పిల్లల కోసం తాచుతో పోరాటం..చివరికి!

అప్పుడే పుట్టిన పప్పీలు(కుక్కపిల్లలు)... బుజ్జిబుజ్జిగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ పప్పీలు... తల్లి చెంతన అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నిజంగా ఆ పప్పీలకు యమపాశంలానే వచ్చింది ఓ పెద్ద తాచుపాము. ఎంత పెద్దగా ఉందంటే.. పప్పీలు దాన్ని చూస్తుండగానే వణికిపోయాయి. తన పప్పీలను రక్షించుకునేందుకు తల్లి, తాచుపాముతో భీకర పోరే చేసింది. తాచుపామును బయటపెట్టడానికి పెద్ద పెద్దగా అరవడం, తన పిల్లల్ని దగ్గరకు లాక్కోవడం చేసింది.దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ అటవీ శాఖ అధికారులు రావడం ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు అప్పటికే జరగరానిది జరిగిపోయింది. అప్పటి వరకు తలపడిన ఆ తల్లి, చివరికి తన పప్పీలను ఆ తాచుకు బలి ఇవ్వక తప్పలేదు. నాలుగు పప్పీలను ఆ తాచు పాము తన విషపు కొరలతో కాటేసింది. పాము కాట్లకు మూడు పప్పీలు, అక్కడికక్కడే ప్రాణాలను వదిలాయి. ఒక్క పప్పీ మాత్రమే తాచుపాము కాటును తట్టుకుని మరీ, తన ప్రాణాలను కాపాడుకుంది.  ఈ సంఘటన అంతా ఒడిశాలోని భద్రక్‌ లో చోటు చేసుకుంది. తాచు పాము, శునకం భీకర పోరు ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top