆసుపత్రి ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. -
ఐపీవో బాటలో 3 కంపెనీలు
ప్రస్తుత కేలండర్ ఏడాది(2024)లో ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. గత వారం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ వారం మరో 4 కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో తాజాగా లక్ష్మీ డెంటల్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో 2 కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. మరోపక్క ఎన్లాన్ హెల్త్‌కేర్ అక్టోబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. వివరాలు చూద్దాం..ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ కంపెనీ.. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 745 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. వీటిలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర విస్తారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఆనంద్ రాఠీ బ్రాండుతో కంపెనీ ఆఫర్ చేస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్, హెచ్ఎన్ఐలకు సేవలు సమకూర్చుతోంది. గతేడాది(2023–24) ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 682 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా దాదాపు రెట్టింపై రూ. 77 కోట్లను దాటింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 442 కోట్ల ఆదాయం, రూ. 64 కోట్ల నికర లాభం అందుకుంది.జీకే ఎనర్జీసౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్ కంపెనీ.. జీకే ఎనర్జీ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 84 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 422 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సౌర విద్యుత్ వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్‌కు సంబంధించి ఈపీసీ సేవలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం–కేయూఎస్యూఎం పథకంలో భాగంగా సర్వీసులు సమకూర్చుతోంది. జల్‌జీవన్ మిషన్కింద నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. 2024 అక్టోబర్‌కల్లా రూ. 759 కోట్ల ఆర్డర్‌బుక్‌ను సాధించింది. గతేడాది(2023–24) ఆదాయం 44 శాతం ఎగసి రూ. 411 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 422 కోట్ల ఆదాయం, రూ. 51 కోట్ల నికర లాభం అందుకుంది.లక్ష్మీ డెంటల్ రెడీసెప్టెంబర్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన లక్ష్మీ డెంటల్ తాజాగా అనుమతి పొందింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ బిజ్డెంట్ డివైసెస్‌లో పెట్టుబడులకు, కొత్త మెషీనరీ కొనుగోలుకి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎండ్టుఎండ్ సమీకృత డెంటల్ ప్రొడక్టుల కంపెనీ ఇది. ఎలైనర్ సొల్యూషన్స్, పీడియాట్రిక్ డెంటల్ తదితర పలు ఉత్పత్తులను రూపొందిస్తోంది. -
ఆనంద్ రాఠీ వెల్త్ లాభం జూమ్
న్యూఢిల్లీ: నాన్‌బ్యాంక్ వెల్త్ సొల్యూషన్స్ కంపెనీ ఆనంద్ రాఠీ వెల్త్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 43 కోట్లను అధిగమించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం ఎగసి రూ. 140 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 109 కోట్ల టర్నోవర్ నమోదైంది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూ ఎం) 20 శాతం వృద్ధితో రూ. 38,517 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ, ఫై నాన్షియల్ ప్రొడక్టుల విక్రయం తదితర ఫైనాన్షియల్ సర్వీసులను కంపెనీ అందిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఆనంద్ రాఠీ వెల్త్ షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం జంప్‌చేసి రూ. 773 వద్ద ముగిసింది. తొలుత రూ. 780 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. -
కొలువులకు బుల్ కళ!
మళ్లీ జోరుగా నియామకాలు రిటైల్ బ్రోకింగ్ సంస్థల భారీ హైరింగ్ ప్రణాళికలు పెద్దయెత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో బుల్ ర్యాలీ ఇటు జాబ్ మార్కెట్లోనూ ఉత్సాహం నింపుతోంది. రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లవైపు చూస్తుండటంతో.. బ్రోకింగ్ సంస్థల వ్యాపారం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో, కస్టమర్లకు సర్వీసులు అందించడం కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి. జోరుగా రిక్రూట్మెంట్ ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఫలితంగా రాబోయే కొన్ని నెలల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగావకాశాలు రానున్నాయి. స్టాక్ మార్కెట్ల ఊగిసలాట కారణంగా కొద్దిరోజుల క్రితం దాకా బ్రోకింగ్ సంస్థలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాయి. గడ్డు పరిస్థితుల నుంచి బైటపడేందుకు వ్యయాలను భారీగా తగ్గించుకున్నాయి. ఇందులో భాగంగా ఏకంగా 1 లక్ష మంది పైగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం మార్కెట్లు కళకళ్లాడుతుండటంతో బ్రోకింగ్ సంస్థలు హైరింగ్ యోచనల్లో ఉన్నాయి. క్యాష్ సెగ్మెంట్లో మొత్తం 9,500 బ్రోకింగ్ సంస్థలు ఉండగా.. ఇందులో సింహభాగం సంస్థలు కొత్త కస్టమర్లను దక్కించుకోవడం, వారికి సర్వీసులు అందించేందుకు ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లవైపు చూస్తుం డటంతో ఆనంద్ రాఠీ, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి సంస్థలు బులిష్‌గా ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 3,200 మంది ఉద్యోగులు ఉన్నారని, దశలవారీగా ఈ సంఖ్యను మరో 10 శాతం మేర పెంచుకునే అవకాశం ఉందని షేర్‌ఖాన్ మానవ వనరుల విభాగం హెడ్ ఉల్హాస్ పగీ తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లు మళ్లీ పుంజుకోవడంతో.. క్లయింట్ల లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. కొత్త అకౌంట్ల కోసం దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయన్నారు. ఆశావహంగా భవిష్యత్..: గడ్డుకాలంలో కూడా భవిష్యత్‌పై ఆశావహ అంచనాలతో అన్ని సన్నాహాలూ చేసుకున్నామని ఆనంద్ రాఠీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపక చైర్మన్ ఆనంద్ రాఠీ తెలిపారు. తాము ఊహించినదే ప్రస్తుతం జరుగుతోందని, రిటైల్ సెగ్మెంట్ కూడా కళకళ్లాడుతోందని ఆయన వివరించారు. ట్రేడింగ్ పరిమాణాలు పెరుగుతుండటంతో భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉండగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనంద్ రాఠీ సంస్థలో ప్రస్తుతం 2,500 మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. మరోవైపు, మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తమ బ్రోకింగ్ వ్యాపార విభాగం కోసం గత ఏడాది వ్యవధిలో 200 మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ సంస్థకు 8 లక్షల క్లయింట్లు ఉండగా. అందులో సుమారు ఏడు లక్షల పైచిలు రిటైల్ బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ క్లయింట్లు ఉన్నారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, రిటైల్ కస్టమర్లకు మళ్లీ మార్కెట్లపై విశ్వాసం వస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎండీ మోతీలాల్ ఓస్వాల్ తెలిపారు. విస్తరణపై దృష్టి.. గడచిన రెండు నెలలుగా కోటక్ సెక్యూరిటీస్ కూడా నియామకాలపై దృష్టి పెట్టింది. ఎక్కువగా సీనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుంటోంది. జూనియర్ స్థాయి వారికీ అవకాశాలు బాగానే ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్) వివేక్ జైన్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం 3,600 మంది సిబ్బంది ఉన్నారని, కొత్తగా వ్యాపారావకాశాలు మరిన్ని వస్తుండటంతో.. సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో మరింత మందిని తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. జియోజిత్ బీఎన్పీ పారిబా తమ కస్టమర్ల వ్యాపార పరిమాణం 100% పెరిగిందని, ప్రతి ఇద్దరు కస్టమర్లలో ఒకరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. ‘వ్యాపారం పెరుగుతోంది. బ్రోకర్లు బాగా ఆర్జిస్తున్నారు. ఉత్పత్తులను విక్రయించాలంటే సరైన నిపుణులు అవసరం. అందుకే దీనిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం’ అని జియోజిత్ బీఎన్పీ పారిబా ఎండీ సీజే జార్జ్ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర 2,000 మంది ఉద్యోగులు ఉన్నారని, మార్కెట్ల పెరుగుదలను బట్టి మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.


