పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్! | Tollywood Movie Satya Trailer Released Today | Sakshi
Sakshi News home page

పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!

May 6 2024 7:49 PM | Updated on May 7 2024 11:49 AM

Tollywood Movie Satya Trailer Released Today

హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం సత్య. ఈ చిత్రాన్ని వాలీ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు.  ఈ సినిమాను శివమ్ మీడియా బ్యానర్‌పై శివమల్లాల నిర్మించారు. ఈ బ్యానర్‌లో వచ్చిన తొలి సినిమాగా సత్య నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఎనిమిది మంది దర్శకుల చేతుల మీదగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ కృష్ణచైతన్య మాట్లాడుతూ..'హమరేష్ చూడడానికి  జీవీ ప్రకాష్ లాగా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ..' సత్య ట్రైలర్ చాల బాగుంది. టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి. అలానే మంచి సక్సెస్‌ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ.' తమిళంలో ఈ సినిమాని నేను రంగోలిగా తీశాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తోంది. అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.

నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ..'ఈరోజు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నా. కానీ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంఛ్‌కే ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి ప్రొడ్యూసర్ వరకు వచ్చా. నా కెరీర్ ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మే 10న సత్య సినిమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుందరమూర్తి కేఎస్ సంగీతమందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement