ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. వాహనదారులను అదుపు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు పడే బాధ అంత ఇంత కాదు. ఒక్కోసారి వారి సూచనలు పట్టించుకోకుండా వాహనదారులు దొడ్డిదారిన వెళ్తునే ఉంటారు. వారిని అదుపు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు నానా కష్టాలు పడుతుంటారు. కానీ ఈ ట్రాఫిక్ పోలీస్‌కి మాత్రం అలాంటి కష్టాలు లేవు. డ్యాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడు. పేరు ప్రతాప్ చంద్ర ఖండ్వాల్. భువనేశ్వర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.అదిరిపోయే స్టెప్పులేసి ట్రాఫిక్‌ను మేనేజ్ చేస్తాడు.