ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ | Mohammed Shami Want to be Investigated Thoroughly | Sakshi
Sakshi News home page

Mar 11 2018 9:49 AM | Updated on Mar 22 2024 10:48 AM

తన భార్య చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ డిమాండ్‌ చేశాడు. ఆదివారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ..‘రోజు రోజుకి నాపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీటిపై మాట్లాడదలుచుకోలేదు. ఆ ఆరోపణలపై వెంటనే విచారణ చెపట్టాలని మాత్రమే కోరుతున్నాను. బీసీసీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు విచారణ అనంతరం వారే నిర్ణయం తీసుకుంటారనే విషయంలో నాకు ఎలాంటి టెన్షన్‌ లేదు.’ అని షమీ తెలిపాడు. ఇక భార్య హసిన్‌ జహాన్‌ఆరోపణలతో బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో షమీ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement