ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా రోయింగ్ ఈవెంట్‌లో భారత్ పతకాలు పంట పండిస్తోంది. ముందుగా పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్‌లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకం సాధించి రోయింగ్‌లో తొలి పతకాన్ని అందించగా, ఆపై డబుల్ స్కల్స్‌లో భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మరో కాంస్యాన్ని సాధించింది.