పెళ్లికార్డులో 'మోదీ' పేరు.. చిక్కుల్లో వరుడు | Karnataka: Groom in trouble for using PM Modi's name in his wedding card | Sakshi
Sakshi News home page

పెళ్లికార్డులో 'మోదీ' పేరు.. చిక్కుల్లో వరుడు

Apr 30 2024 10:12 AM | Updated on Apr 30 2024 10:28 AM

Karnataka: Groom in trouble for using PM Modi's name in his wedding card

బెంగళూరు: పెళ్ళి కార్డులో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉండటం.. వరుణ్ణి చిక్కుల్లో పడేసింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు నియమాలను అతిక్రమించాడనే కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

దక్షిణ కన్నడలోని పుత్తూరు తాలూకాలోని వరుడు తన వెడ్డింగ్ కార్డులో 'మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడమే ఆ దంపతులకు మీరు ఇచ్చే అత్యుత్తమ బహుమతి' అని పేర్కొన్నారు. ఈ ట్యాగ్‌లైన్‌పై వరుడి బంధువుల్లో ఒకరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఫిర్యాదు అందుకున్న తరువాత ఏప్రిల్ 14న పుత్తూరు తాలూకాలోని వరుడి నివాసానికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించకముందే మార్చి 1న ఆహ్వాన పత్రికలు ముద్రించారని వరుడు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానం, దేశం పట్ల ఉన్న శ్రద్ధ కారణంగా వరుడు ఇలా చేసినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement