Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

LIVE AP CM YS Jagan Public Meeting at Kalikiri
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

Team India T20 World Cup Squad Announced
టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ‍ప్రకటన.. స్టార్‌ ఆటగాళ్లకు దక్కని చోటు

కరీబియన్‌ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్‌ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్‌పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న  రింకూ సింగ్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపియ్యాడు.  శుభ్‌మన్‌ గిల్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ కూడా ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎం​పియ్యారు.టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రాట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Ap: Bjp Distanced From The Alliance Manifesto
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్‌, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ   టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.​మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

CM jagan Slams Chandrababu At mydukur Meeting
75 ఏళ్లు వచ్చినా చం‍ద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్‌

సాక్షి, కడప: చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్‌ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిపెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోమొస్తుందని విమర్శించారు.  మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములేమిటని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశ్నలడిగితే ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ5కు, దత్తపుత్రుడికి, వదినమ్మకు పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది.  వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్‌కు  కూడా కోపం వస్తోంది. నేను స్కీమ్ల లిస్ట్ చదివితే వాళ్లు నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు గడగడా చదవుతున్నారు.జగన్‌ను ఎందుకు చంపకూడదని ఈ బాబు అంటున్నాడు.చంద్రబాబు సంస్కారానికి ఒక నమస్కారం.చేతకాని వాడికి కోపం ఎక్కువ అనే సామేత ఉంది. పేదలకు చేసిన మంచి ఏంటి అంటే సమాధానం లేదు. జగన్‌ను తిడితే ఏం ప్రయోజనమయ్యా చంద్రబాబు. ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014 లో ఇచ్చిన ఎన్నికల వాగ్దాలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు.బాబు కొత్త మేనిఫెస్టోకు విలువ, విశ్వసనీయత లేదు.మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట.. నమ్ముతారా?  వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమం అందిస్తున్నాం.గతంలో ఎప్పుడూలేనన్ని స్కీమ్‌లు తీసుకొచ్చాం.రూ. 2లక్షల 70 వేల కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో వేశాం.2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.నాడు-నేడుతో ప్రభుత్వ  ఆత్రుల రూపురేఖలుర్చాంఅవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్‌..ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన.ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం.రూ. 2 లక్షల 70 వేల కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌. కాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం.31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కాచెల్లెమ్మల పేరుపై రిజస్ట్రేషన్‌.ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినక్‌ పెట్టాం.ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ సైతం తీసుకొచ్చాం.పేషెంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం.పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష.కాపు నేస్త,ఈబీసీ నేస్తం, ఆసరా అందిస్తున్నాం.మహిళల రక్షణ కోసం మహిళా పోలీస్‌ స్టేషన్లు.గ్రామ స్వరాజ్యానికి ప్రతీక గ్రామ సచివాలయాలు.క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోర్డులు, విద్యార్థుల చేతిలో ట్యాబ్స్‌ కనిపిస్తున్నాయి.వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలి.పేదవాడి భవిష్యత్‌కోసం రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కాలి.175, 175 అసెంబ్లీ, 3\25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.

AP CM YS Jagan Exclusive Interview: Slams Chandrababu And Sharmila Decision
రెండు పార్టీల రిమోట్‌ బాబు చేతిలో.. షర్మిల నిర్ణయం బాధించింది: సీఎం జగన్‌

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడు.. కూటమి ఇస్తున్న హామీలతో మోసపోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు పదే పదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇండియా టుడే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయాలపై ఆయన స్పందించారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో మేం పోరాడుతున్నాం. ఈ రెండు పార్టీల రిమోట్లు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను ఆయనే నియంత్రిస్తున్నారు.కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న తన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల గురించి సీఎం జగన్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదు ఆమెకు డిపాజిట్లు కూడా దక్కబోవనే విషయం తనను బాధకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు... ఏపీలో నాకు పోటీగా రాజకీయాలు చేసేలా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, షర్మిలను ప్రభావితం చేశారు. నాపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, చనిపోయాక నా తండ్రి..దివంగత మహానేత వైఎస్సార్‌ పేరును  ఛార్జిషీట్‌లో చేర్చిన పార్టీతో ఆమె చేతులు కలిపారు. ఇదంతా ఎంతో బాధ కలిగిస్తోంది. ఎవరు ఏమిటనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు.తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపైనా సీఎం జగన్‌ స్పందించారు. ‘‘ఒకరు తప్పు చేశారా? లేదా? అనేది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. జైలుశిక్ష పడిందీ అంటే ఏదో తప్పు చేశారనే అర్థం. చంద్రబాబు తప్పు చేశాడనడానికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.Was the stone attack on @ysjagan stage managed as his critics allege? Listen here: https://t.co/1Zdr4cbRBU— Rajdeep Sardesai (@sardesairajdeep) April 29, 2024జగన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగితేనే ఏపీలో సంక్షేమం ఉంటుందని,  అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు, వలంటీర్ల ద్వారా నెలవారీ సామాజిక పింఛన్లు డోర్ డెలివరీ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం జగన్‌ ఆ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు. 

Amit Shah Accused Karnataka Government About Prajwal Revanna Row
ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్‌ ప్రశ్నల వర్షం

కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (జేడీఎస్‌) అసభ్యకర వీడియోల విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. రేవణ్ణపై కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ప్రధాని మౌనమేలారేవణ్ణపై వ్యవహారంపై ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రజ్వల్‌ రేవణ్ణ చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కు పోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగానే ఉంటారా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.అక్కడుంది మీ ప్రభుత్వమే కదాప్రియాంక గాంధీ ట్వీట్‌పై మంగళవారం ఉదయం అమిత్‌ షా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలోని మాతృశక్తికి మేం అండగా ఉంటాం. అయితే కాంగ్రెస్‌ను ఓ మాట అడగాలనుకుంటున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే కదా.. ఇంతవరకు రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. లైంగిక వేదింపుల కేసు గురించి ప్రియాంక గాంధీ వాద్రా వారి సీఎంను, డిప్యూటీ సీఎంను అడగాలని సూచించారు.  విచారణకు బీజేపీ డిమాండ్‌ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. కాబట్టే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో విచారణకు బీజేపీ డిమాండ్‌ చేస్తుందని అమిత్‌ షా స్పష్టం చేశారు.పరువు పోతుందంటూకాగా, రేవణ్ణ వేదింపులు కేసు వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ పలువురు నేతలు జేడీఎస్‌ అధినేత దేవెగౌడకు లేఖలు రాశారు. దీంతో దేవెగౌడ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు  ప్రకటించారు.రేవణ్ణను రప్పిస్తాంమరో వైపు కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్‌ బి.కె.సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల‍్లడించింది.

Rajinikanth Vettaiyan completes 100 days of shooting goes Viral
తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు అప్‌డేట్‌!

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్‌.  ఈ చిత్రాన్ని జైభీమ్‌ చిత్రం పేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్‌ మాజీ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత  రజినీకాంత్‌ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది.అయితే ఇంకా షూటింగ్‌ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్, టైటిల్‌ ప్రకటన, టీజర్‌ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్‌ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్‌ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.కాగా.. తాజాగా వేట్టైయాన్‌ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్‌ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది‌. గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా  వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్‌ చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల వంటి ప్రమోషన్‌ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్‌బచ్చన్, ఫాహత్‌ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్‌  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  100 days of #Vettaiyan shooting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Jailer | #Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #VettaiyanFromOctober | #ThalaivarNirandharam | #SuperstarRajinikanth | #Hukum | #CoolieDisco | #Jailer2 | #ThalaivarNirandharam | #CoolieTitleTeaser pic.twitter.com/psri6cXUtQ— Suresh balaji (@surbalutwt) April 27, 2024

Telangana SSC Result 2024 Released
TS SSC Results 2024: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్‌గా రిజల్ట్‌ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్‌ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత  సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.  

South Africa Announce T20 WC 2024 Squad 2 Uncapped Players In
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు ఛాన్స్‌

టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్‌ మార్క్రమ్‌ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్‌ నోర్జే, క్వింటన్‌ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్‌ ఆన్రిచ్‌ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్‌-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు డికాక్‌.అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్‌ రికెల్టన్‌, ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌లు ఏకంగా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు.  ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున రికెల్టన్‌ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్‌ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతున్న పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్‌ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్‌ 3న సౌతాఫ్రికా న్యూయార్క్‌ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్‌ మార్క్రమ్‌(కెప్టెన్‌), ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్డ్‌ కొయోట్జీ, క్వింటన్‌ డికాక్‌, జోర్న్‌ ఫార్చూన్‌, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, అన్రిచ్‌ నోర్జే, కగిసో రబడ, రియాన్‌ రికెల్టన్‌, తబ్రేజ్‌ షంసీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌.ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి. 

Fake Video Row: Amit Shah Hits Out at Congress
కాంగ్రెస్‌ మరింత దిగజారింది: అమిత్‌ షా మండిపాటు

ఢిల్లీ, సాక్షి: రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి పోరాడాలని, అంతేగానీ తప్పుడు వీడియోలతో కాదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. తనపై ఫేక్‌ వీడియో ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన.. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ రాజకీయాలు మరింత దిగజారిపోయానని మండిపడ్డారు.మంగళవారం ఢిల్లీలో ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీ 400 సీట్ల లక్ష్యంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకే గనుక 400 సీట్లు దాటితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెబుతోంది. కానీ,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాల్లో కోత విధించింది కాంగ్రెస్సే. ఆంధ్రా, కర్ణాటకలో రిజర్వేషన్లపై కోత పెట్టింది.మాకు(బీజేపీ) గత రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కానీ, కాంగ్రెస్‌ మాదిరిగా మేం ఎమర్జెన్సీ విధించలేదు. ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు కోసం ఆ సంపూర్ణ అధికారాన్ని ఉపయోగించాం.  ఈ దఫా బీజేపీ 400 సీట్లు సాధిస్తుంది. ముగిసిన రెండు విడతల ఎన్నికల్లోనే వందకు పైగా సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. దక్షిణ భారతంలోనూ బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి అని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ మరింతగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఫేక్‌ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం బాధాకరం. కాంగ్రెస్‌ కూటమి ఓటమి భయంలో ఉండి పోయాయి. అందుకే అమేథీలోనూ పోటీకి కాంగ్రెస్‌ భయపడుతోంది అని షా అన్నారు. 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement