మేలో కృష్ణమ్మ | Satyadev Krishnamma Grand Release on May 10 | Sakshi
Sakshi News home page

మేలో కృష్ణమ్మ

Apr 27 2024 1:43 AM | Updated on Apr 27 2024 1:43 AM

Satyadev Krishnamma Grand Release on May 10

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.

కాగా పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘కృష్ణమ్మ’ని విడుదల చేస్తున్నాయి. ‘‘రా అండ్‌ రస్టిక్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఈ మూవీ నిలుస్తుంది’’ అన్నారు మేకర్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement