చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకబ్జాలకు పాల్పడితే ఎలా?.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమంగా హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించింది.