లాయర్‌గా...  | Amitabh Bachchan Playing This Role In Vettaiyan | Sakshi
Sakshi News home page

లాయర్‌గా... 

Apr 27 2024 1:15 AM | Updated on Apr 27 2024 1:15 AM

Amitabh Bachchan Playing This Role In Vettaiyan

బాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘పింక్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ లాయర్‌గా తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. మరోసారి కోర్టులో అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ వినే అవకాశం ఉందని కోలీవుడ్‌ టాక్‌. రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న ‘వేట్టయాన్‌’ చిత్రంలో లాయర్‌ పాత్రలో అమితాబ్‌ కనిపించనున్నారట. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 

అది లాయర్‌ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. రజనీ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ పాత్రలో కనిపిస్తారని, అమితాబ్‌ లాయర్‌గా కనిపిస్తారనీ భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతోందట. రజనీ ఇంట్రో సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement