పాడటం సరిగారాని, గొంతు బాగాలేని వారు పాడితే ‘అచ్చం గాడిద ఓండ్ర పెట్టినట్లు ఉందిరా!’ అంటుంటాం. ఓ వ్యక్తి పాట పాడుతుంటే దూరంగా గాడిద అరుపులు వినిపించే కామెడీ సీన్లు చాలా సినిమాల్లో మనం చూసుంటాం. అచ్చం అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాజమాని పాడిన పాటకు గాడిద గొంతు కలిపింది. లయన్ కింగ్ సినిమా ఓపెనింగ్ సాంగ్ ‘‘అకూన మటాట’’కు గాడిద తన గొంతు సవరించింది. కిన్లే అనే వ్యక్తి తన పెంపుడు జంతువులు గాడిద, గుర్రం దగ్గర ఈ పాటను పాడాడు. ఆ పాటకు గుర్రం స్పందించలేదు కానీ, గాడిద మాత్రం యాజమానితో గొంతు కలిపి ఓ రెండు లైన్లు పాడింది. మరీ పాట పాడిందో.. యాజమాని గొంతు వినలేక ఆపమని ఏడ్చిందో.. అది గాడిదకే తెలియాలి. కిన్లే ఈ వీడియోను తన ఫేస్‌బుక్‌లో ఖాతాలో పోస్ట్ చేయగా 2.7మిలియన్ వ్యూస్ వచ్చాయి.
అతని పాటకు గాడిద గొంతు కలిపింది
Jul 31 2019 4:58 PM | Updated on Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
Advertisement
