కో–విన్‌ 2.0 పోర్టల్లో రిజిస్ట్రేషన్‌ ఇలా..

కో–విన్‌ 2.0 పోర్టల్‌ (http://cowin.gov.in) పోర్టల్‌లో మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయండి

మొబైల్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్ ‌(ఓటీపీ) వస్తుంది.

ఓటీపీని ఎంటర్‌ చేసి, వెరిఫై బటన్‌ నొక్కండి

రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ వ్యాక్సినేషన్‌ పేజీలోకి ప్రవేశిస్తారు.

పేరు, వయసు వంటి వివరాలతోపాటు గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి అప్‌లోడ్‌ చేయండి

45-59 ఏళ్ల వయసుండి, వ్యాధులతో బాధపడేవారు గుర్తింపు కార్డు, ఆర్‌ఎంపీ సంతకం చేసిన పత్రాన్ని అప్‌లోడ్‌ చేయండి

ఇవన్నీ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్‌ బటన్‌ నొక్కండి

ఇప్పుడు అకౌంట్‌ వివరాలు కనిపిస్తాయి.

ఒకే ఫోన్‌ నంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్‌ కోసం ‘యాడ్‌ మోర్‌’ఆప్షన్‌ ఎంచుకోండి.

‘షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌’ బటన్‌ నొక్కండి

రాష్ట్రాలు, జిల్లాల వారీగా టీకా అందజేసే వ్యాక్సినేషన్‌ కేంద్రాల సమాచారంతోపాటు స్లాట్లు తేదీలు, సమయం వారీగా కనిపిస్తాయి.

ఒక స్లాట్‌ను ఎంచుకొని, ‘బుక్‌’ బటన్‌పై నొక్కండి.

రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్‌ అపాయింట్‌మెంట్‌తో కూడిన మెసేజ్‌ ఫోన్‌కు వస్తుంది.

వ్యాక్సినేషన్‌ అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు. తేదీ, సమయం మార్చుకోవచ్చు. అదే ఫోన్‌ నంబర్‌తో పోర్టల్‌లో మళ్లీ లాగిన్‌ కావాలి.

టీకా తీసుకున్న తర్వాత రిఫరెన్స్‌ ఐడీ వస్తుంది. దీనిద్వారా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు.