పులితో ఆటలు..దాంతో! | Scary moment injured leopard attacks man clicking its pics in West Bengal | Sakshi
Sakshi News home page

పులితో ఆటలు..దాంతో!

Aug 21 2019 6:05 PM | Updated on Aug 21 2019 6:10 PM

‘పులితో సెల్ఫీ దిగాలనుకుంటే కొంచెం రిస్క్‌ అయినా ఫరవాలేదు. ట్రై చేయొచ్చు. కానీ చనువిచ్చింది కదా అని దాంతో ఆడుకోవాలని చూస్తే.. వేటాడేస్తది’ ఇది యమదొంగ సినిమాలో యంగ్‌ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రమాదం తప్పదనే హెచ్చరిక అది. పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు. రోడ్డు దాటుతుండగా ప్రమాదం బారిన పడ్డ చిరుతతో ఆటలకు దిగాడు. దాని దగ్గరగా వెళ్లి ఫొటోలు తీద్దామనుకున్నాడు. ఇంకేముంది..! అసలే గాయాలతో ఉన్న ఆ చిరుత ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది.

చచ్చాన్రా దేవుడా అనుకుంటూ అక్కడున్న మిగతావారు పరుగు లంకించుకున్నారు. అయితే, అప్పటికే  గాయాలతో చిరుత నీరసించిపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మొహం, వీపుపై సదరు వ్యక్తికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిరుతను జల్దపర నేషనల్‌ పార్క్‌ అధికారులు సంరక్షించారు. దాని కుడి కాలు, తలకు గాయాలయ్యాయని, ట్రీట్‌మెంట్‌ అనంతరం అడవిలో వదిలిపెడతామని వెల్లడించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement