breaking news
Assembly
-
ఆవిర్భావ సభలో... అంతులేని అబద్ధాలు
సాక్షి, అమరావతి : కళ్లార్పకుండా అలవోకగా అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను నిరంతరం వంచించడంలో నిష్ణాతుడైన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ, వాటినే నిజాలనుకునేలా ప్రజలను భ్రమలో ఉంచేందుకు ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి వేదికగా చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండానే వాటిని సూపర్‌హిట్ చేసేశామని ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నించారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలుచేయకుండానే అమలుచేసి చూపించామని గొప్పలు చెప్పుకోవడం ఆయన అసత్యాలకు పరాకాష్ట. అలాగే.. » మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసేలేకుండానే 21 నెలల పాలన పూర్తిచేశారు. అయినా నిస్సిగ్గుగా వాటి ఊసేలేకుండా వాటిని అమలుచేసేసినట్లు ప్రకటించుకున్నారు. » అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి అరకొరగా కొంత విదిల్చి దాన్ని అమలుచేసినట్లు డబ్బా కొట్టుకున్నారు. » దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను కంటితుడుపుగా ఏదో చేశామన్నట్లు చేసి వాటిని కూడా చేసేసినట్లు బిల్డప్ ఇచ్చారు. » సూపర్‌సిక్స్‌తో కలిపి 143 హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండానే సూపర్‌హిట్ చేశామని చెప్పుకున్నారు.» జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకోవడాన్ని బట్టి తాను ఏది చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మడం తప్ప మరో మార్గంలేదని చాటుకున్నారు.రాజధాని రైతులపై కపట ప్రేమ.. మరోవైపు.. రాజధాని రైతులను అన్ని విధాలా దెబ్బతీసి ఇప్పుడు వారి త్యాగాలు వృ«థా కావని చెబుతూ.. ఇంకా వారిని మోసంచేస్తూ.. ఇకపై కూడా మోసంచేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పడం గమనార్హం. పుష్కరకాలం క్రితం భూసమీకరణకు 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం. వారికింకా ప్లాట్లు ఇవ్వకుండా, ఆ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల గురించి పట్టించుకోకుండా మళ్లీ రెండు, మూడు విడతల్లో భూములు తీసుకుంటామని ప్రకటించి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. భూములిచ్చిన రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాల భూములను కట్టబెడుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒకవైపు ఇప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కుంటూ.. పైకి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారనే మాయమాటలతో రైతులను వంచించేందుకు యత్నించడంపై రైతులు రగిలిపోతున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి...పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఆయన్నుంచి సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కున్న విషయాన్ని మరచిపోయి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలోనూ ఎప్పటిలానే ఆయన్ను అవతార పురుషుడిగా కీర్తించారు. తాను చేసిన దారుణమైన మోసాన్ని భరించలేక ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయిన విషయాన్ని కూడా మరిపిస్తూ పార్టీ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడాయన గొప్పవాడంటూ చేస్తున్న ప్రసంగాలు, ఆడుతున్న డ్రామాలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ ఆత్మను కూడా వదలకుండా చంద్రబాబు ఆయన్ను వేధిస్తున్నారని ఎన్టీఆర్ నిజమైన అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ జగన్‌పై మళ్లీ విషం.. మరోవైపు.. వైఎస్ జగన్‌పై ఎప్పటిమాదిరిగానే ఈ సభలోనూ చంద్రబాబు విషం కక్కారు. 2019–24లో ఇష్టం వచి్చనట్లు చెప్పిన అబద్ధాలు, విష ప్రచారాలు, దొంగ వ్యవహారాలనే వీడియో చేసి ప్రదర్శించారు. అలాగే, సొంత కుటుంబసభ్యుల వేధింపులతో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే జగన్వల్లే ఆయన చనిపోయాడని చూపించి ప్రజలను అదేపనిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇలా ఆవిర్భావ సభ ఆసాంతం ప్రజలను వంచించే అబద్ధాలు, ఎన్టీఆర్‌కు దొంగ నమస్కారాలు, తనకు సంబంధంలేని వాటిని తన గొప్పలుగా చెప్పుకుని సొంత డబ్బా కొట్టుకున్నారు. -
భంగపాటు తప్పదా !
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఒక్కసారైనా భద్రాచలం పీఠాన్ని దక్కించుకోవాలనే టీడీపీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఆ పార్టీ అగ్రనాయకుల వ్యవహార శైలితో కేడర్‌లో పూర్తిగా నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మండల స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదు. గ్రామాల్లో అయితే పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కార్యకర్తలే కరువయ్యారు. ఆ పార్టీకి కొంత కేడర్ ఉన్నప్పటికీ డివిజన్ స్థాయిలో ఆధిపత్యం కోసం పార్టీ నాయకులు తరచూ కుమ్ములాడుకోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో భద్రాచలంలో నడిరోడ్డుపైనే నాయకులు ముష్టి యుద్ధాలకు దిగారు. పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న తమలాంటి వారిని యశోద రాంబాబు చిన్నచూపు చూస్తున్నారంటూ ఇటీవల అర్ధరాత్రి వేళ ఆ పార్టీ కార్యాలయం ఎదుటే అతని అనుచరులు హల్చల్ చేశారు. వారం క్రితం భద్రాచలం మండలంలోని పలు గ్రామాల ముఖ్య కేడర్ అంతా యశోద రాంబాబు వ్యవహారశైలిపై పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో మాట ఇచ్చిన తప్పిన ఆయన గ్రామాల్లోకి వస్తే ఓట్లు వేసేది లేద ంటూ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయం ముందు హల్చల్ చేసిన నాయకులు ఏకంగా కార్యాలయానికి తాళాలు కూడా వేశారు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో పూర్తిగా నిస్తేజం ఏర్పడింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, సీపీఎం తర్వాత మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ప్రస్తుతం గ్రామాల్లో పూర్తిగా పట్టు తగ్గింది. వెంకటాపురం, చర్ల, భద్రాచలం, కూనవరం మండలాల్లో వర్గపోరు ఉంది. వ్యతిరేక వర్గాన్ని దెబ్బకొట్టేందుకు వేరే పార్టీకైనా ఓట్లు వేయించేందుకు సిద్ధమేనని అక్కడి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని మండలాల్లో టీడీపీ ప్రచారంలో మిగతా పార్టీల కన్నా పూర్తిగా వెనుకబడిపోయింది. ఫణీశ్వరమ్మకు టికెట్టుపై తమ్ముళ్ల ఆగ్రహం : భద్రాచలం నియోజకవ ర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఏనాడూ అందుబాటులో లేని ఫణీశ్వరమ్మకు అధిష్టానం టికెట్టు కట్టబెట్టడంపై స్థానిక నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. టికెట్టు తమకే వస్తుందని ఆశతో ఎంతో కాలంగా పార్టీ అభివృద్ధి కోసమని పనిచేస్తున్న వాజేడుకు చెందిన బోదెబోయిన బుచ్చ య్య, చర్లకు చెందిన ఇర్పా శాంత, కూనవరానికి చెందిన సీనియర్ నాయకుడు సోడే రామయ్య భారీగానే ఆశలు పెట్టుకున్నారు. వీరంతా ఆయా మండలాల్లో మంచి పట్టుఉన్న నాయకులే. అయితే మూడు సార్లు ఎంపీగా గెలిచి, ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత సోడె రామయ్యను ప్రచారం లో విస్మరించారు. హైదరాబాద్‌లోనే ఉంటూ పార్టీ అధినేతను ప్రసన్నం చే సుకున్న ఫణీశ్వమ్మ బరిలో నిలవటంతో ఆశావాహులంతా నిరుత్సాహంలో పడిపోయారు. బోదెబోయిన బుచ్చయ్య వంటి నాయకులు రెబల్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ, చివరకు మొత్తబడి విరమించుకున్నారు. అయితే ఫణీశ్వరమ్మకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించటం లేదని పరిశీలకులు అంటున్నారు. అధిష్టానం మాట చెవికెక్కేనా : భద్రాద్రి తమ్ముళ్ల కుమ్ములాట తారాస్థాయికి చేరటంతో తెలంగాణ జిల్లాల పరిశీలకులు మండవ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిన ఇక్కడి నాయకత్వంపై తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి దిద్దుబాటు చేస్తున్న సమయంలోనే ఇరువురు నాయకులు వాదులాటకు దిగారు. ఇది చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత వరకూ వెళ్లింది. దీంతో తేరుకున్న జిల్లా నాయకత్వం పార్టీని గాడిలో పెట్టేందుకు తోటకూర రవిశంకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా యశోద రాంబాబుకు కూడా దీనిలో భాగస్వామ్యులను చేశారు. అయితే అధిష్టానం మాట భద్రాద్రి టీడీపీ తమ్ముళ్లు చెవికెక్కించుకుంటారా..?అనేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. -
టీడీపీతో ఈనాడు కుమ్మక్కై .... జగన్ వ్యతిరేక వార్తలు రాస్తోంది
ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఈనాడు దినపత్రిక.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శనివారం ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు అందజేశారు. నెలరోజులుగా వస్తున్న ‘ఈనాడు ఎన్నికల ప్రత్యేకం’ పేజీల్లో న్యాయస్థానాల్లో జగన్, వైఎస్‌పై విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తున్నారని, ఇలాంటివి ఎన్నికల వార్తలకింద ప్రచురించడం ‘సబ్‌జ్యుడిస్’ అవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈనాడు, టీడీపీ రెండూ కలిసి ఈ ఎన్నికల్లో జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విచారణలో ఉన్న కేసుల వివరాలనేగాక.. తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తున్నాయని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యధిక సర్క్యులేషన్ గలదిగా ఆ యాజ మాన్యం చెప్పుకుంటున్న ఈనాడు తన పాఠకులను ప్రభావితం చేయాలన్న దురుద్దేశ ంతోనే ఇలాంటి వార్తలను ప్రచురిస్తోందన్నారు. సరిగ్గా ఎన్నికల ముం దుగా టీడీపీ, ఈనాడు చేతులు కలిపి ఇలా ఒక రాజకీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమేగాక, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ ఒక దినపత్రికను సాధనంగా ఎన్నికల తరుణంలో వాడుకోవడం, తద్వారా ఓటర్ల సానుభూతి పొందాలని చూడటం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు.ఈ విషయంలో ఈనాడు-టీడీ పీల కుమ్మక్కుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


